SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
13,459
10-04-2017 21:32:31
పాక్ మరణ శిక్ష విధించిన.. కుల్‌భూషణ్ జాదవ్ ఇంటికి తాళం
ముంబై: పాకిస్థాన్ మరణ శిక్ష విధించిన భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాదవ్ ఇంటికి తాళం వేసి ఉంది. పాక్ మిలిటరీ కోర్టు సోమవారం ఆయనకు మరణ శిక్ష విధించినట్లు తెలియడంతో ముంబైలోని జాదవ్ అపార్ట్‌మెంట్‌కు పోలీసులు, మీడియా సిబ్బంది భారీగా తరలివచ్చారు. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులు ఆ ఇంటిని ఖాళీ చేసి పూణెకు వెళ్ళిపోయారని, చాలా కాలంగా అది లాక్ వేసి ఉందని స్థానికులు తెలిపారు.
nation
10,993
06-12-2017 17:23:11
'హలో' పై అక్కినేని నాగార్జున లైవ్..
అక్కినేని అఖిల్ 'హలో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అఖిల్ నటించిన మొదటి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాను ఛాలెంజింగ్ తీసుకున్నాడు అఖిల్. నాగార్జున కూడా ఈ సినిమా స్టోరీ నుంచి ప్రతీ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పటికే 'హలో' మూవీ ట్రైలర్ రిలీజ్ అయి బాగా ఆకట్టుకుంది. తాజాగా సినిమాలోని ఓ వెడ్డింగ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. హోమ్లీగా.. చాలా అందంగా ఆ సాంగ్‌ని డిజైన్ చేశారు. అఖిల్‌తో పాటు హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కూడా చాలా అందంగా కనిపించారు. పాటలో రమ్యకృష్ణ, జగపతిబాబు కూడా బాగా ఆకట్టుకున్నారు. ఆ సందర్బంగా అక్కినేని నాగార్జున మీడియా ముందుకు వచ్చి సినిమా విశేషాలు పంచుకుంటున్నాడు. ఆ లైవ్ మీ కోసం..
entertainment
18,610
04-02-2017 22:53:46
బ్రేకింగ్ న్యూస్... ట్రంప్ నిషేధాజ్ఞల అమలు నిలిపివేత
వాషింగ్టన్ : ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల అమలును అధికార యంత్రాంగం నిలిపివేసింది. నిషేధాజ్ఞలను సియాటల్ జిల్లా కోర్టు రద్దు చేస్తూ.. దేశమంతటా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. శుక్రవారం పొద్దుపోయాక కోర్టు ఆదేశాలు వెలువడగా.. శనివారం నుంచి వాటి అమలుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. వీసాలు ఉన్న వ్యక్తులు రాకపోకలు సాగించవచ్చని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. వారం కిందట వెలువడిన ట్రంప్ వివాదాస్పద ఆదేశాలతో ఆ దేశంతో పాటు వివిధ దేశాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ట్రంప్ మాత్రం కోర్టు ఆదేశాలను కొట్టిపారేశారు.
nation
934
26-05-2017 00:06:52
హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం రూ.15 కోట్లు
ఒక్కో షేరుకు 40 శాతం డివిడెండ్‌హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెరిటేజ్‌ ఫుడ్స్‌.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో 14.69 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 18.09 కోట్ల రూపాయలుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం రాబడులు 613.37 కోట్ల రూపాయల నుంచి 677.35 కోట్ల రూపాయలకు పెరిగాయని హెరిటేజ్‌ ఫుడ్స్‌ తెలిపింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లాభం 22 శాతం వృద్ధితో 55 కోట్ల రూపాయల నుంచి 67 కోట్ల రూపాయలకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో మొత్తం రాబడులు కూడా 11 శాతం పెరిగి 2,381 కోట్ల రూపాయల నుంచి 2,643 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో 10 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు 4 రూపాయల (40 శాతం) డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. రిటైల్‌, అగ్రి, బేకరీ వ్యాపారాలను ఫ్యూచర్‌ రిటైల్‌కు బదలాయించటంతో జనవరి-మార్చి త్రైమాసికంలో స్టాండ్‌ ఎలోన్‌ ఫలితాలను సరిపోల్చలేమని కంపెనీ తెలిపింది. అంచనాలకు తగ్గట్టుగానే... అంచనాలకు తగ్గట్టుగా కంపెనీ ఫలితాలు ఉన్నాయని, మొత్తం పోర్టుఫోలియోలో విలువ ఆధారిత ఉత్పత్తుల వాటాను పెంచుకోవటంతో రెండంకెల వృద్ధిని సాధించినట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రాహ్మణి నారా తెలిపారు. కంపెనీ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంవత్సరంలో ఉత్తరాది మార్కెట్లోకి అడుగుపెట్టామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ముంబై, పుణె మార్కెట్లలో పనితీరు అద్భుతంగా ఉందని, రానున్న సంవత్సరాల్లో ఉత్తరాది మార్కెట్లో ఇదే జోష్‌ను కనబరుస్తామని బ్రాహ్మణి తెలిపారు. రిటైల్‌ వ్యాపారాన్ని ఫ్యూచర్‌ రిటైల్‌కు బదలాయించటంతో సమీప భవిష్యత్తులో మరింత మెరుగైన వృద్ధిని కనబరచవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆమె చెప్పారు. రిటైల్‌ నుంచి తప్పుకోవటంతో కీలక వ్యాపారమైన డెయిరీపై మరింతగా దృష్టి పెట్టే అవకాశం లభించిందని అన్నారు. క్యాప్టివ్‌ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ అనంతపురం జిల్లాలో 2.1 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుదుత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ తెలిపింది. గురువారం బిఎ్‌సఇలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేరు 4.43 శాతం నష్టంతో 1,114.15 రూపాయల వద్ద స్థిరపడింది.
