SNo
int64 0
21.6k
| date
stringlengths 19
19
| heading
stringlengths 3
91
⌀ | body
stringlengths 6
38.7k
| topic
stringclasses 5
values |
---|---|---|---|---|
21,292 | 14-02-2017 00:57:52 | సైనా, సింధు దూరం |
ఆసియా మిక్స్డ్ టోర్నీ హోచిమిన్ (వియత్నాం): ఆరంభ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు తప్పుకున్నారు. బిజీ అంతర్జాతీయ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని సైనా, సింధు ఈ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. మహిళల సింగిల్స్‌లో తన్వీ లాడ్, రితుపర్ణా దాస్ ప్రాతినిధ్యం వహించనున్నారు. మంగళవారం ప్రారంభం కానున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్, సమీర్ వర్మ, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ప్రణయ్ జోడీ, పురుషుల డబుల్స్‌లో సుమిత రెడ్డి-మను అత్రి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి ద్వయం తలపడనున్నారు. | sports |
8,039 | 02-08-2017 11:41:50 | ఇంకెంత కాలమో నాకు తెలియదు: రకుల్ | పాత తరం హీరోయిన్లలాగా కొత్త హీరోయిన్లు ఎవరూ సంవత్సరాల తరబడి సినిమాలు చేయడంలేదు. పదుల సంఖ్యలో సినిమాలు చేసి ఐదారు సంవత్సరాలకే తెరమరుగవుతున్నారు. వారికి భిన్నంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికీ చేతినిండా సినిమాలతో మరో రెండు మూడు సంవత్సరాల వరకూ బిజీగానే ఉంది. దీనికి కారణం కూడా చెప్పింది రకూల్. ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగాలంటే ప్రేక్షకుల ఆదరణ తప్పనిసరి అన్నది అందరికీ తెలిసిందే! తనకి ఆ ఆదరణ పుష్కలంగా ఉన్నందువల్లే సినిమాలు చేయగలుగుతోందట! అయితే ఈ ఆదరణ ఎంత కాలం ఉంటుందో తనకు తెలియదని అంటోంది రకుల్. | entertainment |
18,473 | 04-10-2017 04:44:15 | గృహ కొనుగోలుదారులకు అండగా సుప్రీం | న్యూఢిల్లీ: బిల్డర్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న ఇళ్ల కొనుగోలుదారులకు అనుకూలంగా సుప్రీంకోర్టు స్పందించింది. పైకం చెల్లించిన తర్వాత కూడా అటు ఇల్లు లేదా ఫ్లాట్ చేతికి రాకుండా, కట్టిన డబ్బు రిఫండ్ రాకుండా కష్టాల్లో ఉన్న కొనుగోలుదారులను ఆదుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక కేసు విచారణ సందర్భంగా సీజే జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. నోయిడాలోని జైపీ విష్ టౌన్ ప్రాజెక్టులో ఇళ్లు కొన్న 40 మంది దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. నిరుడు అమల్లోకి వచ్చిన దివాలా చట్టంలోని కొన్ని నిబంధనలను ఇళ్ల కొనుగోలుదారులు కోర్టులో సవాలు చేశారు. దీనిలో లిటిగేషన్ జోలికి తాము వెళ్లబోమని, గృహ కొనుగోలుదారులకు సాయం చేయడానికే పరిమితమవుతామని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో బిల్డర్ కొనుగోలుదారులకు ఇళ్లు స్వాధీనం చేయాలని, లేకపోతే వారు చెల్లించిన డబ్బు రిఫండ్ చేయాలని తాము కోరుకుంటున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. | nation |
5,481 | 04-05-2017 12:49:20 | బాహుబలి2 సినిమాకు వెళ్లిన సమంత.. 20 నిమిషాల్లోనే బయటికి.. | బాహుబలి2 సినిమాను సినీ ప్రముఖులు ఆకాశానికెత్తేస్తున్నారు. కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. దీంతో దర్శకనిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు విడుదల రోజు 40 మంది చిన్నారులతో కలిసి నూన్ షోకు వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. హైద్రాబాద్‌లోని ఓ థియేటర్‌కు చిన్నారులతో కలిసి బాహుబలి2 సినిమాకు సమంత వెళ్లింది. ఆ తర్వాత ఆమె సినిమాను అభినందిస్తూ ట్వీట్ కూడా చేసింది. కానీ ఆమె సినిమా ఆసాంతం చూడనేలేదట. సమంత వెళ్లిన థియేటర్లో ఏసీ పనిచేయలేదట. సినిమా ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఏసీ ట్రబుల్ ఇచ్చిందట. ఎంతైనా హీరోయిన్ కదా... ఉక్కపోత తట్టుకోలేక 20 నిమిషాల్లోనే బయటికొచ్చేసినట్లు తెలిసింది. చిన్నారులు మాత్రం ఆ ఉక్కపోతలోనే సినిమాను వీక్షించారని సమాచారం. సినిమా ప్రమోషన్లో ఉన్న బాహుబలి2 టీంకు, ఈ విషయం బయటికి పొక్కేసరికి కొంత ఇబ్బందిగా ఉందట. థియేటర్ యాజమాన్యం కలిగిన అసౌకర్యానికి సమంతకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిసింది. | entertainment |
18,417 | 20-08-2017 03:49:27 | కేన్సర్‌పై బ్రహ్మాస్త్రం | నెలాఖరుకల్లా ఇమ్యూనో థెరపీకి ఎఫ్‌డీఐ అనుమతి?ఈ ఏడాది చివరకు అమెరికాలో అందుబాటులోకిమానవాళికి అంతుచిక్కని మహమ్మారి కేన్సర్ పని పట్టే సరికొత్త చికిత్స ఇమ్యూనో థెరపీ.. అమెరికాలో అందుబాటులోకి రాబోతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరకు అమెరికాలోని 35 కేన్సర్ సెంటర్లలో ఈ చికిత్సను ప్రవేశపెట్టడానికి ప్రముఖ మందుల కంపెనీ నోవార్టిస్ సన్నాహాలు చేస్తోంది. ఒకసారి వస్తే అదుపుచేయడం చాలా కష్టమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియాను సైతం నియంత్రించే శక్తి ఈ ఇమ్యూనో థెరపీకి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనో థెరపీ ప్రయోగాల్లో భాగంగా లింఫోబ్లాస్టిక్ లుకేమియా కేన్సర్ పేషెంట్లపై చేసిన ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయని, కేన్సర్‌పై ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తోందని దీని రూపకర్తలు పేర్కొంటున్నారు. ఈ థెరపీని పరిశీలించడానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్ ఈ నెలాఖరుకు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. కొన్ని రకాల కేన్సర్ కేసుల్లో ఇమ్యూనో థెరపీ ఉపయోగించడానికి ఆ ప్యానెల్ అనుమతిస్తుందని భావిస్తున్నారు. ఇదీ నేపథ్యంపెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ సెల్యులర్ ఇమ్యూనోథెరపీ డైరక్టర్ డాక్టర్ కార్ల్ జూన్ భార్య, కుమారుడు కేన్సర్‌తో మరణించారు. దీనితో ఆయన కేన్సర్ పనిపట్టే ఔషధం కోసం ప్రయోగాలు ప్రారంభించి మూడు దశాబ్దాల పరిశోధన అనంతరం ఇమ్యూనో థెరపీకి రూపమిచ్చారు. అదెలా పనిచేస్తుందంటే.. రక్త కేన్సర్ కణాల్లో సీడీ19 అనే ఒక ప్రొటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్‌ను తొలగించగలిగితే కేన్సర్ కణాలు బతకవు. అయితే ఈ ప్రొటీన్‌పై దాడి చేయాలంటే మామూలు మందులు, కీమోథెరపీలు పనికిరావు. కణస్థాయిలోనే దాడులు జరగాలి. అందుకోసం జూన్.. రోగ నిరోధక శక్తిని ఇచ్చే కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. తద్వారా ఆ కణాల్లో తయారయ్యే ఒక ప్రొటీన్- సీడీ19ని అతుక్కొని దానిని నిర్వీర్యం చేస్తుంది. ఈ లోపులో మిగిలిన రోగ నిరోధక కణాలు కేన్సర్ కణంపై దాడి చేసి దానిని చంపేస్తాయి. కేన్సర్ కణాలపై దాడి చేసే కణాలను శరీరం తయారుచేసుకోలేదు కాబట్టి వాటిని ల్యాబ్‌లో తయారుచేసి రక్తంలోకి ప్రవేశపెట్టారు. మొదట ఎలుకలపైనా.. ఆ తర్వాత మనుషులపైన చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయని, ఇప్పటి వరకూ అనేక మంది ఈ చికిత్స ద్వారా పునర్జీవితం పొందారని జూన్ వివరించారు. త్వరలో ఈ థెరపీకి అనుమతి లభిస్తుందనే వార్తలు రావటంతో కొన్ని వందల మంది వలంటీర్లు ఈ చికిత్స చేయించుకోవటానికి ముందుకు వస్తున్నారు. ఈ థెరపీకి ప్రస్తుతం దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుందని ఒక అంచనా. రోగనిరోధక శక్తి కణాల తయారీ చవక అయితే ఈ థెరపీకి అయ్యే ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. విటమిన్-సీ ఇంజెక్షన్లతో రక్త కేన్సర్‌కు అడ్డుకట్టపారిస్, న్యూయార్క్ ఆగస్టు 19: రక్త కేన్సర్ వ్యాప్తిని నిలువరించడంలో విటమిన్-సీ ఇంజెక్షన్లు ఉపయుక్తంగా పనిచేస్తాయని, రక్త కేన్సర్ మూల కణాలను చంపేస్తుందని అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఎక్కువ మోతాదు ఉన్న విటమిన్-సీ ఇంజెక్షన్లతోనే ఇది సాధ్యమని, నారింజ లాంటి పండ్ల వల్ల ఉపయోగం లేదని వివరించారు. కాగా, కేన్సర్ల నివారణకు ప్రామాణిక చికిత్సలు కాకుండా ప్రత్యామ్నాయ చికిత్సలు వద్దని అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్త స్కైలర్ జాన్సన్ హెచ్చరిస్తున్నారు.- స్పెషల్ డెస్క్ | nation |
19,192 | 11-04-2017 17:02:14 | అనంతనాగ్ ఉపఎన్నిక వాయిదాపై.. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఆగ్రహం | శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ ఉప ఎన్నిక వాయిదాపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ గత ఏడాది జూన్‌లో అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన అనంతరం ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన అనంతనాగ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సీఎం ముఫ్తీ సోదరుడు హుసేన్ ముఫ్తీ అధికార పీపుల్స్ డెమోక్రసీ పార్టీ (పీడీపీ) తరుఫున పోటీ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అనంతనాగ్ నియోజకవర్గంలో హింస చెలరేగుతోంది. శనివారం పోలింగ్ బూత్ ఏర్పాటు చేసిన ఓ స్కూల్‌కు కొందరు నిప్పుపెట్టారు. అల్లర్లలో 8 మంది మృతి చెందారు. దీంతో ఈ ఉప ఎన్నికను వాయిదా వేయాలని సీఎం మెహబూబాతో పాటు ఆమె సోదరుడు డిమాండ్ చేశారు. అయితే అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉప ఎన్నికను మే 25కు ఈసీ వాయిదా వేసింది. దీనిపై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నేతలు అనంతనాగ్ డిప్యూటీ కలెక్టర్‌ను చుట్టుముట్టారు. భారత ప్రజాస్వామ్యం డౌన్ డౌన్ అంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. | nation |
13,464 | 10-03-2017 00:48:07 | మా కొలువులు కూల్చుతున్నారు..! | వాషింగ్టన్, మార్చి 9: ‘భారతీయులు హెచ్-1బీ వీసాలతో వచ్చి మన ఉద్యోగాలన్నీ మింగేస్తున్నారు! వీటికి కళ్లెం వేయాల్సిందే!’.... ఇదీ అమెరికా సెనెట్, ప్రతినిధుల సభల్లోని పలువురు సభ్యుల అభిప్రాయం! హెచ్-1బీ వీసాల జారీని సంస్కరించాలంటూ ఉభయ సభల్లో ఆరు బిల్లులు ప్రవేశపెట్టారు. వీరిలో అధికార రిపబ్లికన్లతోపాటు... డెమొక్రాట్లూ ఉండటం గమనార్హం. రిపబ్లికన్ సెనెటర్ చుక్ గ్రాస్లీ, అసిస్టెంట్ సెనేట్ మైనారిటీ లీడర్ డిక్ డర్బిన్ మొట్టమొదటిసారిగా ‘హెచ్-1బీ, ఎల్-1 వీసా సంస్కరణల చట్టం’ ప్రవేశపెట్టారు. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని అందులో ప్రతిపాదించారు. లాటరీ పద్ధతి మార్చి వేయాలని, అమెరికా వర్సిటీల్లో చదువుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అందులో కోరారు. అలాగే... 50 కంటే ఎక్కువ ఉద్యోగులు ఉండి, వారిలో సగం హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులున్న కంపెనీలు అదనంగా విదేశీయులను నియమించుకోరాదని కూడా ప్రతిపాదించారు. తాత్కాలిక శిక్షణకు హెచ్-1బీ, ఎల్-1 వీసాదారులను రప్పించే ఔట్సోర్సింగ్ కంపెనీలపై గట్టి చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. అంతేకాదు... ఒక అమెరికన్ ఉద్యోగిని పక్కనపెట్టి ఆ స్థానంలో విదేశీయులను ఎట్టి పరిస్థితుల్లో నియమించకూడదని స్పష్టం చేశారు. అమెరికాలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ తమ ప్రతిపాదనలను పొందుపరిచారు. ఇక... కాంగ్రె్‌సలో సిలికాన్ వ్యాలీకి (కాలిఫోర్నియా) డెమొక్రాట్ నేత జో లఫ్రోజెన్ కూడా ఓ బిల్లు పెట్టారు. హెచ్-1బీ వీసాలపై వచ్చే వారికి కనీసం వార్షిక వేతనాన్ని రెట్టింపు చేసి, 1.30 లక్షల డాలర్లకు పెంచాలని కోరింది ఆయనే. ‘హై స్కిల్డ్ ఇంటెగ్రిటీ అండ్ ఫెయిర్‌నెస్ యాక్ట్’ పేరిట ఆయన ఈ బిల్లును ప్రతిపాదించారు. ఒక్కో దేశానికి ఇన్ని చొప్పున కోటా పెట్టకుండా... ముందుగా ఎవరు కోరితే వాళ్లకు (ఫస్ట్ కమ్ ఫస్ట్) వీసాలు జారీ చేయాలని కూడా కోరారు. ఇంకా... సెనెటర్లు షెరాడ్ బ్రౌన్, జో డాన్లీ, క్రిస్టెన్ గిల్లిబ్రాండ్ కలిసి ‘ఔట్‌సోర్సింగ్‌కు తెర దించాలి’ అని మరో బిల్లు ప్రతిపాదించారు. అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకే ప్రభుత్వ పనులు అప్పగించాలన్నది ఈ బిల్లు సారాంశం. రిపబ్లికన్ పార్టీకి చెందిన టామ్ కాటన్, డేవిడ్ పర్డ్యూలు మొత్తంగా పదేళ్లపాటు ఏటా అమెరికాలోకి వలసలకు కత్తెర వేయాలంటూ బిల్లు తీసుకొచ్చారు. ఇటీవల భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఖన్నా మరో ముగ్గురితో కలిసి హెచ్-1బీ, ఎల్-1 వర్క్ వీసాల్లో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని ప్రత్యేక బిల్లు తీసుకొచ్చారు. వలసల విధానాలను సమూలంగా మార్చాలని ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లులకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవి వలసదారుల్లో, ముఖ్యంగా భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. మరోవైపు... హెచ్-1బీ, ఉద్యోగాలతో గ్రీన్‌కార్డు పొందడానికి సంబంధించి రిపబ్లికన్ సెనెటర్ టామ్ కాటన్ సంచలన ప్రతిపాదనలు చేశారు. హెచ్1-బీ వీసాలదారుల్లో పీహెచ్‌డీలు, కంప్యూటర్ సైంటిస్టులనే తాము కోరుకుంటున్నామని... ‘మిడిల్ లెవెల్’ ఉద్యోగులు అక్కర్లేదన్నారు. కాటన్ ఇటీవలే ట్రంప్‌ను కలిసి తన అభిప్రాయాలు పంచుకున్నారు. అమెరికాకే నష్టం: కౌశిక్ | nation |
8,643 | 03-05-2017 14:19:40 | చిరంజీవి 151వ సినిమా గురించి ఆసక్తికర వార్త! | బాహుబలితో దర్శకుడు రాజమౌళి హై స్టాండర్డ్స్ సెట్ చేశాడు. ఇకపై సినిమాల్లో గ్రాఫిక్స్ సీన్స్ ఉండాలంటే బాహుబలి స్థాయిలో ఉండాల్సిందే. లేకపోతే అవి జనాలను ఆకట్టుకోలేవు. అందుకే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిరంజీవి 151వ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టడానికి డిసైడ్ అయిపోయాడట నిర్మాత రామ్‌చరణ్. ఈ సినిమా కోసం 125 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధమైపోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా ఐశ్వర్యారాయ్‌ను తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తోందట. అలాగే ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మించబోతున్నారట. బ్రిటీష్ పాలకులపై ఎదురుతిరిగిన ఉయ్యలవాడ నర్సింహారెడ్డి కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడు. | entertainment |
9,035 | 07-01-2017 13:24:01 | రాజమౌళికి సారీ చెబుదామనుకున్నా: అర్చన | తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు పెద్దగా ప్రోత్సాహం లభించదు అనడానికి ఉదాహరణ అర్చన. ట్యాలెంట్ ఉన్నా కూడా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చింది. ‘నువ్వొస్తానంటే నేనొద్దానంటే’ సినిమా సెట్లో రోజూ ఏడ్చేదాన్నని, ఆ సినిమా చేయడం తన కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిందని, రాజమౌళికి ఓ విషయంలో సారీ చెబుదామనుకుంటున్నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అర్చన. ‘మొదటి సినిమా ‘నేను’లో హీరోయిన్ పాత్ర చేసిన తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా’లో బలవంతంగా సపోర్టింగ్ రోల్ చేయవలసి వచ్చింది. కళ్లజోడు పెట్టి డీ-గ్లామర్‌గా చూపించడంతో ఆ సినిమా సెట్లో రోజూ ఏడ్చేదాన్ని. కేవలం ఆ సినిమాలో చేయడం వల్లే ఓ పెద్ద డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ పాత్రను పొగొట్టుకున్నా. ‘నువ్వొస్తానంటే..’ చేయకపోయి ఉండుంటే ఈ రోజు పరిశ్రమలో నా స్థానం వేరేలా ఉండేదేమో. | entertainment |
19,667 | 15-01-2017 20:53:03 | తన అద్భుత పోరాటాన్ని ముగించిన కేదార్ జాదవ్.. | పూణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కేదార్ జాదవ్ తన అద్భుత పోరాటాన్ని ముగించాడు. భారీ లక్ష్యంన్ని ఛేదించే క్రమంలో అద్భుత బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి సెంచరీ నమోదు చేశాడు. 76 బంతుల్లోనే 120 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జాక్ బాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీకి దగ్గర్లో క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 39.5 ఓవర్లకు 291/6. మ్యాచ్ గెలవాలంటే ఇంకా 60 బంతుల్లో 61 పరుగులు చేయాలి. క్రీజ్‌లో హార్ధిక్ పాండ్యాతో పాటు రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నాడు. | sports |
15,303 | 03-06-2017 18:00:05 | ప్రసార భారతికి కొత్త రూపు తెస్తా : శశి శేఖర్ వెంపటి | బెంగళూరు : ప్రజలు నమ్మదగిన ప్రసార మాధ్యమం చాలా అవసరమని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసార భారతికి కాబోయే సీఈఓ శశి శేఖర్ వెంపటి తెలిపారు. ప్రస్తుతం ప్రసార భారతికి విశ్వసనీయత లోపం ఉందని అంగీకరించారు. అనేక సంవత్సరాల నుంచి వెనుకబడిన ప్రసార భారతికి విశ్వసనీయతను సాధించి, ప్రపంచ ఉత్తమ ప్రసార మాధ్యమంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. అత్యంత విశ్వసనీయమైన వార్తలను తెలుసుకోగలమనే దృఢ నమ్మకాన్ని ప్రజలకు కల్పించగలిగే మాధ్యమం ఉండాలన్నారు. తప్పుడు వార్తలు, నకిలీ కథనాల గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేషనల్ బ్రాడ్‌కాస్టర్ పాత్ర చాలా సంక్లిష్టమైనదని శశి శేఖర్ తెలిపారు. జరిగినదాని గురించి అత్యంత నమ్మకమైన కథనాలను తెలుసుకోగలమనే నమ్మకంగల మాధ్యమం ఒకటి ఉండాలని తెలిపారు. మిగతా నేషనల్ బ్రాడ్కాస్టర్ల మాదిరిగానే దూరదర్శన్, ఆకాశవాణి కూడా అంతర్జాతీయ గళంగా పని చేయాలని, తద్వారా అగ్రశ్రేణి బ్రాడ్కాస్టర్ల జాబితాలో చేరాలన్నారు. డిజిటల్ యుగంలో దూరదర్శన్, ఆలిండియా రేడియో సోషల్ మీడియాలో వెనుకబడి ఉన్నాయన్నారు. | nation |
20,482 | 19-01-2017 00:47:47 | కటక్‌లోనే కొట్టేద్దాం! |
సిరీస్‌పై భారత గురిసమంపై ఇంగ్లండ్ కన్నుజోరు మీద టీమిండియాఒత్తిడిలో మోర్గాన్సేనఇరు జట్ల మధ్య రెండో వన్డే నేడుబారాబతి స్టేడియంలో పటిష్ట భద్రతకటక్: తొలి వన్డేలో అద్భుత విజయం సాధించి జోరు మీదున్న టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడి బారాబతి స్టేడియం వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో భారత విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మొదటి మ్యాచ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరో వైపు టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం ఎదుర్కొని తొలి వన్డేలో 350 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయిన ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సిన అవసరం ఏర్పడింది మోర్గాన్ సేనకు. దీంతో, చావోరేవో పోరులో సత్తా చాటి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని ఆ జట్టు కోరుకుంటోంది. అయితే, బారాబతి స్టేడియంలో మంచి రికార్డు ఉండడం భారతకు కలిసొచ్చే అంశం. ఇప్పటిదాకా ఇక్కడ ఆడిన 17 వన్డేల్లో మన జట్టు 11 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఇక, కటక్‌లో 477 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మ్యాచ్ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరగా 2015 అక్టోబర్ 5న దక్షిణాఫ్రికాతో టీ-20 మ్యాచ్ భారతకు చేదు జ్ఞాపకాన్ని మిగిలిచ్చింది. ఆ పోరులో భారత ఓటమిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్ మైదానంలోకి వాటర్ బాటిళ్లు విసిరి మ్యాచ్‌కు అంతరాయం కలిగించారు. దీంతో, ఈ మ్యాచ్‌కు నిర్వాహకులు భారీ భద్రత కల్పించారు. వాళ్లపైనే ఆందోళన..: పుణెలో ప్రత్యర్థి బౌలర్లను మనోళ్లు ఓ ఆటాడుకున్నా కొన్ని విషయాలపై జట్టు మేనేజ్మెంట్ ఆందోళన చెందుతోంది. కీలక సమయంలో ధోనీ, యువరాజ్ వైఫల్యం కోహ్లీసేనపై ఒత్తిడి పెంచింది. అదే విధంగా ఢిల్లీ లెఫ్టాండర్ శిఖర్ ధవన్ కూడా తీవ్రంగా నిరాశపరిచారు. జట్టులో తన స్థానాన్ని ప్రమాదంలో పడేయకూడదంటే ఈ మ్యాచ్‌లో ధవన్ రాణించితీరాల్సిందే. ఇక, మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు జట్టులోకొచ్చిన యువీ, కెప్టెన్సీ వదులుకున్న తర్వాత స్వేచ్ఛగా ఆడతాడని భావించిన ధోనీ అంచనాలను అందుకోవాలని చూస్తున్నారు. కాగా, ఫార్మాట్ ఏదైనా కోహ్లీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తుండగా, కేదార్ జాదవ్ సంచలన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారు. వారితో పాటు పుణెలో హార్దిక్ పాండ్యా చివర్లో బాధ్యతాయుతంగా ఆడడం జట్టుకు సానుకూలాంశం. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ, జాదవ్, పాండ్యా చెలరేగితే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. బ్యాటింగ్‌లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకున్నప్పటికీ.. గత మ్యాచ్‌లో మన బౌలర్లు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. అన్ని సార్లూ పెద్ద లక్ష్యాన్ని ఛేదించలేం. అందువల్ల బౌలర్లు ప్రత్యర్థిని వీలైనంత తక్కువ స్కోరుకు కట్టడి చేసేందుకు ప్రయత్నించాలి. 28 భారత్ కెప్టెన్‌గా 1000 పరుగుల మార్కును చేరేందుకు కోహ్లీకి అవసరమైన పరుగులు. ధోనీ, అజరుద్దీన్, గంగూలీ, సచిన్, ద్రావిడ్, కపిల్ దేవ్ సరసన చేరుతాడు. | sports |
16,625 | 07-10-2017 16:14:34 | సౌదీ అరేబియా కింగ్‌కు అనూహ్య కష్టాలు |
మాస్కో : సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ (81) కాసేపు ఇబ్బంది పడ్డారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లిన ఆయన తన ప్రైవేట్ విమానంలోని బంగారు ఎస్కలేటర్ సక్రమంగా పని చేయలేదు. ఆయన ఆ ఎస్కలేటర్‌పై నిల్చున్న కొద్ది క్షణాల్లోనే అది పని చేయడం మానేసింది. దీంతో ఆయన విధి లేక మెట్ల ద్వారా క్రిందికి దిగారు. ఈ ఎస్కలేటర్‌ను ఆయనకోసమే తయారు చేశారు. ఆయనకు రష్యాలో ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ఉప ప్రధాని దిమిత్రి రోగోజిన్ మాస్కోలోని వునుకోవో విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సౌదీ అరేబియా రాజు విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆయన విపరీతంగా విదేశీ యాత్రలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత పర్యటనలో ఆయనతోపాటు 1500 మందిని, రెండు మెర్సిడెస్ బెంజ్ వాహనాలను, 459 టన్నుల లగేజిని తీసుకెళ్ళారు. | nation |
