license: cc-by-4.0
language:
- te
tags:
- bert
datasets:
- L3Cube-IndicNews
widget:
- text: >-
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మచ్చలేని ప్రజా సేవకుడు అని కేంద్రమంత్రి
నితిన్ గడ్కరీ అన్నారు. పార్లమెంట్ వద్ద టీడీపీ ఎంపీ కేశినేని నానితో గడ్కరీ
గురువారం (సెప్టెంబరు 21) మాట్లాడారు. అనంతరం చంద్రబాబు యోగక్షేమాల గురించి
గడ్కరీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
మాట్లాడుతూ.... చంద్రబాబు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని తెలిపారు.
భగవంతుని ఆశీస్సులతో కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతారు అని గడ్కరీ
చెప్పినట్లు ఎంపీ కేశినేని నాని పేట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో
అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న సంగతి
తెలిసిందే.చంద్రబాబు అరెస్టుపై పలువులు నేతల ఆరా.... చంద్రబాబు అరెస్టుతో ఏపీ
రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఈనెల
19వ తేదీన తర్వాతనే బయటకు వస్తారని ఊహాగానాలు వచ్చినా కానీ దీనిపై స్పష్టత
లేదు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు పైన భిన్నభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
చంద్రబాబు అరెస్టుపై పలువురు కీలక నేతలు ఆరా తీస్తున్నారు.కేంద్రం అరెస్టుపై
స్పందించాలి...చంద్రబాబు అరెస్టుపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం స్పందించకపోవడం పైన టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. చంద్రబాబు అరెస్టు
వెనుక కేంద్రంలోని ముఖ్యుల మద్దతు ఉందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.
వామపక్ష నేతలు ఇవే రకమైన ఆరోపణ చేస్తున్నారు.చంద్రబాబు అరెస్ట్ అయిన రోజునే
తాను పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసి ఏపీలో పరిణామాల పైన చర్చించానని సీఎం
రమేష్ చెప్పుకొచ్చారు. దీని పైన నడ్డా తనకు సమాచారం ఉందని తెలిపారని
వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగా, రాజకీయ కారణాలో అరెస్ట్ చేసారని.. పార్టీ
నేతలంతా ఖండించాలని సూచించారని సీఎం రమేష్ చెప్పారు. సీబీఐ ఎన్నో సార్లు
నోటీసులు ఇచ్చి వైసీపీ నేతలను విచారణ చేసిందని..కానీ, ఎఫ్ఐఆర్ లో పేరు లేని
చంద్రబాబుకు నోటీసులివ్వకుండానే అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ
అరెస్ట్ బీజేపీకి తెలిసే జరిగిందన్నది అబద్దమని చెప్పారు. ఈ అరెస్ట్ రాష్ట్ర
పరిధిలోని సీఐడీ తప్పితే కేంద్రం ఆధ్వర్యంలోని సీబీఐ కాదని వివరించారు.ఇదే
సమయంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాలయ అయ్యన్న పాత్రుడు చేసిన
వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీలో పరిస్థితి ఢిల్లీ పెద్దలకు కనిపించటం లేదా
అని ప్రశ్నించారు. వారి ఆశీర్వాదం లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేయించే
ధైర్యం జగన్ చేయగలరా అని నిలదీసారు. దీంతో ఈ పరిణామాలు పొత్తుల పైనా ప్రభావం
చూపే అవకాశం కనిపిస్తోంది. అటు బీజేపీ మిత్రపక్షంగా.. ఇటు టీడీపీ తో
సన్నిహితంగా కొనసాగుతున్న పవన్ పాత్ర కీలకంగా మారుతోంది.కేంద్ర ప్రభుత్వం
లోని కొందరు కేంద్ర మంత్రులు చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆరా తీస్తున్న
కానీ... కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు రావడంలేదని టీడీపీ వర్గాలు
వెల్లడిస్తున్నారు. అరెస్టుపై కేంద్రానికి సమాచారం లేదా? అని
ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చంద్రబాబు
అరెస్టుపై ఆరా తీయడం పై ప్రస్తుతం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
- text: >-
గత ఏడాది తంబళ్లపల్లెలో జంట హత్యల కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి
తెలిసిందే. ఆ నిందితుడికి చిత్తూరు జిల్లా కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు
వెల్లడించింది. ఇద్దరి చావుకు కారణమై, మరో మైనర్ బాలిక భవిష్యత్తును అంధకారం
చేసిన కర్కోటకుడికి తగిన శిక్ష పడిందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం
చేశారు.ఫిర్యాదుదారు ధనమ్మ వెల్లడించిన వివరాల మేరకు. చిత్తూరు జిల్లా,
తంబళ్లపల్లె మండలం, ఏటిగడ్డ తాండా సమీపంలోని పొలం వద్ద రేకుల షెడ్ లో నివాసం