business
7,751
07-12-2017 11:43:13
ఆసియా సెక్సీయస్ట్ విమెన్‌గా ఐదోసారి ప్రియాంకచోప్రా
లండన్ : ఆసియా సెక్సీయస్ట్ విమెన్‌గా ఐదోసారి బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకచోప్రా నిలిచింది. లండన్ నగరానికి చెందిన ఓ పత్రిక నిర్వహించిన పోలింగులో మొదటిస్థానాన్ని సంపాదించి మరోసారి వార్లల్లోకెక్కింది. 'క్వాంటికో' సీరిస్‌‌లో ప్రియాంక గ్లామర్‌ డోస్‌ పెంచి మరోసారి యువత మదిని దోచుకుంది. రెండోస్థానంలో టీవీ నటి నియాశర్మ, మూడోస్థానంలో బాలీవుడ్ నటి దీపికాలు నిలిచారు. ఈ జాబితాలో పాక్ నటి మహిరాఖాన్, అలియా భట్ లకు స్థానం లభించింది.
entertainment
14,556
27-11-2017 10:30:12
దినకరన్‌కు టోపీ లభించేనా?
చెన్నై: పార్టీలో, పాలనలో పూర్తిగా పట్టుకోల్పోయి, చివరకు చేతికంది వస్తుందన్న రెండాకుల గుర్తు సైతం చేజారిపోవడంతో అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు టీటీవీ దినకరన్‌ ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో పోటీకి సమాయత్తమవుతున్నారు. ఈ ఎన్నికల్లో తాను తప్ప కుండా టోపీ గుర్తుపై పోటీ చేస్తానని ఇటీవలే ఆయన ప్రకటించారు. గత ఏప్రిల్‌లో ఆర్కేనగర్‌ ఎన్నికల్లో రెండాకులను ఎన్నికల సంఘం స్తంభింపజేయడంతో అధికార పార్టీ తరఫున దినకరన్‌ టోపీ గుర్తుపై పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో గెలిచి ఉంటే దినకరన్‌ పార్టీలో, పాలనలోపట్టు సాధించి ఉండేవారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పేరును సైతం వాడుకోలేని నిర్బంధంలో ఉన్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన ఆర్కేనగర్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడి ఓటర్లకు బాగా పరిచయమైన టోపీ గుర్తుపై స్వతంత్య్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆ టోపీ గుర్తు కూడా దినకరన్‌కు అందని ద్రాక్షపండే అవుతుందని తెలుస్తోంది. ఈ విషయమై ఎన్నికల సంఘం అధికారి ఒకరు మాట్లాడుతూ దినకరన్‌ కొత్త పార్టీని ప్రారంభించి ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంటే ఆ పార్టీ పేరును నమోదుచేస్తుందని, అయితే ఆ పార్టీ ఎన్నికల సంఘం జాబితాలోని గుర్తులలోని ఓ గుర్తును ప్రత్యేకించి కావాలని డిమాండ్‌ చేయాలంటే ఆ పార్టీ కనీసం 12 నియోజకవర్గాలలో పోటీ చేయాల్సి ఉంటుందన్నారు.  ప్రస్తుతానికి దినకరన్‌ కొత్త పార్టీని ప్రారంభించే పరిస్థితులలో లేరని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇండిపెండెంట్‌గా ఆర్కేనగర్‌లో ఆయన పోటీకి దిగి తనకు టోపీ గుర్తు కావాలని అడిగినా ఆ గుర్తును ఇతర అభ్యర్థులు ఎవరూ కోరకుంటేనే లభిస్తుంది. అలా కాకుండా ఇద్దరి కంటే అధికంగా అభ్యర్థులు టోపీ గుర్తు కోసం పట్టుబడితే వారి పేర్లున్న చిట్టీలను లాటరీ వేసి గుర్తును కేటాయిస్తారు. అంటే అభ్యర్థుల అదృష్టాన్ని బట్టి ఆ గుర్తు లభిస్తుంది. ఈ అంశాలను పరిశీలిస్తే దినకరన్‌కు టోపీ గుర్తు లభించడం కష్టసాధ్యమేనని తెలుస్తోంది.
