SNo
int64 0
21.6k
| date
stringlengths 19
19
| heading
stringlengths 3
91
⌀ | body
stringlengths 6
38.7k
| topic
stringclasses 5
values |
---|---|---|---|---|
12,994 | 29-10-2017 04:31:48 | స్నాతకోత్సవ గౌన్లకు త్వరలో మంగళం! | బెంగళూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): బ్రిటిష్ కాలంనాటి బానిసత్వానికి సంకేతాలుగా ఉన్న యూనివర్సిటీ స్నాతకోత్సవ సమయంలో ధరించే గౌన్లను రద్దు చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. వాటి స్థానంలో సరికొత్త డ్రెస్‌కోడ్‌ను తీసుకురానున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. బెంగళూరులోని రేవా యూనివర్సిటీ క్యాంప్‌సలో శనివారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య బ్లాక్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయనీ విషయం వెల్లడించారు. | nation |
4,234 | 15-11-2017 01:46:31 | కృష్ణా జలాల పునఃపంపిణీపై సదస్సు |
ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం అనివార్యం అనే అంశంపై నవంబర్ 19న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అసెంబ్లీ హాల్‌లో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు విశ్రాంత ఇంజనీర్లను, పత్రికా సంపాదకులను, ప్రజాస్వామికవాదులను, ప్రజాసంఘాలను, వృత్తి సంఘాలను, జేఏసీలను, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ప్రతినిధులు మాట్లాడతారు. నదీ జలాల సమస్యతో రాబోయే రోజుల్లో నీటి యుద్ధాలు జరుగుతాయని అందరూ మాట్లాడుతారు. కానీ మాట్లాడవలసింది అందరికీ నీరు దక్కవలసిన అవసరం గురించి, ఆ మార్గాల గురించి, న్యాయమైన నీటి కేటాయింపుల గురించి. అందరూ తప్పనిసరిగా పాల్గొనాలి. నీరందని ప్రాంత రైతుల హక్కులు కాపాడాలి. సదస్సు నిర్వహణ కమిటీ : ఎ. రాజేంద్రబాబు, ప్రొ. టి. మోహన్ సింగ్, సి. రామ్మోహన్, మురళీధర్ గుప్త, ఎ. మల్లయ్య, రవిఠాకూర్, జి. రఘురాంరెడ్డి, కొత్తకిష్టయ్య, ఆర్. సుధీర్, పి.బి.స్వామి, షహబాజ్ అహ్మద్, శ్రీనివాస్, డి. కృష్ణ.- ప్రొ. జి. హరగోపాల్, యం. రాఘవాచారిపాలమూరు అధ్యయన వేదిక | editorial |
4,168 | 04-04-2017 00:56:24 | చొరవ పెరగాలి |
ఎస్సీ కులాల మధ్య అసమానతలు తొలగాలంటే రిజర్వేషన్లను వర్గీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎం.ఆర్.పి.యస్ నివేదించింది. ఈ అంశానికి కమి షన్లు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చినా ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. వర్గీకరణకు అడ్డువచ్చే సాంకేతికాంశాలు పరిశీలించి సవరణలతో ‘వర్గీకరణ బిల్లు’ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టి సామాజికన్యాయాన్ని నిలబెట్టాలి. ప్రయోగా త్మకంగా తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేస్తూ ఎస్సీలను ఎ.బి.సి.డిలుగా వర్గీకరణ చేయవచ్చు. తర్వాత కోరిన ప్రతి రాష్ట్రంలో వర్గీకరణ చేయాలి.– జోగు అంజయ్య, జరసం గౌరవాధ్యక్షులు | editorial |
1,487 | 10-04-2017 23:33:37 | విద్యుత్ కంపెనీల కొనుగోలు వేటలో ఎన్‌ఎల్‌సి |
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగలోని ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ సమస్యల్లో ఉన్న విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తోంది. ఇందులో భాగంగా చత్తీస్‌గడ్‌లోని 1,370 మెగావాట్ల జిఎంఆర్ పవర్ ప్లాంట్‌ను, ఒడిసాలోని ఇండ్-భారత్ 700 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ రెండూ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలే. చర్చలు ఫలిస్తే ఈ ప్లాంట్ల కొనుగోలుకు రూ.12,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. బొగ్గు లేదా లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులను అమ్మే ఆసక్తి ఉన్న కంపెనీలు బిడ్స్ సమర్పించాలని ఎన్‌ఎల్‌సి ఇండియా గత ఏడాది కోరింది. దీంతో అనేక కంపెనీలు తమ బిడ్స్ సమర్పించాయి. అందులో జిఎంఆర్ చత్తీస్‌గఢ్ ప్లాంట్, ఇండ్-భారత్ ఒడిశాప్లాంట్‌లను షార్ట్‌లిస్ట్ చేసి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఎన్‌ఎల్‌సి ఇండియాతో చర్చలు జరుపుతున్న విషయం నిజమేనని ఇండ్-భారత్ ఇప్పటికే ప్రకటించింది. జిఎంఆర్ మాత్రం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. సమస్యల్లో ఉన్న విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుపై ఆసక్తితో ఉన్న విషయం నిజమేనని ఎన్‌ఎల్‌సి ఇండియా సిఎండి శరత్ ఆచార్య ఢిల్లీలో జరిగిన ఒక సెమినార్‌లో వెల్లడించడం ఈ విషయాన్ని మరింత ధ్రువపరుస్తోంది. అన్నీ కలిసొస్తే 3,000 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న ఇలాంటి ప్లాంట్లను కొనుగోలు చేయాలని ఎన్‌ఎల్‌సి ఇండియా భావిస్తోంది. | business |
6,380 | 21-05-2017 20:31:17 | పూరీతో కలిసి పోర్చుగల్‌లో ఛార్మీ | స్టార్ హీరోలు, క్రేజీ హీరోలు మర్చిపోయిన ఆ హాట్ లేడీ... రీసెంట్‌గా బడా హీరో సినిమా షూటింగ్ స్పాట్‌లో దర్శనమిచ్చింది. దీంతో అమ్మడు ఆ సినిమాలో ఏదో ఒక రోల్ చేస్తోందనే న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ లేడీగా ఇమేజ్ తెచ్చుకున్న ఛార్మికి ప్రస్తుతానికి సినిమా ఆఫర్లేవీ లేవనే చెప్పాలి. దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో కలిసి 'పూరీ కనెక్ట్స్' అనే పేరుతో కాస్టింగ్‌ను ఎంపిక చేసే ప్రత్యేకమైన బిజినెస్‌ను స్టార్ట్ చేసిన ఛార్మింగ్ లేడీ. ప్రస్తుతం ఆ వ్యవహారాలతో పాటు పూరీ జగన్నాధ్ సినిమాలకు సంబంధించిన అంశాలను కూడాహ్యాండిల్ చేస్తోందనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. అయితే రీసెంట్‌గా ఛార్మీ పోర్చుగల్‌లో ఉన్నానంటూ ట్వీట్ చేయడంతో... బాలయ్య సినిమాలో ఆమె నటిస్తుందేమోనన్న చర్చ మరోసారి మొదలైంది. బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లోని నయా మూవీ షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతుండటంతో ఛార్మీ కూడా అక్కడికి వెళ్లిందని కొందరంటుంటే ఈ సినిమాలో ఛార్మీ ఏదో ఒక రోల్ పోషిస్తుందని, లేకపోతే ఈ సినిమా కోసం ఆమె కూడా పోర్చుగల్ వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు.. మరోవైపు శ్రియ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఛార్మికి ప్రత్యేకమైన రోల్ ఏమీ ఇవ్వకపోయినా కనీసం ఐటెం సాంగ్ అయినా ఆమె కోసం పూరీ రిజర్వ్ చేసి పెడతాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా బాలయ్య సినిమా షూటింగ్ జరుగుతున్న స్పాట్‌లో మకాం వేసిన హాట్ లేడీ, ఆ సినిమాలో నటిస్తుందా లేక జస్ట్ పర్యవేక్షణకు మాత్రమే పరిమితమవుతుందా అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. | entertainment |
19,385 | 16-09-2017 01:59:51 | సెమీస్‌లో సింధు |
సమీర్ అవుట్‌సాయిరాజ్ జోడీ కూడాకొరియా ఓపెన్‌సియోల్: భారత ఏస్ షట్లర్ పీవీ సింధు మరో సూపర్ సి రీస్ టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. ఒలింపిక్ రజత పతక విజేత సింధు.. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఐదో సీడ్ సింధు 21-19, 16-21, 21-10తో జపాన్ షట్లర్ మినాట్సు మితానిపై నెగ్గింది. 63 నిమిషాలపాటు సాగిన పోరులో వరల్డ్ చాంపియన్‌షిప్స్ రజత పతక విజేత అయిన సింధుకు అన్‌సీడెడ్ మితాని గట్టి పోటీ ఇచ్చింది. సెమీస్‌లో ఆరో సీడ్ హి బింజి యావో (చైనా)తో సింధు అమీతుమీ తేల్చుకో నుంది. మొదటి గేమ్ ఆరంభంలోనే వరుసగా పాయింట్లు సాధించిన సింధు 6-2తో ముందంజ వేసింది. ఆ తర్వాత రెచ్చిపోయిన మితాని.. సింధును అధిగమించి 11-9తో బ్రేక్‌కు వెళ్లింది. ఇలా ఆధిక్యం చేతులు మారు తూ 16-16 వద్ద స్కోరు సమమైంది. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు సాధించిన భారత షట్లర్ 19-16తో పైచేయి సాధించింది. కానీ పట్టువీడని జపాన్ ప్లేయర్ మరోసారి స్కోరు సమం చేసినా.. సింధు ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా 21-19తో తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక రెండో గేమ్‌లో రెచ్చిపోయిన మితాని 8-4 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ 12-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే మితాని 13-13తో స్కోరు సమం చేసి.. అదే జోరులో రెండో గేమ్‌ను నెగ్గింది. నిర్ణాయక మూడో గేమ్‌లో తనదైన శైలిలో రెచ్చిపోయిన సింధు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 9-2తో ముందంజ వేసింది. 11-6తో బ్రేక్ వెళ్లిన పీవీ.. 21-10తో మ్యాచ్‌ను ముగించింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో మిగిలిన ఏకైక ప్లేయర్ సమీర్ వర్మ క్వార్టర్స్‌లోనే ఓడి ఇంటి ముఖంపట్టాడు. హోరాహోరీగా జరిగిన క్వార్టర్స్ పోరులో సమీర్ వర్మ 22-20, 10-21, 13-21తో టాప్ సీడ్ సన్ వాన్ (కొరియా) చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌లో వరల్డ్ నెం:1కు గట్టిపోటీ ఇచ్చిన సమీర్.. ఆ తర్వాత ప్రతిఘటించలేకపోయాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 14-21, 21-17, 15-21తో జపాన్ జంట తకీషి కమూర-కిగో సొనోడా చేతిలో పరాజయం పాలైంది. | sports |
3,896 | 27-10-2017 00:51:17 | దేశభక్తికి నిర్వచనం |
సినిమాహాళ్ళలో జాతీయగీత ప్రదర్శనకు సంబంధించి గత ఏడాది నవంబరులో తాను ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించడం సముచితంగానే ఉన్నది. ప్రదర్శనసమయంలో ప్రేక్షకులు నిలబడి దేశభక్తిని భుజకీర్తులుగా తగిలించుకోనక్కరలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గతంలో సినిమా ముగిశాక గీతాన్ని ప్రదర్శించడం, ఇంటికిపోతున్న ప్రజలు నిలబడకపోవడంతో ఆ ప్రదర్శన నిలిచిపోయింది. ఇప్పుడూ ఇందుకు భిన్నంగా ఏమీ జరగడం లేదు. గతంలో దాడులు జరిగాయో లేదో తెలియదు కానీ ఇప్పుడు దేశభక్తి పేరిట దాడులు జరుగుతూండటం విశేషం. సుప్రీం తీర్పు ఈ తీరును మార్చవచ్చునేమో కానీ, నిలబడితేనే గౌరవించినట్టా అన్న వాదన సరికాదు. జాతీయగీతం సమయంలో స్కూల్లో పిల్లలంతా నిలబడుతున్నారు, చట్టసభల్లో పెద్దలూ నిలబడుతున్నారు. థియేటర్లలోనే ఈ మినహాయింపు ఎందుకు? అన్న ప్రశ్న రాకుండా ఉండదు. 3 గంటలు కూర్చోబోయేవారు రెండు నిముషాలు నిలబడలేరా?- రామానుజమ్, హైదరాబాద్ | editorial |
16,572 | 12-02-2017 01:07:00 | సహనానికీ హద్దుంది | చెన్నై, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి పదవి ఊరిస్తూ దూరమవుతుండడంతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఇనచార్జ్ గవర్నర్ సీహెచ విద్యాసాగర్ రావ్‌కే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘‘నా సహనానికీ హద్దుంది. శ్రుతి మించితే, మేం ఏం చేయాలో అది చేస్తాం’’ అని శనివారం ఆమె హెచ్చరించారు. రేపటి (ఆదివారం) నుంచి తమ పోరాటం మరోలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించకుండా గవర్నర్ చేస్తున్న జాప్యం తమ పార్టీలో చీలికకు దారి తీస్తోందని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకుని ఐదు రోజులు దాటినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆహ్వానం రాకపోవడం, మరోవైపు, ప్రత్యర్థి పన్నీర్ సెల్వం శిబిరంలో రోజురోజుకూ బలం పెరుగుతుండడంతో శశికళ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి వరకూ తన వద్దనే ఉండి పలు వ్యూహాల ప్రణాళికలో పాలుపంచుకున్న ఇద్దరు ఎంపీలు, ఓ మంత్రి తెల్లారేసరికి వైరి శిబిరంలో చేరడంపై ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై చర్చించేందుకు శనివారం ఉదయం 12 గంటల ప్రాంతంలో స్థానిక పోయెస్ గార్డెనలోని తన నివాసంలో పార్టీకి చెందిన న్యాయ నిపుణులు, న్యాయవాదులతో గంటకుపైగా చర్చించారు. సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు నవనీత కృష్ణన నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ విచక్షణాధికారాలపైనా, వాటిని ఆయన ఉల్లంఘించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన శశికళ.. అక్కడ వేచి ఉన్న మద్దతుదారులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. తన్నుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూనే ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ‘‘అనేక పోరాటాల తర్వాతే అమ్మ ఆ స్థాయికి వచ్చారు. పలు ఇబ్బందులను అధిగమించి పార్టీని అభివృద్ధి చేశారు. మనకీ అలాంటి పరిస్థితే వచ్చింది. ఈ కష్టకాలంలో మీరంతా నాకు అండగా నిలవడం సంతోషంగా ఉంది’’ అని జీరబోయిన గొంతుతో వ్యాఖ్యానించారు. ఎంజీఆర్ ఆశీస్సులతో, అమ్మ రెక్కల కష్టంతో అభివృద్ధి చెందిన పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం కానివ్వబోమని, అందుకు ఏం చేయాలో అది చేస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా ఎన్నో అవాంతరాలను భరిస్తున్నానని, కానీ, తన సహనానికీ హద్దుందని, ఒక స్థాయి దాటితే ఏం చేయాలో అది చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దీంతో అక్కడున్న కార్యకర్తలు హర్షధ్వానాలతో ఆమెకు మద్దతు తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని నిర్వహించడం తన బాధ్యతని చెప్పారు. ‘‘పార్టీ కార్యకర్తలే నా ఆస్తి. పార్టీని, ప్రభుత్వాన్ని నేను కాపాడగలననే విశ్వాసంతోనే అమ్మ చనిపోయారు. అన్నాడీఎంకే పటిష్ఠమైన కంచుకోట. దానిని ఎవరూ బద్దలు చేయలేరు. అమ్మ మాతోనే ఉంది. ద్రోహులను గుర్తించింది. కోటిన్నర కార్యకర్తల మద్దతు మాకుంది. మమ్మల్ని విభజించాలనుకున్నవాళ్లు విఫలమవుతారు’’ అని శశికళ వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ భయపడనని చెప్పారు. కాగా, ఆదివారం తన పోరాటం విభిన్నంగా ఉంటుందని ప్రకటించిన శశికళ.. జయ సమాధి వద్ద నిరాహార దీక్ష చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వర్గాలు సంకేతమిచ్చాయి.పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇప్పటికే చాలా కాలమైందని, తమ పార్టీ తరఫున శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని శశికళ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె శనివారం గవర్నర్‌కు లేఖ రాశారు. ఓపీఎస్ రాజీనామా అనంతరం తమ పార్టీ ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయాన్ని తెలియపరిచానని, 9వ తేదీన నేరుగా వచ్చి లేఖను అందించానని అందులో వివరించారు. అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్న తనకు, ఆ మేరకు ఎమ్మెల్యేలను ప్రదర్శించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని శశికళ కోరారు. | nation |
18,184 | 18-05-2017 03:36:58 | ఇండియన్ ‘గ్రాండ్ కెన్యన్’..బెస్ట్ హాలిడే స్పాట్! | భోపాల్: చుట్టూ ఎత్తైన కొండలు. ఎవరో కావాలని చెక్కినట్లు కోతకు గురైన శిలలు. మధ్యలో నిండుకుండను తలపిస్తూ చిన్నపాటి జలాశయం. ఆకాశం నుంచి దూకుతున్నట్టు ఉండే జలపాతం. చూపరులను ఇట్టే ఆకట్టుకునే ప్రకృతి సోయగం! ఇలాంటి అపురూప అందాలను సొంతం చేసుకున్న మధ్యప్రదేశ్‌లో ఖజురహో సమీపంలో ఉన్న రనేశ్ జలపాతం దేశంలోకెల్లా ‘బెస్ట్ హాలిడే అవార్డు-2017’ను గెలుచుకుంది. ‘‘విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఈ ప్రాంతం తొలిస్థానంలో ఉంది’’ అని అధికారులు పేర్కొన్నారు. | nation |
9,784 | 26-08-2017 11:43:57 | చిరు, బాలయ్య సినిమాలకు నయనతార రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే..? | సినిమా ప్రచారాలకు తాను ఆమడదూరం అని చెప్పుకునే ఓ దక్షిణాది ముద్దుగుమ్మ.. పారితోషికం మాత్రం మూడు కోట్లకు పైగానే డిమాండ్ చేస్తోందట. పైగా.. మూడు పదుల వయసు దాటాకా కూడా.. అంత భారీ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు అంగీకరించడం.. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మూడు పదుల వయసు దాటితే.. కథానాయికలుగా రాణించడం కష్టమేననుకుంటారంతా. ముఖ్యంగా దక్షిణాదిన ఈ భావన ఎక్కువ. ఒక వేళ అవకాశాలు వచ్చినా.. పారితోషికం విషయంలో సర్దుకుపోక తప్పదు. కానీ.. నయనతార పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. స్టార్ హీరోల సరసన ఛాన్సులతో పాటు.. ఇప్పుడున్న అగ్రకథానాయికలు అంతా అందుకునే మొత్తానికి రెండింతల రెమ్యూనరేషన్ అందుకుంటోంది నయన్. తమిళనాట వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ.. తెలుగులో రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలకు కమిట్ అయింది నయనతార. అందులో ఒకటి ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిన బాలకృష్ణ సినిమా కాగా.. మరొకటి ఇటీవల ఆరంభమైన చిరంజీవి సినిమా 'సై రా.. నరసింహారెడ్డి'. ఈ రెండు పెద్ద సినిమాలతో తిరిగి టాలీవుడ్ లో తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో నిరూపించుకుంది నయన్. ఈ చిత్రాలకు నయన్ అందుకోబోతున్న పారితోషికమే ఇందుకు నిదర్శనం. బాలకృష్ణ సినిమాకు నయన్ అందుకుంటోన్న పారితోషికం.. 3 కోట్ల రూపాయలట. ఇక చిరంజీవి సినిమాకు వర్కింగ్ డేస్ ఎక్కువ కావడంతో.. మరో అరకోటి పెరిగిందట. మొత్తంగా.. ఈ రెండు సినిమాల రూపంలో ఆరున్నర కోట్లవరకూ అందుకోబోతోంది నయన్. తెలుగులో స్టార్ హీరోయిన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ కు ఇది డబుల్. నిజానికి.. నయన్ ఉన్నా లేకున్నా.. మన స్టార్ హీరోల సినిమాలకు క్రేజ్ ఏమీ తగ్గదు. కాకపోతే.. సీనియర్స్ కావడంతో వారి ఏజ్ గ్రూప్‌కు తగ్గ కథానాయికల విషయంలో ఆప్షన్స్ తక్కువగా ఉండడం వల్లే.. నయన్‌కు ఇలా అడిగినంతా ఇచ్చేందుకు అంగీకరించాల్సి వస్తోందట. ఏదేమైనా.. ఇంత భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు కనుక.. కనీసం ప్రమోషన్‌కు అయినా వస్తుందేమో చూద్దాం..! | entertainment |
4,010 | 05-01-2017 02:34:50 | మంచి తీర్పు – ఆచరణ సాధ్యమా? |
ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమానత్వం, సోషల్ సెక్యూరిటీ - ఈ ఆశయాలు గొప్పవి! వాటికి సరియైన అర్థం చెప్పి ఆచరించే వారు వుంటే అంతకంటే గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలో లేనే లేదు! అలాంటి నాయకుల కోసం ఎదురు చూద్దాం. అంతకంటే గత్యంతరం లేదు! భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం నూతన సంవత్సరం మొదట్లోనే మెజారిటీ జడ్జిమెంట్ (4:3) ద్వారా మతం పేరిట, కులం పేరిట, భాష పేరిట ఎన్నికల్లో ఓట్లు అర్థించటం చెల్లదని స్పష్టం చేయటం హర్షణీయమే కానీ అది ఆచరణలో ఎంతవరకు చెల్లుబాటు అవుతుందనేది ప్రశ్నార్థకం! ఆ విధంగా ఓట్లు అడిగితే అది అవినీతి చర్యగా గుర్తించబడి ఆ అభ్యర్థి ఎన్నికల పోటీలో అనర్హుడవుతాడు. అసలు ఈ సమస్య, ఎన్నికల చట్టం సెక్షన్ 123(3)లో పేర్కొనబడిన ‘అతడి’ (his) అనే పదాన్ని చట్ట ప్రకారం ఏ విధంగా అన్వయించాలన్న విషయం వల్ల బయటకు వచ్చింది. ఈ లిటిగేషన్ రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు ఈ తీర్పు వెలువడింది. మతం పేరిటో కులం పేరిటో ఓట్లు ఒక అభ్యర్థికి ఎవరడిగినా, ఎలక్టొరేట్‌ను ప్రభావితం చేసే అంశాన్ని స్థూలంగా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొని తీర్పును ఇచ్చింది. మన రాజ్యాంగం లౌకిక వాదాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకున్న నేపథ్యంలో ఇలాటి అభ్యర్థనలు ఎంతవరకు సబబు అన్న విషయం మీదనే ధర్మాసనం దృష్టి పెట్టి, ఈ నిర్ణయాన్ని వెలువరించింది. మతాన్ని ఆధారం చేసుకొని ప్రచారం చేయటమనేది మతాన్ని ‘స్టేట్ పవర్’తో మిళితం చేయటమే అని మెజార్టీ జడ్జిమెంట్ అభిప్రాయపడింది. ఆసక్తికరంగా మెజారిటీ జడ్జీలలో ఒకరైన జస్టిస్ లోకూర్ ఈ జడ్జిమెంట్‌లో విన్‌స్టన్ చర్చిల్‌ను ఉటంకించటం విశేషం. మతం పేరుతో ఓటు అడిగితే ప్రజాస్వామ్యం విశేషంగా ఆదరించబడటానికి కారణమైన సామాన్యుడికి అన్యాయం చేయటమే అవుతుంది అన్న చర్చిల్ స్థూల అభిప్రాయాన్ని ఆయన తన తీర్పు పాఠంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అందరూ ఒకటిగా వుండాలనే దృక్పథంతో సెక్షన్ 123 విభజనకు దారితీసే, కులపరమైన మతపరమైన అభ్యర్థనలను ప్రచారంలో నిషేధించిదని మరొక జడ్జి అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వాడిన ‘ఇరుకైన గోడలు’ అన్న పదాన్ని జడ్జి బొబ్డె ఉదహరించి, ప్రచారం ఆ గోడలను దాటి ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. లౌకికవాదాన్ని సమర్థించే ఈ వాదనలు మెజారిటీ జడ్జిమెంట్‌లో వుండటం అందరూ హర్షించదగ్గ విషయమే! ‘డిమానిటైజేషన్’ను మొదట్లో సమర్థించిన తీరులోనే దేశాన్ని ప్రభావితం చేసే ఈ జడ్జిమెంట్‌ను కూడా అన్ని రాజకీయపార్టీలు, కాకలుతీరిన రాజకీయ నాయకులు సమర్థించారు. అయితే ఆచరణలో ఈ తీర్పును వారు ఎంత వరకు గౌరవిస్తారనేది అందరికీ అనుమానం కలిగించే అంశమే! ఒక అద్భుతమైన ఆశయం వుండటం హర్షణీయమే! కానీ ఆ ఆశయాన్ని నిర్మాణాత్మకంగా ఆచరణలో పెట్టే వెసులుబాటూ, యంత్రాం గమూ వున్నవా లేవా అనేది ఆలోచించక తప్పదు. జాతీయ గీతం విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి! జాతీయ గీతాన్ని గౌరవించటమనేది ప్రతి భారతీయుడూ మనసా వాచా నమ్మే విషయం. సినిమా హాళ్లలో ఆ గీతం ప్రదర్శిస్తున్నప్పుడు ఎంతమంది ఆ గౌరవాన్ని చూపడానికి సిద్ధపడుతున్నారు? వారు అలా ఏ కారణం చేతనైనా చేయకపోతే జాతీయ గీతాన్ని అగౌరవపర్చినట్లు భావించాల్నా? నిజంగా అగౌరపరిచేవారిని చట్ట ప్రకారం అదుపు చేయటానికి ఏ యంత్రాంగం అందుబాటులో వుంది? ఆచరణ యోగ్యం కాని అంశాలు ఎంత గొప్పవైనా వాటిని కేవలం నోటి మాటగా ఆదరించటం మినహా మరొక విధంగా కచ్చితంగా ఆచరించే మార్గం వుందా అన్నది విజ్ఞులు అందరూ ఆలోచించక తప్పదు. మెజారిటీ జడ్జిమెంట్‌తో ఏకీభవించని జస్టిస్ చంద్రచూడ్ ‘సామాజిక వాస్తవా’లను మన దేశంలోని ప్రతి భారతీయుడూ గుర్తించటమే కాకుండా వాటిని ఏ విధంగా అధిగమించాలన్న దృక్పథంతో వున్నాడని స్పష్టపరిచారు. చారిత్రక అసమానతలూ అణిచివేతలూ వున్న నేపథ్యంలో మతం పేరిట, కులం పేరిట, భాష పేరిట ఇప్పటికే జనం అణగదొక్కబడుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో సామాజిక అసమానతలూ, అన్యాయాలూ ఏదో ఒక రూపంలో ప్రచారంలో బయటకు రాక తప్పవని ప్రజాస్వామ్యంలో ఎన్నికల రాజకీయం అంటే సామాజికంగా మొబిలైజ్ చేయటమే అని స్థూలంగా ‘డిసెంట్’ జడ్జిమెంట్‌లో ప్రస్తావించటం జరిగింది. సెక్షన్ 123 (3)లో అలాంటి చెల్లుబాటుకు అవకాశం వుందని విశ్లేషించటం సత్యదూరం అని కూడా జస్టిస్ చంద్ర చూడ్ స్పష్టం చూశారు ఒక కులం బాగా వున్న ప్రాంతంలో కులాలకు అతీతంగా ఓటు వేయండి అని ఆ కులానికి చెందని ఒక నాయకుడు తెలివిగా ప్రచారం చేయటాన్ని ఎవరూ కాదనలేరు. అదే విధంగా మెజారిటీ మతానికి చెందని నాయకుడు మనల్ని మనం సంఘటిత పర్చుకొనే విధంగా ఒకే తాటిపై నడవాలని ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకోనూవచ్చు! టెక్నికల్‌గా ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినట్లు అందరికీ తెల్సినా, వారిని ఎవరేమి చేయగలరు? కానీ ఎన్నికల కేసులు భవిష్యత్తులో పెరగటం ఖాయం. ఆ పేరు మీద శాంతి భద్రతలకు మరింత విఘాతం జరగటం తథ్యం. నిన్న గాక మొన్న దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా మతం పేరిట రెచ్చగొట్టారని కొందరి నాయకులపై పెట్టిన కేసులు కోర్టులో వీగిపోయాయి. జన బాహుళ్యానికి వాస్తవాలు కొట్టొచ్చినట్టు కన్పడినా, సాక్ష్యాలు వాస్తవాలను ప్రతిబింబించవు. వాస్తవం ప్రజల అవగాహనకు వీలుగా వుంటుంది కానీ కోర్టులో సాక్ష్యానికి సరిపడా వుండదు. రాజకీయ పార్టీలకు ఈ విషయం తెలుసు! ఎన్నికల సమయంలో ఎదుటి పార్టీని, అభ్యర్థిని నిలువరించటానికి ఈ తీర్పును ఉపయోగించుకొనే అవకాశం వుంది. ఎన్నికలుకాగానే ప్రజాస్వామ్య పరిథిలో అందరూ సమానులుగానే భాసిల్లక తప్పదు! ఓటర్లు కూడా ఎక్కడికి అక్కడ సమాధానపడుతూ, తమకున్న చిన్నపాటి అవసరాలు తీర్చుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటూ రాబోయే ఎన్నికల తతంగం కోసం ఎదురుచూస్తూ వుంటారు. ప్రజాస్వామ్యంలోని గమ్మత్తయిన వెసులుబాటే అది! ఎవరు ఏ విధంగా అన్వయించుకొంటే ఆ విధంగానే చట్టాలు సాక్షాత్కరిస్తాయి. చట్టం మన పని చేస్తుందో లేదో కానీ, తన పని తాను చేసుకుంటూనే వుంటుంది! ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమానత్వం, సోషల్ సెక్యూరిటీ – ఈ ఆశయాలు గొప్పవి! వాటికి సరియైన అర్థం చెప్పి ఆచరించే వారు వుంటే అంతకంటే గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలో లేనే లేదు! అలాంటి నాయకుల కోసం ఎదురు చూద్దాం. అంతకంటే గత్యంతరం లేదు!రావులపాటి సీతారాంరావు | editorial |
10,670 | 20-03-2017 17:39:25 | వైరల్‌గా మారిన రణ్‌బీర్-మహీరా వీడియో! | బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, బాలీవుడ్ నటి మహీరా ఖాన్‌ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా ట్రెండ్ అవుతోంది. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. తొలుత ఈ కార్యక్రమానికి వచ్చిన వీరిద్దరూ కొంత సమయం సరదాగా నవ్వుతూ గడిపారు. రెడ్‌కార్పెట్ మీద కూడా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. | entertainment |
20,178 | 30-06-2017 00:39:12 | ప్రణబ్‌కు 81.. నాకు 73 | మాకేల వయోపరిమితి షా సూటి ప్రశ్నన్యూఢిల్లీ: లోధా కమిటీ సంస్కరణల అమలులో బీసీసీఐకి సుప్రీంకోర్టు మధ్య ఏర్పడిన వివాదంలోకి బోర్డు మాజీ కార్యదర్శి నిరంజన్ షా.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని లాగారు. 81 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రథమపౌరుడిగా కొనసాగుతుండగా లేనిది.. 73 ఏళ్ల తాను క్రికెట్ పరిపాలకుడిగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. బీసీసీఐ పరిపాలకులకు వయోపరిమితి విధించడం వివక్షేనని షా వ్యాఖ్యా నించారు. బోర్డు మాజీ కార్యదర్శి, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ)లో అత్యంత పలుకు బడి కలిగిన షాను.. లోధా కమిటీ సంస్కరణల అమలుకు సంబంధించి బీసీసీఐ వేసిన కమిటీలో ఎనిమిదో సభ్యుడిగా బుధవారం నియమిం చడం వివాదాస్పదమైంది. 70 ఏళ్లకు మించిన వారెవరూ బీసీసీఐ పదవుల్లో ఉండకూడదన్నది లోధా సంస్కరణల్లో ఒకటి. కానీ అదే లోధా సంస్కరణల అమలు పరిశీలనపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో గంగూలీ సహా ఏడుగురు సభ్యులతో మంగళవారం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో నిరంజన్ షాను ‘సలహాలు, సూచనలు’ ఇచ్చే పేరిట ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో నిరంజన్ షా తీవ్రంగా స్పందించారు. ‘బీసీసీఐ అధికారుకులకు ఈ వయోపరిమితి ఏమిటో నాకు అర్థం కావడంలేదు. మన రాష్ట్రపతి (ప్రణబ్ ముఖర్జీ, వయస్సు 81) 70 ఏళ్లకు పైబడినా పనిచేస్తున్నప్పుడు.. అదే వయసు దాటిన బీసీసీఐ అధికారులు పనిచేస్తే తప్పేంటి’ అని ప్రశ్నించారు. | sports |
4,722 | 19-12-2017 14:02:54 | చిరంజీవిపై కూతురు సుష్మిత ఆసక్తికర వ్యాఖ్యలు | హైదరాబాద్: చాలాకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్-150’తో సినీతెరపై రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ప్రస్తుతం ‘సైరా’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ‘సైరా’ సినిమాకు చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుష్మిత.. చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేమిటో ఆమె మాటల్లోనే.. రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవి సినిమాలకు దాదాపు దూరమయ్యారు. నిత్యం షూట్‌లతో బిజీగా ఉండే చిరు.. ఒక్కసారిగా సినిమాలకు దూరం అవడంతో ఆయనలో సంతోషం దూరమైందట. షూటింగ్‌లు లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎంతమాత్రం ఇష్టపడని చిరు.. మునిపటిలా ఉండేవారు కాదట. అయితే మళ్లీ తెరంగేట్రం చేశాక.. పాత చిరంజీవిని చూస్తున్నామని, ఆయన మొహంలో మునుపటి సంతోషాన్ని చూస్తున్నామని సుష్మిత వెల్లడించారు. కాగా, సుష్మిత తన తండ్రి నటిస్తున్న ‘సైరా’ మూవీకే కాక.. రామ్‌చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమాకూ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. చిరంజీవి ఎంత వరకు చదువుకున్నారో తెలుసా? తెలుగు కవుల వెలుగు చిలుకులు | entertainment |
19,330 | 31-07-2017 02:19:32 | ఓటమికి చింత వలదు! |
మిథాలీసేనతో ప్రధానిన్యూఢిల్లీ : ప్రపంచకప్ ఫైనల్ పరాజయానికి చింతించాల్సిన అవసరం లేదని మిథాలీసేనకు సలహా ఇచ్చినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ ఫైనల్లో భారత్ తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌లో ప్రదర్శించిన అద్భుత ఆటతీరుతో దేశ ప్రజల మనసులు గెలుచుకున్న భారత జట్టును స్వదేశం తిరిగి వచ్చాక పలు సంస్థలు సన్మానించాయి. ప్రధాని మోదీ కూడా తన నివాసంలో జట్టుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ‘వారితో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. అయితే ప్రపంచకప్ సాధించలేకపోయామన్న బాధ వారి మొహాల్లో కనిపించింది’ అని ప్రధాని తన ‘మన్ కీ బాత్’లో తెలిపారు. ‘మన కూతుళ్లు ప్రపంచకప్ గెలవడంలో విఫలమైనా విమర్శించకుండా వారికి మద్దతు పలకడం ఇదే తొలిసారి. 125 కోట్లమంది భారతీయులు ఆ పరాజయ భారాన్ని మన కూతుళ్లపై కాకుండా తమ భుజాలపై ఎత్తుకున్నారు’ అని గుర్తు చేశారు. ‘దేశ ప్రజలు ఇలా మద్దతు పలుకుతున్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులని వారికి చెప్పాను. అందువల్ల విజయం సాధించలేకపోయామే అనే బాధ మీ మదిలో ఉంటే దానిని తుడిపివేయండి. మీరు ఫైనల్లో గెలిచి ఉండకపోవచ్చు. కానీ 125 కోట్ల భారతీయుల మనసులు కొల్లగొట్టారు’ అని ప్రధాని మోదీ ప్రశంసించారు. | sports |
18,774 | 22-04-2017 02:17:08 | పెట్రోల్, డీజిల్ ఇంటికే సరఫరా! |
హోం డెలివరీపై కేంద్రం యోచన నగదు రహితాన్ని పెంచేందుకే! న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఇంట్లో కూర్చుని ఏ పిజ్జానో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లుగా పెట్రోల్, డీజిల్ కూడా ఆర్డర్ చేయగలిగితే..? అంతకన్నా ఇంకేమి కావాలి. పెట్రోల్ కోసం క్యూలో నిలబడే పని తప్పిపోతుంది కదా!! ఆ రోజులు త్వరలోనే రాబోతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ శుక్రవారం సంకేతాలిచ్చింది. పెట్రోలియం ఉత్పత్తులను హోం డెలివరీ చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన ట్విటర్ ద్వారా వెల్లడించారు. నగదు రహిత లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన శ్రీనగర్‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం కొద్దిసేపటికి పెట్రోలియం ఉత్పత్తుల హోం డెలివరీపై ఆయన ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా రోజూ సుమారు 3.5 కోట్ల మంది పెట్రోలు బంకుల్లో ఆయిల్ కొట్టించుకుంటున్నారు. వీరందరినీ డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా మూడు మార్గాలపై శ్రీనగర్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన చర్చించారు. అవి.. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపులకు అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచడం డిజిటల్ లావాదేవీలపై వినియోగదారులకు అవగాహన పెంచడం, వారి ప్రోత్సాహకాలు అందించడం; మూడోది పెట్రోలియం ఉత్పత్తుల హోం డెలివరీని అందుబాటులోకి తేవడం. కాగా, హోం డెలివరీతో నగదు రహిత చెల్లింపులు మరింత పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది | nation |