4,915 | 16-02-2017 22:03:06 | ‘మెట్రో’ సక్సెస్ కావాలి |
ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ‘మెట్రో’ మార్చి 3న విడుదల కానుంది. సురేశ్ కొండేటి సమర్పించారు. రజనీ రామ్ నిర్మాత. ప్రముఖ గాయని గీతామాధురి ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో హీరో శర్వానంద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘‘తమిళంలో ప్రేక్షకాదరణ పొందిన చిత్రమిది. తెలుగు ట్రైలర్ చాలా బావుంది. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించాలి’’ అని అన్నారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ ‘‘హైదరాబాద్, విశాఖపట్టణం వంటి మెట్రో నగరాల్లో నిరంతం చెయిన స్నాచింగ్ వార్తలను వింటూనే ఉన్నాం. దుండగుల ఆగడాల వల్ల కొన్ని సార్లు అమాయకులు ప్రాణాలను కోల్పోయిన ఘటనలున్నాయి. అలాంటి యథార్థ ఘటనల్ని ఆధారంగా చేసుకుని హృద్యంగా తెరకెక్కించిన చిత్రం ‘మెట్రో’. మార్చి 3న విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. | entertainment |
21,523 | 11-01-2017 01:35:46 | 11 వద్దు 21 ముద్దు... |
బెంగళూరు: దిగువ స్థాయి టోర్నమెంట్లలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్ర యోగాత్మకంగా ప్రవేశబెట్టబోతున్న 5-11 పాయింట్ల ఫార్మాట్‌పై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పెదవి విరిచింది. అలా చేస్తే ఆట ఏకపక్షంగా మారే ప్రమాదం ఉందన్నది. ‘పాత ఫార్మాట్లో మాదిరిగా ఇందులో సుదీర్ఘ ర్యాలీలు చూడలేం. ఇది స్మాష్ కొట్టు..పాయింటు పట్టు అన్నట్టుగా మారుతుంది. ర్యాలీల గురించి మరిచిపోతాం. అప్పుడు ఆటలో ఎలాంటి మజా ఉండబోద’ని వివరించింది. అంతర్జాతీయ టోర్నీల్లో ప్రస్తుత ఫార్మాట్లో 21 పాయింట్లతో మూడేసి గేమ్‌లు నిర్వహిస్తుండగా, ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీడబ్ల్యూఎఫ్ 11 పాయింట్లతో ఒక మ్యాచ్‌లో ఐదేసి గేమ్‌లతో ప్రయోగం చేయాలని చూస్తోంది. దీన్ని పుల్లెల గోపీచంద్ కూడా తప్పుపట్టాడు. | sports |
8,655 | 02-07-2017 00:10:11 | సింగర్ అఖిల్! | ‘సైమా’ వేదికపై గాయకునిగా అవతారమెత్తి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు నవ యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని. ప్రస్తుతం విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో తను హీరోగా నటిస్తోన్న చిత్రంలోని ‘ఏవేవో కలలు కన్నా..’ అనే పాటను ఆలపించిన ఆయన ఆహూతుల ప్రశంసల్ని అందుకున్నారు. ఆ సందర్భంలో తను అక్కడ లేనందుకు నాగార్జున కాస్త బాధపడ్డారు. కానీ తనయుడి ప్రతిభను ఆన్లైన్లో వీక్షించి మురిసిపోయారు. ‘‘నిన్న రాత్రి సైమా 2017లో లైవ్‌గా అఖిల్ పాట పాడే సమయంలో నేనక్కడ ఉండాలని కోరుకున్నా. దాని కోసం అతను ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేయడం నాకు తెలుసు. అభినందనలు తనయుడా!’’ అని ఆయన ట్వీట్ చేశారు. | entertainment |
3,960 | 12-02-2017 23:33:18 | ఉగాది పద్య గేయ రచనా పోటీ |
- ఆర్. రాము | editorial |
14,557 | 29-03-2017 00:10:02 | నేడు జీఎస్టీపై చర్చ | న్యూఢిల్లీ, మార్చి 28: దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం రూపొందించిన జీఎస్టీ బిల్లుపై లోక్‌సభలో బుధవారం చర్చ జరుగనుంది. పరిస్థితులు అనుకూలించి.. అన్ని పార్టీలూ సహకరిస్తే.. ఈ బిల్లుకు ఈ రోజే ఆమోదం లభిస్తుంది. ఈ బిల్లును జులై 1 నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటికి ఇది అమల్లోకి రావాలంటే పార్లమెంట్‌తో పాటు.. అన్ని రాష్ర్టాలూ తమ అసెంబ్లీల్లో ఈ బిల్లును ఆమోదించాలి. బుధవారం దీనిపై చర్చ జరుగనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగెరస్లు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. దీనికి ప్రధాని మోదీ హాజరయ్యా రు. జీఎస్టీ బిల్లును ఏకాభిప్రాయంతో ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. ‘‘సర్వాధికారాన్ని పంచుకోవడం’’ అనే సూత్రంతో ఈ బిల్లును రూపొందించామని వివరించారు. కాగా.. ప్రస్తుత జీఎస్టీ బిల్లును యథావిధంగా ఆమోదించడానికి కాంగ్రెస్ అంగీకరించడం లేదు. అలాగే ఈ బిల్లును అడ్డుకున్నామన్న ముద్రపడకుండా.. ఆచితూచి వ్యవహరించి తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది. పలు సవరణలకు పట్టుబట్టాలని నిర్ణయించింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్‌గాంధీ.. మంగళవారం సమావేశమయ్యారు. ప్రజలకు మరింత మేలు చేకూరేలా జీఎస్టీ బిల్లులో సవరణలకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ఇక, జీఎస్టీ అమల్లోకి వస్తే.. అది జమ్మూ కశ్మీర్‌కి వర్తించదు. ఈ రాష్ర్టానికి జీఎస్టీ వర్తించాలంటే.. అక్కడి అసెంబ్లీలో కొత్తగా ఒక చట్టం చేయాల్సి ఉంటుంది. ఈ జీఎస్టీని ఆమోదిస్తూ చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌కి స్వతంత్ర హోదా ఉంది. దీంతో దీనికి సర్వీస్ పన్ను వర్తించదు. అలాగే జీఎస్టీ కూడా వర్తించదు. దీంతో జీఎసప్టీ ఆ రాష్ర్టానికి వర్తించాలంటే.. కొత్త చట్టం అవసరమవుతుంది. | nation |
15,522 | 23-03-2017 13:48:02 | త్వరలో పేపర్‌లెస్ సుప్రీంకోర్టు! | న్యూఢిల్లీ: త్వరలో సుప్రీంకోర్టు వ్యవహారాలు పేపర్లపై నడవబోవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్ ప్రకటించారు. పత్రాలతో సంబంధం లేకుండా కేసుల విచారణ ఊహించుకునేందుకు కూడా కష్టమే అయినా... మరో ఆరు, ఏడు నెలల్లో అది సాధ్యమేనని స్పష్టం చేశారు. పిటిషన్ల కోసం కట్టలకొద్దీ డాక్యుమెంట్లు, భారీ సైజు పేపర్ పుస్తకాలు అవసరం ఉండదన్నారు. కోర్టు రూమ్ నెం.1లో లాయర్లతో మాట్లాడిన జస్టిస్ ఖేహార్... ఇకపై ట్రయల్ కోర్టులు, హైకోర్టులనుంచి వచ్చే కేసు రికార్డులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో తీసుకుంటామనీ... కాబట్టి మళ్లీ పేపర్లపై వాటి నకళ్లు తేవాల్సిన అవసరం ఉండదన్నారు. లాయర్లు తాము సవాలు చేసే దిగువ కోర్టు తీర్పు నేపథ్యాన్ని మాత్రమే ఫైల్ చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. | nation |
7,947 | 10-05-2017 19:46:37 | 3Dలో రామాయణం: అల్లు అరవింద్ | హైదరాబాద్: మెగాస్టార్‌తో టాలీవుడ్‌కి బ్లాక్ బ్లస్టర్లు అందించిన ప్రముఖ నిర్మాత, హీరో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ వెండితెరపై మరో సంచలనానికి శ్రీకారం చుట్టనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రోమాన్స్, డ్యాన్స్, ఫైట్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలరించిన అరవింద్... మరో భారీ బడ్జెట్ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు. అయితే... ఈసారి తన పంధాకు భిన్నంగా పౌరాణిక చిత్రం వైపు మొగ్గుచూపారు. ఎన్నిసార్లు చూసినా తనవితీరని రామకథను 3Dలో నిర్మించాలని ఆయన సంకల్పించుకున్నారు. మధు మంతెన, నమిత్ మల్హోత్రాతో కలిసి సంయుక్తంగా రామాయణం త్రీడీ చిత్రాన్ని నిర్మిస్తామని బుధవారం మీడియాకు అరవింద్ తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే అల్లువారి రామాయణంలో సీతారాముల పాత్రలు ఎవరు పోషిస్తారో అన్న అంశం మెగా ఫ్యాన్స్‌లో వాడివేడి చర్చకు దారితీసింది. ప్రస్తుతానికి ఇది సస్పెన్స్. | entertainment |
218 | 06-09-2017 02:34:07 | 2 లక్షల కంపెనీలకు చెల్లుచీటీ | నల్లధనంపై దూకుడు పెంచిన ప్రభుత్వం.. బ్యాంక్ లావాదేవీలపైనా వేటున్యూఢిల్లీ: నల్ల ధనానికి చెక్ పెట్టే చర్యలను ప్రభుత్వం మరిత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నిబంధనలు పాటించని 2.09 లక్షలకుపైగా డొల్ల కంపెనీల పేర్లను రిజిస్టర్ల నుంచి తొలగించింది. నమోదైన కంపెనీల జాబితాలో పేర్లు ఉన్న కంపెనీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం బ్యాంకులను కోరింది. ముఖ్యంగా చాలా కాలంగా పెద్దగా వ్యాపార లావాదేవీలు లేని కంపెనీలు, ఉన్నా రెగ్యులేటరీ సంస్థలకు సరిగా వార్షిక నివేదికలు, ఆర్థిక నివేదికలు అందజేయని కంపెనీల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. ‘నల్లధనంపై పోరులో భాగంగా పేర్లు తొలగించిన కంపెనీల ఖాతాలు వెంటనే స్తంభింపచేయాలని బ్యాంకులను కోరాం’ అని కేంద్ర కంపెనీల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పిపి చౌదరి ట్వీట్ చేశారు. నల్లధనాన్ని నిర్మూలించాలన్న ప్రధాని మోదీ విధానానికి అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. చాలా కాలంగా వ్యాపారంలో చురుగ్గా లేకపోయినా కొన్ని కంపెనీలు చురుగ్గా బ్యాంక్ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఈ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో ప్రభుత్వం వీటి పేర్లను తొలగించాలని నిర్ణయించింది. కంపెనీల చట్టంలోని సెక్షన్ 248 (5) కింద ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ సెక్షన్ కింద చాలా కాలంగా వ్యాపార కార్యకలాపాల్లో లేకపోయినా లేదా నిబంధనలు పాటించని కంపెనీలను డీరిజిస్టర్ చేయవచ్చు. ఈ చర్యతో చట్టపరంగా మళ్లీ గుర్తింపు పొందేవరకు ఈ కంపెనీల డైరెక్టర్లు, వాటి బ్యాంక్ ఖాతాలను నిర్వహించేందుకూ అనుమతించరు. అప్పటి వరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల రిజిస్టర్లలోనూ వీటి పేర్లు కొట్టివేసిన కంపెనీల పేర్ల జాబితాలోనే ఉంటాయి. నల్లధన కట్టడి, అక్రమ నగదు లావాదేవీల నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మరిన్ని కంపెనీలపై ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ తాజా చర్యతో పేర్లు తొలగించిన కంపెనీలపై పడే ప్రభావం ఇలా ఉంటుంది. గుర్తింపు రద్దుజాబితా నుంచి పేర్లు తొలగించడంతో ఈ కంపెనీలన్నిటిని దాదాపుగా రద్దయిన కంపెనీలుగానే పరిగణిస్తారు. నిబంధనలన్నీ పాటిస్తున్నట్టు రెగ్యులేటరీ సంస్థలను సంతృప్తిపరిస్తే తప్పించి మళ్లీ వీటి పేర్లను కంపెనీల రిజిస్టర్లో చేర్చరు. బోర్డుపై ప్రభావం ఈ కంపెనీల డైరెక్టర్ల బోర్డు సభ్యులు, అధీకృత సంతకందారులు ఇక ఆయా కంపెనీల మాజీలుగానే పరిగణింపబడతారు. వీరు ఇక ఆ కంపెనీల బ్యాంక్ లావాదేవీలు నిర్వహించేందుకూ వీలుండదు. కంపెనీలే నిర్వహణలో లేనపుడు ఇక ఆ ఖాతాల నిర్వహణ దుర్వినియో గం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. నిర్వహణ మెరుగుపడే అవకాశంప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు కంపెనీల నిర్వహణ మెరుగుపడే అవకాశం ఉంది. తమ ఆర్థిక లావాదేవీలపై ఏ మాత్రం అనుమానం ఉన్నా వేటుపడే అవకాశం ఉందనే భయంతో కంపెనీలు ఇందుకు చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నారు. నల్ల ధనం పెద్ద నోట్ల రద్దు సమయంలో పూర్తిగా లేదా పెద్దగా వ్యాపారం లేని కంపెనీలు కొంత మంది నల్ల ధనాన్ని తమ బ్యాంక్ ఖాతాల ద్వారా వైట్‌గా మార్చేందుకు సహకరించాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇపుడు పేర్లు తొలగించిన కంపెనీల బ్యాంకు ఖాతాలను ప్రభుత్వం ఈ కోణంలోనూ పరిశీలించబోతోంది. | business |
15,000 | 16-03-2017 18:25:19 | శశికళకు దీటైన వ్యూహం పన్నిన పన్నీర్ సెల్వం |
చెన్నై : ‘అమ్మ’ జయలలిత రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్న పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఆమె ప్రాతినిథ్యం వహించిన ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి శశికళ వర్గం నుంచి దినకరన్ పోటీ చేయబోతుండటంతో తన వర్గం తరపున మధుసూదనన్‌ను బరిలో దించాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు. మధుసూదనన్ అటు ఎంజీఆర్‌కు, ఇటు జయలలితకు విదేయుడిగా మంచి పేరు పొందారు. ప్రస్తుతం ఆయనను అన్నా డీఎంకే నుంచి శశికళ బహిష్కరించారు. ఆయన అన్నా డీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా వ్యవహరించేవారు. మధుసూదనన్‌ను అన్నా డీఎంకే నుంచి బహిష్కరిస్తూ శశికళ తీసుకున్న నిర్ణయం చెల్లదని పన్నీర్ సెల్వం వర్గం వాదిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఎన్నుకునేందుకు జరిగిన ప్రక్రియ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమని ఆరోపిస్తోంది. ఆమె తీసుకున్న నిర్ణయాలకు విలువ లేదని చెప్తోంది. ఇదిలావుండగా, మధుసూదనన్ ఆర్కే నగర్ నియోజకవర్గానికి చెందినవారే. ఆయన జయలలిత మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎంజీఆర్‌కు వీర విదేయుడిగా ఆయనకు పేరుంది. దినకరన్‌కు గట్టి పోటీ ఇవ్వగలరని చెప్తున్నారు. దినకరన్ కన్నా అధిక శాతం ఓట్లతో తాను గెలుస్తానని మధుసూదనన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. | nation |
8,406 | 25-02-2017 07:38:52 | ఏపీకి చెందిన ఈ కుర్రాడు ఆ రాష్ట్రంలో స్టార్ హీరో..! | ఆంధ్రజ్యోతి ప్రతినిధి, బెంగళూరు: ఒడిశా రాష్ట్రంలో సూపర్‌స్టార్‌గా ఉన్న సవ్యసాచి మన తెలుగు కుటుంబానికి చెందిన వాడేనంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. అవు ను ఇది నమ్మలేని నిజం. ఆంధ్రప్రదేశలోని అనకాపల్లి నుంచి వీరి పూర్వికులు ఒడిశాకు వెళ్ళిపోయారు. కాలక్రమంలో సవ్యసాచి అక్కడి సినీ రంగంలో అద్భుతంగా రాణించి సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ఒరియా బాషలో ఇతను నటించిన మొత్తం 30 సినిమాలు సూపర్‌డూపర్ హిట్ అందుకున్నాయి. ఇతని గురించి తెలుసుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు నీరాజనం, సీతారాముల కళ్యాణం చూతుము రారండి సినిమాల్లో హీరోగా అవకాశం కల్పించారు. ఈ రెండు సినిమాలు తెలుగు, తమిళు, ఒరియా భాషల్లో త్వరలో విడుదల కానున్నాయి. వచ్చే ఉగాది రోజు మరో తెలుగు చిత్రానికి ముహూర్తం ఖరారైందని సవ్యసాచి వెల్లడించారు. వరల్డ్ టి-20 అంధుల క్రికెట్‌కు ఒడిస్సా రాష్ట్రం నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సవ్యసాచి బెంగళూరుకు వచ్చిన సమయంలో మీడియాతో తన గురించి చెప్పుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందినవాడినని సవ్యసాచి చెప్పారు. నా చిన్నతనంలోనే అనకాపల్లి నుంచి ఒడిశాకు వచ్చామని ఆయన చెప్పారు. అవకాశం లభించినప్పుడెల్లా తాను అక్కడికి వెళ్తుంటానన్నారు. తెలుగు భాషను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానన్నారు. నాలుగైదు తరాల క్రితమే తమ కుటుంబం ఒడిస్సాకు వెళ్ళిందన్నారు. తెలుగులో మరిన్ని చిత్రాలు నటించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. అవకాశం లభిస్తే శాండల్‌వుడ్‌లో కూడా నటించేందుకు సిద్దమన్నారు. అన్నట్టు సవ్యసాచికి ఒరియా సినీ పరిశ్రమలో లౌలీస్టార్ అనే బిరుదు ఉంది. | entertainment |
7,126 | 05-09-2017 11:59:53 | డేరా బాబా నాకు మంచి స్నేహితుడు: ప్రముఖ నటి | ముంబై: 20 సంవత్సరాల జైలు శిక్ష పడిన డేరా బాబా రామ్‌రహీం ఇకపై సినిమాలు తీయలేడు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సింటా) బాబా వర్క్‌పర్మిట్‌ను రద్దు చేసింది. ఇంతేకాదు ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టిడిఎ) రామ్ రహీంతో పాటు అతని కూతురుగా చెప్పుకుంటున్న హనీప్రీత్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. అయితే కొంతకాలం క్రితం వరకూ రామ్ రహీంకు బాలీవుడ్లో మంచి పేరుంది. రామ్‌రహీంకు చెందిన ఒక సినిమా సక్సెస్ పార్టీలో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వేదికపై హంగామా చేసింది. రామ్‌రహీం దగ్గరకు వెళ్ళి అతనితో పాటు సెల్ఫీ తీసుకుంది. బాబాకు శిక్ష పడిన తరువాత రాఖీసావంత్.. తనకు బాబా రామ్‌రహీం మంచి స్నేహితుడని పేర్కొంది. గణేశ్ మహరాజ్.. రామ్ రహీంకు విముక్తి కల్పిస్తే తనకు మంచి సినిమా ఛాన్స్ దక్కుతుందని చెప్పింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు శేఖర్ సుమన్, రుతిక్ రోషన్, శిల్పాశెట్టి, అనిల్ కపూర్, జాన్ అబ్రహం తదితరులతో రామ్ రహీం ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే సల్మాన్‌ఖాన్ సోదరుడు సోహెల్‌ఖాన్ కూడా రామ్‌రహీం పక్కన ఉన్న ఫొటో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. | entertainment |
16,112 | 17-03-2017 00:29:45 | 3 నుంచి హెచ్1-బీ దరఖాస్తులు | వచ్చే ఏడాది కోసం తీసుకోనున్న అమెరికా వాషింగ్టన్, మార్చి 16: వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. వచ్చే నెల 3 నుంచి ఐటీ సంస్థలు, వృత్తి నిపుణుల నుంచి హెచ్1-బీ వర్క్ వీసాల దరఖాస్తులను ఆ దేశం ఆమోదించనుంది. 2018కి ఈ వీసాలను మంజూరు చేస్తారు. అయితే.. ఎప్పటి వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారనే విషయంపై అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎ్‌ససీఐఎస్) అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 85 వేల హెచ్1-బీ వీసాలను జారీ చేస్తారు. ఇందులో 65 వేల వీసాలను జనరల్ కేటగిరీలో, మిగతా 20 వేలను అమెరికాలో ఎంఎస్ తదితర ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి తిరిగి కేటాయిస్తారు. ప్రస్తుత దరఖాస్తులను వచ్చే ఏడాదికి పరిశీలిస్తారు. అమెరికాలో 2018 ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. కాగా,అమెరికాలో వివిధ విద్యా సంస్థల్లో డిగ్రీలు, పోస్ట్ గ్రాడు ్యయేట్ చేస్తున్న విదేశీ విద్యార్థులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో కెరీర్‌ను ప్రారంభించలేమని పెద్ద సంఖ్యలో విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇతర దేశాల్లో ఉన్న అవకాశాలపై వారు దృష్టి సారిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ వివరాలను ‘కెమికల్ అండ్ ఇంజనీరింగ్ న్యూస్’ అనే వెబ్సైట్ వెల్లడించింది. | nation |
7,201 | 13-05-2017 23:51:16 | గింబల్ టెక్నాలజీతో... |
ఆర్.జె సినిమాస్ పతాకంపై హరీశ, అవంతిక నటీనటులుగా రూపొందిస్తున్న చిత్రం ‘వైశాఖం’. జయ బి. దర్శకత్వం వహించారు. బి.ఏ.రాజు నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమల్లో ఉంది. త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ‘‘గింబల్ కన్నా కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కజకిస్థానలో పాటల్ని చిత్రీకరించాం. అది ఖర్చుతో కూడిన విషయం అయినప్పటికీ దర్శకనిర్మాతలు రాజీపడలేదు. పాటలకు, ట్రైలర్లకు స్పందన బావుంది’’ అని అన్నారు. జయ మాట్లాడుతూ ‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది. ఈ సినిమాతో గింబల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసున్నాం. స్టడీ కెమెరాలో షేక్ అయితే పిక్చరైజేషన ఇబ్బందిగా ఉంటుంది. గింబల్లో ఆ సమస్య ఉండదు. వసంత సంగీతం, వెంకట సుబ్బారావు ఫోటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు. | entertainment |
16,615 | 01-07-2017 15:12:18 | పాక్ జైళ్లలో 546 మంది భారతీయులు | లాహోర్ : పాకిస్తాన్ జైళ్లలో 546 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. ఈ జాబితాను పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి అందజేసింది. భారత ఖైదీల్లో 52 మంది పౌరులు కాగా, 494 మంది మత్స్యకారులు ఉన్నట్టు 'డాన్' పత్రిక తెలిపింది. తమ దేశాల్లో ఉన్న ఖైదీల వివరాలతో కూడిన జాబితాను పాకిస్తాన్, భారత్ ఏడాదికి రెండు సార్లు...ప్రతి జనవరి 1, జూలై 1న ఇచ్చిపుచ్చుకుంటాయి. 2008 మే 21న ఇరు దేశాల మధ్య కుదిరిన కాన్సలర్ యాక్సెస్ ఒప్పందం కింద ఈ జాబితాల మార్పిడి ఉంటుంది. పాక్ ప్రభుత్వం గత జనవరి 6న తమ అధీనంలో ఉన్న 219 భారత మత్స్యకారులను విడుదల చేయగా, మరో 78 మందిని ఈనెలలోనే విడుదల చేయనుంది. | nation |
14,929 | 14-03-2017 00:39:02 | ఆశలే కాదు... డిపాజిట్లూ గల్లంతు! | గోవాలో 38 సీట్లలో ఆప్ అట్టర్ ఫ్లాప్ పార్టీ భవిష్యత్తుపై ఆందోళనపనజి, మార్చి 13: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఏర్పాటే ఓ అనూహ్యం! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అది సాధించిన విజయం ఓ సంచలనం! బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కేజ్రీవాల్ పార్టీ... ఢిల్లీ నుంచి ఇక ఇతర రాష్ర్టాలకూ విస్తరించాలని యోచించింది. ఇందుకు ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికలను అవకాశంగా చేసుకుంది. ఢిల్లీ పక్కనే ఉన్న పంజాబ్‌తోపాటు దక్షిణాది రాష్ట్రమైన గోవాపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ రాష్ర్టాల్లో ప్రచారం హోరెత్తించారు. అంతర్గత సర్వేల్లోనూ అధికారం తమదేనని తేలిందని, గోవాలో రాజకీయ విప్లవానికి రంగం సిద్ధమైందని పోస్టర్లు వేసి మరీ ఆప్ ప్రచా రం చేసింది. కేజ్రీవాల్ ప్రకటనలకుతోడు మీడియా కూడా ఈ రెం డు రాష్ర్టాలను ఆప్ కైవసం చేసుకోనుందని ఊదరగొట్టింది. కానీ, గోవా ఎన్నికల్లో ఆప్ బొక్క బోర్లా పడింది! అధికారం కాదుకదా... కనీసం ఇక్కసీటునూ గెల్చుకోలేదు. పైగా, ఆప్ పోటీ చేసిన 39 స్థానాల్లో... 38చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. బెనాలిమ్ స్థానంలో మాత్రం ఆప్ అభ్యర్థి రాయల్ ఫెర్నాండెస్ రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు, పంజాబ్‌లో అకాలీ-బీజేపీ, కాంగ్రె్‌సలకు తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసినా కేవలం 20 సీట్లకే ఆప్ పరిమితమైంది. ఈ రాష్ట్రం నుంచి ఆప్ తరఫున నలుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఆప్ ప్రదర్శన పేలవంగా ఉంది. తక్కువ సీట్లు వచ్చినా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడమే కొంత ఉపశమనం. | nation |
7,834 | 21-11-2017 11:27:07 | అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రాంలో మొదటి పిక్ ఏదంటే.. | అల్లు అర్జున్ తన ఫ్యాన్స్‌కు మరింత చేరువగా ఉండేందుకు.. ఎప్పటికప్పుడు తన మూవీ పిక్స్.. వీడియోలు అప్డేట్ చేసేందుకు తాజాగా ఇన్స్టాగ్రాం అకౌంటును ఓపెన్ చేశారు. ఒక్కరోజులోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య లక్షా 22వేలకు చేరుకుంది. మంగళవారం తన కుమార్తె పుట్టిన రోజు కూడా కావడంతో బన్నీ తన ముద్దుల కూతురు అర్హ పిక్‌ను తన మొదటి పిక్‌గా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. "మా లిటిల్ ఏంజిల్ అర్హకు హ్యాపీ బర్త్‌డే. తనకు సంవత్సరం పూర్తయిందంటే నమ్మలేకున్నాం." అంటూ బన్నీ అర్హ పిక్‌ని పోస్ట్ చేశారు. | entertainment |
