link
stringlengths
46
153
text
stringlengths
1
18.7k
https://www.tupaki.com//entertainment/article/jaaneman-aah-song-making-from-dishoom-movie/135024
ఇదేం గోలండీ బాబూ.. కామెడీగా కూడా ఇలాంటి కామెంట్లు చేసుకుంటారా ఎవరైనా అంటే.. అదిగో అక్కడ కుర్ర హీరో వరుణ్‌ దావన్ అండ్ సెక్సీ అందాల పరిణీతి చోప్రా ఇదే విధంగా కొట్టుకుంటున్నారు. పరిణీతి అయితే మరీ ఘోరంగా కామెంట్లు చేసేస్తోంది. ఇంతకీ ఈ కామెడీ అంతా ఏంటో చూద్దాం పదండి. త్వరలో విడుదల కానున్న ''డిష్యూం'' సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేస్తోంది పరిణీతి చోప్రా. 'జానేమన్.. ఆహ్!!' అంటూ సాగే ఈ పాటలో అమ్మడు చాలా హాటుగా తన అందాలను దారపోస్తోందిలే. అయితే ఇప్పుడు మేకింగ్ వీడియో కోసం ఇచ్చిన ఇంటర్యూలో కూడా అమ్మడు అంతే హాటుగా కనిపిస్తుంటే.. పక్కనే ఉన్న వరుణ్‌ దావన్.. 'చూడండి ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తోందో' అంటూ ఆమె క్లీవేజ్ వైపు చూడమని హింటివ్వసాగాడు. వెంటనే పరిణీతి నవ్వుతూ.. నాకంటే నువ్వే ఎక్స్ పోజింగ్ చేస్తున్నావ్ చూడూ అంటూ అతగాడి షర్టు పై రెండు గుండీలు లేకపోవడాన్ని చూపించి.. వామ్మో అంటోంది. మొత్తానికి ఇద్దరూ ఎవరెక్కువ క్లీవేజ్ చూపించారనే డిస్కషన్ పెట్టేశారులే. మామూలు ఐటెం సాంగుల్లో అందాలు దారపోయడమే కాదు.. వాటి గురించి ఇలా మాట్లాడుతూ మరింత హాట్ టాపిక్ అయిపోవడం ఈ బాలీవుడ్డోళ్ళకే చెల్లిందిలే.
https://www.tupaki.com//entertainment/article/mahesh-babu-rethinking-on-about-movie-with-sukumar/196737
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ల్యాండ్ మార్క్ 25 వ చిత్రం 'మహర్షి' షూటింగ్ లో పాల్గొంటున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో - మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమేనట. సుకుమార్ ఇప్పటికే రెండు బేసిక్ ప్లాట్స్ వినిపించినప్పటికీ అవేమీ మహేష్ ను ఎగ్జైట్ చెయ్యలేదట. దీంతో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా డిఫరెంట్ గా ఉండే స్టొరీని తీసుకురమ్మని మహేష్ అంటున్నాడట. సుకుమార్ ఆ పని మీదే ఉన్నప్పటికీ ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పై ఫోకస్ చేయడం వల్ల ఈ స్క్రిప్ట్ తయారు చేయడం డిలే అవుతోందట. మైత్రీ మూవీ మేకర్స్ వారితోనూ.. అల్లు అర్జున్ నూతన నిర్మాణ సంస్థతోనూ ఇప్పటికే సుకుమార్ కి డీల్స్ కుదిరాయట. దీంతో ఆ సినిమాల కు స్టొరీలను ఫైనలైజ్ చేసే పనుల్లో కూడా బిజీగా ఉన్నాడట. మరోవైపు సుకుమార్ రైటింగ్ టీమ్ లో ముఖ్యమైన అసిస్టెంట్లు ఇప్పుడు దర్శకులుగా మారడం తో మహేష్ స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ కు కాస్త ఇబ్బంది ఎదురవుతోందట.ఇదిలా ఉంటే మహేష్ బాబు కూడా సుకుమార్ కనుక పవర్ఫుల్ స్క్రిప్ట్ తో వస్తే సరే గానీ.. అలా కుదరకపోతే ఎవరైనా యువ దర్శకులు.. ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేసేవారి తో చేయాలని ఆల్టర్నేట్ ప్లానింగ్ లో ఉన్నాడట. ఎందుకంటే సుకుమార్ లైన్ ఫైనలైజ్ అయ్యాక కనీసం ఏడెనిమిది నెలలు స్క్రిప్ట్ డెవలప్ మెంట్ కు తీసుకుంటాడు. ఆ తర్వాత షూటింగ్ కు ఏడాది పైకి గా సమయం కావాలి. ఈ సమయంలో టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ తో రెండు సినిమాలు పూర్తీ చేస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నాడట. చరణ్ - తారక్ ల సినిమాలు కూడా మరో రెండేళ్ళు ఉండవు కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ కూడా ఉండదని ఈ గ్యాప్ ను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడట. ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత రాజమౌళి తో సినిమాకు రెడీ అవుతాడట.
https://www.tupaki.com//entertainment/article/sonakshi-sinha-gives-clarity-on-about-balakrishna-and-boyapati-srinu-film/231796
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఎన్.బీ.కే 106 చిత్రానికి రంగం సిద్దం అవుతోంది. బోయ‌పాటి ఈసారి కూడా బాలీవుడ్ తార‌గ‌ణాన్నే రంగంలోకి దింపుతున్నార‌న్న ప్ర‌చారం ఇప్ప‌టికే వెడెక్కుతోంది. బాల‌య్య‌ను ఢీ కొట్ట‌డానికి సంజ‌య్ ద‌త్ ని బరిలోకి దించుతున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు బాల‌య్య స‌ర‌స‌న ముకుపుడక‌ల సుంద‌రి సోనాక్షి సిన్హా రొమాన్స్ చేయ‌బోతుదంటూ మ‌రో వైపు ప్ర‌చారం వేడెక్కిస్తోంది.బోయ‌పాటి మార్క్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ మ‌రోసారి అభిమానులకు డ‌బుల్ ట్రీట్ ఇస్తుంద‌ని వినిపిస్తోంది. సెట్స్ కు వెళ్ల‌డానికి చాలా ముందుగానే ఓ రేంజ్ లో ప్ర‌చారం మొద‌ల‌వ్వ‌డంతో నంద‌మూరి ఫ్యాన్స్ లో అంచ‌నాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే తాజాగా బాల‌య్య అభిమానుల ఆశ‌ల‌పై సోనాక్షి నీళ్లు చ‌ల్లేసింది. బాల‌య్య బాబు సినిమాలో నేను న‌టించ‌లేదంటూ ట్విట‌ర్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చింది. ఇవ‌న్నీ కేవ‌లం రూమ‌ర్లు మాత్ర‌మే. ప్ర‌స్తుతానికి సౌత్ లో ఎలాంటి సినిమా చేయ‌డం లేద‌ని వెల్ల‌డించి షాక్ ఇచ్చింది. సోనాక్షి ప్ర‌స్తుతం ద‌బంగ్ 3 రిలీజ్ ప్ర‌చారంలో పాల్గొంటూ బిజీగా ఉంది. మ‌రి బాల‌య్య‌తో ఆఫ‌ర్ గురించి త‌న చెవిన ప‌డిందేమో.. వెంట‌నే క్లారిటీ ఇచ్చేసింది.ఇక సోనాక్షి గ‌తంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ స‌ర‌స‌న‌ లింగా చిత్రంలో న‌టించింది. త‌ర్వాత కోలీవుడ్.. టాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌చ్చినా ఎందుక‌నో క‌మిట్ అవ్వ‌లేదు. ఆరంగేట్రం డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో ఇటువైపు చూడలేదు. ప్ర‌స్తుతం సంజ‌య్ ద‌త్ పాన్ ఇండియా కేట‌గ‌రిలో రిలీజ్ అవుతున్న కేజీఎఫ్‌-2లో న‌టిస్తున్నారు. కేజీఎఫ్ 2 త‌రువాత నిజంగానే బాల‌య్య‌తో ద‌త్ సినిమా చేస్తున్నారా లేదా? ఇప్ప‌టికే సాగుతున్న ప్ర‌చారంపై ఆయ‌న ఏదైనా స్ప‌ష్ట‌త‌నిస్తారేమో చూడాలి.
https://www.tupaki.com//entertainment/article/is-urvashi-is-better-than-samantha/375984
'పుష్ప'లోని 'ఊ అంటావా ఊ ఊ అంటావా..' పాట లో అద్భుత న‌ర్త‌న‌తో సమంత విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూడు నిమిషాల ఐట‌మ్ నంబ‌ర్ కోసం 5 కోట్లు వ‌సూలు చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌కుముందు సుభాష్ కె ఝా చాటింగ్ సెష‌న్ లో వెల్ల‌డైన వివ‌రాల ప్ర‌కారం.. ఊ అంటావా డ్యాన్స్ నంబర్ కోసం స‌మంత డిమాండ్ ను నెర‌వేర్చేందుకు నిర్మాత‌లు చాలా దిగి వ‌చ్చారు. సామ్ ఐట‌మ్ నంబ‌ర్ లో న‌ర్తించేందుకు చాలా అయిష్టంగా ఉంది.దీంతో త‌న‌ను ఒప్పించేందుకు చిత్ర‌క‌థానాయ‌కుడు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆ 3 నిమిషాల డ్యాన్స్ నంబర్ కోసం చివ‌రికి దాదాపు 5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింద‌ని క‌థ‌నాలొచ్చాయి. అంతేకాదు ఊ అంటావా సాంగ్ లో కొన్ని నృత్య కదలికల విష‌యం లో సామ్ కు కొన్ని అభ్యంతరాలున్నాయి. కానీ క్రమంగా గాడి లోకి వచ్చింది. ఒక్క స్టెప్ ని కూడా మార్చమని డిమాండ్ చేయలేదు.. అని వెల్ల‌డైంది.అయితే స‌మంత‌ కు ధీటుగా ఇప్పుడు బాలీవుడ్ ఐట‌మ్ గాళ్ ఊర్వ‌శి రౌతేలా పుష్ప 2లో ఐట‌మ్ నంబ‌ర్ కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌లో ఐట‌మ్ నంబ‌ర్ కోసం సుమారు 1.5 కోట్లు వ‌సూలు చేసిన ఈ బ్యూటీ అంత‌కుమించి డిమాండ్ చేస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఐటెమ్ నంబర్ తో హై స్టాండర్డ్ సెట్ చేసిన సమంతా రూత్ ప్రభుతో ఊర్వ‌శిని పోల్చ‌గ‌ల‌మా? ఎవ‌రైనా స్ట్రెయిట్ క‌థానాయిక‌తో స‌మానంగా ఊర్వ‌శి ఇమేజ్ ని పోల్చ‌గ‌ల‌మా? ఒక‌వేళ ఇదే నిజ‌మైతే బాలీవుడ్ నుంచి ఎవ‌రైనా మెయిన్ స్ట్రీమ్ క‌థానాయిక‌ ను పుష్ప ఐట‌మ్ నంబ‌ర్ కి ఒప్పింప‌జేయ‌డ‌మే క‌రెక్ట్ క‌దా? అని అభిమానులు సూచిస్తున్నారు. బాలీవుడ్ లో కిల్ల‌ర్ బ్యూటీ క‌త్రిన కైఫ్.. భూమి పెడ్నేక‌ర్.. హ్యూమా ఖురేషి లాంటి భామ‌లు ఐట‌మ్ నంబ‌ర్ల‌తో అద‌ర‌గొడుతున్నారు. అలాంటి డిమాండ్ ఉన్న మెయిన్ స్ట్రీమ్ నాయిక‌ల‌ ను ఎంపిక చేయ‌డం క‌రెక్ట్ క‌దా? అని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు.
https://www.tupaki.com//entertainment/article/her-care-of-address-for-beauty-but-always-awkward/290351
ఒక వైపున శారద .. వాణిశ్రీ, మరో వైపున జయసుధ .. జయప్రద .. శ్రీదేవి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ తట్టుకుని నిలబడిన కథానాయికగా సుజాత. నటనలో ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తమిళ .. మలయాళ భాషలతో పాటు తెలుగులోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సహజమైన నటన .. సమ్మోహితులను చేసే నవ్వు సుజాత సొంతం. చీరకట్టులో మరింత అందంగా కనిపించే కథానాయికల జాబితాలో ఆమె పేరు ముందువరుసలో కనిపిస్తుంది. అలాంటి సుజాతను గురించి, 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు."సుజాత గొప్ప నటి .. కె. బాలచందర్ గారు ఆమెను తెరకు పరిచయం చేశారు. ఆ తరువాత దాసరి నారాయణరావుగారు ఆమెకి అద్భుతమైన లిఫ్ట్ ఇచ్చారు. సుజాత గారి పేరును తలచుకోగానే ముందుగా 'ఏడంతస్తుల మేడ' గుర్తుకు వస్తుంది. ఆ తరువాత గుర్తొచ్చే సినిమా 'చంటి'. ఈ సినిమాలో వెంకటేశ్ తల్లి పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. అప్పట్లోనే ఆమె నాయిక ప్రధానమైన సినిమాలు చేయడం విశేషం. టైటిల్స్ కూడా ఆమె మీదనే పెట్టేసి సినిమాలు తీసేవారు. మా సినిమాల్లో శారద ఎలా ఉండేవారో .. దాసరి నారాయణరావుగారి సినిమాల్లో సుజాత అలా ఉండేవారు.1980లో ఆమె హీరోయిన్ గా చేసిన 'మానవుడు మహనీయుడు' సినిమాకి నేను పనిచేశాను. అప్పుడు ఆమె నన్ను ఎంతో అభిమానంతో 'పొట్టి పంతులు' అని పిలిచేవారు. ఆ తరువాత కొంతకాలానికి ఆమె నాకు ఎయిర్ పోర్టులో తారసపడ్డారు. నన్ను ఆలస్యంగా గుర్తుపట్టినందుకు ఆమె చాలా బాధపడ్డారు. పాత్రలోకి వస్తే ఆమె అద్భుతంగా చేసేవారు. కానీ మిగతా సమయంలో చాలా దిగాలుగా కనిపించేవారు. అలా ఉండటానికి గల కారణం ఏమిటో తెలిసేది కాదు. ఆమె ఇప్పుడు ఉండి ఉంటే తన వయసుకు తగిన పాత్రలు చేసేవారు .. ఆమె లేకపోవడం దురదృష్టకరం" అని చెప్పుకొచ్చారు.
https://www.tupaki.com//entertainment/susmithasendaterohmanshaul-1335792
మాజీ మిస్ యూనివర్స్, సీనియ‌ర్ న‌టి సుస్మితాసేన్ ప్రేమాయణాలు అన్నివేళ‌లా హాట్ టాపిక్. ఇంత‌కుముందు మోడల్ రోహ్మ‌న్ షాల్ తో ప్రేమాయ‌ణం సాగించిన సుస్మితా సేన్ అత‌డికి బ్రేక‌ప్ చెప్పి, ఆ త‌ర్వాత ఐపీఎల్ వ్య‌వ‌స్థాపక అధ్య‌క్షుడైన ఏజ్డ్ మ్యాన్ ల‌లిత్ మోడీతో డేటింగ్ ని ప్రారంభించ‌డం చ‌ర్చ‌కు తెర‌లేపింది. కానీ ఇంత‌లోనే అత‌డి నుంచి విడిపోయి, తిరిగి మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్ తో క‌లిసిపోయింద‌ని క‌థ‌నాలొచ్చాయి. తాజాగా మ‌రోసారి దీనిని క‌న్ఫామ్ చేస్తూ సుష్ అత‌డికి శుభాకాంక్ష‌లు చెప్పింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రోహ్‌మాన్ షాల్ తో క‌లిసి ఉన్న‌ప్ప‌టి ఫోటోను షేర్ చేసింది ఈ భామ‌. ఇద్దరూ తమ శీతాకాలపు స్వెట్ దుస్తులలో క‌నిపించారు. ఈ స్నాప్‌షాట్ వెబ్ లో ప్రకంపనలు సృష్టించింది. వీరిద్దరి మధ్య ఆనందక‌ర‌మైన జీవితానికి ఈ ఫోటో సింబాలిక్ గా నిలిచింది. సంతోషకరమైన పోటోతో పాటు, సుస్మితా సేన్ తన నిజమైన ఆప్యాయతను తెలియజేసింది. ''పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు @రోహ్మాన్ షాల్. మీ ఆనందానికి ఎల్లప్పుడూ టోస్ట్! ప్రేమ & దువాస్ సమృద్ధి! అని సుస్మిత రాసారు. రోహ్మాన్ స్పెష‌ల్ డే సెల‌బ్రేష‌న్ తో పాటు, వారి మ‌ధ్య‌ పరిణతి చెందిన స్నేహం, ప్రేమ‌, ఆప్యాయత అనుబంధాన్ని ఇది ప్రతిబింబించింది. అభిమానులు అనుచరులు వ్యాఖ్యల విభాగాన్ని హార్ట్ ఎమోజీలతో నింపారు. రోహ్మాన్ షాల్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సుష్ మంచి మ‌న‌సును చాలా మంది కీర్తించారు. సుస్మితా సేన్ - రోహ్‌మాన్ షాల్ ఇప్పుడు మాజీలేనా? అంటే అవును అనే చెప్పాలి. ఈ జంట ఒకరికొకరు ఆప్యాయత మద్దతు ప‌రంగా ఒక‌టిగా ఉన్నా కానీ, క‌లిసి లేరు. ఎవ‌రికి వారు విడివిడిగా ఉన్నారు. త‌మ‌ మధ్య ఉన్న బంధం దృఢంగా ఉందని, పరస్పర గౌరవంతో నిండి ఉందని వారి ఇటీవలి పరస్పర చర్య వెల్ల‌డిస్తోంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సుస్మితా సేన్ తాజా విడుదలైన `ఆర్య సీజన్ 3`లో అద్భుత న‌ట‌న‌తో అల‌రించింది. ఇది నవంబర్ 3న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రారంభ‌మైంది. సుస్మిత తాలీలో కూడా కనిపించింది. రవి జాదవ్ దీనికి దర్శకత్వం వహించారు. కృతికా డియో, అంకుర్ భాటియా, ఐశ్వర్య నార్కర్, సువ్రత్ జోషి, హేమాంగి కవి, మీనాక్షి చుగ్ మరియు మాయా రాచెల్ మెక్‌మనుస్‌లతో త‌దిత‌రులు న‌టించారు. లింగమార్పిడి కార్యకర్త శ్రీగౌరి సావంత్ స్ఫూర్తిదాయకమైన జీవిత‌ ప్రయాణానికి సంబంధించిన క‌థ‌తో రూపొందింది తాలి. బయోగ్రాఫికల్ డ్రామా ఆగస్ట్ 15న JioCinemaలో ప్రారంభమైంది.