5,090 | 28-06-2017 23:03:02 | స్టైలిష్ యాక్షన్ ‘జవాన్’ | ‘‘చాలా చక్కటి కాన్సెప్ట్‌తో మేం తెరకెక్కిస్తున్న చిత్రం ‘జవాన్’. సాయిధరమ్‌తేజ్ ఇప్పటివరకూ చేయని ఓ మంచి పాత్రలో నటిస్తున్నాడు. మధ్య తరగతికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి? వాటిని తన బుద్ధిబలంతో ఎలా కాపాడుకున్నాడనేది ఈ సినిమా కథ. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్’’ అని దర్శకుడు బీవీయస్ రవి చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జవాన్’. సాయిధరమ్‌తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా నటించారు. దిల్‌రాజు సమర్పణలో అరుణాచల్ కియ్రేషన్స్ పతాకంపై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ మాట్లాడుతూ ‘‘రవి చెప్పిన కథను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాం. జులైలో మిగిలిన షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 1న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘తేజ్ కథలో ఇన్వాల్వ్ అయ్యి మరీ చేస్తున్నాడు. సినిమా అనుకున్నట్టుగా బాగా వస్తోంది’’ అని చెప్పారు. | entertainment |
12,764 | 22-12-2017 03:08:11 | భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం | ‘‘భారత ప్రభుత్వంతో సమస్యలను పరిష్కరించుకునేందుకు పౌర ప్రభుత్వం జరిపే ప్రయత్నాలకు మా మద్దతు ఉంటుంది. యుద్ధం ద్వారా కాకుండా భారత్‌తో చర్చల ద్వారా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో భారత్‌తో పాకిస్థాన్ ప్రభుత్వం చర్చలకు సిద్ధపడితే తప్పకుండా మద్దతు ఇస్తాం’’పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్‌జావేద్ బాజ్వా | nation |
19,375 | 09-11-2017 01:52:07 | చాంపియన్లు సైనా, ప్రణయ్ |
నాగ్‌పూర్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్‌లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, హెచ్‌ఎస్ ప్రణయ్ నూతన చాంపియన్లుగా నిలిచారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-17, 27-25తో పీవీ సింధును ఓడించింది. సైనా కెరీర్‌లో ఇది మూడో జాతీయ టైటిల్. అలాగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21-15, 16-21, 21-7తో కిడాంబి శ్రీకాంత్‌ను కంగుతినిపించాడు. ఇక పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మను అత్రి 15-21, 22-20, 25-23తో సాత్విక్-చిరాగ్ శెట్టిపై, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప 21-14, 21-14తో ప్రజక్తా సావంత్-సన్యోగితపై.... మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్-అశ్విని పొన్నప్ప 21-9, 20-22, 21-17 తో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డిపై గెలిచి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. సింధు, సైనా హోరాహోరీభారత బ్యాడ్మింటన్‌లో అగ్రశ్రేణి షట్లర్లుగా పేరు తెచ్చుకున్న సైనా, సింధు ఫైనల్ ఉర్రూతలూగించింది. తొలి గేమ్ ఆరంభంలో ఇరువురు పాయింట్లు దక్కించుకున్నారు. సైనా పుంజుకుని వరుసగా పాయింట్లు సాధించడంతో 10-7తో ఆధిక్యంలో నిలిచింది. బ్రేక్ సమయానికి సింధు చెలరేగి 11-10తో గట్టి పోటీనిచ్చింది. కానీ సైనా అద్భుతంగా ఆడి నాలుగు పాయింట్లు సాధించి 14-9కి వెళ్లింది. ఈ దశలో సింఽధు వరుస పాయింట్లతో 17-18కి చేరింది. కానీ సైనా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధును అదే స్కోరుపై ఉంచి గేమ్‌ను దక్కించుకుం ది. ఇక రెండో గేమ్‌లో మాత్రం ఒక్కసారిగా చెలరేగిన సింధు 5-1తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత సైనా 6-6తో నిలవగా మళ్లీ చెలరేగిన సింధు తన ఆధిక్యాన్ని 18-15 వరకు నిలబెట్టుకుంది. కానీ ఈ దశలో సైనా 20-18తో నిలిచి మ్యాచ్ పాయింట్ అవకాశం దక్కించుకుంది. అయితే సింఽధు అంత సులువుగా లొంగకపోవడంతో సైనా మరో ఆరు పాయింట్ల దాకా వేచిచూడాల్సి వచ్చింది. చివరకు సుదీర్ఘ ర్యాలీతో మ్యాచ్‌ను ముగించింది. శ్రీకాంత్‌కు షాక్...ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లతో అదరగొట్టిన కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో హెచ్‌ఎస్ ప్రణయ్ షాకిచ్చాడు. దీంతో గత నెల ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో శ్రీకాంత్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చు కున్నట్టయ్యింది. ఈ ఫైనల్లో శ్రీకాంత్, ప్రణయ్ తమ హోరాహోరీ ఆటతో అభిమానులను ఆకట్టుకున్నారు. మైదానంలో మెరుపులా కదులుతూ సుదీర్ఘ ర్యాలీలతో మెరిశారు. దీంతో తొలి రెండు గేమ్‌ల్లో చెరొకటి నెగ్గి సమవుజ్జీలుగా నిలిచారు. చివరి గేమ్‌లో శ్రీకాంత్ వేగవంతమైన ర్యాలీలను సమర్థవంతంగా అడ్డుకున్న ప్రణయ్ 6-1తో ఆధిక్యం సాధించాడు. ఇదే జోరును కొనసాగించి ఓ దశలో 11-3తో నిలిచాడు. దీంతో ఒత్తిడికి లోనైన శ్రీకాంత్ ఆట గతి తప్పింది. అతడి బ్యాక్‌హ్యాండ్ షాట్ నెట్‌కు తాకడంతో ప్రణయ్‌కు మ్యాచ్ పాయింట్ అవకాశం చిక్కింది. ఆ తర్వాత పాయింట్ కోల్పోయి నా ప్రణయ్ ఇబ్బంది లేకుండా తర్వాతి పాయింట్‌తో విజేతగా నిలిచాడు. గవర్నర్ ప్రశంసజాతీయ బ్యాడ్మింటన్‌లో విజేతలుగా నిలిచిన సైనా, హెచ్‌ఎస్ ప్రణయ్‌లను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అభినందించారు. గవర్నర్ ప్రశంసజాతీయ బ్యాడ్మింటన్‌లో విజేతలుగా నిలిచిన సైనా, హెచ్‌ఎస్ ప్రణయ్‌లను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అభినందించారు. | sports |
15,754 | 30-11-2017 07:29:55 | ఉల్లి ధరల నియంత్రణ మా చేతుల్లో లేదు : కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు | న్యూఢిల్లీ : ఖరీఫ్ సీజనులో ఉల్లి సాగు విస్తీర్ణం 30 శాతం తగ్గడం, డిమాండుకనుగుణంగా ఉల్లి సరఫరా కాకపోవడం వల్ల ధరలు పెరిగాయని కేంద్ర పౌర సరఫరాలశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ఉల్లి ధరలను నియంత్రించడం తమ చేతుల్లో లేదని, ఉల్లి డిమాండు... సప్లయిని బట్టి నిర్ణయం జరుగుతుందని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఉల్లి డిమాండు, సప్లయిల మధ్య అంతరంతోనే ధరలు పెరిగాయని మంత్రి స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉల్లి మార్కెట్ కు రావడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి చెప్పారు. ఢిల్లీ నగరంలో ఉల్లి కిలో ధర రూ.70 ఉన్నందున ధరను తగ్గించేందుకు పదివేల టన్నుల ఉల్లిని ఢిల్లీకి పంపించాలని మహారాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ను కోరినట్లు మంత్రి వివరించారు. ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఉల్లిని పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ షాపుల్లో తక్కువ ధరలకు విక్రయించాలని సూచించినట్లు కేంద్రమంత్రి పాశ్వాన్ వివరించారు. | nation |
48 | 17-11-2017 00:20:11 | అమెరికా పొమ్మంటోంది.. యుకె రమ్మంటోంది | హెచ్1బి వీసాలకు కనీస వేతన పరిమితి పెంపు దిశగా అమెరికా పావులుప్రతిభావంతులకు ద్వారాలు తెరిచే యోచనలో బ్రిటన్‌వాషింగ్టన్/లండన్: భారతీయుల డాలర్ డ్రీమ్స్‌ను చెదరగొట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. పౌండ్‌ల పంట పండించుకొనేందుకు వీలుగా మనోళ్లకు పెద్ద సంఖ్యలో ఆహ్వానం పలకాలని బ్రిటన్ యోచిస్తున్నది. హెచ్1బి వీసాలకు కనీస వేతన పరిమితిని 60 వేల డాలర్ల నుంచి 90 వేల డాలర్లకు పెంచాలన్న ప్రతిపాదనతోపాటు పలు ఆంక్షలు విధించే చట్టానికి కీలక కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. అమెరికన్ల ఉద్యోగాలను రక్షించడంతోపాటు స్వదేశీయులకు ఉపాధి అవకాశాలు పెంచే ఉద్దేశంతో అక్కడి కోర్టులు, మేధో సంపత్తి హక్కులు, ఇంటర్నెట్ సబ్ కమిటీల చైర్మన్ డారెల్ ఇస్సా ప్రవేశపెట్టిన ‘ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్’కు హౌజ్ జ్యుడీషియరీ కమిటీ ఓకే చెప్పింది. తదుపరి ప్రక్రియ కోసం ఈ బిల్లును చట్ట సభలకు పంపనున్నారు. సభలు ఆమోదించాక బిల్లు వైట్‌హౌజ్‌కు చేరుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశాక బిల్లు చట్టంగా మారుతుంది. అయితే, డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు మధ్య ఉన్న తీవ్ర విభేదాల కారణంగా చట్ట సభల్లో ఈ బిల్లు గట్టెక్కెందుకు అవకాశాలు తక్కువనే చెప్పాలి. కానీ ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే గనుక మనోళ్లకు హెచ్1బి వీసా దక్కే అవకాశాలు భారీగా తగ్గుతాయి. దేశీ సాఫ్ట్‌వేర్ కంపెనీలపైనా వ్యయభారం పెరుగుతుంది. ఎందుకంటే, చాలా వరకు దేశీయ ఐటి కంపెనీలు ఆన్‌సైట్ కార్యకలాపాల కోసం ఇక్కడి ఐటి నిపుణులను హెచ్1బి వీసాలపై అమెరికాకు పంపుతున్నాయి. బిల్లుకు ఆమోదం లభిస్తే.. అమెరికాలోని కంపెనీలు స్థానిక ఉద్యోగి స్థానంలో హెచ్1బీ వీసా కలిగిన వ్యక్తిని తీసుకోవడాన్ని నిషేధిస్తుంది. అంతేకాదు, హెచ్1బి వీసా కలిగిన ఉద్యోగికి ఏడాదికి కనీసం 90 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో అమెరికాలో కార్యకలాపాల కోసం హెచ్1బి వీసా హోల్డర్ల నియామకాలు భారీగా తగ్గేందుకు అవకాశం ఉంది. మేం ఆహ్వానం పలుకుతాం..నాన్ యూరోపియన్ యూనియన్ (నాన్-ఇయు) దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు, కళాకారులు, సృజనాత్మక వ్యక్తులకు ఆఫర్ చేసే వీసాలను రెట్టింపు చేయనున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరెసా మే ప్రకటించారు. బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం) తర్వాత అనుసరించాల్సిన వూహాల్లో భాగంగా గ్లోబల్ టాలెంట్‌కు బ్రిటన్ గేట్లు బార్లా తెరవాలని అనుకుంటున్నది. అసాధారణ ప్రతిభ కలిగినవారికి జారీ చేసే వీసాల సంఖ్యను 1,000 నుంచి 2,000కు పెంచనున్నట్లు మే తెలిపారు. తద్వారా భారతీయులకు బ్రిటన్‌కు వలస వెళ్లేందుకు అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి. | business |
12,750 | 07-12-2017 11:04:23 | స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తా... విశాల్ శపథం! | చెన్నై: నాటకీయ పరిణామాల మధ్య ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోయిన నటుడు విశాల్ కృష్ణ... తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 21న జరగనున్న ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థికి మద్దతిస్తాననీ.. అతడిని గెలిపించుకుని నియోజకవర్గ ప్రజలకు సేవచేస్తానని పేర్కొన్నారు. ఆర్కే నగర్‌లో జరుగుతున్న పరిణామాలను ట్విటర్ ఖాతాల ద్వారా రాష్ట్రపతి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ‘‘నేను విశాల్.. చెన్నైలోని ఆర్కేనగర్ ఎన్నికల్లో ఏంజరుగుతుందో మీకు తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. నా నామినేషన్‌ను అంగీకరించి, ఆ తర్వాత మళ్లీ తిరస్కరించారు. ఇది అన్యాయం. నేను దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను..’’ అని విశాల్ పోస్టు చేశారు. మంగళవారం విశాల్ సమర్పించిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఆయన వాదన విన్నతర్వాత నామినేషన్ అంగీకరించారు. అనంతరం మళ్లీ విశాల్ నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. రెండ్రోజుల క్రితం సినీఫక్కీలో జరిగిన ఈ నాటకీయ పరిణామాలకు విశాల్‌తో పాటు తమిళనాడు ప్రజలను కూడా గందరగోళానికి గురిచేశాయి. దీంతో ‘‘ఇవాళ ప్రజాస్వామ్యం చచ్చిపోయిందంటూ’’ విశాల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓ యువకుడు స్వంతంత్రంగా పోటీచేస్తే.. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. | nation |
14,804 | 23-06-2017 02:19:02 | దళితుడని కాదు..యోగ్యుడనే..: వెంకయ్య | న్యూఢిల్లీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రామ్‌నాథ్ కోవింద్‌ను దళితుడని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయలేదని, ఆయన అన్ని విధాలా యోగ్యుడని ఎంపిక చేశామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రతిపక్షాలు మీరా కుమార్‌ను ఎంపిక చేయడం ద్వారా అనవసర పోలికలకు తెరతీశాయని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల ఫలితాలు ముందే అందరికీ తెలుసునని అన్నారు. కోవింద్ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి ప్రతిపక్షాలు కలిసి వచ్చి ఉండే బాగుండేదని, ఏకాభిప్రాయం కోసం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపామని, నిర్ణయం తీసుకున్నాక సోనియా, మన్మోహన్‌తోపాటు ప్రతిపక్ష నేతలతో ప్రధాని మోదీ మాట్లాడారని చెప్పారు. | nation |
4,258 | 08-06-2017 01:04:41 | ప్రజాస్వామ్యమా, కులస్వామ్యమా? | ‘రాజ్యం వీర భోజ్యం’ అనేది ఒకనాటి సూక్తి. అదిప్పుడు రూపు మార్చుకుంది. స్వాతంత్య్రానంతరం మనం గొప్పగా చెప్పుకుంటున్న ప్రజాస్వామ్య దేశంలో కుల బలం, ధన బలం ఉన్నవారిదే సత్తా. ఈ పుణ్య భూమిలో ఓట్లొకరివి, సీట్లొకరివి. ఓట్లున్న వారికి అరచి గీపెట్టుకున్నా పెద్దగా సీట్లివ్వరు. అరకొరగా ఇచ్చి అవి కూడా గెలవనీయకుండా ఎన్నికల వ్యవస్థను ధనమయం చేసిపెట్టారు. రెడ్లు సభలు, సమావేశాలు పెట్టి కేంద్రంలోనే కాక రెండు తెలుగు రాష్ట్రాలలో తమకు అన్యాయం జరుగుతున్నదని, అంటున్నందుకే ఈ ప్రస్తావన. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో తమకు ముఖ్యమంత్రులు లేని దుస్థితి వచ్చిందని, కేంద్రంలో కూడా తమ మంత్రులు లేరని వారు వాపోతున్నారు. అసలు రెడ్లకు ఏం తక్కువైందని ఈ గగ్గోలు. రాష్ట్ర విభజన వరకు ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని అధికారాన్ని, ఆధిపత్యాన్ని పొందింది వారే. సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ హయాంలో 99% ముఖ్యమంత్రి పదవులు వారికే దక్కాయి. వీటితో పాటు ప్రాముఖ్యత గల శాఖలతో మెజార్టీ మంత్రి పదవులు, కార్పోరేషన్ అధ్యక్ష పదవులు వారి పరమయ్యాయనేది సత్యం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెడ్ల భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. 1956 నుంచి రాష్ట్ర విభజన వరకు వారికే పెద్ద పీట వేసింది. రాష్ట్రంలోనే కాకుండా, కేంద్రంలో సైతం వారి హవా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం కోణమనేది రాష్ట్ర అవతరణ నుంచే ప్రారంభమైంది. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్రతో తెలంగాణ విలీనాన్ని మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే జవహర్‌లాల్ నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్ వంటి కేంద్ర నాయకుల ఒత్తిడితో అయిష్టంగానే విలీనానికి ఒప్పుకున్నారు. పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, తెలంగాణ మరణ శాసనంపై సంతకం చేశానని కూడా ఆయన ప్రకటించారు. రామకృష్ణారావు ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళేందుకు రెండేళ్ళ గడువుండగానే విలీనం ప్రతిపాదన వచ్చింది. హైదరాబాద్ రాజధానిగా సకల సౌకర్యాలతో ఉన్న తెలంగాణను విలీనం చేసేందుకు సర్కారియా కమిషన్ కూడా ఒప్పుకోలేదు. ఒకవేళ చేయదల్చుకుంటే, రెండేళ్ళ అనంతరం జరిగే ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని కోరాలని చెప్పినా వినకుండా, రెండు రాష్ట్రాలను కేంద్రం విలీనం చేసింది. అటువంటప్పుడు ఏపీ తొలి ముఖ్యమంత్రిగా రామకృష్ణారావు ఉండటమే న్యాయం. అందుకు అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయి. అయినప్పటికి సీఎం పదవి నుంచి తప్పించి ఆయనను కేరళ గవర్నర్‌గా పంపారు. కర్నూలులో ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. దీనిలో మతలబు కులం కాక మరేమిటి? సంజీవరెడ్డి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులలో దామోదరం సంజీవయ్య, పి.వి. నర్సింహారావు, జలగం వెంగళరావు, రోశయ్య తప్ప మిగతావారంతా రెడ్లే. వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర రెడ్డి, టి. అంజయ్య (రామకృష్ణారెడ్డి), వై.యస్. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. ప్రాంతీయ పార్టీగా అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ నుంచి కమ్మ వర్గానికి చెందిన ఎన్.టి.రామారావు, నాదెళ్ళ భాస్కర రావు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులయ్యారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేండ్లు పాలించగా మర్రి చెన్నారెడ్డి, విజయభాస్కర రెడ్డి, రాజశేఖర్ రెడ్డి రెండేసి పర్యాయాల చొప్పున సీఎం పదవిని ఏలారు. దళితుడైన సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అవమానాలకు గురయ్యారు. అగ్రకుల దురహంకారంతో ఆయన మంత్రి వర్గంలోని కొందరు సంజీవయ్యను తీవ్రమనస్థాపానికి గురి చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేస్తే ఆ జిల్లాకు చెందిన సొంతపార్టీ దిగ్గజ నాయకుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులను ఇండిపెండెంట్లుగా పోటీ చేయించి సంజీవయ్యను ఓడించారు. చివరకు ఆయన పదవి నుంచి తప్పుకొనే పరిస్థితులు కల్పించారు. పేదల కోసం భూ సంస్కరణలు అమలు చేసిన పాపానికి పి.వి.నరసింహారావును భూస్వాములు, పెత్తందార్లు ఉద్యమాలు లేవదీసి గద్దె దింపారు. మొత్తం మీద రెడ్లు పన్నెండు పర్యాయాలు సీఎం పీఠాన్ని అధిష్టించి రాష్ట్రాన్ని ఏలారు. సీఎం పదవిలోనే కాదు, ఎమ్మెల్యే టిక్కెట్లలోనూ పెద్దవాటా రెడ్లదే. బీసీలకు ఎప్పుడూ ఇచ్చింది అత్తెసరు సీట్లే. బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన వై.యస్.ఆర్. తన హయాంలో ఎన్నికలు జరిగితే ఆ సూత్రాన్ని పాటించలేదు. బీసీల కంటే రెడ్లకే ఎక్కువ టిక్కెట్లు ఇచ్చారు. ఆదేమని అడిగితే రెడ్లకు ఇంకా తక్కువయ్యాయని బదులిచ్చారు. అటు కేంద్రంలో కూడా రెడ్ల వైభవానికి కొదువేమీ లేదు. సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవి చేపట్టగా, బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కేంద్ర మంత్రి పదవిలో కొనసాగారు. మర్రి చెన్నారెడ్డి కేంద్ర మంత్రిగా, మూడు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారు. విజయభాస్కర్ రెడ్డి, కె.వి. రఘునాధ్ రెడ్డి, జయపాల్ రెడ్డి లాంటి వారు మంచి శాఖలతో కేంద్ర మంత్రి పదవులు చేపట్టిన వారే. రాజశేఖర్ రెడ్డితో పాటు తమ వర్గానికి చెందిన ముఖ్యమంత్రుల పాలనలో వారి అండదండలు పొంది అపారమైన ఆర్థిక వనరులు రెడ్లు సమకూర్చుకున్నారు. ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ఇంజనీరింగ్ వైద్య కళాశాలల అనుమతులు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో ఆర్థికంగా బలవంతులుగా ఎదిగారు. రెడ్లలో 80% ఆర్థికంగా శక్తివంతులని ఆ వర్గానికి చెందిన ఎంపీ సుఖేందర్ రెడ్డి చెప్పడం గమనార్హం. ఈ ఆర్థిక వనరులతో రాజకీయ పార్టీలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని వారు గుప్పిట్లో ఉంచుకోగలుగుతున్నారు. ముఖ్యమంత్రి పదవి లేకపోవచ్చు కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా రెడ్ల ప్రాభవమే కొనసాగుతున్నది. అన్ని పదవుల్లో వారిదే పెద్దవాటా. తమకు అధికారం రావాలని ఎవరైనా కోరుకోవడంలో తప్పులేదు. కానీ అది తమకే ఉండాలని మరెవ్వరికీ దక్కకూడదని కోరుకోవడం సహేతుకం కాదు. తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో ఈసారి వేరే సామాజిక వర్గానికి అధికారం లభిస్తే, ఇంతగా బాధపడవలసిన అగత్యం లేదు. రాష్ట్ర జనాభాలో ఐదారు శాతం ఉన్న రెడ్లు అన్నీ అనుభవించి కూడా బాధపడితే, ఇప్పటి వరకు అసలే ముఖ్యమంత్రి పదవికి అవకాశం లభించని 80 శాతం ఉన్న బలహీన వర్గాల వారు ఎంతగా బాధపడాలి? ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి అందినట్లే అంది చేజారిపోయింది. అరవై శాతం ఉన్న బీసీలకు ఇంతవరకు ఒక్కసారి కూడా అధికార పగ్గాలు రాలేదు. ఇందుకు కారకులెవరు? కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ఈ వివక్ష పూరిత విధానం ఒక చెడు సాంప్రదాయంగా కొనసాగుతున్నది. అయితే ఈ విషయంలో టీడీపీ పాలనలో కొంత మార్పు కనబడింది. యన్.టి.రామారావు నాయకత్వంలో బలహీనవర్గాలకు గుర్తింపుతో పాటు రాజకీయ సాధికారత లభించింది. తెలంగాణలో నిజాం పాలన నుంచి వేళ్ళు పాతుకు పోయిన ప్యూడల్ వ్యవస్థ సంకెళ్ళను ఆయన తెంచి వేశారు. పటేల్, పట్వారి వ్యవస్థను రద్దు చేసి, బలహీన వర్గాల వారికి విముక్తి కల్పించారు. తాలూకాల స్థానంలో మండల వ్యవస్థను ప్రవేశపెట్టి వారు రాజకీయంగా ఎదిగేందుకు దోహదం చేశారు. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నందున వారికే సమస్యా లేదు. బీసీలకు రిజర్వేషన్లు లేనందువల్ల నామ మాత్రంగా సీట్లిచ్చి గెలవనీయకుండా అడ్డుపడుతున్నారు. తీరా గెలిస్తే మంత్రి పదవులు రానివ్వరు, ఒక వేళ ఇచ్చినా పనికి మాలిన శాఖలు అప్పగిస్తారు. బీసీలలో ఐక్యత రాకుండా విభజించి పాలిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఓట్లు మావి, సీట్లు మీవా? అనే నినాదం బలహీన వర్గాల్లో ఇప్పటికే పుంజుకుంటున్నది. తాము అధికారంలోకి రావాలనే కాంక్ష వారిలో రగులుకుంటున్నది. రెడ్లు, కమ్మ తదితర అగ్రకులాల వారు ఈ పరిమాణాలను గుర్తించవలసిన తరుణం ఆసన్నమైంది. వ్యక్తుల సారథ్యంలో ఏర్పాటైన ప్రాంతీయ పార్టీలు తప్పటడుగులు వేసినా, అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడంలో జాతీయ పార్టీలకు ప్రత్యేక బాధ్యత వుంది. లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. అసలు దాని మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. అప్పుడు కులస్వామ్యం క్రూరంగా పరిహసిస్తుంది.-కె. వేణుగోపాల్‌సీనియర్ జర్నలిస్ట్ | editorial |
11,299 | 28-06-2017 21:34:36 | భారత్, చైనా సరిహద్దును.. సందర్శించనున్న ఆర్మీ చీఫ్ | న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ గురువారం సిక్కిం సరిహద్దును సందర్శించనున్నారు. ఇటీవల అక్కడ ఇండియా, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. భారత్‌లోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని, ఇండో టిబెటన్ జవాన్లు నిలువరించారు. దీంతో ఇరువైపులా కొంత తోపులాట, వాదులాట జరిగింది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో చైనా ప్రవర్తించిన తీరుపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. భారత్, చైనా సరిహద్దులోని ఆర్మీ అధికారులతో ఆయన సమావేశమవుతారు. అక్కడ నెలకొన్న పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షిస్తారు. | nation |
13,154 | 30-11-2017 12:48:05 | వృద్ధదంపతులను హత్య చేసి.. ఆపై ప్రమాదంగా చిత్రీకరించారు.. | మహదేవపుర: వృద్ధదంపతుల ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తుల రూపంలో సన్నిహితులే ప్రవేశించి వారిని దారుణంగా హత మార్చి ఆపై గ్యాస్‌సిలిండర్ నుంచి గ్యాస్ లీక్‌చేసి దహనం చేసేందుకు యత్నించారు. వివరాలివి... అశ్వర్థనగర్‌లో కళామందిర్ వెనుక ప్రాంతంలో నివశిస్తున్న బీఈఎల్ రిటైర్డు ఉద్యోగి గోవిందన్ (62), భార్య సరోజ(61)లను మంగళవారం రాత్రి దుండగులు హతమార్చారు. గ్యాస్‌లీకేజీ కారణంగా స్థానికులు అక్కడికి వచ్చేసరికి దంపతులు మృతి చెందిఉన్నారు. ఈ మేరకు హెచ్‌ఎఎల్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24గంటలలోనే నిందితులను అరెస్టు చేశారు. వైట్‌ఫీల్డ్ డీసీపీ అబ్దుల్ అహద్ బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. నగర పోలీస్‌కమిషనర్ సునీల్‌కుమార్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందులో మనవడు ప్రమోద్, అతడి స్నేహితులు ప్రవీన్, హుసేన్‌ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించడంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారికోసం వెళ్ళిన పోలీసు బృందంపై దాడికి పాల్పడ్డారన్నారు. దాడి సందర్భంగా కానిస్టేబుల్ రవి గాయపడ్డాడు. గాయపడిన కానిస్టేబుల్ రవి, నిందితుడు హుసేన్ పాషాలను మారతహళ్ళి ప్రైవేటు ఆసు పత్రిలో చికిత్సకోసం చేర్పించారు. | nation |
20,349 | 15-07-2017 02:38:36 | సెమీస్‌కా.. ఇంటికా! | భారత్‌కు చావోరేవోకివీస్‌తో ఆఖరి లీగ్ నేడుడెర్బీ: ప్రపంచకప్‌లో తొలి లక్ష్యం ‘సెమీఫైనల్’ అని చెబుతూ వచ్చిన భారత మహిళల జట్టు ఇప్పుడు ఆ బెర్తు కోసం క్వార్టర్‌ఫైనల్ లాంటి పోరుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా.. శనివారం జరిగే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే సెమీస్‌కు చేరుకుంటుంది. లేదంటే కథ కంచికే! ఇప్పటికే.. ఆస్ర్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సెమీస్‌లో ప్రవేశించగా.. ఈ మ్యాచ్ ఫలితంతో మరో బెర్తు ఖరారు కానుంది. దాంతో రెండు జట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరి.. తనకంటే కాస్త మెరుగైన మూడో ర్యాంకర్ కివీస్‌ను భారత్ ఓడించి సెమీస్ చేరుతుందో లేదో చూడాలి. బలహీనతలు వీడితేనే..వాస్తవానికి నాలుగు వరుస విజయాలతో ప్రపంచకప్ వేటను అసాధారణ రీతిలో ఆరంభించిన టీమిండియా.. తర్వాత డీలా పడింది. దక్షిణాఫ్రికాతోపాటు గత మ్యాచ్ లో పటిష్ఠ ఆస్ర్టేలియా చేతిలో ఓడి ఇప్పుడు చావోరేవో అన్న పరిస్థితి తెచ్చుకుంది. బ్రిస్టల్‌లో జరిగిన గత పోరులో పూనమ్ రౌత్ సెంచరీతో కదం తొక్కినా.. మిథాలీ హాఫ్ సెంచరీతో అత్యధిక పరుగులతో వరల్డ్ రికార్డు బద్దలు కొట్టినా.. మన జట్టు గట్టెక్కలేకపోయింది. దూకుడైన బ్యాటింగ్ చేయలేకపోవడమే భారత్ ప్రధాన సమస్య. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్మృతి మంధానా (90, 106 నాటౌట్) ఇన్నింగ్స్‌లు చూసి ట్రెండ్ మారుతోందని అనుకున్నాం. కానీ.. తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో ఆమె విఫలమైంది. ఆసీస్‌తో పోరులో స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మంధాన ఆరంభంలోనే అవుటవడం తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్న మిథా లీ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ప్లేయర్లు మనపై ఒత్తిడి పెంచే అవకాశం ఇచ్చింది. కాబట్టి కివీస్‌తో పోరులో వికెట్ కాపాడుకోవడంతో పాటు వేగంగా ఆడడంపై ప్లేయర్లు దృష్టి పెట్టాలి. ఓపెనర్ మంధాన మళ్లీ ఫామ్‌లోకి రావాలని, రౌత్, మిథాలీ, దీప్తిశర్మ సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ టోర్నీలో పూర్తిగా నిరాశ పరిచింది. ఈ కీలక మ్యాచ్‌లో అయినా ఆమె బ్యాట్ ఝుళిపిం చాల్సిందే. ఇక బౌలింగ్‌లో చూస్తే సీనియర్ పేసర్ జులన్ గోస్వామి పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. దాంతో స్పిన్నర్లు దీప్తి శర్మ, ఏక్తాబిస్త్, హర్మన్‌ప్రీత్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోం ది. కాగా.. ఇంగ్లండ్, పాకిస్థాన్‌పై చెలరేగిపో యిన స్పిన్నర్లు తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. పేలవ ఫీల్డింగ్ కూడా జట్టును వేధిస్తోంది. మనవాళ్లు తొలి మూడు మ్యాచ్‌ల్లోనే ఏకంగా ఎనిమిది క్యాచ్‌లు వదిలేశారు. దక్షిణాఫ్రికాకు కనీసం పది పరుగులు అదనంగా ఇచ్చారు. ఆసీస్‌తో పోరులో అయితే ప్రాథమిక తప్పులూ కనిపించాయి. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చిన్న పొరపాటు చేసినా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది గనుక భారత్ అన్ని విభాగాల్లోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కివీస్‌దీ అదే తీరు..న్యూజిలాండ్‌కూ ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి రెండింటిలో ఓడిన కివీస్ టోర్నీలో ఏడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. సౌతాఫ్రికాతో మ్యాచ్ రద్దయింది. గత పోరులో ఇంగ్లండ్ చేతిలో 75 పరుగుల ఓటమి ఆ జట్టుపై ఒత్తిడి పెంచింది. అయితే, నాణ్యమైన క్రికెటర్లు కివీస్ సొంతం. కెప్టెన్ సుజీ బేట్స్, రాచెల్ ప్రీస్ట్, అమీ సాటర్‌వైట్, సోఫీ డివైన్‌తో ఆ జట్టు బ్యాటింగ్ దుర్భేధ్యంగా ఉంది. పాక్‌పై 41 బంతుల్లోనే 93 పరుగులు చేసిన సోఫీ గాయంతో బాధపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆమె ఆడేది అనుమానమే. న్యూజిలాండ్ స్పిన్నర్లు కూడా టోర్నీ లో అద్భుతంగా రాణిస్తున్నారు. 16 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ అమెలియా కెర్, ఆఫ్ స్పిన్నర్ లీగ్ కాస్పెరెక్ ఇద్దరూ కెప్టెన్ బేట్స్‌కు తురుపు ముక్కలు. అయితే ఐసీసీ ఈవెంట్ ప్రధాన మ్యాచ్‌ల్లో తడబడే కివీస్‌ను భారత్ ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి. రద్దయితే భారత్‌కే మేలుడెర్బీ పిచ్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గడం భారత్‌కు సానుకూలాంశం. కాగా, శనివారం కొద్దిపాటి వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. అది భారత్‌కే లాభం కానుంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే చెరో పాయింట్ వస్తుంది గనుక 9 పాయింట్లతో మన జట్టు నేరుగా సెమీస్ చేరితే, 8 పాయింట్లతో న్యూజిలాండ్ నిష్క్రమించాల్సి ఉంటుంది. | sports |
821 | 11-07-2017 00:02:39 | హెచ్‌పిసిఎల్ రూ.3,200 కోట్ల సమీకరణ | ప్రభుత్వ రంగంలోని ఆయిల్ మార్కెటింగ్ సంస్థ హెచ్‌పిసిఎల్ విదేశీ మార్కెట్లలో 10 సంవత్సరాల కాలపరిమితి గల డాలర్ బాండ్లు జారీ చేయడం ద్వారా 50 కోట్ల డాలర్లు (రూ.3,200 కోట్లు) సమీకరించినట్టు ప్రకటించింది. దేశీయంగా ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులతోపాటుగా భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఆసియా, యూరప్, పశ్చిమాసియా దేశాల ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులు సమీకరించినట్టు ఆ ప్రకటనలో తెలియచేసింది. విదేశీ మార్కెట్లలో హెచ్‌పిసిఎల్ బాం డ్లు జారీ చేయడం ఇదే ప్రథమం. 2027 జూలై 12వ తేదీన మెచ్యూరిటీ అయ్యే ఈ బాండ్లకు నాలుగు శాతం వడ్డీ ఇస్తున్నట్టు తెలిపింది. అమెరికన్ ట్రెజరీ బాండ్లు ఇస్తున్న రాబడులకన్నా ఇది 167.5 బేసిస్ పాయింట్లు అధికం. వీటిని సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజిలో లిస్టింగ్ చేస్తారని హెచ్‌పిసిఎల్ సిఎండి ముకేశ్ కుమార్ సురానా తెలిపారు. ఈ ఇష్యూ 6 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయిందని, హెచ్‌పిసిఎల్‌పై ఇన్వెస్టర్లలో గల విశ్వాసానికి ఇది దర్పణమని ఆయన చెప్పారు. | business |
3,548 | 01-01-2017 23:02:31 | ఆవిష్కరణలు - పరిచయాలు |
- ఛాయ | editorial |
19,960 | 08-04-2017 04:20:33 | దడపుట్టిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ | బౌలింగ్ బలంగా ఉన్న జట్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఒకటి. పేసర్ జహీర్ ఖాన్‌కు అండగా ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి ఉన్నారు. క్రిస్ మోరిస్, అమిత మిశ్రాలతో పాటు రబాడ చేరికతో బ్యాట్స్‌మెన్‌కు కష్టకాలమే. అంతేకాకుండా యువ ఆటగాళ్ల చేరికతో ఢిల్లీ మరింత బలోపేతమైంది. కరుణ్ నాయర్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత, ఆదిత్య తారె కూడా మెరుపులు మెరిపించగల సమర్థులు. ఇక కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఉండనే ఉన్నాడు. ఇన్ని సానుకూలతలు ఉన్న ఢిల్లీని ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. డుమిని, డికాక్ గైర్హాజరీలో యువ ఆటగాళ్లు సత్తాచాటాలి. మరోవైపు బెంగళూరు గాయాలతో విలవిల్లాడుతోంది. కోహ్లీ, డివిల్లీర్స్, లోకేష్ రాహుల్, సర్ఫ్‌రాజ్ ఖాన్‌లు లేకపోవడం చాలెంజర్స్‌కు పెద్ద దెబ్బే. శనివారం ఢిల్లీతో బెంగళూరు తలపడనుంది. గేల్, వాట్సన్‌పైనే ఆ జట్టు ప్రధానంగా ఆధారపడింది. వీరిద్దరూ విఫలమవుతుండడం ఆందోళన కలిగించే అంశం. స్టార్ బ్యాట్స్‌మన్ లేని సమయంలో కేదార్ జాదవ్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. సన్‌రైజర్స్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమైన బెంగళూరు.. రెండో మ్యాచ్‌లో సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. ఆరంభంలోనే డీలా పడితే.. కోహ్లీ, డివిల్లీర్స్ వచ్చినా జట్టులో ఉత్సాహం నింపలేరు. మరోవైపు ఢిల్లీ మాత్రం ప్రత్యర్థిని వేటాడాలనే కసితో ఉంది. -(టీసీఎమ్) | sports |