14,015 | 22-03-2017 04:24:00 | మావాడికి రాజకీయం నేర్పండి | మోదీ చెవిలో ములాయం చెప్పిందిదేన్యూఢిల్లీ, మార్చి 21: ‘‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్ర ధాని మోదీ చెవిలో ములాయం సింగ్ యాదవ్ గుసగుసలాడారు. వెంటనే అఖిలేశ్‌ను దగ్గరకు పిలిచి మోదీకి ఏదో చెప్పారు. మోదీకి ములా యం ఏం చెప్పారనే దానిపై టెలిగ్రాఫ్ ఓ కథనం ప్ర చురించింది. థోడా అఖిలేశ్కో ఖయాల్ రఖియే(అఖిలేశ్ మంచి చెడ్డా చూసుకోండి) అని మోదీతో ములాయం చెప్పినట్లు పేర్కొంది. అంతేకాక రాజకీయంగా ఎదురయ్యే ఒడిదొడుకుల గురించీ అఖిలేశ్‌కు నేర్పాలని కోరినట్లు తెలిపింది. ములాయం ను అసంతృప్తి పరచకుండా మోదీ కూడా అఖిలేశ్ భుజం తట్టినట్లు వివరించింది. ఆ సమయంలో వేదికపైనున్న ఇతర బీజేపీ నేతలు ఈమేరకు తమ తెలిపారని ‘టెలిగ్రాఫ్’ పేర్కొంది. | nation |
11,807 | 07-10-2017 03:59:40 | హిమాలయాలకు రజనీకాంత్? | ‘కాలా’ షూటింగ్ అవగానే పయనంచెన్నై, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలో హిమాలయాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘కాలా’ సినిమా షూటింగ్ ముగియగానే హిమాలయాలకు పయనం కానున్నట్లు సమాచారం. తన జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునేముందు కొంతకాలం హిమాలయాల్లో ధ్యానం చేయడం ఆయనకు అలవాటని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని, అందుకే హిమాలయాలకు వెళ్తున్నారని అభిమానుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. | nation |
835 | 01-02-2017 03:53:15 | ఈ ఏడాది వృద్ధి 6.5 శాతమే | సర్వే కామెంట్స్...ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటుపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి 6.75-7.5 శాతం మధ్య ఉండొచ్చు. స్వల్పకాలంలో ఆర్థిక రంగంపై ఒత్తిడి ఉన్నప్పటికీ నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలంలో లాభాలు ఉంటాయి. ఏప్రిల్ కల్లా నగదు చలామణి సాధారణ స్థితికి చేరుతుంది. రీమానిటైజేషన్ తర్వాత మళ్లీ ఆర్థిక రంగం పుంజుకుంటుంది. వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టడం, అవినీతి నిర్మూలన, వ్యవస్థీకృత ఆర్థిక రంగంలో కార్యకలాపాలు ఊపందుకోవడం... ఆర్థికవ్యవస్థకు మేలు చేస్తాయి. రియల్టీ ధరలు తగ్గడం, డిజిటలైజేన్ పెరగడం, పన్నుల ఎగవేతలు తగ్గుముఖం పట్టడం... ఇవన్నీ మంచి పరిణామాలు. మధ్యకాలంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 10 శాతం దిశగా దూసుకుపోతుంది. ప్రపంచంలో శరవేగంగా దూసుకుపోతున్న దేశాల జాబితాలో భారత్ టాప్‌లో ఉంటుంది. డిజిటలైజేషన్ మంత్రదండం కాదు.. రియల్టీ ఢమాల్ | business |
16,911 | 26-03-2017 21:34:06 | అనాథ పిల్లల వద్ద రూ.96 వేల పాత నోట్లు... మార్పిడికి సహకరిస్తానంటున్న ఎంపీ | కోటా: అనాథ పిల్లల వద్ద ఉన్న రూ.96,000 విలువైన రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి సహకరిస్తానని ఓ ఎంపీ హామీ ఇచ్చారు. రాజస్థాన్‌లోని కోటా సమీప గ్రామంలో నాలుగేళ్ళ కిందట ఓ మహిళ హత్యకు గురైంది. ఆమె భర్త అంతకు ముందే చనిపోవడంతో అనాథలైన చిన్నారులను ప్రభుత్వ సంక్షేమ కేంద్రానికి తరలించారు. అయితే నాలుగేళ్ళుగా మూతపడిన వారి ఇంటికి గత నెల తిరిగి వచ్చారు. ఆ ఇంట్లో కొంత బంగారంతో పాటు రూ.96,000 విలువైన రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. వీటిని ఆర్బీఐ శాఖలో మార్చేందుకు ఆ పిల్లలు ప్రయత్నించగా అధికారులు నిరాకరించారు. దీంతో ఈ విషయంపై ప్రధాని మోదీకి శనివారం వారు లేఖ రాశారు. కోటా ఎంపీ ఓం బిర్లా కూడా దీనిపై స్పందించారు. వారి వద్ద ఉన్న రద్దైన పాత నోట్ల మార్పిడికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దీని కోసం ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. | nation |
13,567 | 21-08-2017 04:34:06 | ముసలమ్మను కాపాడిన ఫేస్బుక్! | న్యూయార్క్, ఆగస్టు 20: ఆ ముసలమ్మ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టినంత సేపు కొట్టింది! అక్కడున్న వారంతా వెళ్లిపోయాక ఇక చాల్లే అనుకుని పైకొస్తుంటే ఇనుప మెట్లు విరిగిపోయాయి. ఇంకేముందీ అందులో చిక్కుకుపోయింది. సాయం కోసం అరిచినా.. ఆమె అరుపులు వినపడేంత దూరంలో ఎవరూ లేరు. ఫోన్ చేద్దామంటే అదీ లేదు! పైకొచ్చే దారులన్నీ మూసుకుపోయి దాదాపు మూడు గంటల పాటు ఆ స్విమ్మింగ్‌పూల్‌లోనే ఉండిపోయిందామె! చివరకు ఫేస్బుక్ ఆమెను ఒడ్డుకు చేర్చింది. పూల్‌కు ఉన్న ఓ పోల్‌ను ఆసరాగా చేసుకుని విశ్రాంతి కుర్చీని దగ్గరగా లాగి అందులోని తన ఐప్యాడ్‌ను తీసుకుని వెంటనే ఫేస్బుక్లో సాయం కోసం మెసేజ్ పెట్టింది. వెంటనే స్పందించిన సభ్యులు నిముషాల్లో అక్కడకు చేరుకుని ఆమెను పైకి తీసుకొచ్చారు. ఈ ఘటన అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో శుక్రవారం జరిగింది. ఆమె పేరు లెస్లీ కాన్. | nation |
2,221 | 23-02-2017 23:32:24 | ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులో బీమా, ఎంఎఫ్ ఉత్పత్తులు |
కోల్‌కతా : రాబడిని పెంచుకునేందుకుగాను థర్డ్‌పార్టీ ఫైనాన్షియల్ ఉత్పత్తులను విక్రయించనున్నట్టు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ శశి అరోరా తెలిపారు. ‘‘రుణాలను జారీ చేసేందుకు ఆర్బిఐ మాకు అనుమతివ్వలేదు. కానీ బ్యాంకుల మాదిరిగా థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ ఉత్పత్తులను విక్రయించేందుకు అవకాశం కల్పించారు. కాబట్టి సమీప భవిష్యతలో మా నెట్వర్క్ ద్వారా బీమా, మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను విక్రయించాలనుకుంటున్నాం. ఆ తర్వాత ఎన్బిఎ్ఫసి లాంటి సంస్థల రుణ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితమే ఎయిర్టెల్ తన పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లను ఈ సంస్థ ప్రారంభించింది. కస్టమర్ల సంఖ్య 20 లక్షలు దాటింది. | business |
21,391 | 24-05-2017 00:45:27 | భారత్ జయభేరి |
4-1తో ఇండోనేసియాపై విజయంనాకౌట్ అవకాశాలు పదిలంమెరిసిన శ్రీకాంత్, సింధు, అశ్వినిసుదీర్మన్ కప్ టీమ్ చాంపియన్షిప్గోల్డ్ కోస్ట్ (ఆస్ర్టేలియా): సుదీర్మన్ కప్ తొలి మ్యాచ్‌లో డెన్మార్క్ చేతిలో ఓడినప్పటికీ భారత్ కోలుకుంది. మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షి్‌పలో భాగంగా మంగళవారమిక్కడ జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో భారత్ 4-1తో మాజీ చాంపియన్, ఐదోసీడ్ ఇండోనేసియాపై అద్భుత విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు సింగిల్స్‌లో విజయాలు అందించగా.. అశ్విని పొన్నప్ప మిక్స్‌డ్‌లో సాత్విక్ సాయిరాజ్‌తో, మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డితో కలిసి విజయాలు సాధించింది. కాగా.. గ్రూప్-డిలో ప్రస్తుతం భారత్, డెన్మార్క్ ఒక్కో విజయంతో సమంగా ఉన్నాయి. దీంతో నాకౌట్ బెర్త్ ఎవరిదో ఖరారు కావాలంటే డెన్మార్క్, ఇండోనేసియా జట్ల మధ్య బుధవారం జరిగే మ్యాచ్ వరకూ వేచిచూడాల్సిందే. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. బుధవారం మ్యాచ్‌లో డెన్మార్ నెగ్గితే దానితోపాటు భారత్ కూడా నాకౌట్ చేరుతుంది. ఒకవేళ ఇండోనేసియా విజయం సాధిస్తే అప్పుడు ప్రతీ జట్టు ఒక్కో గెలుపు సాధించినట్టు అవుతుంది కాబట్టి.. ఆడిన మ్యాచ్‌లు, గెలిచిన గేమ్‌లు కీలకమవుతాయి. ఈ మెగా టోర్నీలో భారత్ చివరిసారిగా 2011లో నాకౌట్‌కు చేరింది. చివరి రెండు దఫాల్లో గ్రూప్ దశను దాటలేకపోయింది. అదరగొట్టిన శ్రీకాంత్, సింధుఆరంభ మ్యాచ్‌లో మిక్స్డ్ జోడీ సాత్విక్-అశ్విని 22-0, 17-21, 21-19తో తొంతోవి- గ్లోరియాపై ఉత్కంఠ విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 21-15, 21-16తో క్రిస్టీపై నెగ్గి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. కానీ.. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ షెట్టి ద్వయం 9-21, 17-21తో పెర్నాల్డి గిద్యోన్, కెవిన్ సుకముల్యో చేతిలో ఓటమిపాలైంది. అయితే కీలకమైన నాలుగో మ్యాచ్‌లో సింధు 21-9, 21-19తో ఫిత్రియాని ఫిత్రియానిపై వరుస గేముల్లో నెగ్గి భారత్‌కు 3-1తో విజయాన్ని ఖాయం చేసింది. ఇక ఆఖరి మహిళల డబుల్స్‌లో అశ్విని, సిక్కిరెడ్డి ద్వయం 21-12, 21-19తో డెలా డెస్టియారా, రోసిత ఎకా పుత్రి జోడీని ఓడించి భారత్ ఆధిక్యాన్ని 4-1కి పెంచింది. | sports |
1,847 | 12-02-2017 23:02:18 | పెట్టుబడుల వ్యూహాలు మారాల్సిందే.. | ఫిక్స్డ్ డిపాజిట్లు.. ప్రస్తుతం బ్యాంకులు ఆర్బిఐ నుంచి రెపో రేటు కింద 6.25 శాతం వడ్డీకి స్వల్ప కాలిక రుణాలు తీసుకుంటున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి)పై బ్యాంకులు ఖాతాదారులకూ ఇంతకంటే ఎక్కువ చెల్లించడం లేదు. పొదుపు (ఎస్బి) ఖాతాదారులకైతే నాలుగు శాతం వడ్డీతో సరిపెడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో కుప్పతెప్పలుగా డిపాజిట్లు పోగయ్యాయి. ఈ మొత్తం ఎంత లేదన్నా రూ.15 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో 30-40 శాతం డిపాజిట్లు బ్యాంకుల్లోనే ఉంటాయని భావిస్తున్నారు. దీంతో మున్ముందు ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయని భావించవచ్చు. అదే జరిగితే ఎఫ్డిలనే నమ్ముకున్న సీనియర్ సిటిజన్లు, రిటైర్మెంట్ ఉద్యోగుల రాబడికి చిల్లు పడే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే వీరు తమ స్వల్ప కాలిక ఎఫ్‌డిలను వెనక్కి తీసుకుని ఎక్కువ కాలపరిమితి ఉండే బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకోవడం మంచిది. అయితే కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లకు వెళ్లే ముందు వాటి పరపతి రేటింగ్‌ను తప్పనిసరిగా చూడాలి. ఇవేవీ చూడకుండా అధిక వడ్డీకి ఆశపడితే ఆసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. వడ్డీ రేట్లు తగ్గిపోతున్న నేపథ్యంలో స్థిర ఆదాయం కోసం చూసే ఇన్వెస్టర్లు రుణ పత్రాలపైనా దృష్టి పెట్టడం మంచిది. ఏ మాత్రం రిస్కు వద్దనుకుంటే ప్రభుత్వ రుణ పత్రాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కొద్దిగా రిస్కు తీసుకోగలిగితే మంచి పరపతి రేటింగ్ ఉన్న కంపెనీల రుణ పత్రాలనూ పరిశీలించవచ్చు. ఇటీవల చాలా కంపెనీలు తమ రుణ పత్రాలను స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లోనూ నమోదు చేస్తున్నాయి. దీనివల్ల గడువుకు ముందే ఎపుడైనా వీటిని అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశమూ ఏర్పడింది. ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉన్నందున ఆర్బిఐ సమీప భవిష్యతలో రెపో రేటు తగ్గించదని దాదాపుగా తేలిపోయింది. దీంతో స్థిర రాబడుల కోసం డెట్ ఫండ్స్‌పైనా దృష్టి పెట్టవచ్చు. ఇప్పటికే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మదుపరులు తమ పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని మూడు నుంచి నాలుగేళ్ల గడువు ఉండే స్వల్ప, మధ్యకాలిక డెట్ ఫండ్స్‌కు మార్చడం మంచిది. ఇంకా వీలైతే మంచి ట్రాక్ రికార్డు ఉన్న డైనమిక్ బాండ్ ఫండ్స్‌లోనూ కొంత ఇన్వెస్ట్ చేయాలి. పిండి కొద్ది రొట్టె. పెట్టుబడులకు కూడా వర్తిస్తుంది. ఎంత నష్ట భయం తీసుకోగలిగితే పెట్టుబడుల మార్కెట్లో రాబడులు అంత బాగుంటాయి. డెట్ ఫండ్స్‌కూ ఇది వర్తిస్తుంది. ఏ మాత్రం రిస్కు తీసుకోలేని ఇన్వెస్టర్లు నూరు శాతం పెట్టుబడులను ట్రిపుల్ రేటింగ్ ఉన్న రుణ పత్రాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. కొద్ది స్థాయిలో రిస్కు తీసుకోగలిగితే 10-20 శాతం నిధులను క్రెడిట్ ఆపర్చునిటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగని పెద్దగా రేటింగ్ లేని రుణ పత్రాల్లో దూకుడుగా ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ ఫండ్స్ జోలికి పోవద్దు. రిస్కు ఉన్నా ఫరవాలేదు.. మంచి రాబడులు కావాలనుకుంటే మాత్రం డెట్ ఫండ్స్‌లో పెట్టే పెట్టుబడుల్లో 30 శాతం వరకు డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మిగతా మొత్తాన్ని మాత్రం ట్రిపుల్ రేటింగ్ ఉన్న డెట్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. వడ్డీ రేట్లు మరింత తగ్గినా ఈ ఫండ్స్‌పై రాబడులు బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. వడ్డీ రేట్లలో వచ్చే ఆటుపోట్లతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి నిలకడతో కూడిన స్థిరమై ఆదాయం కోరుకునే మదుపరులు కార్పొరేట్ బాండ్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే అక్రూయల్ ఫండ్ లేదా ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఫండ్స్ ఎంచుకోవాలి. | business |
13,294 | 15-07-2017 02:20:28 | నా కూతురి పేరైనా చెప్పేవాడిని |
క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం: కమల్చెన్నై, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నటుడు దిలీప్ అరెస్టు వ్యవహారంలో బాధిత నటి పేరును బహిరంగంగా ప్రస్తావించి, విమర్శలపాలైన కమల్‌హాసన్ వెనక్కు తగ్గారు. జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపడంతో... భావన పేరు ప్రస్తావించినందుకు ట్విట్టర్ ద్వారా ఆయన క్షమాపణలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి మూడు ట్వీట్లు చేశారు. ‘‘నేను మహిళలను గౌరవించి, వారికోసం పోరాడుతుంటే... వారే నన్ను క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారు. కారణం లేకుండా నేను ఎవరికీ లొంగేవ్యక్తిని కాదు. ఇది నేరస్థుడిని వదిలిపెట్టి లాయర్‌ను శిక్షించినట్టుగా ఉంది. ఆమె పేరు చెప్పకూడదా? నా తల్లి, కూతురి పేరయినా చెబుతాను. ఇది మహాభారతం కథ. ఓ భారత స్ర్తీ మేలుకో. ఇప్పటికీ మీరు కావాలనుకుంటే నేను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం. ఎవరూ చట్టానికి అతీతులు కాదు’’ అని ఆ సందేశాల్లో పేర్కొన్నారు. | nation |
10,136 | 23-02-2017 13:12:13 | షాకింగ్: ఆ దర్శకుడికి బాలయ్య అవకాశమిచ్చాడా? | నందమూరి బాలకృష్ణ 101వ సినిమాకు దర్శకుడిగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కేఎస్ రవికుమార్, కృష్ణవంశీ, ఎస్వీ కృష్ణారెడ్డి.. ఇలా ఎంతో మంది బాలయ్య కోసం క్యూలో ఉన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం ఎవరూ ఊహించని ఓ దర్శకుడి చేతిలో తన 101వ సినిమాను పెట్టాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్. | entertainment |
10,045 | 11-05-2017 09:15:47 | వర్మ.. హీరోయిన్ రాశిని ఎత్తుకుని ఆడించేవాడట! | సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు సెంటిమెంట్లు ఉండవని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ విషయం రామ్‌గోపాల్ వర్మ కూడా ఇదివరకు చాలాసార్లు చెప్పాడు. అయితే వర్మకు కూడా సెంటిమెంట్లు ఉంటాయని, కాకపోతే ఆయన బయటకు వ్యక్తం చేయడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు వర్మ స్నేహితుడు, డైరెక్టర్ శివనాగేశ్వరరావు. ‘’శివ’ సినిమా కంటే ముందు వర్మ, నేను కలిసి ‘రావుగారిల్లు’ సినిమాకు అసిస్టెంట్లుగా పనిచేశాం. ఆ సినిమాలో చాలామంది పిల్లలు నటించారు. అందులో ఇప్పటి హీరోయిన్ రాశి (బేబీ విజయ) కూడా నటించింది. అప్పుడు వర్మ ఆ అమ్మాయిని ఎత్తుకుని ఆడించేవాడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొని పెట్టేవాడు. రాశినే కాదు అక్కడి పిల్లలందరినీ ఎంతో ముద్దు చేసేవాడు. అంతేకాదు నాగార్జున అంటే కూడా వర్మకు చాలా చాలా ఇష్టం. కానీ, బయటకు వ్యక్తం చేయడ’ని చెప్పాడు శివనాగేశ్వరరావు. | entertainment |
172 | 18-05-2017 00:50:12 | ఎలక్ట్రానిక్ క్లస్టర్లకు రూ.390 కోట్ల కేంద్ర సాయం | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఫ్యాబ్‌సిటీ రావిరాల, మహేశ్వరం ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం రూ.390 కోట్లు విడుదల చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం టిఎ్‌సఐఐసి ఆధ్వర్యంలో ఈ-సిటీ పేరుతో రావిరాల ప్రాంతంలో సుమారు 602.37 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్‌ఫీల్డ్ ఎలకా్ట్రనిక్ మానుఫాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధి కోసం సుమారు రూ.667 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇప్పటికే దాదాపు 150 కోట్లతో అంతర్గత రోడ్లు, ఇతర నిర్మాణ పనులు పూర్తిచేశారు. దీనికి కేంద్రం రూ.260కోట్ల వరకు విడుదల చేయనున్నది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసిన పక్షంలో సుమారు రూ.1,800 కోట్లకు పైగా ఎలకా్ట్రనిక్ సంస్థల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. దీంతో దాదాపు 35వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. మహేశ్వరం ప్రాంతంలో దాదాపు 310 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండో ఎలకా్ట్రనిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని తలపెట్టింది. దీనికోసం దాదాపు రూ.437 కోట్లకు పైగా వ్యయమవుతుందని అధికారులు అంచనాలు రూపొందించి కేంద్రానికి నివేదించగా రూ.138కోట్ల నిధులను సమకూర్చడానికి అంగీకరించింది. మహేశ్వరంలో ఎలకా్ట్రనిక్ మానుఫాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధి పూర్తి చేసిన పక్షంలో ఎల్ఇడి వంటి ఎలకా్ట్రనిక్ ఉత్పత్తుల కోసం దాదాపు రూ.900 కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని టిఎ్‌సఐఐసి అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దాదాపు 15-20వేల మందికి ఉపాధి లభిస్తుందని మరో 50వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. రెండు ఎలకా్ట్రనిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను 2019 చివరి నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. | business |
17,364 | 10-05-2017 17:53:26 | గుజరాత్ నుంచి అమర జవాన్లు లేరెందుకు.. మోదీపై మండిపడిన అఖిలేష్ | లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సవాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మరోసారి ప్రధాని మోదీపై పరోక్షంగా మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన జవాన్లు సరిహద్దులో అమరులవుతున్నారని, గుజరాత్ నుంచి ఒక్కరైనా తమ ప్రాణాలు త్యాగం చేశారా అని ఆయన ప్రశ్నించారు. భారత్ సైనికుల శరీరాలను పాక్ ఆర్మీ ఛిద్రం చేసిన దారుణంపై చర్చ జరగకపోవడాన్ని అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. అమర సైనికులు, జాతీయవాదం, వందేమాతరం వంటి అంశాలపై మోదీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు. అయితే అఖిలేష్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపట్టారు. అమర జవాన్లను రాష్ట్రాల వారీగా ఆపాదించడం తగదన్నారు. | nation |
17,906 | 20-11-2017 04:18:15 | చెన్నై విమానాశ్రయంలో భద్రతా లోపం | కట్టుదిట్టమైన 5వ ద్వారంలోకి వ్యక్తి చొరబాటుభద్రతా లోపంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదుచెన్నై, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత భద్రతా ఏర్పాట్లు కలిగిన ఐదవ ప్రవేశ ద్వారంలోకి ఓ వ్యక్తి చొరబడటం కలకలం రేపుతోంది. దీంతో భద్రతా లోపం గురించి అధికారులు కేంద్ర హోంశాఖకు సమాచారం అందించారు. చెన్నై విమానాశ్రయానికి ప్రతిరోజు కనీసం 10 వేల మందికిపైగా స్వదేశీ, విదేశీ ప్రయాణికులు వచ్చి వెళుతుంటారు. అందువల్ల అక్కడ అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు షిఫ్ట్ పద్ధతిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎ్‌సఎ్‌ఫ)కు చెందిన 800 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు విమానాశ్రయంలోని ప్రవేశ ద్వారాల వద్ద స్థానిక పోలీసుల పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినా ఓ వ్యక్తి చొరబడినట్లు విమానాశ్రయ అధికారులు సీసీటీవీ కెమెరా ద్వారా గుర్తించి విస్మయానికి గురయ్యారు. ప్రధాని, గవర్నర్, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ నేతల కోసం కేటాయించిన ఐదవ ప్రవేశ ద్వారాన్ని 24 గంటలు మూసి ఉంచి 20 మందికిపైగా సీఐఎ్‌సఎఫ్ పోలీసులు భద్రతా విధు ల్లో పాల్గొంటుంటారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సంచరించి, ద్వారంలోకి ప్రవేశించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని పేరు మణియన్(36) అని, అతనికి మానసిక స్థిమితం లేదని తెలిసింది. భద్రతా లోపం వల్లే అతను చొరబడినట్లు అధికారులు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చారు. | nation |
14,151 | 30-04-2017 12:57:26 | మన దేశంలో అందరూ ఈపీఐలే... వీఐపీలు లేరు : మోదీ | న్యూఢిల్లీ : మనదేశంలో వీఐపీలు లేరని, అందరూ ఈపీఐలేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 31వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈపీఐ అంటే ‘ఎవ్విరి పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్(ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే)’ అని వివరించారు. వీఐపీల కార్లపై ఎర్రబుగ్గలను నిషేధించిన విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ ప్రతి వ్యక్తీ ముఖ్యమైన వ్యక్తేనని స్పష్టం చేశారు. ఈపీఐ అనేది నవ భారతానికి మరొక దీపస్తంభం అవుతుందని చెప్పారు. వీఐపీ సంస్కృతి మన దేశానికి శాపమని మోదీ చెప్పారు. తన అనుభవం నేర్పిన విషయాన్ని వివరిస్తూ వాహనాలపై ఎర్రబుగ్గలను పెట్టినప్పటికీ, జనం మనసుల్లోకి చొరబడ్డాయని, తద్వారా వీఐపీ సంస్కృతికి మారిందని తెలిపారు. జనం మనసుల్లో ఉన్న ఎర్రబుగ్గలు కూడా పోవాలన్నారు. వీఐపీకి బదులు ఈపీఐ రావాలన్నదే నవ భారతం సిద్ధాంతమని తెలిపారు. ప్రతి వ్యక్తి ముఖ్యమైనవాడేనని, 125 కోట్ల భారతీయులందరూ ముఖ్యమైనవారేనని తెలిపారు. మనమంతా కలిస్తే అత్యంత సంక్లిష్టమైన కలలను కూడా సాకారం చేసుకోగలుగుతామన్నారు. | nation |