https://www.tupaki.com//entertainment/article/malavika-mohanan-latest-photo/329646
కేర‌ళ కుట్టీ మాళ‌విక మోహ‌న‌న్ మాలీవుడ్..బాలీవుడ్ కే ప‌రిమితం. ఇంకా టాలీవుడ్ లో లాంచ్ అవ్వ‌లేదు. అదిగో పులి ఇదిగో తో అన్న ప్ర‌చారం త‌ప్ప అమ్మ‌డు ఎంట్రీ ఇంకా ఖ‌రారు కాలేదు. అయినా గ్లామ‌ర్ గేట్లు మాత్రం ఎప్పుడో తెరిచేసింది. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడల్లా చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగుతుంది. క్లీవేజ్ అందాల‌తో...థైషోస్ తో యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంది.ఇన్ స్టాలో హాట్ టాపిక్ అవుతుంది. ఏ సౌత్ హీరోయిన్ ఆరబోయ‌ని రేంజ్ లో అందాలు విందు చేస్తుంది. ఇటీవ‌లే ఓ హాట్ ఫోజుతో ఇన్ స్టాని షేక్ చేసిన బ్యూటీ మ‌రోసారి స్కిన్ షోతో ఆక‌ట్టుకుంది. చిమ్మ‌చీకట్లో మిరుమిట్లు గొలిపే స్కిన్ టోన్ తో జిగేల్ అనిపించింది. ఆకుప‌చ్చ డిజైన‌ర్ ఔట్ ఫిట్ లో చీక‌టిలో వెలుగులు విర‌జిమ్మింది.చేతిలో హ్యాండ్ బ్యాగ్ మ‌రింత షైనింగ్ అవుతుంది. పార్కింగ్ సెల్లార్ లో స్పాట్ లైట్ న‌డుమ ఇచ్చిన‌ ఫోజులిప్పుడు ఇన్ స్టా యువ‌త‌ని ఊపేస్తున్నాయి. ఈ ఫోటోని ఉద్దేశించి `బిగ్ హ‌గ్ టూ మై ఫ్యావ‌రెట్ బోయ్స్` అని రాసుకొచ్చింది. నిన్న‌టి రాత్రిపూట ఈ ఫోటోని క్యాప్చ‌ర్ చేసారు.మాళ‌విక మోహ‌న‌న్ `కోహీనూర్` అనే మాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అటుపై క‌న్న‌డ‌..హిందీ భాష‌ల్లో కొన్ని సినిమాలు చేసింది. త్వ‌ర‌లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న `డీల‌క్స్ రాజా` సినిమాలో హీరోయిన్ గా మాళ‌వికని ఎంపిక చేసిన‌ట్లు ప్రచారం సాగుతుంది. అదే నిజ‌మైతే టాలీవుడ్ లో మాళ‌విక డెబ్యూ మూవీ ఇదే అవుతుంది.ప్ర‌స్తుతం మాళ‌విక బాలీవుడ్ లో `యుద్ర` అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ ఛాన్స్ త‌ప్ప కొత్త ప్రాజెక్ట్ లు ఏవి చేతిలో లేవు. బాల‌వుడ్ లో అవ‌కాశాల కోసం సీరియ‌స్ గానే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కానీ ఆ టైమ్ ఇంకా రాలేదు. ఈలోపు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ మేక‌ర్స్ మ‌ల‌యాళం బ్యూటీల‌కు ఎర్ర తివాచీ వేసి మ‌రీ ఆహ్వానిస్తోన్న సంగ‌తి తెలిసిందే.
https://www.tupaki.com//entertainment/article/rana-daggubati-gave-voice-to-thanos/180770
యాక్షన్ సినిమాలను మన భారతీయులు ఇష్టపడినట్లుగా ఎవరు ఇష్టపడరని చాలా దేశాల్లో ఓ ప్రచారం ఉంది. అలాగే అడ్వెంచర్ సినిమాలకు కూడా మన ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అందుకే హాలీవుడ్ లో కొందరు దర్శక నిర్మాతలు ఇండియన్స్ మోసాలను కలుపుతుంటారు. అదే విధంగా ఏషియన్ కంట్రీస్ లలో భారీగా రిలీజ్ చేయడానికి ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం ఓ సినిమా ట్రైలర్ కూడా ఇండియన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా ట్రైలర్ ని హిందీలో డబ్ చేయడంతో నార్త్ ఆడియెన్స్ అడిక్డ్ అయిపోయారు. ఆ ట్రైలర్ ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ర్యాన్ రేనాల్డ్స్ నటించిన డెడ్ పుల్ సీక్వెల్. డెడ్ ఫుల్ మొదట వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇండియా లో రెస్పాన్స్ ఓ రేంజ్ లో వచ్చింది. ఇక తెలుగు తమిళ్ హిందీ వెర్షల్ లో కూడా సినిమా రిలీజ్ అయ్యి బయ్యర్స్ కి మంచి లాబాలనే ఇచ్చింది.దీంతో ఈ సారి ట్రైలర్ తోనే సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వనుందని చెప్పేశారు. హిందీ ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ బాగానే వస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 3 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో. అందులోను మంచి డైలాగ్స్ కూడా ఉండడంతో సి క్లాస్ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ అవుతుందో లేదో చూడాలి. మే లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు తెలుగులో మన రానా దగ్గుబాటి డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.
https://www.tupaki.com//entertainment/article/pawan-kalyan-kohinoor-thief-in-veeramallu/356329
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటు దొంగ గా కనిపిస్తారని టాక్. ఇక ఈ సినిమా కథ 17వ శతాబ్దం ఔరంగజేబు సామ్రాజ్యం నాటి నేపథ్యంతో వస్తుంది. సినిమాలో పవన్ ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా లుక్స్, యాక్షన్ తో కనిపిస్తారని తెలుస్తుంది.ఇక సినిమాలో పవన్ దొంగ గా కోహినూర్ వజ్రాన్ని దొంగిలిస్తారట. ఔరంగజేబు సామ్రాజ్యంలో ఉన్న కోహినూర్ ను పథకం ప్రకారం వీరమల్లు తన సొంతం చేసుకుంటారట. ఈ సీన్స్ సినిమాలో చాలా స్పెషల్ గా సినిమాకు హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. క్రిష్ ఈ సినిమాను చాలా ఫోకస్ తో తెరకెక్కిస్తున్నారు. పవన్ కెరీర్ లో డిఫరెంట్ మూవీగా హరి హర వీరమల్లు సినిమా వస్తుంది.సినిమా అంతా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతి అందిస్తుందని అంటున్నారు. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం తో పాటుగా 17వ శతాబ్దం నాటి కథను కూడా క్రిష్ ఈ సినిమాతో చెప్పబోతున్నారు. సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, జాక్వెలిన్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.పవన్ ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడని తెలుస్తుంది. నిర్మాత ఏ.ఎం రత్నం కూడా సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెడుతున్నారు. పవన్ హరి హర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తుంది. సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెప్పొచ్చు. సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
https://www.tupaki.com//entertainment/article/the-heroine-of-the-phone-cover-sentiment/310161
బాలీవుడ్ న‌టి లారా ద‌త్త్ మూడేళ్ల త‌ర్వాత `బెల్ బాట‌మ్` చిత్రంతో కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా బాలీవుడ్ లో న‌టిగా కొనసాగుతున్నా లారా కెరీర్ మాత్రం ఎగుడుదిగుడుగానే సాగింది. బిజీ న‌టిగా అవ‌కాశాలు ద‌క్కించుకోవడంలో విఫ‌ల‌మైంది. ఈ నేప‌థ్యంలో అందివ‌చ్చిన అవ‌కాశాల‌తోనే కెరీర్ ని ముందుకు తీసుకెళుతోంది. ఇటీవ‌ల వెబ్ సిరీస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీ వేదిక‌గా అక్క‌డ మాత్రం బిజీగానే ఉంది. తాజాగా `హిక్కాప్స్ అండ్ హుక్కాప్స్` వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ల‌య‌న్స్ గేట్ ఇండియా సంస్థ దీన్ని నిర్మిస్తోంది.త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. దాన్ని టార్గెటెడ్ గా చేసిన ఓ నెటిజ‌నుడు లారా ద‌త్ ఫోన్ క‌వ‌ర్ ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర కామెంట్ చేసాడు. `నేను పేద‌వాడిని కాబ‌ట్టి ఫోన్ క‌వ‌ర్ ని మార్చ‌లేదు. లారాద‌త్తాని చూడండి. ఆమె మొబైల్ ఫోన్ క‌వ‌ర్ రెండేళ్లు అదే ఉంది. కాస్త పాత‌బ‌డిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని కామెంట్ చేసాడు. దీనికి లారా బ‌దులిస్తూ నిజ‌మే 2 ఏళ్లుగా నేను క‌వ‌ర్ మార్చ‌లేదు. ఎందుకంటే కొన్ని వ‌స్తువులు సెంటిమెంట్ గా అలాగే ఉంచుకోవాల‌నిపిస్తోంది. అందులో నా ఫోన్ క‌వ‌ర్ ఒక‌టి అని స‌మాధానం ఇచ్చింది. ఫోన్ క‌వ‌ర్ నే అంతగా ప్రేమిస్తే స‌ఖుడిని ఇంకెంతగా ప్రేమిస్తుందో! అంటూ అభిమానులు స‌ర‌దా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.ఓ న‌టి ఇలా కూల్ గా స‌మాధానం ఇవ్వ‌డం గొప్ప విషయం. ఇలాంటి కామెంట్లు చూస్తే హీరోయిన్లు మండిప‌డ‌తారు. కౌంట‌ర్ ఎటాక్ కి దిగుతారు. కానీ లారా మాత్రం చాలా విన‌యంగా స‌మాధానం ఇవ్వ‌డం విశేషం. అలాగే కొన్ని రోజుల క్రితం లారా ద‌త్తా పేరుతో డేటింగ్ యాప్ లో ఆమె పేరుతో ఓ ప్రోఫైల్ ద‌ర్శ‌న‌మిచ్చింది. దానిపై కూడా లారా క్లారిటీ ఇచ్చింది. నా పేరుతో ఎవ‌రో కావాల‌నే అకౌంట్ క్రియేట్ చేసారు. నేను ఎలాంటి డేటింగ్ యాప్స్ లో లేనని` తెలిపింది. లారా ద‌త్తా టెన్నిస్ దిగ్గ‌జం మ‌హేష్ భూప‌తిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌కు వార‌సులు ఉన్నారు.
https://www.tupaki.com//entertainment/article/leonardo-dicaprio-dating-punjabi-girl/374799
హాలీవుడ్ సూపర్ స్టార్..'టైటానిక్' స్టార్ లియోనార్డో డికాప్రియో డేటింగ్ వ్య‌వ‌హారాల్లో గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. డికాప్రియో రొమాన్స్ రీల్ లైఫ్ లోనే కాదు..రియ‌ల్ లైఫ్ లోనూ అంత‌కు మించి రొమాంటిక్ ఉంటాడు. 30 ఏళ్లు వ‌య‌సులోపున్న యువ‌తు ల‌తో ప్రేమ‌కలాపాలు న‌ల్లేరు మీద న‌డ‌క‌లా కానిచ్చేస్తుంటాడు. అంద‌మైన మోడ‌ల్స్...హీరోయిన్ల‌తో న‌చ్చినంత కాలం డేటింగ్ చేయ‌డం..త‌ర్వాత బైబై చెప్పేయ‌డం డికాఫ్రియోకా ఓహ‌బీ. ఆ ర‌కంగా హాలీవుడ్ లోనే ప్ర‌త్యేకంగా పేరుగాంచిన స్టార్ ఇత‌ను.తాజాగా లియోనార్డో డికాప్రియో 28 ఏళ్ల బ్రిటీష్ పంజాబీ మోడల్ నీలం గిల్‌ తో చెట్టాప‌ట్లాలేసుకున్న కొన్ని ఫోటోలు నెట్టంట వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్ వీధుల్లో ఇటీవ‌ల జంట మీడియా కంట ప‌డింది. చిల్టర్న్ ఫైర్‌హౌస్ లో జంట‌గా చిక్కారు. ఆ స‌మ‌యం లో నిలం త‌ల్లి కూడా వెంట‌నే ఉంది. దీంతో మోడల్ త‌ల్లి ముందే డియాప్రియో రొమాన్స్ హైలైట్ అయింది. దీంతో తొలి మీట్ లోనే ఇద్ద‌రు డేటింగ్ లో ఉన్నార‌ని హాలీవుడ్ స‌హా టాలీవుడ్ ఓ అంచ‌నాకి వ‌చ్చేసింది.అయితే అది నూరుశాతం కాదు. ఏమో అది స్నేహం కొద్ది అలా మూవ్ అయి ఉండొచ్చ‌ని ఎక్క‌డో ఓ సందేహం ఉండేది. అయితే అది స్నేహాన్ని మంచిన బంధం అని మ‌ర‌సారి జోడీ కెమెరా క‌ళ్ల‌కి చిక్క‌డంతో వ్య‌వ‌హారం దాదాపు ఖాయ‌మైంది. ఈ నెల 23న ఇద్దరూ కలిసి పారిస్‌ లో డిన్నర్ చేస్తూ మీడియా కంట ప‌డ్డ విష‌యం ఆల‌స్యంగా వెలుగు లోకి వ‌చ్చింది. పారిస్ డిన్నర్‌ లో డికాప్రియా బెస్ట్‌ఫ్రెండ్ టోబీ మగుయిర్ తోపాటు ఇతర స్నేహితులు కూడా కనిపించారు.మగుయిరీ పిల్లలు రూబీ.. ఒటిస్.. డికాప్రియో మేనకోడలు నోర్మాండీ కూడా వీరితో పాటు ఉన్నారు. నీలమ్ బ్లాక్ ట్యాంక్ టాప్ బీగీ మినీ స్కర్ట్ ధరించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. లియోనార్డో డికాప్రియో-నీలం గిల్ తొలిసారి ఫ్రెంచ్ రివేరాలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జంట‌గా కనిపించారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌ కి నీలమ్ గిల్‌ తో డికాప్రియో నైట్‌ అవుట్స్‌ చేస్తున్నట్టు విదేశీ మీడియా వెలుగు లోకి తెచ్చింది. నీలం గిల్ తాత‌లు..ముత్తాత‌లు పంజాబ్ కి చెందిన వారు.