1,706 | 27-04-2017 23:26:34 | నోట్ల రద్దు నుంచి కోలుకున్న సిమెంట్ రంగం | హైదరాబాద్‌లో 27 శాతం పెరిగిన ధర న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి సిమెంట్ రంగం బయట పడింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సిమెంట్ ధర దాదాపుగా పెద్ద నోట్ల రద్దుకు ముందున్న స్థాయికి చేరింది. దేశీయ రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ రేటింగ్ సంస్థ పేర్కొంది. హైదరాబాద్ మార్కెట్‌లో సిమెంట్ ధర పెరుగుదల మరింత ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ మార్కెట్‌లో ఏప్రిల్ నెలలో బస్తా (50 కిలోలు) సిమెంట్ ధర రూ.60 (27 శాతం) పెరిగి రూ.325-330కి చేరిందని పేర్కొంది. నిజానికి ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో పలు కంపెనీల సిమెంట్ బస్తా ధర రూ.370 వరకు పలుకుతోంది. పెద్ద నోట్ల రద్దుతో గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు అహ్మదాబాద్ మార్కెట్‌లో సిమెంట్ ధర 17 శాతం తగ్గింది. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి 19 శాతం పెరిగి ప్రస్తుతం బస్తా ధర రూ.265 పలుకుతోందని ఇక్రా నివేదిక తెలిపింది. దేశ తూర్పు ప్రాంతంలో మాత్రం ధరల పెరుగుదల ఆరు శాతం మాత్రమే ఉంది. తగ్గిన వినియోగం: ధరలు కోలుకున్నా పెద్ద నోట్ల రద్దు దేశంలో సిమెంట్ వినియోగాన్ని తగ్గించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో వినియోగం 25.5 కోట్ల టన్నులకు తగ్గించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు ఒక శాతం తక్కువని ఇక్రా పేర్కొంది. | business |
10,870 | 06-09-2017 14:48:49 | విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీలో హీరోయిన్ ఎవరో తెలుసా? | అంతకు ముందు విజయ్ దేవరకొండ సినిమాలు ఎన్ని వచ్చినా.. అర్జున్ రెడ్డి ఇచ్చిన స్టార్ డమ్ ఏ సినిమా ఇవ్వలేదు. ఆ సినిమా ఎంత వివాదాస్పదమయ్యిందో అంత ఫేమస్ అయ్యారు హీరో హీరోయిన్లు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? దానిలో హీరోయిన్ ఎవరు? ఈ విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్. పరశురామ్ డైరెక్షన్‌లో.. గీతా ఆర్ట్ బ్యానర్‌లో విజయ్ ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ విజయ్ సరసన కన్నడ నటి రష్మిక మందన్న నటిస్తోంది. ముందుగా లావణ్య త్రిపాఠిని హీరోయిన్‌గా అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ప్లేస్‌లో రష్మిక తెరపైకి వచ్చింది. | entertainment |
7,981 | 04-05-2017 14:14:28 | ప్రభాస్‌కు ఆరు వేల పెళ్లి ప్రతిపాదనలు! | బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. నిజానికి పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. అయితే బాహుబలి ప్రాజెక్టుకు ఐదేళ్ల సమయం కేటాయించాల్సి రావడంతో పెళ్లిని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాడు. ఈ సమయంలో ప్రభాస్‌కు దాదాపు 6 వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయట. అయితే బాహుబలి మీద ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో వీటన్నింటినీ ప్రభాస్ తిరస్కరించాడని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఇదే కాకుండా ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా బయటపెట్టింది. బాహుబలి షూటింగ్‌లో ఉన్న సమయంలోనే తమ బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఉంటే పది కోట్ల రూపాయలు ఇస్తామని ఓ సంస్థ ఆఫర్ చేసిందట. అయితే పూర్తి దృష్టి బాహుబలి మీదే పెట్టాలనే ఉద్దేశంతో ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడట ప్రభాస్. అంతేకాదు ఆ సమయంలో వచ్చిన కొన్ని బాలీవుడ్ సినిమా ఆఫర్లను కూడా వదులుకున్నాడట. బాహుబలి సినిమా కోసమే ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్.. దాదాపు 600 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాడట. | entertainment |
2,874 | 13-02-2017 01:09:30 | అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు 12వ స్థానం | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జిఎంఆర్ నిర్వహణలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచంలో అత్యంత ప్రయాణికుల రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో 12వ స్థానాన్ని సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసిఎఒ) తాజాగా వెలువరించిన నివేదిక ప్రకారం నవంబర్ నెలలో ఢిల్లీ విమానాశ్రయం ఈ ఘనతను సాధించింది. ప్రపంచంలోని టాప్ 15 విమానాశ్రయాల్లో భారతకు చెందిన ఒక ఎయిర్‌పోర్ట్‌కు స్థానం దక్కడం ఇదే మొదటిసారి. కాగా నవంబర్ నెలలో ఢిల్లీ విమానాశ్రయం 19.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకోవడం విశేషం. ఇదే నెలలో 5 కోట్ల ప్రయాణికుల మైలురాయిని అధిగమించడం మరో విశేషమని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సిఇఒ ఐ ప్రభాకర రావు తెలిపారు. 5.56 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా రాకపోకలు సాగించారని, దేశీయ విమానాశ్రయాల్లో ఇదే అత్యధికమని ఆయన పేర్కొన్నారు. | business |
16,263 | 19-03-2017 20:13:40 | ఆర్కేనగర్ పోటీకి ఆ మూడు పార్టీలు దూరం | చెన్నై: ప్రతిష్ఠాత్మక ఆర్.కె.నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయరాదని భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), విడుదలై చిరుతైగళ్ కట్చి (వీసీకే), మరుమలర్చి ద్రవిడ మున్నేట కళగం (ఎండీఎంకే) పార్టీలు నిర్ణయించాయి. ఎన్నికలను సామూహికంగా బహిష్కరించాలని తాము నిర్ణయించినట్టు ఎండీఎంకే అధినేత వైగో తెలిపారు. ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం కూడా చేసేదిలేదన్నారు. దీంతో ప్రధానంగా నాలుగు పార్టీల మధ్యే ఆర్కేనగర్‌లో పోటీ నెలకొంది. బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు జయలలిత మేనకోడలు దీప జయకుమార్ స్థాపించిన ఎంజీఆర్ అమ్మ దీపా పెరవైల మధ్యే పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా సంగీత దర్శకుడు, గీతరచయిత గంగై అమరన్, అన్నాడీఎంకే పన్నీర్ సెల్వం వర్గం తరఫున ఆ పార్టీ సీనియర్ నేత ఇ.మధుసూదనన్, అన్నాడీఎంకే శశికళ వర్గం తరఫున శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ పోటీ పడుతున్నారు. మరుదు గణేష్‌ను తమ పార్టీ అభ్యర్థిగా డీఎంకే ప్రకటించింది. ఏప్రిల్ 12న ఉపఎన్నిక పోలింగ్ జరగనుండగా, 15న ఫలితాలు ప్రకటిస్తారు. | nation |
629 | 30-11-2017 01:22:44 | బంధం మరింత బలపడింది! | ఎయిర్‌ఫ్రాన్స్‌తో భాగస్వామ్యాన్ని విస్తృతపర్చుకున్న జెట్‌ముంబై: దేశీయ ప్రైవేట్ విమాన రంగంలో రెండో అతిపెద్ద సంస్థ జెట్‌ఎయిర్‌వేస్.. ఎయిర్‌ఫ్రాన్స్-కెఎల్‌ఎంతో భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ఇరు సంస్థల మధ్య పరస్పర సహకారంతోపాటు ప్రస్తుత కోడ్ షేరింగ్‌ను మరింత పెంచుకునేలా జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్‌ఫ్రాన్స్‌లు ఒప్పందాన్ని మెరుగుపర్చుకున్నాయి. తొలుత 2014లో ఈ రెండు కంపెనీల మధ్య జట్టు కుదిరింది. 2016లో భాగస్వామ్య పరిధిని పెంచుకున్న సంస్థలు తాజాగా మరింతగా సహకరించుకోవాలని అవగాహనకు వచ్చాయి. తద్వారా ఈ రెండు ఎయిర్‌లైన్స్ కలిసి దేశంలో 44, యూర్‌పలో 106 నగరాలకు విమానాలను నడపనున్నాయి. ఇరు సంస్థల గ్లోబల్ నెట్‌వర్క్‌లో మరింత మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు వీలుగా ఎయిర్‌ఫ్రాన్స్‌తో భాగస్వామ్య పరిధిని పెంచుకొన్నామని జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేష్ గోయల్ ఈ సందర్భంగా అన్నారు. జెట్ తన సిల్వర్ జూబ్లీ (25వ సంవత్సర) ఉత్సవాలను జరుపుకుంటున్నది. ఎయిర్‌ఫ్రాన్స్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి 70 ఏళ్లయింది. ఈ తరుణంలో ఇరు సంస్థలు తమ మధ్య బంధాన్ని మరింత బలపర్చుకోవడం విశేషం. ఎయిర్‌ఫ్రాన్స్-కెఎల్‌ఎంతో భాగస్వామ్యాన్ని విస్తృతపరుచుకున్న నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్లో జెట్ ఎయిర్‌వేస్ షేర్లు ఒక దశలో 2 శాతంపైగా పెరిగాయి. బిఎ్‌సఇలో ట్రేడింగ్ ముగిసేసరికి సంస్థ షేరు ధర 1.89 శాతం లాభంతో రూ.669.05 వద్దకు చేరుకుంది. | business |
11,165 | 14-10-2017 09:54:15 | ఇద్దరు ఉగ్రవాదుల హతం |
శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భద్రతా దళాలు ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను శనివారం ఉదయం మట్టుబెట్టాయి. ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం నిర్దిష్ట సమాచారం మేరకు పుల్వామాలోని లిట్టర్ గ్రామానికి భద్రతా దళాలు శనివారం తెల్లవారుజామున వెళ్ళాయి. ఉగ్రవాదులు తమను సమీపిస్తున్న భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించాయి. అనంతరం భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా కమాండర్లు వసీం షా, హఫీజ్ నిసార్ హతమయ్యారు. | nation |
18,589 | 23-12-2017 17:14:40 | దాణా మేత సాగిందిలా... | రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి..రెండు దశాబ్దాల పాటు సాగిన దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్టకేలకు దోషిగా తేలారు. ఈమేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునివ్వడంతో ఆయనను రాంచీలోని బిర్సాముందా జైలుకు తరలించారు. లాలూతో పాటు 15 మందిని దోషులుగా పేర్కొన్న కోర్టు జనవరి 3న శిక్ష ఖరారు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి చూస్తే... -లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సీఎంగా ఉన్నప్పుడు 1996లో పశుసంవర్ధక శాఖలో పశుదాణా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.900 కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.-1996లోనే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. మొత్తం ఐదు కేసులు నమోదు చేసింది.-ప్రస్తుత కేసు 84.5 లక్షల రూపాయల ప్రజా దనం దుర్వినియోగానికి సంబంధించినది.-1994-1996 కాలంలో ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉన్న దియోగఢ్ ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలు అక్రమంగా డ్రా చేసినట్టు లాలూ సహా 34 మందిపై సీబీఐ 1997 అక్టోబర్ 27న ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో లాలూతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా పేరు కూడా ఉంది.-ఈ కేసు విచారణ సమయంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారారు.-పశుదాణా కుంభకోణానికి సంబంధించి చియబస ట్రెజరీ నుంచి రూ.37.5 కోట్లు నగదు అక్రమంగా డ్రా చేసిన కేసులో 2013 అక్టోబర్ 3న సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్‌కు 5 సంవత్సరాలు జైలుశిక్ష విధించింది.-సీబీఐ కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 11 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడయ్యారు.-ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులు డ్రా చేసిన కేసులో కోర్టు తీర్పుతో లాలూ కొద్దికాలం జైళ్లో గడిపారు.-2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో లాలూ బయటకు వచ్చారు. -2014లో జార్ఖండ్ హైకోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరటనిచ్చింది. నేరపూరిత కుట్ర, విశ్వాసఘాతుకం వంటి ఆరోపణలను ఉపసంహరించింది. ఒక కేసులో అప్పటికే శిక్ష పడిన వ్యక్తిపై అవే ఆధారులు, అవే సాక్ష్యాలతో విచారించడం సరికాదని హైకోర్టు తెలిపింది.-హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాణా కుంభకోణంలో అభియోగాలన్నింటిపైనా లాలూ వివరణ ఇవ్వాల్సిందేనని సీబీఐ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. లాలూను ఇతర కేసుల్లో విచారించాలంటూ 2017 మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది.-దీంతో సీబీఐ న్యాయస్థానం ప్రస్తుత కేసు విచారణను ముమ్మరం చేసి ఈనెల 13వ తేదీతో వాదనలు పూర్తిచేసింది. -తీర్పును రిజర్వ్ చేసిన రాంచీ కోర్టు శనివారం లాలూను లాలూను దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. జనవరి 3న శిక్షాకాలాన్ని ఖరారు చేయనుంది. | nation |
1,223 | 17-11-2017 23:47:56 | తక్షణమే సబ్‌స్ర్కైబర్ల వివరాలివ్వండి : ఆర్‌కామ్‌కు ట్రాయ్ ఆదేశం | న్యూఢిల్లీ: తక్షణమే మొబైల్ కస్టమర్ల వివరాలు తెలియజేయాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)ను టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. అంతేకాకుండా ప్రీ పెయిడ్ కస్టమర్లు వాడకుండా ఉన్న బ్యాలెన్స్ వివరాలను జనవరి 10 నాటికి ఇవ్వాలని కూడా పేర్కొంది. ఎంత మంది కస్టమర్లు ఇతర టెలికాం సంస్థలకు మారిపోయారు, ఎంత మంది మారడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కూడా తెలియజేయాలని ఆర్‌కామ్‌ను ట్రాయ్ కోరింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఆర్‌కామ్ తన వాయిస్ కాల్ సర్వీసులను నిలిపివేయనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరినాటికి ఆర్‌కామ్ కస్టమర్లు ఇతర టెలికాం కంపెనీలకు మారే అవకాశం ఉంటుంది. | business |
2,363 | 09-03-2017 16:44:29 | ఆఫర్లు బాబు.. ఆఫర్లు.. విమానయాన సంస్థల హోలీ స్పెషల్! | న్యూఢిల్లీ: రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని పలు విమానయాన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాతోపాటు ప్రైవేటు సంస్థలైన ఎయిర్ ఏషియా, ఇండిగో, స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్ వంటి సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. ఎయిరిండియా తన టికెట్ ప్రాథమిక ధరపై ఎకానమీ క్లాస్‌లో పదిశాతం, బిజినెస్ క్లాస్‌లో 20 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. జెట్ ఎయిర్‌వేస్ తన డొమెస్టిక్ సర్వీసుల్లో రూ.1,330 ప్రారంభ ధరతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అయితే ప్రయాణానికి కనీసం 20 రోజుల ముందు బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిర్ ఏషియా కూడా రూ.1,499తో ఇటువంటి ఆఫర్‌నే తీసుకొచ్చింది. విమానయాన సంస్థలు పోటీ పడి మరీ ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిందని, జనవరిలో డొమెస్టిక్ ప్రయాణికుల సంఖ్య 25 శాతానికి పైగా పెరిగినట్టు డీజీసీఏ గణాంకాలు చెబుతున్నాయి. | business |
4,183 | 25-06-2017 00:02:04 | కులమా? గుణమా? | ఒకప్పుడు అధికారంలో ఉన్నవారు కులసంఘాలు ఏర్పాటుచేసే సమావేశాలకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందినవారే తమ హక్కుల రక్షణకోసం కుల సంఘాలు ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పుడు అన్ని వర్ణాల వారూ కులసంఘాలు పెట్టుకుని నిస్సంకోచంగా ‘మా కులం’ అని చెప్పుకొంటున్నారు. ఈ సంఘాల నాయకులు అందరూ తమవారి హక్కుల కోసం కాకుండా స్వీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు చేస్తుంటారు. ఈదేశంలో దళితులకు మహర్దశ పట్టిందా? ఏమో! రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీల హడావుడి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంపిక చేసినప్పుడు... దళితుడికి అత్యున్నత గౌరవం దక్కిస్తున్నామని ప్రచారం చేశారు. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, చంద్రబాబు కూడా తమ సూచన మేరకే దళితుడిని అభ్యర్థిగా ఎంపిక చేశారని ప్రచారం చేసుకున్నారు. నిజానికి రామ్‌నాథ్ కోవింద్ పేరు ఈ దేశ ప్రజలకు, ముఖ్యంగా దక్షిణాదివారికి పెద్దగా తెలియదు. అయినా నరేంద్ర మోదీ తన రాజకీయ వ్యూహంలో భాగంగా కోవింద్‌ను ఎంపికచేశారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ఒక దళితుడికి అత్యున్నత గౌరవం దక్కిస్తున్నామన్నంతగా బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. చివరకు ఆ ప్రచారం మోతాదు మించడంతో స్వరం మార్చుకుని కోవింద్ దళితుడు మాత్రమే కాదు- గొప్ప మేధావి అని కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి పదవికి దళిత అభ్యర్థిని ఎంపిక చేయడంతో వ్యతిరేకించడానికి ఇబ్బందిపడిన ప్రతిపక్షాలు సుదీర్ఘ సమాలోచనలు జరిపి తమ తరఫున మరో దళిత అభ్యర్థి మీరా కుమార్ పేరును ప్రకటించాయి. మొత్తానికి దళితుల పట్ల తమకు మాత్రమే అపార ప్రేమాభిమానాలు ఉన్నాయని అన్ని పార్టీలు చాటింపు వేసుకున్నాయి. ఈ హడావుడి చూస్తుంటే నరేంద్ర మోదీ పుణ్యమా అని దేశంలో మొదటిసారిగా ఒక దళితుడు రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిని అందుకోబోతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. కె.ఆర్. నారాయణన్ వంటి దళిత మేధావి గతంలోనే రాష్ట్రపతి పదవిని అలంకరించిన విషయాన్ని మరపింప చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను దళితుడిగా ఎంపిక చేయలేదు. ఆయనకు ఉన్న మేథస్సును బట్టి ఆ అవకాశం కల్పించారు. బహుశా అందుకే కాబోలు అప్పుడు అధికారంలో ఉన్నవారు దళిత కార్డును వాడుకోలేదు. నిజానికి అలా వాడుకోవలసిన అవసరం కూడా నాటి నాయకులకు లేదు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి దళిత వ్యతిరేక పార్టీ అన్న ముద్ర ఉంది. దీనికి తోడు బీఫ్ అమ్మకాలపై ఆంక్షలు విధించడంతో దళితులు ఆ పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ఈ అప్రతిష్ఠ నుంచి గట్టెక్కడానికి ప్రధాని మోదీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికను ఉపయోగించుకుని దళితవర్గానికి చెందిన కోవింద్‌ను ఎంపికచేసి ఉంటారు. రాజకీయ పార్టీలకు వాటి ప్రయోజనాలే ముఖ్యం కనుక నిర్ణయాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ దేశంలోని రాజకీయపార్టీలన్నీ దళితులంటే పడిచస్తున్నట్లు కనిపిస్తాయి. అయినా, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తి అవుతున్నా ఇప్పటికీ దళితులు చచ్చి బతుకుతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లగానీ, ఆయా ప్రభుత్వాలు కల్పించిన ప్రయోజనాల వల్లగానీ కొద్దిమంది దళితులే లబ్ధిపొందారు, అభివృద్ధిలోకి వచ్చారు. రిజర్వేషన్‌ల వంటి సౌకర్యాల వల్ల పైకి వచ్చిన దళిత కుటుంబాలకు చెందిన వారి పిల్లలే మళ్లీ మళ్లీ అవే ప్రయోజనాలు పొందుతున్నారు గానీ అట్టడుగున ఉన్నవారి జీవితాలు మాత్రం మారడంలేదు. రిజర్వేషన్ల ఫలాలు అందుకుంటున్న వారిలో అత్యధికులు ఉన్నత కులాలకు చెందిన వారితో వియ్యం అందుకుంటూ తమ జాతికి దూరం అవుతున్నారు. రాజకీయపార్టీలే కాకుండా దళితులలో పైకి వచ్చినవారు కూడా అవసరం వచ్చినప్పుడు దళిత కార్డు వాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్నే తీసుకుందాం! ఈ చట్టాన్ని దళితులలోని ఒక వర్గం దుర్వినియోగం చేస్తుండగా, గ్రామాలలో నిజంగా అవమానించబడుతున్న దళితులకు మాత్రం ఈ చట్టం అక్కరకు రావడం లేదు. ఆ చట్టం ద్వారా రక్షణ పొందవచ్చునన్న విషయం కూడా వారికి తెలియదు. రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయినంత మాత్రాన దళితుల జీవితాలు మారిపోతాయా... అంటే లేదనే చెప్పాలి. అలా అనుకుంటే వారి జీవితాలు ఎప్పుడో బాగుపడి ఉండాల్సింది. కాకపోతే కోవింద్ దళితుడు కాకపోయి ఉంటే ఇప్పుడు ఆయనకు ఆ గౌరవం కూడా దక్కి ఉండేది కాదు. కులం కలకలందళితులేకాదు.. మనదేశంలో ఇటీవలి కాలంలో కులానికి ప్రాధాన్యం పెరిగింది. పెరుగుతోంది. అటు రాజకీయ నాయకులు, ఇటు కుల సంఘాల నాయకులు తమ ప్రయోజనాల కోసం కులం కార్డులను విచ్చలవిడిగా వాడటంతో కులాలకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. తెలుగు రాష్ర్టాలలో కులాల ప్రాధాన్యం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితి ఒకటైతే, తెలంగాణలో పరిస్థితి మరోలా ఉంది. బీసీలను ఆకట్టుకునే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా కులాల వారీగా పథకాలు ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి దీనివల్ల రాజకీయ ప్రయోజనం కలగవచ్చుగానీ భవిష్యత్తులో డిమాండ్‌లు పెరుగుతాయి. అర్హతలను బట్టి కాకుండా కుల ప్రాతిపదికగా ప్రయోజనాలు కల్పించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకోసం ఆయా కులాల నుంచి నాయకులు పుట్టుకువస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఎంతో మంది నాయకులుగా ఎదిగారు. ఇలా ఎదిగిన వారిలో మున్నూరు కాపు, గౌడ, యాదవ కులాలకు చెందినవారే ఎక్కువగా కనిపిస్తారు. బీసీలలో అత్యంత వెనుకబడి, సంఖ్యాపరంగా తక్కువ ఉన్న వర్గాలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ముఖ్యం కనుక అలాగే జరుగుతుంది. ఏపీ విషయానికి వస్తే అక్కడ అగ్రవర్ణాలైన రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు రాజకీయ పార్టీల ప్రాతిపదికగా కత్తులు దూసుకుంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే చాలు- మా కడుపు నిండినట్టేనని కమ్మ సామాజిక వర్గం వారు భావిస్తుండగా, ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న బాధ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉందో తెలియదుగానీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు అధికారం పోయిందని కుతకుతలాడిపోతున్నారు. ఈ కులాభిమానం కాస్తా కులద్వేషంగా మారిపోయింది. దీంతో సోషల్ మీడియాలో కులప్రాతిపదికన గ్రూపులు ఏర్పడి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాము అభిమానించే నాయకుల పట్ల ఉన్న ప్రేమకొద్దీ అవతలి వారిపై విషం కక్కుతూ ప్రచారం చేస్తున్నారు. ఫలానా కులంవాడు ముఖ్యమంత్రి అయితే ఆ కులానికి చెందిన కొంతమంది బాగుపడవచ్చునుగానీ, ఆ కులంవారి అందరి జీవితాలు మారిపోవు. తెలుగుదేశం పార్టీ చాలా సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారంలో ఉంది. అయినా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారందరూ బాగుపడలేదే? అలాగే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు కూడా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నారు. అయినా రెడ్డి సామాజికవర్గంలో ఇప్పటికీ ఎంతోమంది పేదలుగా ఉన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వారు ఉన్నారు. అంటే కులం ఎవరికి ఉపయోగపడుతుందో అర్థంకావడం లేదా? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టుగా కులం పేరు చెప్పుకొని నాయకులు ప్రయోజనం పొందుతారేకానీ జనం కాదు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అమెరికాలో ఉండే కమ్మ సామాజిక వర్గంవారు సంబరం చేసుకున్నారు. ఎన్నికలలో జగన్మోహన్‌రెడ్డి ఓడిపోతే అమెరికాలో ఉన్న రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు విలవిలలాడిపోయారు. నిజానికి అమెరికాలో ఉంటున్న వారెవ్వరికీ చంద్రబాబు వల్లగానీ, జగన్మోహన్‌రెడ్డి వల్లగానీ పైసా ప్రయోజనం కలగదు. హెచ్చులకు పోయి డబ్బు ఖర్చుచేయడం మినహా ఒరిగేది ఏమీ ఉండదు. ఒకప్పుడు అధికారంలో ఉన్నవారు కులసంఘాలు ఏర్పాటు చేసే సమావేశాలకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందినవారే తమ హక్కుల రక్షణ కోసం కుల సంఘాలు ఏర్పాటు చేసుకునేవారు. సమాజంలో అగ్రవర్ణాలుగా చెలామణి అవుతున్న వర్గాలకు చెందిన వారికి కులసంఘాలు ఉండేవి కావు. ఇప్పుడు అన్ని వర్ణాల వారూ కులసంఘాలు పెట్టుకుని నిస్సంకోచంగా ‘మా కులం’ అని చెప్పుకొంటున్నారు. ఈ సంఘాల నాయకులు అందరూ తమవారి హక్కుల కోసం కాకుండా స్వీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు చేస్తుంటారు. చిన్న రాష్ర్టాల వల్ల ప్రయోజనాలతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయని ఇప్పుడు తెలుగునాట జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కులాలకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. సీమాంధ్రలో ఉన్న కులతత్వం రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపేది కాదు. హైదరాబాద్ రాజధానిగా ఉన్నందున ఆ గొడవలు అక్కడికే పరిమితం అయ్యేవి. ఇప్పుడు అలా కాదు. అధికారంలో ఉన్నవారు కులాల మధ్య సమన్వయం చేసుకోవలసి ఉంటున్నది. అవసరాలను బట్టి కాకుండా కులాలను బట్టి సంతృప్తి కలిగించే నిర్ణయాలు తీసుకోవలసి ఉంటోంది. తెలుగు రాష్ర్టాలు అనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కులాల కుంపట్లు నానాటికీ రాజుకుంటున్నాయి. కులాలు, వాటి వెనుక ఉన్న బలగం ఆధారంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటున్నాయి. మతాలను సంతృప్తిపరిచే రోజులతోపాటు, కులాలను సంతృప్తిపరచవలసిన రోజులు కూడా వచ్చాయి. మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ప్రాణమిస్తామని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ ఏలుబడిలో పేద ముస్లింల జీవితాలు బాగుపడలేదు. ఇవ్వాళ్టికీ ముస్లింలలో దారుణమైన పేదరికం ఉంది. ఇందుకు కారణం అధికారంలో ఉన్నవారు ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతూ పేదలను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయకపోవడమే! హిందూ ముస్లింలుగా దేశాన్ని విడగొట్టడానికి అధికార-ప్రతిపక్షాలు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాయి. సెక్యులరిజం పేరిట కాంగ్రెస్ అండ్ కో ముస్లింలను అతిగా సంతృప్తి పరుస్తున్నదని హిందువులలో మెజారిటీవర్గం భావిస్తోంది. దీంతో వారు భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను అణచివేస్తున్నారని ముస్లింలు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఈ దేశం తమది కాదన్న భావన ముస్లింలలో ఏర్పడుతోంది. వారం రోజుల క్రితం ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడిన ఇండియా- పాక్ మ్యాచ్‌ను దేశప్రజలందరూ ఆసక్తిగా తిలకించారు. ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఇండియా చిత్తుగా ఓడిపోవడంతో కొన్ని ప్రాంతాలలో మసీదులలోనే కాకుండా ఇళ్లల్లో సైతం ముస్లింలు సంబరాలు చేసుకున్నారు. పాకిస్థాన్ గెలిచినందుకు డ్యాన్సులు చేశారు. ఇలాంటి చర్యల వల్ల హిందూ- ముస్లింల మధ్య అంతరం నానాటికి పెరుగుతోంది. బీజేపీ నాయకులు ఇలాంటి చర్యలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. పాకిస్థాన్ గెలిస్తే ఇండియాలోని ముస్లింలకు ఒరిగేది ఏమి ఉండదు. అయినా వారిలో అలాంటి భావాలు ఏర్పడటానికి రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలే కారణం. కులాల విషయంలో కూడా మున్ముందు ఇదే పరిస్థితి తలెత్తుతుంది. సమాజంలో అవమానాలకు గురవుతూ అణచివేయబడిన దళితులకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్‌లు కల్పించడానికి, ఇతర ప్రయోజనాలు ఇవ్వడానికి ఇతర వర్గాలవారు మొదట్లో వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఆ నిర్ణయాలు అవసరాన్ని గుర్తించి తీసుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు కనుక! ఇప్పుడు ఇంకెన్నేళ్లు రిజర్వేషన్‌లు అన్న స్వరాలు వినబడటానికి కూడా పాలకుల వైఖరే కారణం. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావలసిన హక్కులను, ప్రయోజనాలను అందించడంలో కూడా ప్రచారం పొందడానికి ప్రయత్నించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఎవరికి వారు ఫలానా కులానికి, వర్గానికి, మతానికి తాము చాంపియన్‌లమని ప్రచారం చేసుకోవడం వల్ల సమాజంలో ఆయా వర్గాల మధ్య విద్వేష బీజాలు పడుతున్నాయి. బిహార్ గవర్నర్‌గా ఉండిన రామ్‌నాథ్ కోవింద్‌ను అర్హతలను బట్టి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశామని చెప్పకుండా... దళితుడిని రాష్ట్రపతిని చేస్తామంటే మద్దతు ఇవ్వరా? అని ప్రశ్నించడంతోనే తంటా అంతా వస్తోంది. దీంతో మాకూ ఒక దళిత నాయకురాలు ఉన్నారంటూ మీరా కుమార్‌ను కాంగ్రెస్ అండ్ కో పోటీకి నిలుపుతున్నాయి. అభ్యర్థి ఏ వర్గానికి చెందిన వారైనా రాష్ట్రపతిగా ఎన్నికైతే మొత్తం దేశానికే రాష్ట్రపతి అవుతారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉంటారు. అలాంటి అత్యున్నత పదవిని చేపట్టబోయే అభ్యర్థులను కులదృష్టితో చూడటం, కులముద్ర వేయడం ఎంతవరకు ఔచిత్యమో రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఆయా పదవులు చేపడుతున్న వారు దేశప్రజల విశాల ప్రయోజనాలను కాపాడతారా? లేదా? అని కాకుండా కులదృష్టితో చూసే వైఖరికి స్వస్తి చెప్పాలి. రాజకీయ చదరంగంలో రైతుదళితులు, ముస్లింల తరహాలోనే ఇప్పుడు రైతులు కూడా ఈ దేశంలో రాజకీయ ప్రయోజనాల చదరంగంలో పావులుగా మారుతున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ర్టాలలో అధికారంలో ఉన్న పార్టీలు రుణమాఫీ విషయంలో పోటీపడుతున్నాయి. ముందుగా తెలుగు రాష్ర్టాలలో అధికారం కోసం ఇద్దరు చంద్రులు రుణమాఫీ ప్రకటించారు. అప్పుడు ఈ విషయాన్ని వ్యతిరేకించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సందర్భంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఇతర రాష్ర్టాలలో కూడా రుణమాఫీ కోసం రైతు పోరాటాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో మొదలైన పోరాటం ఇతర రాష్ర్టాలకు విస్తరించింది. త్వరలో ఎన్నికలు జరుగనున్నందున కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ కూడా రైతులకు రుణమాఫీ ప్రకటించింది. దేశంలో ప్రభుత్వ విధానాల వల్ల దగాపడుతున్న వారిలో రైతులు ముందు వరుసలో ఉంటారు. స్వాభిమానంతో బతికే రైతులను ప్రభుత్వాలపై ఆధారపడేలా చేశారు. ఓట్ల అవసరం వచ్చినప్పుడు రుణమాఫీలు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు తాత్కాలిక ప్రయోజనం చేకూరుతున్నదేగానీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. రైతులకు రుణమాఫీ చేయాలనడం ఫ్యాషన్ అయిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించినందుకు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అధికారంలో ఉన్నారు కనుక వెంకయ్య నాయుడు విమర్శలను ఎదుర్కోవలసిందే. తెలుగు రాష్ర్టాల విషయమే తీసుకుందాం. రుణమాఫీ తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. అంటే రుణమాఫీ వల్ల సమస్య శాశ్వతంగా పరిష్కారం కావడం లేదనేగా! నిజానికి వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వల్ల పంటల దిగుబడి పెరిగింది. అదే సమయంలో పెట్టుబడులు కూడా పెరిగాయి. దీంతో దిగుబడులు పెరిగినప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లభించక, అయిన కాడికి అమ్ముకోవలసిన పరిస్థితి. ఫలితంగా వ్యవసాయంపై ఫలసాయం రాకపోగా పెట్టుబడి కోసం చేసిన అప్పులు పేరుకుపోతున్నాయి. రైతుల గురించి నోరుపట్టనంతగా ప్రేమను కురిపించే రాజకీయ పార్టీలు వ్యవసాయరంగానికి సంబంధించి శాశ్వత విధానాలను ఇంతవరకు రూపొందించలేదు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంటుంది? ఏ పంట వేస్తే ఎంత ధర వచ్చే అవకాశం ఉంది? అనే విషయం చెప్పే విధానమే లేదు. దీంతో గత ఏడాది మిర్చి పంటకు అధిక ధర పలికినందున రెండు తెలుగు రాష్ర్టాల రైతులు మిర్చివైపు మొగ్గుచూపారు. ఫలితంగా దిగుబడులు పెరిగి మిర్చి ధర దారుణంగా పడిపోయింది. గత ఏడాది పత్తి ధర పడిపోయిందని ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తి వైపు చూడలేదు. దీంతో ఈ ఏడాది పత్తి ధర బాగా పలికింది. వ్యవసాయ ఉత్పత్తులపై నియంత్రణ విధించడం వల్ల రైతులు నష్టపోతున్నారు. నియంత్రణ లేకపోతే బహిరంగ మార్కెట్ ధరలను అదుపుచేయడం అసాధ్యం అన్న భావంతో ప్రభుత్వాలు నియంత్రణలను కొనసాగిస్తున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలను చూస్తున్న ప్రభుత్వాలు ఉత్పత్తిదారులైన రైతుల ప్రయోజనాలను మాత్రం పట్టించుకోవడం లేదు. వ్యవసాయం చేస్తే ఆదాయం గ్యారంటీ అన్న భరోసా కల్పించకుండా తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకుంటున్నంత మాత్రాన రైతుల ఆత్మహత్యలు ఆగవు. అంతేకాదు- మున్ముందు వ్యవసాయం చేయడానికి ఎవరూ ఇష్టపడని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే వ్యవసాయం భారంగా మారింది. ఉపాధి హామీ పథకాల వల్ల గ్రామాలలో రైతులకు కూలీలు దొరకడం లేదు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తే రైతులకు ఎంతో మేలుచేసిన వారు అవుతారు. పెట్టుబడి కలిసి వస్తుంది. కానీ, నాటి యూపీయే ప్రభుత్వంగానీ, నేటి ఎన్డీయే ప్రభుత్వంగానీ ఈ విషయం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు కాఠిన్యం...