21,149 | 09-11-2017 01:49:25 | పరుగివ్వకుండా పదికి పది.. |
టీ-20ల్లో ఆకాశ్ చౌదరి సంచలన బౌలింగ్ న్యూఢిల్లీ: టీ-20 ఫార్మాట్లో ఓ బౌలర్ నాలుగు వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తాం.. అలాంటిది ఈ టీనేజ్ కుర్రాడు మొత్తం పదికి పది వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. అదీ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అంటే నిజంగా అద్భుతమే.. రాజస్థాన్‌కు చెందిన 15 ఏళ్ల ఆకాశ్ చౌదరి అనే పేసర్ ఈ సంచలనానికి కారకుడయ్యాడు. జైపూర్‌లో జరిగిన భవేర్ టీ20 టోర్నమెంట్లో దిశా క్రికెట్ అకాడమీ తరఫున బరిలోకి దిగిన ఈ లెఫ్టార్మ్ పేసర్ పెరల్ అకాడ మీపై చెలరేగిపోయాడు. 157 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన పెరల్ అకాడమీ ఆకాశ్ ధాటికి 36 పరుగులకే కుప్పకూలింది. తన తొలి మూడు ఓవర్లలో రెండేసి వికెట్లు తీసిన ఆకాశ్ చివరి ఓవర్లో నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇందులో చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ నమోదు కావడం విశేషం. జహీర్ ఖాన్‌ను విపరీతంగా అభిమానించే తను ఏదో ఓరోజు భారత్ తరఫున ఆడాలని కల కంటున్నాడు. కాగా అంతర్జాతీయ స్థాయిలో ఇలా పదికి పది వికెట్లు (టెస్టుల్లో) తీసిన బౌలర్లు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే మాత్రమే ఉన్నారు. | sports |
16,950 | 21-07-2017 14:50:53 | కార్తీ చిదంబరం పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా | న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి మద్రాసు హైకోర్టు నుంచి ఊరట లభించలేదు. తనపై సీఐఐ దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ కార్తీ హైకోర్టును ఆశ్రయించగా, కేసు విచారణను ఈనెల 28కి హైకోర్టు వాయిదా వేసింది. ఆసక్తికరంగా సీబీఐ విచారణకు కార్తీ ఇవాళ హాజరుకావలసి ఉంది. ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో తమపై ఆధారాలను నిరూపించడంలో విఫలమైనందువల్ల సిబీఐకు ఆశాభాంగం కలిగిందని, అందువల్లే తనను ఈ కేసులో ఇరికేంచేందుకు సీబీఐ కుట్రపన్నుతోందని కార్తీ చిదంబరం ఆరోపిస్తున్నారు. గత ఫిబ్రవరిలో ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో ఆరోపణల నుంచి అప్పటి సమాచార శాఖ మంత్రి దయానిధి మారన్, తదితరులకు సీబీఐ ప్రత్యేక కోర్టు విముక్తి కలిగించింది. ఈ నేపథ్యంలో ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో ఈనెల 21న విచారణ రావాల్సిందిగా కార్తీ చిదందబరానికి సీబీఐ ఇటీవల రెండో నోటీసు పంపింది. ఇంతకుముందు జూన్ 27-29 మధ్య విచారణకు హాజరుకావాలని కార్తీ చిదంబరానికి సీబీఐ సమన్లు పంపినప్పటికీ తనకు మరింత సమయం కావాలని కోరుతూ విచారణకు ఆయన హాజరుకాలేదు. | nation |
4,249 | 01-09-2017 03:17:01 | క్రమబద్ధీకరణ అక్రమమే! |
రాష్ట్రంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారికి ఉచితంగానూ, నామమాత్రపు ధరలకు క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. ఇది తీవ్ర గర్హనీయమే కాక ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగపరచడమే అవుతుంది. పేదల ముసుగులో వివిధపార్టీల నాయకులకు, వారి తాబేదార్లకు ప్రజల ఆస్తిని దోచిపెట్టడం తప్ప మరేమీ కాదు. నిజంగా ప్రజల కోసమే అయితే, చట్టాలపై గౌరవంతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారికి సహకరించడమేమిటి? అదే సమయంలో వేల రూపాయలు అద్దెలు చెల్లిస్తూ, అద్దె ఇళ్ళల్లో నివసిస్తున్న పేదల మాటేమిటి? అంటే ప్రభుత్వం ఒకరిని – వారి ఖర్మానికి వారిని వదిలేసి, చట్టవ్యతిరేకులకు అండగా నిలవడమేగా! ఇప్పటికే ఉచిత కానుకలు వంటి నిరర్థక, అనుత్పాదక పథకాల ద్వారా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయనాయకులు, వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, వారి అనుచరగణాలకు తప్ప సామాన్య పేద ప్రజలకు ఆశించినంతగా ప్రయోజనం దక్కడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం కేవలం రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ, పేద, సామాన్య ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నది.- వి. పేరయ్య శాస్త్రి, విజయవాడ | editorial |
8,795 | 18-09-2017 19:15:54 | సల్మాన్ ఖాన్‌కు అరుదైన గౌరవం | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ‘గ్లోబల్ డైవర్సిటీ అవార్డు - 2017’ను సల్మాన్‌కు బ్రిటిష్ పార్లమెంట్ ప్రదానం చేసింది. ఎంపీ కీత్‌వాజ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు సల్మాన్. ‘బీయింగ్ హ్యూమన్’ అనే ఎన్జీవో ద్వారా నిరుపేదలకు సాయం అందిస్తున్నందుకు సల్మాన్‌కు ఈ అవార్డు లభించింది. సినిమాల ద్వారా అవార్డులు ఎన్నో అందుకున్నప్పటికీ ఈ అవార్డు మాత్రం తనకు ఎంతో ప్రత్యేకమైందన్నారు సల్మాన్. | entertainment |
741 | 07-07-2017 23:52:45 | 3 లక్షల పెండింగ్ కేసుల పరిష్కారానికి సిబిడిటి ప్రణాళిక | అమలు జరిగితే 1.63 లక్షల కేసులు పరిష్కారం అవుతాయని అంచనాన్యూఢిల్లీ: పలు లిటిగేషన్ల వల్ల పన్ను ఆదాయాలు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్న మూడు లక్షల కేసులను సత్వరం పరిష్కరించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇలాంటి కేసుల కారణంగా 6.11 లక్షల కోట్ల రూపాయలు వసూలు కాలేదని అంచనా. ఇక నుంచి 10 లక్షల రూపాయల కన్నా తక్కువ మొత్తంలోని కేసులు లేదా 50 కోట్ల రూపాయల కన్నా పైబడిన కేసులను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకుని ఏడాదికి కనీసం ఐదు వందల కేసులను పరిష్కరించాలని ఐటి అప్పీల్స్ కమిషనర్లను ఆదేశించింది. అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి దేశంలోని వివిధ ప్రాథమిక స్థాయి అప్పిలేట్ కమిషనర్ల ముందు 2,90,227 కేసులు పెండింగులో ఉన్నాయని అంచనా. ఈ కేసులన్నింటిలోనూ 6.11 లక్షల కోట్లు ఇరుక్కుపోగా అందులో 1.18 లక్షల కోట్ల రూపాయలపై వివిధ కమిషనరేట్లు స్టే ఇచ్చాయి. ఇలాంటి లిటిగేషన్ల వల్ల విలువైన వనరులు వృథా అవుతున్నాయని సిబిడిటి ఆందోళన ప్రకటించింది. వీలైనంత వరకు ఈ లిటిగేషన్ల సంఖ్యను తగ్గించి వాటిలో ఇరుక్కున్న సొమ్ము ఖజానాకు చేరేలా చూడాలని వారిని ఆ ఉత్తర్వుల్లో కోరింది. తాము రూపొందించిన ప్రణాళిక ఆచరణలోకి వచ్చినట్లయితే 1.63 లక్షల కేసులు పరిష్కారం అవుతాయని సిబిడిటి ఆశిస్తోంది. | business |
21,393 | 29-10-2017 02:00:53 | ఏడోదీ పట్టేస్తారా..! | వరుసగా ఏడో సిరీస్‌పై భారత్ గురిచరిత్ర సృష్టించాలని న్యూజిలాండ్కాన్పూర్లో చివరి వన్డే నేడుమొదటి వన్డేలో అనూహ్యంగా ఓడినా.. అద్భుతంగా పుంజుకొని రెండో మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా ఇప్పుడు అదే ఉత్సాహంతో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే చివరి, మూడో వన్డేలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రెండేళ్లుగా విశేషంగా రాణిస్తూ.. వరుసగా ఆరు సిరీస్‌లు ఖాతాలో వేసుకున్న కోహ్లీసేన.. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి తమ జైత్రయాత్రను కొనసాగించాలని ఆశిస్తోంది. మరోవైపు ఆరంభ పోరులోనే భారత్‌ను కంగుతినిపించిన కివీస్.. గత మ్యాచ్ ఓటమి నుంచి బయటపడి భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ నెగ్గి చరిత్రకెక్కాలన్న కృతనిశ్చయంతో ఉంది. కాన్పూర్‌లో జరిగే ఈ ఆఖరాటలో విజయఢంకా మోగించేదెవరో మరి..! కాన్పూర్: సొంతగడ్డపై సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా అరుదు. అయినా.. ముంబై పరాజయం నుంచి కోహ్లీసేన వెంటనే బయటపడింది. తీవ్ర ఒత్తిడిలోనూ మెరుగైన ఆటతీరు కనబరుస్తూ పుణెలో అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ప్రదర్శన చేసి 1-1తో సిరీ స్ సమం చేసింది. ‘సవాళ్లను స్వీకరించడంలో మేమెప్పు డూ ముందుంటాం. పుంజుకుంటాం అని చెప్పాం. ఇక్కడ (పుణెలో) చేసి చూపించాం. కాన్పూర్‌లోనూ ఇలానే ఆడా లని భావిస్తున్నామ’ని రెండో వన్డే విజయానంతరం కోహ్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. దాంతో, ఆఖరి మ్యాచ్ కోసం జట్టు మానసికంగానూ బాగా సన్నద్ధమైనట్టు కనిపిస్తోంది. కాగా.. భారత్‌లో తొలిసారిగా వన్డే సిరీస్ గెలిచే సువర్ణావకాశం కివీస్ ముందుంది. ఈ మ్యాచ్‌లో గనుక పర్యాటక జట్టు విజయం సాధిస్తే.. చరిత్ర సృష్టించినట్టే. మరి సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ పోరులో విజేత ఎవరో..! జోరు మీదున్న కోహ్లీసేన: పుణెలో టీమిండియా తన ప్రణాళికలను చక్కగా అమలు చేసింది. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న పేస్ ద్వయం భువనేశ్వర్, బుమ్రా ఆరం భంతోపాటు డెత్ ఓవర్లలోనూ మెరుగైన ప్రదర్శన చేశారు. ముంబైలో తేలిపోయిన స్పిన్నర్లు కూడా గొప్పగా పుంజుకున్నారు. తొలి వన్డేలో ఖాతా తెరవని చాహల్ రెండు వికెట్లతో రాణించగా.. కుల్దీప్ స్థానంలో జట్టులోకొచ్చిన అక్షర్ పటేల్.. జోరుమీదున్న టామ్ లాథమ్ పని పట్టాడు. పార్ట్ టైమర్ కేదార్ జాదవ్ కూడా ఎనిమిది ఓవర్లలో 31 పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. సొంతగడ్డపై కుల్దీప్ యాదవ్‌కు చాన్స్ ఇవ్వాలనుకుంటే తప్ప తుది జట్టులో మార్పు లు ఉండకపోవచ్చు. ఇక.. గత పోరులో వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ అజేయ అర్ధ శతకంతో రాణించడంతో చాలా కాలంగా జట్టును వేధిస్తోన్న నాలుగో నెంబర్ సమస్య పరిష్కారమైనట్టు అనిపించింది. అలాగే ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత శిఖర్ ధవన్ హాఫ్ సెంచరీతో మెరవడం భారత్‌కు శుభసూచకం. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లోనూ 20, 7 స్కోర్లతో విఫలమైన మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. కోహ్లీ కూడా మంచి ఫామ్‌లో ఉండగా.. తన వరకూ వస్తే ధోనీ కూడా బ్యాట్ ఝుళిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక, ఆతిథ్య జట్టు మాదిరిగా కివీస్‌కు కూడా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలని కోరుకుంటోంది. బ్యాటింగ్ పిచ్‌పై కోహ్లీసేనను వాళ్లు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి. ఈ మ్యాచ్‌లోనూ కివీస్ తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. జట్లు (అంచనా)భారత్: రోహిత్, ధవన్, కోహ్లీ (కెప్టెన్), దినేశ్, కేదార్, ధోనీ (కీపర్), హార్దిక్, భువనేశ్వర్, అక్షర్/కుల్దీప్, చాహల్, బుమ్రా. న్యూజిలాండ్: గప్టిల్, మన్రో, విలియమ్సన్ (కెప్టెన్), టేలర్, లాథమ్ (కీపర్), నికోల్స్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, ఆడమ్ మిల్నె/సోధి, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ.ప్రపంచ క్రికెట్ చరిత్రలో మిథాలీ రాజ్ సంచలనం మరోసారి భారత్‌ను మురిపించనున్న ప్రపంచ క్రికెట్ కప్ | sports |
13,081 | 16-07-2017 03:12:57 | కేజ్రీవాల్ ఎక్కడ!? | మూగవోయిన ట్విటర్.. ఢిల్లీ పాలనకే పరిమితంన్యూఢిల్లీ, జూలై 15: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ హ్యాండిల్ చూస్తే ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలతో నిండిపోయేది. ఇతర ప్రత్యర్థులపైనా ఆయన విరుచుకుపడేవారు. కానీ, రెండు నెలలుగా ఆయన ట్విటర్ హ్యాండిల్ మూగవోయింది. అందులో ఢిల్లీ అప్డేట్స్ తప్ప మరేమీ ఉండడం లేదు. ఇంతకీ కేజ్రీవాల్ ఏం చేస్తున్నారు!? దేశవ్యాప్తంగా ‘మార్పు’ తీసుకొస్తానన్న ఆయన ఆ దిశగానే పయనిస్తున్నారా!? లేక తానే మారుతున్నారా!? రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఎటు!? అధికార, ప్రతిపక్షాలు ఏవైనా ఆయనను సంప్రదించాయా!? ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి. పంజాబ్ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ రాజకీయ విమర్శలు, కార్యకలాపాలు ఏమీ లేవు. కనీసం విలేకరులతోనూ మాట్లాడలేదు. ఇప్పుడు ఢిల్లీ కాలనీల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆయన పూర్తిగా ఢిల్లీ పాలనకే పరిమితమయ్యారని, ప్రజలతో వచ్చిన గ్యాప్‌ను పూరిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయంకోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు చిన్న చిన్న పార్టీలను కూడా సంప్రదిస్తున్నారు. కానీ, ఆయా నేతలు కేజ్రీవాల్‌ను మాత్రం సంప్రదించలేదని అంటున్నారు. | nation |
7,456 | 17-04-2017 22:50:49 | మెగాఫోన్ చేతబట్టి... |
సినిమా ఇండస్ట్రీ గురించి, దర్శకత్వం గురించి కలలు కనే ఎవరైనా రెండు చేతులను చాపి కుడి చేతి చూపుడు మధ్య వేళ్లను, ఎడమ చేతి చూపుడు, మధ్యవేళ్లపై ఉంచి, ఆ రంధ్రం నుంచి సీన్‌ను చూస్తున్నట్టు ఫోజ్ పెడుతుంటారు. సరిగ్గా అదే ఫోజుతో ‘దర్శకుడు’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. సుకుమా రైటింగ్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘దర్శకుడు’. ఇంతకుమునుపు ‘కుమారి 21ఎఫ్’ను తెరకెక్కించిన సుకుమార్ ఇప్పుడు తాజా చిత్రాన్ని బిఎన్సిఎస్పి విజయ్‌కుమార్, థామస్ రెడ్డి, రవిచంద్ర సత్తితో కలిసి నిర్మిస్తున్నారు. అశోక్, ఈషా జంటగా నటించిన ఈ సినిమాకు హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. వేసవికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: నవీన్ నూలి, కెమెరా: ప్రవీణ్ అనుమోలు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేశ్ కోలా. | entertainment |
14,316 | 20-09-2017 02:43:35 | ద్వితీయ శ్రేణి నగరాల్లో నైపుణ్యాల లేమి | అస్పైరింగ్ మైండ్స్ నివేదిక మనదేశంలో ఏటా ఉత్తీర్ణులవుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో సుమారు 80 శాతం మందికి పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు లేవని ఇండస్ట్రీ ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ విషయాన్ని ‘అస్పైరింగ్ మైండ్స్’ విడుదల చేసిన ‘నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్ట్(ఇంజనీర్స్)-2016’ నివేదిక స్పష్టం చేసింది. మంచి జిపిఎతో సర్టిఫికెట్లు పొంది ఎన్నో ఆశలతో జాబ్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు నైపుణ్యాల కొరత పెద్ద ఆటంకంగా మారుతోంది. సరిపోను స్కిల్స్ లేవన్న కారణంతో కంపెనీలు వీరిని తిరస్కరిస్తున్నాయి. టైర్-2,. టైర్-3 పట్టణాల్లో అయితే ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ నగరాల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన ఎక్కువ మందికి కనీసం ఆంగ్లంలో మాట్లాడటం కూడా రాదని నివేదిక తేల్చింది. దీనికి ప్రధాన లోపం బోధనలోనే ఉందని ఇండస్ర్టీ నిపుణులు చెబుతున్నారు. సబ్జెక్టుపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో అక్కడి అధ్యాపకులు విఫలమవుతున్నారు.దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థుల పరిస్థితిని ‘అస్పైరింగ్ మైండ్స్’ విశ్లేషించింది. 2014లో కేవలం 18.43 శాతం మంది మాత్రమే సాఫ్ట్వేర్ సర్వీసెస్ సెక్టార్లో ఉద్యోగాలకు అర్హత సాధించారు. 3.21 శాతం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్, 39.84 శాతం నాన్ ఫంక్షనల్ రోల్ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ రంగాల్లో ఉద్యోగాలు పొందారు. 2016లోనూ పరిస్థితిలో మార్పు కనిపించలేదు. 17.91 శాతం మంది సాఫ్ట్వేర్ సర్వీసె్‌సకు, 3.67 శాతం మంది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్‌కు, 40.57 శాతం బిపివో సెక్టార్‌కు అర్హత సాధించారు. ఇక స్టార్ట్‌పలకు పనికొస్తున్న వారు కేవలం 3.84 శాతం మందే కావడం గమనార్హం. నాస్కామ్ అంచనా ప్రకారం వచ్చే మూడేళ్లలో ఐటీ, ఈపీఎస్, ఐటీహెచ్ఎ్స రంగంలో అయిదు నుంచి ఏడు లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని అంచనా. జాబ్ రెడీ స్కిల్స్ ఉన్న విద్యార్థులు కేవలం 20 శాతం లోపే ఉన్నారు. సీఐఐ-మెకిన్సే అంచనా ప్రకారం మరో రెండేళ్లలో టెలికం, మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్, ఎలక్ర్టానిక్స్ రంగాల్లో దాదాపు పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వాటిని అందుకొనే నైపుణ్యాలున్న విద్యార్థులు కేవలం 30-40 శాతం మధ్యలోనే ఉన్నారు. నైపుణ్యాలు కొరవడటానికి కారణాలు ఇవీఇంటర్మీడియెట్లో పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు.అకడమిక్ పుస్తకాలను బట్టీ పెడితే మార్కులు బాగా వస్తాయని, మంచి జిపిఎతో కోరుకున్న ఉద్యోగం లభిస్తుందనే భావనలో ఉంటున్నారు.ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. ఇది వారిలో లోపించింది.అప్లికేషన్ ఓరియెంటేషన్‌ను పెంచుకోవటం లేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు భిన్నంగా తోస్తున్నాయి.అధిక శాతం మంది విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌ను జిపిఎను పెంచే సాధనంగా మాత్రమే చూస్తున్నారు. ప్రాజెక్టును, సొంతంగా అంకిత భావంతో చేయడం లేదు.నిపుణుల మాటఉద్యోగ నైపుణ్యాలు పెరగాలంటే కేవలం తమ బ్రాంచ్‌కు సంబంధించిన పుస్తకాలు, ప్రాక్టికల్స్‌కు పరిమితం కాకూడదు. ఇతర అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.కంపెనీలు సబ్జెక్టుల పరంగా విద్యార్థుల నుంచి ఆశిస్తున్న ప్రధాన అంశం మల్టీ డిసిప్లీనరీ నైపుణ్యాలు. విధి నిర్వహణలో ఒక విభాగానికి మరో విభాగానికి మధ్య అనుసంధానం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సమర్థంగా విధులు నిర్వహించాలంటే మల్టీ డిసిప్లినరీ స్కిల్స్ ఎంతో ముఖ్యం.బోధన పద్ధతుల్లో కూడా మార్పు రావాలి. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాలి. పాత సబ్జెక్టే అయినా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి. అసైన్మెంట్లు, గ్రూప్ డిస్కషన్స్‌తో అవసరమైన పరిజ్ఞానం పెంపొందించుకునేలా చూడాలి.- ఎడ్యుకేషన్ డెస్క్ | nation |
2,018 | 19-02-2017 23:13:03 | త్వరలో ఎన్టిపిసి సిమెంట్ | భాగస్వాముల ఎంపికకు సన్నాహాలు న్యూఢిల్లీ: బొగ్గు ఆధారిత విద్యుత్ర్కేందాల సమీపంలో సిమెంట్ ప్లాంట్లను ఏర్పాటు కోసం వ్యూహాత్మక భాగస్వామిని చేర్చుకునేందుకు దేశీయ విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్టిపిసి రెడీ అవుతోంది. విద్యుదుత్పత్తి ప్లాంట్ల నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు గాను ఎన్టిపిసి ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. సిమెంట్ ప్లాంట్, సిమెంట్ క్లింకర్ గ్రైండింగ్ యూనిట్, సిమెంట్ బ్లెండింగ్ యూనిట్ సహా ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీకి సంస్థలు తమ ఇఒఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రె్‌స్ట)లను దాఖలు చేయాలని కోరింది. జాయింట్ వెంచర్ లేదా బిల్డ్, ఓన్, అండ్ ఆపరేట్ (బిఒటి) పద్దతిలో ఎన్టిపిసి విద్యుత ప్లాంట్లు లేదా పక్కన ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది. వచ్చే 10వ తేదీనాటికల్లా ఆసక్తి ఉన్న సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించాలని ఎన్టిపిసి కోరింది. ఏటా 10 లక్షల టన్నులు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్లాంట్లను కంపెనీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఎన్టిపిసి ఏటా 6.5 కోట్ల టన్నుల ఫ్లై యాష్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీన్ని ప్రధానంగా లాండ్ డెవల్‌పమెంట్, యాష్ డైక్ రైజింగ్, రోడ్/రైల్ ఎంబ్యాంక్మెంట్స్, బ్రిక్/బ్లాక్/టైల్ ఇండసీ్ట్రస్, సిమెంట్ పరిశ్రమలు విరివిగా వినియోగిస్తున్నాయి. ఎన్టిపిసి దేశవ్యాప్తంగా 48 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన 45 విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్వహిస్తోంది. మరో 9 ప్లాంట్లను సంయుక్త భాగస్వామ్యంలో నడుపుతోంది. ప్రస్తుతం సంస్థ థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 35885 మెగావాట్లుగా ఉంది. | business |
5,884 | 31-10-2017 12:17:50 | మెగా హీరోస్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటే.. | మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, స్నేహ, అల్లు శిరీష్ ప్రస్తుతానికి వెకేషన్లోఉన్నారు. నలుగురూ మనాలి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న రంగస్థలం మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత నటిస్తోంది. బన్నీ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్లో 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' అనే మూవీ చేస్తున్నారు. బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ముగ్గురూ షూటింగ్స్‌కి కాస్త విరామం ఇచ్చి మనాలిలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ తీసిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. | entertainment |