https://www.tupaki.com//entertainment/article/anasuya-speech-at-rangasthalam-thank-you-meet/181260
రంగస్థలం మూవీ తొలి వీకెండ్ ముగిసేనాటికే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సెన్సేషనల్ హిట్ సాధించింది. అనితర సాధ్యమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ డే వసూళ్లు మినహాయిస్తే.. దాదాపుగా నాన్ బాహుబలి రికార్డులు అన్నీ రంగస్థలం ఖాతాలోకి వచ్చేస్తున్నాయి. తమ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది రంగస్థలం టీం.ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ రంగస్థలంలో తమ అనుభవాలను పంచుకోగా.. రంగమ్మత్తగా మెప్పించిన అనసూయ ఇచ్చిన సుదీర్ఘమైన స్పీచ్ హైలైట్ అవుతోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హడావిడిగా పిలిచేసరికి పెద్దగా మాట్లాడలేకపోయానన్న అనసూయ.. సక్సెస్ మీట్ లో మాత్రం కాస్త ఎక్కువే మాట్లాడింది. సుకుమార్ నుంచి చిట్టిబాబు వరకూ ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ప్రశంసలు.. కృతజ్ఞతలతో పాటు క్షమాపణలు కూడా చెప్పింది. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో అత్తా అని పిలిపించుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడలేదని.. రంగమ్మా అని పిలిపించమని పోరు పెడుతూనే ఉన్నానని.. చెప్పింది అనసూయ.అయినా సరే.. తనతో కూడా 'ప్రేమంటే అంతేరా అల్లుడూ' అనడంతో పాటు రామ్ చరణ్ ను రెండు సార్లు అల్లుడు అని పిలిపించారని గుర్తు చేసుకున్న అనసూయ.. మీడియా జనాలకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పింది. తనను ఆకాశంలోకి ఓసారి ఎత్తేయడం.. ఆ తర్వాత ఫట్ మని పడేయడం వంటివి అన్నీ మీడియా మిత్రులే చేశారని.. మళ్లీ ఇప్పుడు రంగమ్మత్తను తెగ పొగుడుతున్నారని చెప్పిన అనసూయ.. మీడియా తన గురించి పాజిటివ్ గా ఉండాలంటే తాను ఎలా ఉండాలో తెలియచేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది. అప్పట్లో ఓ యంగ్ స్టర్ చేతిలో నుంచి సెల్ ఫోన్ లాక్కుని పగలకొట్టడం ఇష్యూ అయింది కదా.. దాని గురించే ఇలా నర్మగర్భంగా చెప్పిన రంగమ్మత్త.. మళ్లీ అలాంటివి చేయనని చెప్పింది. అంతే కాదు.. రంగమ్మత్త అని పిలుపు చాలా ఎంజాయ్ చేస్తున్నానని అంటోంది ఈ స్టార్ యాంకర్ కం యాక్ట్రెస్.
https://www.tupaki.com//entertainment/article/followed-what-trivikram-says/319160
ద‌క్క‌న్ సినిమాలు ఒక ద‌శ‌లో పాపుల‌ర్ కావ‌డ‌మే కాకుండా మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే పంథాని అనుస‌రించి సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ చేసిన చిత్రం `డీజే టిల్లు`. విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ రేపే (ఈ నెల 12న) ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఈ సంద‌ర్భంగా హీరో సిద్ధూ జొన్న‌ల గ‌డ్డ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.చిన్న చిత్రంగా మొద‌లైన ఈ మూవీ ప్ర‌స్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ స్క్రిప్ట్ ని ముందు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కి వినిపించార‌ట‌. క‌థ విన్న త్రివిక్ర‌మ్ కొన్ని ఐడియాల‌తో పాటు కొన్ని సూచ‌న‌లు చేశార‌ట‌. అంతే కాకుండా ఈ మూవీని ఓన్ స్టైల్లోనే తీయ‌మ‌ని సూచించార‌ట‌. ఆయ‌న చెప్పిందే ఫాలో అయ్యామ‌ని సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌. సినిమా విష‌యానికి వ‌స్తే మెచ్యూర్ లేదా బ్యాలెన్సింగ్ అనేది నాకు ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. హీరో పాత్ర‌కు ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుంటే అలాంటి క‌థ‌పై ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూప‌రు. అందుకే టిల్లు క్యారెక్ట‌ర్ ని లోప‌భూయిష్టంగా తీర్చి దిద్దాన‌న్నారు. అంతే కాకుండా త‌ను రాసిన క‌థ‌ల‌ని సొంత అనుభ‌వాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాన‌ని చెప్పుకొచ్చాడు. అయితే త‌న‌కు ర‌చ‌యిత‌గా వుండ‌టం కంటే న‌టుడిగా వుండానికే అధికంగా ఇష్ట‌ప‌డ‌తాన‌ని, న‌ట‌న‌కే త‌న తొలి ప్రాధాన్య‌త అని తెలిపాడు సిద్దూ.ఇక సంగీతం పై త‌న‌కున్న ప‌ట్టుగురించి మాట్లాడుతూ ` నాలుగేళ్లు త‌బ‌లా నేర్చుకున్నాన‌ని, అందు వ‌ల్లే త‌న‌కు సంగీతంపై ప‌ట్టు ఏర్ప‌డింద‌ని చెప్పుకొచ్చాడు. `డీజే టిల్లు` ప్రోమోలు చూస్తే యూత్ ని టార్గెట్ చేసిన‌ట్టుగా వున్నాయి. కానీ సినిమా మాత్రం పూర్తి వినోదాత్మ‌క చిత్రం. ఇంటిల్లిపాద‌కి న‌చ్చుతుంది. ప్ర‌తి సినిమాకు టార్గెట్ ఆడియ‌న్స్ అంటూ వుంటారు. ప్ర‌తీ చిత్రాన్ని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూస్తార‌ని చెప్ప‌లేం. టార్గెట్ చేసిన ఆడియ‌న్స్ సినిమా చూస్తే చాలు హిట్ అవుతుంది. మా టార్గెట్ యూత్‌. కామెడీ థ్రిల్ల‌ర్ ల‌ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చే చిత్ర‌మిదన్నారు సిద్ధూ.ఇక సినిమా ర‌న్ టైమ్ గురించి వివ‌రిస్తూ ` ఈ మూవీ ర‌న్ టైమ్ 2 గంట‌ల 4 నిమిషాలు. అయితే దాదాపు గంట నిడివిని ఎడిటింగ్ లో తొల‌గించాం. ఆ స‌న్నివేశాల‌ని సినిమా రిలీజ్ త‌రువాత పార్ట్ లు పార్ట్ లుగా విడుద‌ల చేస్తాం. త్రివిక్ర‌మ్ సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ లో చేయ‌బోయే సినిమాల స్క్రిప్ట్ ల‌ను విన‌డం, అవ‌స‌ర‌మైతే త‌న విలువైన ఇన్ పుట్ ల‌ని అందించ‌డం అనేది ఆన‌వాయితీ. అదే ఈ చిత్రానికి కూడా జ‌రిగింది. ఆయన‌ ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లని ఫాలో అయ్యాం` అని తెలిపాడు హీరో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌.
https://www.tupaki.com//entertainment/article/anchor-anasuya-latest-photo/372539
తెలుగు బుల్లితెరపై ఇప్పుడు స్టార్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఒకప్పుడు ఏకధాటిగా షోల మీద షోలు చేసుకుంటూ వచ్చిన ఈ అమ్మడు.. కొంత కాలంగా టెలివిజన్ రంగంలో పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, వెండితెరపై మాత్రం వరుస చిత్రాలతో హడావిడి చేస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలతో వచ్చిన ఈ భామ.. ఇప్పుడు మరికొన్ని సినిమాలు చేస్తోంది.దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న అనసూయ భరద్వాజ్.. వీలు చిక్కినప్పుడల్లా కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా తన భర్త భరద్వాజ్‌తో కలిసి అనసూయ వెకేషన్‌కు బ్యాంకాక్ వెళ్లింది. అక్కడ ఫుల్‌గా చిల్ అవుతోంది.బ్యాంకాక్ టూర్‌లో తీసుకున్న ఫొటోలు, వీడియోలను అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తోంది. ఇలా ఇప్పటికే ఈ అమ్మడు చాలా వాటిని వదిలింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అనసూయ ఓ బికినీ స్పెషల్ వీడియోను పంచుకుంది. ఇందులో ఈ భామ వైట్ కలర్ టూ పీస్ బికినీలో అందాలను ఆరబోస్తూ కనిపించింది. అంతేకాదు, భర్తకు ముద్దులు పెడుతూ ఓ రేంజ్‌లో స్టిల్స్ ఇచ్చింది.అనసూయ భరద్వాజ్ ఈ వీడియోను షేర్ చేయడానికి కారణం ఈరోజు (జూన్ 4వ తేదీ) ఆమె పెళ్లిరోజు కావడమే. అందుకే భర్తతో బీచ్‌లో చిల్ అవుతోన్న క్లిప్‌ను ఈ స్టార్ యాంకర్ షేర్ చేసింది. దీంతో అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా మంది ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లను పెడుతున్నారు.తాజాగా అనసూయ షేర్ చేసిన వీడియోకు ఓ నోట్‌ను కూడా జత చేసింది. అందులో 'జనవరి 23, 2001 తేదీన ఢిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరైన సమయంలో వీరు నాకు మొదటి లవ్ లెటర్ రాశారు. దానికి అప్పుడు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు బదులు ఇవ్వాలనుకుంటున్నాను' అంటూ ఓ ఎమోషనల్ నోట్ రాసింది. చివర్లో భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసింది <|hyperlink|> RlODBiNWFlZA==
https://www.tupaki.com//entertainment/article/allen-border-about-kohli-leaving-australia-tour/267388
‘ కోహ్లి సూపర్బ్​ బ్యాట్స్​మెన్​. అతడి బ్యాటింగ్​ అంటే ఎంతో ఇష్టం. ఇంత డెడికేషన్​ ఉన్న బ్యాట్స్​మెన్​ను నేను ఇంతవరకు చూడలేదు. కోహ్లికి నేను వీరాభిమానిని. నిజానికి కోహ్లీ ఆస్ట్రేలియాతో అన్ని మ్యాచ్​లు ఆడతాడనుకున్నా. అనుష్క కూడా ఆస్ట్రేలియాలోనే డెలివరీ చేయించుకుంటుందేమో అనుకున్నా. కానీ కోహ్లీ అన్ని మ్యాచ్ లు ఆడకుండానే ఇండియాకు వెళ్లిపోతున్నాడు. ఇది నిజంగా టీంఇండియాకు ఎంతో నష్టం’ అంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ అలెన్ బోర్డర్‌ పేర్కొన్నారు. నవంబరు 27 నుంచి కంగారూలతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌ని భారత్ ఆడనుండగా.. తొలి టెస్టు ముగిసిన వెంటనే భారత్‌కి కోహ్లీ వచ్చేయనున్నాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆస్ట్రేలియాలో ప్రసవిస్తుందని, దీంతో కోహ్లీ సంతానాన్ని తమ దేశానికి చెందినవారిగా పరిగణించవచ్చని ఆశించామని ఓ వర్చువల్ మీడియా సమావేశంలో అలెన్‌ బోర్డర్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. డిసెంబరు 17 నుంచి 21 వరకూ అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్‌కి కోహ్లీ వచ్చేయనున్నాడు. చివరి మూడు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం కానుండడంతో.. అతని స్థానంలో అజింక్య రహానె మూడు టెస్టుల్లోనూ కెప్టెన్‌గా టీమిండియాని నడిపించబోతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. బయో-సెక్యూర్ బబుల్‌లో ఈ సిరీస్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్వహిస్తుంది. కోహ్లి ఆడకపోవడం ఆస్ట్రేలియాకు ఎంతో లాభమని బోర్డర్​ వ్యాఖ్యానించారు. ఈ టెస్ట్​ సీరిస్​లో ఆస్ట్రేలియా సులభంగానే గెలుస్తుందన్నారు. టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలుస్తుందని భావిస్తున్నా' అని అలెన్ బోర్డర్‌ జోస్యం చెప్పాడు.
https://www.tupaki.com//entertainment/article/rajasekhar-diplomatic-reply-about-his-dialogue/217537
సినిమాలన్న తర్వాత కామెడీ కామన్.. కొన్ని చోట్ల నిజ జీవితంలోని వ్యక్తులపై సెటైర్లు వేయడం కామన్. అయితే వీటితో వచ్చిన చిక్కేమిటంటే ఎవరిపై సెటైర్లు వేస్తారో వారికి.. వారి ఫ్యాన్సుకు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. మిగతా అందరికీ అది కామెడీ. 'గబ్బర్ సింగ్' అంత్యాక్షరిలో పవన్ కళ్యాణ్.. అలీ కలిసి రాజశేఖర్ మీద వేసిన సెటైర్ సూపర్ గా పేలింది. ఆ విషయంపై రాజశేఖర్ - జీవిత అప్సెట్ అయ్యారు. ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో వారు ఓపెన్ గానే ఈ విషయాన్ని చెప్పారు.అయితే తాజాగా రాజశేఖర్ చిత్రం 'కల్కి' లో అదే 'ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి' డైలాగ్ ను రివర్స్ స్టైల్ లో కౌంటర్ వేయడం.. 'గబ్బర్ సింగ్' యాక్టర్ నే ఈ సినిమాలో కూడా నటింపజేయడంతో మరో సారి హాట్ టాపిక్ అయింది. ఈ సీన్లో రాజశేఖర్ ఆ నటుడికి ఒక్కటిచ్చి లెక్క సరిచేశారు. 'కల్కి' లో ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి డైలాగ్ రెండు సార్లు రిపీట్ అయింది.. కామెడీ కూడా వర్క్ అవుట్ అయింది. కానీ రాజశేఖర్ మాత్రం ఈ సీన్ విషయం వివాదం కాకుండా జాగ్రత్త పడ్డారు.రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఆ డైలాగ్ మొదటి సారి చెప్పే సమయంలో అదే నాదే అని నాకు తెలియదు. కానీ అదే డైలాగ్ రెండోసారి చెప్పే సమయంలో జీవిత అక్కడే ఉండడంతో తను నాకు ఆ సంగతి గుర్తు చేసింది. ఆడియన్స్ ఆ డైలాగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు" అంటూ అదేమీ పెద్దగా పట్టించుకోవాల్సినది కాదన్నట్టుగా తేల్చారు. అది జస్ట్ రీల్ ఫన్.. జస్ట్ కాసిన్ని నవ్వుల కోసమే. అంతకంటే పెద్దది చేయాల్సిన పనే లేదు.
https://www.tupaki.com//entertainment/article/tollywood-heroes-crazy-about-pan-india-movies/239242
ఇటీవ‌ల టాలీవుడ్ లో పాన్ ఇండియా అనే ప‌దం ఎంత కామ‌న్ అయిపోయిందో తెలిసిందే. ప్ర‌తి హీరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాం అంటూ త‌మ సినిమాల‌ను ఊక దంపుడు ప్ర‌చారం ఊద‌ర‌గొడుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ కంటెంట్ లేక‌పోయినా పాన్ ఇండియా అంటూ తెగ ప్ర‌చారం చేసుకోవ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. ఎవ‌రి సినిమా వాళ్ల‌కి గొప్ప అన్న దానిలో త‌ప్పులేదు. సినిమాను పైకి లేపే ప్ర‌యత్నంలో ఒక్కోసారి నోరు జార‌డం స‌హ‌జం. కానీ ప‌నిగ‌ట్టుకుని మ‌రీ పాన్ ఇండియా అంటూ అక్క‌ర్లేని ప్ర‌చారం చేయ‌డ‌మే విడ్డూరంగా ఉందంటూ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో సైతం విమ‌ర్శ‌ వినిపిస్తోంది.ఏడాదిలో వంద‌ల కొద్ది తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో స‌క్సెస్ రేటు చూసుకుంటే కేవ‌లం రెండు శాతం మాత్ర‌మే. మ‌రి నిజంగా పాన్ ఇండియా రేంజ్ కంటెంట్ అయితే ఎందుకు రెండు శాత‌మే స‌క్సెస్ రేటు ఉంది? అంత‌కు మించి పెర‌గ‌దా? అంటూ విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఫిలిం ఛాంబ‌ర్ పెద్ద‌లు సైతం ఈ ర‌క‌మైన ప్ర‌చారంపై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ముందు మ‌న స్టార్లు అంతా కంటెంట్ ఉన్న సినిమాలు చేసి స‌క్సెస్ అయితే అప్పుడు పాన్ ఇండియా పై కాన్ స‌న్ ట్రేట్ చేస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేయ‌డం వ‌ల్ల టాలీవుడ్ రేంజ్ మారుతుంది.జాతీయ స్థాయిలో తెలుగు సినిమాల గురించి చ‌ర్చ జ‌రుగుతుంది. అంత‌ర్జాతీయ స్థాయికి చేరుకుంటాం. కానీ ముందుగా మ‌న‌లో పాన్ ఇండియా రేంజ్ ఉందో లేదో? ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని నిపుణులు అంటున్నారు. ఇలా పాన్ ఇండియా అంటూ ప్ర‌చారం చేసుకుంటోన్న హీరోలంతా ఓసారి సీరియ‌స్ గా దీని గురించి లోతుగా ఆలోచిస్తే బాగుంటుంద‌న్న‌ విమ‌ర్శ వినిపిస్తోంది. అలా కాకుండా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న‌ట్లు అస‌లు మ్యాట‌ర్ లేకుండా పాన్ ఇండియా అంటూ ప్ర‌చారం చేసుకుంటే ఏం లాభం అంటూ చాంబ‌ర్ పెద్ద‌లు పెద‌వి విరిచేస్తున్నారు.