ఈ విషయం అలా ఉంచితే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు రోజుల క్రితం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తెలుగుదేశం పార్టీ వారినే కాకుండా రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా తాను నియమించిన ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియా ద్వారా తనపైనే విమర్శలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి... విషయం తెలిసిన కొన్ని గంటలకే కృష్ణారావును ఆ పదవి నుంచి తొలగించి ఆనంద్ సూర్యను ఆ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇనుమును కూడా నాన బెడతారని పేరొందిన చంద్రబాబు ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, పదవీ విమరణ చేసిన అధికారులకు పదవులు ఇస్తే విధేయత ఎందుకు ఉంటుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు నచ్చని పక్షంలో కృష్ణారావు తన చైర్మన్ పోస్టుకు రాజీనామా చేసి సోషల్ మీడియాలో ఎన్ని పోస్టింగులు పెట్టినా ఎవరు ఆక్షేపించేవారు కాదు. ప్రభుత్వం ఇచ్చిన పదవిని అనుభవిస్తూ ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడటం సమర్థనీయం కాదు. చంద్రబాబు వల్ల ప్రయోజనం పొందిన వారు కూడా ఆయనను లోకువగా చూస్తారు. అంతేకాదు చంద్రబాబు వల్ల ఈ ప్రయోజనం పొందానని ఎవరూ బహిరంగంగా ప్రచారం కూడా చేయరు. బహుశా అది చంద్రబాబుకు ఉన్న శాపం కావచ్చు. కృష్ణారావు అన్నారని కాదుగానీ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణారాహిత్యం పెరుగుతోంది. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులు పరస్పరం బజారుకెక్కుతున్నారు. ఈ పరిస్థితి ఏర్పడటానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటారన్న భయం లేకపోవడం వల్లనే! ఐవైఆర్ కృష్ణారావు విషయంలో కఠినంగా, వేగంగా స్పందించినట్టుగానే పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పుతున్న వారి విషయంలోనూ కొరడా ఝళిపించవలసిన తరుణం ఆసన్నమైంది. తమ వ్యవహార శైలితోపాటు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ అరాచకంగా వ్యవహరిస్తున్న కొంతమందిపైన అయినా వేటు వేయని పక్షంలో నష్టపోయేది తెలుగుదేశం పార్టీనే! సమర్థుడిగా గుర్తించడం వల్లనే ప్రజలు చంద్రబాబుకు అధికారం అప్పగించారు. అలాంటి వ్యక్తి పార్టీలో పెడధోరణులను అదుపు చేయలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజలలో విస్తరిస్తే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.ఈదేశంలో దళితులకు మహర్దశ పట్టిందా? ఏమో! రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీల హడావుడి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంపిక చేసినప్పుడు... దళితుడికి అత్యున్నత గౌరవం దక్కిస్తున్నామని ప్రచారం చేశారు. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, చంద్రబాబు కూడా తమ సూచన మేరకే దళితుడిని అభ్యర్థిగా ఎంపిక చేశారని ప్రచారం చేసుకున్నారు. నిజానికి రామ్‌నాథ్ కోవింద్ పేరు ఈ దేశ ప్రజలకు, ముఖ్యంగా దక్షిణాదివారికి పెద్దగా తెలియదు. అయినా నరేంద్ర మోదీ తన రాజకీయ వ్యూహంలో భాగంగా కోవింద్‌ను ఎంపికచేశారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ఒక దళితుడికి అత్యున్నత గౌరవం దక్కిస్తున్నామన్నంతగా బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. చివరకు ఆ ప్రచారం మోతాదు మించడంతో స్వరం మార్చుకుని కోవింద్ దళితుడు మాత్రమే కాదు- గొప్ప మేధావి అని కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి పదవికి దళిత అభ్యర్థిని ఎంపిక చేయడంతో వ్యతిరేకించడానికి ఇబ్బందిపడిన ప్రతిపక్షాలు సుదీర్ఘ సమాలోచనలు జరిపి తమ తరఫున మరో దళిత అభ్యర్థి మీరా కుమార్ పేరును ప్రకటించాయి. మొత్తానికి దళితుల పట్ల తమకు మాత్రమే అపార ప్రేమాభిమానాలు ఉన్నాయని అన్ని పార్టీలు చాటింపు వేసుకున్నాయి. ఈ హడావుడి చూస్తుంటే నరేంద్ర మోదీ పుణ్యమా అని దేశంలో మొదటిసారిగా ఒక దళితుడు రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిని అందుకోబోతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. కె.ఆర్. నారాయణన్ వంటి దళిత మేధావి గతంలోనే రాష్ట్రపతి పదవిని అలంకరించిన విషయాన్ని మరపింప చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను దళితుడిగా ఎంపిక చేయలేదు. ఆయనకు ఉన్న మేథస్సును బట్టి ఆ అవకాశం కల్పించారు. బహుశా అందుకే కాబోలు అప్పుడు అధికారంలో ఉన్నవారు దళిత కార్డును వాడుకోలేదు. నిజానికి అలా వాడుకోవలసిన అవసరం కూడా నాటి నాయకులకు లేదు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి దళిత వ్యతిరేక పార్టీ అన్న ముద్ర ఉంది. దీనికి తోడు బీఫ్ అమ్మకాలపై ఆంక్షలు విధించడంతో దళితులు ఆ పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ఈ అప్రతిష్ఠ నుంచి గట్టెక్కడానికి ప్రధాని మోదీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికను ఉపయోగించుకుని దళితవర్గానికి చెందిన కోవింద్‌ను ఎంపికచేసి ఉంటారు. రాజకీయ పార్టీలకు వాటి ప్రయోజనాలే ముఖ్యం కనుక నిర్ణయాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ దేశంలోని రాజకీయపార్టీలన్నీ దళితులంటే పడిచస్తున్నట్లు కనిపిస్తాయి. అయినా, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తి అవుతున్నా ఇప్పటికీ దళితులు చచ్చి బతుకుతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లగానీ, ఆయా ప్రభుత్వాలు కల్పించిన ప్రయోజనాల వల్లగానీ కొద్దిమంది దళితులే లబ్ధిపొందారు, అభివృద్ధిలోకి వచ్చారు. రిజర్వేషన్‌ల వంటి సౌకర్యాల వల్ల పైకి వచ్చిన దళిత కుటుంబాలకు చెందిన వారి పిల్లలే మళ్లీ మళ్లీ అవే ప్రయోజనాలు పొందుతున్నారు గానీ అట్టడుగున ఉన్నవారి జీవితాలు మాత్రం మారడంలేదు. రిజర్వేషన్ల ఫలాలు అందుకుంటున్న వారిలో అత్యధికులు ఉన్నత కులాలకు చెందిన వారితో వియ్యం అందుకుంటూ తమ జాతికి దూరం అవుతున్నారు. రాజకీయపార్టీలే కాకుండా దళితులలో పైకి వచ్చినవారు కూడా అవసరం వచ్చినప్పుడు దళిత కార్డు వాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్నే తీసుకుందాం! ఈ చట్టాన్ని దళితులలోని ఒక వర్గం దుర్వినియోగం చేస్తుండగా, గ్రామాలలో నిజంగా అవమానించబడుతున్న దళితులకు మాత్రం ఈ చట్టం అక్కరకు రావడం లేదు. ఆ చట్టం ద్వారా రక్షణ పొందవచ్చునన్న విషయం కూడా వారికి తెలియదు. రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయినంత మాత్రాన దళితుల జీవితాలు మారిపోతాయా... అంటే లేదనే చెప్పాలి. అలా అనుకుంటే వారి జీవితాలు ఎప్పుడో బాగుపడి ఉండాల్సింది. కాకపోతే కోవింద్ దళితుడు కాకపోయి ఉంటే ఇప్పుడు ఆయనకు ఆ గౌరవం కూడా దక్కి ఉండేది కాదు. కులం కలకలందళితులేకాదు.. మనదేశంలో ఇటీవలి కాలంలో కులానికి ప్రాధాన్యం పెరిగింది. పెరుగుతోంది. అటు రాజకీయ నాయకులు, ఇటు కుల సంఘాల నాయకులు తమ ప్రయోజనాల కోసం కులం కార్డులను విచ్చలవిడిగా వాడటంతో కులాలకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. తెలుగు రాష్ర్టాలలో కులాల ప్రాధాన్యం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితి ఒకటైతే, తెలంగాణలో పరిస్థితి మరోలా ఉంది. బీసీలను ఆకట్టుకునే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా కులాల వారీగా పథకాలు ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి దీనివల్ల రాజకీయ ప్రయోజనం కలగవచ్చుగానీ భవిష్యత్తులో డిమాండ్‌లు పెరుగుతాయి. అర్హతలను బట్టి కాకుండా కుల ప్రాతిపదికగా ప్రయోజనాలు కల్పించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకోసం ఆయా కులాల నుంచి నాయకులు పుట్టుకువస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఎంతో మంది నాయకులుగా ఎదిగారు. ఇలా ఎదిగిన వారిలో మున్నూరు కాపు, గౌడ, యాదవ కులాలకు చెందినవారే ఎక్కువగా కనిపిస్తారు. బీసీలలో అత్యంత వెనుకబడి, సంఖ్యాపరంగా తక్కువ ఉన్న వర్గాలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ముఖ్యం కనుక అలాగే జరుగుతుంది. ఏపీ విషయానికి వస్తే అక్కడ అగ్రవర్ణాలైన రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు రాజకీయ పార్టీల ప్రాతిపదికగా కత్తులు దూసుకుంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే చాలు- మా కడుపు నిండినట్టేనని కమ్మ సామాజిక వర్గం వారు భావిస్తుండగా, ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న బాధ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉందో తెలియదుగానీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు అధికారం పోయిందని కుతకుతలాడిపోతున్నారు. ఈ కులాభిమానం కాస్తా కులద్వేషంగా మారిపోయింది. దీంతో సోషల్ మీడియాలో కులప్రాతిపదికన గ్రూపులు ఏర్పడి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాము అభిమానించే నాయకుల పట్ల ఉన్న ప్రేమకొద్దీ అవతలి వారిపై విషం కక్కుతూ ప్రచారం చేస్తున్నారు. ఫలానా కులంవాడు ముఖ్యమంత్రి అయితే ఆ కులానికి చెందిన కొంతమంది బాగుపడవచ్చునుగానీ, ఆ కులంవారి అందరి జీవితాలు మారిపోవు. తెలుగుదేశం పార్టీ చాలా సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారంలో ఉంది. అయినా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారందరూ బాగుపడలేదే? అలాగే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు కూడా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నారు. అయినా రెడ్డి సామాజికవర్గంలో ఇప్పటికీ ఎంతోమంది పేదలుగా ఉన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వారు ఉన్నారు. అంటే కులం ఎవరికి ఉపయోగపడుతుందో అర్థంకావడం లేదా? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టుగా కులం పేరు చెప్పుకొని నాయకులు ప్రయోజనం పొందుతారేకానీ జనం కాదు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అమెరికాలో ఉండే కమ్మ సామాజిక వర్గంవారు సంబరం చేసుకున్నారు. ఎన్నికలలో జగన్మోహన్‌రెడ్డి ఓడిపోతే అమెరికాలో ఉన్న రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు విలవిలలాడిపోయారు. నిజానికి అమెరికాలో ఉంటున్న వారెవ్వరికీ చంద్రబాబు వల్లగానీ, జగన్మోహన్‌రెడ్డి వల్లగానీ పైసా ప్రయోజనం కలగదు. హెచ్చులకు పోయి డబ్బు ఖర్చుచేయడం మినహా ఒరిగేది ఏమీ ఉండదు. ఒకప్పుడు అధికారంలో ఉన్నవారు కులసంఘాలు ఏర్పాటు చేసే సమావేశాలకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందినవారే తమ హక్కుల రక్షణ కోసం కుల సంఘాలు ఏర్పాటు చేసుకునేవారు. సమాజంలో అగ్రవర్ణాలుగా చెలామణి అవుతున్న వర్గాలకు చెందిన వారికి కులసంఘాలు ఉండేవి కావు. ఇప్పుడు అన్ని వర్ణాల వారూ కులసంఘాలు పెట్టుకుని నిస్సంకోచంగా ‘మా కులం’ అని చెప్పుకొంటున్నారు. ఈ సంఘాల నాయకులు అందరూ తమవారి హక్కుల కోసం కాకుండా స్వీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు చేస్తుంటారు. చిన్న రాష్ర్టాల వల్ల ప్రయోజనాలతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయని ఇప్పుడు తెలుగునాట జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కులాలకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. సీమాంధ్రలో ఉన్న కులతత్వం రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపేది కాదు. హైదరాబాద్ రాజధానిగా ఉన్నందున ఆ గొడవలు అక్కడికే పరిమితం అయ్యేవి. ఇప్పుడు అలా కాదు. అధికారంలో ఉన్నవారు కులాల మధ్య సమన్వయం చేసుకోవలసి ఉంటున్నది. అవసరాలను బట్టి కాకుండా కులాలను బట్టి సంతృప్తి కలిగించే నిర్ణయాలు తీసుకోవలసి ఉంటోంది. తెలుగు రాష్ర్టాలు అనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కులాల కుంపట్లు నానాటికీ రాజుకుంటున్నాయి. కులాలు, వాటి వెనుక ఉన్న బలగం ఆధారంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటున్నాయి. మతాలను సంతృప్తిపరిచే రోజులతోపాటు, కులాలను సంతృప్తిపరచవలసిన రోజులు కూడా వచ్చాయి. మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ప్రాణమిస్తామని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ ఏలుబడిలో పేద ముస్లింల జీవితాలు బాగుపడలేదు. ఇవ్వాళ్టికీ ముస్లింలలో దారుణమైన పేదరికం ఉంది. ఇందుకు కారణం అధికారంలో ఉన్నవారు ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతూ పేదలను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయకపోవడమే! హిందూ ముస్లింలుగా దేశాన్ని విడగొట్టడానికి అధికార-ప్రతిపక్షాలు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాయి. సెక్యులరిజం పేరిట కాంగ్రెస్ అండ్ కో ముస్లింలను అతిగా సంతృప్తి పరుస్తున్నదని హిందువులలో మెజారిటీవర్గం భావిస్తోంది. దీంతో వారు భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను అణచివేస్తున్నారని ముస్లింలు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఈ దేశం తమది కాదన్న భావన ముస్లింలలో ఏర్పడుతోంది. వారం రోజుల క్రితం ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడిన ఇండియా- పాక్ మ్యాచ్‌ను దేశప్రజలందరూ ఆసక్తిగా తిలకించారు. ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఇండియా చిత్తుగా ఓడిపోవడంతో కొన్ని ప్రాంతాలలో మసీదులలోనే కాకుండా ఇళ్లల్లో సైతం ముస్లింలు సంబరాలు చేసుకున్నారు. పాకిస్థాన్ గెలిచినందుకు డ్యాన్సులు చేశారు. ఇలాంటి చర్యల వల్ల హిందూ- ముస్లింల మధ్య అంతరం నానాటికి పెరుగుతోంది. బీజేపీ నాయకులు ఇలాంటి చర్యలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. పాకిస్థాన్ గెలిస్తే ఇండియాలోని ముస్లింలకు ఒరిగేది ఏమి ఉండదు. అయినా వారిలో అలాంటి భావాలు ఏర్పడటానికి రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలే కారణం. కులాల విషయంలో కూడా మున్ముందు ఇదే పరిస్థితి తలెత్తుతుంది. సమాజంలో అవమానాలకు గురవుతూ అణచివేయబడిన దళితులకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్‌లు కల్పించడానికి, ఇతర ప్రయోజనాలు ఇవ్వడానికి ఇతర వర్గాలవారు మొదట్లో వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఆ నిర్ణయాలు అవసరాన్ని గుర్తించి తీసుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు కనుక! ఇప్పుడు ఇంకెన్నేళ్లు రిజర్వేషన్‌లు అన్న స్వరాలు వినబడటానికి కూడా పాలకుల వైఖరే కారణం. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావలసిన హక్కులను, ప్రయోజనాలను అందించడంలో కూడా ప్రచారం పొందడానికి ప్రయత్నించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఎవరికి వారు ఫలానా కులానికి, వర్గానికి, మతానికి తాము చాంపియన్‌లమని ప్రచారం చేసుకోవడం వల్ల సమాజంలో ఆయా వర్గాల మధ్య విద్వేష బీజాలు పడుతున్నాయి. బిహార్ గవర్నర్‌గా ఉండిన రామ్‌నాథ్ కోవింద్‌ను అర్హతలను బట్టి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశామని చెప్పకుండా... దళితుడిని రాష్ట్రపతిని చేస్తామంటే మద్దతు ఇవ్వరా? అని ప్రశ్నించడంతోనే తంటా అంతా వస్తోంది. దీంతో మాకూ ఒక దళిత నాయకురాలు ఉన్నారంటూ మీరా కుమార్‌ను కాంగ్రెస్ అండ్ కో పోటీకి నిలుపుతున్నాయి. అభ్యర్థి ఏ వర్గానికి చెందిన వారైనా రాష్ట్రపతిగా ఎన్నికైతే మొత్తం దేశానికే రాష్ట్రపతి అవుతారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉంటారు. అలాంటి అత్యున్నత పదవిని చేపట్టబోయే అభ్యర్థులను కులదృష్టితో చూడటం, కులముద్ర వేయడం ఎంతవరకు ఔచిత్యమో రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఆయా పదవులు చేపడుతున్న వారు దేశప్రజల విశాల ప్రయోజనాలను కాపాడతారా? లేదా? అని కాకుండా కులదృష్టితో చూసే వైఖరికి స్వస్తి చెప్పాలి. రాజకీయ చదరంగంలో రైతుదళితులు, ముస్లింల తరహాలోనే ఇప్పుడు రైతులు కూడా ఈ దేశంలో రాజకీయ ప్రయోజనాల చదరంగంలో పావులుగా మారుతున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ర్టాలలో అధికారంలో ఉన్న పార్టీలు రుణమాఫీ విషయంలో పోటీపడుతున్నాయి. ముందుగా తెలుగు రాష్ర్టాలలో అధికారం కోసం ఇద్దరు చంద్రులు రుణమాఫీ ప్రకటించారు. అప్పుడు ఈ విషయాన్ని వ్యతిరేకించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సందర్భంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఇతర రాష్ర్టాలలో కూడా రుణమాఫీ కోసం రైతు పోరాటాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో మొదలైన పోరాటం ఇతర రాష్ర్టాలకు విస్తరించింది. త్వరలో ఎన్నికలు జరుగనున్నందున కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ కూడా రైతులకు రుణమాఫీ ప్రకటించింది. దేశంలో ప్రభుత్వ విధానాల వల్ల దగాపడుతున్న వారిలో రైతులు ముందు వరుసలో ఉంటారు. స్వాభిమానంతో బతికే రైతులను ప్రభుత్వాలపై ఆధారపడేలా చేశారు. ఓట్ల అవసరం వచ్చినప్పుడు రుణమాఫీలు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు తాత్కాలిక ప్రయోజనం చేకూరుతున్నదేగానీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. రైతులకు రుణమాఫీ చేయాలనడం ఫ్యాషన్ అయిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించినందుకు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అధికారంలో ఉన్నారు కనుక వెంకయ్య నాయుడు విమర్శలను ఎదుర్కోవలసిందే. తెలుగు రాష్ర్టాల విషయమే తీసుకుందాం. రుణమాఫీ తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. అంటే రుణమాఫీ వల్ల సమస్య శాశ్వతంగా పరిష్కారం కావడం లేదనేగా! నిజానికి వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వల్ల పంటల దిగుబడి పెరిగింది. అదే సమయంలో పెట్టుబడులు కూడా పెరిగాయి. దీంతో దిగుబడులు పెరిగినప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లభించక, అయిన కాడికి అమ్ముకోవలసిన పరిస్థితి. ఫలితంగా వ్యవసాయంపై ఫలసాయం రాకపోగా పెట్టుబడి కోసం చేసిన అప్పులు పేరుకుపోతున్నాయి. రైతుల గురించి నోరుపట్టనంతగా ప్రేమను కురిపించే రాజకీయ పార్టీలు వ్యవసాయరంగానికి సంబంధించి శాశ్వత విధానాలను ఇంతవరకు రూపొందించలేదు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంటుంది? ఏ పంట వేస్తే ఎంత ధర వచ్చే అవకాశం ఉంది? అనే విషయం చెప్పే విధానమే లేదు. దీంతో గత ఏడాది మిర్చి పంటకు అధిక ధర పలికినందున రెండు తెలుగు రాష్ర్టాల రైతులు మిర్చివైపు మొగ్గుచూపారు. ఫలితంగా దిగుబడులు పెరిగి మిర్చి ధర దారుణంగా పడిపోయింది. గత ఏడాది పత్తి ధర పడిపోయిందని ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తి వైపు చూడలేదు. దీంతో ఈ ఏడాది పత్తి ధర బాగా పలికింది. వ్యవసాయ ఉత్పత్తులపై నియంత్రణ విధించడం వల్ల రైతులు నష్టపోతున్నారు. నియంత్రణ లేకపోతే బహిరంగ మార్కెట్ ధరలను అదుపుచేయడం అసాధ్యం అన్న భావంతో ప్రభుత్వాలు నియంత్రణలను కొనసాగిస్తున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలను చూస్తున్న ప్రభుత్వాలు ఉత్పత్తిదారులైన రైతుల ప్రయోజనాలను మాత్రం పట్టించుకోవడం లేదు. వ్యవసాయం చేస్తే ఆదాయం గ్యారంటీ అన్న భరోసా కల్పించకుండా తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకుంటున్నంత మాత్రాన రైతుల ఆత్మహత్యలు ఆగవు. అంతేకాదు- మున్ముందు వ్యవసాయం చేయడానికి ఎవరూ ఇష్టపడని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే వ్యవసాయం భారంగా మారింది. ఉపాధి హామీ పథకాల వల్ల గ్రామాలలో రైతులకు కూలీలు దొరకడం లేదు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తే రైతులకు ఎంతో మేలుచేసిన వారు అవుతారు. పెట్టుబడి కలిసి వస్తుంది. కానీ, నాటి యూపీయే ప్రభుత్వంగానీ, నేటి ఎన్డీయే ప్రభుత్వంగానీ ఈ విషయం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు కాఠిన్యం...ఈ విషయం అలా ఉంచితే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు రోజుల క్రితం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తెలుగుదేశం పార్టీ వారినే కాకుండా రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా తాను నియమించిన ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియా ద్వారా తనపైనే విమర్శలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి... విషయం తెలిసిన కొన్ని గంటలకే కృష్ణారావును ఆ పదవి నుంచి తొలగించి ఆనంద్ సూర్యను ఆ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇనుమును కూడా నాన బెడతారని పేరొందిన చంద్రబాబు ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, పదవీ విమరణ చేసిన అధికారులకు పదవులు ఇస్తే విధేయత ఎందుకు ఉంటుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు నచ్చని పక్షంలో కృష్ణారావు తన చైర్మన్ పోస్టుకు రాజీనామా చేసి సోషల్ మీడియాలో ఎన్ని పోస్టింగులు పెట్టినా ఎవరు ఆక్షేపించేవారు కాదు. ప్రభుత్వం ఇచ్చిన పదవిని అనుభవిస్తూ ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడటం సమర్థనీయం కాదు. చంద్రబాబు వల్ల ప్రయోజనం పొందిన వారు కూడా ఆయనను లోకువగా చూస్తారు. అంతేకాదు చంద్రబాబు వల్ల ఈ ప్రయోజనం పొందానని ఎవరూ బహిరంగంగా ప్రచారం కూడా చేయరు. బహుశా అది చంద్రబాబుకు ఉన్న శాపం కావచ్చు. కృష్ణారావు అన్నారని కాదుగానీ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణారాహిత్యం పెరుగుతోంది. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులు పరస్పరం బజారుకెక్కుతున్నారు. ఈ పరిస్థితి ఏర్పడటానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటారన్న భయం లేకపోవడం వల్లనే! ఐవైఆర్ కృష్ణారావు విషయంలో కఠినంగా, వేగంగా స్పందించినట్టుగానే పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పుతున్న వారి విషయంలోనూ కొరడా ఝళిపించవలసిన తరుణం ఆసన్నమైంది. తమ వ్యవహార శైలితోపాటు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ అరాచకంగా వ్యవహరిస్తున్న కొంతమందిపైన అయినా వేటు వేయని పక్షంలో నష్టపోయేది తెలుగుదేశం పార్టీనే! సమర్థుడిగా గుర్తించడం వల్లనే ప్రజలు చంద్రబాబుకు అధికారం అప్పగించారు. అలాంటి వ్యక్తి పార్టీలో పెడధోరణులను అదుపు చేయలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజలలో విస్తరిస్తే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. | editorial |
17,173 | 21-08-2017 02:46:55 | ఉద్యోగాలిచ్చే స్థాయికి యువత | ‘ఒకప్పుడు దేశంలోని యువత ఉద్యోగార్థులుగా ఉండేవారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియాలతో ఇప్పుడు వారే ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగారు. దేశాన్ని న్యూ ఇండియాగా మార్చే బాధ్యత యువతపైనే ఉంది.’- బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా | nation |
17,367 | 01-02-2017 02:05:29 | మే 7న ‘నీట్’.. 80 నగరాల్లో పరీక్ష | న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష(నీట్) మే 7న జరగనుంది. భారత వైద్యమండలి చట్టాన్ని అనుసరించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ ఈ) ఈ పరీక్షను 80 నగరాల్లో నిర్వహించనుంది. ఎంబీబీఎ్‌స/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మంగళవారం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆరంభమైంది. మార్చి 1 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపుకోవచ్చు. ఈ ఏడాది ఎంబీబీఎ్‌స/బీడీఎస్ కోర్సుల్లో సీట్లను నీట్ ద్వారానే భర్తీ చేస్తారని ఓ అధికారి తెలిపారు. | nation |
4,269 | 16-08-2017 02:58:46 | మరో ప్రపంచాన్ని రేపు చూస్తాం! | మార్క్సిజాన్ని ఇష్టపడే వాళ్ళకి కూడా కొన్ని సందేహాలు వుంటాయి. ‘‘అసలు, ప్రపంచంలో వున్న డబ్బు అంతా ఎవరిది?’’ అని అడిగితే, కొందరైనా, ‘‘శ్రామికులది’’ అంటారు. ‘‘ఏ శ్రామికులది’’ అంటే, చెప్పలేరు. ఏ సందేహం కోసం అయినా, మార్క్స్ ‘‘కాపిటల్’’ పుస్తకం తెరవ వలిసిందే! అదే సమాజ శాస్త్రం మరి!‘‘మీమరో ప్రపంచం ఎక్కడ?’’ అంటూ, దుగ్గరాజు శ్రీనివాసరావు గారు రాసిన వ్యాసం (ఆంధ్రజ్యోతి, జూలై 26) కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలు, నక్సల్బరీ ఉద్యమకారుల్ని అడిగినవే అయినప్పటికీ, అవి ప్రధానంగా ‘‘మార్క్సిజం’’ గురించి అడిగిన ప్రశ్నలే అవుతాయి. ‘‘మరో ప్రపంచం’’ అంటే, దోపిడీ సంబంధాలు లేని, ఆధిపత్యాలు లేని, ఉత్తమ మానవ సంబంధాల ప్రపంచం. అటువంటి మంచి ప్రపంచం ఏర్పడితే, అది ‘‘మాదే’’ కాదు; ‘‘మీదే’’ కాదు; మొత్తం మానవులందరిదీ అవుతుంది. ఈ నాడు, స్వంత శ్రమలు లేకుండా ఇతరుల శ్రమల్ని దోస్తూ జీవించే దోపిడీదారులు వున్నారే, ఆ మంచి ప్రపంచం, వాళ్ళందర్నీ మార్చి, వాళ్ళందరిదీ కూడా అవుతుంది. ఈ నాటి మానవ సమాజంలో ఏవేవో సమస్యలు వున్నాయని ఎంతో కొంత గ్రహించిన మానవులు, ఈ సమాజం మారాలని, ఎవరి విధానాలు వారు చెప్పి వుండవచ్చు. కానీ, ‘‘మార్క్సిజం’’ తప్ప, ఇతర విధానాలేవీ, సమాజంలో వున్న అసలు దుష్టత్వం గురించి చెప్పలేదు. మార్క్సిజం మాత్రమే ‘‘శ్రమ దోపిడీ వేల సంవత్సరాలుగా సాగుతూనే వుంది; సమస్త సమస్యలకూ మూలం అదే!’’ అని గ్రహించిన, ఏకైక సిద్ధాంతం.మార్క్సిజం మాత్రమే మానవ సమాజంలో వున్న ‘‘మౌలిక దోషాన్ని’’ గ్రహించింది కాబట్టి, దాన్ని తీసి వేసే మార్గం కూడా చెప్పగలిగింది. ‘‘మంచి ప్రపంచానికి మార్గం మార్క్సిజమే’’ అని గ్రహించిన ఏ మానవులైనా, సమాజం గురించి రేకెత్తే ఏ ప్రశ్నలకైనా జవాబు ఇవ్వగలరు. ‘‘మీ మరో ప్రపంచం ఎక్కడ?’’ అని అడిగిన వ్యాసకర్త ప్రశ్నలకు నా జవాబులు ఇవి: (1) ప్రశ్న: మరో ప్రపంచానికి నమూనా ఏదైనా వుందా?జవాబు: నమూనా ఇంకా ఇప్పటికి లేదు. నమూనా కోసం, శ్రామిక వర్గ ప్రణాళిక ఏ నాడో సిద్ధమై వుంది. అదే ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’. రష్యా–చైనాలు, నమూనాల కోసం ప్రారంభ ప్రయత్నాలు చేశాయి గానీ, ‘‘శ్రమ దోపిడీ’’ పట్లా, ‘‘శతృ వర్గాల’’ పట్లా, వాటి గ్రహింపులు గాఢమైనవిగా లేక, ఆ దేశాలు మంచి ప్రపంచానికి నమూనాలు కాలేకపోయాయి. అయితే, అక్కడి అపజయాలకు కారణాలేమిటో కాల క్రమంలో అక్కడా గ్రహిస్తారు, ఇక్కడా గ్రహిస్తారు, ప్రపంచం అంతటా గ్రహిస్తారు. ఆ గ్రహింపులు జరుగుతూనే వున్నాయి. ‘‘మంచి’’ కోసం జరిగే ప్రయత్నాల్లో అపజయాలు అదే విధంగా ఆగిపోవు. నమూనాలు కాల క్రమంలో ఏర్పడక పోవు. (2) మరో ప్రపంచంలో కూడా ఏదో ఒక ప్రభుత్వం ఉండాల్సిందే కదా?జవాబు: ‘‘మరో ప్రపంచం’’ అంటే, దాని అర్ధం వేరు. ‘‘ప్రభుత్వం’’ ప్రసక్తి, మరో ప్రపంచానిది కాదు. ఈ నాటి దోపిడీ ప్రపంచం, మరో ప్రపంచంగా స్తిర పడే వరకూ సాగే పరివర్తనా దశలో, దానికి తగిన ప్రభుత్వం (స్టేట్) అనేది, దాని కోర్టులూ, జైళ్ళూ, చిత్రహింసలూ, మరణ శిక్షలూ, వంటి వాటితో సహా, బానిసత్వం ప్రారంభమైన కాలంలో, యజమానుల వర్గ రక్షణ కోసమే, బానిస వర్గ అణిచివేత కోసమే, కొత్తగా ఏర్పడిందని మొదట తెలిస్తే; వర్గాలే పోయినప్పుడు, ప్రభుత్వం కూడా పోతుందని తెలుస్తుంది. శతృ వర్గాలు లేని ప్రపంచానికి ప్రభుత్వాలతో అవసరం వుండదు. సమాజానికి, సమాజ నిర్వహణ చాలు! ఈ నాటి శ్రామిక వర్గానికి ఈ నిజాలు తెలిస్తే, ప్రభుత్వంతో అవసరం లేని మంచి సమాజ నిర్మాణం ఒక ప్రశ్నా? (3) మీ మరో ప్రపంచంలో కూడా పెత్తనం కొందరి చేతుల్లోనే వుంటుంది కదా?జవాబు: ‘‘పెత్తనం’’ అన్నారంటే, దోపిడీ సంబంధాలనే ఊహిస్తున్నారని అర్ధం. దోపిడీ సంబంధాల్ని మార్చే ప్రయత్నాలు, ‘‘పెత్తనాలు’’ కావు, ‘‘స్వంత శ్రమ లేకుండా జీవించే హక్కు ఎవ్వరికీ లేదు. అందరూ శ్రమలు చెయ్యాలి’’ అని ఒక నిబంధన పెడితే, అది ‘‘పెత్తనం’’ కాదు. అది, శ్రామిక వర్గం, దోపిడీ నించి విముక్తి చెందే ఆత్మ రక్షణ మార్గం. ‘‘పురుషులు కూడా స్త్రీలతో పాటు ఇంటి పనులూ, పిల్లల పెంపకాలూ, వృద్ధుల సంరక్షణలూ చెయ్యాలి’’ అని నిబంధనలు పెడితే, అవి ‘‘పెత్తనాలు’’ కావు. అవి, స్త్రీలకు పురుషుల పెత్తనాల నించి విముక్తి. దోపిడీ వర్గాల పాలనలో వుండే రకపు పెత్తనాలే, శ్రామిక వర్గ పాలనలో కూడా వుంటే, అది వర్గాల రాహిత్యం అవదు. మంచి ప్రపంచం కోసం, దోపిడీ సంబంధాల్ని వ్యతిరేకించే కొత్త విద్యా, కొత్త కళలూ, కొత్త సంస్కృతీ, పెత్తనం లేని సంబంధాలూ, ఏర్పడతాయి. వాటిని కోరుకుంటేనే, ఏర్పర్చుకుంటేనే, అది మరో ప్రపంచం! (4) నేటి పోలీసు వ్యవస్త వంటిదే మరో పేరుతో వుండి తీరుతుందా లేదా?జవాబు: నేటి పోలీసు వ్యవస్త, దోపిడీ వర్గ రక్షకురాలు. రేపు, దోపిడీ వర్గం, తన స్వంత శ్రమతో తను బ్రతకాలని గ్రహిస్తే, అలా గ్రహించే వరకూ, అనేక కొత్త నిబంధనలతో పాటు పోలీసు కూడా అవసరమే. యుద్ధాలే లేకపోతే, సైన్యం ఎందుకు? దోపిడీయే లేకపోతే పోలీసు ఎందుకు? అందరికీ శ్రమలు చేసే అవకాశాలూ, కడుపునిండా తిండీ, బట్టా, ఇల్లూ, వైద్యం, విశ్రాంతీ, సంసారాల్లో శాంతీ – అన్నీ వుంటే, పోలీసు ఎందుకు? కొంత కాలం వరకూ పోలీసు వుంటే, వాళ్ళు కూడా ఉత్పాదక శ్రమలు చేసే వాళ్ళుగానే వుంటారు. అందరూ శ్రమలు చేసే మరో ప్రపంచానికి పోలీసు అక్కరలేదు. (5) పోలీసు వ్యవస్త లేని రాజ్యం ఎక్కడైనా వుంటుందా? జవాబు: బానిసత్వం గురించి తెలిసి వుంటే, ఈ ప్రశ్న రాదు. యజమానీ బానిస సంబంధాలు ప్రారంభం కాని కాలంలో, ‘‘రాజ్యం’’ అనేది లేదు. దానితో అవసరం ఇంకా కలగలేదు. రాజ్యం లేకుండానే అనేక వేల, లక్షల సంవత్సరాల కాలం గడిచింది. ‘‘రాజ్యం’’ ఎందుకు పుట్టిందో తెలిస్తే, అది ఎందుకు పోతుందో తెలుస్తుంది. దోపిడీ అదృశ్యమే, రాజ్యం అదృశ్యం! (6) మరో ప్రపంచంలో, శాంతి భద్రతల సమస్యలే తలెత్తవా? లాఠీ చార్జీలూ, కాల్పులూ, ఉండవా? జవాబు: దోపిడీ సంబంధాలు సాగుతూనే వుంటే, ఆ లాఠీలూ, తూటాలూ అన్నీ వుంటాయి. దోపిడీ సంబంధాలే వుంటే ‘శాంతి’ ఎవరికి కావాలి? భద్రత ఎవరికి కావాలి? కార్మికులు ఎప్పుడైనా సమ్మె చేస్తే అక్కడికి పోలీసులు తుపాకులతో దిగుతారు. అప్పుడు శాంతి భద్రతలు యజమానికి దొరుకుతాయి. కార్మికులకు కాదు. డబ్బూ, ఉత్పత్తులూ అన్నీ, ఒక వర్గం వేపు చీలిపోయి, అవన్నీ తయారుచేసిన వర్గం ఖాళీ చేతుల్తో వుంటే, వాళ్ళు డబ్బుని వెతుక్కుంటూ, అది ఎక్కడ వుందో అక్కడికి వస్తారు మరి. అందుకే, సిరి సంపదల వాళ్ళకి భద్రత కావాలి. శాంతి కావాలి. వాళ్ళ కోసం, వాళ్ళ భవనాల ముందు వాచ్‌మేన్లూ, పోలీసులూ, వుండాలి. ఒక చోటుకి చేరే ధన రాసులే లేకపోతే, శాంతి భద్రతల మాటేమిటి? నిరుపేద గుడిసె ముందు వాచ్‌మేన్ వుంటాడా? (7) మీ పాలన నచ్చని వారుంటారు. వారి అసమ్మతి వుంటుంది. వారి పోరాటం మీద మీరు ఎలా ప్రవర్తిస్తారు? జవాబు: ‘‘అసమ్మతీ; పోరాటమూ’’, మాటల్ని ఈ వ్యాసకర్త ఎంత అర్ధరహితంగా వాడేశారు! దోపిడీకి గురి అయ్యే వాళ్ళ అసమ్మతినీ, దోపిడీ చేసే వాళ్ళ అసమ్మతినీ ఒకే గాటిన కట్టారు. ‘‘అందరూ శ్రమలు చెయ్యాలి. ఇతరుల శ్రమల్ని దోస్తూ బ్రతకకూడదు’’ అని శ్రామిక వర్గం అంటే, దానికి ఎవరైనా అసమ్మతి చూపితే, వాళ్ళ అర్ధం ఏమిటి? వాళ్ళు, ‘‘మేము శ్రమలు చెయ్యం. వడ్డీలూ – లాభాలూ – కౌళ్ళూ తింటూ బ్రతికే హక్కులు మాకు కావాలి’’ అంటున్నారన్నమాట! వాళ్ళు, ఆ దృష్టితో, ‘‘దోపిడీ సమాజమే కావాలి’’ అంటే, దాన్ని, న్యాయమైన ‘‘అసమ్మతి’’గానూ, న్యాయమైన పోరాటంగానూ భావించారు ఈ వ్యాస కర్త. ‘‘మీ పాలనలో అసమ్మతిదారులు వుండరా? వాళ్ళ మీద లాఠీలూ, కాల్పులూ వుండవా?’’ అంటున్నారు. ‘‘దోపిడీ చేస్తాం! మమ్మల్ని చెయ్యనివ్వండి! మాకు అడ్డు రాకండి!’’ అనడాన్ని గొప్ప పోరాటంగా ఎంచి! ‘‘మేము శ్రమలు చెయ్యం. ఇతరుల శ్రమలే లాగుతాం’’ అనే వాళ్ళు దోషులే. వాళ్ళని జైళ్ళల్లో పడేసి అక్కడే పనులు చేయించవచ్చు. కానీ, అదంతా చెత్త! భూమిని జైళ్ళ కోసం ఉపయోగించడమా? అక్కడ కాపలా మనుషులు ఉండడమా? అది చాలా చెత్త! ‘‘శ్రమలు చెయ్యం’’ అని చెప్పే వాళ్ళని అడవుల్లోకి పొమ్మనాలి. ‘‘మీరు శ్రమలు చెయ్యం అంటున్నారు. అలాంటప్పుడు, అడుగడుగునా శ్రమలతో తయారైన ఊళ్ళల్లో వుండే హక్కు వుండదు మీకు. రోడ్డు మీద నడిచే హక్కు కూడా వుండదు. తిండీ, బట్టా, ఇల్లూ, మందులూ, పుస్తకాలూ, రవాణాలూ, అన్నీ శ్రమలవే. మీ ఒంటి మీద బట్టలు కూడా కింద పడేసి అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అడవులు మా శ్రమలు కావు. మీరు అక్కడ వుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ, మీరు అక్కడైనా ఏదో ఒక పని చేసుకోవాలి. పాకలు కట్టుకోవాలి, నేలలో వెతికి దుంపల్ని తవ్వి వాటిని కాల్చుకోవాలి. క్షవరాలు చేసుకోవాలంటే, మొదట కత్తెర్లు కావాలి. ఒంటి మీద బట్టలు కావాలంటే మొదట రాట్నాలూ, మగ్గాలూ, కావాలి. ఇక మీ ఇష్టం! ఊళ్ళల్లో వుంటారో, అడవుల్లోకి పోతారో! తేల్చుకోండి తొందరగా. ఊళ్ళల్లో వుండాలంటే, వెంటనే లారీ డ్రైవర్లుగా పనుల్లోకి దిగండి!’’ అని చెప్తే చాలు! వాళ్ళ కోసం లాఠీలూ, తూటాలూ, ఎందుకు? వృధా! వ్యాసకర్త ఇంకా అనేక ప్రశ్నలు అడగలేదు గానీ, ఇంకా చాలా వుంటాయి. మార్క్సిజాన్ని ఇష్టపడే వాళ్ళకి కూడా కొన్ని సందేహాలు వుంటాయి.‘‘అసలు, ప్రపంచంలో వున్న డబ్బు అంతా ఎవరిది?’’ అని అడిగితే, కొందరైనా, ‘‘శ్రామికులది’’ అంటారు. ‘‘ఏ శ్రామికులది’’ అంటే, చెప్పలేరు. ‘‘డబ్బు’’ అనేది, ఉత్పాదక శ్రామికుల ‘‘శ్రమ విలువ’’ మాత్రమే. అనుత్పాదక శ్రామికులు కూడా శ్రమ దోపిడీకి గురి అయినా, వారి శ్రమలు, డబ్బుగా మారవు. అలాగే, కుటుంబ శ్రమలు, డబ్బుగా మారవు. ‘‘మార్క్సిజం’’ మీద ఇంకో సందేహం. ‘‘మార్క్సిజం మాత్రం, సమానత్వాన్ని ఎలా ఇవ్వగలదు? ఒక వ్యక్తి శారీరక శ్రమ చేస్తాడు; ఇంకో వ్యక్తి మేధా శ్రమ చేస్తాడు. ఆ శ్రమల విలువలు సమానంగా వుండవు. ఆ వ్యక్తుల ఆదాయాలు తేడాగా వుంటాయి. మరి, వాళ్ళు ‘‘సమానులు’’ ఎలా అవగలరు?’’ – ఇదీ సందేహం!ఏ సందేహం కోసం అయినా, మార్క్స్ ‘‘కాపిటల్’’ పుస్తకం తెరవ వలిసిందే! అదే సమాజ శాస్త్రం మరి!రంగనాయకమ్మ‘‘మీమరో ప్రపంచం ఎక్కడ?’’ అంటూ, దుగ్గరాజు శ్రీనివాసరావు గారు రాసిన వ్యాసం (ఆంధ్రజ్యోతి, జూలై 26) కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలు, నక్సల్బరీ ఉద్యమకారుల్ని అడిగినవే అయినప్పటికీ, అవి ప్రధానంగా ‘‘మార్క్సిజం’’ గురించి అడిగిన ప్రశ్నలే అవుతాయి. ‘‘మరో ప్రపంచం’’ అంటే, దోపిడీ సంబంధాలు లేని, ఆధిపత్యాలు లేని, ఉత్తమ మానవ సంబంధాల ప్రపంచం. అటువంటి మంచి ప్రపంచం ఏర్పడితే, అది ‘‘మాదే’’ కాదు; ‘‘మీదే’’ కాదు; మొత్తం మానవులందరిదీ అవుతుంది. ఈ నాడు, స్వంత శ్రమలు లేకుండా ఇతరుల శ్రమల్ని దోస్తూ జీవించే దోపిడీదారులు వున్నారే, ఆ మంచి ప్రపంచం, వాళ్ళందర్నీ మార్చి, వాళ్ళందరిదీ కూడా అవుతుంది. ఈ నాటి మానవ సమాజంలో ఏవేవో సమస్యలు వున్నాయని ఎంతో కొంత గ్రహించిన మానవులు, ఈ సమాజం మారాలని, ఎవరి విధానాలు వారు చెప్పి వుండవచ్చు. కానీ, ‘‘మార్క్సిజం’’ తప్ప, ఇతర విధానాలేవీ, సమాజంలో వున్న అసలు దుష్టత్వం గురించి చెప్పలేదు. మార్క్సిజం మాత్రమే ‘‘శ్రమ దోపిడీ వేల సంవత్సరాలుగా సాగుతూనే వుంది; సమస్త సమస్యలకూ మూలం అదే!’’ అని గ్రహించిన, ఏకైక సిద్ధాంతం.మార్క్సిజం మాత్రమే మానవ సమాజంలో వున్న ‘‘మౌలిక దోషాన్ని’’ గ్రహించింది కాబట్టి, దాన్ని తీసి వేసే మార్గం కూడా చెప్పగలిగింది. ‘‘మంచి ప్రపంచానికి మార్గం మార్క్సిజమే’’ అని గ్రహించిన ఏ మానవులైనా, సమాజం గురించి రేకెత్తే ఏ ప్రశ్నలకైనా జవాబు ఇవ్వగలరు. ‘‘మీ మరో ప్రపంచం ఎక్కడ?’’ అని అడిగిన వ్యాసకర్త ప్రశ్నలకు నా జవాబులు ఇవి: (1) ప్రశ్న: మరో ప్రపంచానికి నమూనా ఏదైనా వుందా?జవాబు: నమూనా ఇంకా ఇప్పటికి లేదు. నమూనా కోసం, శ్రామిక వర్గ ప్రణాళిక ఏ నాడో సిద్ధమై వుంది. అదే ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’. రష్యా–చైనాలు, నమూనాల కోసం ప్రారంభ ప్రయత్నాలు చేశాయి గానీ, ‘‘శ్రమ దోపిడీ’’ పట్లా, ‘‘శతృ వర్గాల’’ పట్లా, వాటి గ్రహింపులు గాఢమైనవిగా లేక, ఆ దేశాలు మంచి ప్రపంచానికి నమూనాలు కాలేకపోయాయి. అయితే, అక్కడి అపజయాలకు కారణాలేమిటో కాల క్రమంలో అక్కడా గ్రహిస్తారు, ఇక్కడా గ్రహిస్తారు, ప్రపంచం అంతటా గ్రహిస్తారు. ఆ గ్రహింపులు జరుగుతూనే వున్నాయి. ‘‘మంచి’’ కోసం జరిగే ప్రయత్నాల్లో అపజయాలు అదే విధంగా ఆగిపోవు. నమూనాలు కాల క్రమంలో ఏర్పడక పోవు. (2) మరో ప్రపంచంలో కూడా ఏదో ఒక ప్రభుత్వం ఉండాల్సిందే కదా?జవాబు: ‘‘మరో ప్రపంచం’’ అంటే, దాని అర్ధం వేరు. ‘‘ప్రభుత్వం’’ ప్రసక్తి, మరో ప్రపంచానిది కాదు. ఈ నాటి దోపిడీ ప్రపంచం, మరో ప్రపంచంగా స్తిర పడే వరకూ సాగే పరివర్తనా దశలో, దానికి తగిన ప్రభుత్వం (స్టేట్) అనేది, దాని కోర్టులూ, జైళ్ళూ, చిత్రహింసలూ, మరణ శిక్షలూ, వంటి వాటితో సహా, బానిసత్వం ప్రారంభమైన కాలంలో, యజమానుల వర్గ రక్షణ కోసమే, బానిస వర్గ అణిచివేత కోసమే, కొత్తగా ఏర్పడిందని మొదట తెలిస్తే; వర్గాలే పోయినప్పుడు, ప్రభుత్వం కూడా పోతుందని తెలుస్తుంది. శతృ వర్గాలు లేని ప్రపంచానికి ప్రభుత్వాలతో అవసరం వుండదు. సమాజానికి, సమాజ నిర్వహణ చాలు! ఈ నాటి శ్రామిక వర్గానికి ఈ నిజాలు తెలిస్తే, ప్రభుత్వంతో అవసరం లేని మంచి సమాజ నిర్మాణం ఒక ప్రశ్నా? (3) మీ మరో ప్రపంచంలో కూడా పెత్తనం కొందరి చేతుల్లోనే వుంటుంది కదా?జవాబు: ‘‘పెత్తనం’’ అన్నారంటే, దోపిడీ సంబంధాలనే ఊహిస్తున్నారని అర్ధం. దోపిడీ సంబంధాల్ని మార్చే ప్రయత్నాలు, ‘‘పెత్తనాలు’’ కావు, ‘‘స్వంత శ్రమ లేకుండా జీవించే హక్కు ఎవ్వరికీ లేదు. అందరూ శ్రమలు చెయ్యాలి’’ అని ఒక నిబంధన పెడితే, అది ‘‘పెత్తనం’’ కాదు. అది, శ్రామిక వర్గం, దోపిడీ నించి విముక్తి చెందే ఆత్మ రక్షణ మార్గం. ‘‘పురుషులు కూడా స్త్రీలతో పాటు ఇంటి పనులూ, పిల్లల పెంపకాలూ, వృద్ధుల సంరక్షణలూ చెయ్యాలి’’ అని నిబంధనలు పెడితే, అవి ‘‘పెత్తనాలు’’ కావు. అవి, స్త్రీలకు పురుషుల పెత్తనాల నించి విముక్తి. దోపిడీ వర్గాల పాలనలో వుండే రకపు పెత్తనాలే, శ్రామిక వర్గ పాలనలో కూడా వుంటే, అది వర్గాల రాహిత్యం అవదు. మంచి ప్రపంచం కోసం, దోపిడీ సంబంధాల్ని వ్యతిరేకించే కొత్త విద్యా, కొత్త కళలూ, కొత్త సంస్కృతీ, పెత్తనం లేని సంబంధాలూ, ఏర్పడతాయి. వాటిని కోరుకుంటేనే, ఏర్పర్చుకుంటేనే, అది మరో ప్రపంచం! (4) నేటి పోలీసు వ్యవస్త వంటిదే మరో పేరుతో వుండి తీరుతుందా లేదా?జవాబు: నేటి పోలీసు వ్యవస్త, దోపిడీ వర్గ రక్షకురాలు. రేపు, దోపిడీ వర్గం, తన స్వంత శ్రమతో తను బ్రతకాలని గ్రహిస్తే, అలా గ్రహించే వరకూ, అనేక కొత్త నిబంధనలతో పాటు పోలీసు కూడా అవసరమే. యుద్ధాలే లేకపోతే, సైన్యం ఎందుకు? దోపిడీయే లేకపోతే పోలీసు ఎందుకు? అందరికీ శ్రమలు చేసే అవకాశాలూ, కడుపునిండా తిండీ, బట్టా, ఇల్లూ, వైద్యం, విశ్రాంతీ, సంసారాల్లో శాంతీ – అన్నీ వుంటే, పోలీసు ఎందుకు? కొంత కాలం వరకూ పోలీసు వుంటే, వాళ్ళు కూడా ఉత్పాదక శ్రమలు చేసే వాళ్ళుగానే వుంటారు. అందరూ శ్రమలు చేసే మరో ప్రపంచానికి పోలీసు అక్కరలేదు. (5) పోలీసు వ్యవస్త లేని రాజ్యం ఎక్కడైనా వుంటుందా? జవాబు: బానిసత్వం గురించి తెలిసి వుంటే, ఈ ప్రశ్న రాదు. యజమానీ బానిస సంబంధాలు ప్రారంభం కాని కాలంలో, ‘‘రాజ్యం’’ అనేది లేదు. దానితో అవసరం ఇంకా కలగలేదు. రాజ్యం లేకుండానే అనేక వేల, లక్షల సంవత్సరాల కాలం గడిచింది. ‘‘రాజ్యం’’ ఎందుకు పుట్టిందో తెలిస్తే, అది ఎందుకు పోతుందో తెలుస్తుంది. దోపిడీ అదృశ్యమే, రాజ్యం అదృశ్యం! (6) మరో ప్రపంచంలో, శాంతి భద్రతల సమస్యలే తలెత్తవా? లాఠీ చార్జీలూ, కాల్పులూ, ఉండవా? జవాబు: దోపిడీ సంబంధాలు సాగుతూనే వుంటే, ఆ లాఠీలూ, తూటాలూ అన్నీ వుంటాయి. దోపిడీ సంబంధాలే వుంటే ‘శాంతి’ ఎవరికి కావాలి? భద్రత ఎవరికి కావాలి? కార్మికులు ఎప్పుడైనా సమ్మె చేస్తే అక్కడికి పోలీసులు తుపాకులతో దిగుతారు. అప్పుడు శాంతి భద్రతలు యజమానికి దొరుకుతాయి. కార్మికులకు కాదు. డబ్బూ, ఉత్పత్తులూ అన్నీ, ఒక వర్గం వేపు చీలిపోయి, అవన్నీ తయారుచేసిన వర్గం ఖాళీ చేతుల్తో వుంటే, వాళ్ళు డబ్బుని వెతుక్కుంటూ, అది ఎక్కడ వుందో అక్కడికి వస్తారు మరి. అందుకే, సిరి సంపదల వాళ్ళకి భద్రత కావాలి. శాంతి కావాలి. వాళ్ళ కోసం, వాళ్ళ భవనాల ముందు వాచ్‌మేన్లూ, పోలీసులూ, వుండాలి. ఒక చోటుకి చేరే ధన రాసులే లేకపోతే, శాంతి భద్రతల మాటేమిటి? నిరుపేద గుడిసె ముందు వాచ్‌మేన్ వుంటాడా? (7) మీ పాలన నచ్చని వారుంటారు. వారి అసమ్మతి వుంటుంది. వారి పోరాటం మీద మీరు ఎలా ప్రవర్తిస్తారు? జవాబు: ‘‘అసమ్మతీ; పోరాటమూ’’, మాటల్ని ఈ వ్యాసకర్త ఎంత అర్ధరహితంగా వాడేశారు! దోపిడీకి గురి అయ్యే వాళ్ళ అసమ్మతినీ, దోపిడీ చేసే వాళ్ళ అసమ్మతినీ ఒకే గాటిన కట్టారు. ‘‘అందరూ శ్రమలు చెయ్యాలి. ఇతరుల శ్రమల్ని దోస్తూ బ్రతకకూడదు’’ అని శ్రామిక వర్గం అంటే, దానికి ఎవరైనా అసమ్మతి చూపితే, వాళ్ళ అర్ధం ఏమిటి? వాళ్ళు, ‘‘మేము శ్రమలు చెయ్యం. వడ్డీలూ – లాభాలూ – కౌళ్ళూ తింటూ బ్రతికే హక్కులు మాకు కావాలి’’ అంటున్నారన్నమాట! వాళ్ళు, ఆ దృష్టితో, ‘‘దోపిడీ సమాజమే కావాలి’’ అంటే, దాన్ని, న్యాయమైన ‘‘అసమ్మతి’’గానూ, న్యాయమైన పోరాటంగానూ భావించారు ఈ వ్యాస కర్త. ‘‘మీ పాలనలో అసమ్మతిదారులు వుండరా? వాళ్ళ మీద లాఠీలూ, కాల్పులూ వుండవా?’’ అంటున్నారు. ‘‘దోపిడీ చేస్తాం! మమ్మల్ని చెయ్యనివ్వండి! మాకు అడ్డు రాకండి!’’ అనడాన్ని గొప్ప పోరాటంగా ఎంచి! ‘‘మేము శ్రమలు చెయ్యం. ఇతరుల శ్రమలే లాగుతాం’’ అనే వాళ్ళు దోషులే. వాళ్ళని జైళ్ళల్లో పడేసి అక్కడే పనులు చేయించవచ్చు. కానీ, అదంతా చెత్త! భూమిని జైళ్ళ కోసం ఉపయోగించడమా? అక్కడ కాపలా మనుషులు ఉండడమా? అది చాలా చెత్త! ‘‘శ్రమలు చెయ్యం’’ అని చెప్పే వాళ్ళని అడవుల్లోకి పొమ్మనాలి. ‘‘మీరు శ్రమలు చెయ్యం అంటున్నారు. అలాంటప్పుడు, అడుగడుగునా శ్రమలతో తయారైన ఊళ్ళల్లో వుండే హక్కు వుండదు మీకు. రోడ్డు మీద నడిచే హక్కు కూడా వుండదు. తిండీ, బట్టా, ఇల్లూ, మందులూ, పుస్తకాలూ, రవాణాలూ, అన్నీ శ్రమలవే. మీ ఒంటి మీద బట్టలు కూడా కింద పడేసి అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అడవులు మా శ్రమలు కావు. మీరు అక్కడ వుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ, మీరు అక్కడైనా ఏదో ఒక పని చేసుకోవాలి. పాకలు కట్టుకోవాలి, నేలలో వెతికి దుంపల్ని తవ్వి వాటిని కాల్చుకోవాలి. క్షవరాలు చేసుకోవాలంటే, మొదట కత్తెర్లు కావాలి. ఒంటి మీద బట్టలు కావాలంటే మొదట రాట్నాలూ, మగ్గాలూ, కావాలి. ఇక మీ ఇష్టం! ఊళ్ళల్లో వుంటారో, అడవుల్లోకి పోతారో! తేల్చుకోండి తొందరగా. ఊళ్ళల్లో వుండాలంటే, వెంటనే లారీ డ్రైవర్లుగా పనుల్లోకి దిగండి!’’ అని చెప్తే చాలు! వాళ్ళ కోసం లాఠీలూ, తూటాలూ, ఎందుకు? వృధా! వ్యాసకర్త ఇంకా అనేక ప్రశ్నలు అడగలేదు గానీ, ఇంకా చాలా వుంటాయి. మార్క్సిజాన్ని ఇష్టపడే వాళ్ళకి కూడా కొన్ని సందేహాలు వుంటాయి.‘‘అసలు, ప్రపంచంలో వున్న డబ్బు అంతా ఎవరిది?’’ అని అడిగితే, కొందరైనా, ‘‘శ్రామికులది’’ అంటారు. ‘‘ఏ శ్రామికులది’’ అంటే, చెప్పలేరు. ‘‘డబ్బు’’ అనేది, ఉత్పాదక శ్రామికుల ‘‘శ్రమ విలువ’’ మాత్రమే. అనుత్పాదక శ్రామికులు కూడా శ్రమ దోపిడీకి గురి అయినా, వారి శ్రమలు, డబ్బుగా మారవు. అలాగే, కుటుంబ శ్రమలు, డబ్బుగా మారవు. ‘‘మార్క్సిజం’’ మీద ఇంకో సందేహం. ‘‘మార్క్సిజం మాత్రం, సమానత్వాన్ని ఎలా ఇవ్వగలదు? ఒక వ్యక్తి శారీరక శ్రమ చేస్తాడు; ఇంకో వ్యక్తి మేధా శ్రమ చేస్తాడు. ఆ శ్రమల విలువలు సమానంగా వుండవు. ఆ వ్యక్తుల ఆదాయాలు తేడాగా వుంటాయి. మరి, వాళ్ళు ‘‘సమానులు’’ ఎలా అవగలరు?’’ – ఇదీ సందేహం!ఏ సందేహం కోసం అయినా, మార్క్స్ ‘‘కాపిటల్’’ పుస్తకం తెరవ వలిసిందే! అదే సమాజ శాస్త్రం మరి!రంగనాయకమ్మ | editorial |
1,345 | 09-06-2017 00:23:56 | ముగింపులో మెరుగు | తిథి: జ్యేష్ఠ శుక్ల చతుర్దశి నక్షత్రం: జ్యేష్ఠకృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, ధనుస్సు, మేష రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ: 9647.25 (-16.65)ట్రెండ్ మార్పు వేళలు: ఉదయం 11.45ధోరణి: గ్రహగతులను బట్టి నిలకడగా ప్రారంభమై 11 నుంచి 12.45 మధ్యలోను, ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 నుంచి 3.30 మధ్యలోను మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 12.45 నుంచి 2.45 మధ్యలో నిలకడగా ఉండవచ్చు. ట్రేడింగ్ వ్యూహం...నిఫ్టీ ఫ్యూచర్స్ 11 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.45 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2.45 తర్వాత ఎటిపి కన్నా పైనే ఉంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్ పొజిషన్లు శ్రేయస్కరం.నిరోధ స్థాయిలు : 9685, 9705మద్దతు స్థాయిలు : 9585, 9555మధ్యాహ్నం సమయానికి నిరోధ స్థాయిలకు చేరితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు, మద్దతు స్థాయిలకు చేరితే కనిష్ఠ స్థాయిల్లో అమ్మకాలు నివారించాలి. రిస్క్ భరించగల వారు మాత్రం పుల్‌బ్యాక్ ఆశలతో పొజిషన్లు తీసుకోవచ్చు.గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.- డా.భువనగిరి అమరనాథశాస్ర్తిwww.thefinancialastrologer.blogspot.in | business |
1,181 | 20-05-2017 07:05:18 | జిఎస్‌టితో ఈ వస్తువుల ధరలన్నీ భలే చౌక! | దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి కొన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి బియ్యం, గోధుమలు తదితర 7 శాతం వస్తువులకు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటి వరకు వీటిపై వ్యాట్ వ సూలు చేస్తున్నారు. జూలై 1 నుంచి పన్ను బాధ ఉండదు కాబట్టి వీటి ధరలు తగ్గనున్నాయి. చిరుధాన్యాలను ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నందున వీటి ధరలపై తరువాత నిర్ణయం తీసుకుంటారు. సబ్బులు, టూత్ పేస్టులు, హెయిర్ ఆయిల్, వంటనూనెలు, పంచదార, పెయింట్లు, ఎలక్ర్టానిక్ వస్తువుల ధరలు తగ్గుతాయి. చిన్నకార్లు, తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌ల ధరలు తగ్గేఅవకాశం ఉంది.మిఠాయిలు 5 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటి మీద అంతకంటే ఎక్కువ వ్యాట్ వసూలు చేస్తున్నారు కాబట్టి వాటి ధరలు కొంత తగ్గుతాయి. హెయిర్ ఆయిల్స్, సబ్బులు, టూత్‌పేస్ట్‌లపై ప్రస్తుతం మనం 22-24 శాతం మధ్యలో పన్ను కడుతున్నాం. వీటిని 18 శాతం శ్లాబ్‌లో ఉంచారు కాబట్టి ఈ వస్తువులు జలై 1 నుంచి ధరలు తగ్గుతాయి. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల మీద ప్రస్తుతం 31 నుంచి 32శాతం పన్నులు చెల్లిస్తున్నాం. కొత్త పన్నుల విధానంలో ఇవి 28 శాతం శ్లాబ్‌లో ఉన్నాయి కాబట్టి వీటి ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. | business |
403 | 20-05-2017 01:02:34 | అదరగొట్టిన హడ్కో |
హడ్కో షేర్లు అదరగొట్టాయి. ఇటీవలనే 60 రూపాయల ఆఫర్ ధరతో ఇష్యూకు వచ్చిన ఈ సంస్థ షేర్లు శుక్రవారం నాడు 22 శాతం ప్రీమియంతో 73.45 వద్ద బిఎస్ఇలో లిస్టయ్యాయి. షేరు ధర ఇంట్రాడేలో 77.80 రూపాయల గరిష్ఠ స్థాయిని తాకి ఆఖరులో 21 శాతం లాభంతో 72.50 రూపాయల వద్ద ముగిసింది. రెండు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీల్లోనూ భారీ పరిణామంలో షేర్లు ట్రేడయ్యాయి. బిఎస్ఇలో దాదాపు 303.12 లక్షల షేర్లు ట్రేడ్ కాగా, ఎన్‌ఎస్ఇలో 21 కోట్ల షేర్లు చేతులుమారాయి. హడ్కో పబ్లిక్ ఇష్యూకు కూడా ఇన్వెస్టర్ల నుంచి అసాధారణ స్పందన లభించిన విషయం తెలిసిందే. ఇష్యూ దాదాపు 80 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. దాదాపు 20 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లు దరఖాస్తు చేశారు. | business |
20,071 | 23-07-2017 19:28:05 | ఫైనల్‌లో తొలి సిక్సర్ బాదిన పూనమ్ | లండన్: ఇంగ్లండ్ నిర్దేశించిన 229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోని స్మృతి మందన రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి సంయమనంగా ఆడుతున్న మరో ఓపెనర్ పూనమ్ రౌత్ జాగ్రత్తగా ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ బౌలర్ ష్రబ్‌షోల్ వేసిన బంతిని సిక్సర్ కొట్టి ఫైనల్‌లో తొలి సిక్స్ నమోదు చేసింది. కాగా, ఇంగ్లండ్ ిఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా నమోదు కాలేదు. | sports |
10,821 | 01-11-2017 18:47:32 | ప్రభాస్ దూకుడు చూసి టెన్షన్ పడుతోన్న 'సాహో' యూనిట్ | 'బాహుబలి' కోసం కండలు పెంచి యుద్ధ సన్నివేశాల్లో వీర విన్యాసాలు చేసిన ప్రభాస్‌కు.. 'సాహో' సినిమా పుణ్యమా అని మళ్లీ సాహసాలు తప్పడం లేదట. పైగా వద్దని వారించినా వినకుండా రిస్కీ స్టంట్స్‌తో రెచ్చిపోతున్నాడట ఈ యంగ్ రెబల్ స్టార్.'సాహసం చేయరా ఢింభకా' రాజకుమారి వరించునని పాతాళభైరవిలో నేపాల మాంత్రికుడు చెప్పినట్టు సాహసంతో రిస్కీ స్టంట్స్ చేస్తే సక్సెస్ లభిస్తుందని ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు ఈ సూత్రాన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడీ వరుసలో ప్రబాస్ కూడా చేరాడు. ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తోన్న ప్రభాస్ ఈ సినిమా కోసం చాలానే సాహసాలు చేయబోతున్నాడట. కొన్ని రిస్కీ సీన్స్‌ను డూప్స్‌తో తెరకెక్కిద్దామని దర్శకనిర్మాతలు సూచించినప్పటికీ ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా తానే ఆ సన్నివేశాల్లో నటిస్తున్నాడట ఈ యంగ్ రెబల్ స్టార్. ఆ మధ్య 'బాహుబలి' విషయంలోనూ యాక్షన్ సీన్స్‌లో నటిస్తూ ప్రభాస్ గాయపడ్డాడు. అప్పట్లో ప్రభాస్‌కు చిన్నపాటి సర్జరీ కూడా జరిగినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో 'సాహో' కోసం బాడీ డబుల్ లేకుండా ప్రభాస్ చేస్తోన్న ఈ సాహసాలకు దర్శకుడు సుజిత్ తెగ టెన్షన్ పడుతున్నాడట. "ట్రాన్స్ఫార్మర్", "డై హార్డ్" చిత్రాలకు పనిచేసిన కెన్నీ బేట్స్ 'సాహో' సినిమాకు స్టంట్ మాస్టర్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సైతం హాలీవుడ్ స్థాయి హై ఓల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ కోసం ఈమాత్రం కష్టపడటంలో తప్పేమిలేదంటున్నాడట. మరి ప్రభాస్ రిస్క్ స్టంట్స్ 'సాహో' విజయానికి ఎంతవరకూ హెల్ప్ అవుతాయో చూడాలి..! | entertainment |
10,764 | 13-11-2017 16:12:19 | ఆ బట్టలను తిరస్కరించడం వల్ల పది సినిమాలు కోల్పోయిందట! | ప్రియాంక చోప్రా నేడు ఓ హాలీవుడ్ స్టార్. ప్రపంచంలోని అత్యంత నైపుణ్యం కలిగిన వంద మంది మహిళల్లో ఒకరు. అలాంటి ప్రియాంక కెరీర్ ప్రారంభంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని ఇటీవల ఆమె స్వయంగా తెలియజేసింది. తాజాగా ప్రియాంక తల్లి మధు చోప్రా ఓ విషయం బయటపెట్టారు. ఓ ప్రముఖ డైరెక్టర్ చెప్పినట్టుగా బట్టలు వేసుకోకపోవడం వల్ల ప్రియాంక పది సినిమాల్లో అవకాశాలను కోల్పోయిందని తెలిపారు. `2000లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ప్రియాంక రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఓ ప్రముఖ దర్శకుడి సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఆ సినిమా కోసం చాలా చిన్న కాస్ట్యూమ్స్ వేసుకోవాలని డైరెక్టర్ బలవంతం చేశాడు. ఆ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడని ప్రియాంక ఆ సినిమా నుంచి బయటకు వచ్చేసింది. దాని కారణంగా ఆమె పది సినిమాలను కోల్పోవాల్సి వచ్చింద`ని మధు చోప్రా తెలిపారు. | entertainment |
7,794 | 10-10-2017 10:51:39 | వలపు వాన తడిలో తమన్నా.. కల్యాణ్ రామ్ | వలపు వాన తడి ఏంటి.. ఆ తడిలో తమన్నా.. కల్యాణ్ రామ్ ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఇది వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్. అనంత్ శ్రీరామ్ రాశారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, కూల్ బ్రీజ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జయేందర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌లో భాగంగా తమ్ము, కల్యాణ్ రామ్‌లపై "చినికి చినికి వలపు వాన తడి" అంటూ ఓ రొమాంటిక్ రైన్ సాంగ్‌ని తెరకెక్కించారు. డిసెంబర్ చివరికల్లా షూటింగ్ పూర్తవుతుంది. దాదాపు 2018ఫిబ్రవరి చివరి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. | entertainment |
15,052 | 26-10-2017 06:40:35 | ప్రయాణికులకు రైల్వేశాఖ మంత్రి కొత్త సంవత్సర కానుక | ముంబై : దేశ ఆర్థిక నగరమైన ముంబైలోని ప్రయాణికులకు కేంద్ర రైల్వేశాఖామంత్రి పీయూష్ గోయల్ 2018 జనవరి 1న కొత్త సంవత్సర కానుక ఇస్తామని ప్రకటించారు. పశ్చిమ రైల్వే పరిధిలోని ముంబై నగరంలో మొట్టమొదటిసారి ఫస్ట్ ఏసీ లోకల్ రైలు సర్వీసును వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రవేశపెట్టనున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫస్ట్ క్లాస్ టికెట్ కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా టికెట్ తో నడిచే ఈ లోకల్ ఏసీ రైళ్ల కోచ్ లను చెన్నై నగరంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. కేవలం 20 నుంచి 30 సెకన్ల పాటు స్టేషన్లలో ఆగే ఈ ఏసీ లోకల్ రైళ్లతో ముంబై ప్రయాణికులకు మెరుగైన సేవలందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు ముంబయి నగరంలో రైల్వే ప్రయాణికుల భద్రత కోసం 370 ఎస్కలేటర్లు, సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు పీయూష్ గోయల్ వివరించారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఏసీ లోకల్ రైళ్లను నడుపుతామని మంత్రి చెప్పారు. | nation |
19,147 | 31-05-2017 01:46:12 | ముంబై తరహా ఉగ్రదాడి కుట్ర? |
న్యూఢిల్లీ, మే 30: ముంబైపై ఉగ్రదాడి తరహాలో భారతపై మరోసారి విరుచుకుపడేందుకు పాకిస్థాన్ నుంచి 20-25 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ సరిహద్దుల్లోని పట్టణాల్లో గానీ, దేశంలోని ఏదైనా మెట్రో నగరంలో గానీ దాడి చేసే అవకాశం ఉందని తెలిపాయి. పర్యటక ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్, హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు వెళ్లాయి. మరోపక్క కశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్‌బుల్ ముజాహిదీన్‌లో లుకలుకలు బయల్దేరాయి. హిజ్‌బుల్ కమాండర్ జాకిర్ మూసా ఇరవై రోజుల క్రితం ఒక ఆడియో టేపు విడుదల చేశాడు. హిజ్‌బుల్ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్లు ప్రకటించాడు. ఇక నుంచి ఇస్లామిక్ ఖాలిఫైట్‌కు మాత్రమే విధేయుడినన్నాడు. హురియతపై యుద్ధం ప్రకటించాడు. హురియత నేతలందర్నీ తలలు నరకాలని పిలుపునిచ్చాడు. | nation |
14,468 | 11-11-2017 01:48:23 | మోదీ సక్సెస్! | సువిశాల భారతాన్ని ఏకం చేశారు ఎపెక్ సీఈవోల భేటీలో ట్రంప్ ప్రశంసలు రేపు ఫిలిప్పైన్స్ వెళ్లనున్న ప్రధాని ఇండియా-ఏసియాన్ సదస్సుకు హాజరుదనాంగ్ (వియత్నాం), నవంబరు 10: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం భారత ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. సువిశాల దేశాన్ని, దాని ప్రజలను ఏకోన్ముఖం చేయడంలో విజయం సాధించారని కొనియాడారు. శుక్రవారం చైనా నుంచి వియత్నాం చేరుకున్న ఆయన.. దనాంగ్ నగరంలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కో-ఆపరేషన్ (ఎపెక్) సదస్సు సందర్భంగా పలు సంస్థల సీఈవోలనుద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి బహిరంగ మార్కెట్ విధానంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ నమ్మశక్యం గాని రీతిలో అనూహ్య వృద్ధి సాధించిందని తెలిపారు. ‘భారత్ 70వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తన ఆర్థిక వ్యవస్థకు తలుపులు తెరిచినప్పటి నుంచి అనూహ్య వృద్ధిని సాధించింది. నానాటికీ విస్తరిస్తున్న తన మధ్యతరగతి వర్గానికి అపార అవకాశాలు కల్పిస్తోంది. ఇంత సువిశాల దేశాన్ని, ప్రజలను ఒక్కటి చేసేందుకు ప్రధాని మోదీ శ్రమిస్తున్నారు. ఆ దిశగా విజయవంతమవుతున్నారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఎపెక్ గ్రూపులో భారత్‌కు సభ్యత్వం లేదు. ఈ విషయాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ.. ఈ గ్రూపులో లేని దేశాలు కూడా ఇండో-పసిఫిక్ నూతన అధ్యాయంలో భాగస్వాములయ్యేందుకు గొప్ప కృషిచేస్తున్నాయని చెప్పారు. కాగా.. ఫిలిప్పైన్స్‌లో ఆదివారం ఇండియా-ఏసియాన్, తూర్పు ఆసియా సదస్సులు జరుగనున్నాయి. వీటికి హాజరయ్యేందుకు మోదీ అక్కడకు వెళ్తున్నారు. తూర్పు ఆసియా సదస్సుకు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే ద్వైపాక్షిక భేటీ ఉండదని వైట్‌హౌస్ ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాలతో చతుర్భుజ కూటమి ఏర్పాటుకు అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. కిమ్ క్రూర కలలకు ఆసియా భవిష్యత్ బందీఉత్తరకొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్‌పై ట్రంప్ మండిపడ్డారు. క్రూరమైన ఆ నియంత కలలకు, అణు బ్లాక్‌మెయిల్‌కు ఆసియా భవిష్యత్ మొత్తం బందీగా చిక్కుకుందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశాలన్నీ ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ఒక్కటి కావాలని ఎపెక్ భేటీలో పిలుపిచ్చారు. ఈ సంక్షోభంపై సమయం మించిపోతోందన్నారు. అంతకుముందు చైనాపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు. | nation |
15,961 | 20-09-2017 14:14:43 | డేరా ప్రధాన కార్యాలయంలో 600 అస్థిపంజరాలు... | న్యూఢిల్లీ: డేరాబాబా గుర్మీత్ సింగ్ కీచకపర్వంపై మరో షాకింగ్ వ్యవహారం వెలుగుచూసింది. సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయం లోపల మొత్తం 600 పైగా అస్థిపంజరాలను పూడ్చిపెట్టినట్టు సమాచారం. డేరా క్యాంపస్‌లో అనేక అస్థిపంజరాలు పాతిపెట్టారనీ.. వాటిపై మొక్కలు నాటి కవర్ చేశారని సిట్ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఈ అస్థిపంజరాలకు ‘మోక్షం’ సిద్ధించాలంటే వాటిని పాతిపెట్టాలని డేరాబాబా తమను ఆదేశించినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. డేరా ఆశ్రమంలోకి వెళ్లిన దాదాపు 500 మంది జాడలేకుండా పోయారనీ... డేరాక్యాంపస్‌లో తవ్వకాలు జరిపితే పెద్ద ఎత్తున అస్థిపంజరాలు బయటికి వస్తాయని హర్యానా సీనియర్ జర్నలిస్టు ఒకరు ఇటీవల పేర్కొన్నారు. గుర్మీత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దారుణంగా హతమార్చి డేరా క్యాంపస్‌లో రహస్యంగా పాతిపెట్టేవారని ఆయన ఆరోపించారు. జాతీయ స్థాయి మీడియా సమక్షంలో మాత్రమే తవ్వకాలు జరగాలని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇద్దరు సాధ్విలను అత్యాచారం చేసినట్టు రుజువుకావడంతో డేరాబాబాకి 20 యేళ్ల కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనంతరం డేరా క్యాంపస్‌లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విచారణ సందర్భంగా డేరాను అడ్డాగా చేసుకుని గుర్మీత్ సింగ్ రాజవైభోగం వెలగబెట్టినట్టు వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోనే తొలిసారి రాష్ట్రపతి పాలన.. శ్రీకృష్ణుడికి రాధ ఏమవుతుందో తెలుసా? | nation |
8,019 | 22-07-2017 14:06:21 | మార్నింగ్ వాక్ చేస్తుండగా యాంకర్‌ను కబళించిన కొబ్బరిచెట్టు | ఏ టైం, ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదు అంటే ఇదేనేమో! మార్నింగ్ వాక్ చేస్తున్నా మృత్యువు ముంచుకురావొచ్చనేదానికి ఇది ఒక ఉదాహరణ అవుతుందేమో. ఓ టీవీ మాజీ యాంకర్ ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళుతుండగా.. అకస్మాత్తుగా కూకటివేళ్లను పెగిలించుకుంటూ ఓ కొబ్బరి చెట్టు ఆమెపై కుప్పకూలింది. ఆ కొబ్బరి చెట్టు పడిన తాకిడికి ఆమె తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. సమయానికి ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ శనివారం ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ముంబైలోని చెంబూర్ స్వస్తిక్ పార్కులో గురువారం జరిగింది. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాంచన నాథ్ అనే దూరదర్శన్ టీవీ మాజీ యాంకర్.. ఎప్పటిలాగానే గురువారం ఉదయం వాకింగ్‌కు వెళుతున్నారు. ఉన్నట్టుంది ఓ కొబ్బరి చెట్టు ఆమెపై కూలిపోయింది. అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై ఆమెను ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్సను అందించినా.. కంచన్ ప్రాణాలు నిలబడలేదు. ఇక, కొబ్బరిచెట్టు కూలి ఆమె మీద పడిపోవడం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. | entertainment |
2,811 | 24-05-2017 01:43:49 | రూ.1079కే జెట్ టికెట్ | ముంబై: జెట్ ఎయిర్‌వేస్ రానున్న రుతుపవనాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల ఫీజులతో కలిపి 1079 రూపాయలకే విమాన టికెట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలోనే ఈ ప్రత్యేక డిస్కౌంట్ ధరలు వర్తిస్తాయి. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికపై బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ స్పెషల్ ఆఫర్ కింద టికెట్ల బుకింగ్ తెరిచి ఉంటుంది. ప్రయాణికులు జూన్ 15 నుంచి సెప్టెంబరు 20 తేదీల మధ్య కాలంలో ప్రయాణించవచ్చు. రెండు వైపుల ప్రయాణానికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. | business |
3,885 | 20-01-2017 02:25:14 | కొత్తగూడెం విమానాశ్రయానికి వ్యతిరేకంగా సభ | తెలంగాణలో 80 శాతం బొగ్గు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఓపెన్ కాస్ట్‌ల పేరిట ఆదివాసీ ప్రాంతాలను స్మశాన వాటికలుగా మారుస్తున్నారు. సత్తుపల్లి, మణుగూరు, కోయగూడెం ప్రాంతాలలో బలవంతంగా ఆదివాసీల భూములు లాక్కుని ఓపెన్ కాస్ట్‌లు తీస్తున్నారు. ఆదివాసీలకు మాత్రం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులు ఆదివాసీల బతుకులతో చెలగాటమాడుతున్నాయి. కొత్తగూడెం విమానాశ్రయం పేరుతో ఆదివాసీల భూములను ప్రభుత్వం బలవంతంగా సేకరిస్తోంది. కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, కొత్తగూడెం క్లబ్‌లో నేడు ఉదయం 10 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది.- తెలంగాణ ప్రజా ఫ్రంట్ | editorial |
8,715 | 20-11-2017 10:53:13 | కోడి రామకృష్ణకు ఇప్పటివరకూ బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు ఇవ్వలేదు | నంది అవార్డుల వివాదంపై ఏబీఎన్ నిర్వహించిన ఓపెన్ డిబేట్‌లో రచయిత రాజేంద్ర కుమార్ సరికొత్త అంశాన్ని లేవనెత్తారు. వివాదంపై స్పందన ఆయన మాటల్లోనే.. కోడి రామకృష్ణ తీసిన అంకుశం సినిమాకు నాడు బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు ఇవ్వలేదు. అదే సంవత్సరం గీతాంజలి సినిమాకు ఇచ్చారు. లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు ఇవ్వడంలో న్యాయం ఉంది. రాజకీయ పార్టీలు ముందుగా కులాల వారీగా ఇన్ని సీట్లు ఇస్తామని చెప్పిన తరహాలోనే రాబోయే రోజుల్లో నంది అవార్డుల ఎంపికలో కూడా ఇలాంటి పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇదే తరహాలో నంది అవార్డుల విషయంలో గందరగోళ పరిస్థితులుంటే ప్రభుత్వాలు అవార్డులు తొలగించే అవకాశాలుంటాయి.రాజేంద్రకుమార్, రచయిత | entertainment |