ఉన్న గంగులమ్మ, సరళమ్మ, ముగ్గురు మైనర్ పిల్లలు శ్రావణి (14), శశికళ (12),
శ్యామ్ (8) మొత్తం ఐదు మంది కనిపించడం లేదని, చిత్తూరులోని ఇందిరానగర్ లో
నివసిస్తున్న శివ భార్య ధనమ్మ ఫిర్యాదు చేసింది. ఆ మేరకు 28-01-2021 లో cr no
12/2021 మహిళ, పిల్లలు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ధనమ్మ అన్న వెంకటరమణ
అనారోగ్యంతో మరణించిన కొంతకాలం తర్వాత తన వదిన సరళమ్మ(40), తన ముగ్గురు
పిల్లలను తీసుకొని తన పుట్టినిల్లు అయిన తంబళ్లపల్లె మండలం,
గోవిందువారిపల్లెలో నివసిస్తున్న అమ్మ గంగులమ్మ వద్దకు వెళ్లి అక్కడే కూలీ
పనులు చేసుకొంటూ జీవిస్తుంది.వివాహేతర సంబంధంఅప్పుడప్పుడు వెళ్లి పిల్లలను
చూసుకొని వచ్చే క్రమంలో సరళమ్మ గంగిరెడ్డిపల్లె కి చెందిన సయ్యద్ మౌలాతో
వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నట్లు తెలిసింది. అయితే గ్రామంలో వీరి గురించి
చెప్పుకొంటున్నందున మౌలా పెద్దేరు ప్రాజెక్టు సమీపంలోని తన పొలంలో రేకుల షెడ్
నిర్మించి వీరందరినీ అక్కడే నివాసం ఉంచినట్లు తెలిసింది. అయితే అక్కడికి కూడా
వెళ్లి పిల్లలను పలకరించే దానిని అని ధనమ్మ తెలిపారు. అప్పట్లో కరోనా
వ్యాప్తి కారణంగా వెళ్లలేదని, ఫోన్ చేసినా ఫోన్ కలవలేదని కరోనా ఆంక్షల
సడలింపు ఇచ్చిన తర్వాత వెళ్లగా సదరు రేకుల షెడ్ కు తాళం వేసి ఉందని
తెలిపింది. గ్రామంలోకి వెళ్లి విచారణ చేస్తే, వారు 3 నెలలుగా కనిపించలేదని
చెప్పడంతో మౌలాపై అనుమానం వ్యక్తం చేస్తూ తంబళ్లపల్లె పోలీసులకు 28-01-2021న
ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. దీనిపై Cr no 12/2021 గా మహిళ , పిల్లలు
మిస్సింగ్ కేసు నమోదు చేశారు.దర్యాప్తులో సయ్యద్ మౌలా తాను సరళమ్మ, వారి
తల్లి గంగులమ్మను హత్య చేసినట్లు, మైనర్ బాలికపై అత్యాచారం చేశానని మిగిలిన
ఇద్దరు పిల్లలను కర్ణాటకలోని ఓ పల్లెలో దాచి ఉంచానని ఒప్పుకున్నాడు. వారి
మృతదేహాలను సమీపంలోని చెరువులో పాతి పెట్టానని నేరం అంగీకరించాడు. దీంతో
స్థానిక రెవెన్యూ, వైద్య సిబ్బంది సహకారంతో మృతదేహాలను వెలికి తీశారు. తమ
వదిన సరళమ్మ, వారి అమ్మ గంగులమ్మ మృతదేహాలను ఫిర్యాదుదారు ధనమ్మ
గుర్తించింది. శవ పరీక్షల నివేదికలో హత్య కేసు, మైనర్ బాలికపై అత్యాచారం
చేశాడని మైనర్ బాలిక వాగ్మూలం, డాక్టర్ల పరీక్షల నివేదిక ఆధారంగా ఫోక్సో కేసు
పెట్టారు. మొత్తం రెండు కేసులుగా మార్పు చేసిన పోలీసులు, సుదీర్ఘ వాదోపవాదాల
తర్వాత ఫోక్సో కేసులో ముద్దాయి సయ్యద్ మౌలాకు జీవిత ఖైదు విధించారు. రూ.5
వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే జంట హత్యలు, ఎస్సీ, ఎస్టీ
కేసులో జీవిత ఖైదుతో పాటు ఉరిశిక్షను అదనపు న్యాయమూర్తి రమేష్ విధించారు.
Telugu-Doc-Topic-BERT
Telugu-Doc-Topic-BERT model is an IndicSBERT(l3cube-pune/telugu-sentence-bert-nli) model fine-tuned on Telugu documents from the L3Cube-IndicNews Corpus [dataset link]https://github.com/l3cube-pune/indic-nlp.
This dataset consists of sub-datasets like LDC (Long Document Classification), LPC (Long Paragraph Classification), and SHC (Short Headlines Classification), each having different document lengths.
This model is trained on a combination of all three variants and works well across different document sizes.
More details on the dataset, models, and baseline results can be found in our [paper]https://arxiv.org/abs/2401.02254
Citing:
@article{mirashi2024l3cube,
title={L3Cube-IndicNews: News-based Short Text and Long Document Classification Datasets in Indic Languages},
author={Mirashi, Aishwarya and Sonavane, Srushti and Lingayat, Purva and Padhiyar, Tejas and Joshi, Raviraj},
journal={arXiv preprint arXiv:2401.02254},
year={2024}
}
Other document topic models for different Indic languages are listed below:
Hindi-Doc-Topic-BERT
Marathi-Doc-Topic-BERT
Bengali-Doc-Topic-BERT
Telugu-Doc-Topic-BERT
Tamil-Doc-Topic-BERT
Gujarati-Doc-Topic-BERT
Kannada-Doc-Topic-BERT
Odia-Doc-Topic-BERT
Malayalam-Doc-Topic-BERT
Punjabi-Doc-Topic-BERT
English-Doc-Topic-BERT