https://www.tupaki.com//entertainment/article/it-raids-on-khaidi-no-150-distributors-and-exhibitors/149613
అసలు సినిమాకు 100 కోట్ల షేర్ వచ్చిందంటే.. అది ప్రొడ్యూసర్ జేబులోకి వచ్చిన డబ్బు. అంటే ప్రేక్షకుల దగ్గర నుండి ధియేటర్ల దగ్గర వసూలైంది 150 కోట్ల వరకు ఉంటుంది. ఆ రేంజులో వచ్చిందంటే.. మరి కేవలం ప్రొడ్యూసర్ ను మాత్రమే ఇనకమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ చేస్తే ఎలా? ధియేటర్ల ఓనర్ల నుండి పంపిణీదారులు కమ్ బయ్యర్ల వరకు అందరినీ కాచి వడకట్టాల్సిందేగా. సరిగ్గా ఇలాంటి సందేహమే కొందరికి వచ్చింది. అ సందేహం ఒక రూమర్ గా మొదలై.. గోదావరి జిల్లాలను షేక్ చేసింది. ఈ రోజు ఉదయం గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల ఖైదీ నెం 150 డిస్ర్టిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్స్ మీద ఐటి శాఖ రైడ్స్ జరుగుతుందని టాక్ వచ్చింది. ఈ రైడ్ సమాచారాన్ని అందుకున్న కొందరు బడా బాబులు.. ధియేటర్లలో ఉన్న ఎకౌంట్ పుస్తకాలను తీసుకుని జంప్ అయిపోయారట. ఇప్పటికే టౌన్లలో కంప్యూటరైజ్డ్ బుక్కింగ్ వచ్చేసినా కూడా.. ఇంకా కొన్ని బి అండ్ సి సెంటర్లలో మాత్రం పాత కాలంలో అమ్మినట్లు టిక్కెట్టు ముక్కలు మ్యానువల్ గానే నెంబరింగ్ వేసి అమ్ముతున్నారు. అప్పుడు ఎక్కువ టిక్కెట్లు అమ్మేసి.. అబ్బే మేం అన్ని అమ్మలేదు అని చెప్పే ఛాన్సుంటుంది. అయితే చివరకు ఈ రైడ్ న్యూస్ అంతా జస్ట్ రూమర్ అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారట. అసలు ఈ ఏరియాల్లో వచ్చిన లెక్కలను నిర్మాతల దగ్గర తెలుసుకుని.. అదే సమయంలో అవన్నీ కరక్టుగా ఉన్నాయా లేదా అని వెరిఫై చేయడానికి.. స్థానిక ఎగ్జిబిటర్లపై ఐటి శాఖ దాడి చేసే ఛాన్సు మాత్రం లేకపోలేదు. . మొత్తానికి ఖైదీ నెం 150 సినిమాతో ఎంత భారీగా కలక్షన్లు వచ్చినా.. అంతే భారీగా రైడ్స్ కూడా జరగొచ్చని ఎప్పుడో కొందరు నిపుణులు వెల్లడించారు. ఇప్పటికే గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మాతలు అండ్ పంపిణీదారులపై ఇలాంటి దాడులే జరిగాయి <|hyperlink|> /Tupakidotcom/
https://www.tupaki.com//entertainment/article/will-spark-ott-become-successful/289153
ప్రస్తుతం డిజిటల్ వరల్డ్ లో ఓటీటీల హవా నడుస్తోంది. వినోద రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుడుతూ.. ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చొని చూసేలా కావల్సినంత ఎంటర్టైన్మెంట్ ని ఓటీటీలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఓటీటీ వేదికలను మరిపించేలా తెలుగులోనూ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ పుట్టుకొస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ లతో పాటుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన తెలుగు ఓటీటీ ‘ఆహా’ కూడా వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు 'స్పార్క్' (SPARK) అనే మరో సరికొత్త ఓటీటీ అందుబాటులోకి వస్తోంది.యువ వ్యాపారవేత్త సాగర్‌ మచనూరు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సహకారంతో 'స్పార్క్' ఓటీటీకి శ్రీకారం చుట్టారు. వర్మ రూపొందించిన 'D-కంపెనీ' సినిమాతో మే 15న ఈ ఓటీటీని గ్రాండ్ గా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఓటీటీ ప్లే స్టోర్‌ లో యాప్ రూపంలో అందుబాటులో ఉంచారు. ఈ యాప్ ని కూడా యూజర్ ఫ్రెండ్లీగా వీక్షకులను అట్రాక్ట్ చేసేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో జోనర్ ని బట్టి భాషను బట్టి సెక్షన్ వైస్ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారు. అలానే 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' సినిమాలు కూడా ఈ యాప్ లో స్ట్రీమింగ్ కి పెట్టనున్నారు. వీక్షకులకు పూర్తిగా కొత్త తరహా వినోదాన్ని అందించాలానే లక్ష్యంతో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని ఇవ్వడానికి ఈ ఫ్లాట్ ఫార్మ్ రెడీగా ఉందని నిర్వాహకులు తెలిపారు. 'స్పార్క్' లో ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లు - డ‌బ్బింగ్ సినిమాలతో పాటుగా కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేయనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంటర్టైన్మెంట్ కి దూరమైన ప్రేక్షకుల కోసం విభిన్నమైన కంటెంట్ ని అప్లోడ్ చేయనున్నట్లు అర్థం అవుతోంది. 'ఆర్జీవీ మిస్సింగ్' 'డేంజరస్' 'దిశ ఎంకౌంటర్' 'జగన్ మొండి' 'కనబడుటలేదు' 'టాబ్లెట్' 'క్యాబ్ స్టోరీస్' 'ఇది మహాభారతం కాదు' 'మనిషి' 'భీమునిపట్నం' 'తెరవెనుక భాగోతం' 'న్యూటన్' 'సెక్రటరీ' 'ఫ్లాట్ నెం.143' వంటి సినిమాలు రాబోయే రోజుల్లో ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.ఇకపోతే 'స్పార్క్' ఓటీటీకి టాలీవుడ్ - బాలీవుడ్ సినీ ప్రముఖుల సపోర్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి - ప్రభాస్‌ - ప్రకాశ్‌ రాజ్‌ - దగ్గుబాటి సురేశ్‌ బాబు - పూరి జగన్నాథ్‌ - మంచు లక్ష్మీ - అడవి శేష్ - రితేష్ దేశముఖ్ వంటి వారు బైట్స్ ద్వారా 'స్పార్క్' ఓటీటీకి విషెస్ అందించారు. ఇదంతా చూస్తుంటే ఇనోవేటివ్ ఐడియాస్ తో డిజిటల్ వరల్డ్ లోకి సరికొత్తగా అడుగుపెడుతున్న 'స్పార్క్' ఓటీటీ సక్సెస్ అవుతుందనే భావన కలుగుతుంది.
https://www.tupaki.com//entertainment/article/mini-review-malik-movie/339886
న‌టీన‌టులు : ఫ‌హ‌ద్ ఫాజిల్ - నిమిషా స‌జ‌య‌న్ - విన‌య్ ఫోర్ట్ - జోజు జార్జ్ - డిలీష్ పోత‌న్ - ఇంద్ర‌న్స్ - జ‌ల‌జ - సాలిమ్ కుమార్ - దినేష్ ప్ర‌భాక‌ర్ - స‌న‌ల్ అమ‌న్ - పార్వ‌తీ ఆర్ కృష్ణ త‌దిత‌ర‌లు న‌టించారు. ఈ సినిమాకు సంగీతం : సుషిన్ శ్యామ్ - సినిమాటోగ్ర‌ఫీ : సాను జాన్ వ‌ర్గీస్ - ఎడిటింగ్ : మ‌హేష్ నారాయ‌ణ‌న్ - నిర్మాతలు (తెలుగు) : అనిల్ కె. రెడ్డి, కిషోర్ రెడ్డి - ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం : మ‌హేష్ నారాయ‌ణ‌న్.మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీతో హీరోగా విభిన్న‌మైన సినిమాలు చేస్తూ ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్. త‌మిళంతో పాటు తెలుగులోనూ న‌టిస్తూ మూడు భాష‌ల్లోనూ న‌టుడిగా క్రేజ్ ని ద‌క్కించుకున్నారు. ఈ మ‌ధ్య కాలంలో మ‌ల‌యాళంలో ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌టించిన సినిమాల్లో దాదాపు అన్ని మంచి విజ‌యాల్ని సాధించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌ల‌కుల ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకున్నాయి. కంటెంట్ ప్ర‌ధానంగా సాగే సినిమాల‌కే ప్ర‌ధానంగా ప్రాధాన్య‌త‌నిస్తూ ఫ‌హ‌ద్ సినిమాలు చేస్తున్నారు.ఈ నేప‌థ్యంలో నిజ‌జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఫ‌హ‌ద్ న‌టించిన లేటెస్ట్ మ‌ల‌యాళ మూవీ `మాలిక్‌`. భూ క‌బ్జా, రాజ‌కీయ అవినీతి నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు. మ‌ల‌యాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీని తెలుగులో అదే పేరుతో ఆహా ఓటీటీలో విడుద‌ల చేశారు. ఈ మూవీ ఆగ‌స్టు 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. గ‌త ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియో లో మ‌ల‌యాళ వెర్ష‌న్ స్ట్రీమింగ్ అయింది.క‌థ : అహ‌మ్మ‌ద్ అలీ సులేమాన్ మాలిక్ (ఫ‌హ‌ద్ ఫాజిల్‌) కేర‌ళ తిరువ‌నంత‌పురంలోని స‌ముద్ర తీర ప్రాంతంలో వున్న ర‌మాద‌ప‌ల్లి కి గ్యాంగ్ స్ట‌ర్‌. ఆ ప్రాంతంలో మాలిక్ ఏది చెబితే అదే శాస‌నం. పోలీసులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా ఆయ‌న మాట వినాల్సిందే. అదే స‌మ‌యంలో కేర‌ళ తుఫాను బాధితుల‌కు ఇళ్లు, ప‌క్కా సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి ప్ర‌భుత్వం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తూ వుంటుంది. ఇదే స‌మ‌యంలో స్థానికంగా వున్న కొంత మంది నాయ‌కులు తుఫాను బాదితుల కోసం కేటాయించిన స్థ‌లంలో ప్రైవేటు వ్య‌క్తుల‌తో క‌లిసి క‌మ‌ర్షియ‌ల్ ప్రాజెక్ట్ ల‌ని నిర్మించాల‌నుకుంటారు.ఈ విష‌యం తెలుసుకున్న మాలిక్ రాజ‌కీయ నాయ‌కుల్ని తీవ్రంగా హెచ్చ‌రిస్తాడు. దీంతో ఎలాగైనా నాయ‌క్ అడ్డు తొల‌గించుకోవాల‌ని చూసిన రాజ‌కీయ నాయ‌కులు కొన్నేళ్ల క్రితం జ‌రిగిన మ‌త‌ఘ‌ర్ష‌ణ‌ల కేసుని తిరిగ‌తోడి హ‌జ్ యాత్రకు వెళుతున్న మాలిక్ ని అరెస్ట్ చేయిస్తారు. అంతే కాకుండా జైల్లోనే అత‌న్ని హ‌త్య చేయించాల‌ని ప‌థ‌కం వేస్తారు. ఇంత‌కీ వారి ప్లాన్ కు మాలిక్ చిక్కాడా?..ఈ క్ర‌మంలో ర‌మాద‌ప‌ల్లి కి త‌ను కీల‌క గ్యాంగ్ స్ట‌ర్ ఎలా అయ్యాడు? సులేమాన్.. మాలిక్ గా మారే క్ర‌మంలో ఏం జ‌రిగింది? త‌ను ఏం కోల్పోయాడు అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌. ఒక సాధార‌ణ వ్య‌క్తి త‌న చుట్టూ ఏర్ప‌డిన ప‌రిస్థితుల ప్ర‌భావం చేత‌ ప్ర‌జ‌ల కోసం, త‌న‌ని న‌మ్ముకున్న వారి కోసం ఒంటిగా పోరాటం చేసి కాల క్ర‌మేనా తిరుగులేని శ‌క్తిగా ఎద‌గ‌డం ఇందులో చూపించారు. త‌నే గ్యాంగ్ స్ట‌ర్ గా, చివ‌రికి తిరుగులేని డాన్ గా మారిన వైనాన్ని ఆవిష్క‌రించారు. ఇదే త‌ర‌హాలో వ‌చ్చిన హాలీవుడ్ ఫిల్హ్ `గాడ్ ఫాద‌ర్‌`, క‌మ‌ల్ హాస‌న్ `నాయ‌కుడు, ర‌జీనీకాంత్ `భాషా`సంచ‌ల‌న విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ లు అనిపించుకున్నాయి. మంచి పై చెడుతో సాగే స‌మ‌రం నేప‌థ్యంలో ఈ సినిమాల పంథాలోనే ద‌ర్శ‌కుడు `మాలిక్‌`ని తెర‌కెక్కించాడు.సులేమాన్ నేర జీవితాన్ని వ‌దిలేయాల‌ని అనుకోవ‌డం.. కానీ అత‌న్ని పోలీసులు చంపేయాల‌ని ప్లాన్ చేయ‌డం వంటి స‌న్నివేశాల‌తో క‌థ మొద‌ల‌వుతుంది. ప్రారంభ దృశ్యాల నుంచే సినిమా కథేంటో.. సులేమాన్ ఎవ‌రో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి స‌గ‌టు ప్రేక్ష‌కుడిలో మొద‌ల‌వుతుంది. ఆ స్థాయిలో ద‌ర్శ‌కుడు మ‌హేష్ నారాయ‌ణ‌న్ క‌థ‌, క‌థ‌నాల్ని న‌డిపించి ఆక‌ట్టుకున్నాడు. చిన్న చిన్న నేరాలు చేస్తూ ఫైన‌ల్ గా ఓ హ‌త్య తో సులేమాన్ కాస్తా మాలిక్ గా మార‌డం స్థానిక నాయ‌కులు, పోలీసులు, అధికారుల్ని ఎదిరించే స్థాయికి మాలిక్ చేర‌డం వంటి స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.మాలిక్ ని హ‌త్య చేయాల‌ని పోలీసులు చేసే కుట్ర‌లు, వాటిని అధిగ‌మిస్తూ మాలిక్ ముందుకు సాగే తీరు ఈ క్ర‌మంలో త‌న‌కు విలువైనవి పోగొట్టుకునే తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఎమోష‌న‌ల్ కు గురిచేస్తుంది. మాలిక్ పాత్ర‌లో ఫ‌హ‌ద్ శ‌భాష్ అనిపించాడు. క‌థా గ‌మ‌నం నెమ్మ‌దిగా సాగినా గ్యాంగ్ స్ట‌ర్ సినిమాల‌ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్ని మెప్పించే సినిమా ఇది. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే మాలిక్.. ఫ‌హ‌ద్ ఫాజిల్‌.. మ‌హేష్ నారాయ‌ణ‌న్ ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఓ మ్యాజిక్ అని చెప్పొచ్చు.