14,091 | 24-09-2017 15:25:03 | బంగ్లాదేశ్‌లో రొహింగ్యా హిందువుల పరిస్థితి దారుణం |
ఢాకా : మయన్మార్ నుంచి వలస వెళ్ళినవారిలో ముస్లింలతో పాటు హిందువులు కూడా ఉన్నారు. దాదాపు 100 హిందూ కుటుంబాలు రఖైన్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళాయి. కాక్స్ బజార్ వద్ద శిబిరంలో వీరు ఉంటున్నారు. ఈ శిబిరం నిర్వహణ బాధ్యతను కొందరు సామాజిక ఉద్యమకారులు చేపట్టారు. పౌల్ట్రీ ఫారంను తాత్కాలిక శిబిరంగా మార్చారు. దీనిలో దాదాపు 600 మంది హిందువులు ఉన్నారు. వీరికి ఆహారం సక్రమంగా అందడం లేదు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇచ్చినప్పటికీ ఆహారాన్ని సరఫరా చేయడం లేదని వలసదారులు చెప్పారు. ఐక్యరాజ్య సమితి ఆహార పథకం క్రింద మాత్రమే వీరికి కొన్ని బియ్యం, నూనె లభించాయని బాధితులు చెప్పారు. కొందరు విరాళాలు ఇస్తున్నారని కూడా తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి తమకు సహాయం అందడం లేదని, ప్రైవేటు సంస్థలే సాయపడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తమకు 10 కేజీల బియ్యం, ఒక లీటరు నూనె పంపించిందని, ఐరాస ఆహార పథకం క్రింద 25 కేజీల బియ్యం పంపించిందని తెలిపారు. తమకు సరైన వసతి సదుపాయం లేదని చెప్పారు. మయన్మార్ నుంచి వలస వచ్చినవారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం 12 శిబిరాల్లోని వలసదారులకు ఆహార సరఫరా ఏర్పాట్లు చేసింది. సైన్యాన్ని మోహరించి సక్రమంగా ఆహారం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంది. కానీ ఈ శిబిరాల్లో హిందువులు లేకపోవడం విశేషం. | nation |
11,068 | 24-12-2017 02:23:07 | బెంగళూరులో నీళ్ల అంబులెన్స్ | ఫోన్ చేస్తే చాలు.. వచ్చేస్తుందిబెంగళూరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులో నీటి అంబులెన్స్ (వాటర్ అంబులెన్స్)ను వచ్చేసింది. టోల్‌ఫ్రీ నంబరు ద్వారా ఫిర్యాదు చేస్తే హుటాహుటిన నీళ్ల అంబులెన్స్ రంగంలోకి దిగుతుంది. వెంటనే తాగునీటిని అందించడంతో పాటు బోరుబావులు, ఆర్‌వో ప్లాంట్లు, పైప్‌లైన్‌లకు అంబులెన్స్ సిబ్బంది మరమ్మతులు చేస్తారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకంలో బెంగళూరు జిల్లావ్యాప్తంగా సేవలందించేలా ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించారు. | nation |
3,918 | 07-12-2017 02:12:54 | నవ్యాంధ్ర చుక్కాని సామాజిక న్యాయం | రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రతిబింబిస్తున్న వాస్తవ పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా శాస్త్రీయంగా, భౌగోళిక పరిస్థితులను బట్టి ఏ వర్గాన్నీ నొప్పించకుండా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను బీసీల్లో చేరుస్తూ, బోయ కులస్థులను ఎస్టీలో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. గతంలో చాలా మంది రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అనేక సార్లు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. నేడు ఆ విధంగా కాకుండా స్పష్టమైన దృక్పథంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక ఏ ప్రభుత్వం చేయని పనిని చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేసింది. పేద వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా సువర్ణ అవకాశాన్ని కల్పించి సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకునేందుకు బాటలు వేసిందిసామాజిక న్యాయం, అసమానతల నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందనడానికి అసెంబ్లీ సాక్షిగా కల్పించిన రిజర్వేషన్లే నిదర్శనం. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు, బోయలకు ఎస్టీ హోదా కల్పించడంవల్ల చెప్పింది చేసే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు చరిత్రలో నిలిచిపోయారు. దీర్ఘకాలిక ఫలితాల సాధన దిశగా నవ్యాంధ్రప్రదేశ్‌ను నడిపిస్తూ, రిజర్వేషన్లపై ఆయా వర్గాలు కన్న కలలు చంద్రబాబునాయుడు నెరవేరుస్తున్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అనేకమంది ఆర్థిక, సామాజిక వెనుకబాటు కారణంగా విద్యా, ఉపాధి అవకాశాలు పొందలేకపోయారు. నేడు ఆ కష్టాలు రిజర్వేషన్ల ద్వారా దూరం కానున్నాయి. రాత్రికి రాత్రే కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యంకాదని, అందుకు నిర్దిష్ట పద్ధతిప్రకారం వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పినా పట్టించుకోకుండా విమర్శలు చేసిన నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? కాపు జాతి ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రభుత్వం చేసినన్ని మేళ్లు గతంలో ఏ ప్రభుత్వమైనా చేసిందా? రాష్ర్ట చరిత్రలో మొట్టమొదిసారిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి, మూడేళ్లలో రూ. 2100 కోట్లు ఖర్చు చేయడంతో పాటు కొత్తగా కాపుల కోసం 9 పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధికి బాటలు వేయడం జరిగింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను బీసీల్లో చేర్చే అంశం ఒక క్రమపద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా జరిగింది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రభుత్వం తొందర పాటు నిర్ణయం కాపులకు తీరని అన్యాయం చేసింది. ఆ తరువాత వైఎస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేసింది. వైఎస్ ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల ముస్లింలకు తీరని అన్యాయం జరిగింది. ముస్లిం రిజర్వేషన్‌ల విషయంలో ఎదురైన కోర్టు సమస్యలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం ప్రభుత్వం కాపు రిజర్వేషన్‌ల విషయంలో పకడ్బందీగా వ్యవహరించింది. 2014 మార్చిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక సామాజిక వర్గానికి బీసీ స్టేటస్ కల్పించాలంటే ముందుగా ఆ రాష్ట్రం ఆ స్టేటస్ కల్పించాలి. కాపులకి బీసీ స్టేటస్ కల్పించేందుకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏమిచేయాలో రాష్ర్ట ప్రభుత్వం అవి చేసింది. 9 నెలల్లో నివేదిక ఇవ్వాలని, 2016 జనవరి 16న బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. బీసీ కమిషన్‌ను నియమించడం ద్వారా రిజర్వేషన్‌ల కేటాయింపునకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసింది. ఈ కమిషన్ 13 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి కాపులకు సంబంధించిన జీవన స్థితిగతులు, ఆర్థిక, సామాజిక అంశాలను పరిశీలించి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రజా సాధికారత సర్వే వివరాలను కూడా క్రోడీకరించి 266 రోజులు సుదీర్ఘ అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. బీసీ కమిషన్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రాష్ట్ర కేబినెట్ 6 నెలల్లో మూడు సార్లు రిపోర్టు కోరడం జరిగింది. బీసీ కమిషన్‌లోని మెజార్టీ సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంది. నివేదికను రెండుసార్లు కేబినెట్‌లో చర్చించి ఉభయ సభల్లో ప్రవేశపెట్టి తీర్మానంచేసి, గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించటం జరిగింది. తమిళనాడు తరహాలో కాపులకు రిజర్వేషన్‌లు కల్పించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవటం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. కాపులను బీసీ జాబితాలో చేర్చటం వల్ల ఇప్పటికే బీసీలుగా ఉన్న వారికి ఎటువంటి నష్టం ఉండదు. దీనికోసం కమిషన్ అధ్యయనం చేసిన తర్వాత ప్రణాళికాబద్ధంగా కాపులను బీసీల్లో చేర్చడం జరిగింది. ప్రస్తుతం వెనుకబడిన తరగతుల్లో ఉన్న ఏ ఒక్కరికి నష్టం జరగకుండా ఏ, బీ, సీ, డీ, ఈ కోటాల్లో కోత వేయకుండా కొత్తగా ‘ఎఫ్’ కేటగిరీని చేర్చి 5 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. షెడ్యూల్ 9లో 5 శాతం రిజర్వేషన్లు అదనంగా కాపులకు కల్పించడం జరిగింది. బీసీ(-ఏ) కేటగిరిలో ఉండే వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చటం వలన మిగిలిన 51 ఉప కులాలకు మేలు జరుగుతుంది. బీసీ(సీ) కేటగిరిని మతం మార్చుకున్న వారి కోసం కేయించడం జరిగింది. వీరి రిజర్వేషన్ శాతంలోనూ కోత పెట్టలేదు. బీసీ(డీ) కేటగిరిలో 48 కులాలు ఉండగా, అందులో మున్నూరు కాపు, తమ్మర, లక్కమర్రి కాపు, వరల అనే నాలుగు కులాలు అసలు ఆంధ్రలోనే లేవు. అయినా వీరికి కేయించిన 7 శాతం రిజర్వేషన్లలోనూ ఎక్కడా కోత పెట్టలేదు. బీసీ(ఇ) కేటగిరీని వెనుకబడిన ముస్లిం ఉప కులాల కోసం కేయించారు. దీనిలోని 4 శాతం రిజర్వేషన్లలోనూ కోత విధించలేదు. ఏపీలో ప్రస్తుతం 136 కులాల వారు బీసీలుగా ఉన్నారు. అందులో 18 కులాలు ఆంధ్రాలోనే లేవు. బీసీలకు కేయించిన రిజర్వేషన్‌లో ఎలాంటి మార్పు చేయకుండా బీసీ-(ఎఫ్)గా కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ను కల్పించడం జరిగింది. కాపులకు 5 శాతం ఇవ్వడంతో రిజర్వేషన్ల శాతం 55కు చేరింది. బీసీలకు అన్యాయం జరగలేదు, కాపులకు న్యాయం జరిగింది. ఇద్దరికీ మేలు చేసేలా తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది. ఎస్టీలకు ఎటువంటి నష్టం జరగకుండా వాల్మీకి, బోయ కులస్థులను ప్రభుత్వం చట్టబద్ధంగా ఎస్టీలో చేర్చడం జరిగింది. సంచార జాతులైన వాల్మీకి, బోయలకు ఎస్టీ హోదా కల్పించడం వారిపురోభివృద్ధికి దోహదపడుతుంది. అత్యంత పురాతనమైన ఆటవిక తెగగా బోయలను గుర్తించారు. 1962లో సెన్సెస్ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా ఉన్న రాయబర్డన్ బోయలను ఎస్టీల్లో చేర్చాలని ఆనాడే సిఫార్సు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రైబ్స్ కమిటీ కూడా ఎస్టీల్లో చేర్చాలని సిఫార్సు చేసింది. ఎస్టీలో చేర్చేందుకు అన్ని అర్హతలు ఉండి కూడా ఈనాటికీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తగిన గుర్తింపును, గౌరవాన్ని నోచుకోక తీవ్రమైన ఇబ్బందుల్లో వాల్మీకి, బోయ సామాజిక వర్గం ఉంది. సత్యపాల్ కమిటీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లు అన్ని జిల్లాల్లో ఈ కులాల స్థితిగతులను అధ్యయనం చేసిన తరువాత ఎస్టీలుగా బోయలను గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అడవులే ఆలవాలంగా జీవించే గిరిజనజాతుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. గిరిజన హక్కుల కోసం పోరాడిన అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున 13 గిరిజన భవన్‌లను నిర్మిస్తున్నారు. ఎస్టీలందరికీ గురుకుల విద్య అందిస్తున్నారు. రిజర్వేషన్లపై నేడు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాపులు, బీసీలు, ఎస్టీలు సంతోషంగా ఉన్నారు. వెనుకబడిన తరగతుల వారికి సామాజిక న్యాయం చేకూర్చటం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు తెలుగుదేశం అన్యాయం చేస్తుందనడం కేవలం వెనుకబడిన వర్గాలవారికి న్యాయం జరగకూడదు అనుకునేవారి కుట్రలో భాగమే. నేడు ఎవరైతే బీసీల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్నారో వారు తెలంగాణలో 26 కులాల్ని బీసీ జాబితా నుంచి తొలిగించినప్పుడు ఎందుకు బీసీల తరుపున పోరాటం చేయలేదు? వారి హక్కుల కోసం ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? ఎటువంటి కమిటీలు, కమిషన్లు, కసరత్తులు లేకుండా జీవోలు జారీచేసి, రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీల 33 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి బీసీల పొట్ట కొట్టే కుట్ర పన్నినా ఈ నేతలు స్పందించలేదు? బీసీ కులాలను 93 నుంచి 136కి పెంచినప్పటికీ అదే స్థాయిలో రిజర్వేషన్ల శాతం పెంచలేదు. నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారు ఒక్కసారి అత్మపరిశీలన చేసుకోవాలి. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు బీసీల పరిస్థితి ఎలాంటిదో, తెలుగుదేశం ఆవిర్భావం తరువాత బీసీల పరిస్థితి ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వస్తోందో ఆలోచించాలి. సమాజంలో సగభాగంగా ఉన్న బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. బీసీల అభివృద్ధి కోసం మొట్టమొదటి సారిగా స్వర్గీయ ఎన్.టి రామారావు స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించి, గ్రామస్థాయిలో బలహీన వర్గాల నాయకత్వాన్ని ఇతోధికంగా ప్రోత్సహించారు. తరువాత చంద్రబాబు నాయుడు హయాంలో బీసీ ప్రతినిధులకు ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం కల్పించడంతో పాటు, కుల వృత్తులు, చేతి వృత్తుల ప్రోత్సాహకానికి అనేక పథకాలను అమలుచేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు రూ.10 వేల కోట్లతో సబ్ ప్లాన్ ప్రవేశపెట్టారు. నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన ప్రతిపక్షం విషం కక్కుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి అడ్డుపడుతోంది. కుట్రలు, కుతంత్రాలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేద్దామనే ఆలోచన ప్రతిపక్షానికి లేదు. బీసీ, ఎస్టీల ప్రయోజనాలకు ఎలాంటి ఢోకా లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు అందరూ స్వాగతించాలి. వ్యవస్థీకృత సామాజిక అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకారం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అనిల్ పాటిబండ్లటీడీపీ నాలెడ్జ్ సెంటర్ | editorial |
10,278 | 12-11-2017 22:35:21 | ‘గల్ఫ్’కి సీక్వెల్ |
ప్రవాస మిత్ర సంస్థ, శ్రావ్య ఫిల్మ్స్ సంయుక్తంగా ‘గల్ఫ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఓ సినిమాను తీస్తున్నామని దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి తెలిపారు. మందా భీమిరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. ‘గల్ఫ్’ సినిమా 16 సెంటర్‌లలో 25 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సునీల్‌కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ‘‘గల్ఫ్’ సీక్వెల్ కన్నా ముందు బాపిరాజుగారితో ఓ సినిమా చేస్తా. ‘రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘క్రిమినల్ ప్రేమకథ’ చిత్రాలకు సీక్వెల్‌గా ఈ సినిమా ఉండబోతుంది. దానికి ‘రొమాంటిక్ క్రిమినల్స్’ అనే టైటిల్ పెట్టాం. మనోజ్ నందం, అనిల్ కల్యాణ్ ఇందులో నటిస్తారు’’ అని తెలిపారు. | entertainment |
13,341 | 04-01-2017 23:02:34 | ఈ-వ్యాలెట్లపై ఎస్‌బీఐ ఆంక్షలు | న్యూఢిల్లీ: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులా? అయితే పేటీఎం, ఫ్రీచార్జ్, మొబిక్విక్, జియో మనీ, ఎయిర్‌టెల్ మనీ వంటి వ్యాలెట్ సర్వీసుల్లోకి.. మీ ఖాతా నుంచి ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఈ కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా డబ్బు వేయలేరు. ఈ రెండు విధానాల ద్వారా అలాంటి సర్వీసుల్లోకి ఖాతాదారులు డబ్బు బదిలీ చేసే అవకాశం లేకుండా ఎస్‌బీఐ బ్లాక్ చేస్తోంది. ఆసక్తికరమైన విషయమేంటంటే.. పేటీఎంలాగానే పనిచేసే స్టేట్‌బ్యాంక్ ఈవ్యాలెట్ ‘ఎస్‌బీఐ బడ్డీ’ నుంచి కూడా ఈ-వ్యాలెట్లకు డబ్బు బదిలీ చేసే అవకాశం ఉంది. అలాగే.. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా ఈ వ్యాలెట్లలోకి డబ్బు జమ చేయగలరు. భద్రతా కారణాల రీత్యానే మిగతా రెండు విధానాలను బ్లాక్ చేస్తున్నట్టు ఎస్‌బీఐ వర్గాలు తెలుపుతున్నాయి. ఇటీవలికాలంలో జరిగిన ఫిషింగ్ ఎటాక్‌లను ఉదాహరించిన ఆ వర్గాలు.. అలాంటి దాడుల నుంచి, వాటివల్ల కలిగే నష్టాల నుంచి తమ ఖాతాదారులను కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. అయితే.. నోట్ల రద్దు నేపథ్యంలో ఈ-వ్యాలెట్ సర్వీసులే నగదుకు ప్రధాన ప్రత్యామ్నాయంగా మారాయని, అలాంటి సర్వీసుల్లో డబ్బు జమను అడ్డుకోవడానికి కారణాలేంటో వివరించాలని ఎస్‌బీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. కాగా.. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, ఈకామర్స్ వెబ్‌సైట్ల నుంచి కూడా డబ్బు జమ చేసే అవకాశం కల్పించడంపై పునఃపరిశీలించాలని ఎస్‌బీఐని మొబిక్విక్ కోరింది. | nation |
19,623 | 15-10-2017 01:46:21 | దాయాదుల సమరం |
నేడు ఇండో-పాక్ ఢీఆసియా కప్ హాకీఢాకా: ఆసియా కప్ హాకీలో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న భారత్.. ఆదివారం జరిగే హైవోల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. పూల్-ఎలో మొదటి మ్యాచ్‌లో 5-1తో జపాన్‌ను మట్టికరి పించింది. ఇక రెండో మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను 7-0తో దుమ్ముదులిపింది. మరోవైపు పాకిస్థాన్‌కు మిశ్రమ ఫలితా లందాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాను 7-0తో చిత్తు చేసిన పాక్.. రెండో మ్యాచ్‌లో జపాన్‌తో డ్రా చేసుకుంది. పూల్-ఎలో భారత్ మొత్తం ఆరు పాయింట్లతో టాపర్‌గా ఉండగా.. పాక్ రెండో స్థానంలో ఉంది. రెండు విజయాలతో టీమిండియా ఈపాటికే సూపర్-4కు చేరుకోగా.. లీగ్‌లో చివరి మ్యాచ్‌ను కూడా గెలుపుతో ముగించాలనే పట్టుదలతో ఉంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో మన్‌ప్రీత్ సేన ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. రెండు వైపుల నుంచి దాడులు చేస్తూ గోల్ అవకాశాలను ఇబ్బడిమబ్బడిగా సృష్టించుకుంది. భారత్ ఎక్కువగా ఫీల్డ్ గోల్స్ చేయడం విశేషం. అయితే పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మార్చే విషయంలో ఇంకా తడబాటుకు లోనుకావడం ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ 13 పెనాల్టీ కార్నర్‌లను సాధిస్తే.. రెండింటిని మాత్రమే గోల్స్‌గా మలిచింది. ముఖ్యంగా కొత్త కోచ్ మరిజ్నేకు పాక్‌తో మ్యాచ్ పెద్ద సవాల్. ఇండో-పాక్ మ్యాచ్‌లు భావోద్వేగాలతోపాటు ఆట కూడా సరికొత్త స్థాయిలను తాకుతుంది. ప్రస్తుతం పాక్ జట్టు కొంత బలహీనంగా కనిపిస్తోన్నా.. భారత్‌తో పోరంటే మాత్రం సర్వశక్తులూ ఒడ్డుతుంది. ఈ నేపథ్యంలో టీమిం డియా ఏమాత్రం ఆవేశపడకుండా మ్యాచ్‌ను నియంత్రిం చాలి. భారత్, పాక్‌లు చివరిసారిగా జూన్‌లో లండన్‌లో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో తలపడ్డాయి. | sports |
12,942 | 30-11-2017 02:32:35 | మోదీ హయాంలో పెరిగిన మాంసం ఎగుమతులు | ‘‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాంసం ఎగుమతులు 3 రెట్లు పెరిగాయి. ఆవు మాంసంతో పాటు ఎలాంటి మాంసాలను విదేశాలకు ఎగుమతి చేయరాదని సుప్రీంకోర్టు 2006లో ఆదేశాలు జారీచేసినా ఇంతవరకు అమలులోకి రాలేదు. భారత్ నుంచి విదేశాలకు మాంసం ఎగుమతులను పూర్తిగా నిషేధించాలి. గోవధ నిషేధంపై మాట్లాడే నాయకులంతా తమ మాంసం ఎగుమతి వ్యాపారాలను తక్షణం నిలిపివేయాలి.’’దయానందస్వామి,విశ్వప్రాణి దయామండలి అధ్యక్షుడు | nation |
9,526 | 13-03-2017 00:11:27 | నన్నింక మరిచిపొమ్మని చెప్పరా!! | రెండు కన్నీటి చుక్కల్ని చూసే మనం ఒక్కోసారి కకావికలైపోతాం. అలాంటిది, ఒక్కోసారి జీవితమే కన్నీటి సముద్రమైపోతుంది. ఆ సముద్రాన్ని దాటి బయటికి రావడం ఇక ఎప్పటికీ సాధ్యం కాదని, నువ్వు నువ్వుగా ఇంక మిగలవనీ తేలిపోతే, ఎవరికైనా ఏమనిపిస్తుంది? నేను ఈ సముద్ర గర్భంలో కలసిపోయినా, తనను నమ్ముకున్న వాళ్లకు మాత్రం ఆ గతి పట్టకూడదనిపిస్తుంది. వారిని ఆ వైపే రాకుండా వారించి కాపాడాలనిపిస్తుంది. 1958లో విడుదలైన ‘పర్‌వరిశ్’ సినిమాకోసం హస్రత జయ్‌పురి రాసిన ఈ పాటలో అలాంటి జీవన స్పందనలే వినిపిస్తాయి. దత్తారామ్ స్వరపరిచిన ఈ పాటను విషాదగీతాలకు మారుపేరైన ముకేశ్ పాడిన తీరు నిజంగా గుండెల్ని జలదరింపచేస్తుంది. మరొకసారి వినిచూడండి మీకే తెలుస్తుంది. ప్రాణప్రదంగా ప్రేమించినవారిని ఎవరైనా పూలబాటల్లోంచి తీసుకువెళ్లాలనుకుంటారు గానీ, ముళ్లడొంకల్లోంచి నడిపించాలనుకుంటారా? కన్నీటి తుపానుల్లో వదిలేయాలనుకుంటారా? వెంట తీసుకుపోలేని స్థితిలో వారిని దూరంగా ఉండిపొమ్మంటారు. అలా అని వచ్చిపడిన సంక్షోభమేమిటో, ఆ విషాదమేమిటో నేరుగా తన ప్రేమమూర్తికి చెప్పేయడం కూడా ఒక్కోసారి సాధ్యం కాదు. ఆ విషాదం వెనుక అసలేం జరిగిందో చెప్పేయడానికి ఒక్కోసారి మన హృదయమే సరిపోదు. భాషా సరిపోదు. ఏదోలా చెప్పేద్దాం అనుకునేసరికి ఒక్కోసారి గొంతు తడారిపోతుంది. ఉన్న ఆ కాస్త భాష కూడా అవిటిదైపోతుంది. ఈ స్థితిలో తన ఆవేదనను తన ప్రేమ మూర్తికి చేరవేయడానికి మరో వ్యక్తిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేదో ఆ విషాదాన్ని వివరించడానికని కాదు తననింక శాశ్వతంగా మరిచిపొమ్మనడానికి. ప్రేమికులుగా ఎన్నో వాగ్దానాలు, ప్రమాణాలు చేసుకున్న మాట వాస్తవమే కానీ, అవన్నీ జీవితం అంతో ఇంతో హాయిగా నడుస్తున్న రోజులు. జీవితం అక్షరాలా మన చేతుల్లోనే ఉన్న రోజులవి. కానీ, ఉన్నట్లుండి అంతా తలకిందులై పోయి, అనివార్యంగా అనుకున్న వాటికి అంతా పూర్తి విరుద్ధంగానే జరిగిపోతున్నప్పుడు అప్పుడెప్పుడో చేసిన వాగ్దానాలకు, ప్రమాణాలకు ఉనికేమిటి? వాటి విలువేమిటి? పున్నమి రోజుల్లో కలిసి నడిచిన ఆ దారుల్లోనే ఆ తర్వాత కటిక చీకట్లో నడవలేం కదా! ఒకవేళ తప్పనిసరిగా ఆ దారుల్లోంచే వెళ్లాలనే అనుకున్నా ఏ చిన్న దీపమైనా వెలిగించే అవకాశమే లేనప్పుడు మళ్లీ వెన్నెల రోజులు వచ్చేదాకా వేచి ఉండాల్సిందే కదా! అయినా ప్రకృతిలో అమావాస్య తర్వాత కచ్ఛితంగా పున్నమి వస్తుందన్న గ్యారెంటీ ఉంది. కానీ, జీవితాన్ని కమ్మేసిన చీకట్లు కచ్చితంగా తొలగిపోతాయన్న గ్యారెంటీ ఏదీ లేదు. ఆ గ్యారెంటీ ఏదీ లేనప్పుడు నీ ప్రేమమూర్తిని అప్పటిదాకా వేచి ఉండవని హృదయమున్న ఏ ప్రేమికుడూ చెప్పలేడు. అందుకే తననింక మరిచిపొమ్మని చెప్పడానికే సిద్ధమవుతాడు. | entertainment |
16,948 | 16-08-2017 03:35:37 | రెండేళ్లలో మరింత హు‘షార్’ | రూ.350 కోట్లతో పీఐఎఫ్ నిర్మాణంపూర్తయితే ఏడాదిలో 15 పీఎస్‌ఎల్వీ రాకెట్లుమరో ఘన ఇంధన మోటార్ తయారీ ప్లాంట్‌ఈ ఏడాది మరో 4 ప్రయోగాలు: షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్‌శ్రీహరికోట, ఆగస్టు 15: శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)ను రానున్న రెండేళ్లలో మరింత బలోపేతం చేయనున్నట్లు షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ వెల్లడించారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన షార్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వేగవంతంగా పీఎ్‌సఎల్వీ రాకెట్లను అనుసంధానం చేసేందుకు షార్‌లో రూ.350 కోట్లతో పీఐఎఫ్ (పీఎ్‌సఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ) కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం షార్‌లో ఏడాదికి 5 నుంచి 6 పీఎ్‌సఎల్వీ రాకెట్లను ప్రయోగానికి సిద్ధం చేస్తున్నామని, పీఐఎఫ్ కాంప్లెక్స్ పూర్తయితే ఏడాదిలో 12 నుంచి 15 రాకెట్లు తయారు చేయవచ్చని ఆయన చెప్పారు. ఇక్కడ తయారయ్యే రాకెట్లను షార్‌లోని రెండు ప్రయోగ వేదికలపైకి చేరవేసేలా 1.5 కిలోమీటర్ల ట్రాక్‌ను నిర్మిస్తామన్నారు. అలాగే షార్‌లో మరో ఘన ఇంధనం మోటార్ల తయారీ ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేయాలనే ధ్యేయంతో ఉన్నామని చెప్పారు. షార్‌లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రెండో వాహన అనుసంధాన భవనం మరో ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. కాగా, ఈ ఏడాదిలో మరో నాలుగు రాకెట్ ప్రయోగాలు చేపట్టునున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది రెండు పీఎ్‌సఎల్వీలు,, ఒక జీఎ్‌సఎల్వీ, ఒక జీఎ్‌సఎల్వీ మార్క్3 రాకెట్లను షార్ నుంచి ప్రయోగించామని ఆయన చెప్పారు. ఈ నెల 31న పీఎ్‌సఎల్వీ-సీ39 రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స-1హెచ్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. | nation |
17,733 | 23-09-2017 05:04:55 | జేఈఈ మెయిన్‌పై ఒడిసాలో ఆందోళన | పరీక్షను వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు.. 75 శాతం సీట్లు భర్తీ కాని వైనంజాతీయ స్థాయిలో నిర్వహించే ఎంట్రెన్స్ టెస్టుల్లో లోపాలు ఉన్నప్పటికీ ఒకప్పుడు అంత చర్చనీయాంశం అయ్యేవి కావు. ఐఐటి, ఎన్‌ఐటి లేకుంటే జాతీయ స్థాయి మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్షలు కావడంతో ఎక్కువ మంది ప్రభావితం అయ్యేవారు కారు. ముఖ్యంగా గ్రామీణ, దిగువ మధ్యతరగతి వర్గాలకు వాటిపై అంత ఆశలు కూడా ఉండేవి కావు. మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశానికి ‘నీట్’ ఒకటే దిక్కు కావడంతో తమిళనాడులో ఇటీవల ప్రకంపనలే చోటుచేసుకున్నాయి. అలాగే జెఇఇ మెయిన్ స్కోర్‌ను కొన్ని రాష్ట్రాలు ఇంజనీరింగ్ ప్రవేశాలకు వర్తింపజేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఈ ప్రయత్నంలోనే ఉన్నాయి. ఆ క్రమంలో ఈసారి ఒడిషాలో జెఇఇ మెయిన్ స్కోర్‌తో ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లపై తాజాగా రగడ ప్రారంభమైంది. పాత విధానాన్నే పునరుద్ధరించాలని కోరుతూ ఒడిషాలోని ప్రయివేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఆందోళన బాట పట్టాయి. ఈ మేరకు ‘ఒడిషా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేన్’ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది సుమారు 75 శాతానికి పైగా ఇంజనీరింగ్ సీట్లు భర్తీ కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 2014 నుంచి ఒడిషాలో ఇంజనీరింగ్ సీట్లను జెఇఇ మెయిన్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తున్నారు. 2014కు ముందు రాష్ట్ర స్థాయిలో ఒడిషా జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(ఒజెఇఇ) నిర్వహించేవారు. ప్రస్తుతానికి అటువంటి పరీక్షను ఎంబిఎ, ఎంసిఎలో ప్రవేశానికి మాత్రమే పరిమితం చేశారు. మెడిసిన్‌లో మాత్రం నీట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. ఒడిషాలో రాష్ట్ర వ్యాప్తంగా జెఇఇ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్లు అతి తక్కువగా కేవలం తొమ్మిది మాత్రమే ఉన్నాయని ‘ఒడిషా ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్’ సెక్రటరీ బినోద్ దాస్ తెలిపారు. పైగా సిబిఎ్‌సఇ సిలబస్ ఆధారంగా జెఇఇ మెయిన్ ఉంటోందని, తమ విద్యార్థులు స్టేట్ సిలబ్‌సను అనుసరిస్తున్నందున ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని ఆయన వాపోయారు. సిబిఎ్‌సఇ సిలబ్‌సకి, స్టేట్ సిలబ్‌సకి చాలా వ్యత్యాసం ఉంటోందని చెప్పారు. సిబిఎ్‌సఇ ప్రమాణాలను తమ విద్యార్థులు అందుకోలేకపోతున్నారని వాపోయారు. ఏటేటా ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని, ఫలితంగా కాలేజీల్లో సీట్లన్నీ మిగిలి, తాము నష్టాల బారిన పడుతున్నామని ఆయా కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఏఐసిటిఇ అధికారులు వీరి వాదనను తోసిపుచ్చుతున్నారు. ‘నీట్’ పరీక్ష రాయడంలో ఇబ్బంది కలిగించని సిబిఎ్‌ససి సిలబస్ జెఇఇకి మాత్రం ఎలా అడ్డంకిగా మారిందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రయివేట్ కాలేజీల్లో బోధనలో ప్రమాణాలు పడిపోయాయని, నాసిరకం ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహిస్తున్నారని అందుకే తాము దేశవ్యాప్తంగా సుమారు 800 కాలేజీలను ఈఏడు మూసివేయాల్సిందిగా సూచించామని వారు గుర్తు చేస్తున్నారు. ప్రయివేట్ కాలేజీల నిర్వాకాల వల్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగవకాశాలు సన్నగిల్లుతున్నాయని, అందుకే అడ్మిషన్లు తగ్గుముఖం పడుతున్నాయని ఎఐసిటిఇ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఒడిషాతో పాటు మరో ఐదు రాష్ట్రాలు హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, మధ్యప్రదేశ్‌ల్లో మాత్రమే జెఇఇ మెయిన్ ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్లను భర్తీ చేస్తున్నారు. అయితే స్టేట్, సెంట్రల్ సిలబ్‌సల్లో వ్యత్యాసాల కారణంగా ఈ రాష్ర్టాల్లో క్రమేణా జెఇఇ మెయిన్ రాసే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మిగతా రాష్ట్రాలు మాత్రం ప్రస్తుతానికి సొంత ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లనే నిర్వహించుకొంటున్నాయి. ఈఏడు గుజరాత్‌లో 24 వేలు, మధ్య ప్రదేశ్‌లో 37 వేల సీట్లు మిగిలిపోయాయి. ఇదిలా ఉండగా నీట్ తరహాలోనే ఇంజనీరింగ్‌లోనూ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉండటం గమనార్హం. -ఎడ్యుకేషన్ డెస్క్ | nation |
6,453 | 09-01-2017 18:16:01 | ‘బాహుబలి’ పుణ్యమా అని ప్రభాస్‌కు కొత్త కష్టమొచ్చిందట! | సుధీర్ఘమైన ప్రాజెక్ట్‌కు ప్యాక్ అప్ చెప్పేసిన ఆ డార్లింగ్ హీరో... కొత్త సినిమాలో తళుక్కుమనేందుకు కాలుదువ్వుతున్నా... అతడి బాడీ సహకరించడంలేదట. ఇంతకూ ఎవరా బిగ్ హీరో? సుమారు మూడున్నరేళ్ల పాటు కలలో కూడా మరో సినిమా గురించి ఆలోచించని టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్. 'బాహుబలి' షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశాడు. దీంతో ఈ యంగ్ రెబెల్ స్టార్ త్వరలోనే రొమాంటిక్ హీరోగా అలరిస్తాడని భావిస్తున్నారు అభిమానులు. అయితే ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరికాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. 'బాహుబలి' సినిమా కోసం విపరీతమైన బరువు పెరిగిన ప్రభాస్ ప్రస్తుతం భారీ కాయంతో నిలువెత్తు విగ్రహంలా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్శనాలిటీ లవర్ బాయ్ రోల్స్‌కు ఏమాత్రం సూట్ అవ్వదని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతో ప్రస్తుతం బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభాస్.. ఇందుకోసం తన నెక్స్ట్ ఫిల్మ్‌ను కొంతకాలం పాటు వాయిదా వేసుకున్నాడట. యూవీ క్రియేషన్స్‌లో దర్శకుడు సుజిత్ నేతృత్వంలో ప్రభాస్ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డార్లింగ్ అథ్లెటిక్స్ బాడీతో కనిపించాలని భావిస్తున్నాడట. ఇందుకోసం కేవలం 2-3 నెలల వ్యవధిలోనే సుమారు 20 కేజీల బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడట. మరి డార్లింగ్ కష్టం సిల్వర్ స్క్రీన్‌పై ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి. | entertainment |
17,676 | 09-05-2017 03:23:30 | నాపై ఆరోపణలు చేసినవారే ఇప్పుడు ఆరోపణల్లో : వాద్రా | కేజ్రీవాల్‌పై కపిల్ మిశ్రా ఆరోపణలపై సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా స్పందించారు. ‘ఒకప్పుడు నాపై ఆధారరహిత ఆరోపణలు చేసినవారే ఇప్పుడు సొంత మనుషుల నుంచే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ‘కీలక అంశాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ఒకప్పుడు నాపై ఆధారరహితంగా అవినీతి ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు అదే పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. కేజ్రీవాల్‌కు నా అభినందనలు. ఆయన క్లీన్‌చిట్‌తో బయటపడాలని కోరుకుంటున్నా’ అని వాద్రా తన పోస్టులో పేర్కొన్నారు. | nation |