nation
4,291
22-10-2017 22:57:54
బైపాస్‌
అంటే ఏమీ లేదునువ్వు లేనప్పుడు నీ శరీరాన్ని తెరవడంకాలిదారిని కత్తిరించిచెట్లు కూలిన రహదారికి అతికించడం వైద్యులు గుండెప్రాంతాన్ని మాత్రమే తెరుస్తారుగుండెను మాత్రం నువ్వు తెరవాల్సిందే తెరిచి-నువ్వే అయిన లోకానికిరక్త తివాచీ పరవాల్సిందే పరచి-నీలోకి ప్రవేశించిన కత్తుల్ని, పువ్వుల్నిమౌనంతో కడగాల్సిందే కడిగి-వెచ్చటిభయంగా తాకేచల్లటి మృత్యువుకునేనుండగా నువ్వుండవని చెప్పడమే చెప్పి-ఇంతదాకా రోజులుగా గడిచిన కాలాన్నిక్షణాలుగా వికసింప చెయ్యడమే చేసి-నీలోకి ప్రవేశించిన లోకంలోలోకమే అయిన నువ్వు కరిగిపోవడమే (నేను తాకని నా గుండెను తాకిన డా.మన్నం గోపీచంద్‌కి,మూసుకుపోయిన నన్ను తెరచిన ధర్భశయనం శ్రీనివాసాచార్యకి) రమణజీవి99516 18021
editorial
10,983
11-09-2017 16:45:56
ఆ డైరెక్టర్‌కు మెగా హీరోస్ ఇచ్చిన షాక్ తెలిస్తే...
మెగా హీరోలకు బడా హిట్స్ ఇచ్చానని మురిసిపోతున్న ఓ దర్శకుడికి ఝలక్ ఇచ్చారట ఇద్దరు యంగ్ హీరోస్. మల్టీస్టారర్ అంటూ కథ చెపితే ఇంట్రస్ట్ లేదంటూ నో చెప్పేశారట...? కెరీర్ ప్రారంభంలో 'షాక్' తిన్నప్పటికీ 'గబ్బర్ సింగ్' సినిమాతో మెగాఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన హరీశ్ శంకర్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'తో మెగాస్టార్ మేనల్లుడికి కూడా హిట్ ఇచ్చాడు. రీసెంట్ గా వచ్చిన 'డీజే' కూడా బన్నీ ఫ్యాన్స్‌ను మురిపించింది. కానీ హరీశ్ శంకర్ నెక్స్ట్ మూవీ విషయంలో మెగా ఫ్యామిలీ హీరోస్ షాక్ ఇచ్చారట. పైగా నో చెప్పిన వారిలో సాయిధరమ్ తేజ్ కూడా ఉండటం విశేషం. 'డీజే' తర్వాత 'దాగుడు మూతలు' పేరుతో ఓ సినిమా ప్లాన్ చేశాడు హరీశ్ శంకర్. దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకు టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. ఇద్దరు యువహీరోలు నటించాల్సిన ఈ చోటా మల్టీస్టారర్ కోసం సాయిధరమ్‌తో పాటు వరుణ్ తేజ్‌ను సంప్రదించాడు హరీశ్. అయితే బిజీ షెడ్యూల్స్ కారణంగా వారు నో చెప్పడంతో మరో ఇద్దరు యువహీరోలను సంప్రదించాడట. వారు సైతం హరీశ్‌కు ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. ఆల్రెడీ వరుస విజయాలతో నాని ఫామ్‌లో ఉండటం. మరోవైపు 'అర్జున్ రెడ్డి' విజయంతో విజయ్ దేవరకొండ లైమ్ లైట్‌లోకి రావడంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'దాగుడు మూతలు' తెరకెక్కించాలని భావించాడట హరీశ్. గతంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రంలో విజయ్‌తో కలసి నటించిన నాని మరోసారి సేమ్ కాంబినేషన్‌పై ఆసక్తి చూపించడం లేదట. మరోవైపు 'అర్జున్ రెడ్డి' సక్సెస్‌ను నిలబెట్టుకోవాలంటే సోలో హీరోగానే మెప్పించాలని భావిస్తున్న విజయ్ హరీశ్ ఆఫర్‌ను వద్దన్నాడట. టైటిల్‌తో సహా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న హరీశ్ మళ్ళీ యువహీరోల వేటలో బిజీ అయ్యాడట. మరి ‘దాగుడు మూతలు’ ఆడే ఇద్దరు హీరోస్ ఎవరో చూద్దాం..!
entertainment
14,443
12-04-2017 15:34:25
పెట్రో ధరల్లో రోజువారీ మార్పులు.. వైజాగ్ సహా 5 నగరాల్లో అమలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మే 1వ తేదీ నుంచి ప్రతిరోజూ మారనున్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరల్లో మార్పులు ఉంటాయి. దేశంలోని పెట్రోల్ పంపులలో కేంద్ర ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సొంతంగా 95 శాతం పెట్రోల్ పంప్‌లు కలిగి ఉన్నాయి. ఈ చమురు సంస్థలు పైలెట్ లాంచ్‌గా రోజువారీ సవరించిన రేట్ల విధానాన్ని ఐదు ఎంపిక చేసిన నగరాల్లో తొలుత అమలు చేయనున్నారు. క్రమంగా దానిని దేశమంతటా విస్తరిస్తారు. '5 నగరాల్లో ఈ పైలెట్ ప్రాజెక్టులను ఆయిల్ కంపెనీలు మే 1 నుంచి అమలు చేయనున్నాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేసే విషయాన్ని నిర్ణయిస్తాయి' అని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారంనాడు మీడియాకు తెలిపారు. పుదుచ్చేరి, ఏపీలోని విశాఖపట్నం, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్, ఛండీగఢ్‌లలో తొలుత ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ ప్రతినెలా 1, 16 తేదీల్లో సవరించిన రేట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆ విధానంలో మార్పులు తేనున్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా రోజువారీ ధరల మార్పుల దిశగా ఇదో ముందడుగు అని తాజా నిర్ణయంపై ఐఓసీ చైర్మన్ బి.అశోక్ తెలిపారు. సాంకేతికంగా రోజువారీ ధరల మార్పు సాధ్యమేనని, అయితే మొదట ప్రయోగాత్మకంగా దీనిని అమలులోకి తీసుకువచ్చి, తగిన అధ్యయనం అనంతరం దేశమంతటా విస్తరిస్తామని ఆయన తెలిపారు.