https://www.tupaki.com//entertainment/article/niharika-hopes-on-happy-wedding-movie/189659
సినీ కుటుంబాల నుంచి హీరోలు వస్తుంటారు కానీ.. హీరోయిన్లు అరంగేట్రం చేయడం అరుదు. ఐతే ఈ మధ్య సంప్రదాయాన్ని మారుస్తూ పెద్ద కుటుబాల నుంచి అమ్మాయిలు కూడా సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ కోవలోనే ‘ఒక మనసు’ సినిమాతో మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారిక తెరంగేట్రం చేసింది. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. నిహారికకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ దెబ్బతో మళ్లీ ఆమె ఇంకో సినిమా చేయడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఎట్టకేలకు ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాలో నటించిన నిహారిక.. దీని ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ రోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీని ప్రోమోలు జస్ట్ ఓకే అనిపించాయి. ఐతే యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్ నుంచి ఈ చిత్రం వస్తుండటంతో దీన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.నిహారికతో పాటు ఇందులో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ కు కూడా ఇప్పుడు హిట్టు చాలా అవసరం. అతడి నుంచి ఓ మోస్తరు సినిమా వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది. ఇక ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్న లక్ష్మణ్ కార్యకు కూడా ఈ సినిమా కీలకమే. మరి ఇంది జాతకాలు ముడిపడి ఉన్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి. పెళ్లి విషయంలో ఈ తరం అమ్మాయిలు.. అబ్బాయిల మనస్తత్వాలకు అద్దం పట్టే సినిమాలా కనిపిస్తోంది. మరి యూత్ ఈ చిత్రానికి ఏమాత్రం కనెక్టవుతారన్నదానిపై దీని ఫలితం ఆధారపడి ఉంటుంది. హీరో హీరోయిన్లకు ఎలాంటి ఇమేజ్ లేకపోవడం.. వాళ్ల ట్రాక్ రికార్డు కూడా గొప్పగా లేకపోవడంతో ఈ చిత్రానికి ప్రి రిలీజ్ బజ్ అయితే లేదు. బుకింగ్స్ కూడా పెద్దగా జరగలేదు. కాబట్టి సినిమాకు మంచి టాక్ రావడం చాలా కీలకం. మరి ఏమవుతుందో?
https://www.tupaki.com//entertainment/article/oscar-award-winning-movie-for-telugu-audience-the-whale-movie/365689
ఆస్కార్‌ అవార్డ్‌ దక్కించుకున్న ది వేల్‌ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేక్షకులు గూగల్‌ లో సెర్చ్‌ చేశారు.. ఈ సినిమా ఎక్కడ ఉంది.. ఎలా ఉంది అంటూ చాలా మంది గూగుల్ చేయడం జరిగింది. ఇండియన్ సినీ ప్రేక్షకులకు సోనీ లివ్ గుడ్‌ న్యూస్ చెప్పింది. అన్ని ఇండియన్ భాషల్లో ఈసినిమాను స్ట్రీమింగ్‌ చేస్తోంది.బ్రెండన్ ఫ్రేజర్ కీలక పాత్రలో నటించిన ది వేల్‌ చిత్రం మొన్నటి ఆస్కార్‌ అవార్డ్‌ వేడుకల్లో రెండు అవార్డులను గెలుచుకున్న విషయం తెల్సిందే. ఆస్కార్‌ గెలిచినప్పటి నుండి కూడా ఈ సినిమాను చూడాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ప్రముఖ ఓటీటీ లు ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేసేందుకు ముందుకు వచ్చాయి.ఇంగ్లీష్ తో పాటు తెలుగు.. తమిళం.. హిందీ ఇంకా ఇతర భాషల్లో కూడా ది వేల్ చిత్రం స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లుగా సోనీ లివ్‌ అధికారికంగా ప్రకటించింది.సోనీ లివ్‌ కు ఇండియాలో ఖాతాదారులు తక్కువే ఉన్నారు. అయితే తాజాగా ది వేల్ కారణంగా సోనీ లివ్‌ యొక్క ఖాతాదారులు భారీగా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.డారెన్ అరోనోఫ్స్కీ దర్శకత్వంలో రూపొందిన ది వేల్‌ విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది వేల్‌ ఆస్కార్‌ దక్కించుకున్న తర్వాత ఎక్కువ మంది చూస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి తన కథనంలో పేర్కొనడం జరిగింది.ఆర్ఆర్‌ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన నేపథ్యంలో చాలా మంది ఆ పాటను ఇప్పుడు వింటున్నారు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
https://www.tupaki.com//entertainment/article/sree-vishnu-interview-on-raja-raja-chora-movie/300159
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాజ రాజ చోర‌’. కొత్త దర్శకుడు హసిత్‌ గోలి తెరెక్కించిన ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ - సునయన హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌ - అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఆగ‌స్ట్ 19న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుద‌ల‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో శ్రీవిష్ణుతో మీడియాతో ముచ్చటించిన విశేషాలు...- నేను వెంక‌టేశ్‌ గారికి వీరాభిమానిని. నా సినిమాను ఆయ‌న చిత్రంతో కంపేర్ చేయ‌కూడ‌దు. అయితే సినిమా చూస్తున్నంత‌సేపు ఫ్యామిలీతో క‌లిసి చూసేలా ఉంటుంద‌నిపించడం.. హ్యుమ‌ర్‌ - ఎమోష‌న్స్.. ఇలాంటి వాటి వ‌ల్ల ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ లో అలా మాట్లాడాను. - వెంక‌టేశ్‌ గారిని క‌లిశాను. సినిమా చేయ‌డానికి ముందు కూడా ఆయ‌న్ని క‌లిసి క‌థ చెప్పాను. ఆయ‌న బావుంద‌ని ఎంక‌రేజ్ చేశారు. ట్రైల‌ర్ వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న స్పందించారు. కామెడీ టైమింగ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంద‌ని మెచ్చుకున్నారు. అప్పుడు పాండ‌మిక్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆయ‌న్ని క‌ల‌వ‌లేదు. ఇప్ప‌టికి కుదిరింది. ఆయ‌న్ని క‌లిసి మాట్లాడిన త‌ర్వాత సినిమా చాలా బావుంటుంది అని ఎంక‌రేజ్ చేశారు. - నాకు ఇంత‌కు ముందు వెంక‌టేశ్‌ గారిని క‌లిసే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ.. నా అంత‌ట నేను నా హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌కూడ‌దు. ఆయ‌నే పిల‌వాల‌ని ఓ చిన్న టార్గెట్ పెట్టుకున్నాను. ప‌లానా సినిమాలో బాగా చేశావ‌ని ఆయ‌న పిలిచి మాట్లాడితే బావుంటుంది క‌దా అని ఎదురుచూశాను. 'నీది నాది ఒకే క‌థ' త‌ర్వాత న‌టుడిగా ఆయ‌న‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. చాలా బాగా మాట్లాడారు. ఎలా ఉండాలో చెప్పారు. క‌థ‌ల పరంగా ఏమైనా స‌ల‌హాలు కావాల‌న్నా అడ‌గ‌మ‌ని కూడా చెప్పారు. అప్ప‌టి నుంచి నాకేదైనా డౌట్ వ‌స్తే ఆయ‌నతో మాట్లాడుతూ వ‌స్తున్నాను. ప‌ర్స‌న‌ల్‌ గా నాకు అవి ఎంతో హెల్ప్ అవుతూ వ‌చ్చాయి. అన్నీ బాగా చేస్తున్నావ్‌. కాస్త మాస్ క్యారెక్ట‌ర్స్ కూడా చెయ్.. మాస్ అంటే కొడితే ఎగిరిపోవ‌డం అనే స్టైల్ లో కాకుండా కాస్త డిఫ‌రెంట్‌ గా ట్రై చెయ్‌ అని రీసెంట్‌ గా ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. - నా అదృష్టం కొద్దీ తదుప‌రి సినిమాల‌న్నీ నేను గ్రామీణ నేప‌థ్యంలో చేస్తున్నాను. ఆ పాత్ర‌లు మాస్ ఆడియెన్స్‌ కు బాగా క‌నెక్ట్ అవుతాయి. - 'రాజ రాజ చోర' కు చాలా మంచి క‌థ కుదిరింది. ఆ న‌మ్మ‌కంతోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో అలా మాట్లాడాను. సాధార‌ణంగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌ కు రావ‌డానికి ఆలోచిస్తుంటారు. అలాంటి భ‌యానికి ముందు నా కాన్ఫిడెన్స్‌ ని ప్రెజంట్ చేస్తే బావుంటుంద‌నిపించి స్టేజ్‌ పై అలా మాట్లాడాను. అయితే నేను చెప్పిన మాట‌లు హృద‌యంలో నుంచి వ‌చ్చిన‌వే. - కొత్త ర‌క‌మైన స్టోరీ టెల్లింగ్. బ‌య‌టి లాంగ్వేజ్ చిత్రాల‌ను ఓటీటీల్లో చూసి వాళ్ల‌ని పొగుడుతున్నాం క‌దా.. అలా రేపు మీరు కూడా మ‌మ్మ‌ల్ని పొగుడుతారు. ఈ జోన‌ర్‌ లో డిఫ‌రెంట్ అటెంప్ట్. - కొంటె దొంగ పాత్ర చేశాను. సినిమాలో క్యారెక్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌కు అర్థం కావ‌డానికి ప‌దిహేను నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. వెళ్లిన త‌ర్వాత హీరో పాత్ర‌ను అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. సినిమాలో సిచ్యువేష‌న్ కామెడీ ఉంటుంది. సినిమా ఫ‌స్ట్ హాఫ్‌ లో హీరో చెప్పేదంతా అబ‌ద్దాలే. - హసిత్ దీని కంటే ముందు ఓ డిసీస్ ఓరియెంటెడ్ సినిమా నాతో చేద్దామ‌ని అనుకున్నారు. ఎక్స్‌ట్రార్డిన‌రీ క‌థ‌. అలాంటి ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే చిన్న భ‌య‌మేసింది. అంత కంటే ముందు మ‌న‌ల్ని ప్రూవ్ చేసుకోవాల‌నిపించింది. అందుక‌ని ఈ క‌థ‌తో ముందుకెళ్లాం. - హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేస్తే రిలాక్స్ అయిపోతాం. అలా ఉండ‌టం నాకు ఇష్టం ఉండదు. అదే కొత్త వాళ్ల‌తో సినిమా చేస్తే ఓ భ‌యం, బాధ్య‌త ఉంటాయి. హ్యాండిల్ చేస్తార‌ని న‌మ్మ‌కం వ‌చ్చిన‌ప్పుడు వాళ్లు బిడ్డ‌లాగే భావించే సినిమా క‌రెక్ట్ వస్తుంటే వాళ్లు ప‌డే ఆనందం చూస్తే నాకొక కిక్ వ‌స్తుంది. ఫ‌స్ట్ నుంచి నాకు అలా అల‌వాటైంది. - ఈ సినిమా చూసిన త‌ర్వాత ముందు మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివేక్ సాగ‌ర్ గురించే మాట్లాడుతారు. ఇక మేఘా ఆకాశ్‌ - సునయన ఇద్దరరూ తెలుగువాళ్లే. కానీ త‌మిళ ఇండ‌స్ట్రీలో ఎక్కువ సినిమాలు చేశారు. ఇక్క‌డ త‌క్కువ‌గానే సినిమాలు చేశారు. ఈ సినిమా వారికి కూడా మంచి పేరు తెస్తుంద‌న‌డంలో సందేహం లేదు. - నెక్ట్స్ చేస్తున్న‌ 'అర్జున ఫాల్గుణ‌' చిత్రంలో ఓ సాంగ్ మాత్ర‌మే బాలెన్స్ ఉంది. అలాగే 'భ‌ళా తంద‌నాన' షూటింగ్ జ‌రుగుతుంది. ఇవి కాకుండా ఓ పోలీస్ సినిమా చేస్తున్నాను. అది స‌గం పూర్త‌య్యింది.
https://www.tupaki.com//entertainment/article/vidyut-jammwal-kalari-video-goes-viral/269263
బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు విద్యుజమాల్‌. ఈయన విలన్‌ గానే కాకుండా హీరోగా కూడా నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫిజిక్‌ విషయంలో విద్యుజమాల్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కండలు తిరిగిన బాడీతో అతడు ఎప్పుడు కూడా సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉంటాడు. ఈసారి కలరిపట్టు వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కలరి పట్టు విద్యలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని ముందు ఉన్న థింగ్స్‌ ను నరకడం కొట్టడం వంటివి చేస్తూ ఉంటారు.కలరి పట్టులో రాణించాలంటే అత్యంత నైపుణ్యం కావాలి. కాస్త అటు ఇటు అయినా కూడా ప్రాణాలు పోతాయి. అలాంటి విద్యను విద్యు జమాన్‌ తాను నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ కోసం అభ్యషించాడు. మామూలుగా అయితే నేర్చుకోకుండా కూడా నటించేయవచ్చు. కాని రియాల్టీగా సీన్స్‌ రావాలనే ఉద్దేశ్యంతో నేర్చుకుని మరీ రంగంలోకి దిగబోతున్నాడు. తాజాగా కలరి పట్టు విద్యను నేర్చుకున్న విద్యు జమాల్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అతడి పట్టుదలకు అంతా కూడా వావ్‌ అంటూ అభినందిస్తున్నారు.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి <|hyperlink|> ?v=MDIRoEEIt6k
https://www.tupaki.com//entertainment/article/karnan-first-look-motion-poster/244652
తమిళంలో కమర్షియల్ సినిమాలే చేసినా వాటిలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకునే హీరో ధనుష్. చూడ్డానికి బక్కగా.. పీలగా.. ఇతనేం హీరో అనిపించేలా ఉంటాడు కానీ.. తెరపై అతను హీరోయిజాన్ని ఓ రేంజిలో పండిస్తాడు. అతడి సినిమాలు చాలా వరకు వయొలెంటుగా ఉంటాయి. రక్తంలో తడిసి ముద్దయిపోయే క్యారెక్టర్లంటే ధనుష్‌ కు బాగా ఇష్టం. గత ఏడాది వచ్చిన ‘అసురన్’ సినిమాలో అతనెలా రక్తపాతం సృష్టించాడో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ధనుష్ అలాంటి పాత్రే ఎంచుకున్నట్లున్నాడు. గత ఏడాది తమిళం నుంచి వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలవడమే కాక జాతీయ అవార్డు కూడా గెలిచిన ‘పరియేరుమ్ పెరుమాళ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రం ‘కర్ణన్’. తాజాగా ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ మోషన్ పోస్టర్ మొదలు కావడంతోనే ఒక కత్తి వేటుకు తల తెగిపడ్డ దృశ్యం కనిపించింది. ఆ తర్వాత ధనుష్ ఆ కత్తినే పట్టి శత్రువుల్ని చీల్చి చెండాడే దృశ్యం చూపించారు. ముఖానికి గుడ్డ చుట్టిన లుక్‌ లో ధనుష్ వయొలెంట్‌ గా కనిపించాడు మోషన్ పోస్టర్ లో. దీన్ని బట్టి చూస్తే ‘అసురన్’ తరహాలోనే అన్యాయానికి గురైన ఓ సామాన్యుడు ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించేట్లున్నారు. ధనుష్ ఫేవరెట్ డైరెక్టర్ - అతడితో మూడు సినిమాలు తీసిన వెట్రిమారన్.. ఎక్కువగా అతణగారిన వర్గాలకు చెందిన కథల్నే సినిమాలుగా తీశాడు. ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ శిష్యుడైన మారి సెల్వరాజ్ కూడా ఈ తరహా కథతోనే దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. కాబట్టి వీళ్ల కలయికలో వచ్చే సినిమా కూడా అదే టైపులో ఉంటుందనిపిస్తోంది. ‘కర్ణన్’ పూర్తయ్యాక వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వడ చెన్నై’ సీక్వెల్లో ధనుష్ నటించాల్సి ఉంది.
https://www.tupaki.com//entertainment/article/film-based-on-gangster-nayeem-encounter/136149
నయీముద్దీన్ ఎన్ కౌంటర్.. 24 గంటలుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఇదే. నయీమ్ గురించి చెప్పుకోవాలంటే ఓ సినిమా స్టోరీకి మించిన ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి.ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసే ఓ మాఫియా డాన్.. మావోయిస్టులపై విపరీతమైన వ్యతిరేకత ఉన్న ఓ మాజీ నక్సలైట్.. సరెండర్ అయిన మావోయిస్టులకు ఇతడంటే టెర్రర్.. ఉన్నత పోలీస్ అధికారులకు కోవర్టు.. ఓ గ్యాంగ్ స్టర్.. కోబ్రా గ్యాంగుల క్రియేటర్.. ప్రభుత్వమే పావుగా వాడుకున్న ఓ రౌడీ షీటర్.. ఇలా ఎన్నో రకాలుగా నయీమ్ గురించి కథలు వినిపిస్తాయి. ఒక వ్యక్తి లైఫ్ లో ఇన్ని వేరియేషన్స్ చాలా అరుదు. పైగా మాఫియాకి లింక్ అవడం చాలా మంది దర్శకులను ఆకర్షించే విషయమే. ఇలాంటి సినిమాలు తీయడంలో దిట్ట సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటివరకూ నయీమ్ పై సినిమా తీస్తున్నా అని వర్మ అనౌన్స్ చేయకపోవడమే ఆశ్చర్యకరమైన విషయం. వీలైనంత తొందరలో వినేసినా ఆశ్చర్యం అక్కర్లేదు. అయినా.. మాఫియా టైపు సినిమాలంటే వర్మకు ఏమన్నా పేటెంట్స్ ఉన్నాయా ఏంటి? ఇలా రియల్ లైఫు కేరక్టర్లతో సినిమా చేసే సత్తా వేరే ఎవరికీ లేదా? ఏమో చూద్దాం.. ఆ తెగువ ఉన్న దర్శకుడు ఎవరో!