3,351 | 03-11-2017 00:36:19 | న్యాయస్థానాల్లో ఎంబీసీలు | కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఎన్నెన్నో పథకాలు అమలుచేస్తున్నారు. సామాజిక న్యాయానికి అగ్ర తాంబూలం ఇచ్చారు. అలాగే భవిష్యత్‌లో జరిగే న్యాయశాఖ నియామకాల్లో ఎంబీసీలకు సమన్యాయం చేయగలిగితే, ఆ విషయంలోనూ గొప్ప వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోతారు. భారత పౌరులు సర్వస్వతంత్రంగాను, లౌకిక జ్ఞానంతోను, ప్రజాస్వామ్యయుతంగాను, సమానత్వంతోనూ జీవించేందుకు బి.ఆర్. అంబేడ్కర్ అందించిన ప్రామాణిక గ్రంథం మన భారత రాజ్యాంగం. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతోపాటు న్యాయ (వ్యవస్థ) రంగంలో కూడా పౌరులందరికీ సమాన అవకాశాలు దక్కాలని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ రాజ్యాంగంలో పలు ఆర్టికల్స్ క్లాజులు, సబ్ క్లాజులు పొందుపరిచారు. ఎంతో పకడ్బందీగా బహుజనుల గురించి అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పించారు. హక్కులులేని వారికి కొన్ని ఆర్టికల్స్ ద్వారా వెసులుబాటు కల్పించారు. అయితే రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం సమన్యాయం, సమ వాటా దేశంలోని పౌరులకు అందడం లేదని న్యాయ నిపుణులు, రాజ్యాంగ విశ్లేషకులు పలు సందర్భాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు సామా జిక ఉద్యమకారులు, సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని రాష్ట్ర హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తుల నియామకాలు సామాజికంగా జరగలేదని గణాంకాలతో సహా పలు వేదికల్లో వినిపించారు. ప్రధానమంత్రులకు, రాష్ట్రపతులకు వినతి పత్రాలు సమర్పించారు. మన ఉమ్మడిరాష్ట్ర హైకోర్టు విషయానికివస్తే ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకాలలో బీసీ, ఎంబీసీలకు న్యాయం జరగలేదని వివరాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన తరువాత మొత్తం 36 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. వీరిలో కొందరు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. ప్రప్రథమ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు (1956 – 58) పనిచేశారు. తర్వాత పని చేసిన జస్టిస్ పి. చంద్రారెడ్డి 1958 నుంచి, ఇటీవలి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే (2015 – 2016) వరకు మొత్తం 36 మంది ప్రధాన న్యాయమూర్తులు, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్. కుమరయ్య (1969 – 1971) ఒక్కరే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. దీనిని బట్టి న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం నామమాత్రమే అని తెలుస్తుంది. ఇక న్యాయమూర్తుల విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్ప డిన తరువాత 2016 సంవత్సరం వరకు మొత్తం 178 మంది న్యాయమూర్తులుగా, తాత్కాలిక న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రథమ న్యాయమూర్తిగా జస్టిస్ పి. చంద్రారెడ్డి 1949 నుంచి 1966 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మొదలుకొని జస్టిస్ కె.జి. శంకర్ (2010 – 2014) వరకు పని చేసిన మొత్తం 178 న్యాయమూర్తుల్లో గణాంకాల వివరాల ప్రకారం కేవలం 23 మంది న్యాయమూర్తులు, తాత్కాలిక న్యాయమూర్తులు మాత్రమే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారుగా తెలుస్తుంది. నిజానికి జనాభా ప్రాతిపదికన 50 శాతంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి న్యాయంగా రావలసిన వాటా 89 న్యాయమూర్తి పదవులు. కనుక సామాజిక న్యాయం జరగలేదని అర్థం. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్స్ విషయంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నియమించే రాష్ట్ర అడ్వకేట్ జనరల్స్ విషయానికి వస్తే 1956 నుంచి 2017 వరకు 18 మంది అడ్వకేట్ జనరల్స్‌గా విధులు నిర్వర్తించారు. వారిలో మొదటి అడ్వకేట్ జనరల్‌గా దువ్వూరి నరసరాజు 1956 నుంచి 63 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం (2017) డి. ప్రకాష్‌రెడ్డి రాష్ట్ర 19వ అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ 19 మంది అడ్వకేట్ జనరల్స్‌లో ఒక్కరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు లేరు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల విషయంలోనూ సామాజిక న్యాయం మృగ్యం. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. ఈ పదహారు మందిలో టి. మునికన్నయ్య (1956 – 1958), ఆర్.వి. రామారావు (1958 – 1960) వీరిద్దరు మాత్రమే ఈ సామాజిక వర్గాల వారు. అంబేడ్కర్ రాజ్యాంగ అంతర్ సూత్రమైన సామాజిక న్యాయాన్ని అమలు చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని కొలిజియం పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో న్యాయ నియామకాల్లో సామాజిక న్యాయం ఎంబీసీలకు జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన బాధ్యత తీసుకుంటాయని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం ప్రగాఢంగా విశ్వసిస్తుంది. ఇటీవల జరిగిన ఆరుగురు హైకోర్టు జడ్జీల నియామకాలలో కూడా ఎంబిసీలకు స్థానం శూన్యం. ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఎంబీసీలను గుర్తించడమేగాక ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడమేగాక వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఎంబీసీ కులాల అభివృద్ధికి కేటాయించి తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఎన్నెన్నో పథకాలు అమలుచేస్తున్నారు. సామాజిక న్యాయానికి అగ్రతాంబూలం ఇచ్చారు. అలాగే భవిష్యత్‌లో జరిగే న్యాయశాఖ నియామకాల్లో ఎంబీసీలకు సమన్యాయం చేయగలిగితే, ఆ విషయంలోనూ గొప్ప వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోతారు.కెసి కాళప్పజాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అయితే రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం సమన్యాయం, సమ వాటా దేశంలోని పౌరులకు అందడం లేదని న్యాయ నిపుణులు, రాజ్యాంగ విశ్లేషకులు పలు సందర్భాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు సామా జిక ఉద్యమకారులు, సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని రాష్ట్ర హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తుల నియామకాలు సామాజికంగా జరగలేదని గణాంకాలతో సహా పలు వేదికల్లో వినిపించారు. ప్రధానమంత్రులకు, రాష్ట్రపతులకు వినతి పత్రాలు సమర్పించారు. మన ఉమ్మడిరాష్ట్ర హైకోర్టు విషయానికివస్తే ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకాలలో బీసీ, ఎంబీసీలకు న్యాయం జరగలేదని వివరాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన తరువాత మొత్తం 36 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. వీరిలో కొందరు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. ప్రప్రథమ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు (1956 – 58) పనిచేశారు. తర్వాత పని చేసిన జస్టిస్ పి. చంద్రారెడ్డి 1958 నుంచి, ఇటీవలి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే (2015 – 2016) వరకు మొత్తం 36 మంది ప్రధాన న్యాయమూర్తులు, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్. కుమరయ్య (1969 – 1971) ఒక్కరే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. దీనిని బట్టి న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం నామమాత్రమే అని తెలుస్తుంది. ఇక న్యాయమూర్తుల విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్ప డిన తరువాత 2016 సంవత్సరం వరకు మొత్తం 178 మంది న్యాయమూర్తులుగా, తాత్కాలిక న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రథమ న్యాయమూర్తిగా జస్టిస్ పి. చంద్రారెడ్డి 1949 నుంచి 1966 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మొదలుకొని జస్టిస్ కె.జి. శంకర్ (2010 – 2014) వరకు పని చేసిన మొత్తం 178 న్యాయమూర్తుల్లో గణాంకాల వివరాల ప్రకారం కేవలం 23 మంది న్యాయమూర్తులు, తాత్కాలిక న్యాయమూర్తులు మాత్రమే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారుగా తెలుస్తుంది. నిజానికి జనాభా ప్రాతిపదికన 50 శాతంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి న్యాయంగా రావలసిన వాటా 89 న్యాయమూర్తి పదవులు. కనుక సామాజిక న్యాయం జరగలేదని అర్థం. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్స్ విషయంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నియమించే రాష్ట్ర అడ్వకేట్ జనరల్స్ విషయానికి వస్తే 1956 నుంచి 2017 వరకు 18 మంది అడ్వకేట్ జనరల్స్‌గా విధులు నిర్వర్తించారు. వారిలో మొదటి అడ్వకేట్ జనరల్‌గా దువ్వూరి నరసరాజు 1956 నుంచి 63 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం (2017) డి. ప్రకాష్‌రెడ్డి రాష్ట్ర 19వ అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ 19 మంది అడ్వకేట్ జనరల్స్‌లో ఒక్కరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు లేరు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల విషయంలోనూ సామాజిక న్యాయం మృగ్యం. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. ఈ పదహారు మందిలో టి. మునికన్నయ్య (1956 – 1958), ఆర్.వి. రామారావు (1958 – 1960) వీరిద్దరు మాత్రమే ఈ సామాజిక వర్గాల వారు. అంబేడ్కర్ రాజ్యాంగ అంతర్ సూత్రమైన సామాజిక న్యాయాన్ని అమలు చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని కొలిజియం పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో న్యాయ నియామకాల్లో సామాజిక న్యాయం ఎంబీసీలకు జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన బాధ్యత తీసుకుంటాయని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం ప్రగాఢంగా విశ్వసిస్తుంది. ఇటీవల జరిగిన ఆరుగురు హైకోర్టు జడ్జీల నియామకాలలో కూడా ఎంబిసీలకు స్థానం శూన్యం. ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఎంబీసీలను గుర్తించడమేగాక ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడమేగాక వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఎంబీసీ కులాల అభివృద్ధికి కేటాయించి తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఎన్నెన్నో పథకాలు అమలుచేస్తున్నారు. సామాజిక న్యాయానికి అగ్రతాంబూలం ఇచ్చారు. అలాగే భవిష్యత్‌లో జరిగే న్యాయశాఖ నియామకాల్లో ఎంబీసీలకు సమన్యాయం చేయగలిగితే, ఆ విషయంలోనూ గొప్ప వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోతారు.కెసి కాళప్పజాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు | editorial |
18,327 | 06-12-2017 01:31:50 | జస్టిస్ కర్ణన్‌పై పిల్ తిరస్కృతి | చెన్నయ్, డిసెంబరు 5: కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌ను విడుదల చేయాలంటూ రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీచేసేలా చూడాలంటూ దాఖలైన పిల్‌ను మద్రా్సహైకోర్టు కొట్టేసింది. కోర్టు ధిక్కరణ కేసులో జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించడంతో జూన్ 20 నుంచి ఆయన జైల్లో ఉన్నారు. ఆయన్ను విడుదల చేయాలంటూ ఏపీ గౌతమ సిద్ధార్థన్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. | nation |
20,581 | 11-01-2017 00:58:40 | బ్యాటింగ్ ప్రాక్టీస్ |
ముంబై: వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ శుభారంభం చేసింది. భారత-ఎతో మంగళవారమిక్కడి బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ సేన మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. సామ్ బిల్లింగ్స్ (85 బంతుల్లో 8 ఫోర్లతో 93), జేసన్ రాయ్ (62) అర్ధ సెంచరీలతో రాణించారు. అలెక్స్ హేల్స్ (40), జోస్ బట్లర్ (46), లియామ్ డాసన్ (41) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/60) ఐదు వికెట్లు పడగొట్టినా మిగతా బౌలర్లు చేతులెత్తేశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత-ఎ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 304 పరుగులు చేసింది. అంబటి రాయుడు (97 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 100 రిటైర్డ్ అవుట్) సెంచరీ సాధించాడు. శిఖర్ ధవన్ (84 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 63), యువరాజ్ సింగ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో మెరుపులు మెరిపించిన కెప్టెన్ ధోనీ (40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 నాటౌట్) అర్ధ శతకంతో అజేయంగా నిలిచాడు. కాగా.. ఇదే వేదికపై గురువారం జరిగే మరో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రహానె నేతృత్వంలోని భారత్-ఎతో ఇంగ్లండ్ తలపడనుంది. భారత్-ఎ ఇన్నింగ్స్: మన్దీప్ సింగ్ (బి) విల్లీ 8, ధవన్ (సి) బట్లర్ (బి) బాల్ 63, రాయుడు (రిటైర్డ్ అవుట్) 100, యువరాజ్ (సి) రషీద్ (బి) బాల్ 56, ధోనీ (నాటౌట్) 68, శాంసన్ (సి) హేల్స్ (బి) విల్లీ 0, హార్దిక్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 50 ఓవర్లలో 304/5; వికెట్లపతనం: 1-25, 2-136, 3-227, 4-250, 5-257; బౌలింగ్: వోక్స్ 10-1-71-0, డేవిడ్ విల్లీ 10-1-55-2, మొయిన్ అలీ 10-0-42-0, జేక్ బాల్ 10-0-61-2, రషీద్ 8-0-49-0, డాసన్ 2-0-24-0. ఇంగ్లండ్ లెవెన్ ఇన్నింగ్స్: జాసన్ రాయ్ (సి) మోహిత (బి) కుల్దీప్ 62, హేల్స్ (సి) శాంసన్ (బి) కుల్దీప్ 40, బిల్లింగ్స్ (బి) హార్దిక్ 93, మోర్గాన్ (సి) ధవన్ (బి) చాహల్ 3, బట్లర్ (సి) మోహిత (బి) కుల్దీప్ 46, మొయిన్ అలీ (ఎల్బీ) కుల్దీప్ 0, డాసన్ (సి) అండ్ (బి) కుల్దీప్ 41, వోక్స్ (నాటౌట్) 11, రషీద్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 48.5 ఓవర్లలో 307/7; వికెట్లపతనం: 1-95, 2-106, 3-112, 4-191, 5-191, 6-290, 7-290; బౌలింగ్: నెహ్రా 6-0-50-0, హార్దిక్ 9.5-1-48-1, మోహిత 9-0-58-0, చాహల్ 10-0-56-1, కుల్దీప్ 10-1-60-5, యువరాజ్ 4-0-32-0. | sports |
13,164 | 25-01-2017 18:03:13 | ప్రముఖ హోటల్‌పై ఉగ్రదాడి.. ఏడుగురి మృతి | మొగదీషు: ఓ ప్రముఖ హోటల్‌పై బుధవారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. సొమాలియా పార్లమెంట్ సమీపంలోని డేయా హోటల్ గేట్ వద్ద బుధవారం తొలుత ఓ కారు బాంబు పేలింది. అనంతరం ఆయుధాలు ధరించిన కొందరు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. హోటల్ భవంతిలోకి ప్రవేశించేందుకు యత్నించారు. ఇంతలో అంబులెన్స్‌లు, మీడియా అక్కడికి రాగా మరో కారు బాంబ్ పేలింది. ఐదుగురు పౌరులు చనిపోగా పలువురు మీడియా సిబ్బంది గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ షాబాబ్ ప్రకటించింది. | nation |
9,666 | 25-09-2017 18:14:26 | 2018 ఆఖరిలో రాజమౌళి-మహేశ్ సినిమా | 'స్పైడర్' తర్వాత కొరటాల శివ మూవీని కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చిన మహేశ్ బాబు, ఇప్పుడో సెన్సేషన్ కాంబోను కన్ఫర్మ్ చేశాడు. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. మహేశ్ బాబు టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ డైరెక్టర్స్‌తోనూ సినిమాలు చేశాడు. కానీ రాజమౌళితో సినిమా ఇప్పటి కింకా వీలుకాలేదు. వీళ్లిద్దరూ కలసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో, ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలని అభిమానులు, ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా మహేశ్‌తో చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఎట్టకేలకు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కన్ఫర్మ్అయింది. ప్రస్తుతం 'స్పైడర్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మహేశ్‌బాబు ఈ సినిమాను కన్ఫర్మ్ చేసి చెప్పాడు. 2018 ఆఖర్లో మొదలయ్యే అవకాశం ఉంటుందని అంటున్నాడు. 'స్పైడర్' రిలీజ్ పనులతో పాటు కొరటాల శివ 'భరత్ అనే నేను' సినిమా చేయడంలోనూ బిజీగా ఉన్నాడు. 2018 వేసవికి ఈ సినిమా పూర్తికానుంది. ఆ తర్వాత వంశీ పైడి పల్లి ప్రాజెక్ట్ కూడా రెడీ అవుతుంది. అది కూడా పూర్తయ్యే సమయానికి రాజమౌళితో సినిమా 2018 ఆఖరులో సెట్ కావొచ్చు అని తెలుస్తోంది . ఇక ఈ సినిమా సాంఘికమా,పౌరాణికమా లేక జానపదమా అనే విషయాల్లో ఇంకా స్పష్టతలేదు. మరి మహేశ్, రాజమౌళి కాంబో మూవీ ఏ రేంజ్లో తెరకెక్కుతుందో చూడాలి. | entertainment |
5,713 | 10-04-2017 12:37:01 | పిల్లలు, భర్తతో తళుక్కున మెరిసిన యాంకర్ ఉదయ భాను | ఒకప్పుడు యాంకర్‌గా ఉదయభాను ఓ రేంజ్లో బుల్లితెరపై హంగామా చేసింది. యాంకర్‌గా ఎన్నెన్నో ప్రోగ్రామ్‌లు చేసి బుల్లితెర అభిమానులను సంపాదించుకుంది. కానీ, రెండేళ్ల నుంచి ఆమె బుల్లితెరకు దూరంగా ఉంది. కవల పిల్లలకు తల్లైన ఉదయ భాను ప్రస్తుతం.. వారి ఆలనా..పాలనా చూసుకుంటోంది. అందుకే బుల్లితెరకు దూరంగా ఉంటున్నానంటోంది. రెండేళ్ల నుంచి ఒకట్రెండు సార్లు మినహా.. ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించింది లేదు. తొలిసారిగా తన కవల పిల్లలతో తళుక్కున మెరిసింది ఉదయ భాను. నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తున్న భర్త విజయ్ సహా కవల పిల్లలతో ఇటీవల జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరైంది ఈ యాంకర్. తమ ఇద్దరు పాపలతో ఈ ఆలుమగలు అవార్డ్ ఫంక్షన్లో ఫొటోలకు పోజులిచ్చారు. ఇక, కార్యక్రమానికి ఉదయభాను ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా హాజరైంది. ప్రస్తుతం బుల్లితెర ఎంట్రీ లేనట్టేనని ఆ సందర్బంగా వెల్లడించింది కూడా. ప్రస్తుతం వారిద్దరి ఆలనా..పాలనా చూడడమే తన కర్తవ్యమని, వారికి కొంత వయసు వచ్చేదాకా వారిదగ్గరే ఉంటానని, తర్వాత మళ్లీ కెరీర్‌పై ఆలోచన చేస్తానని చెప్పింది ఉదయ భాను. | entertainment |
8,107 | 24-09-2017 13:24:27 | శ్రీహరి, కల్యాణ్ రామ్‌తో అనుబంధం గురించి చెప్పిన దర్శకుడు బాబీ | దర్శకుడు బాబీ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన జై లవకుశ సినిమా హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.75 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర బృందం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా దర్శకుడు బాబీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. 2005 నుంచి సినీ పరిశ్రమలో మొదటిసారి పరిచయమైన వ్యక్తి నటుడు శ్రీహరి అని బాబీ చెప్పాడు. శ్రీహరి మనింట్లో వ్యక్తిలాగా కలిసిపోతారని, కష్టం చెప్పుకోవడానికి వెళితే ఎలాంటి బేషజాలు లేకుండా ఇంట్లోకి రానిస్తారని బాబీ తెలిపాడు. అలా శ్రీహరితో పెద్ద బంధమే ఉందని, ఆయనతో ఉన్న బంధం గురించి చెప్పాలంటే తనకు ఒక రోజు పడుతుందని చెప్పాడు. ఆ తర్వాత సినీ పరిశ్రమలో అంతలా పరిచయమైన వ్యక్తి కల్యాణ్ రామేనని బాబీ తెలిపాడు. కల్యాణ్ రామ్ పరిచయమైనప్పటి నుంచి తన ప్రతీ పుట్టినరోజుకూ తాను ఉన్నానని, సర్దార్ గబ్బర్‌సింగ్ షూటింగ్‌కు వెళ్లే ముందు కూడా కలిసి కేక్ కట్ చేయించి వెళ్లానని బాబీ చెప్పాడు. టాలెంట్ ఉన్న రైటర్స్‌కు కల్యాణ్ రామ్ అవకాశమిస్తాడని దర్శకుడు బాబీ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ను రాజమౌళి అంతమాటన్నాడా..! ఎన్టీఆర్, బాలయ్య, కల్యాణ్‌రామ్.. గురించి కొన్ని సరికొత్త విషయాలు... | entertainment |
16,133 | 24-12-2017 02:25:52 | పగిలిన అద్దం అతుకుతుంది! | వాషింగ్టన్, డిసెంబరు 23: స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పగిలిపోయిందని, స్ర్కీన్‌పై గీతలు పడ్డాయని, ఇష్టమైన గాజు వస్తువు పగిలిపోయిందని ఇకపై బాధపడనక్కర్లేదు. జపాన్ పరిశోధకులు సెల్ఫ్ హీలింగ్ గ్లాస్‌ను అభివృద్ధి చేశార ట! పాలీఈథర్-థియరియ్సగా పిలిచే తేలికైన అణుపుంజం(పాలిమర్)తో తయారు చేసే గ్లాస్ పగిలితే కొద్దిసేపు చేత్తో ఒత్తి పట్టుకుంటే చాలు.. రిపేర్ అయిపోయితుందట! సాధారణంగా గాజు పదార్థాన్ని కరిగించాలంటే అత్యధిక ఉష్ణోగ్రతలు కావాలి. అయితే పాలీఈథర్-థియరియ్సతో తయారు చేసే గ్లాస్‌ను గది ఉష్ణోగ్రత(21డిగ్రీలు)లో చేతితో గట్టిగా ఒత్తి పట్టుకుంటే మరమ్మతు అయిపోతుందని టోక్యో యూనివర్సిటీకి చెందిన టకుజో అయిడా చెబుతున్నారు. | nation |
12,487 | 26-11-2017 12:25:41 | ఉగ్రవాదంతో ప్రపంచానికే కాదు మానవత్వానికీ ముప్పే : మోదీ |
న్యూఢిల్లీ : ఉగ్రవాదం వల్ల సమాజం నిర్వీర్యమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 38వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం అహింసా సందేశాన్నే వ్యాపింపజేస్తోందన్నారు. ఉగ్రవాదం పీడను నివారించేందుకు ప్రపంచం ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం మానవత్వానికే కాకుండా, ప్రపంచ దేశాలకు కూడా పెను ముప్పు అని హెచ్చరించారు. ఈ సందర్భంగా 2008 నవంబరు 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రస్తావించారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారందరికీ వందనం చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశం నలభయ్యేళ్ళ నుంచి ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తోందని, ప్రపంచం మొదట్లో దీనిపై శ్రద్ధ పెట్టలేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఉగ్రవాదం తాలూకు విధ్వంసకర కోణాన్ని ప్రపంచం గుర్తిస్తోందని చెప్పారు. | nation |
2,177 | 07-09-2017 16:07:42 | భారత మార్కెట్లోకి వీ7ప్లస్.. ఫీచర్లు తెలిస్తే ఎగిరి గంతేస్తారు! | న్యూఢిల్లీ: చైనా మొబైల్ ఫోన్ తయారీదారు వివో తన సరికొత్త సెల్ఫీ ఫోకస్ స్మార్ట్‌ఫోన్ వీ7 ప్లస్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమేరా ఉన్న ఈ ఫోన్ ధరను రూ.21,990గా నిర్ణయించింది. రియర్ కెమేరాను 16 మెగాపిక్సల్‌తో పొందుపర్చారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సెల్ఫీ ఫోన్‌గా చెబుతున్న వీ7 ప్లస్... లేత బంగారు వర్ణం, మాట్ బ్లాక్ వేరియంట్లతో లభ్యమవుతోంది. కీలక ఫీచర్లు ఇవే... - 5.99 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే- ఆక్టాకోర్ 64 బిట్ ప్రాసెసర్- 24 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా- 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా- 4 జీబీ ర్యామ్- 64 జీబీ మెమొరీ, మైక్రో ఎస్డీ కార్డుతో 256 జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకునే వెసులుబాటు.- నాన్ రిమూవబుల్ లియాన్-అయాన్ 3225 ఎంఏహెచ్ బ్యాటరీ..- ఫింగర్ ప్రింట్ స్కానర్- ఆండ్రాయిడ్ 7.1 ఓఎస్- ట్రిపుల్ స్లాట్ (2సిమ్స్, 1కార్డు స్లాట్) | business |