nation
9,006
16-10-2017 19:31:08
రవితేజ లైవ్‌లోకి వస్తున్నాడు
మాస్‌ మహరాజ్ రవితేజ అభిమానులతో తన సినిమా ముచ్చట్లను పంచుకునేందుకు రాబోతున్నారు. ప్రస్తుతం రవితేజ నటించిన 'రాజా ది గ్రేట్' చిత్రం అక్టోబర్ 18న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. తన సినిమా గురించి విశేషాలను చెప్పేందుకు రవితేజ ఫేస్‌బుక్ లైవ్‌లోకి రానున్నారు. ఈ విషయాన్ని రవితేజ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'రాజా ది గ్రేట్' చిత్ర ట్రైలర్‌లో విలన్‌కి వార్నింగ్ ఇస్తూ.. 'వచ్చి నాకు వినబడు' అనే డైలాగ్ ఎలా చెప్పారో..అలాగే రేపు మాట్లాడుకుందాం అంటూ రవితేజ చేసిన ట్విట్‌కి అభిమానులంతా ఆల్ ది బెస్ట్ చెబుతూ.. 'వెయిటింగ్' అంటూ రిప్లైలు ఇస్తున్నారు.
entertainment
289
09-05-2017 01:08:18
సాధారణ నిస్తేజం
తిథి: వైశాఖ శుక్ల చతుర్దశి నక్షత్రం: చిత్త, స్వాతిపుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, తుల, కుంభ రాశుల వారు (ఉదయం), ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు, వృశ్చిక, మీన రాశులవారు (మధ్యాహ్నం) అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ: 9314.05 (+28.75) ట్రెండ్‌ మార్పు వేళలు: మధ్యాహ్నం 12 ధోరణి: గ్రహగతులను బట్టి నిస్తేజంగా ప్రారంభమై 10.50 వరకు అదే ధోరణిలో ట్రేడవుతూ ఆ తర్వాత 12 గంటల వరకు మెరుగ్గా ఉంది తిరిగి నిస్తేజంగా మారే ఆస్కారం ఉంది. ట్రేడింగ్‌ వ్యూహం...నిఫ్టీ ఫ్యూచర్స్‌ 9.30 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో షార్ట్‌ పొజిషన్లు తీసుకుని 10.50 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 11 తర్వాత ఎటిపికన్నా పైకి వస్తే లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 12 గంటల సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 12.30 తర్వాత తిరిగి ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్‌ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్‌ చేసుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం. నిరోధ స్థాయిలు: 9345, 9380 మద్దతు స్థాయిలు: 9275, 9240మధ్యాహ్నం సమయానికి నిరోధ స్థాయిలకు చేరితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు, మద్దతు స్థాయిలకు చేరితే కనిష్ఠ స్థాయిల్లో అమ్మకాలు నివారించాలి. రిస్క్‌ భరించగల వారు మాత్రం పుల్‌బ్యాక్‌ ఆశలతో పొజిషన్లు తీసుకోవచ్చు.గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టో టెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.-డా.భువనగిరి అమరనాథశాస్ర్తిwww.thefinancialastrologer.blogspot.in
business
11,362
16-02-2017 00:34:53
ఖైదీ శశికళ.. నంబర్‌ 9234
 ‘వేద నిలయం’ జాగ్రత్త  పరప్పనకు మారిన సీన్‌...
nation
2,498
11-02-2017 23:36:57
ఎన్‌పిపిఎకు మరిన్ని అధికారాలు
బెంగళూరు: జాతీయ ఔషధ ధరల అథారిటీ (ఎన్‌పిపిఎ)కి మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు గాను నిబంధనలు సవరించాలని చూస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్‌ వెల్లడించారు. 350కి పైగా ఔషధాల ధరలను నియత్రించటంతో పాటు అందుబాటు ధరల్లో విక్రయించేందుకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జాతీయ అత్యవసర ఔషధాల జాబితా (ఎన్‌ఎల్‌ఈం) కింద మార్కెట్‌ డేటా లభించకపోవటంతో ఈ 350 ఔషధాలను ఎన్‌పిపిఎ నియంత్రించలేకపోతోందని అన్నారు. ఇందుకనుగుణంగా ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వుల (డిపిసిఒ)ను సవరించటం ద్వారా డేటాను మదింపు చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఎన్‌పిపిఎకు పూర్తి స్థాయి అధికారాలను కట్టబెట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, అన్ని రకాలైన అధికారాలతో స్వతంత్ర సంస్థగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు.
business
7,612
14-10-2017 20:51:51
రవితేజ హీరోగా వీవీ వినాయక్ సినిమా..!