https://www.tupaki.com//entertainment/article/mahesh-babu-to-buy-ipl-team/108402
సూప‌ర్‌స్టార్ డ‌మ్ సంపాదించుకొన్న మ‌హేష్ ఇప్ప‌టివ‌ర‌కు సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల‌కే ప‌రిమితమ‌య్యాడు. ఇత‌ర‌త్రా వ్యాపారాల‌పై ఆయ‌న అంత కాన్సంట్ర‌ట్ చేయ‌లేదు. ఇటీవ‌లే సొంతంగా ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించాడు. ఆ సంస్థ‌లో వ‌రుస‌గా సినిమాలు తీయాల‌ని ప్లాన్ చేసుకొంటున్నాడు. దాంతోపాటు తాజాగా మ‌రో కొత్త బిజినెస్ ప్లాన్‌కి కూడా మ‌హేష్ తెర‌తీశాడ‌ని తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపుని సొంతం చేసుకొన్న మ‌హేష్‌బాబు క్రీడా రంగంలోకి అడుగు పెడుతున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న ఐపీయ‌ల్‌లో ఓ కొత్త టీమ్‌ని ప్ర‌వేశ పెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వైజాగ్ సిక్స‌ర్స్ పేరుతో 2017లో మ‌హేష్ టీమ్ ఐపీయ‌ల్‌లోకి అడుగుపెడుతున్న‌ట్టు స‌మాచారం. ఈ టీమ్ ఆలోచ‌న వెన‌క మ‌హేష్ బావ, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా ఉన్న‌ట్టు తెలిసింది. టీమ్ అస‌లు ఓన‌ర్ జ‌య‌దేవ్ గల్లానేన‌ట‌. కానీ ఆ టీమ్‌కి ప్ర‌చార క‌ర్త‌గా మ‌హేష్ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారట‌. టీమ్‌కోసం మ‌హేష్ కూడా కొంత భాగం ఇన్వెస్ట్ చేయ‌బోతున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు చెబుతున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్ త‌ర‌ఫున స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఉండేది. ఆ జ‌ట్టు ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అయితే రాష్ట్రం విడిపోయింది కాబ‌ట్టి... హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ అంటే తెలంగాణ‌కే చెందుతుంద‌నీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కూడా ఓ టీమ్ ఉంటే బాగుంటుంద‌న్న ఆలోచ‌నే `వైజాగ్ సిక్స‌ర్` టీమ్ ఏర్పాటుకి కార‌ణ‌మైన‌ట్టు తెలుస్తోంది. మొత్త‌మ్మీద మ‌హేష్ క్రికెట్‌తోనూ అనుబంధం పెంచుకొంటున్నార‌న్న‌మాట‌. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ ప్లేయ‌ర్స్‌తో క‌లిసి ఆయ‌న ప‌లు ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించి అద‌ర‌గొట్టేస్తాడ‌న్న‌మాట‌.
https://www.tupaki.com//entertainment/article/kalyana-vaibhogame-movie-review/125299
చిత్రం : కళ్యాణ వైభోగమే నటీనటులు- నాగశౌర్య, మాళవిక నాయర్, రాశి, ఆనంద్, ఆశిష్ విద్యార్థి, ఆర్జే హేమంత్, రాజ్ మాదిరాజు తదితరులుసంగీతం- కళ్యాణి కోడూరిఛాయాగ్రహణం- జీవీఎస్ రాజుమాటలు- లక్ష్మీభూపాల్నిర్మాత- దామోదర్ ప్రసాద్కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- నందిని రెడ్డిదర్శకురాలిగా తన తొలి సినిమా ‘అలా మొదలైంది’తో వచ్చిన పేరంతా.. రెండో సినిమా ‘జబర్దస్త్’తో పోగొట్టుకుంది నందిని రెడ్డి. ఇక నిర్మాత దామోదర్ ప్రసాద్ ‘హోరాహోరీ’తో కంగుతిన్నాడు. హీరో నాగశౌర్య సైతం జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి లాంటి సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. వీళ్ల ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ.. ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కిన ‘కళ్యాణ వైభోగమే’ ఆసక్తి రేపింది. మంచి ఫీల్ గుడ్ మూవీలాగా కనిపించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.కథ: శౌర్య (నాగశౌర్య) బీఎస్సీ పూర్తి చేసి.. అమెరికాకు వెళ్లాలని కలలు కంటున్న కుర్రాడు. దివ్య (మాళవిక) ఎంబీబీఎస్ చదువుతూ.. ఆ తర్వాత ఫారిన్లో ఎండీ చదవాలని కోరుకుంటున్న అమ్మాయి. వీళ్లిద్దరికీ అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ వాళ్ల తల్లిదండ్రులు మాత్రం పెళ్లి కోసం తొందర పెడుతుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్లిద్దరూ పెళ్లికి సిద్ధమవుతారు. పెద్ద వాళ్ల కోసం పెళ్లి చేసుకున్నా.. తర్వాత విడాకులు తీసుకుని ఎవరి జీవితం వాళ్లు చూసుకోవాలన్నది వాళ్ల ప్లాన్. అనుకున్నట్లే పెళ్లి చేసుకుని.. ఆ తర్వాతి రోజే విడాకుల కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. మరి వాళ్లు కోరుకున్న ప్రకారం వారు విడిపోయారా లేదా.. వాళ్ల ప్లాన్ వర్కవుటైందా లేదా.. అన్నది తెర మీదే చూడాలి. కథనం, విశ్లేషణ: అక్క‌డో పెళ్లి జ‌రుగుతుంటుంది. పెళ్లికొడుకు మావ‌య్య పెళ్లికూతురు తండ్రి ద‌గ్గ‌రికెళ్లి ఏంటండీ.. పెళ్లి ఇంత సింపుల్ గా చుట్టేస్తున్నారు అంటాడు. అంత‌లో పెళ్లికొడుకు తండ్రి ఎంట‌ర‌వుతాడు. పెళ్లి అనేది మ‌న‌వాళ్ల మ‌ధ్య మ‌న‌మంతా క‌లిసి చేసుకునే వేడుక అని.. మ‌న‌కు ఎంత డబ్బు, ప‌ర‌ప‌తి ఉందో చూపించడానికి కాదంటూ సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుల్లో సైతం ఆలోచ‌న క‌లిగించేలా రియ‌లిస్టిగ్గా కొన్ని మాట‌లు చెబుతాడు. ఆ స‌న్నివేశం చూస్తుంటే మ‌నం థియేట‌ర్లో కాకుండా అక్క‌డే ఉండి నిజంగానే ఆ మాట‌ల్ని వింటున్నామా అన్న ఫీలింగ్ క‌లుగుతుంది. ‘క‌ళ్యాణ వైభోగ‌మే’లో ఇలా ప్రేక్ష‌కులు ఈజీగా క‌నెక్ట‌యిపోయే పాత్ర‌లు, స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి.ఈ త‌రం యూత్ కు ప్ర‌తిబింబాల్లా అనిపించే హీరో హీరోయిన్లు.. హుందాత‌నం ఉన్న హీరోయిన్ తండ్రి.. కొడుక్కి పెళ్లి చేసే వ‌య‌సులో అమ్మాయిల‌తో చాటింగ్ చేస్తూనే అవ‌స‌ర‌మైన‌పుడు పెద్ద‌రికం చాటుకునే హీరో తండ్రి.. కోపం వ‌స్తే వంట‌గ‌దిలోకి దూరిపోయి అతిగా వండేసే హీరో త‌ల్లి.. క‌మ్యూనికేష‌న్ లేని తండ్రీకూతుళ్ల మ‌ధ్య వార‌ధిగా నిలిచే హీరోయిన్ త‌ల్లి.. ఇలా ప్ర‌తి పాత్ర‌కూ ఓ క్యారెక్ట‌రైజేష‌న్‌.. యూత్ ను ఆక‌ట్టుకునే ఫ‌న్ ఫిల్డ్ రొమాన్స్‌.. ఫ్యామిలీస్ ను మెప్పించే ఎమోష‌న్స్.. మొత్తంగా ఓ ఫీల్ గుడ్ ఎంట‌ర్టైన‌ర్ ‘క‌ళ్యాణ వైభోగ‌మే.కొన్ని క‌థ‌లు కొత్త‌గా ఉండి ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తాయి. ఇంకొన్ని క‌థ‌లు రొటీన్ గా ఉంటూనే క‌థ‌నంలో కొత్త‌ద‌నంతో ఆక‌ట్టుకుంటాయి. క‌ళ్యాణ వైభోగ‌మే రెండో కోవ‌కే చెందుతుంది. పెళ్లి మీద వ్య‌తిరేక‌త‌తో ఉన్న ఓ జంట‌.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో పెళ్లి చేసుకుని, అపార్థాలు, గొడ‌వ‌ల త‌ర్వాత ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని చివ‌రికి ప్రేమ‌లో ప‌డి ఒక్క‌ట‌య్యే క‌థ‌తో ‘పెళ్లైన కొత్త‌లో’ లాంటి కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మే. ఆ త‌ర‌హా క‌థ‌తోనే నందిని రెడ్డి ఆహ్లాద‌క‌ర‌మైన క‌థ‌నంతో ‘క‌ళ్యాణ వైభోగ‌మే’ను ప్ర‌త్యేక‌మైన సినిమాగా తీర్చిదిద్దింది. ఎక్క‌డా మెలో డ్రామాకు అవ‌కాశం లేకుండా నిజంగా మ‌న చుట్టూ జ‌రుగుతున్న‌ట్లే స‌హ‌జంగా స‌న్నివే​శాల్ని తీర్చిదిద్ద‌డం సినిమాకున్న పెద్ద ప్ల‌స్ పాయింట్‌.ఒక ఫ్యామిలీలో హిడెన్ కెమెరాలు పెట్టి క్యాప్చ‌ర్ చేసినట్లు పాత్ర‌ల‌న్నీ స‌హ‌జంగా ప్ర‌వ‌ర్తిస్తాయి. ఒరిజిన‌ల్ గా అనిపించే హావ‌భావాలు ప‌లికిస్తాయి. నిజ‌మైన ఎమోష‌న్ల‌ను మనం ఫీల‌వుతాం. పెళ్లి, కెరీర్ విష‌యంలో హీరో హీరోయిన్ల ఆలోచ‌న‌లు కొంచెం ఎక్స్ ట్రీమ్ గా... త‌ల్లిదండ్రుల ప‌ట్టుద‌ల కొంచెం టూమ‌చ్ గా అనిపిస్తాయి కానీ.. వాటిని ప‌క్క‌న‌బెట్టేస్తే మిగ‌తా ఎమోష‌న్లన్నీ కూడా స‌హ‌జంగా అనిపిస్తాయి. ప్ర‌తి పాత్ర‌కూ ఓ ఐడెంటిటీ ఉండ‌టంతో వాటితో ఈజీగా క‌నెక్ట‌యిపోతాం. పేలిపోయే కామెడీ లేకున్నా.. సింపుల్ హ్యూమ‌ర్ తోనే ప్రేక్ష‌కుల ముఖాల‌పై చిరున‌వ్వు నిలిచి ఉండేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దింది నందిని రెడ్డి.హీరో హీరోయిన్లు స‌హా పాత్ర‌ల ప‌రిచ‌యం.. ఆ త‌ర్వాత పెళ్లి చూపులు.. పెళ్లి చెడ‌గొట్టుకునే స‌న్నివేశాలు.. ఆపై ఇద్ద‌రికీ వేరే చూపుల‌కు సంబంధించిన సీన్స్ అన్నీ కూడా స‌ర‌దాగా సాగిపోవ‌డంతో ప్ర‌థ‌మార్ధం ర‌య్యిన దూసుకెళ్తుంది.ఇక పెళ్లికి సంబంధించిన స‌న్నివేశాలు కొంచెం ఎమోష‌న‌ల్ గా సాగుతాయి. వాటితో కూడా ప్రేక్ష‌కులు ఈజీగా క‌నెక్ట‌యిపోవ‌డంతో చూస్తుండ‌గానే ప్ర‌థ‌మార్ధం అయిపోతుంది. ఉత్కంఠ రేపే ఇంట‌ర్వెల్ బ్యాంగ్ తో ప్ర‌థ‌మార్ధం ముగుస్తుంది.ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ఎక్కువ ప్రెడిక్ట‌బుల్ గా ఉండ‌టం.. కొంచెం సాగ‌దీసిన ఫీలింగ్ క‌ల‌గ‌డంతో సినిమా గ్రాఫ్ కొంచెం ప‌డిపోయిన ఫీలింగ్ క‌లుగుతుంది కానీ.. నిరాశ చెందేలా మాత్రం ఉండ‌దు.ఫీల్ మాత్రం కంటిన్యూ అవుతుంది. హీరో హీరోయిన్ల మ‌ధ్య దూరం త‌గ్గి వాళ్ల మ‌ధ్య ప్రేమ చిగురించే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ప్రిక్లైమాక్స్ లో ఎమోష‌న్ బాగా పండింది. ఇక క్లైమాక్స్ విష‌యంలో నందిని రెడ్డి అలా మొద‌లైంది ఫార్ములా ఫాలో అయిపోయింది. తాగుబోతు ర‌మేష్ పాత్ర‌ను ప్ర‌వేశ‌పెట్టి స‌ర‌దాగా సినిమాను ముగించే ప్ర‌య‌త్నం చేసింది. ఎక్క‌డా అస‌భ్య‌త‌కు తావు లేకుండా సినిమాను క్లీన్ ఎంట‌ర్టైన‌ర్ గా తీర్చిదిద్ద‌డం కూడా సినిమాకున్న ప్ల‌స్ పాయింట్‌. ‘క‌ళ్యాణ వైభోగ‌మే’లో చెప్పుకోద‌గ్గ నెగెటివ్ పాయింట్స్ అంటే.. క‌​థ​​ ​ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా ఉండ‌ట‌మే. సినిమా మొద‌లైన‌పుడే క‌థ ఎప్పుడు ఏ మ‌లుపు తీసుకుంటుందో.. ఎలా సాగుతుందో.. ఎలా ముగుస్తుందో ఓ అంచ‌నా వచ్చేయొచ్చు. దాదాపుగా ఆ అంచ‌నాకు త‌గ్గ‌ట్లే సినిమా న‌డుస్తుంది. సినిమా అంతా ఉన్న ఫీల్ తో సాగి చివ‌రికి వ‌చ్చేస‌రికి మామూలుగా ముగియ‌డం కూడా నెగెటివ్ పాయింటే. మ‌నం ఇంకా ఎక్కువే ఆశిస్తాం కానీ.. నందిని రెడ్డి మామూలుగా ముగించేసింది. అనుకున్నంత స్థాయిలో ఎమోష‌న్లు పండ‌లేదు. క్లైమాక్స్ మామూలుగా అనిపిస్తుంది. సినిమా నిడివి కూడా కొంచెం ఎక్కువైంది.