14,633 | 26-06-2017 19:49:25 | బెయిల్ కోసం గవర్నర్‌కు.. జస్టిస్ కర్ణన్ పిటిషన్ | కోల్‌కతా: కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ బెయిల్ కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ కేశ్రీనాథ్ త్రిపాఠికి పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ అధికార పరిమితి మేరకు తనకు బెయిల్ లేదా పెరోల్ మంజూరు చేయాలని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిన ఓ లేఖ ద్వారా కోరారు. న్యాయ వ్యవస్థలో అవినీతిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన జస్టిస్ కర్ణన్‌కు సుప్రీం కోర్టు పలుసార్లు సమన్లు జారీ చేసింది. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలపై తమ ఎదుట వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే సమన్లను కర్ణన్ లెక్కచెయకపోగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు సమన్లు జారీ చేయడంతో పాటు వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఈపరిణామాల నేపథ్యంలో కోర్టు ధిక్కారం కింద సుప్రీం కోర్టు ధర్మాసనం మే నెలలో జస్టిస్ కర్ణన్‌కు ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించింది. ఒక హైకోర్టు న్యాయమూర్తికి ఆ పదవిలో ఉండగా జైలు శిక్ష పడటం భారత చరిత్రలో ఇదే తొలిసారి. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం తమిళనాడులో కనిపించకుండా పోయిన జస్టిస్ కర్ణన్ పదవీ కాలం జూన్ 12తో ముగిసింది. అనంతరం బెంగాల్, తమిళ పోలీసులు జూన్ 20న కోయంబత్తూరులో ఆయనను అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు తీసుకొచ్చి ప్రెసిడెన్సీ జైలుకు తరలించారు. అయితే కడుపులో నొప్పి కారణంగా నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టుతో పాటు రాష్ట్రపతి ప్రణబ్‌కు గతంలో ఆయన చేసిన విన్నపాలు ఫలించలేదు. దీంతో తాజాగా బెయిల్ లేదా పెరోల్ కోసం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ను జస్టిస్ కర్ణన్ ఆశ్రయించారు. | nation |
11,422 | 11-08-2017 14:46:56 | ప్రధానితో తమిళనాడు సీఎం భేటీ | న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దాదాపు అర్థగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు సాగాయి. ఏఐఏడీఎంకే పార్టీలోని ప్రత్యర్థి వర్గాలన్నీ ఏకమవుతున్నట్టు ఊహాగానాలు ఊపందుకుంటున్న వేళ .. పళనిస్వామి ప్రధానితో భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వారాంతానికల్లా పార్టీలోని ఇరువర్గాలూ విలీనం కానున్నట్టు సీఎం పళని ప్రధానికి వివరించినట్టు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడు మాజీ సీఎం, జయలలిత విధేయుడు పన్నీర్‌సెల్వం కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినట్టు చెబుతున్నప్పటికీ... ఈ ఇద్దరు నేతలూ పార్టీ సమన్వయం కోసం చర్యలు చేపట్టనున్నట్టు కనిపిస్తోంది. విలీనానికి మార్గం సుగమం చేసేలా ఇప్పటికే ఏఐఏడీఎంకే నేతలు ఆ పార్టీ డిప్యూటీ చీఫ్, శశికళ మేనల్లుడు దినకరన్‌ను పదవినుంచి గెంటేసిన సంగతి తెలిసిందే. దినకరన్ నియామకం అక్రమంగా జరిగిందనీ... ఆయనకు కట్టబెట్టిన పదవి చెల్లదనీ, ఆమోదయోగ్యం కాదని ఏఐఏడీఎంకే ఓ తీర్మానం కూడా ఆమోదించింది. ఆఫీస్ బేరర్ల నియామకం సహా పార్టీ విషయంలో దినకరన్ తీసుకున్న నిర్ణయాలన్ని రద్దు చేసింది. | nation |
716 | 02-08-2017 00:11:38 | కరీంనగర్‌కు కార్జ్ | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మల్టీ బ్రాండ్ కార్ రిపైర్, మెయింటెనెన్స్ సంస్థ కార్జ్... తెలంగాణలోని కరీంనగర్‌కు కార్యకలాపాలు విస్తరించింది. ఈ నెల 4 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. కార్జ్ ఫ్రాంఛైజీని ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరించుకుంటూ వస్తున్నామని, ఇందులో భాగంగా కరీంనగర్లో ఫ్రాంఛైజీని ప్రారంభిస్తున్నట్లు కార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు దోనేపూడి తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 2.5 లక్షలకు పైగా కస్టమర్లకు సేవలందించినట్లు చెప్పారు. | business |
5,414 | 01-08-2017 22:00:52 | గోల్డ్‌కాయిన్స్ బహుమతిగా ఇచ్చిన ఆ హీరో.. | ఓ నటుడు తన తోటి టెక్నిషన్స్ అందరికీ ఏకంగా బంగారు నాన్నలే బహుమతిగా ఇచ్చేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. కోలీవుడ్ అగ్రనటుడు విజయ్. సినిమా ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్‌బాలా ఈవిషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మెర్సల్'. విజయ్-అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈచిత్రం కోసం 200మంది టెక్నిషన్స్ పనిచేస్తున్నారు. అయితే ఒక్కొక్కరికీ ఒక్కో గోల్డ్కాయిన్ చొప్పున మొత్తం 200మందికి కాయిన్స్ ఇచ్చాడట విజయ్. ఏఆర్ రహెమాన్ సంగీత సారథ్యంలో వస్తున్న ఈచిత్రంలో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. | entertainment |
20,616 | 26-10-2017 01:39:08 | హైదరాబాద్ ఢమాల్ |
తొలి ఇన్నింగ్స్ 136 ఆలౌట్మెరిసిన మెహ్దీ హసన్కర్ణాటక రెండో ఇన్నింగ్స్ 127/4తొలి ఇన్నింగ్స్ 136 ఆలౌట్మెరిసిన మెహ్దీ హసన్కర్ణాటక రెండో ఇన్నింగ్స్ 127/4షిమోగ: కర్ణాటకతో గ్రూప్-ఎ మ్యాచ్‌లో బౌలింగ్‌లో అదరగొట్టిన హైదరాబాద్ బ్యాటింగ్‌లో మాత్రం చెత్త ప్రదర్శన చేసింది. ఆతిథ్య జట్టు బౌలర్ల విజృంభణతో హైదరాబాద్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవడానికి ఆపసోపాలు పడ్డారు. కేఎ్‌ససీఏ నావల్ స్టేడియంలో.. ఓవర్‌నైట్ స్కోరు 51/3తో రెండో రోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రాయుడు సేన బ్యాటింగ్ వైఫల్యంతో మరో 85 రన్స్ మాత్రమే జోడించి 136 పరుగులకే కుప్పకూలింది. భారీ అంచనాలున్న సందీప్ (19), ఆకాశ్ బండారి (24), ఆశీష్ రెడ్డి (2) తీవ్ర నిరాశపర్చారు. టెయిలెండర్లు ప్రజ్ఞాన్ ఓఝా (0), రవికిరణ్ (0) డకౌటయ్యారు. లెగ్‌బ్రేక్ స్పిన్నర్ శ్రేయాష్ గోపాల్ 6 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. కృష్ణప్ప గౌతమ్ 3 వికెట్లు తీశాడు. శ్రీకాంత్ అరవింద్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక ఆట చివరకు 4 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 174 రన్స్ ఆధిక్యంలో ఉంది. కరుణ్ నాయర్ (37 బ్యాటింగ్), స్టువర్ట్ బిన్నీ (26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు రవికుమార్ సమర్థ్ 29, రాహుల్ 23 రన్స్ చేశాడు. మయాంక్ అగర్వాల్ (0), కృష్ణప్ప గౌతమ్ (0) డకౌటయ్యారు. హైదరాబాద్ బౌలర్ మెహ్దీ హసన్ 4 వికెట్లతో రాణించాడు. విహారి ట్రిపుల్ సెంచరీ: రంజీ ట్రోఫీలో ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ఒడిశాతో గ్రూప్-సి పోరులో విహారి (456 బంతుల్లో 29 ఫోర్లు, 2 సిక్సర్లతో 302 నాటౌ ట్) కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచరీతో చెలరేగడంతో ఆంధ్రకు భారీ స్కోరు లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 278/2తో రెండో రోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర మరో 306 రన్స్ జోడించి 584/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆంధ్ర తరపున రంజీల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగా డిగా విహారి ఘనత వహించారు. అంతకుముందు భరత్ ట్రిపుల్ సాధించాడు. విహారి అజేయ ట్రిపుల్‌తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (144 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 100) సెంచరీతో రాణించాడు. విహారి-రికీ మూడో వికెట్‌కు 208 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో ఒడిశాకు 43.3 ఓవర్ల తర్వాత వికెట్ దక్కింది. విహారికి రంజీల్లో ఇదే అత్యుత్తమ స్కోరు. అంతకుముందు ఫస్ట్ క్లాస్‌లో అతని బెస్ట్ స్కోరు 263. సుమంత్ (17), రవితేజ (1) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. సూర్యకాంత్ ప్రధాన్ 2 వికెట్లు తీయగా.. బసంత్ మొహంతి, ధీరజ్ సింగ్, గోవింద పొదర్కు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు కొనసాగించిన ఒడిశా ఆట చివరకు వికెట్ నష్టానికి 32 రన్స్ చేసింది. ప్రస్తుతం ఒడిశా 552 పరుగులు వెనకబడి ఉంది. సందీప్ పట్నాయక్ (14 బ్యాటింగ్), గోవిం ద పొదర్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భార్గవ్ భట్ ఒక వికెట్ తీశాడు. గుర్కీరత్ సెంచరీ: గోవాతో గ్రూప్-డి మ్యాచ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 396/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్ 635 వద్ద ఆలౌటైంది. గుర్కీరత్ సింగ్ (114) సెంచరీతో మెరిశాడు. అనంతరం ఆట చివరకు తొలి ఇన్నింగ్స్‌లో గోవా 94/1 స్కోరు చేసింది. ప్రస్తుతం గోవా 541 రన్స్ వెనకంజలో ఉంది. కాగా, తమిళనాడుతో గ్రూప్-సి మ్యాచ్ లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 రన్స్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆట చివరకు తమిళనాడు 5 వికెట్లకు 239 పరుగులు చేసింది. బాబా ఇంద్రజిత్ (105 బ్యాటింగ్) సెంచరీ, వాషింగ్టన్ సుందర్ (69) అర్ధ సెంచరీలతో రాణించారు. | sports |
7,304 | 18-09-2017 17:35:25 | ఫిదా తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రం ఇదే.. | రీసెంట్గా 'ఫిదా'తో సూపర్ హిట్టు అందుకున్న యంగ్ హీరో వరుణ్ తేజ్ తదుపరి చిత్రం అప్పుడే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది . ఆకర్షణీయమైన టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూసిన వరుణ్ తేజ 'ఫిదా'తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఫిదా చేసేశాడు . ఆ సినిమా ఇచ్చిన నూతనోత్సాహంతో అప్పుడే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళిపోయాడు. వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో పూర్తి చేశారు. కాగా ఇప్పుడు రెండో షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు వెంకీ, సినిమాటోగ్రాఫర్ జార్జ్ విలియమ్స్ ప్రస్తుతం లండన్ లో లొకేషన్స్ చూసే పనిలో ఉన్నారు. వరుణ్ తేజ తాజా సినిమా కోసం 'తొలి ప్రేమ' అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎక్కువ రోజులు ఆడిన చిత్రంగా 'తొలిప్రేమ' నిలచింది. బాబాయ్‌కి అచ్చివచ్చిన టైటిల్‌ను అబ్బాయ్ వరుణ్ తన సినిమాకు పెట్టుకోవడం విశేషం. రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను బి.వి.యస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతం యస్ యస్ థమన్ అందిస్తున్నారు. త్వరలో లండన్‌లో సెకండ్ షెడ్యూల్‌కు వెళ్లబోతున్న ఈ సినిమా వరుణ్ తేజకు ఏ రేంజ్ హిట్టిస్తుందో చూడాలి. | entertainment |
18,326 | 29-12-2017 20:26:18 | మూడేళ్ల జైలులో మతలబు ఏంటి? | న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ లోక్‌సభ ఆమోదించిన బిల్లుపై డీఎంకే శుక్రవారం స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. క్రిమినల్ నేరం కింద మూడేళ్ల కఠిన శిక్ష విధిస్తున్న ఈ బిల్లును అంత ఆదరాబాదరాగా ఎందుకు తీసుకువచ్చారని కేంద్రాన్ని డీఎంకే ప్రశ్నించింది. మూడేళ్ల కారాగారమంటూ బిల్లులో ఉన్న ప్రొవిజన్‌ను సమీక్షించేందుకు పార్లమెంటరీ స్టాటింగ్ కమిటీకి తక్షణం పంపాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ముస్లిం మహిళల హక్కులు పరిరక్షిస్తామని చెబుతున్న బీజేపీ మూడేళ్ల జైలు ప్రొవిజన్ చేర్చడంపైనే అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఆదరాబాదరాగా బిల్లు తేవడం కూడా ఈ అనుమానాలకు తావిస్తోందన్నారు. సుప్రీంకోర్టు సైతం గత ఆగస్టులో ఇచ్చిన తీర్పులో ట్రిపుల్ తలాక్ పద్ధతిని అడ్డుకునేందుకు పార్లమెంటు చట్టం తేవాలని సూచించిందని, జైలు నిబంధన గురించి తీర్పులో ఎక్కడా చెప్పలేదని స్టాలిన్ గుర్తుచేశారు.మహిళల హక్కుల పరిరక్షణకు డీఎంకే ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం షరియాను పట్టించుకోకుండా, ముస్లిం వర్గాలతో కానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డును కూడా సంప్రదించకుండా ఇంత హడావిడిగా బిల్లు తీసుకువచ్చిందని అన్నారు. కనీసం ఇప్పుడైనా బిల్లును పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ పరిశీలనకు పంపి, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని స్టాలిన్ ఆ ప్రకటనలో సూచించారు. న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ లోక్‌సభ ఆమోదించిన బిల్లుపై డీఎంకే శుక్రవారం స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. క్రిమినల్ నేరం కింద మూడేళ్ల కఠిన శిక్ష విధిస్తున్న ఈ బిల్లును అంత ఆదరాబాదరాగా ఎందుకు తీసుకువచ్చారని కేంద్రాన్ని డీఎంకే ప్రశ్నించింది. మూడేళ్ల కారాగారమంటూ బిల్లులో ఉన్న ప్రొవిజన్‌ను సమీక్షించేందుకు పార్లమెంటరీ స్టాటింగ్ కమిటీకి తక్షణం పంపాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ముస్లిం మహిళల హక్కులు పరిరక్షిస్తామని చెబుతున్న బీజేపీ మూడేళ్ల జైలు ప్రొవిజన్ చేర్చడంపైనే అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఆదరాబాదరాగా బిల్లు తేవడం కూడా ఈ అనుమానాలకు తావిస్తోందన్నారు. సుప్రీంకోర్టు సైతం గత ఆగస్టులో ఇచ్చిన తీర్పులో ట్రిపుల్ తలాక్ పద్ధతిని అడ్డుకునేందుకు పార్లమెంటు చట్టం తేవాలని సూచించిందని, జైలు నిబంధన గురించి తీర్పులో ఎక్కడా చెప్పలేదని స్టాలిన్ గుర్తుచేశారు.మహిళల హక్కుల పరిరక్షణకు డీఎంకే ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం షరియాను పట్టించుకోకుండా, ముస్లిం వర్గాలతో కానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డును కూడా సంప్రదించకుండా ఇంత హడావిడిగా బిల్లు తీసుకువచ్చిందని అన్నారు. కనీసం ఇప్పుడైనా బిల్లును పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ పరిశీలనకు పంపి, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని స్టాలిన్ ఆ ప్రకటనలో సూచించారు. | nation |
9,194 | 23-09-2017 22:55:58 | నేను మంచి కథకుడిని | ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు ఎస్.ఎస్.రాజమౌళి. అయినప్పటికీ తనలోని ఉన్న దర్శకుడి కన్నా కథకుడే గొప్పవాడని ఆయన చెబుతున్నారు. ఇటీవల మంగుళూరులో ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమౌళి మాట్లాడుతూ ‘‘కథ చెప్పడం, క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా వివరించడంలో నేను చాలా బెస్ట్. నాలో ఉన్న దర్శకుడి కన్నా కథకుడే బాగా నచ్చుతాడు. నా హీరోలకు కూడా నాలో అదే నచ్చుతుంది. ‘బాలరామాయణం’, ‘అమర చిత్ర కథ’, వంటి కామిక్ పుస్తకాలు చదువుతూ పెరిగిన నాకు పురాణాల మీద మంచి పట్టుంది. అవి చిన్నప్పటి నుంచే నా బ్లడ్‌లో ఉన్నాయి’’ అని చెప్పారు. ‘కర్ణుడి’ వల్లే తనకు మహాభారతమంటే ఇష్టమనీ, అతని గురించి చదువుతున్నప్పుడు తన రోమాలు నిక్కబోడుచుకుంటాయనీ, భావోద్వేగానికి లోనయితే కన్నీరు అస్సలు ఆగదని రాజమౌళి అన్నారు. ఒక సినిమా సక్సెస్ క్రెడిట్ 80 శాతం కథకు, 20 శాతం సినిమాటోగ్రఫీకి ఇస్తానని వివరించారు. | entertainment |
15,923 | 24-01-2017 17:00:04 | అఖిలేష్‌కు ఎన్నికల వేళ షాక్..! | న్యూఢిల్లీ: కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 17 వెనుకబడిన తరగతుల (ఓబీసీ)ను ఎస్సీ జాబితాలోకి చేరుస్తూ యూపీ సర్కార్ గత డిసెంబర్ 22న ఇచ్చిన ఉత్తర్వుపై అలహాబాద్ హైకోర్టు మంగళవారంనాడు స్టే విధించింది. దీంతో ఓబీసీలను ఎస్సీ జాబితాలోకి చేర్చడం ద్వారా ఎన్నికల్లో వారి ఓట్లను ఆకట్టుకోవాలన్న అఖిలేష్ సర్కార్ ఆలోచనకు గండిపడింది. గత ఏడాది ఈ ప్రతిపాదనను ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదించి క్లియరెన్స్ కోసం కేంద్రానికి పంపింది. డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచే ఒక సంస్థ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసింది. ప్రభుత్వ ఉత్తర్వు రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకుని లబ్ది పొందేందుకు జరిగిన ప్రయత్నమని, ఇది భారత రాజ్యాంగంలోని 341వ ఆర్టికల్‌ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆ పిల్ పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వుపై స్టే ఇస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది. | nation |
7,072 | 26-08-2017 19:02:50 | మహేష్ నన్ను డామినేట్ చేస్తున్నాడు: జూనియర్ ఎన్టీఆర్ |
‘‘మహేష్ నీవు నన్ను డామినేట్ చేస్తున్నావు. గడిచిన రెండు వారాలుగా నా ‘బిగ్‌బాస్’ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్న ప్రేక్షకులు ఇప్పుడు దాన్ని వదిలేసి నీ స్పైడర్ టీజర్ గురించి మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నీ టీజర్ సూపర్’’ అని జూనియర్ ఎన్టీఆర్ మహేష్‌బాబును ఆకాశానికి ఎత్తేశాడు. మహేష్ పుట్టినరోజు ఆగస్టు 9న స్పైడర్ టీజర్ విడుదలైంది. సోషల్ మీడియా అంతా ఈ సినిమా చుట్టే తిరుగుతోంది. ఎన్టీఆర్ అయితే తన తాత ఎన్టీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అభిమాన హీరో మహేష్బాబేనని ఏనాడో చెప్పాడు. హాలీవుడ్ సినిమాకు దీటుగా టీజర్ వచ్చిన స్పైడర్ టీజర్ ఆయనను ఊర్రూతలూపింది. దీంతో మహేష్‌ను పొగుడుతూ కొన్నాళ్లు తన ‘బిగ్‌బాస్’ షోకు జనం టాటా చెప్పినట్టే ఉందని వ్యాఖ్యానించారట. అది విన్న మహేష్ నవ్వేసి అదంతా టీజర్ ఫాలో అప్ అని నవ్వేశాడట. ‘‘చూడు మహేష్ నీవు నన్ను డామినేట్ చేస్తున్నావు’’ అన్నాడట సరదాగా ఎన్టీఆర్. ‘‘నా టీజర్ నాలుగు లేదా ఐదు రోజులు. నీ బిగ్‌బాస్ హవా నెలలు తరబడి ఉంటుంది’’ అని మహేష్ అన్నాడంట. పైగా ఆ షో బాగుందని పొడిగాడట మహేష్. ఇలా టాప్‌హీరో సద్భావనతో ఒకరిని ఒకరు గౌరవించుకోవడం గొప్ప విశేషమే మరి. | entertainment |
20,494 | 15-10-2017 17:10:17 | సెల్ఫీ గురించి మర్చిపోండి.. ఇప్పుడు బోథీ ట్రెండ్! | న్యూఢిల్లీ: సెల్పీ.. యువత ఇప్పుడు తిండి లేకుండా అయినా ఉంటుందేమో కానీ సెల్ఫీ దిగకుండా ఉండలేకపోతోంది. సెల్ఫీ మోజులో యువత ఊగిపోతోంది. ఇప్పటి వరకు జనాలను ఊపేసిన సెల్ఫీ ఇక కనుమరుగు అయ్యే రోజు వచ్చేసింది. తాజా సెల్ఫీ ప్లేస్‌లో ‘బోథీ’ వచ్చి చేరింది. ముందు, వెనక కెమెరాలతో ఒకేసారి ఫొటో తీసుకోవడమే బోథీ. నోకియా తాజా స్మార్ట్ ‘నోకియా 8’ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ధర 36,999. రెండు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంది. నోకియా 8లో ఉపయోగించిన అత్యాధునిక సాంకేతికతో ఒకేసారి రియర్, సెల్ఫీ కెమెరాలు ఉపయోగించి ఫొటోలు తీసుకోవచ్చు. అంతేకాదు ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ కోసం ప్రత్యేక సదుపాయం కూడా ఉంది. నోకియా 8 ప్రత్యేకతల విషయానికి వస్తే.. 5.3 అంగుళాల ఐపీఎస్ క్యూహెచ్డీ డిస్ప్లే, క్వాల్-కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బుల్ట్ మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 13 ఎంపీ రియర్, ఫ్రంట్ కెమెరాలు, 3090 ఎంఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఓఎస్. తన సినిమాపై తానే సెటైర్ వేసుకున్న పూరీ ఎన్టీఆర్‌ను రాజమౌళి అంతమాటన్నాడా..! | sports |
11,161 | 12-08-2017 16:14:30 | గోరఖ్‌పూర్ విషాదంపై మోదీ విచారం | గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీలో 64 మంది చిన్నారుల మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ శనివారంనాడు తెలిపారు. గోరఖ్‌పూర్ విషాదంపై వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు బయలుదేరిన అనుప్రియ మీడియాతో మాట్లాడుతూ, గోరఖ్‌పూర్ ఘటన దురదృష్టకరమని అన్నారు. దీనిపై ప్రధాని మోదీ సైతం విచారం వ్యక్తం చేశారని చెప్పారు. తాను స్వయంగా పరిస్థితిని సమీక్షించి ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయమై ప్రాథమిక సమాచారం తెలుసుకుంటానని అన్నారు. యూపీ ప్రభుత్వం ఇప్పటికే మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిందని అన్నారు. దీంతో దోషులెవరనే వాస్తవం బయటకు వస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. దోషులెవరైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆమె భరోసా ఇచ్చారు. అంతకుముందు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ, యూపీ ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్ధ్ నాథ్ సింగ్‌ను, వైద్య విద్య మంత్రి అశుతోష్ టాండన్‌ను నివేదిక అడిగినట్టు చెప్పారు. కాగా, గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్విజన్ సరఫరాలో తలెత్తిన అవాంతరాల కారణంగా 64 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పాయారంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో యోగి సర్కార్‌పై విమర్శలు గుప్పించాయి. సకాలంలో రోగులకు వైద్య సదుపాయం కల్పించడంలో విఫలమైన యోగి ఆదిత్యనాథ్, సిద్ధార్థ్ నాథ్ సింగ్ రాజీనామా చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. అక్సిజన్ కొరత వల్ల మెదడువాపు తలెత్తి అది మెదడుపై ప్రభావం చూపడం వల్ల చిన్నారులు మృతిచెందినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. | nation |