2,869 | 10-10-2017 03:19:18 | జిఎస్‌టిఆర్-1 గడువు పొడిగించం | రిటర్నుల దాఖలుకు నేడే ఆఖరు రోజున్యూఢిల్లీ: జూలై నెలకు సంబంధించి తుది జిఎస్‌టి రిటర్నుల దాఖలుకు నేటితో (10వ తేదీ) గడు వు ముగియనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జిఎస్‌టిఆర్-1 రిటర్నుల దాఖలుకు గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. జూలై నెలకు సంబంధించి ఇంకా రిటర్నులు దాఖలు చేయని 14 లక్షల మంది వ్యాపారులు వెంటనే తమ రిటర్నులను సమర్పించాలని కోరింది. మొత్తం 53 లక్షల మంది వ్యాపారులు రిటర్నులను దాఖలు చేయాల్సి ఉండగా సోమవారం రాత్రి వరకు మొత్తం 39 లక్షల మంది వ్యాపారులు తుది విక్రయాలు లేదా జిఎ్‌సటిఆర్-1ను ఫైల్ చేశారు. జిఎ్‌సటిఆర్-1 ను సమర్పించని వ్యాపారులకు జిఎ్‌సటి నెట్‌వర్క్ (జిఎ్‌సటిఎన్) ఇప్పటికే రెండు సంక్షిప్త సందేశాలు, ఇ-మెయిల్స్‌ను పంపించింది. కాగా జూలై నెల జిఎ్‌సటిఆర్-1 రిటర్నుల దాఖలుకు ప్రభుత్వం ఇప్పటికే రెండు నెలల గడువు పెంచింది. ఈ గడువు అక్టోబరు 10వ తేదీతో ముగియనుంది. మరోసారి ఈ గడువును పెంచే అవకాశం లేదని, పన్ను చెల్లింపుదారులు అందరు నేటితో తమ రిటర్నులను ఫైల్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రిటర్నులు దాఖలు చేయని పక్షంలో వ్యాపారస్తుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసిన వారు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను అందుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని తెలిపింది. | business |
12,965 | 30-08-2017 03:22:35 | డోక్లాంపై డేగ కన్ను! | దూరం నుంచే భారత్ నిఘా.. ‘డ్రాగన్’ కదిలితే మళ్లీ ముందుకే!న్యూఢిల్లీ, ఆగస్టు 29: డోక్లాంపై ప్రతిష్టంభన వీడినప్పటికీ... చైనా సైన్యం కదలికలపై కన్నేసి ఉంచాలని భారత్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం ఔట్ పోస్టుల వద్ద భారత జవాన్లు కాపలా కాస్తున్నారు. చైనా సైన్యం కదలికలపై డేగ కన్ను వేసేందుకు అనువుగా ఎత్తైన ప్రాంతంలో కాపలా కాస్తున్నారు. ‘‘సిక్కిం-భూటాన్-టిబెట్ ట్రైజంక్షన్‌లో.. డోక్లాంకు 500మీటర్ల దూరంలోనే మనసైన్యం నిఘా ఉంచింది. అటువైపు నుంచి ఎలాంటి కదలికలు కనిపించినా వెంటనే రంగంలోకి దిగుతుంది. డోక్లాంలో యథాతథ స్థితి కాపాడటమే మన లక్ష్యం’’ అని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. డోక్లాం వివాదాన్ని దౌత్యపరంగా పరిష్కరించుకోవడంపై గతంలో చైనా, అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన నిరుపమారావు స్వాగతించారు. ప్రస్తుతం ఆమె అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విల్సన్ సెంటర్‌లో పబ్లిక్ పాలసీ ఫెలోగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారైంది. వచ్చే నెల 3 నుంచి 5వరకు చైనాలోని జియామెన్‌లో జరిగే ‘బ్రిక్స్’ సదస్సులో ఆయన పాల్గొంటారు. మోదీ చైనా పర్యటనకు మార్గం సుగమం చేసేందుకే డోక్లాంపై చైనా వెనక్కి తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఫుజియాన్ ప్రావిన్స్‌లోని జియామెన్‌ను సందర్శిస్తారు. అక్కడ సెప్టెంబరు 3 నుంచి 5వరకు జరిగే బ్రిక్స్ 9వ సదస్సుకు హాజరవుతారు’’ అని మంగళవారం భారత విదేశీ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని మయన్మార్‌కు వెళతారు. ఆ దేశ అధ్యక్షుడు యు హితిన్‌క్యాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. | nation |
1,556 | 18-02-2017 00:04:17 | సిప్లా నుంచి హెపటైటిస్ బి వ్యాక్సిన్ | న్యూఢిల్లీ : సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి పెద్దల కోసం హెపటైటిస్ బి వ్యాక్సిన్‌ను విడుదల చేసినట్లు సిప్లా వెల్లడించింది. తొలుత పెద్దల కోసం హెపటైటిస్ బి వ్యాక్సిన్ విడుదల, మార్కెట్ కోసం సెరమ్‌తో సిప్లా ఇప్పటికే ప్రత్యేకమైన ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాతి కాలంలో చిన్న పిల్లల కోసం వ్యాక్సిన్‌ను రూపొందించి, మార్కెట్ చేయనుంది. ప్రాణాంతక వ్యాధులైన హెపటైటిస్ బి వంటి వ్యాధుల కోసం అందుబాటు ధరల్లో ఔషధాలు తీసుకువచ్చేందుకు సెరమ్‌తో ఒప్పందం దోహదపడుతుందని సిప్లా మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ సిఇఒ ఉమాంగ్ వోహ్రా అన్నారు. | business |
14,326 | 14-10-2017 02:25:39 | ఎన్నికల్లో స్వతంత్రులు పోటీ చేయొద్దా! | ఢిల్లీ, అక్టోబరు 13: పార్లమెంటు సహా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయకుండా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని(ఈసీ) సుప్రీం కోర్టు కోరింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అభిప్రాయం చెప్పేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఢిల్లీకి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఎన్నికల్లో స్వతంత్రులు పోటీ చేస్తున్నందున ఓట్లు చీలిపోతున్నాయని, ఇది ఎన్నికల వ్యవస్థలో అస్థిరతకు దారితీస్తోందని పేర్కొన్నారు. | nation |
343 | 14-10-2017 01:42:35 | ఆ రెండు దేశాన్ని మార్చేశాయ్.. | నోట్ల రద్దు, జిఎస్‌టితో ఆర్థిక వ్యవస్థ రికవరీ: అరుణ్ జైట్లీవాషింగ్టన్: జిఎస్టి, పెద్ద నోట్ల రద్దు వంటి సంస్కరణలతో భారత్ మారిపోయిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వారం రోజుల అమెరికా పర్యటనకు వచ్చిన జైట్లీ.. ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయం ప్రకటించారు. నిబంధనలు, విధానాల సడలింపు కూడా ఇందుకు దోహదం చేసిందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ వెంటనే అందింపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం అన్ని సంకేతాలు సానుకూలంగానే ఉన్నట్టు జైట్లీ చెప్పారు. గత మూడేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం, వచ్చే ఏడాది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బాగా కోలుకుంటుందని ఇటీవల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జైట్లీ ఈ విషయం చెప్పడం విశేషం. ‘మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధామైంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే ఆ ప్రభావం డిమాండ్‌పైనా ఉంటుంది. ముందు ముందు అది భారత ఆర్థిక వ్యవస్థకూ తప్పకుండా మేలు చేస్తుంది’ అని జైట్లీ చెప్పారు. గత మూడేళ్లుగా మాత్రం భారత్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని అంగీకరించారు. ప్రస్తుతం మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయన్నారు. అత్యంత అనువైన దేశం గత కొన్నేళ్లుగా చేపట్టిన సంస్కరణలతో ప్రస్తుతం భారత్ పెట్టుబడులకు అత్యంత అనువైన దేశంగా మారిందని జైట్లీ చెప్పారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోని అత్యంత సరళీకృత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలనే తేడా లేకుండా ప్రతి రాష్ట్రం పెట్టుబడుల కోసం పోటీపడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. మానవ వనరులు, అతి పెద్ద మార్కెట్, సంస్కరణల తీరు.. పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్‌కు ఉన్న అత్యంత అనుకూల అంశాలన్నారు. భారత్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను అమెరికా ఇపుడిపుడే అర్థం చేసుకుంటోందన్నారు. భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50,000 కోట్ల డాలర్లకు తీసుకు పోవాలన్న లక్ష్యం సుదూర స్వప్నం కాదని జైట్లీ స్పష్టం చేశారు. రక్షణ, వైమానిక రంగాల్లో అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అద్భుత అవకాశాలున్నట్టు చెప్పారు. | business |
14,025 | 04-12-2017 01:58:03 | ఓ యాప్.. బాల్యవివాహాన్ని ఆపింది | పట్నా, డిసెంబరు 3: ఆమె మైనర్! నిండా 13 ఏళ్లు కూడా లేవు. వివాహం జరిపించాలని తల్లిదండ్రులే నిర్ణయించారు. తాను ఇంకా చదువుకుంటానని, అప్పుడే పెళ్లి వద్దని ప్రాధేయపడింది. తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఎటూ పాలుపోని స్థితిలో బాధిత బాలికకు ఓ మొబైల్ యాప్ అండగా నిలిచింది. బాల్య వివాహం అనే చెరలో చిక్కుకోకుండా ఆమెను కాపాడింది. బిహార్‌లో ఇటీవల చోటుచేసుకుందీ ఘటన. పట్నాకు చెందిన జెండర్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థ గత సెప్టెంబరులో ‘బంధన్ టాడ్’ పేరుతో ఓ మొబైల్ యాప్‌ను రూపొందించింది. బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, గృహహింస, లింగ వివక్షకు గురయ్యే బాధితులు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తనకు బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నారంటూ 13 ఏళ్ల బాలిక ‘బంధన్ టాడ్’లో మెసేజ్ పెట్టింది. ఫిర్యాదు స్వీకరించిన జెండర్ అలయన్స్ ప్రతినిధులు పట్నా పోలీసుల సహకారంతో బలవంతపు పెళ్లి నుంచి బాలికను రక్షించారు. పోలీసులు స్వయంగా బాధిత బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిత్రం ఏమిటంటే.. ఈ కేసులో వరుడు కూడా మైనరే (15). దీంతో ఈ యాప్ ద్వారా ఇద్దరు మైనర్లను బాల్య వివాహం నుంచి రక్షించినట్టయింది. | nation |
10,874 | 09-02-2017 15:59:46 | కలిసి ఎంజాయ్ చేద్దాం: దేవిశ్రీ ప్రసాద్ | ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ బాబి దర్శకత్వంలో చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాకు ‘జై లవకుశ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సందర్భంగా మ్యూజిక్ సిట్టింగ్స్ అద్భుతంగా జరిగినట్టు దర్శకుడు బాబి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మంచి ట్యూన్స్ ఇచ్చినందకు దేవిశ్రీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాడు. | entertainment |
1,162 | 23-06-2017 00:00:01 | ఎగుమతుల్లో 8 శాతం వృద్ధి | దేశీ మార్కెట్లో వృద్ధి 10-11 శాతం2017-18లో ఐటి పరిశ్రమపై నాస్కామ్ అంచనా హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశీయంగా ఐటి మార్కెట్ 2017-18లో 10 నుంచి 11 శాతం వృద్ధిని సాధిస్తుందని, ఎగుమతుల్లో 7 నుంచి 8 శాతం వృద్ధి ఏర్పడుతుందని నాస్కామ్ అంచనా వేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన బిగ్ డేటా అనలిటిక్స్ సదస్సుకు వచ్చిన నాస్కామ్ చైర్మన్ ఆర్ చంద్రశేఖర్, నాస్కామ్ ప్రెసిడెంట్ రమణ్‌రాయ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ఏడాదికి ఐటి అంచనాలు ప్రకటించారు. సాధారణంగా కొత్త సంవత్సరానికి అంచనాలు నాలుగో త్రైమాసికంలోనే ప్రకటిస్తామని, కాని అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఐటి భవిష్యత్తుపై ఒక స్పష్టత ఏర్పడే వరకు ఆగి ఇప్పుడు ప్రకటిస్తున్నామని చెప్పారు. భారత ఐటి రంగం పరిమాణం 15,400 కోట్ల డాలర్లని (రూ.10 లక్షల కోట్లు) చెబుతూ గత ఏడాది 1100 కోట్ల డాలర్ల (రూ.71,500 కోట్లు) అదనపు ఆదాయాలు జోడయ్యాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఐటి రంగంలో 1.3 లక్షల నుంచి 1.5 లక్షల కొత్త నియామకాలుండవచ్చునని చంద్రశేఖర్ చెప్పారు. ఎగుమతుల నిలకడ వృద్ధిఐటి రంగం ఎగుమతుల్లో మంచి వృద్ధిని సాధిస్తున్నదని చంద్రశేఖర్ అన్నారు. ఐటి ఎగుమతులు గత ఆరేళ్లలో రెట్టింపు అయ్యాయని, గత ఏడాది ఈ రంగం ఎగుమతుల్లో 7.6 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆయన చెప్పారు. ఖజానాకు సమకూరుతున్న విదేశీ మారకం నిల్వల్లో ఐటి రంగం వాటా 20 శాతమని, దేశానికి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఐటి రంగం వాటా ఏడు శాతం ఉందని ఆయన తెలిపారు. అమెరికాపై భయం అవసరం లేదుగత ఏడాది ఐటి రంగం తీవ్ర అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొన్నదని, ప్రధానంగా బ్రెగ్జిట్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు గట్టి సవాలునే ఇచ్చాయని చంద్రశేఖర్ అన్నారు. అయితే ఇప్పుడు ఆ వేడి చల్లారిందని, పరిస్థితులు కాస్తంత సానుకూలంగా మారాయని తెలిపారు. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ మార్కెట్‌లో భారత ఐటి వాటా ఏమీ తగ్గలేదని రమణ్‌రాయ్ చెప్పారు. భారత ఐటి మార్కెట్‌కు 60 శాతం వ్యాపారం అమెరికా నుంచే వస్తుందంటూ తాజా పరిస్థితుల్లో కూడా ఆ వాటా ఏమీ మారే ఆస్కారం లేదని అంచనా వేశారు. అమెరికాలో భారత్‌కు చెందిన పెద్ద కంపెనీలన్నీ ఇప్పటికే అక్కడి చట్టాలకు అనుగుణంగా పని చేస్తున్నందు వల్ల వాటిపై ప్రభావం గణనీయంగా ఉండబోదని ఆయన అన్నారు. అయితే రక్షణాత్మక విధానాల ప్రభావం కొంతమేరకు ఉండవచ్చని, ప్రధానంగా వీసాల కుదింపు వంటి సమస్యలను అధిగమించే వ్యూహాలు రచించుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త మార్కెట్లకు విస్తరణ భారత ఐటి రంగం సాంప్రదాయిక మార్కెట్లు, సాంప్రదాయిక ఉత్పత్తులకు అతీతంగా ఆలోచించి కొత్త భౌగోళిక ప్రదేశాలు, కొత్త రంగాలపై దృష్టి సారించాలని చంద్రశేఖర్ అన్నారు. జపాన్ ప్రపంచంలో అది రెండో పెద్ద ఐటి మార్కెట్ అని, కాని అక్కడ మన వాటా రెండు శాతమేనని చెప్పారు. అక్కడ వాటా పెంచుకోవడంతోపాటు జర్మనీ, పశ్చిమాసియా, ఆఫ్రికా, చైనా వంటి దేశాల పైన, ఆధునిక డిజిటల్ టెక్నాలజీల పైన దృష్టి పెట్టాలని చంద్రశేఖర్ సూచించారు. నిరంతర శిక్షణప్రస్తుత పరివర్తిత ప్రపంచంలో నైపుణ్యాల వృద్ధికి అత్యంత కీలకమైన పాత్ర ఉందని, ఏ రంగందీనికి అతీతం కాదని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో 15- 20 లక్షల మంది వరకు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేశారు. అదే సమయంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉపాధి రంగంలో ప్రవేశించే వారిని పరిశ్రమ అవసరాలకు దీటుగా తీర్చి దిద్దేందుకు కళాశాలలతో నాస్కామ్ కలిసి పని చేస్తోంది. డిజిటల్ రంగం దూకుడునైపుణ్యాలను వృద్ధికి అవకాశం ఉన్న 55 కొత్త తరం విభాగాలను గుర్తించినట్టు చంద్రశేఖర్ చెప్పారు. డిజిటల్ టెక్నాలజీలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి), డేటా సైన్సులు, సైబర్ సెక్యూరిటీ విభాగాలకు మంచి భవిష్యత్తు ఉన్నట్టు తెలిపారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీలో 3500 కోట్ల డాలర్ల (రూ.2.28 లక్షల కోట్లు) వ్యాపారావకాశం ఉందని, అందులో భారత్ మంచి వాటా సాధించవచ్చని ఆయన సూచించారు. కంపెనీల మొత్తం ఆదాయాల్లో డిజిటల్ టెక్నాలజీల వాటా 2012 నాటికి 4 నుంచి 7 శాతం ఉండగా ఇప్పుడది 15 నుంచి 20 శాతానికి పెరిగిందని ఆయన చెప్పారు. ఎనిమిది వేల కంపెనీలు డిజిటల్ సొల్యూషన్లను అందిస్తున్నాయని, దేశంలో డిజిటల్ విభాగంలో 2000 స్టార్ట్‌పలు పని చేస్తున్నాయన్నారు. వివిధ సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగుల్లో 50 శాతం మందికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చాయని చెప్పారు. రానున్న కాలంలో భారత్ డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రంగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. నికరంగా ఉద్యోగాలే ఇస్తాం ..ఐటి రంగంలో భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులుంటాయన్న భయాలను చంద్రశేఖర్ తోసి పుచ్చారు. ఈ ఏడాది ఐటి కంపెనీలు 1.3 లక్షల నుంచి 1.5 లక్షల మంది కొత్త ఉద్యోగులను నియమించుకునే ఆస్కారం ఉన్నదని అంచనా వేశారు. గత ఏడాది 1.7 లక్షల కొత్త నియామకాలున్నాయని, వాటితో పోల్చితే ఈ ఏడాది నియామకాలు తక్కువే అయినా నాన్ టెక్నాలజీ విభాగాల్లో టెక్నాలజీ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. టెక్నాలజీ ఉద్యోగాలంటే కేవలం ఐటి రంగం ప్రత్యక్షంగా నియమించుకుంటున్న వారిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటే చాలదని ఆయన అన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని ఉదాహరణగా చెబుతూ ఆ రంగం డిజిటలైజ్ అవుతున్న కొద్ది అక్కడ టెక్నాలజీ నిపుణుల అవసరం పెరిగిందని ఆయన తెలిపారు. అలా చూస్తే టెక్నాలజీ రంగంలో కొత్తగా ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య నాస్కామ్ అంచనా కన్నా ఎక్కువగానే ఉంటుందని చంద్రశేఖర్ తెలిపారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు వస్తున్న కొద్ది కొన్ని ఉద్యోగాలు అదృశ్యం కావడం, కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావడం, నైపుణ్యాల మెరుగుదల వంటివి భారత ఐటి రంగానికి కొత్తేమీ కాదని ఆయన చెప్పారు. | business |
2,129 | 23-06-2017 23:34:51 | ఎస్సార్ డీల్‌కు బ్యాంకర్ల గ్రీన్‌సిగ్నల్ | హోంశాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో అభ్యంతరంముంబై: ఎస్సార్ కంపెనీ గుజరాత్‌లోని వడినార్‌లో నడుపుతున్న అతి పెద్ద రిఫైనరీని రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, ట్రఫిగురా-యుసిపి కన్సార్షియంకు విక్రయించడానికి కుదిరిన డీల్‌కు రుణదాతలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా హోంశాఖ, ఆ శాఖకు అనుబంధంగా పని చేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో అభ్యంతరాలు ప్రకటించాయి. 86 వేల కోట్ల రూపాయల ఆ డీల్ దేశంలో అతి పెద్ద ఎఫ్‌డిఐ డీల్ కాగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో రాస్‌నెఫ్ట్, ఎస్సార్ గత ఏడాది అక్టోబరు 15వ తేదీన ఈ డీల్‌పై సంతకాలు చేశాయి. శుక్రవారం ఎస్‌బిఐ, ఐసిఐసిఐ నాయకత్వంలో సమావేశమైన 23 రుణదాత సంస్థల ఉమ్మడి ఫోరమ్ ఈ డీల్‌పై ముందుకు సాగేందుకు ఎస్సార్‌కు అనుమతి తెలిపింది. దీంతో డీల్‌కు చివరి అడ్డంకి తొలగిపోయినట్టే అనుకుంటున్న సమయంలో దేశ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హోం శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో అభ్యంతరాలు చెప్పాయని అధికార వర్గాల సమాచారం. రుణదాతల్లో ఒక్క ఎల్‌ఐసికే ఆ సంస్థ 1,200 కోట్ల రూపాయలు అప్పు పడింది. ఎల్‌ఐసితో సహా రుణదాతలందరూ దీనికి ఆమోదం తెలిపారని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. రష్యాకు చెందిన రిఫైనరీని కొనుగోలు చేయడానికి వీలుగా అందులో రష్యాకు గల వాటాలన్నింటి నుంచి వైదొలగాలన్నది ఆ డీల్ ప్రధానాంశం. దాని రిఫైనరీ సామర్థ్యం 2 కోట్ల టన్నులు. దేశంలోని మొత్తం రిఫైనింగ్ సామర్థ్యంలో దాని వాటా 9 శాతం మేరకు ఉంది. దీనికి తోడు రిఫైనరీ అవసరాల కోసం 1010 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం. 5.8 కోట్ల టన్నుల డీప్ డ్రాఫ్ట్ పోర్టు, 3500 రిటైల్ ఔట్‌లెట్లు కూడా ఎస్సార్‌కు ఉన్నాయి. డీల్‌లో భాగంగా అవన్నీ రాస్‌నెఫ్ట్ చేతికి పోతాయి. ఇదిలా ఉండగా ఈ ప్రయత్నాలపై హోంశాఖ, ఇంటలిజెన్స్ బ్యూరో అభ్యంతరం వ్యక్తం చేశాయి. పాక్ సరిహద్దుకు చేరువలో ఉన్న ఈ రేవును విదేశీ కంపెనీకి అప్పగించడం వలన దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించాయి. ప్రధాని కార్యాలయం స్వయంగా రంగంలోకి దిగితే తప్పించి ఈ ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. | business |
11,707 | 17-01-2017 01:01:54 | ఏమిటీ నాటో? | ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలను కలుపుకొని బలపడిన సోవియట్ యూనియన్‌ను అడ్డుకునేందుకు అమెరికా, ఐరోపా దేశాలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో)ను ఏర్పాటు చేశాయి. 1949 ఏప్రిల్ 4న ఇది ఆవిర్భవించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, పోర్చుగల్, ఇటలీ, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్ తదితర దేశాలు దీనిపై సంతకాలు చేశాయి. ప్రస్తుతం ఐరోపా, ఉత్తర అమెరికాలోని 28 దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. మరో 22 దేశాలు నాటో ‘శాంతి భాగస్వామ్యం’లో పాలుపంచుకుంటున్నాయి. ఇంకో 15 దేశాలు సంస్థాగత చర్చల్లో భాగస్వాములుగా ఉన్నాయి. అంటే 65 దేశాలకు ఇందులో కీలక భూమిక ఉంది. ఈ దేశాల వైశాల్యం ప్రపంచంలో 70% భూభాగం కావడం గమనార్హం. సభ్యదేశంపై ఎవరైనా దాడిచేస్తే నాటో సైనికంగా దానికి రక్షణగా నిలవాలన్నది ఈ కూటమి ప్రధాన లక్ష్యం. సభ్య దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతాన్ని రక్షణకు కేటాయిస్తుంటాయి. యుగోస్లేవియా అంతర్యుద్ధం, బోస్నియా సంక్షోభం, ఇరాక్ యుద్ధం, 9/11 దాడుల తర్వాత అమెరికా ఆత్మరక్షణ నినాదానికి, అఫ్గానిస్థాన్‌లో అల్-ఖైదాపై దాడులకు నాటో అండగా నిలిచింది. నిజానికి నాటో రక్షణ వ్యయంలో 70 శాతం వరకు అమెరికానే భరిస్తోంది. ఐదు దేశాలు మాత్రమే అమెరికాకు రక్షణ చెల్లింపులు చేస్తున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, బెర్లిన్ గోడ పతనం అనంతరం తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలు, సోవియట్ యూనియన్ నుంచి స్వతంత్రించిన దేశాలు నాటోలో చేరిపోవడం గమనార్హం. వాటి రక్షణకు తాము లక్షల కోట్ల డాలర్లు ఖర్చుపెడుతున్నా.. చాలా దేశాలు దమ్మిడీ ఇవ్వడం లేదని, పైగా నాటో ఆవిర్భావ పరిస్థితులు ఇప్పుడు లేవని అమెరికాలో ఏనాటి నుంచో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఇప్పుడు రష్యా వైపు మొగ్గుతూ నాటోకు దూరం కావాలని యోచిస్తున్నారు. నిజానికి ఐరోపాలో శాంతిస్థాపన కోసం తాను కూడా నాటోలో చేరతారనని సోవియట్ యూనియన్ 1952లోనే ప్రతిపాదించింది. కానీ, తమను బలహీనపరిచే కుట్రగా అనుమానించిన ఐరోపా దేశాలు ఇందుకు ససేమిరా అన్నాయి. | nation |
4,557 | 13-07-2017 00:35:40 | అమానుష దాడి | అమర్‌నాథ్ యాత్రికులపై సోమవారం రాత్రి జరిగిన ఉగ్రదాడి అమానుషమైనది. ఇప్పటివరకూ కశ్మీర్ ఎంత రగులుతున్నా పర్యాటకులపైనా, యాత్రికులపైన ఉగ్రవాదదాడులు జరగబోవన్న నమ్మకాన్ని ఈ ఘటన వమ్ముచేసింది. దాడికి పాల్పడిందని లష్కరే తోయిబా అంటున్న పోలీసులు ఏరివేత ప్రయత్నాల్లో ఉన్నారు. పొరుగుదేశపు ఉగ్రవాదితో ముగ్గురు స్థానిక ఉగ్రవాదులు కలసి చేసిన పనిగా కూడా అనుమానిస్తున్నారు. దాడిఘటన జరిగిన వెంటనే వెలువడిన విభిన్నకథనాల్లో ఇది నేరుగా యాత్రికులపై తెగబడి జరిపింది కాదనీ, భద్రతాదళాలే వారి ప్రధాన లక్ష్యమన్న వాదన కూడా ఉన్నది. ఏడుగురు అమాయకులైన యాత్రికులను కాల్చిచంపిన ఈ దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాదులు ఎవరైనా ఇది అత్యంత పాశవికమైనది, అమానవీయమైనది. ఇటువంటి ఘోరం జరిగినప్పుడు, వారూ వీరూ భేదంలేకుండా సమాజంలోని అందరూ ముక్తకంఠంతో దానిని ఖండించడం ఊరటనూ, సంతోషాన్నీ కలిగిస్తుంది. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలతో నిమిత్తం లేకుండా కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకూ దేశం యావత్తూ ఈ దారుణానికి చలించిపోయి, తీవ్రంగా ప్రతిస్పందించింది. కశ్మీర్ సమాజం తాను ఎన్నడూ ఎరుగని ఈ ఘాతుకానికి బిత్తరపోయింది. వేర్పాటువాదనాయకులు ఏమాత్రం నీళ్ళునమలకుండా విస్పష్టంగా ఖండించారు. తమ వేర్పాటువాద సిద్ధాంతానికీ, ఆకాంక్షకు విశ్వసనీయత మిగలాలంటే, ఉపరితలంలోనైనా ఉగ్రవాదాన్ని సమర్థించకూడదన్న భావన వారిలో అంతర్గతంగా ఉన్నది. పాలకవర్గాలు మిగతా సమస్యలను, ఆకాంక్షలను తొక్కిపెట్టి, ఉగ్రవాదమనే ఒకే అంశాన్ని ఊతంగా చేసుకొని కశ్మీర్‌కు మిగతా భారతదేశానికీ మధ్య అగాధాన్ని పెంచుతున్నారని అంటున్నప్పుడు, ఇటువంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించడం అవసరం. సగటు కశ్మీరీ ఎన్నడూ ఈ యాత్రను తమది కాదని అనుకోలేదు. ఇది వారి భుక్తితో ముడిపడినదే కావచ్చును కానీ, అదొక్కటే వారి ఆదరణకూ సహకారానికీ కారణం కాదు. వారి దృష్టిలో ఈ యాత్ర కశ్మీర్ బహుళత్వ సంప్రదాయాలు, విలువలు, గుర్తింపుతో ముడివడిన అంశం. అమర్‌నాథ్ యాత్రికులపట్ల స్థానికులు ఎంత బాధ్యతగా ఉంటారో, ఎంతగా సహకరిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అందువల్లనే, ఈ దుశ్చర్యతో తాము ఎంతో ఘనంగా భావించే కశ్మీర్ సంస్కృతికి విఘాతం కలిగిందన్న ఆవేదన ప్రతి కశ్మీరీలోనూ రేగింది. ఉగ్రవాదుల లక్ష్యం కల్లోల కశ్మీర్‌ను మరింత కల్లోలితం చేయడం, దానికీ మిగతాదేశానికీ మధ్య ఉన్న అగాధాన్ని ఇంకా విస్తరించడం. ప్రధానంగా రాష్ట్రంలోనూ, పరోక్షంగా దేశంలోనూ మతసామరస్యాన్ని దెబ్బతీయడం, ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింతగా రాజేయడం. అందువల్ల, కశ్మీర్ సమాజాన్ని సాధ్యమైనన్ని ప్రాతిపదికలమీద చీల్చాలన్న కుటిలయత్నాలను తిరగ్గొట్టడం అత్యంత ముఖ్యం. ఉగ్రవాదుల దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించి, పాలనూ నీళ్ళనూ వేరుగా చూడగల సమర్థత సమాజానికి ఉన్నదని తెలియచెప్పడం అవసరం. ఈ ముక్తకంఠపు ఖండనలు ఊరటనిస్తున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడుప్రాణాలు కాపాడలేకపోయాయన్నది వాస్తవం. బుర్హన్‌వనీ ఎన్‌కౌంటర్‌కు ఏడాది అయిన నేపథ్యంలో, ఈ మారు యాత్రికులపైన దాడిచేసి కనీసం వందమందిని కాల్చిపారేయాలని ఉగ్రవాదులు భావిస్తున్నారంటూ యాత్ర ఆరంభానికి ముందే కేంద్రప్రభుత్వానికి ఇంటలిజెన్స్ హెచ్చరికలు అందినట్టు వార్తలు వచ్చాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరిస్థితిని సమీక్షించి, అదనపు బలగాలను కూడా మోహరించినట్టు చెబుతున్నారు. దాదాపు పాతికవేలమంది జవాన్లు కీలకప్రాంతాల్లో ఉంటూ కాపలాకాశారు. యాత్రికుల వాహనాలకు ముందూ వెనుకా రక్షణగా వెళుతున్నారు. ఇంతచేసినా, ఏదో మారుమూల ప్రాంతంలో కాక, జాతీయ రహదారి సమీపంలోనే ఈ దాడి జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. పోలీస్‌పోస్టు మీద దాడిజరిగిన తరువాత ఆ దారిని మూసివేయడం సహజంగా చేయాల్సిన పని. అది జరగనందువల్లనే బస్సుమీద దాడి సాధ్యమైంది. అలాగే, ఈ బస్సు ఆలయబోర్డు వద్ద రిజిస్టర్ చేయించుకోలేదన్న ఆరోపణ ఒకవైపు, చేయించుకున్నామన్న వాదన మరొకవైపు ఉన్నది. రిజిస్టరు కానప్పుడు తిరుగుప్రయాణం వరకూ దానిని ఎలా వదిలేశారన్నది ప్రశ్న. రిపేరు వచ్చి కొద్దిగంటలు నిలిచిపోయిన కారణంగా మిగతా బస్సులనుంచి వేరుపడిన బస్సును రాత్రి ఏడుగంటల తరువాత ఎలా నడవనచ్చారన్నదీ ప్రశ్నే. నిజానిజాలు దర్యాప్తులో తేలే అంశాలే కావచ్చును కానీ, భద్రతా ఏర్పాట్లు లోపభూయిష్టంగా ఉన్న విషయం తెలుస్తూనే ఉన్నది. బుర్హన్ వనీ మరణం తరువాత కశ్మీర్ లోయలో ఉగ్రవాదం కొత్తరూపాన్ని తీసుకున్నమాట వాస్తవం.2013లో ముప్పైమంది స్థానిక యువకులు ఆయుధాలు చేపడితే, గత ఏడాది కాలంలోనే 230మంది ఉగ్రవాదులుగా మారినట్టు నివేదికలు చెబుతున్నాయి. అలాగే, ఏడాదికాలంలో మరణించిన పౌరులు, జవాన్ల సంఖ్య కూడా 400 వరకూ ఉన్నట్టు చెబుతున్నారు. నాలుగేళ్ళక్రితంతో పోల్చితే ఇది నాలుగురెట్లు ఎక్కువ. మిలిటెన్సీతో పాటుగానే వీధిపోరాటాలు, దాడులు, దహనాలు అధికం కావడమూ కనిపిస్తూనే ఉన్నది. ఈ విషవలయాన్ని ఛేదించి, సాధ్యమైనంత వేగంగా అక్కడ సాధారణస్థితిని నెలకొల్పవలసిన అవసరం ఉన్నది. యాత్రికులపై దాడి జరిగిన నేపథ్యంలో కశ్మీరియత్‌ను ప్రశంసిస్తూ రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన ట్వీట్ సగటు కశ్మీరీలకు సంతోషాన్నిచ్చిందని అంటున్నారు. ఇటువంటి ప్రశంసలతో సరిపెట్టకుండా, కేంద్రప్రభుత్వం కొనసాగింపు చర్యలతో దానిని కాపాడాల్సిన అవసరం ఉన్నది.ఇటువంటి ఘోరం జరిగినప్పుడు, వారూ వీరూ భేదంలేకుండా సమాజంలోని అందరూ ముక్తకంఠంతో దానిని ఖండించడం ఊరటనూ, సంతోషాన్నీ కలిగిస్తుంది. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలతో నిమిత్తం లేకుండా కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకూ దేశం యావత్తూ ఈ దారుణానికి చలించిపోయి, తీవ్రంగా ప్రతిస్పందించింది. కశ్మీర్ సమాజం తాను ఎన్నడూ ఎరుగని ఈ ఘాతుకానికి బిత్తరపోయింది. వేర్పాటువాదనాయకులు ఏమాత్రం నీళ్ళునమలకుండా విస్పష్టంగా ఖండించారు. తమ వేర్పాటువాద సిద్ధాంతానికీ, ఆకాంక్షకు విశ్వసనీయత మిగలాలంటే, ఉపరితలంలోనైనా ఉగ్రవాదాన్ని సమర్థించకూడదన్న భావన వారిలో అంతర్గతంగా ఉన్నది. పాలకవర్గాలు మిగతా సమస్యలను, ఆకాంక్షలను తొక్కిపెట్టి, ఉగ్రవాదమనే ఒకే అంశాన్ని ఊతంగా చేసుకొని కశ్మీర్‌కు మిగతా భారతదేశానికీ మధ్య అగాధాన్ని పెంచుతున్నారని అంటున్నప్పుడు, ఇటువంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించడం అవసరం. సగటు కశ్మీరీ ఎన్నడూ ఈ యాత్రను తమది కాదని అనుకోలేదు. ఇది వారి భుక్తితో ముడిపడినదే కావచ్చును కానీ, అదొక్కటే వారి ఆదరణకూ సహకారానికీ కారణం కాదు. వారి దృష్టిలో ఈ యాత్ర కశ్మీర్ బహుళత్వ సంప్రదాయాలు, విలువలు, గుర్తింపుతో ముడివడిన అంశం. అమర్‌నాథ్ యాత్రికులపట్ల స్థానికులు ఎంత బాధ్యతగా ఉంటారో, ఎంతగా సహకరిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అందువల్లనే, ఈ దుశ్చర్యతో తాము ఎంతో ఘనంగా భావించే కశ్మీర్ సంస్కృతికి విఘాతం కలిగిందన్న ఆవేదన ప్రతి కశ్మీరీలోనూ రేగింది. ఉగ్రవాదుల లక్ష్యం కల్లోల కశ్మీర్‌ను మరింత కల్లోలితం చేయడం, దానికీ మిగతాదేశానికీ మధ్య ఉన్న అగాధాన్ని ఇంకా విస్తరించడం. ప్రధానంగా రాష్ట్రంలోనూ, పరోక్షంగా దేశంలోనూ మతసామరస్యాన్ని దెబ్బతీయడం, ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింతగా రాజేయడం. అందువల్ల, కశ్మీర్ సమాజాన్ని సాధ్యమైనన్ని ప్రాతిపదికలమీద చీల్చాలన్న కుటిలయత్నాలను తిరగ్గొట్టడం అత్యంత ముఖ్యం. ఉగ్రవాదుల దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించి, పాలనూ నీళ్ళనూ వేరుగా చూడగల సమర్థత సమాజానికి ఉన్నదని తెలియచెప్పడం అవసరం. ఈ ముక్తకంఠపు ఖండనలు ఊరటనిస్తున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడుప్రాణాలు కాపాడలేకపోయాయన్నది వాస్తవం. బుర్హన్‌వనీ ఎన్‌కౌంటర్‌కు ఏడాది అయిన నేపథ్యంలో, ఈ మారు యాత్రికులపైన దాడిచేసి కనీసం వందమందిని కాల్చిపారేయాలని ఉగ్రవాదులు భావిస్తున్నారంటూ యాత్ర ఆరంభానికి ముందే కేంద్రప్రభుత్వానికి ఇంటలిజెన్స్ హెచ్చరికలు అందినట్టు వార్తలు వచ్చాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరిస్థితిని సమీక్షించి, అదనపు బలగాలను కూడా మోహరించినట్టు చెబుతున్నారు. దాదాపు పాతికవేలమంది జవాన్లు కీలకప్రాంతాల్లో ఉంటూ కాపలాకాశారు. యాత్రికుల వాహనాలకు ముందూ వెనుకా రక్షణగా వెళుతున్నారు. ఇంతచేసినా, ఏదో మారుమూల ప్రాంతంలో కాక, జాతీయ రహదారి సమీపంలోనే ఈ దాడి జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. పోలీస్‌పోస్టు మీద దాడిజరిగిన తరువాత ఆ దారిని మూసివేయడం సహజంగా చేయాల్సిన పని. అది జరగనందువల్లనే బస్సుమీద దాడి సాధ్యమైంది. అలాగే, ఈ బస్సు ఆలయబోర్డు వద్ద రిజిస్టర్ చేయించుకోలేదన్న ఆరోపణ ఒకవైపు, చేయించుకున్నామన్న వాదన మరొకవైపు ఉన్నది. రిజిస్టరు కానప్పుడు తిరుగుప్రయాణం వరకూ దానిని ఎలా వదిలేశారన్నది ప్రశ్న. రిపేరు వచ్చి కొద్దిగంటలు నిలిచిపోయిన కారణంగా మిగతా బస్సులనుంచి వేరుపడిన బస్సును రాత్రి ఏడుగంటల తరువాత ఎలా నడవనచ్చారన్నదీ ప్రశ్నే. నిజానిజాలు దర్యాప్తులో తేలే అంశాలే కావచ్చును కానీ, భద్రతా ఏర్పాట్లు లోపభూయిష్టంగా ఉన్న విషయం తెలుస్తూనే ఉన్నది. బుర్హన్ వనీ మరణం తరువాత కశ్మీర్ లోయలో ఉగ్రవాదం కొత్తరూపాన్ని తీసుకున్నమాట వాస్తవం.2013లో ముప్పైమంది స్థానిక యువకులు ఆయుధాలు చేపడితే, గత ఏడాది కాలంలోనే 230మంది ఉగ్రవాదులుగా మారినట్టు నివేదికలు చెబుతున్నాయి. అలాగే, ఏడాదికాలంలో మరణించిన పౌరులు, జవాన్ల సంఖ్య కూడా 400 వరకూ ఉన్నట్టు చెబుతున్నారు. నాలుగేళ్ళక్రితంతో పోల్చితే ఇది నాలుగురెట్లు ఎక్కువ. మిలిటెన్సీతో పాటుగానే వీధిపోరాటాలు, దాడులు, దహనాలు అధికం కావడమూ కనిపిస్తూనే ఉన్నది. ఈ విషవలయాన్ని ఛేదించి, సాధ్యమైనంత వేగంగా అక్కడ సాధారణస్థితిని నెలకొల్పవలసిన అవసరం ఉన్నది. యాత్రికులపై దాడి జరిగిన నేపథ్యంలో కశ్మీరియత్‌ను ప్రశంసిస్తూ రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన ట్వీట్ సగటు కశ్మీరీలకు సంతోషాన్నిచ్చిందని అంటున్నారు. ఇటువంటి ప్రశంసలతో సరిపెట్టకుండా, కేంద్రప్రభుత్వం కొనసాగింపు చర్యలతో దానిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. | editorial |