నటీనటులు: కథకు తగ్గట్లు మంచి నటీనటుల్ని ఎంచుకోవడంలోనే నందిని రెడ్డి సగం విజయం సాధించింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. నాగశౌర్య, మాళవికల జంట చూడముచ్చటగా అనిపిస్తుంది. వాళ్లిద్ద‌రి కెమిస్ట్రీ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఇద్దరూ కూడా నేటితరం అబ్బాయి-అమ్మాయిగా చక్కగా సరిపోయారు. అందం, అభినయం రెండింట్లోనూ ఆకట్టుకున్నారు. పాత్ర‌ల్లో ఇమిడిపోయారు. ముఖ్యంగా మాళ‌వికతో త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. నిత్యామీన‌న్ త‌ర‌హాలో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసే ప్ర‌తిభ ఆమె సొంతం. ఆనంద్, రాశి హుందాగా న‌టించారు. ఐశ్వ‌ర్య కూడా ఆ పాత్ర‌కు ప్ర‌త్యేక‌త చేకూర్చింది. న‌ట‌న కొత్త‌యిన‌ప్ప‌టికీ రాజ్ మాదిరాజు కూడా త‌డ‌బాటు లేకుండా న‌టించాడు.సాంకేతిక వ‌ర్గం: న‌టీన‌టుల్లాగే సాంకేతిక నిపుణులు కూడా సినిమాకు బ‌లంగా నిలిచారు. సంగీత ద‌ర్శ‌కుడు క‌ళ్యాణి కోడూరి, ఛాయాగ్రాహ‌కుడు బీవీఎస్ రాజు.. సినిమాలో మంచి ఫీల్ తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. క‌ళ్యాణి పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతం కూడా చాలా ఆహ్లాదాన్నిచ్చాయి. రాజు విజువ‌ల్స్ కూడా అంతే. సినిమా చాలా క‌ల‌ర్ ఫుల్ గా రావ‌డంలో కెమెరా ప‌నిత‌నం కీల‌కం. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. దామోద‌ర్ ప్ర‌సాద్ త‌న అభిరుచిని మ‌రోసారి చాటుకున్నారు. ల‌క్ష్మీ భూపాల్ మాట‌లు, పాట‌లు క్యాచీగా, స‌హ‌జంగా ఉన్నాయి. స‌న్నివేశాల‌కు త‌గ్గ మాట‌లే కానీ.. అన‌వ‌స‌ర‌, అస‌హ‌జ‌మైన డైలాగ్స్ లేవు. ఇక ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి.. మ‌ళ్లీ అలా మొద‌లైంది ఫ్లేవ‌ర్ తీసుకొచ్చింది. ఆమె మార్కు సింపుల్ హ్యూమ‌ర్ తో సినిమాను ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దింది. క్యారెక్ట‌ర్ల‌ను స‌రిగ్గా తీర్చిదిద్దుకుంటే ఆటోమేటిగ్గా క‌థ‌నం కూడా ఆస‌క్తిక‌రంగా త‌యార‌వుతుంద‌ని నందిని చూపించింది. ఆహ్లాద‌క‌ర‌మైన క‌థ‌నం రాసుకోవ‌డంతో పాటు దాన్ని స‌మ‌ర్థంగా తెర‌కెక్కించ‌డంలో ఆమె విజ‌యం సాధించింది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల నుంచి కూడా త‌న టేస్టుకు త‌గ్గ‌ట్లు ఔట్ పుట్ రాబ‌ట్టుకుని ద‌ర్శ‌కురాలిగా త‌న‌దైన ముద్ర వేసింది నందిని.చివరగా: క‌ళ్యాణ వైభోగమే.. సింపుల్ బ‌ట్ బ్యూటిఫుల్‌రేటింగ్​ ​-​ 3/5Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
https://www.tupaki.com//entertainment/mouniroyphotoshoots-1367141
ఉత్తరాదిన బుల్లి తెర స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌. ఈ అమ్మడు నటించిన నాగిన్‌ తో పాటు ఎన్నో సీరియల్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈమె హిందీలో నటించిన కొన్ని సీరియల్స్ సౌత్‌ లో కూడా డబ్‌ అయ్యి టెలికాస్ట్‌ అవ్వడం వల్ల ఇక్కడ కూడా గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ అమ్మడికి బ్రహ్మాస్త్ర సినిమాలో లేడీ విలన్ గా చేయడం వల్ల పాన్ ఇండియా స్థాయిలో నటిగా మంచి గుర్తింపు దక్కింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఈ అమ్మడు మళ్లీ బిజీ అయ్యేంతగా ఆ సినిమా స్టార్‌డమ్‌ తెచ్చింది అనేది కొందరు విశ్లేషకుల మాట. ఈ అమ్మడు సినిమాలు మరియు టీవీ షో లతో మాత్రమే కాకుండా రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడంతో పాటు ఆకట్టుకునే స్కిన్‌ షో మరియు ఔట్‌ ఫిట్‌ అందాల ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తూ ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు బికినీ షో చేసింది. ఇంతకు ముందే ఈ అమ్మడు చాలా సన్నగా ఉండేది. ఈ మధ్య ఇంకా సన్నగా మారిందా అన్నట్లుగా ఈ ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోల్లో నాగిని ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌ జీరో సైజ్ అందాలు చూపిస్తూ కవ్విస్తుంది. ఈ ఫోటోలు నెటిజన్స్ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్న మౌనీ రాయ్ నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా పాతికేళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగానే ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందాల విందు చేయడం కేవలం ఈ అమ్మడికే సాధ్యం అన్నట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
https://www.tupaki.com//entertainment/article/teja-on-nene-raju-nene-mantri-movie/158979
కొందరు దర్శకులు వేసే ముద్ర అలా ఇలా ఉండదు. ఆ ముద్ర నుంచి బయటికి రావడం.. ఆ దర్శకుల మీద అభిమానం చంపుకోవడం సులువు కాదు. చిత్రం.. నువ్వు నేను.. జయం లాంటి సినిమాలతో తేజ అలాంటి ముద్రే వేశాడు. భారీగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అప్పట్లో అతను యూత్ కు ఫేవరెట్ డైరెక్టర్. కానీ ‘జయం’ తర్వాత తేజ అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఒకటి రెండు కాదు.. పుష్కర కాలంలో రెండంకెల సంఖ్యలో ఫ్లాపులిచ్చాడు తేజ. ప్రతిసారీ తేజ ఏదో చేస్తాడని ఆశించి థియేటర్లకు వెళ్లడం.. నిరాశగా బయటికి రావడం.. ఆయన అభిమానులకు అలవాటైపోయింది. తేజ ఫ్లాప్ సినిమాలు తీయడం కంటే కూడా.. తన బ్లాక్ బస్టర్ మూవీ ‘జయం’ను కాపీ కొడుతూ అదే తరహా సినిమాలు తీయడమే ఆయన ఫ్యాన్స్ ను ఎక్కువ నిరాశ పరిచింది.తేజ చివరగా తీసిన ‘హోరాహోరీ’ సైతం అచ్చం ‘జయం’ ఫార్మాట్లో తెరకెక్కిన సినిమా. ప్రేక్షకులకు విసుగొచ్చి ఆ సినిమాను తిప్పికొట్టారు. ఐతే ఎట్టకేలకు తేజ ‘జయం’ హ్యాంగోవర్ నుంచి బయటికి వచ్చినట్లే కనిపిస్తోంది ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్ చూస్తుంటే. ఈ టీజర్ చూస్తే అసలు తేజ పాత సినిమాల ఛాయలేవీ కనిపించలేదు. ఇది ఆ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండేలాగే కనిపిస్తోంది. టీజర్ కాన్సెప్ట్.. అందులో వినిపించిన డైలాగులు.. విజువల్స్.. అన్నీ కూడా రిఫ్రెషింగ్ గా అనిపించాయి. ఈసారి తేజ నుంచి భిన్నమైన సినిమా ఆశించొచ్చన్న భరోసా కలిగించాయి. ఇంతకుముందు ‘నిజం’లో కొంతమేర రాజకీయాల్ని టచ్ చేసిన తేజ.. ఈసారి పూర్తి స్థాయి పొలిటికల్ మూవీ తీస్తున్నాడు. టీజర్ లాగే సినిమా కూడా ఆసక్తికరంగా.. రిఫ్రెషింగ్ గా ఉంటే.. తేజకు సుదీర్ఘ విరామం తర్వాత ఓ హిట్టు దక్కే అవకాశముంది <|hyperlink|> /Tupakidotcom/
https://www.tupaki.com//entertainment/article/photo-story-katrina-new-look-for-vogue-photoshoot/228172
బ్యూటీలు చాలామందే ఉంటారు కానీ ఎవర్ గ్రీన్ బ్యూటీలు మాత్రం తక్కువ మంది ఉంటారు. బాలీవుడ్ హాటీ కత్రీనా కైఫ్ ఆ లిస్టులో టాప్ లో ఉంటుంది. సీనియర్ బ్యూటీ అయినా ఇప్పటికీ న్యూ జెనరేషన్ భామలకు పోటీ ఇస్తోంది. సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో రెగ్యులర్ గా నెటిజన్లను సతాయిస్తోంది. అందుకే కత్రీనాకు ఇన్స్టాలో భారీగా ఫాలోయర్లు ఉన్నారు.కత్రినా తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు 'గోల్డెన్ అవర్. వోగ్ నవంబర్ 2019' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోషూట్ లో కత్రినా ధరించిన డ్రెస్ డిజైన్ చేసిన వారు అనైతా ష్రాఫ్ అదజానియా. ఈ ఫోటోలో గోల్డ్.. పింక్.. బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉండే ఒక లాంగ్ జాకెట్ ధరించి ఒక గ్లాస్ కుర్చీపై కూర్చుంది. నలుపు రంగు నెయిల్ పాలిష్.. మెడలో బంగారు దండతో.. ఫేస్ కు పర్ఫెక్ట్ మేకప్ తో ఒక మోడల్ లాగా పోజిచ్చింది. జుట్టును కాస్త చిందరవందరగా వదిలెయ్యడంతో హాట్ అప్పీల్ వచ్చింది. ఈ ఫోటోలో కత్రినా ఎంతో సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. కరెక్ట్ గా చెప్తే ఈ ఫోటో ఒక అల్ట్రా మోడరన్ పెయింటింగ్ లాగా ఉంది.ఈ ఫోటోకు నెటిజన్లు తెగ లైక్స్ కొట్టారు. అలా లైక్స్ కొట్టిన వారిలో లస్ట్ భామ కియారా అద్వాని కూడా ఉంది. ఈ ఫోటోకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా వచ్చాయి. 'క్యాట్.. నీకు సాటిలేదు'.. 'ది బెస్ట్ బాలీవుడ్ బ్యూటీ'.. 'సూపర్ హాట్' అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం 'సుర్యవంశి' లో హీరోయిన్ గా నటిస్తోంది.
https://www.tupaki.com//entertainment/article/that-director-ex-life-story-should-prabhas-judge-the-movie/278182
హిందీ మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్'.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా యూత్ తప్పకుండా చూసే ఉంటుంది. నెట్ ఫ్లిక్స్‌ ఇండియా విడుదల చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్. బోల్డ్ కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నెట్ ఫ్లిక్స్ ఎల్లప్పుడూ సిద్ధమే. ఇప్పుడు అదే నెట్ ఫ్లిక్స్ వారు లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ను తెలుగులో పిట్టకథలు పేరుతో విడుదల చేయనుంది. నాలుగు మినీ కథలు కలిగిన ఈ వెబ్ సిరీస్ లో భార్యభర్తల మధ్య బంధాలు, సంసారంలో కలిగే సమస్యలు, ఇష్టాయిష్టాలు, అలకలు ఇలాంటి అన్ని విషయాలు మేళవించి అందించనున్నారు మేకర్స్. హిందీలో ఘాటు సన్నివేశాలు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. మరి తెలుగు పిట్టకథలు కూడా ఘాటుగానే ఉండబోతున్నాయని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.ఇదిలా ఉండగా.. ఇందులో నాలుగు స్టోరీలకు నలుగురు దర్శకులు. తరుణ్ భాస్కర్ 'రాములా', నందిని రెడ్డి 'మీరా', సంకల్ప్ రెడ్డి 'పుస్తకం' స్టోరీలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ఎక్స్-లైఫ్'. అయితే ఈ నాలుగు కథలలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'ఎక్స్-లైఫ్' బాగా చర్చలలో నిలుస్తోంది. శృతిహాసన్, సంజిత్ హెగ్డే నటించిన ఈ ఎక్స్-లైఫ్ స్టోరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎందుకంటే బ్లాక్ బస్టర్ మహానటి మూవీ తర్వాత నాగ్ అశ్విన్ నుండి వస్తున్న ప్రాజెక్ట్ ఇది. అలాగే దీని తర్వాత నాగ్ డార్లింగ్ ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ రూపొందించనున్నాడు. మరి ఎక్స్-లైఫ్ స్టోరీకి నాగ్ ఎంతవరకు న్యాయం చేసాడో తెలిస్తేనే ప్రభాస్ అభిమానులు నెక్స్ట్ సినిమా పై ఓ అంచనాకు రాగలరని టాక్. మరి నాలుగు పిట్టకథలలో నాగ్ అశ్విన్ కథ మోస్ట్ సక్సెస్ అవుతుందా లేదా చూడాలి! ఫిబ్రవరి 19న పిట్టకథలు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతోంది.