5,135 | 21-03-2017 13:00:10 | మనోజ్‌ను సీఎం లేదంటే.. మావోయిస్టును చేయండి: పోసాని | సినిమా ఇండస్ట్రీలో పంచ్‌లు పేల్చడంలో దిట్ట ఎవరంటే ముందు గుర్తుకొచ్చే పేరు పోసాని కృష్ణమురళి. అతడికి అదీ..ఇదీ అన్న తేడా ఏదీ లేదు.. నోటికి పనిచెప్పాడా అంతే. అలాంటి వ్యక్తి.. మంచు వారి చిన వారసుడు మనోజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘మనోజ్‌ను ముఖ్యమంత్రిని చేయండి.. లేదంటే.. మావోయిస్టు నేతగానైనా మార్చండి..’ అంటూ వ్యాఖ్యానించాడు పోసాని. ఇటీవల మంచు మోహన్‌బాబు 67వ జన్మదిన వేడుకలను తిరుపతి శ్రీ విద్యానికేతన్‌లో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న పోసాని.. ఈ షాకింగ్ కామెంట్లు చేశాడు. ‘‘నేను చాలా మాట్లాడదామనుకున్నా. కానీ, అందరూ మాట్లాడేశాక నాకు మైకునిచ్చారు మోహన్‌బాబు గారు. ఇక నాకేం మిగిలింది మాట్లాడడానికి. ముఖ్యంగా మనోజ్ మాట్లాడాక నాకైతే మాట రావట్లేదు. మోహన్ బాబు గారూ.. మనోజ్‌ను ముఖ్యమంత్రిని చేయండి. లేదంటే మావోయిస్టుగానైనా మార్చేయండి. అప్పుడైతేనే మనోజ్ కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరతాయి. దేశానికి స్వాతంత్ర్యం అంటే మహాత్మ గాంధీ, మానవత్వం పేరెత్తితే మదర్ థెరిస్సా గుర్తొస్తారు. అలాగే దేశంలో విద్య పేరెత్తితే మోహన్‌బాబు గారే గుర్తొస్తారు’’ అని తెగ పొగిడేశాడు పోసాని. మోహన్‌బాబును అందరూ బాగా పొగిడేస్తున్నారని, కానీ, ఆయన కూడా అందరి లాంటి మనిషేనని, ఆయనకున్నదీ మనిషి లక్షణాలేనని, చాలా మందిలాగా జంతు లక్షణాలు లేవని అన్నాడు. కాగా, ఓటు హక్కు వచ్చాక ఓటును అమ్ముకోవద్దని విద్యార్థులకు హితవు చెప్పాడు. తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం రూ.7 లక్షలే ఖర్చుపెట్టడం వల్ల గెలవలేకపోయానని పోసాని కృష్ణమురళి అన్నాడు. | entertainment |
14,951 | 20-11-2017 01:00:45 | ప్రాంతీయ భాషల్లో ‘ఖాన్ అకాడమీ’ | ఆన్లైన్ వీడియో పాఠాలు చెప్పడంలో పేరొందిన ‘ఖాన్ అకాడమీ’ భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాదికి ఎడ్యుకేషనల్ వీడియోలను గుజరాతీ, బెంగాలీ, హిందీ భాషల్లో విడుదల చేయనుంది. ఇండియన్ కరిక్యులమ్ ప్రకారం రూపొందించిన మెటీరియల్ ఇంగ్లి్‌షలో మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. అయితే దీన్ని యథాతథంగా కాకుండా ప్రాంతీయ భాషల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్చనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల్లో వినియోగానికి వీలుగా మెటీరియల్ రూపకల్పనకు ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఖాన్ అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. సబ్ డొమైన్స్‌లో కూడా మెటీరియల్‌ను అందిస్తారు. ఇంగ్లిష్, కన్నడ రెండు భాషల్లో దేన్నైనా విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. మ్యాథ్స్, సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటింగ్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్, ఫైనాన్స్ సబ్జెక్టులకుపాటు శాట్, జీమ్యాట్కు ప్రిపరేటరీ మెటీరియల్‌ను ఇప్పటికే అందిస్తోంది. వీటిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను భారత కరిక్యులమ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. సుమారు 5,500 వీడియోలు, ఇరవై వేల ఎక్స్‌ర్‌సైజ్‌లను ఆ రెండు సబ్జెక్టుల్లో రూపొందించారు. సోషల్ సైన్సెస్ మెటీరియల్‌నూ వచ్చే ఏడాది అందించనున్నారు. సుమారు పది లక్షల మంది భారత వినియోగదారులు ఈ కంటెంట్‌ను ఉపయోగించుకుంటున్నారు.- స్టడీ డెస్క్ | nation |
3,376 | 11-03-2017 00:59:24 | ఎన్నికల సంస్కరణలు ఎలా ఉండాలి? | ప్రజాస్వామ్యంలో ప్రజలు తమను తామే పాలించుకొంటారు. జనాభా తక్కువగా ఉంటే ప్రత్యక్ష, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయవచ్చు. జనాభా లక్షల్లోనూ, కోట్లలోనూ ఉంటే ప్రాతినిథ్య ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. ప్రపంచమంతా ప్రాతినిథ్య ప్రజాస్వామ్యమే నడుస్తున్నది. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధాన పాత్ర కలిగి ఉంటాయి. ప్రజలు ఎన్నికల ద్వారా తమ పాలకులను ఎన్నుకొంటారు. 1950 నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల విధానంలోని లోపాలను అప్పుడప్పుడు కొద్దిగా సవరించుకుంటూ వస్తున్నారు. ఎన్నికల వ్యయం విపరీతంగా ఉండటం, ఓటర్లకు అర్హతలు సరిగా నిర్ణయించకపోవటం, ఓటర్లు డబ్బులకు ఓట్లు అమ్ముకోవటం, ఓట్ల లెక్కింపు విధానం సరిగా లేకపోవటం, రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటింగు లేకపోవటం, దొంగ ఓట్లు వేయటం, పోలింగు కేంద్రాలను ఆక్రమించి రిగ్గింగు చేయటం, బలహీనవర్గాలను పోలింగు కేంద్రాలకు రానీయకుండా అడ్డుకోవడటం, ఎన్నికల్లో మితిమీరిన హింస, తక్కువ శాతం పోలింగు కావటం, నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనటం, కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టటం, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల్లో దుర్వినియోగం చేయటం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, అసంబద్ధమైన వాగ్దానాలు చేయటం, సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉపఎన్నికలతో సంవత్సరం పొడవునా, ఐదు సంవత్సరాల పాటు ఎన్నికల వాతావరణం నెలకొనటం, రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం లేకపోవటం, ఎన్నికల సంఘానికి ఎక్కువ అధికారాలు లేకపోవటం, ప్రభుత్వ, ప్రైవేటు మీడియాను దుర్వనియోగం చేయటం, పార్టీ ఫిరాయింపులు మొదలగునవి మన ఎన్నికల విధానంలోని ముఖ్యమైన లోపాలు. ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ బలంగా ఉండాలంటే రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం చాలా అవసరం. రాజకీయ పార్టీల వ్యవహారాన్ని అంతరంగిక వ్యవహారంగా భావించరాదు. అవి కూడా ప్రజలకు, న్యాయస్థానాలకు, ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఉండాలి. రాజకీయ పార్టీల ఎన్నికలు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలను ‘కాగ్’ పరిధిలోకి తేవాలి. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన రాజకీయ పార్టీలను మాత్రమే అనుమతించాలి. సాధారణ ఎన్నికల నిర్వహణ సుదీర్ఘకాలంపాటు ఉంటున్నది. దశలు ఎక్కువగా ఉండటం, ఒక్కొక్క దశకు ఎక్కువ కాలపరిమితి ఉండటం వలన సుదీర్ఘ ప్రక్రియగా మారింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోనే ఎన్నికలను నాలుగు దశలలోనే జరపాలన్న నిబంధన ఉండాలి. ఒక్కొక్క దశకు నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండాలి. ఎన్నికల ప్రకటన తేదీ నుంచి లెక్కింపు తేదీ మధ్య రెండు నెలలకు మించి ఉండకూడదు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో నాలుగింట మూడు వంతుల స్థానాలను అభ్యర్థులను ఎన్నుకోవటం ద్వారాను, స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల నిష్పత్తి ప్రకారం రాజకీయ పార్టీలు సూచించిన అభ్యర్థులను ఎంపిక చేయాలి. పార్లమెంటరీ విధానం వలన మన దేశం లాభపడిందో లేక నష్టపోయిందో అర్థం కావటం లేదు. సాధారణ ఎన్నికల్లో మెజారిటీ రాని చోట్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, కొద్ది రోజుల్లోనే పార్టీ ఫిరాయింపుల వలన అవి కూలిపోవటం, మళ్లీ ఎన్నికలు ఎదుర్కొనవలసి రావటం గత 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. చట్టసభల కాలపరిమితి ఐదు సంవత్సరాలని చెప్పినప్పటికీ చాలాసార్లు మధ్యలోనే రద్దవుతున్నాయి. పార్లమెంటరీ విధానంలో ఇదొక పెద్ద లోపం. దేశంలోని అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా రాజ్యాం, చట్టసవరణలు చేసుకోవాలి. కాలపరిమితి ప్రకారమే సాధారణ ఎన్నికలు జరగాలి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు పార్టీ చిహ్నాల మీద జరిగితే, స్థానిక సంస్థలు, ఇతర సహకార సంఘాల ఎన్నికలు పార్టీ రహితంగా జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం లేక లాటరీ విధానం అనుకరిస్తే ఇంకా మంచిది.ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు ఓట్లను కొనటానికి తెగబడుతున్నారు. ఓటర్లు కూడా చాలామంది ఓట్లు అమ్ముకోవటం తప్పు కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఓటుకు ఇంత ఇవ్వాలని పట్టుబట్టే స్థితికి ఓటర్లు వచ్చారు. దీన్ని నివారించటానికి రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటు విధానాన్ని ప్రవేశపెట్టాలి. బహిరంగ ఓటింగు విధానం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. ఓటర్లకు కొన్ని అదనపు అర్హతలను నిర్ణయించాలి. ఓట్ల లెక్కింపు విధానంలో మార్పులు చేయాలి. ఓటర్లను మూడు తరగతులుగా వర్గీకరించాలి. పూర్తి అర్హత కలిగిన ఓటర్లు, సగం అర్హత కలిగిన ఓటర్లు, పూర్తిగా అర్హతలేని ఓటర్లుగా విభజించాలి. ఎటువంటి సివిల్, క్రిమినల్ కేసులు లేని వాళ్లు, ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు, స్థానిక సంస్థలకు ఎటువంటి బకాయిలు లేని వాళ్ళను పూర్తి అర్హత కలిగిన ఓటర్లుగా భావించాలి. సివిల్, క్రిమినల్ కేసుల్లో ఉన్నవారు, ప్రభుత్వ సంస్థలకు, స్థానిక సంస్థలకు బకాయిలు ఉన్నవారు సగం అర్హత కలిగిన ఓటర్లుగా భావించాలి. సివిల్, క్రిమినల్ కేసుల్లో చార్జిషీట్ పెడితే సగం అర్హతే ఉంటుంది. సివిల్, క్రిమినల్ కేసుల్లో శిక్ష పడినవారు, మతి స్థిమితం లేనివారు, ప్రభుత్వ సంస్థలకు దీర్ఘకాలంగా బకాయిలు ఉన్నవారు, పన్నులు ఎగవేసినవారు, దివాలా తీసినవారు పూర్తిగా అర్హతలేని ఓటర్లుగా భావించాలి. మొదటి, రెండవ తరగతి ఓటర్లకు ఓటు వేసే హక్కు ఉంటుంది. మొదటి తరగతి ఓటర్లను ఒక రకం బ్యాలట్ బాక్స్, రెండవ రకం ఓటర్లకు మరొక రకం బ్యాలట్ బాక్సు ఉండాలి. ఓట్ల లెక్కింపులో మొదట మొదటి రకం బాక్స్‌లోని ఓట్లను లెక్కించాలి. ఓట్లు సమానంగా వచ్చినప్పుడు లేక అతి తక్కువ మెజారిటీ వచ్చినపుడు రెండవ రకం బాక్స్ ఓట్లను లెక్కించాలి. ఈ పద్ధతి వలన ఓటర్లు బాధ్యత కలిగి ఉంటారు. ప్రభుత్వాలకు బకాయిలు పెట్టరు. బాధ్యతతో మెలిగే ఓటర్లుకు విలువ పెరుగుతుంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం భారత దేశమేనని అందరూ చెబుతుంటారు. మన ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ మేడిపండులాగానో, నేతి బీరకాయలాగానో మారకూడదు. ఎన్నికల సంస్కరణలను త్వరగా ప్రవేశపెట్టి భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా చూపాలి. అప్పుడే మన స్వాతంత్ర్యం సమరయోధుల పోరాటాలు ఫలవంతమవుఆయి. ఈ దిశగా అన్ని రాజకీయ పక్షాలు నడుం బిగించి ఎన్నికల సంస్కరణల కొరకు పోరాడాలి.బాచిన రామాంజనేయులు | editorial |
17,538 | 02-07-2017 15:50:31 | మంత్రిని యాంకర్ అవమానించలేదట ! | న్యూఢిల్లీ : నొచ్చుకునేలా సంధించిన ప్రశ్న సర్జికల్ స్ట్రైక్స్‌కు దారి తీసిందని మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పడంలో నిజమెంత? గోవాలో శుక్రవారం పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌తో మాట్లాడిన ఓ టీవీ యాంకర్ కఠినంగా ప్రశ్నించారని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్‌కు వ్యూహాలను సిద్ధం చేయడానికి ఆ ప్రశ్నే పురిగొలిపిందని చెప్పారు. అంత ఘాటుగా ప్రశ్నించిన టీవీ యాంకర్ ఎవరు? అసలు అలాంటి ప్రశ్న వేశారా? లేదా? అనే చర్చలో నెటిజన్లు మునిగి తేలుతున్నారు. 2015 జూన్‌లో ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లో తిరుగుబాటుదారులపై దాడులను భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో లక్షిత దాడులకు వ్యూహ రచనను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని పారికర్ చెప్పారు. అంతేకాకుండా ఓ టీవీ యాంకర్ కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌ను నొచ్చుకునేలా వేసిన ప్రశ్న తమను మరింత పురిగొలిపిందని చెప్పారు. ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లుగానే ఇండియా-పాకిస్థాన్ సరిహద్దుల్లో లక్షిత దాడులను నిర్వహించే దమ్ము, ధైర్యం, సామర్థ్యం భారత ప్రభుత్వానికి ఉన్నాయా? అని ఆ యాంకర్ ప్రశ్నించారని తెలిపారు. ‘‘(మీడియా నుంచి వచ్చిన) ఓ ప్రశ్న నన్ను బాధించింది. ఎక్స్-ఆర్మీమ్యాన్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ టీవీలో మాట్లాడుతున్నారు. అన్ని రకాల సెర్చ్ ఆపరేషన్ల గురించి వివరిస్తున్నారు. పశ్చిమ సరిహద్దుల్లో ఇదేవిధంగా చేసే ధైర్యం, సామర్థ్యం మీకు ఉన్నాయా? అని యాంకర్ ఆయనను (రాజ్యవర్థన్ను) అడిగారు. ఓ సర్జికల్ స్ట్రైక్ విజయవంతమైన తర్వాత ఇది నాకు మరొక అవమానం. ఆ ప్రశ్నను నిశితంగా విన్నాను. అయితే సమయం వచ్చినపుడు సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను. పశ్చిమ సరిహద్దుల్లో 2016 సెప్టెంబరు 29నాటి సర్జికల్ స్ట్రైక్స్‌కు ప్రారంభం 2015 జూన్ 9న జరిగింది’’ అని పారికర్ చెప్పారు. 2015 జూన్ 9న ‘ఎన్డీటీవీ 24/7’తో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మాట్లాడారు. యాంకర్ నిధి రజ్దాన్‌తో జరిగిన సంభాషణ ఈ విధంగా సాగింది. నిధి రజ్దాన్ : దీనిని (క్రాస్ బోర్డర్ స్ట్రైక్స్‌ను) ఇతర సరిహద్దులకు విస్తరించే అవకాశం వైపు ప్రభుత్వం చూసే అవకాశం ఏమైనా ఉందా? పాకిస్థాన్ వంటి ఇతర దేశాలకు మీరు పంపిస్తున్న సందేశం ఇదేనా? రాజ్యవర్థన్ సింగ్ : (ఉగ్రవాద) ఆలోచనలకు ఆశ్రయమిచ్చే దేశాలన్నిటికీ, అవి పశ్చిమంలో ఉన్నా, ప్రస్తుతం మనం వెళ్ళిన దేశమైనా, ఇది నిస్సందేహంగా ఓ సందేశమే. రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ 2015 జూన్ 10న ‘టైమ్స్ నౌ’తో మాట్లాడారు. అర్ణాబ్ గోస్వామి ప్రశ్నలకు రాజ్యవర్థన్ సమాధానాలు చెప్పారు. ఆ సంభాషణ ఇలా సాగింది. అర్ణాబ్ : పాకిస్థాన్ వైపు నుంచి భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నవారి గురించి ఏం చెబుతారు? రాజ్యవర్థన్ సింగ్ : మన దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద ఆలోచనలకు ఆశ్రయమిచ్చే ఏ దేశానికైనా ఇదొక సందేశమనుకుంటున్నాను. మన ప్రజలు మన గడ్డపై ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, వారికి రక్షణ ఉంటుంది. అయితే అన్ని దేశాలతోనూ మనం ఎప్పుడూ స్నేహంగా ఉంటాం. కానీ అవసరమైతే దాడులు నిర్వహిస్తాం. అవసరమైతే శత్రువు గుండెపై దాడి చేస్తాం. అర్ణాబ్ : పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు, టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. పాకిస్థాన్‌కు ఇదొక సందేశమని చెప్తున్నారా? రాజ్యవర్థన్ సింగ్ : ఈ సందేశం అవసరమైన ప్రతివారికీ ఇదొక సందేశమే. ప్రశ్నిస్తే సందేశం ఇస్తాం. అర్ణాబ్ : నేను నిర్దిష్టంగా పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నాను. వాడివేడి కార్యక్రమాలకు పచ్చ జెండా ఊపే రాజకీయ నాయకత్వం మనకు ఇప్పుడు ఉంది, మయన్మార్‌కు తగిలిన సెగ నుంచి పాకిస్థాన్ ప్రభుత్వం సందేశాన్ని పొందాలా? రాజ్యవర్థన్ సింగ్ : మనకు చాలా సమర్థవంతమైన సైన్యం ఉంది. మనకు చాలా సామర్థ్యంగల నాయకుడు అవసరం. ఈ రెండూ మనకు ఇప్పుడు ఉన్నాయి. ఈ రెండిటితో సంతృప్తి చెందుతూ నేను నా పొరుగు దేశాల గురించి నిర్దిష్టంగా చెప్పాలనుకుంటే, పాకిస్థాన్ ఒకవేళ భారతదేశంలో అలాంటి దాడులకు ప్రయత్నిస్తే, కచ్చితంగా మాకు నచ్చిన సమయం, ప్రదేశంలో వాటిని తిప్పి కొడతాం. ఈ ఇద్దరు యాంకర్లు వేసిన ప్రశ్నల్లో మయన్మార్ తరహాలో పశ్చిమ సరిహద్దుల్లో దాడులు చేసే దమ్ము, సామర్థ్యం ఉన్నాయా? అనే ప్రశ్న లేదు. కానీ మనోహర్ పారికర్ చెప్పిన మాటల్లో ఆ ప్రశ్న కనిపిస్తోంది. దీంతో నెటిజన్లతో పాటు జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్లతో రంగంలోకి దిగారు. ఒమర్ అబ్దుల్లా శనివారం ఇచ్చిన ట్వీట్లో ‘‘ఓ న్యూస్ యాంకర్ ప్రశ్న పాకిస్థాన్‌తో పెద్ద సంఘర్షణకు పురిగొలపవచ్చు. ఇలాంటి నిర్ణయీకరణతో సురక్షితంగా ఉన్నట్లు భావించమనగలరా? అని మండిపడ్డారు. మరికొందరు ట్విటరాటీలు స్పందిస్తూ వాస్తవ ప్రయోజనం కన్నా మంత్రి అహం గొప్పదని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. మనోహర్ పారికర్ తన అహాన్ని తృప్తి పరచుకోవడానికే సర్జికల్ స్ట్రైక్స్ చేయించారని ఆరోపించారు. | nation |
1,313 | 23-09-2017 02:38:01 | దీపావళికి మార్కెట్లోకి రెనో క్యాప్చర్ | ధర రూ.15 లక్షలకన్నా తక్కువే!పనాజీ: రెనో ఇండియా తన ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ ‘క్యాప్చర్’ను శుక్రవారంనాడు ఆవిష్కరించింది. దీన్ని దీపావళికన్నా ముందు మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధర 15 లక్షల రూపాయలకన్నా తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ క్యాప్చర్.. జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్యువి, టాటా హెక్సాలకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని కంపెనీవర్గాలు చెబుతున్నాయి. వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేసినప్పుడే ఈ కారు ధరను వెల్లడిస్తామని రెనో ఇండియా సిఇఒ, ఎండి సుమిత్ సాహ్నే తెలిపారు. ఇది గ్లోబల్ కారు అని, ప్రీమియం విభాగంలో వస్తుంది కాబట్టి ఇప్పటికే మార్కెట్లో ఉన్న డస్టర్కన్నా ఎక్కువ ధర ఉంటుందని ఆయన చెప్పారు. కాంపాక్ట్ ఎస్యువి డస్టర్తోపాటు చిన్న కారు క్విడ్ ద్వారా రెనో భారత మార్కెట్లో వాటాను జోరుగా పెంచుకుంటోంది. వాస్తవానికి 2020నాటికి దేశీయ మార్కెట్లో 5 శాతం వాటాను సంపాదించుకోవాలన్నది రెనో లక్ష్యం. కానీ ఇప్పటికే ఈ లక్ష్యాన్ని చేరుకుంది. ఇక కొత్తగా మార్కెట్లోకి తెస్తున్న క్యాప్చర్‌లో 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఉంది. 210 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇది పరిశ్రమలోనే అత్యధికం. చెన్నై ప్లాంట్‌లో దీన్ని తయారు చేయనుంది. ఈ కారు బుకింగ్స్‌ను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. | business |
7,693 | 25-12-2017 12:09:36 | `అర్జున్‌రెడ్డి`ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో? |
చాలా చిన్న సినిమాగా మొదలై ట్రైలర్ విడుదలతోనే పెద్ద సినిమా తరహాలో ఆడియెన్స్ అటెన్షన్‌ను సంపాదించింది `అర్జున్‌రెడ్డి`. ఆ సినిమా విడుదల కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. వారి అంచనాలకు అనుగుణంగానే సినిమా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతో డైరెక్టర్, హీరో, హీరోయిన్, ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిన రాహుల్ ఓవర్‌నైట్ స్టార్లుగా మారిపోయారు. ఈ సినిమాను తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేసేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్‌కు ఈ కథ చెప్పారు. ఈ కథ నచ్చినా సినిమా చేసేందుకు మాత్రం రణ్వీర్ ముందుకు రాలేదట. దానికి కారణం సినిమా కంటెంట్ చాలా బోల్డ్‌గా ఉండడడమే. ఇప్పటికే బాలీవుడ్లో తీవ్ర వివాదాస్పదమైన `పద్మావతి` సినిమాలో రణ్వీర్ నటిస్తున్నాడు. `పద్మావతి` అంత వివాదాస్పదం కావడానికి సినిమాలో రణ్వీర్ పోషిస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రే కారణం. ఆ సినిమా వెంటనే `అర్జున్‌రెడ్డి` వంటి మరో వివాదాస్పద పాత్రలో నటించి మరింత వార్తల్లో కెక్కడం ఇష్టం లేక రణ్వీర్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. | entertainment |
7,055 | 11-05-2017 11:41:11 | ధనుష్ ‘వీఐపీ2’ విడుదల తేదీ ఖరారైంది | ధనుష్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ్లస్టర్ గా నిలిచిన ‘వేలై యిల్ల పట్టధారి’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘వీఐపీ2’ విడుదల తేదీ ఖరారైంది. ‘కబాలి’ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మాతగా సౌందర్య రజనీకాంత్ తెరకెక్కి స్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టును ధనుష్ పుట్టినరోజున నాడు అంటే జూన్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘వీఐపీ2’లో అమలాపాల్ హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ సుందరి కాజోల్ ముఖ్య పాత్ర పోషించారు. ధనుష్ నటించిన చివరి చిత్రం ‘తొడరి’ బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరచడంతో ‘వీఐపీ2’తో మరో బ్లాక్‌బస్టర్ అందుకుని హిట్ ట్రాక్ ఎక్కాలని ధనుష్ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బలమైన కథ, కథనాలతో చాలా భారీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. | entertainment |