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చేఏడాది మొదట్లో ఈ సినిమాకు ముహూర్తం ఖరారు చేశారనేది ఫిలింనగర్ వార్త. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'కృష్ణ' సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో ఇద్దరూ ఎవరికీ వారే సాటి. దీంతో వీరిద్దరి కాంబో ఎలా ఉండబోతోంది అంటూ.. అప్పుడే టాలీవుడ్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. రవితేజ ప్రస్తుతం 'రాజా ది గ్రేట్', 'టచ్ చేసి చూడు' సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజా ది గ్రేట్' సినిమా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన మెహరీన్ కథానాయికగా నటిస్తోంది. ఇక మరోవైపు వీవీ వినాయక్.. సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఆయన రవితేజతో సినిమా ప్రారంభిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
entertainment
9,444
05-08-2017 02:37:26
‘నాన్నకు ప్రేమతో’..పన్ను కట్టాల్సిందే!
షోకాజ్‌ నోటీసులు ఇవ్వబోతున్నామన్న కేంద్ర ఆర్థిక శాఖన్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): నందమూరి నటవారసుడు.. ప్రముఖ కథానాయకుడు.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు సేవా పన్ను మినహాయింపుపై ‘కాగ్‌’ ఆక్షేపించిం ది. విదేశాల్లో సినిమా షూటింగ్‌ తీశాము కాబట్టి అది సేవల ఎగుమతి కిందికి వస్తుందని చూపిస్తూ ఎన్టీఆర్‌ పన్ను చెల్లించలేదని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. వినోద రంగంలో సేవా పన్నుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై కాగ్‌ అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.  ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో హీరోగా నటించిన ఎన్టీఆర్‌.. లండన్‌కు చెందిన వైబ్రంట్‌ విజువల్‌ లిమిటెడ్‌ ప్రొడ్యూసింగ్‌ కంపెనీ నుంచి 2015లో రూ.7.33 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని కాగ్‌ ఆ నివేదికలో పేర్కొంది. ఎక్స్‌పోర్ట్‌ ఆఫ్‌ సర్వీసు కింద పరిగణించి తాను చెల్లించాల్సిన రూ. 1.10 కోట్ల సర్వీసు పన్ను మినహాయించారని వివరించింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ కోరగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు షోకాజ్‌ నోటీసు ఇవ్వబోతున్నామని ఆర్థిక శాఖ అనుబంధంగా ఉండే రెవెన్యూ విభాగం సమాధానం ఇచ్చింది. బాలీవుడ్‌లోనూ ఇదే తరహాలో.. ‘‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’’ హిందీ సినిమాను న్యూయార్క్‌లో చిత్రీకరించామని చూపిస్తూ ఆ సినిమా హీరోరూ. 83.43 లక్షల పన్ను మినహాంపులు పొందిన విషయాన్ని కాగ్‌ గుర్తించింది.
entertainment
7,438
21-05-2017 18:43:01
తొలిసారి గ్లామర్ పాత్రలో అనీషా!
'అలియాస్ జానకి' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనీషా ఆంబ్రోస్ 'ఫ్యాషన్ డిజైనర్. సన్నాఫ్ లేడీస్ టైలర్' మూవీలో హీరోయిన్‌గా నటించింది. వంశీ దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. మనాలి, మానస కూడా కీలక పాత్రలు పోషించారు. తన కెరీర్‌లో తొలిసారి గ్లామరస్ పాత్రను పోషించానని, ఎన్నారై అమ్మాయిగా ఇందులో నటించానని అనీషా ఆంబ్రోస్ తెలిపింది.
entertainment
7,672
22-03-2017 16:53:47
పవన్‌ నా కెరీర్‌ను మలుపు తిప్పారు: శృతిహాసన్‌
కమల్‌హాసన్‌ కూతురిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతిహాసన్‌ మొదట్లో వరుసగా ఫ్లాప్‌లనే ఎదుర్కొంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌.. ఇలా అన్ని భాషల్లోనూ ఆమెను పరాజయలే పలుకరించాయి. దీంతో విసుగెత్తిన శృతి ఓ దశలో సౌత్‌ సినిమాలు మానేద్దామనుకుందట. ఆ తరుణంలో పవన్‌తో నటించిన ‘గబ్బర్‌సింగ్‌’ శృతికి తిరుగులేని విజయాన్ని అందించింది. ఇక, అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు శృతి. ఇప్పుడు మరోసారి పవన్‌ సరసన ‘కాటమరాయుడు’లో జోడీ కట్టింది. శుక్రవారం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో పవన్‌ గురించి శృతి మాట్లాడిన ఓ వీడియో బైట్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఆ వీడియోలో పవన్‌ గురించి మాట్లాడింది శృతి. ‘ఐదేళ్ల కిందట ‘గబ్బర్‌సింగ్‌’ చేసినపుడు పవన్‌ ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలానే ఉన్నారు. నాలో చాలా మార్పు వచ్చింది గానీ, ఆయనలో మాత్రం ఏ విధమైన మార్పు రాలేదు. ‘గబ్బర్‌సింగ్‌’కు ముందు నా మీద నాకే ఎన్నో సందేహాలు. అయితే ఆ సినిమా నా మీద ఐరెన్‌లెగ్‌ ముద్రను చెరిపేసింది. ఆ సినిమాతో పవన్‌ నా కెరీర్‌ను మలుపు తిప్పారు. పవన్‌ చాలా తక్కువ మాట్లాడతారు. కానీ, మంచి విషయాలే మాట్లాడతారు. సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పవన్‌.. మరో 20 ఏళ్లపాటు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాన’ని చెప్పింది శృతి.