https://www.tupaki.com//entertainment/hemacommitteereportinmollywoodindustry-1380077
మీటూ ఉద్య‌మం నేప‌థ్యంలో అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో లైంగిక వేధింపుల గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. వేధింపుల మాన్ స్ట‌ర్స్ పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కొంద‌రికి శిక్ష‌లు ప‌డినా ఎక్కువ‌మంది త‌ప్పించుకున్నారు. అదంతా ఒకెత్తు అనుకుంటే, ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై కేరళ ప్రభుత్వం హేమ నివేదికను ప్రచురించడం సంచ‌ల‌నంగా మారింది. 235 పేజీల నివేదికలో ఉద్యోగావకాశాల కోసం తమను లైంగికంగా వేధించార‌ని సాక్ష్యమిచ్చిన ప‌లువురు ఔత్సాహిక న‌టీమ‌ణుల వివ‌రాల‌తో ఒక‌ ఖాతాలో వివ‌రాల్ని ఈ నివేదిక అందించింది. కేరళ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన‌ నాలుగున్నరేళ్ల తర్వాత, మలయాళ చిత్రసీమలో మహిళల దుస్థితిపై రిటైర్డ్ జస్టిస్ కె హేమ నేతృత్వంలోని కమిటీ నివేదికను సోమవారం విడుదల చేసారు. పరిశుభ్రమైన టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే గదులు సౌక‌ర్యంగా లేవ‌ని, సినిమా సెట్లలో మహిళలకు ప్రాథమిక మానవ హక్కులు నిరాకరిస్తున్నార‌ని ఈ నివేదిక హైలైట్ చేసింది. అవకాశాల కోసం వ‌చ్చిన వారిని లైంగిక ప్ర‌యోజ‌నాల కోసం అడిగిన వారిపై సాక్ష్యమిచ్చిన మహిళల ఖాతాలను నివేదిక‌ రికార్డ్ చేసింది. అవ‌కాశాలు కావాలంటే.. సర్దుబాటు...రాజీలు చేసుకోమని చెప్పారని, హోటల్‌ గదుల్లో తమ సహోద్యోగులు బలవంతంగా ప్రవేశించి వేధించ‌డమే కాకుండా, చట్టపరమైన చర్యలు తీసుకుంటే ప‌రిశ్ర‌మ నుంచి నిషేధం విధిస్తామని బెదిరించారని ప‌లువురు న‌టీమ‌ణులు చెప్పారు. రాజీ-సర్దుబాటు అనే రెండు పదాలు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు బాగా తెలిసినవి. డిమాండ్ మేర‌కు సె* చేయ‌డానికి అందుబాటులో ఉండాల్సి ఉంటుంది అని నివేదిక పేర్కొంది. సినిమా సెట్‌లలో మహిళల వసతి సురక్షితం కాద‌ని అండర్‌లైన్ చేస్తూ, కామాంధులు దాడి చేస్తారనే భయంతో వారి కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులతో కలిసి ఉండవలసి వస్తుందర‌ని నివేదిక పేర్కొంది. కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చిన వారు పరిశ్రమలో తమ అనుభవాలను వెల్లడించడం ద్వారా రిస్క్ తీసుకోవ‌డ‌మేన‌ని భ‌య‌ప‌డిన‌ట్టు చెప్పారు. వారు చెప్పిన వాస్తవాలు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. మ‌హిళ‌ల‌ను హింసించిన వారి చెవులకు తాము ఏదైనా చెప్పిన‌ట్టు వెల్ల‌డైతే, నేరస్థులు చాలా ప్రభావం చూపుతారు. సినీ రంగంలో మహిళలు ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, వేధింపుల స్వభావాన్ని వినడం మాకు దిగ్భ్రాంతికరమైన అనుభవం అని జ‌డ్జి నివేదిక పేర్కొంది. పరిశుభ్రమైన టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే గదులు వంటి సినిమా సెట్లలో మహిళలకు ప్రాథమిక మానవ హక్కులు నిరాకర‌ణ‌కు గుర‌వుతున్నాయని నివేదిక హైలైట్ చేసింది. మహిళా కళాకారులు బహిష్టు కాలంలో చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటారు. మూత్రవిసర్జన చేయాలనే కోరికను నివారించడానికి ఎక్కువ కాలం నీరు త్రాగకుండా ఉండటం నేర్చుకుంటారు అని నివేదిక పేర్కొంది. కేర‌ళ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ కొంతమంది నటీనటులు, నిర్మాతలు, దర్శకుల అధీనంలో ఉందని హేమ కమిటీ ఆరోపించింది. అందరూ పురుషులే ఆధిప‌త్యం చెలాయిస్తారు. వారు మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమను నియంత్రిస్తారు. వారు సినిమాల్లో పనిచేస్తున్న ఇతర వ్యక్తులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి)లో పని చేసే వ్యక్తులను వారు డిమాండ్ చేస్తారు. ఫిర్యాదును పరిష్కరించడానికి వారు బలవంతం చేయవచ్చు లేదా బెదిరించవచ్చు. ఐసిసిలో భాగమైన వారిలో ఎవరైనా అధికారంలో ఉన్నవారి ఆదేశాల ప్రకారం వ్యవహరించకపోతే వారి భవిష్యత్తు నాశనం కావచ్చు. వ్య‌తిరేకించే వారు ప‌రిశ్ర‌మ‌లో ఇక మిగ‌ల‌రు. సినీరంగంలో ఈ పరిస్థితి చాలా షాకింగ్‌గా ఉంది అని హేమ క‌మిటీ నివేదిక‌ పేర్కొంది. పరిశ్రమలోని ఎవరిపైనైనా చట్టవిరుద్ధమైన అనధికారిక నిషేధాలకు గురి చేయ‌గల `మాఫియా` ఉంద‌ని ఒక ప్రముఖ నటుడు పేర్కొన్నారు. పురుషుల లాబీ గురించి అత‌డు బ‌హిర్గ‌తం చేసాడు. ఇటువంటి నిషేధాలు ఒకరి నుంచి ఇంకొక‌రికి నోటి మాట ద్వారా చేర‌తాయి. రహస్య సంభాషణ ద్వారా మేనేజ్ చేస్తారు.. అని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడిట్ సెట్స్‌లో అమానవీయ ప్ర‌వ‌ర్త‌న‌కు బ‌ల‌వుతున్న జూనియర్ ఆర్టిస్టుల దుస్థితిపై కూడా ఈ క‌మిటీ వెల్ల‌డించింది. వారికి AMMA మరియు FEFKA వంటి చలనచిత్ర శాఖ‌ల్లో సభ్యత్వం ఇవ్వ‌లేదు. వారికి మరుగుదొడ్ల సౌకర్యాన్ని నిరాకరించారు. ఎక్కువ గంటలు నిరంతరం పని చేయవలసి వస్తుంది. అటువంటి కళాకారులు పారితోషికం పరంగా చాలా వరకు వారి వేతనాలను ఏజెంట్ల(మేనేజ‌ర్ల‌)తో లోపాయికారీగా మాట్లాడుకుంటారు. వారు మోసానికి గుర‌వుతారు. క‌మీష‌న్ల‌ను చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి 295 పేజీల నిడివితో ఉన్న కమిటీ నివేదికను 66 పేజీలకు తగ్గించి, సాక్ష్యం చెప్పిన వారి పేర్లను, వారి వివ‌రాల‌ను తొల‌గించారు. 2017లో కొచ్చి సమీపంలో కదులుతున్న కారులో ప్రముఖ మలయాళ నటిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన నేపథ్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఆ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన హీరో దిలీప్ కుట్ర, ఇతర నేరాలతోపాటు సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. హేమ కమిటీ తన నివేదికలో పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఒక చట్టాన్ని రూపొందించాలని దాని క్రింద ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఇతర రంగాలకు విరుద్ధంగా ని ప్రదేశాలలో సినిమాల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, అవ‌కాశాల పేరుతో మహిళలు వేధింపులకు గురవుతున్నారని నివేదిక‌ నొక్కి చెప్పింది. అందువల్ల PoSH చట్టం- పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) 2013 నిబంధనలు సరిపోవని పేర్కొంది. సివిల్ కోర్టు, రిటైర్డ్ జిల్లా జడ్జి నేతృత్వంలో ట్రిబ్యున‌ల్ ప‌ని చేయాలి. కనీసం ఐదు సంవత్సరాల విచారణ అనుభవం ఉన్న మహిళ జ‌డ్జిగా ఉంటారు. కొత్త చట్టంలో మహిళలకు సురక్షితమైన వసతి.. రవాణా ఎంపికలు, టాయిలెట్లు .. దుస్తులు మార్చుకునే గదుల సుర‌క్షిత విధానం త‌ప్ప‌నిస‌రి చేయాలి. సినిమా సెట్లలో డ్రగ్స్ మద్యంపై నిషేధం అమ‌లు చేయాలి. ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులకు వర్క్ కాంట్రాక్ట్‌లను ఖచ్చితంగా పాటించాలి.. అని నివేదిక పేర్కొంది.
https://www.tupaki.com//entertainment/article/kajal-agarwal-kiki-challenge-with-bellamkonda-srinivas/190835
బెల్లంకొండ శ్రీనివాస్ అంటే ఎప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు - మాస్ యాక్షను - పెద్ద స్టార్ హీరోయిన్లు - టెక్నిషియన్లు గుర్తొస్తున్నాయి.. దాన్ని మార్చాలి అనుకున్నాడో ఏమో గానీ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తో కికి ఛాలెంజ్ ని స్వీకరించాడు... కాకపోతే కొత్త యాంగిల్ కికి. పిచ్చి కికి చేస్తూ గాయాలపాలు కావొద్దని.. కికి చేసినా జాగ్రత్తగా చేయమని కికి సమాజానికి ఒక సందేశం ఇచ్చాడు. తన ట్విట్టర్ ద్వారా కికి ఛాలెంజ్ వీడియో పోస్ట్ చేస్తూ ఇలా ట్వీట్ పెట్టాడు "మేము కూడా ఇందులో అడుగుపెట్టాం. లేట్ అయినా ఫరవాలేదు కానీ సేఫ్ గా! మేము జాగ్రత్తగా చేసింది ఇది.. కికి వీ లవ్ యూ(కానీ రూల్స్ అంటే మాకింకా ప్రేమ). కాజల్ తో కలిసి ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ లో పాల్గొంటూ ఇలా ట్రై చేయడం జరిగింది." వీడియో లో మొదట శ్రీనివాస్ - కాజల్ ఇద్దరూ వీల్ చైర్ లో కూర్చుని ఉంటే కాజల్ ఆ వీల్ చైర్ ను వేరేవాళ్ళు నెట్టుకుంటూ వస్తారు.. తర్వాత ఇద్దరూ లేచి కికి డూ యు లవ్ మీ అంటూ డ్యాన్స్ చేస్తారు. ఫైనల్ గా కాజల్ వీల్ చైర్లో కూర్చుంటుంది. శ్రీనివాస్ ఆ వీల్ చైర్ ను నెట్టుకుంటూ వెళ్తాడు.కానీ ఆలా కూర్చునే ముందు. తమ మొహాలకైన గాయాలకున్న బ్యాండ్-ఎయిడ్ లను చూపిస్తూ కికి ని జాగ్రత్తగా చేయకపోతే ఇలా అవుతుందని, కాబట్టి ఇప్పుడు చేసినట్టు సేఫ్ గా చేయమని చెప్తారు. మొత్తానికి ఇద్దరూ కలిసి సూపర్ మెసేజ్ ఇచ్చారు. మీరెవరైనా సరే పిచ్చి కికిలు చేయకుండా బెల్లంకొండ బాబు - కాజలమ్మ చెప్పేది ఫాలో అవ్వండి. సేఫ్ గా ఉండండి!వీడియో కోసం క్లిక్ చేయండి
https://www.tupaki.com//entertainment/sivakarthikeyanalienmovie-1316521
యాంకర్‌ నుంచి హీరో స్థాయికి ఎదిగిన కోలీవుడ్ యాక్టర్​ శివ కార్తికేయన్​. 'రెమో' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత 'వరుణ్​ డాక్టర్‌', 'డాన్' వంటి చిత్రాలతో తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే రీసెంట్​గా ప్రిన్స్​, మావీరన్​ చిత్రాలతో వరుస పరాజయాలను అందుకున్న ఆయన నుంచి రాబోతున్న కొత్త చిత్రం 'అయలాన్‌'. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల మందుకు రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత కోటపాడి జె. రాజేష్ తెలిపారు. వచ్చే సంక్రాంతికి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. "మేం ఎంతో ప్రేమతో, మనసుపెట్టి చేసిన సినిమా ఇది. ఈ ప్రయాణంలో మాకు కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. అయినా ధైర్యాన్ని అస్సలు కోల్పోలేదు. పట్టుదలతో సినిమాను చేశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడాలని అనుకోలేదు. అందుకే రిలీజ్ కాస్త ఆలస్యం అయింది. ప్రేక్షకులకు అంచనాలకు మించి సినిమా ఉంటుంది" అని పేర్కొన్నారు. అంటే ఈ చిత్రం అనుకున్నట్టే సంక్రాంతికి రిలీజైతే.. తెలుగులో గుంటూరు కారం, ఈగల్​, నా సామీ రంగ, హనుమాన్​, విజయ్​ దేవరకొండ చిత్రాలతో పోటీ పడాల్సి వస్తుంది. పాన్ ఇండియా లెవల్​లో అయితే భారీ వీఎఫ్​ఎక్స్​తో తెరకెక్తుతున్న హనుమాన్​తో పోటీ పడాల్సి ఉంటుంది. ఇక కోలీవుడ్​ నుంచి సూర్య భారీ ప్రాజెక్ట్ కంగువా జనవరిలో వస్తుందని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ దీనిపై క్లారిటీ లేదు. కాగా, సైన్స్‌ ఫిక్షన్‌కు కామెడీని జోడించి 'అయలాన్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్‌ రవి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్​. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ బ్యానర్లపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 'అయలాన్' అంటే 'ఏలియన్' అని అర్థం. ఓ ఏలియన్ ప్రధాన పాత్రలో సౌత్ ఇండస్ట్రీలో సినిమా రావడం ఇదే మొదటిది. ఈ చిత్రంలో 4500లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయట.
https://www.tupaki.com//entertainment/article/chennakesava-reddy-re-release-collections/346168
టాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతుంది. సినిమాల అసలు ఫలితాలతో సంబంధం లేకుండా కూడా సరికొత్త టెక్నాలజీతో అప్డేట్ చేసి మరీ నిర్మాతలు సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇక రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాను కూడా మళ్లీ విడుదల చేశారు. 2002 సెప్టెంబర్ 5వ తేదీన వచ్చిన ఈ సినిమాకు వివి.వినాయక్ దర్శకత్వం వహించగా బెల్లంకొండ సురేష్ నిర్మించారు.ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు. అలాగని అది దారుణంగా నష్టాలను కూడా కలిగించలేదు. అయితే చెన్నకేషవరెడ్డి సినిమాను మళ్లీ విడుదల చేయాలి అని ఫ్యాన్స్ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఇటీవల నిర్మాత మళ్లీ సరికొత్త టెక్నాలజీతో సినిమా క్వాలిటీని అప్డేట్ చేసి మరి విడుదల చేశారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను ఒక మీడియం రేంజ్ సినిమా విడుదలవుతున్నంత రేంజ్ లోనే ప్రదర్శించడం విశేషం.ఇక ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ కలెక్షన్స్ ఎంత అనే విషయంలో అనేక రకాల పదనాలు వెలువడ్డాయి. ఇక ఫైనల్ గా ఈ విషయంపై నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చెన్నకేశవరెడ్డి సినిమా మళ్లీ విడుదల చేయడంతో బాక్సాఫీస్ వద్ద 5.39 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది అని సురేష్ తెలియజేశారు. ఇక ఈ వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కోసం డొనేట్ చేస్తున్నట్లు బెల్లంకొండ సురేష్ క్లారిటీగా తెలియజేశారు.అయితే ఇంతకు ముందు రీ రిలీజ్ అయిన పోకిరి జల్సా సినిమాల కంటే చెన్నకేశవరెడ్డి అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ సినిమా ఆ స్థాయిలో కలెక్ట్ చేసిందా అనేది కూడా మరొక అనుమానాన్ని కలిగిస్తుంది.ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షోలకు పెద్దగా రెస్పాన్స్ ఏమీ రాలేదు. కేవలం మెయిన్ సెంటర్స్ లోనే ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాను చూసి ఎంజాయ్ చేశారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక సినిమా కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే మాత్రం చెన్నకేశవరెడ్డి ఈ రోజుల్లో కూడా బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
https://www.tupaki.com//entertainment/article/manchu-yuvasena-president-sunil-chakravarthy/320643
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ''సన్ ఆఫ్ ఇండియా'' గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ సినిమాని ఓటీటీ కోసమే రూపొందించారు. అయితే చివరకు థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్డ్ షో నుంచే ప్లాప్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫలితాన్ని అందుకుంది.తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 350 థియేటర్లలో 'సన్నాఫ్ ఇండియా' ని రిలీజ్ చేయగా.. రెండో రోజు నుంచే చాలా వరకు థియేటర్లలో జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది. మోహన్ బాబుకు మునుపటిలా మార్కెట్ లేదు కాబట్టి.. ఎవరూ ఈ చిత్రానికి భారీ వసూళ్లు ఎక్సపెక్ట్ చేయలేదు. టాక్ ఎలా ఉన్నా ఓ మోస్తరు కలెక్షన్స్ వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అసలు ఓపెనింగ్స్ రాకపోగా.. నెగిటివ్ షేర్ తీసుకురావడం శోచనీయం.అయితే ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ విడుదలకు ముందు నుంచీ మంచు ఫ్యామిలీ మీద చేస్తోన్న ట్రోల్స్ కారణంగానే సినిమా ఆడలేదని స్టేట్ మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. వందకు పైగా యూట్యూబ్ చానెల్స్ పనిగట్టుకొని మరీ మోహన్ బాబు సినిమాపై నెగిటివ్ ప్రచారం చేశాయని.. అదే ఇంపాక్ట్ చూపెట్టిందని ఆరోపించారు.మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ''నేను గత ఇరవై ఏళ్లుగా మోహన్ బాబుకు ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌ గా ఉన్నాను. ఇంత వరకు ఏ హీరోగానీ ట్రోల్ చేయలేదు.. ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. 'సన్నాఫ్ ఇండియా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి మంచు ఫ్యామిలీలో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు - లక్ష్మీ ప్రసన్న లపై కొందరు ట్రోలర్స్ నోటితో చెప్పలేని అసభ్యకరమైన పదజాలంతో దూషించడం మొదలు పెట్టారు. ఒకటి కాదు వందకు పైగా యూట్యూబ్ చానల్స్ ఇలా చేశాయి'' అని అన్నారు.''సినిమా రిలీజ్ అవ్వకముందే బాగాలేదని.. ఇలా ఉందని అలా ఉందని పని గట్టుకొని ‘సన్ ఆఫ్ ఇండియా’ పై నెగిటివ్ ప్రచారం చేసి ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేశారు. ఆన్‌ లైన్‌ లో కొన్ని టిక్కెట్స్ బుక్ అయ్యాయి. మన దగ్గర డైరెక్ట్‌ గా థియేటర్స్ వచ్చి టికెట్ కొని చూసేవాళ్లు కూడా ఉంటారు. సినిమా చూడకుండానే బాగాలేదని ట్రోల్స్ చేయడం వల్ల సినిమాకు కలెక్షన్లు రాలేదు''''సినిమా ఫ్లాప్ అయితే నటుడు, నిర్మాత మోహన్ బాబు ఒకరికే కాదు.. దీనిపై ఆధారపడిన ప్రతి ఒక్క టెక్నీషియన్ - కో డైరెక్టర్లు -సినీ కార్మికులు సహా అందరిపై ఆ ప్రభావం పడుతుంది. ఈ సినిమాపోయినంత మాత్రాన మోహన్ బాబుకు వచ్చిన నష్టమేమీ లేదు. మరో సినిమా రెడీ అవుతోంది. త్వరలో మంచు విష్ణు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఇక పేర్ని నాని.. మోహన్ బాబు ఇంటి వెళితే దానిపై దుష్ప్రచారం చేశారు''''సోషల్ మీడియాలో మంచు లక్ష్మీని అసభ్యకరమైన మాటలతో ట్రోల్ చేస్తున్నారు. మంచు విష్ణు 'మా' అధ్యక్షుడు అవడంపై ఓ వర్గం జీర్ణించుకోలేకపోవడం.. అక్కడి నుంచే ఇలా టార్గెట్ చేయడం జరిగింది. మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ కొన్ని యూట్యూబ్ చానల్స్ బ్రతుకుతున్నాయి. అదీ ఒక బ్రతుకేనా?. మోహన్ బాబును యూట్యూబ్‌ లో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనిపై విచారించి వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు'' అని మంచు యువ సేన అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
32
Edit dataset card