3,860 | 28-12-2017 00:22:38 | జైలులో లాలూ! | విపక్షాలన్నింటినీ ఏకం చేస్తాను, వచ్చే ఎన్నికల్లో మోదీని కుప్పకూలుస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేసిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు జైలులో ఉన్నారు. దాణా కుంభకోణంలో ఆయనను దోషిగా నిర్థారించిన సీబీఐ న్యాయస్థానం ఆయన ఎంతకాలం జైలులో ఉండబోయేదీ కొత్తసంవత్సరంలో చెబుతుంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఆయనమీద ఉన్న ఆరోపణల్లో దియోగఢ్ ట్రెజరీ నుంచి ఎనభైలక్షల రూపాయలు ఉపసంహరించిన కేసు ఇది. తీర్పుకు ముందు లాలూ ధీమాగానే ఉన్నారు. వేలకోట్ల రూపాయల 2జీ కుంభకోణంలో ఇలాగే మరో సీబీఐ న్యాయస్థానం డీఎంకే పెద్దలను అప్పటికే నిర్దోషులుగా ప్రకటించి, కుంభకోణమే మిథ్య అని తేల్చేసింది కనుక, తాను నిర్దోషినని కోర్టు ప్రకటించడం ఖాయమని అనుకొని వుంటారు. కేసు సంగతి తేలగానే మరింత ఉత్సాహంగా బరిలోకి దిగి మోదీ–నితీశ్ భరతం పట్టవచ్చునని కలలుగని ఉంటారు. కానీ, ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సహా ఆరుగురిని వదిలేసిన ఇరవై నిముషాల్లోనే సీబీఐ కోర్టు తనను జైలుకు పంపుతుందని ఆయన ఊహించినట్టు లేదు. జైలుకు వెళ్ళడం లాలూకు కొత్తకాదు. దాణా కేసుల్లో పలుమార్లు జైలుకు పోయొచ్చిన ఆయన దోషిగా ఖరారుకావడం ఇది రెండోసారి. నాలుగేళ్ళక్రితం చాయ్‌బాసా జిల్లా కోశాగారం నుంచి నిధులు విడుదల చేసిన కేసులో ఆయనకు ఐదేళ్ళు శిక్షపడటంతో లోక్‌సభ సీటు పోగొట్టుకొని ఎన్నికల్లో పోటీకి అనర్హుడైపోయారు. ఆ తరువాత ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, తనమీద ఉన్న కేసుల్లో ఇంకా కొన్ని విచారణలో ఉన్నందున ఆయన ఇలా జైలుకుపోవడం రావడం ఇకపైనా తప్పకపోవచ్చు. కరువు బీహార్‌లో పశువులు పశుగ్రాసం లేక కన్నుమూస్తున్న నేపథ్యంలో, కేంద్రప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరంభించిన దాణా పథకం చివరకు నాయకుల, అధికారుల మేతకు దారితీసిన మాట వాస్తవం. సుమారు 900కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఉమ్మడి బీహార్‌లో జరిగిన ఈ భారీ కుంభకోణంలో ప్రతీ జిల్లా ఖజానా నుంచి సొమ్ము ఉపసంహరించిన విడివిడి కేసుల్లో తనను పలుమార్లు శిక్షించడం సరికాదని యాదవ్ సుప్రీంకోర్టులో వాదించారు. కుట్ర ఒకటే కావచ్చును కానీ, ప్రతీ ఉపసంహరణా అక్రమమని వేర్వేరుగా నిర్థారించి కారకులకు శిక్షలు పడాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చేయడం ఆయనకు పెద్ద దెబ్బ. గతంలో ఏకంగా ముఖ్యమంత్రి పదవినే వదులుకోవాల్సి వచ్చిన లాలూపై ఇప్పుడు ఒకటి కాదు, రెండు కేసులు ఉన్నాయి. పైకోర్టులు వీటినుంచి బయటపడేస్తే తప్ప ఎన్నికల బరిలోకి ప్రత్యక్షంగా దిగే అవకాశం ఆయనకు రాదు. గతంలో మాదిరిగా పార్టీని నిక్షేపంగా వదిలేసి జైలులో ఉండగలిగే పరిస్థితులు ఇప్పుడు ఆయనకు లేవు. నాలుగేళ్లక్రితం కేంద్రంలోనూ, జార్ఖండ్‌లోనూ మిత్రపక్షమే ఉన్నది కనుక జైలునుంచే ఆయన చక్రం తిప్పగలిగారు. ఇప్పుడు రెండు చోట్లా శత్రుపక్ష ప్రభుత్వాలే. జార్ఖండ్‌లోని బిర్సాముండా జైలుకు లాలూను కలవడానికి వచ్చేవారిని ఎవరినీ అనుమతించడం లేదు. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే పని గతంలో భార్య చూసుకుంటే, ఇప్పుడు కుమారులు ఆ పనిచేస్తున్నారు కానీ, పక్కలో బల్లెంలాగా ఉన్న నితీశ్‌ను, కాచుకొని కూర్చున్న మోదీనీ తట్టుకొని నిలబడే శక్తి వీరిద్దరికీ లేదు. లాలూ లేని ఆర్జేడీ చీలికలు పేలికలైపోయే ప్రమాదం హెచ్చుగా ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. బీహార్‌లో బలమైన ఓటు బ్యాంకుతో, అధికస్థానాలు నెగ్గుకొచ్చిన లాలూను ఆర్నెల్ల క్రితమే నితీశ్‌కుమార్ పెద్ద దెబ్బకొట్టి బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ప్రజలు తన పక్షాన ఉన్నప్పటికీ శత్రువులు ఒక్కటైన దశ ఇది. జైలుకెళ్లిన ప్రతీసారి లాలూ మరింత శక్తిమంతుడిగా తిరిగివచ్చి, ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నమాట నిజమే కానీ, మోదీ–నితీశ్ దోస్తీ నేపథ్యంలో, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన కార్యక్షేత్రానికి ఎంతకాలం దూరంగా ఉంటే, పార్టీ అంత వేగంగా బలహీనపడుతుందన్న మాట వాస్తవం. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో ఈ ‘మహాగడ్బంధన్’ సృష్టికర్త, సారధి నిష్ణాతుడైనందువల్లనే రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టుల కేసును కూడా కేంద్రం ఆయనపై రుద్దిందన్న వాదనలో నిజం ఉండివుండవచ్చు. కానీ, ఇరవైయేళ్ళనాటి దాణా కుంభకోణం ఆయన చేజేతులా చేసుకున్న పాపం. అది ఇప్పటికీ వెంటాడుతూ రాజకీయ భవిష్యత్తును అంధకారంలో ముంచుతున్నది. కానీ, ఇదే శిక్ష అవినీతికి పాల్పడిన అందరి నాయకులకూ పడుతున్నదా? అన్నదే ప్రశ్న. స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో సుప్రీంకోర్టుకు అక్రమం అనిపించినది సీబీఐ కోర్టుకు ఏమీ జరగనట్టుగానే కనిపించింది. లాలూ తీర్పుకు కొద్దిముందుగా వెలువడిన ఈ తీర్పుతో పాటు న్యాయమూర్తి సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్లపై చేసిన వ్యాఖ్యలు దేశప్రజలను నిర్ఘాంతపరచి, ప్రభుత్వ ఏజెన్సీలపై అనుమానాలను పెంచాయి. ఒకపక్క దేశాన్ని కుదిపేసిన నరమేథాల కేసుల నుంచి కూడా స్వపక్షీయులు నిక్షేపంగా బయటపడుతుంటే, మరొకవైపు విపక్షీయులపై ఈ సంస్థలు విరుచుకుపడుతూ, కేసులు పెడుతూ వేటాడుతున్న పరిస్థితి నేడున్నది. పాలకులు తమకు గిట్టనివారి విషయంలో సకల వ్యవస్థలనూ ఎంతో సమన్వయంతో, నైపుణ్యంతో పనిచేయిస్తున్నారని ప్రజలకు అనిపించడం వ్యవస్థలపై వారికున్న విశ్వాసాన్ని దిగజార్చుతుంది. | editorial |
6,551 | 01-09-2017 19:47:51 | బాలయ్యబాబుకు పైసలమాల | హైదరాబాద్: నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్తసినిమా 'పైసా వసూల్' తాజాగా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. భారీ అంచనాలనడుమ ఈ రోజే (సెప్టెంబర్ 1న) విడుదలైన ఈసినిమాకు బాలయ్య అభిమానులు బ్రహ్మరథం పట్టారు. క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అన్నిసెంటర్లలో పండుగ వాతావరణం కనిపించింది. అన్నిచోట్లా భారీ కటౌట్లు దర్శనమిచ్చాయి. కాగా ఈ కటౌట్లలో ఓ కటౌట్ మాత్రం డిఫరెంట్‌గా పైసలతో కనిపించింది. 'పైసావసూల్' సినిమా పోస్టర్లో బాలయ్యబాబుకు పైసలమాల వేశారు. అదికూడా మొత్తం 500 , 2000 రూపాయలనోట్లతోనే. మంజు థియేటర్ వద్ద కనిపించిన ఈ పోస్టర్‌ను బాలయ్య అభిమాని ఒకరు ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ 'జై బాలయ్య' అనే హాష్టాగ్ పెట్టాడు. ఈ ట్వీట్ చూసిన చార్మీ వెంటనే ఆ పోస్టర్‌ను రీట్వీట్ పెట్టి అందరితో పంచుకుంది. | entertainment |
20,019 | 17-09-2017 01:26:55 | సెహ్వాగ్‌వి మూర్ఖపు వ్యాఖ్యలు | కోల్‌కతా: బోర్డు పెద్దలతో సాన్నిహిత్యం లేనందునే భారత జట్టు కోచ్ పదవి తనకు దక్కలేదని సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ గంగూలీ స్పందించాడు. ‘అతడి వ్యాఖ్యలు మూర్ఖంగా ఉన్నాయి’ అని అభిప్రాయపడ్డాడు. అంతకుమించి అతడి వ్యాఖ్యలపై తాను స్పందిం చేదేమీ లేదన్నాడు. కోచ్‌గా రవిశాస్ర్తిని ఎంపిక చేసిన ముగ్గురు సభ్యుల సలహా కమిటీలో గంగూలీ ఒకడన్న సంగతి తెలిసిందే. | sports |
7,671 | 16-05-2017 11:41:46 | ‘జై లవకుశ’ ఫస్ట్‌లుక్ ఎప్పుడో తెలుసా? | యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘జైలవకుశ’. ఈ సినిమాలో ఎన్టీయార్ మూడు పాత్రల్లో కనిపించడమే కాదు.. మొదటి సారి విలన్‌గా కూడా నటిస్తున్నాడు. అలాగే మరో రోల్లో డ్యాన్స్ మాస్టర్‌గా కనిపించనున్నాడు. ఎన్టీయార్ అభిమానులకు విందు భోజనంలాంటి ఈ సినిమా ఫస్ట్‌లుక్ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 19న ఎన్టీయార్ జన్మదినం. ఆ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఎన్టీయార్ ఆర్ట్స్ బృందం. బాబీ దర్శకత్వంలో రూపొందుతన్న ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. | entertainment |
4,918 | 01-03-2017 13:01:51 | ఆ రెండు సినిమాలూ నేను రిజెక్ట్ చేయలేదు: రాజ్‌తరుణ్ | ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో తెలుగు సినీ రంగప్రవేశం చేసిన రాజ్‌తరుణ్ చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కుమారి 21ఎఫ్’, ‘ఈడోరకం.. ఆడోరకం’ సినిమాలతో విజయాలు అందుకున్నాడు. అయితే ఇటీవలి కాలంలో ఆయన సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. నిజానికి ‘శతమానం భవతి’, ‘నేను లోకల్’ సినిమాలు రాజ్‌తరుణ్ చేయాల్సినవేనని, ఆ కథలు నచ్చక రిజెక్ట్ చేశాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తల గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు రాజ్‌తరుణ్. | entertainment |
3,894 | 24-09-2017 23:35:08 | గురజాడ పురస్కారాలు |
జగత్పూర్ణ విద్యా సమాజం, కురుపా వారి 2017 గురజాడ పురస్కారాలు అక్టోబర్ 2 ఉ.10గం.లకు విశాఖ పౌర గ్రంథాలయం (మినీహాలు), ద్వారకా నగర్, విశాఖపట్నంలో జరుగుతుంది. ప్రధాన అతిథి కె.ఎస్.చలం, విశిష్ట అతిథి వి.ఉమామహేశ్వరరావు, అధ్యక్షులు చందు సుబ్బారావు. పురస్కార గ్రహీతలు చింతకింది శ్రీనివాసరావు, వెలుగు రామినాయుడు.- శ్యామ్ సుందర్ | editorial |
8,017 | 15-05-2017 15:37:28 | అమలాపాల్ సెటైర్స్ వెనక ఆంతర్యం ఏమిటి? | ఈ మధ్యకాలంలో కాస్త స్పీడ్ తగ్గించిన ఆ కేరళకుట్టి.. తీరిగ్గా కూర్చొని హాలీవడ్ స్టార్‌పై సెటైర్లు వేస్తోందట. ఇంతకూ అంత తీరిగ్గా ఉన్న ఆ సుందరాంగి ఎవరంటారు?.. భర్తతో విడిపోయిన దగ్గర నుంచి తిరిగి లైమ్ లైట్లోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు అమలాపాల్. ఆఫర్ల పరంగా రెండు అడుగులు అడుగు ముందుకేస్తుంటే... నాలుగు అడుగులు వెనక్కు వేస్తోంది అమ్మడు. ఆ మధ్య ధనుష్ సరసన 'వీఐపీ 2'లో నటించే ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. దీంతో కాస్త తీరికెక్కువైపోయిందట అమ్మడికి. ధనుష్ మూవీ చేజారిపోయినా... ఆఫర్ల వేటలో ఎక్కడా వెనక్కు తగ్గని అమలాపాల్... మరోవైపు జనాల దృష్టిలో ఉండేందుకు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతోంది. ఇందులో భాగంగానే... ఇటీవలే ఇండియా వచ్చిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌పై సెటైర్లు వేసింది అమ్మడు. చేతిలో పక్షులతో దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన అమలాపాల్.. బీబర్ కన్నా ఇవే బాగా పాడతాయని ట్వీట్ చేసింది. జస్టిన్ బీబర్ ముంబైలో నిర్వహించిన కాన్సర్ట్... ఎంతో మందిని ఉర్రూతలూగించినా... కొందరిని నిరాశపరచింది. కేవలం లిప్ సింక్‌తో పనికానిచ్చేసిన బీబర్ అభిమానులను నిరుత్సాహపరిచాడు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన సెలబ్రిటీలకు సరైన సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేయలేదన్న సంగతి తెలిసిందే... ఇదే విధంగా అమలాపాల్ కూడా బీబర్ కాన్సర్ట్‌కు వెళ్లి తిరిగివచ్చేసిందని తెలుస్తోంది. ఆ బాధతోనే అమ్మడు ఇలా పాప్‌స్టార్‌పై అక్కసు వెళ్ళగక్కిందట. మరి తీరిక ఎక్కవైపోయిన అమలను ఇకనైనా దర్శక-నిర్మాతలు కరుణిస్తారేమో చూడాలి. | entertainment |
578 | 02-07-2017 23:57:12 | పెరిగే అవకాశం | (జూలై 3-7 తేదీల మధ్య వారానికి)గత వారం నిఫ్టీ : 9521 (-54) నిఫ్టీ గత వారం 9449-9615 మధ్యన కదలాడి 54 పాయింట్ల నష్టంతో (0.6 శాతం) వారం మధ్య స్థాయిలో 9521 వద్ద కాస్తంత నెగిటివ్ దృక్పథంతో ముగిసింది. కీలక మద్దతు స్థాయి 9525ని బ్రేక్ చేసినందువల్ల 9500 ప్రధాన మద్దతు స్థాయిగా మారింది. మంగళవారం ట్రెండ్ మార్పునకు అవకాశం ఉన్న రోజు. స్వల్పకాలిక ధోరణి స్వల్ప బేరిష్ మొగ్గుతో తటస్థంగా మారింది. అయితే మధ్య, దీర్ఘకాలిక ధోరణులు రెండింటిలోనూ బుల్లిష్ గానే ఉంది. 9525 దిగువన ముగిస్తే బేరిష్ అవుతుంది.20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 9607, 9483, 9238, 8827 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. ప్రస్తుతం 20 డిఎంఏ కన్నా దిగువకు వచ్చింది.నిఫ్టీ 200, 50 డిఎంఏల కన్నా పైన ఉండడం, 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం (గోల్డెన్ క్రాస్) దీర్ఘకాలిక ట్రెండ్ బుల్లిష్ అయిందనేందుకు సంకేతం. 200, 50 డిఎంఏల కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక ట్రెండ్ కూడా బుల్లిష్ అయిందనేందుకు సంకేతం.వారానికి బ్రేకౌట్ స్థాయి : 9670. బ్రేక్‌డౌన్ స్థాయి : 9450నిరోధ స్థాయిలు : 9675, 9750 (9600 పైన బుల్లిష్)మద్దతు స్థాయిలు : 9375, 9300 (9450 దిగువన బేరిష్)ఇన్వెస్టర్లకు సూచనవారం ప్రారంభ స్థాయి అత్యంత కీలకం. ఇండెక్స్ గత వారం ప్రారంభ స్థాయి కన్నా పైన ట్రేడవుతూ ఉంటే లాంగ్ పొజిషన్లను పరిశీలించవచ్చు. - డా. భువనగిరి అమర్ నాథ్ శాస్త్రీ | business |
16,343 | 09-05-2017 14:55:51 | నగ్నంగా బాలుడి ఊరేగింపు.. హనుమంతరాయుడికి వింత మొక్కు! |
ఆంధ్రజ్యోతి, బెంగళూరు: కర్ణాటక మండ్యజిల్లా పాండవపుర తాలూకా డింకా గ్రామంలో నిచ్చెన హనుమంతరాయుడికి మొక్కు తీర్చుకునేందుకై బాలుడిని నగ్నం గా ఊరేగించి సంబరం జరిపిన ఉదంతం ఇది. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకొచ్చింది. డింకా గ్రామంలో ఏటా నిచ్చెన హనుమంతరాయస్వామి పేరిటి పండుగ జరిపే సంప్రదాయం ఉంది. అందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి బాలుడిని తీసుకువచ్చి స్నానం చేయించి తర్వాత నగ్నంగా ఎనిమిది అడుగుల ఎత్తుకలిగిన నిచ్చెనకు కట్టివేస్తారు. పూలమాలలు వేసి బాలుడిని ఆలయం నుంచి గ్రామమంతటా ఊరేగిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా గ్రామానికి చెందిన బి.కె. రుద్రశేఖర్ దంపతులకు చెందిన 8ఏళ్ళ బాలుడిని అలంకరించి కేరింతలు కొడుతూ ఊరేగించారు. డప్పులకు అనుగుణంగా నృత్యాలు చేశారు. బాలుడిని హనుమంతరాయ రూపంగా భావించి కొలిచారు. మహిళలు బాలుడికి పూజలు జరిపి మొక్కులు తీర్చాలని వేడుకోవడం ప్రత్యేకం. ఆ సమయంలో బాలుడు ఏమి చెబితే అది జరుగుతుందనే నమ్మకం కూడా ఉంది. బాలుడి మూత్రాన్ని సేకరించి జనంపై చల్లుతారు. ఏటా పండుగకు ముందుగానే బాలుడిని ఎంపిక చేసి కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామస్తులు కులమతాలకు అతీతంగా పాల్గోనడం విశేషం. | nation |
18,452 | 17-03-2017 01:22:51 | తల్లి శవంతో 3 రోజులుగా చిట్టి తల్లి! | ఈస్ట్ హార్ట్ఫోర్డ్, మార్చి 16: అది అమెరికాలోని ఈస్ట్ హార్ట్ఫోర్డ్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటు. అందులోని ఓ ఫ్లాట్‌లో 37 ఏళ్ల మహిళ చనిపోయి ఉంది. ఆ విషయం తెలియని ఆమె మూడేళ్ల బిడ్డ పక్కనే ఒంటరిగా దిగాలుగా కూర్చుంది. తల్లి నిద్రిస్తోందని అనుకుంటున్న ఆ చిట్టి తల్లి అమ్మ లేస్తుందని, తనకు తిండిపెడుతుందన్న ఆశతో 3రోజులగా ఎదురుచూస్తోంది. కానీ, తల్లి మరణించిన విషయం ఏం తెలుసు పాపం! ఆకలి తీర్చుకోడానికి ఆ గదిలో కిందపడి ఉన్న చిరుధాన్యాలను తింటూ నీరసించిపోయింది. కొన్ని రోజుల నుంచి చైల్డ్‌కేర్‌కు ఈ బిడ్డ వెళ్లకపోవడంతో... కారణం తెలుసుకుందామని ఇంటికి వచ్చిన నిర్వాహకురాలు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ మృతికి కారణాలపై వారు దర్యాప్తు చేస్తున్నారు. | nation |
18,860 | 13-04-2017 11:53:55 | మోదీకి చెక్ చెప్పిన కర్ణాటక సీఎం | బెంగళూరు : కర్ణాటకలో రెండు శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నంజంగడ్ నుంచి కేశవమూర్తి, గుండ్లుపేట్ నుంచి గీత మహదేవ ప్రసాద్ గెలిచారు. ఈ ఫలితాలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజనానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అడ్డుకట్ట వేసినట్లయిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్, జార్ఖండ్‌లోని లితిపర, కర్ణాటకలోని నంజంగుడ్, గుండ్లుపేట్, రాజస్థాన్‌లోని ధోల్పూర్, పశ్చిమ బెంగాల్‌లోని కంతి దక్షిణ్, మధ్యప్రదేశ్‌లోని అటెర్, బాంధవ్ గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లోని భోరంజ్, అస్సాంలోని ధీమజి స్థానాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. | nation |
5,976 | 22-03-2017 23:00:08 | పల్లె అందాల పరవళ్లు... |
దర్శకుడు సుకుమార్ ఈ సారి పల్లెటూరి అందాలను తన చిత్రంలో చూపించనున్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా ఆయన ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’ చిత్రాలను తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తోంది. ఈ నెలాఖరు నుంచి పల్లెటూరికి సంబంధించిన సన్నివేశాలనుచిత్రీకరించనున్నారు. చరణ్, సమంతతో పాటు జగపతిబాబు, రావు రమేశ్, నరేశ్ తదితరులు షూటింగ్లో పాల్గొంటారు. రెండు పాటలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మాతలు. కెమెరా: రత్నవేలు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్. | entertainment |
12,819 | 11-03-2017 02:29:51 | మన పని ‘ఔటే’! | (హైదరాబాద్ సిటీ-ఆంధ్రజ్యోతి): అమెరికా ఉద్యోగాల ‘ఔట్ సోర్సింగ్’కు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లు మన హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్లు పాసైతే నగర ఐటీ రంగ ముఖచిత్రం సమూలంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. నిజానికి భారత ఐటీ ఎగుమతులు అమెరికా మీదనే ఎక్కువగా ఆధారపడి జరుగుతున్నాయి. మన ఎగుమతుల్లో దాదాపు 60ు అక్కడికే. ఇక, ఔట్సోర్సింగ్ పరంగా అంతర్జాతీయంగా 55ు వాటా మనదే అని నాస్కామ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆ బిల్లు పాసైతే హైదరాబాద్‌కు జరిగేది ఆర్థిక నష్టం మాత్రమే కాదని.. దానివల్ల కోల్పోయే ఉద్యోగాలను పరిగణలోకి తీసుకుంటే 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లేనని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఐటీ ఎగుమతుల పరంగా దేశంలో రెండో స్థానంలో ఉండటమే కాదు.. వృద్ధి రేటు పరంగా అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌కు ఎన్నో దిగ్గజ కంపెనీలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిలో అత్యధికం.. ఔట్సోర్సింగ్ కంపెనీలుగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో దాదాపు 5 వేలకు పైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నాయని అంచనా. భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతులు 110 బిలియన్ డాలర్లుగా ఉంటే ఒక్క హైదరాబాద్ నుంచి 87 వేల కోట్ల రూపాయల ఎగుమతులు ఐటీ, ఐటీఈఎస్ పరంగా ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో ఈ ఎగుమతులను రెట్టింపు చేయడంతో పాటుగా.. 4 లక్షల ఐటీ ఉద్యోగుల సంఖ్యను 10 లక్షలకు చేర్చేందుకు కృషి చేస్తామని తెలంగాణ ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ పలు సందర్భాలలో అన్నారు. కానీ ఇప్పుడు ఆ అంచనాలన్నీ తలకిందులయ్యే ప్రమాదం అధికంగా ఉందన్నది ఐటీ నిపుణుల మాట. నాస్కామ్ది సైతం ఇదే అంచనా. ట్రంప్ చెప్పినట్లుగా అన్నీ చేస్తే.. అంటే హెచ్1బీ వీసాలను ఆపేయడం, ఔట్‌సోర్సింగ్‌పై కొరడా ఝుళిపించడం, అమెరికన్లకే తొలి ప్రాధాన్యం వంటివాటిని అమలు చేస్తే ఇండియాలో 25 లక్షల మంది ఉద్యోగులపై ప్రత్యక్షంగా.. 2కోట్ల మందిపై పరోక్షంగా ప్రభావం పడుతుందని హైదరాబాద్ ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.తాజా పరిణామాల నేపథ్యంలో.. అమెరికాలో అమల్లోకి రానున్న కఠిన నిబంధనలు, ఫీజుల పెంపు వంటివి కంపెనీలకు తలకు మించిన భారం కాబోతున్నాయి. ఇన్ఫోసి్‌సలాంటి కంపెనీలు.. ఈ నిబంధనలు తమ మార్జిన్స్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఇప్పటికే చెబుతున్నాయి. దీనివల్ల కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. మన ఔట్సోర్సింగ్ పరిశ్రమకు స్వల్పకాలంలో నష్టం కలిగించినా తమను తాము పునర్విచించకోవడానికి లభించిన అవకాశంగానే పేర్కొనాలంటున్నారు సాఫ్ట్వేర్ రంగ నిపుణుడు వివేక్‌వర్మ. కేవలం అమెరికా మీద మాత్రమే ఆధారపడకుండా ఇతర దేశాలలో కూడా మనకున్న అవకాశాలను వెతకాల్సిన ఆవశ్యకత ఉందని ఇండియా సాఫ్ట్ చైర్మన్ నళిన్ కోహ్లీ అంటున్నారు.- సౌదామిని, కాన్ఫెడరేషన్ ఆఫ్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పూర్వ చైర్పర్సన్ అమెరికన్ల వాదన ‘‘ప్రపంచం మొత్తం వాడుతున్న సాఫ్ట్వేర్లన్నీ రాసింది మనోళ్లే. డాస్, విండోస్, ఐవోఎస్.. అన్నీ మనవే. ఫేస్బుక్, గూగుల్ మనవే! మరి లక్షలాది మంది ప్రోగ్రామర్లు.. డెవలపర్లు ఉన్నారని చెబుతున్న ఇండియా నుంచి వచ్చిన విప్లవాత్మక సాఫ్ట్వేర్లు ఏమున్నాయ్? ఐబీఎం, మైక్రోసాఫ్ట్, ఎసెంచర్ లాంటి ఎన్నో కంపెనీలు వేలాది మంది భారతీయులకు ఉద్యోగాలిస్తున్నాయి. ఈ కంపెనీలేవైనా భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్ల సహాయంతో విప్లవాత్మక ఆవిష్కరణ చేశామని ప్రకటించాయా? నలుగురు భారతీయ డెవలపర్లు చేసే పని ఒక్క అమెరికన్ చేయగలడు. ఇక ఔట్‌సోర్స్ చేయాల్సిన అవసరమేముంది’’ ..ఇదీ అమెరికన్ యూనివర్సిటీల్లో నడుస్తున్న చర్చ. వాట్సప్, ఫేస్బుక్ పోస్టుల రూపంలో విస్తృతంగా ప్రచారంలోకొస్తున్న వాదన. దీనికి మన సాఫ్ట్వేర్ నిపుణులు ఏం సమాధానం చెబుతారో!? యుఎస్ కంపెనీలపై ప్రభావం ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేయించుకునే అమెరికా కంపెనీలపై ఆదాయపరంగా తక్షణ ప్రభావం కనిపిస్తుంది. అమెరికాలో స్థానికంగా ఉద్యోగాల లభ్యత పెరుగుతుంది. కానీ ఆ అవసరాలను తీర్చే ప్రతిభావంతులు అక్కడ దొరకడం కష్టమే. ఈ డిమాండ్ తీర్చడానికి మరలా విదేశీయులను ఆహ్వానించాల్సిందేనన్నది అక్కడి నిపుణుల మాట. సాఫ్ట్వేర్, సర్వీసెస్ ధరలుపెరగవచ్చు. ఇది మనకూ నష్టమే. అమెరికా కంపెనీలు తమ ఐటీ ఇన్వె్‌స్టమెంట్లను తగ్గించవచ్చు. దీనివల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చు. ఇండియన్ కంపెనీలపై ప్రభావం.. స్వల్పకాలంలో ఇండియన్ ఐటీ/బీపీఓ కంపెనీలు భారీగా నష్టపోతాయి. దాదాపు 60 శాతం రెవెన్యూ నష్టపోయే ప్రమాదం ఉంది. ఆదాయ నష్టం వల్ల ఉద్యోగాలలో భారీ కోతలూ పెట్టవచ్చు. నూతన ఉద్యోగాలూ ఉండవు. పరోక్షంగా భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద కూడా భారం అధికంగా పడుతుంది. | nation |
4,538 | 19-06-2017 00:23:50 | ‘ఆలోచన చేద్దామా!’ |
అనంతోజు మోహన్ కృష్ణ కవితా సంపుటి ‘ఆలోచన చేద్దామా!’ ఆవి ష్కరణ సభ జూన్ 25 సా.5గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైద రాబాద్ నందు జరుగుతుంది. జి.యా దగిరిరావు, ఎస్.వీరయ్య, తెలకపల్లి రవి, సుధామ, కొండేపూడి నిర్మల, కె.ఆనందాచారి, ఆర్.రమేష్ పాల్గొం టారు.- తెలంగాణ సాహితి | editorial |
16,324 | 25-02-2017 00:39:32 | 11 గంటల్లో 2.5 లక్షల డాలర్లు | శ్రీనివాస్ మృతదేహాన్ని భారతకు చేర్చేందుకు ‘గోఫండ్‌మి’లో సాయం కోరిన స్నేహితులు శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహాన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు అవసరమైన ఖర్చుల కోసం అతడి స్నేహితులు ‘గోఫండ్‌మి’సైట్లో ఓ పేజీ క్రియేట్ చేశారు. వారి అభ్యర్థనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. పేజ్ క్రియేట్ చేసిన 8 గంటల వ్యవధిలోనే దాదాపు కోటి రూపాయలు (లక్షన్నర డాలర్లు) పోగయ్యాయి. మరో మూడు గంటలు గడిచేసరికి.. అంటే 11 గంటల్లో ఆ మొత్తం 2.5 లక్షల డాలర్లకు (దాదాపు రూ.1.66 కోట్లు) చేరింది. కాగా.. కాల్పులకు పాల్పడిన ఆడమ్ ప్యూరిన్టన్‌ను అడ్డుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన మూడో బాధితుడు ఇయాన్ గ్రిల్లోట్ సోదరి మాగీ ఈ పేజీలో కామెంట్ చేశారు. ‘‘నా సోదరుడు (ఈ ఘటనలో) మూడో బాధితుడు. శ్రీనివాస్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. మీ కుటుంబం కోసం సాయం చేయాలని నా సోదరుడు అనుకుంటున్నాడు’’ అని ఆమె వ్యాఖ్యానించింది. | nation |
12,842 | 30-12-2017 02:52:23 | విజయానికి సమయం చాలాముఖ్యం | ‘‘రాజకీయాలైనా, సినిమా అయినా, మరే రంగమైనా విజయానికి అనుకూలమైన సమయం అవసరం. సినీ రంగంలో విజయవంతమైన ఎంజీఆర్, శివాజీగణేశన్ లను చూసి నేర్చుకోవాల్సినది చాలాఉంది. కోయంబత్తూరు జిల్లా అభిమానులతో ఫోటోలు దిగడం సంతోషంగా ఉంది. నా ఆధ్యాత్మిక గురువు సచ్చిదానంద అక్కడివారే. ‘బాబా’ తీయాలన్నవారిలో ఆయన కూడా ఒకరు’’- చెన్నైలో తన అభిమానులతో ఫొటో సెషన్లో రజనీకాంత్ | nation |