18,672 | 23-07-2017 17:05:49 | త్వరలో చంద్రమామపై వ్యోమనౌక | బెంగళూరు: అంతాప్లాన్ ప్రకారమే జరిగితే బెంగళూరు సంస్థ చంద్రమామపై వ్యోమనౌకను దించుతుంది. ఆ ఘనతను సాధించిన తొలి ప్రైవేటు కంపెనీగా రికార్డు సృష్టించనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. బెంగళూరు సంస్థ టీ ఇండస్ జాబిల్లిపై డిసెంబర్ నాటికి వ్యోమనౌకను దించాలని భావిస్తోంది. వ్యోమనౌక నిర్మాణం దిశగా టీ ఇండస్ పురోగతి సాధించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందిన పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. వ్యోమనౌక నమూనాను నిర్మించామని, ఆగస్టు రెండో వారంలో దాన్ని ఇస్రో పరీక్ష కేంద్రంలో విస్తృతంగా పరీక్షిస్తామని టీ ఇండస్ తెలిపింది. | nation |
21,232 | 10-09-2017 01:52:01 | కెవిన్ కాచుకో! | యూఎస్ ఫైనల్లో నడాల్‌సెమీస్‌లో పొట్రోకు చెక్‌చరిత్ర సృష్టించిన ఆండర్సన్‌పదిహేను గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వీరుడు.. స్పెయిన్ దిగ్గజ ఆటగాడు.. రఫెల్ నడాల్ గర్జించాడు..! తన నెంబర్‌వన్ ర్యాంక్‌కు అర్థం చెప్పే ఆటతో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు..! క్వార్టర్స్‌లో స్విస్ గ్రేట్ ఫెడెక్స్‌కు దడపుట్టించిన డెల్ పొట్రోను మట్టి కరిపించాడు..! 2009లో ఇదే వేదికపై నాడు సెమీస్‌లో తనను ఓడించిన పొట్రోపై ప్రతీకారం తీర్చుకుంటూ.. టోర్నీలో మూడో టైటిల్ వేటలో నిలిచాడు..! మరోవైపు కారెన్ బుస్టాకు చెక్ పెట్టిన కెవిన్ ఆండర్సన్ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ తుదిపోరుకు చేరుకున్నాడు..! 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన సౌతాఫ్రికా ఆటగాడిగా రికార్డుకెక్కిన కెవిన్‌తో ఆదివారం అర్ధరాత్రి జరిగే టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు నడాల్ సిద్ధమయ్యాడు..! న్యూయార్క్: స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ యూఎస్ ఓపెన్‌లో మూడో టైటిల్ ముచ్చట తీర్చుకునేందుకు మరొక్క అడుగు దూరంలో నిలిచాడు. కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన రఫా.. క్వార్టర్స్‌లో ఫెడెరర్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకొచ్చిన జువాన్ మార్టిన్ డెల్ పొట్రో జోరుకు చెక్ పెట్టాడు. శనివారం తెల్లవారు జామున జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నెంబర్‌వన్, టాప్‌సీడ్ నడాల్ 4-6, 6-0, 6-3, 6-2తో 24వ సీడ్ డెల్ పొట్రోను చిత్తుచేశాడు. రెండు గంటల 50 నిమిషాల పోరులో రఫా ఐదు ఏస్‌లు, 45 విన్నర్లు సాధించి.. 20 అనవసర తప్పిదాలు చేశాడు. పొట్రో ఏడు ఏస్‌లు 23 విన్నర్లు కొట్టి 40 అనవసర తప్పిదాలతో ప్రతికూల ఫలితం ఎదుర్కొన్నాడు. 2010, 13లో ఇక్కడ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ మొనగాడు కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది రఫాకిది మూడో ఫైనల్ కావడం విశేషం. ఆదివారం జరిగే తుదిపోరులో 32వ ర్యాంకర్ కెవిన్ ఆండర్సన్‌ను ఢీకొననున్నాడు. మరో సెమీస్‌లో ఆండర్సన్ 4-6, 7-5, 6-3, 6-4తో 12వ సీడ్ స్పెయిన్ ప్లేయర్ పాబ్లో కారెన్ బుస్టాపై విజయం సాధించాడు. కాగా, కెవిన్‌పై నడాల్‌కు 4-0తో మెరుగైన రికార్డు ఉంది. తడబడి.. వ్యూహాలు మార్చి..: 2009లో ఇక్కడే ఏకైక గ్రాండ్‌స్లామ్ నెగ్గే క్రమంలో పొట్రో.. నాడు సెమీస్‌లోనే నడాల్‌ను ఓడించాడు. ఆ ఉత్సాహంతో బరిలోకి దిగిన పొట్రో ఆరంభంలో అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు. ఐదో గేమ్‌లోనే చక్కటి బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో బ్రేక్ సాధించాడు. ఉత్కంఠ రేపిన తర్వాతి గేమ్‌లో సర్వీస్ నిలబెట్టుకున్న అతను 4-2తో ముందంజ వేశాడు. అదే ఊపులో తొలిసెట్ నెగ్గి 1-0తో ముందంజ వేశాడు. అయితే, ఆరంభ సెట్‌లో తడబడిన నడాల్ తర్వాత గొప్పగా పుంజుకున్నాడు. రెండోసెట్ నుంచి తన వ్యూహాలను పూర్తిగా మార్చేసి ప్రత్యర్థిపై దూకుడైన ఆటతో చెలరేగి ఆడిన రఫా.. ఏకంగా మూడు బ్రేక్స్ సాధించి రెండో సెట్‌ను 26 నిమిషాల్లోనే గెలుచుకున్నాడు. మరోవైపు ఆత్మరక్షణలో పడిపోయిన అర్జెంటీనా ప్లేయర్ తప్పిదా లతో వరుసగా తొమ్మిది గేమ్‌లు కోల్పోయాడు. దాంతో, మూడో సెట్‌లో స్పెయిన్ స్టార్ 3-0తో ఆధిక్యంలో నిలిచాడు. ఎనిమిదో గేమ్‌లో డెల్ రెండు సెట్ పాయింట్లు కాచుకున్నా ఫలితం లేకపోయింది. తర్వాతి గేమ్‌లో ఫోర్‌హ్యాం డ్ స్మాష్‌తో రఫా ఈ సెట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇక, మ్యాచ్‌లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన నాలుగో సెట్‌లో పొట్రో ప్రభావం చూపలేకపోయాడు. బలమైన సర్వీస్‌లు, చక్కటి విన్నర్లు సంధించడంతో పాటు నెట్ గేమ్‌లో ఎంతో మెరుగ్గా ఆడిన నడాల్ అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వరుసగా మూడు బ్రేక్ పాయింట్లు నెగ్గి 5-1తో ఆధిక్యం సాధించాడు. అనవసర తప్పిదాలతో తర్వాతి గేమ్ కోల్పోయినా.. ఎనిమిదో గేమ్‌లో బ్యాక్ హ్యాండ్ విన్నర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. బుస్టాపై ఆండర్సన్ పైచేయితొలిసారి సెమీస్ ఆడుతున్న కారెనో బుస్టా-కెవిన్ అండర్సన్‌లో కెవిన్‌దే పైచేయి అయింది. ఈ టోర్నీలో నలుగురు క్వాలిఫయర్స్‌ను ఎదుర్కొని.. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీస్‌కు వచ్చిన బుస్టా ఫైనల్ చేరుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. ఏడో గేమ్‌లో కెవిన్ సర్వీస్ బ్రేక్ చేసిన ఈ స్పెయిన్ ఆటగాడు.. అదే జోష్‌లో తొలి సెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత 6.8 అడుగుల పొడగరి అయిన ఆండర్సన్ హవా కొనసాగింది. పవర్ గేమ్‌తో విజృంభించిన కెవిన్ ఏకంగా 22 ఏస్‌లు, 58 విన్నర్లతో వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను నెగ్గాడు. ఈ విజయంతో ఆండర్సన్.. క్లిష్ డ్రిస్డేల్ (1965) తర్వాత ఫైనల్ చేరుకున్న తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. డబుల్స్ చాంప్ రోజర్-టెకావ్‌పురుషుల డబుల్స్‌లో జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రొమేనియా) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో రోజర్-టెకావ్ జోడీ 6-4, 6-3తో స్పెయిన్ ద్వయం ఫెలిసియానో లోపెజ్-మార్క్ లోపెజ్‌పై గెలిచింది. హింగిస్ ఖాతాలో మిక్స్‌డ్‌స్విస్ వెటరన్ మార్టినా హింగిస్ ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ చేరింది. యూఎస్ మిక్స్‌డ్ డబుల్స్ లో హింగిస్- జేమీ మర్రే (ఇంగ్లం డ్) ద్వయం టైటిల్ నెగ్గింది. సూపర్ టై బ్రేక్‌కు దారి తీసిన ఫైనల్లో హింగిస్-జేమీ 6-1, 4-6, 10-8తో మూడోసీడ్ చింగ్ చాన్ (తైపీ)- మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంట పై ఉత్కంఠ విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లోనూ హింగిస్ ఫైనల్‌కు చేరింది. | sports |
522 | 11-10-2017 00:20:34 | ఐటి నిపుణులకు లేఆఫ్‌ల సెగ | వచ్చే ఆరు మాసాలు గడ్డుకాలంసీనియర్లకు ఉద్వాసన తప్పదున్యూఢిల్లీ: భారత ఐటి కంపెనీల్లో వచ్చే రెండు త్రైమాసికాల్లోనూ ఉపాధి అవకాశాలు తగ్గుతాయని, ప్రధానంగా ఆటోమేషన్, డిజిటైజేషన్ ప్రభావం వల్ల సాంప్రదాయిక ఉద్యోగాలకు ముప్పు ఏర్పడిందని ఒక సర్వేలో తేలింది. ఎక్స్‌పెరిస్ ఐటి, మ్యాన్‌పవర్ గ్రూప్ ఈ సర్వే నిర్వహించాయి. 2017 అక్టోబరు నుంచి 2018 మార్చి మధ్య కాలంలో కొత్త నియామకాలు మరింతగా క్షీణించే ఆస్కారం ఉన్నట్టు ఆ సర్వే నివేదిక తెలిపింది. తమ వద్ద ఉన్న ప్రతిభను సద్దుబాటు చేసేందుకు ఐటి పరిశ్రమ కృషి చేస్తున్నదని, ఈ నేపథ్యంలో సీనియర్ స్థాయిలో లేఆఫ్‌లు చేస్తూ జూనియర్, మధ్య స్థాయిలో కొత్త నియామకాలు చేపడతారని ఆ నివేదిక పేర్కొంది. దేశంలోని అగ్రగామి ఐటి కంపెనీలన్నింటిలోనూ కలిపితే లేఆ్‌ఫలు ఇంతకు ముందెన్నడూ కనివిని ఎరుగనంత భారీ సంఖ్యలోనే ఉండవచ్చునంటూ వచ్చే 6 నుంచి 12 నెలల కాలం ఈ ధోరణి కొనసాగే ఆస్కారం ఉన్నట్టు తెలిపింది. వచ్చే 12 నెలల కాలంలో ఐటి రంగంలోని నిపుణులందరూ డిమాండు అధికంగా ఉన్న కొత్త తరానికి చెందిన టెక్నాలజీల్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలని ఆ నివేదికలో సూచించారు. సర్వీసుగా సాఫ్ట్‌వేర్ (సాస్), క్లౌడ్, ఇఆర్‌పి సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేథస్సు వంటి విభాగాల్లో మంచి అవకాశాలున్నట్టు ఎక్స్‌పెరిస్ ప్రెసిడెంట్ మన్‌మీత్ సింగ్ తెలిపారు. అమిత వేగం, నూరు శాతం విశ్వసనీయత, తక్కువ ధరలకు అందుబాటులో ఉండే టెక్నాలజీకే భవిష్యత్తు అని ఆయన అన్నారు. ఐటి రంగంలో చోటు చేసుకుంటున్న పరివర్తనలో ముందుకు వస్తున్న ఈ సాంకేతిక పరిజ్ఞానాలు సంక్లిష్టంగా ఉంటాయంటూ తమ ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునే యువ వృత్తి నిపుణులకు ఇవి మంచి అవకాశాలు అందుబాటులోకి తెస్తాయని ఆయన చెప్పారు. ఐటి రంగంలో స్థూలంగా నియామకాల వాతావరణం సానుకూలంగానే ఉన్నప్పటికీ ఆ రంగంలోని సంస్థలు నైపుణ్యాలకు మెరుగులు దిద్దడం, కొత్త నైపుణ్యాలు అలవాటు చేయడంపై దృష్టి పెడతాయని ఆయన అన్నారు. అయితే చాలా కంపెనీల యాజమాన్యాలు తమకు సుశిక్షితులైన కొత్త వారే కావాలని చెబుతున్నట్టు మన్‌మీత్ చెప్పారు. అభ్యాస కాలాన్ని తగ్గించడం కోసం ప్రొబేషన్ కాలపరిమితిని ముందుకు జరపడం కూడా ఐటి రంగంలో కొత్త సాంప్రదాయం కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు. | business |
17,259 | 19-12-2017 05:07:43 | సంస్కరణలకు దేశం సిద్ధం | రెండు రాష్ట్రాల ఫలితాలు చెప్తోందిదేఅభివృద్ధి గెలిచింది.. గుజరాత్ గెలిచిందిఇరు రాష్ట్రాల ప్రజలకు శిరసా వందనం: మోదీన్యూఢిల్లీ, డిసెంబరు 18: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలకు ప్రజల మద్దతు ఉందనడానికి, దేశం సంస్కరణలకు సిద్ధంగా ఉందనడానికి సంకేతాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బీజేపీపై పెట్టుకున్న నమ్మకానికి, మాపై చూపిన ఆప్యాయతకు.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు శిరసు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. ఆయా రాష్ట్రాల అభివృద్ధి ప్రస్థానం ఇలాగే కొనసాగుతుందని.. రెండు రాష్ట్రాల ప్రజలకు అవిశ్రాంతంగా సేవలందిస్తామని నేను హామీ ఇస్తున్నాను’’ అని ఆయన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు తాను ప్రణమిల్లుతున్నానని.. వారివల్లనే ఈ విజయాలు సిద్ధించాయని అన్నారు. ‘అభివృద్ధి గెలిచింది.. గుజరాత్ గెలిచింది’ అంటూ హిందీలో మరో ట్వీట్ చేశారు. అలాగే.. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రయోగించారు. ఎన్నికల్లో గెలుపుపై ఆనందం వెలిబుచ్చారు. ఎన్నికలపై జీఎస్టీ ప్రభావం ఉంటుందన్నవారికి చెంపపెట్టులా ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. 1995 నుంచి గుజరాత్‌లో బీజేపీ అప్రతిహత విజయాలను గుర్తుచేసుకున్నారు. అభివృద్ధిని ఎగతాళి చేసినవారికి గుజరాత్ ప్రజలు పాఠం చెప్పారన్నారు. గుజరాత్‌లో కులతత్వాన్ని నిర్మూలించడానికి 30 ఏళ్లు పట్టిందని.. కానీ, ఇప్పుడు కొందరు ఆ విషబీజాలను నాటడానికి ప్రయత్నించారని అన్నారు. అలాంటివారిని గుజరాత్ ప్రజలు ఎప్పట్నుంచో తిరస్కరిస్తున్నారని.. తాజాగా మరోసారి తిరస్కరించారని మోదీ అన్నారు. న్యూఢిల్లీ, డిసెంబరు 18: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలకు ప్రజల మద్దతు ఉందనడానికి, దేశం సంస్కరణలకు సిద్ధంగా ఉందనడానికి సంకేతాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బీజేపీపై పెట్టుకున్న నమ్మకానికి, మాపై చూపిన ఆప్యాయతకు.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు శిరసు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. ఆయా రాష్ట్రాల అభివృద్ధి ప్రస్థానం ఇలాగే కొనసాగుతుందని.. రెండు రాష్ట్రాల ప్రజలకు అవిశ్రాంతంగా సేవలందిస్తామని నేను హామీ ఇస్తున్నాను’’ అని ఆయన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు తాను ప్రణమిల్లుతున్నానని.. వారివల్లనే ఈ విజయాలు సిద్ధించాయని అన్నారు. ‘అభివృద్ధి గెలిచింది.. గుజరాత్ గెలిచింది’ అంటూ హిందీలో మరో ట్వీట్ చేశారు. అలాగే.. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రయోగించారు. ఎన్నికల్లో గెలుపుపై ఆనందం వెలిబుచ్చారు. ఎన్నికలపై జీఎస్టీ ప్రభావం ఉంటుందన్నవారికి చెంపపెట్టులా ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. 1995 నుంచి గుజరాత్‌లో బీజేపీ అప్రతిహత విజయాలను గుర్తుచేసుకున్నారు. అభివృద్ధిని ఎగతాళి చేసినవారికి గుజరాత్ ప్రజలు పాఠం చెప్పారన్నారు. గుజరాత్‌లో కులతత్వాన్ని నిర్మూలించడానికి 30 ఏళ్లు పట్టిందని.. కానీ, ఇప్పుడు కొందరు ఆ విషబీజాలను నాటడానికి ప్రయత్నించారని అన్నారు. అలాంటివారిని గుజరాత్ ప్రజలు ఎప్పట్నుంచో తిరస్కరిస్తున్నారని.. తాజాగా మరోసారి తిరస్కరించారని మోదీ అన్నారు. మోదీ అరగంట ప్రసంగంలో.. 25సార్లు ‘అభివృద్ధి’గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ‘అభివృద్ధి’ ఊసే ఎత్తని మోదీ.. గెలిచాక ఆ పదాన్ని పదేపదే ఉపయోగించారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. అరగంటలో 25 సార్లు ‘వికాస్ (అభివృద్ధి)’ అనే పదాన్ని ఉపయో గించారు. ఈ ఎన్నికల్లో గెలుపునకు అభివృద్ధే కారణమంటూ మొదలుపెట్టిన మోదీ.. గుజరాత్‌లో ‘అభివృద్ధి’ని ఎగతాళి చేసినవారిపై విసుర్లతో ప్రసంగాన్ని కొనసాగించారు. | nation |
19,796 | 12-06-2017 01:51:09 | పాక్, లంక అమీతుమీ! | గెలిచిన జట్టు సెమీస్‌కిచాంపియన్స్ ట్రోఫీకార్డిఫ్: ఆరంభ మ్యాచ్‌ల్లో ఓటములతో డీలా పడినా ఆ తర్వాత అనూహ్య విజయాలతో పుంజుకుని సెమీస్ రేసులో నిలిచిన జట్లు పాకిస్థాన్, శ్రీలంక. ఇప్పుడీ రెండు జట్లూ ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. గెలిచిన జట్టు సెమీ్‌సకి.. ఓడిన టీమ్ ఇంటికి. ఈ నేపథ్యంలో గ్రూప్-బిలో సోమవారం జరగనున్న ఈ చివరి లీగ్ మ్యాచ్ పాక్, లంకకు క్వార్టర్ ఫైనల్ లాంటిది. కాబట్టి ఈ మ్యాచ్‌లో నెగ్గి సెమీ్‌సకు చేరాలని ఇరు జట్లూ గట్టి పట్టుదలతో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో 124 పరుగుల తేడాతో చిత్తుగా ఓడినా.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు ఫామ్‌లోకొచ్చారు. అయితే పాక్ బ్యాటింగ్ విభాగం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. లంకతో మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ రాణించడంపైనే ఆ జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో డీలాపడిన శ్రీలంక.. భారత్‌పై స్ఫూర్తిదాయక విజయంతో రేసులోకొచ్చింది. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్.. టీమిండియాపై జట్టుని ముందుండి నడిపించాడు. మాథ్యూ్‌సతోపాటు మెండిస్, గుణతిలక రాణించడంతో భారత్‌పై విజయం తేలికైంది. అలాగే బౌలింగ్ విభాగం కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే పాక్‌కు కష్టమే. | sports |
16,164 | 06-08-2017 01:03:51 | సముద్ర గర్భంలోకి మనిషి! | 6కి.మీ. లోతుకు వెళ్లేలా ప్రత్యేక క్రాఫ్ట్ఐదేళ్లలో రూపకల్పనకు ప్రణాళికఐదు అగ్ర దేశాల సరసన భారత్‌డిజైన్‌ను రూపొందించిన ఎన్‌ఐవోటీచెన్నై, ఆగస్టు 5: మానవ సహిత రోదసియానానికి నాంది పలికేలా జీఎ్‌సఎల్వీ-మార్క్3 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత్ ఇప్పుడు మనిషిని సముద్రం అట్టడుగుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. ఉపరితలం నుంచి ఆరు కిలోమీటర్ల లోతులోకి వెళ్లేలా ప్రత్యేక క్రాఫ్ట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టబోతోంది. దీని కి సంబంధించిన ప్రాథమిక డిజైన్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్‌ఐవోటీ) శాస్త్రవేత్తలు రూపొందించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్రాఫ్ట్‌ను రూపొందించేందుకు రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఐదేళ్లలోగా పూర్తి చేయగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తయితే ఈ తరహా టెక్నాలజీ ఉన్న ఐదు అగ్ర దేశాలు చైనా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ సరసన భారత్ చేరుతుంది. ఎన్‌ఐవోటీ రూపొందించిన డిజైన్ ప్రకారం 3.2 మీటర్ల వ్యాసంతో గోళాకార ‘క్రాఫ్ట్’ను తయారు చేయనున్నారు. నౌకలో నుంచి దీనిని సముద్రంలోకి వదులుతారు. ఇందులో ముగ్గురు శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలోకి వెళ్లొచ్చు. 8-10 గంటల పాటు ఉండి పరిశోధనలు జరపొచ్చు. అక్కడి నుంచి నమూనాల సేకరణకోసం ఓ రోబోటిక్ చేతినీ అమర్చనున్నట్లు తెలిపింది. ఈ క్రాఫ్ట్ డిజైన్‌కు కేంద్రం ఆమోదం లభిం చాల్సి ఉందని ఎన్‌ఐవోటీ డైరెక్టర్ సతీష్ షెనోయి తెలిపారు. మూడేళ్లలో ‘శాంపిల్’ క్రాఫ్ట్‌ప్రస్తుతం భారత్ సముద్ర గర్భంలో పరిశోధనల కోసం ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ సాయంతో పాలీమెటాటిక్ మాడ్యూల్స్‌ను వినియోగిస్తోంది. ఇవి మానవ రహిత పరికరాలు కావడంతో నమూనాల సేకరణ కష్టతరంగా మారుతోంది. దీంతో స్వదేశీ పరిజ్ఞానంతో ‘మానవ సహిత క్రాఫ్ట్’ను రూపొందించాలని కేంద్రం భావిస్తోందని సతీ ష్ షెనోయి చెప్పారు. అయితే ఇంతటి భారీ ప్రయోగాన్ని చేపట్టే ముందు ఒక ‘శాంపిల్’ క్రాఫ్ట్‌ను తయారు చేయడం మేలని ఎన్‌ఐవోటీ భావన. 500 మీటర్ల లోతు వరకు మనిషిని తీసుకెళ్లగలిగేలా గోళాకార క్రాఫ్ట్‌ను రానున్న మూడేళ్లలో పూర్తి చేయనుంది. | nation |
21,097 | 07-09-2017 19:52:30 | కోహ్లీకి సరికొత్త బిరుదు ఇచ్చిన ఐసీసీ! | దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి తాజాగా ఓ బిరుదు ఇచ్చింది. ‘ఛేజ్ మాస్టర్’ అంటూ కొనియాడింది. బుధవారం శ్రీలంకతో జరిగిన టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా.. ఛేజ్ మాస్టర్ కోహ్లీ 82 పరుగుల ఇన్నింగ్స్‌తో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.. అని ఐసీసీ పేర్కొంది. నిజానికి కోహ్లీకి ఛేజింగ్ అంటేనే ఇష్టం. లక్ష్య ఛేదనలో ముందుండే కోహ్లీ తాజాగా శ్రీలంకతో జరిగిన అన్ని ఫార్మాట్లలోనూ ఇదే ఫార్ములాను ఎంచుకున్నాడు. ప్రత్యర్థులకు బ్యాటింగ్ అప్పగించి, అనంతరం వారు నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించడంలో కోహ్లీ దిట్ట అనిపించుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సాధించిన పరుగుల్లో ఎక్కువ శాతం ఛేదనలో వచ్చినవే. ఇక టీ20లలో కోహ్లీ ఏకంగా ఛేజింగ్‌లో 1,016 పరుగులు పిండుకోవడం విశేషం. ఇక ఇప్పటికే కోహ్లీని అభిమానులు చీకూ అని, ఇండియన్ రన్ మిషన్ అని, పరుగుల వీరుడని పిలిచుకుంటుంటారు.. ఇప్పుడు ఛేజ్ మాస్టర్ బిరుదు కూడా వచ్చి చేరింది. | sports |
8,307 | 15-04-2017 07:40:50 | విలన్ వారసుడికి సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు | 1980, 90ల్లో విలన్ పాత్రలతో భయపెట్టిన సీనియర్ నటుడు చరణ్‌రాజ్ వారసుడు తేజ్ ‘లాలి లాలి ఆరారో’ చిత్రంతో హీరోగా ఆరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఆడియోను సూపర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా తమిళ ఉగాది రోజున ఆవిష్కరించారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసంలోనే ఈ కార్యక్రమం జరుగడం విశేషం. ఈ సందర్భంగా రజనీకాంత్, చరణ్‌రాజ్ కలిసి నటించిన ‘బాషా’ చిత్రం తాలూకా జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం తేజ్ చరణ్‌రాజ్ హీరోగా గొప్ప స్థాయికి చేరుకోవాలని రజనీకాంత్ ఆశీర్వదించారు. | entertainment |
12,651 | 14-08-2017 02:16:54 | 14 రాష్ట్ర శాఖల మద్దతు శరద్‌కే! | ‘‘దేశంలోని 14 రాష్ట్ర శాఖల మద్దతు జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్‌కే ఉంది. పార్టీ అధ్యక్షుడు నితీశ్ కుమార్‌కు బిహార్ ఒక్కటే మద్దతుగా ఉంది. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, కొంతమంది జాతీయ ఆఫీస్ బేరర్లు కూడా శరద్‌కే మద్దతిస్తున్నారు. మేము పార్టీని వీడే ప్రసక్తే లేదు.’’ - అరుణ్ శ్రీవాస్తవ(శరద్ మద్దతుదారు), జేడీయూ గుజరాత్ మాజీ జనరల్ సెక్రటరీ | nation |
1,807 | 11-01-2017 23:16:43 | జెఎల్‌ఆర్ నుంచి రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్ వెర్షన్ | ధర రూ.53.20 లక్షలు హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): టాటా మోటార్స్.. జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) దేశీ మార్కెట్లోకి ప్రీమియం స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యువి) రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రో ల్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కారు ధర 53.20 లక్షల రూపాయలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). ఎస్‌ఇ ట్రిమ్‌లో ఈ ఎస్‌యువి అందుబాటులో ఉంటుందని జెఎల్‌ఆర్ తెలిపింది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన ఈ ఎస్‌యువి పవర్ అవుట్ పుట్ 177 కిలో వాట్లని పేర్కొంది. జెఎల్‌ఆర్ గత ఏడాది డిసెంబరు నుంచి ఎవోక్ డీజిల్ వేరియంట్‌ను విక్రయిస్తోంది. వినియోగదారులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన రేంజ్ రోవర్ ఎవోక్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు జెఎల్‌ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత సూరి తెలిపారు. జెఎల్‌ఆర్ లాండ్ రోవర్ పోర్టుఫోలియోలో డిస్కవరీ స్పోర్ట్ ప్రారంభ ధర 47.59 లక్షల రూపాయలుండగా రేంజ్ రోవర్ స్పోర్ట్ ధరలు 1.18 కోట్ల రూపాయల నుంచి 2.13 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. కాగా రేంజ్ రోవర్ ఎవోక్ ప్రారంభ ధర 49.10 రూపాయలుగా ఉంది. | business |
16,096 | 26-04-2017 11:01:23 | ఈ విజయం వీరజవాన్లకు అంకితం : ఢిల్లీ బీజేపీ చీఫ్ | న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ విజయాన్ని తాము వేడుకగా జరుపుకోరాదని నిర్ణయించినట్టు ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ప్రకటించారు. ఇటీవల సుక్మా జిల్లాలో మృతిచెందిన సైనికులకు సంతాపంగా ఢిల్లీ విజయంపై బీజేపీ వేడుకలు జరుపుకోవడం లేదన్నారు. అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు తమ విజయాన్ని అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఈ ఫలితాలు మాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు. అయితే ఈ విజయంపై మేము సంబురాలు జరుపుకోవడం లేదు. ఛత్తీస్‌ఘడ్‌లో 25 మంది సైనికులను పోగొట్టుకున్నాం... దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని మనం తప్పక గౌరవించాలి’’ అని తివారీ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు కేజ్రివాల్ నాయకత్వాన్ని తిరస్కరించినందున ఆయన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. | nation |
9,179 | 25-07-2017 22:38:42 | తొలిసారి |
‘సినీ మ్యుజీషియన్స్ యూనియన్’ అధ్యక్షురాలిగా నేపథ్యగాయని విజయలక్ష్మి ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. విజయలక్ష్మి అధ్యక్షురాలిగా ఎన్నికకాగా, గౌరవ అధ్యక్షులుగా ఆర్.పి.పట్నాయక్, అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్‌గా మణిశర్మ, ఉపాధ్యక్షులుగా పాల్‌రాజ్, సంయుక్త కార్యదర్శిగా కౌసల్య, ప్రధాన కార్యదర్శిగా లీనస్ కోశాధికారిగా రమణ, సలహాదారుగా రామాచారి ఎన్నికయ్యారు. ‘‘ఒక మహిళ యూనియన్‌కు అధ్యక్షురాలు కావడం ఇదే మొదటిసారి. సభ్యులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. పేద, వృద్ధ కళాకారుల సహాయపడేలా మూలనిధిని ఏర్పాటు చేసి కళాకారులకి ఆరోగ్యబీమా కార్డులు, ఇళ్ల స్థలాలు సమకూర్చడం స్థానిక కళాకారులకి ఎక్కువ పని దొరికేలా చెయ్యడం ఇవే తక్షణ లక్ష్యాలుగా పెట్టుకున్నాం’’ అని విజయలక్ష్మి తెలిపారు. | entertainment |
1,635 | 22-03-2017 23:32:46 | 75 హైవేల విక్రయంతో రూ.40 వేల కోట్లు | ముంబై : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) నిర్వహణలోని 75 హైవే ప్రాజెక్టులను విక్రయించడం ద్వారా సుమారుగా 40,000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. అయితే ఈ సొమ్ము ప్రభుత్వం అంచనా వేసిన దానికన్నా చాలా తక్కువని పేర్కొంది. జాతీయ రహదారులపై ఉండే రవాణా రద్దీ, రోడ్ ఫ్రైట్‌లో తగ్గిన వృద్ధి, ప్రత్యేక ఫ్రైట్ కారిడార్‌లను (డిఎఫ్‌సి) దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు బిడ్స్‌ను దాఖలు చేసే అవకాశం ఉందని తెలిపింది. ట్రాఫిక్‌లో ఉండే తేడాలు, హెచ్చుతగ్గుల కారణంగా రిటర్నులు తగ్గడానికి అవకాశం ఉందని, ఇలాంటి వాటితోపాటు డిఎఫ్‌సి, జిఎస్‌టి వంటి వాటిపైనా ఇన్వెస్టర్లు ప్రత్యేకంగా దృష్టిసారిస్తారని వెల్లడించింది. సాంకేతిక పరిశీలనలో లేని రోడ్లలో లోపాలను కూడా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకుంటారని క్రిసిల్ రీసెర్చ్ సీనియర్ డైరెక్టర్ ప్రసాద్ కొపార్కర్ తెలిపారు. కాంపీటింగ్ రోడ్లకు సంబంధించిన అంశాలు కూడా లేవనెత్తవచ్చని అన్నారు. వాస్తవమైన రోడ్డుకు బదులుగా 20 శాతం పొడవైన ప్రత్యామ్నాయ రూట్‌ను నిర్మిస్తే దాన్ని కాంపీటింగ్ రూట్‌గా పరిగణి స్తారు. టోల్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (టిఒటి) విధానంలో ఎన్‌హెచ్‌ఎఐ హైవేలలోని తన యాజమాన్య హక్కులు, టోల్‌ను వసూలు చేసే హక్కులను ప్రైవేటు సంస్థలకు 30 ఏళ్ల కాలానికి బదిలీ చేస్తుంది. | business |
21,201 | 09-03-2017 02:03:18 | శ్రీలంక 494 ఆలౌట్ |
గాలె: కుశాల్ మెండిస్ (194) భారీ సెంచరీకి తోడు అసెల గుణరత్నె (85), నిరోషన్ డిక్‌వెల్లా (75), దిల్‌రువాన్ పెరీర (51) అర్ధ సెంచరీలతో రాణించడంతో.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో ఆతిథ్య శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 494 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా... ఆట చివరకు 2 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. | sports |
20,569 | 19-09-2017 11:49:58 | శ్రీశాంత్ ఆశలపై నీళ్లు చల్లిన బీసీసీఐ! | న్యూఢిల్లీ: కేరళ హైకోర్టు తీర్పుతో క్రికెటర్ శ్రీశాంత్‌పై నిషేధం తొలగిపోయినట్టేనని భావిస్తున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలన్న తీర్పును వ్యతిరేకిస్తూ కేరళ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలకు విరుద్దంగా హైకోర్టు నిర్ణయం ఉందంటూ బీసీసీఐ పేర్కొంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అన్ని ఆధారాలు ఉన్నందునే శ్రీశాంత్‌పై నిషేధం విధించామని... దాన్ని కొనసాగించాలని కోర్టుకు నివేదించింది. 2013 ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే 2015లో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా సహా మొత్తం 36 వచ్చిన ఆరోపణలను పటియాలా హైకోర్టు కొట్టివేసింది. దీంతో తనపై విధించిన నిషేధాన్ని తొలగించేలా బీసీసీఐని ఆదేశించాలంటూ శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ విధించిన నిషేధాన్నిఎత్తివేస్తూ ఆగస్టు 7న హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే తీర్పు తర్వాత కూడా బీసీసీఐ మాత్రం తాను తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. | sports |
8,817 | 26-10-2017 13:23:10 | జాతీయగీతంపై స్పందించిన కమల్ హాసన్ | సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడం అనే అంశంపై నిరసన పెరుగుతోంది. తాజాగా సుప్రీంకోర్టు కూడా సినిమాకి ముందు జాతీయగీతం ప్రదర్శించడానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని కేంద్రానికి సూచించింది. జాతీయగీతం రాగానే లేచి నిలబడనక్కర్లేదని తెలిపింది. థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శించడంపై కమల్ హాసన్ స్పందించారు. ఎక్కడ పడితే అక్కడ మన దేశభక్తిని ప్రదర్శించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. "ప్రతిరోజూ అర్ధరాత్రి సింగపూర్ తమ జాతీయగీతాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే దూరదర్శన్‌లో మీరూ చెయ్యండి. అంతేకానీ ఎక్కడపడితే అక్కడ మా దేశభక్తిని నిరూపించుకోమని ఫోర్స్ చేయకండి. సింగపూర్ నియంతృత్వ దేశం కాబట్టి ఇలాంటి వివాదాస్పద విషయాల్లో ఆ దేశ ప్రస్తావన వస్తోంది. అది మనకు కావాలా?" నో ప్లీజ్ అంటూ కమల్ ట్వీట్ చేశారు. ఇదే అంశంపై ఇటీవల అరవింద్ స్వామి కూడా స్పందించిన విషయం విదితమే. | entertainment |
12,798 | 23-12-2017 13:32:14 | మళ్లీ గుజరాత్‌లో రాహుల్ హల్‌చల్...! | న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ గుజరాత్‌లో అడుగుపెట్టారు. సోమనాథ్ ఆలయ సందర్శనతో ఆయన పర్యటన ప్రారంభమైంది. గుజరాత్ పర్యటన సందర్భంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరపనున్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన ఇక్కడికి రావడం ఇదే తొలిసారి . ప్రధాని మోదీ సొంతరాష్ట్రం, బీజేపీ కంచుకోటగా భావించే గుజరాత్‌లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు 80 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో బీజేపీ 100 లోపు స్థానాలతో నామమాత్ర విజయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. 22 ఏళ్ల పాటు గుజరాత్‌ను పాలించిన బీజేపీని ఓడించడంలో విఫలం కావడానికి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కాంగ్రెస్ నేతలు విశ్లేషించనున్నట్టు చెబుతున్నారు. గుజరాత్ ఎన్నికల ముగిసిన రెండ్రోజుల తర్వాత ఈ నెల 16న రాహుల్ గాంధీ కాంగ్రెస్ చీఫ్‌గా పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. | nation |
13,833 | 26-02-2017 02:05:25 | రూ.6000తో చంపేశారు | కౌలాలంపూర్, ఫిబ్రవరి 25: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్‌ను హత్య చేయడానికి పెద్దగా కష్టపడలేదు. కేవలం 90 అమెరికా డాలర్ల (మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.6000)తో చంపేశారు. ఇంకా చెప్పాలంటే, సరదాగా, టీవీ షోల తరహాలో ఆట పట్టిస్తున్నట్లు మరిపించి మరీ హత్య చేశారు. నామ్ హత్య కేసుకు సంబంధించి ఇద్దరు మహిళలను మలేసియా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఒకరు ఇండోనేసియాకు చెందిన సిటి ఐశ్యాహ్ అయితే మరొకరు వియత్నాంకు చెందిన మహిళ. వారిలో ఐశ్యా్‌హను పోలీసులు విచారిస్తున్నారు. నామ్‌పై వీఎక్స్ విషం చల్లడాన్ని తనకు టీవీ షోల్లో తరచూ చేసే ఆట పట్టించే కార్యక్రమమని చెప్పారని, అందుకు తనకు 90 డాలర్లు ఇచ్చారని ఆమె తెలిపింది. అయితే, తాను కస్టడీలో ఉన్న విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పవద్దని కోరింది. తన గురించి ఆందోళన చెందవద్దని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసుల ద్వారా వారికి సమాచారం పంపింది. అయితే, ఇదేమీ ఆట పట్టించే కార్యక్రమం కాదని, నామ్ హత్య కుట్ర గురించి వారికి తెలుసని, తెలిసే వీఎక్స్ ఆయనపై చల్లారని మలేసియా పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగానే విచారణ చేస్తున్నారు. అలాగే, ఆ ఇద్దరు మహిళలకు రక్షణగా నలుగురు పురుషులు వచ్చారని, ఈ ఘటన జరిగిన వెంటనే వారు మలేసియా నుంచి పరారయ్యారని భావిస్తున్నారు. కాగా, నామ్ హత్య నేపథ్యంలో ఉత్తర కొరియా, అమెరికా మాజీ అధికారుల మధ్య చర్చలను రద్దు చేసినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. వచ్చే వారంలో జరగాల్సిన ఈ సమావేశం అధికారికం కాదు. తాజా పరిణామాలతో ఉత్తర కొరియా రాయబారులకు వీసా ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. దాంతో, చర్చలు వాయిదా పడ్డాయి. | nation |