entertainment
9,315
24-11-2017 08:03:39
నెపోలియ‌న్ రివ్యూ
న‌టీన‌టులు: ఆనంద్ ర‌వి, కోమ‌లి, ర‌వివ‌ర్మ‌, కేదార్ శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, గురురాజ్ త‌దిత‌రులుసంస్థ‌: ఆచార్య క్రియేష‌న్స్, ఆనంద్ ర‌వి కాన్సెప్ట్స్.సంగీతం: సిద్ధార్థ్ స‌దాశివునికెమెరా: మార్గ‌ల్ డేవిడ్‌ఎడిట‌ర్‌: కార్తిక శ్రీనివాస్‌పాట‌లు: బాలాజీఆర్ట్: బాబ్జీర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ ర‌వినిర్మాత‌: భోగేంద్ర గుప్త మ‌డుప‌ల్లి పోరాడేవాడు యోధుడు అయితే యుద్ధం అంటారు. పోరాడే వాడు పౌరుడు అయితే ప్ర‌తినిధి అంటారు అంటూ నారా రోహిత్ న‌టించిన `ప్ర‌తినిధి` సినిమాకు క‌థ‌, మాట‌లు అందించిన ర‌చ‌యిత ఆనంద్ ర‌వి. తాజాగా త‌న సొంత క‌థ‌తో తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ లీడ్ రోల్‌లో ప్లే చేశారు. `నా నీడ పోయింది సారూ` అంటూ ఆస‌క్తిక‌ర‌మైన ప‌బ్లిసిటీతో తెర‌ముందుకు వ‌చ్చారు. `ప్ర‌తినిధి`లోనే త‌న‌దైన బాణీలో అంద‌రినీ ఆక‌ర్షించిన ఈ ర‌చ‌యిత ఈ సారి దేని గురించి చ‌ర్చిస్తారోన‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా ఉంది. మ‌రి ఆ అంచ‌నాల‌ను అందుకున్నారా? లేదా? ఓ లుక్కేసేయండి.. క‌థ‌:నెపోలియ‌న్ (ఆనంద్ ర‌వి) త‌న నీడ పోయింద‌ని పోలీస్ స్టేష‌న్‌కి చేరుకుంటాడు. అక్క‌డ పోలీస్ అధికారి (ర‌వివ‌ర్మ‌) ఇత‌న్ని ప‌రీక్షించి అది నిజ‌మేన‌ని తేల్చుకున్నాక త‌న పై అధికారి (కేదార్ శంక‌ర్‌)కి చెబుతాడు. క‌ల‌లో దేవుడు క‌నిపించి యాక్సిడెంట్‌గా చిత్రీక‌రించి క్లోజ్ చేసిన ఓ ఫైల్‌ను ఓపెన్ చేయ‌మ‌న్నాడ‌ని, అది మ‌ర్డ‌ర్ అనీ పోలీసుల‌తో చెబుతాడు నెపోలియ‌న్‌. పోలీసుల ఇన్వెస్టిగేష‌న్ లో అది మ‌ర్డ‌ర్ అనే తేలుతుంది. కానీ ఎవ‌రు ఎందుకు చేశార‌నే విష‌యం మాత్రం అంతుబ‌ట్ట‌దు. దాంతో నెపోలియ‌న్ చెప్పే విష‌యాల మీద పోలీసుల‌కు న‌మ్మ‌కం కుదురుతుంది. అత‌ను చెప్పిన ప్ర‌కారం ద‌ర్యాప్తు చేస్తారు. అంత‌లోనే అత‌ను నెపోలియ‌న్ కాద‌నీ, త‌న భ‌ర్త అశోక్ అని ఒక‌మ్మాయి (కోమ‌లి) వ‌స్తుంది. మ‌ధ్య‌లో ఒక‌సారి నెపోలియన్ పోలీసుల‌తో త‌న‌ని తాను తిరుప‌తి గా ప‌రిచ‌యం చేసుకుంటాడు. ఇంత‌కీ అశోక్ ఎవ‌రు? అశోక్‌కి నిజంగా పెళ్ల‌యిందా? తిరుప‌తి ఎవ‌రు? తిరుప‌తి కుమార్తె ఎందుకు అనాథ‌గా మారింది? తిరుప‌తి భార్య‌ను ఎవ‌రు కిడ్నాప్ చేశారు? ఆల్రెడీ అశోక్‌గా చెలామ‌ణి అయిన వ్య‌క్తి నెపోలియ‌న్‌గా త‌న‌ని తాను ఎందుకు ప‌రిచ‌యం చేసుకోవాల్సి వ‌చ్చింది? నెపోలియ‌న్ - అశోక్ - తిరుప‌తి ఒక‌రికొక‌రు ఏమ‌వుతారు వంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం. స‌మీక్ష‌న‌టీన‌టులు త‌మ ప‌రిధిమేర బాగా న‌టించారు. ర‌వి వ‌ర్మ పాత్ర సినిమాలో కీల‌కం. ఆనంద్ ర‌వి ముఖ క‌వ‌ళిక‌ల్లో మొనాట‌నీ ఉంది. ఒకే ర‌క‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ ఉంటాయి. ఎక్క‌డా స్ప‌ష్ట‌మైన‌ మార్పు క‌నిపించ‌దు. డైలాగులు చెప్ప‌డంలో మాత్రం క్లారిటీ ఉంది. క‌థ, క‌థ‌నం కొత్త‌గా ఉన్నాయి. స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇది. ఎక్క‌డికక్క‌డ ఏం జ‌రుగుతుందోన‌నే ఉత్కంఠ‌ను క‌లిగించ‌గ‌లిగారు. నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ల‌స్ అయింది. తెర‌మీద సినిమా క్వాలిటీగానే క‌నిపిస్తుంది. సిటీల్లో స‌గం మంది న‌డుం నొప్పికి కార‌ణం అనాథ‌రైజ్డ్ గా వేసిన స్పీడ్ బ్రేక‌ర్లేన‌ని చెప్ప‌డం బావుంది. నెపోలియ‌న్ ఎవ‌రు? అశోక్ ఎవ‌రు? తిరుప‌తి ఎవ‌రు? వ‌ంటి అయోమ‌యం సెకండాఫ్‌లో చాలా మందికి క‌లుగుతుంది. ఆ విష‌యంలో మ‌రికొంత క్లారిటీగా ఉంటే బావుండేది. అయినా త‌మిళ అనువాద చిత్రంగా విడుద‌లైన `భ‌ద్ర‌మ్‌` ఛాయ‌లు కొంత‌మేర ఈ చిత్రంలో క‌నిపించాయి. ఎవ‌రూ లేని అనాథ‌ల‌ను ఎంపిక చేసి వారి మీద ఇన్‌స్యూరెన్స్ చేసి చంప‌డం అందులో క‌థ‌. అనాథ‌ల‌ను టార్గెట్ చేస్తే అడిగేవారు ఉండ‌ర‌నే అంశంతోనే `నెపోలియ‌న్` క‌థ‌ను డిజైన్ చేసుకున్నారు. అయితే మ‌రింత ఎఫెక్టివ్‌గా, ఇంకాస్త రేసీగా చెప్పాల్సింది. సినిమాలో వేగం త‌గ్గింది. బాట‌మ్ లైన్‌: `నెపోలియ‌న్‌`.. ఒక‌సారి చూడొచ్చు సారూ!రేటింగ్‌: 2.5/5
entertainment
15,275
07-12-2017 17:48:47
శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం
న్యూఢిల్లీ : ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) మండిపడింది. యమునా నది మైదాన ప్రాంతం తీవ్రంగా దెబ్బతినడానికి ప్రధాన బాధ్యత శ్రీ శ్రీ రవిశంకర్‌దేనని పేర్కొంది. 2016 మార్చిలో నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల కారణంగానే ఈ ప్రాంతం దెబ్బతిందని తెలిపింది. అయితే గతంలో సమర్పించిన రూ.5 కోట్లకు అదనంగా తదుపరి పర్యావరణ నష్టపరిహారాన్ని విధించేందుకు తిరస్కరించింది. ఈ సొమ్మును ఈ ప్రాంతం పునరుద్ధరణకు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ఎన్‌జీటీ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం యమునా నది వరద ప్రాంతం దెబ్బతినడానికి కారణం ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అని నిర్థారించినట్లు తెలిపింది. ఈ ప్రాంతం పునరుద్ధరణకు రూ.5 కోట్లు కన్నా ఎక్కువ ఖర్చయితే, అదనపు సొమ్మును ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి రాబడతామని తెలిపింది. ఒకవేళ ఈ రూ.5 కోట్ల కన్నా తక్కువ ఖర్చయితే, మిగిలిన సొమ్మును తిరిగి ఇచ్చేస్తామని పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించేవిధంగా ఈ ప్రాంతాన్ని ఎవరూ ఉపయోగించరాదని తెలిపింది.
nation
19,813
09-01-2017 17:17:44
ఇకపై పాక్ జట్టును మన దేశ పర్యటనకు పిలవకండి : చాపెల్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ పాకిస్థాన్ క్రికెటర్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆటను మెరుగుపర్చుకోలేకపోతే విదేశీ పర్యటనలకు రాకండని అన్నారు. పాక్ జట్టును ఆసిస్ పర్యటనకు ఆహ్వానించకూడదని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరారు. వాళ్లు తమ ఆట తీరును మార్చుకుని ఆతిధ్య దేశానికి సరైన పోటీనిచ్చే వరకు వారిని పిలవొద్దని చెపెల్ మండిపడ్డారు. ప్రస్తుతం ఆసిస్ టూర్‌లో ఉన్న పాకిస్థాన్ జట్టు కంగారులపై టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయి వైట్ వాష్‌కు గురైంది. ఆసిస్ గడ్డపై పాక్ ఇలా వరుసగా 12 మ్యాచ్‌లను కోల్పోయి, నాలుగు వైట్‌వాష్‌లకు ఎదుర్కొంది.  దీంతో పాక్‌పై అటు స్వదేశంతో పాటు ఆస్ట్రేలియలో కూడా విమర్శలు ఎక్కువయ్యాయి. అంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లలో అన్ని విధాలుగా రాణించిన పాక్ జట్టు ఆస్ట్రేలియాలో మాత్రం చెత్తగా ఆడిందని చాపెల్ అన్నారు. అటు బౌలింగ్‌తో పాటు, ఇటు ఫీల్డింగ్‌లో కూడా వారి ఆటతీరు ఏమీ బాగోలేదని, కెప్టెన్‌గా మిస్బా ఏమీ ఆకట్టుకోలేదని అన్నారు. అయితే పాక్‌పై విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా సంబరపడకూడదని, నిజానికి సరైన పోటీ ఇంకా ఎదురుకాలేదని అన్నారు. రాబోయే భారత పర్యటనలో వారికి కఠిన పరీక్ష ఉండనుందని చాపెల్ అన్నారు. ఇదిలా ఉండగా పాక్, ఆసిస్ మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 13 నుంచి మొదలుకానుంది. అయితే భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టు కోహ్లీసేనతో ఫిబ్రవరి 23 నుంచి నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.
sports
19,592
08-12-2017 00:33:07
భారత్‌ x అర్జెంటీనా
భువనేశ్వర్‌: హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో భారత్‌ సెమీస్‌ ప్రత్యర్థి ఎవరో ఖరారైంది. శుక్రవారం జరిగే తొలి సెమీస్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌, వరల్డ్‌ నెంబర్‌ వన్‌ అర్జెంటీనాతో భారత్‌ తలపడనుంది. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో అర్జెంటీనా 3-2తో ఇంగ్లండ్‌పై, జర్మనీ షూటౌట్‌లో 4-3తో నెదర్లాండ్స్‌పై గెలుపొంది సెమీస్‌ చేరాయి. శనివారం జరిగే రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియాతో జర్మనీ తలపడనుంది. హాకీ లీగ్‌ పూల్‌ స్టేజ్‌లో పేలవ ప్రదర్శనతో ఒక్క మ్యాచ్‌ను కూడా నెగ్గలేకపోయిన భారత్‌ క్వార్టర్స్‌లో మాత్రం అద్భుత ఆటతో పటిష్ట బెల్జియంకు షాకిచ్చింది. అదే జోరులో సెమీస్‌లో భీకరమైన అర్జెంటీనాపైనా గెలు పొందాలని మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత్‌ ఆరా టపడుతున్నది. కాగా, అర్జెంటీనాతో ముఖాముఖి పోరులో భారత్‌దే పైచేయి. ఇరుజట్ల మధ్య 46 మ్యా చ్‌లు జరిగితే.. టీమిండియా 26 సార్లు నెగ్గింది. 16 మ్యాచుల్లో ఓడింది. నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగి శాయి. పైగా 2016 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అర్జెంటీనాను ఓడించిన ఏకైక జట్టు కూడా టీమిండియానే కావడం మనకు లాభించే అంశం.
sports
9,808
04-08-2017 20:57:24
సంతోషం' అవార్డుల హంగామా షురూ
సంతోషం ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగింది. అవార్డుల లోగోను, ఆహ్వాన పత్రికను 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, రెజీనా సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ నెల 12న సంతోషం సౌతిండియన్ ఫిల్మ్ అవార్డులను ఘనంగా నిర్వహించబోతున్నామని సురేశ్ కొండేటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు, హీరో ఆది, హీరోయిన్ హేబా పటేల్, ఏడిద రాజా తదితరులు పాల్గొన్నారు.
entertainment
17,695
24-10-2017 01:55:55
జియో ఫోన్‌ పేలింది!
న్యూఢిల్లీ: రిలయన్స్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జియో 4జీ స్మార్ట్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా పేలింది. ఈ మేరకు పేలిన ఫోన్‌ ఫొటోను ఫోన్‌ ర్యాడర్‌ సంస్థ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కాగా, ఈ వార్తను రిలయన్స్‌ సంస్థ ఖండించింది. ఫోన్‌ వెనుక భాగం మాత్రమే పేలిందని, ముందు భాగం బాగానే ఉందని తెలిపింది. బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేందుకు కొంతమంది కావాలనే ఈ వివాదాన్ని సృష్టించారని ఆరోపించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఫోన్‌ను తయారు చేశామని.. ప్రతి ఫోన్‌ను అన్నివిధాలుగా పరీక్షించిన తర్వాతే మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు స్పష్టం చేసింది.
nation
21,515
10-09-2017 02:02:44
ప్రదీప్‌కు ‘కామన్వెల్త్‌’ బెర్త్‌
గోల్గ్‌ కోస్ట్‌ (ఆస్ర్టేలియా): భారత వెయిట్‌ లిఫ్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ సింగ్‌.. వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించాడు. కామెన్వెల్త్‌ యూత్‌ జూనియర్‌, సీనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియ న్‌షిప్స్‌ 105 కిలోల విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా ప్రదీప్‌.. ఈ బెర్త్‌ను దక్కించుకు న్నాడు. అంతేకాకుండా భారత లిఫ్టర్లు ఈ టోర్నీలో 34 రికార్డులను కూడా నెలకొల్పారు. చివరి రోజు భారత్‌ రెండు స్వర్ణాలతోపాటు ఒక రజతం, రెండు కాంస్య పతకాలను సాధించింది.  105 కిలోల విభాగంలో ప్రదీప్‌ స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో (147+195) మొత్తం 342 కిలోల బరువెత్తి పసిడి సాధించాడు. ఈ క్రమంలో స్నాచ్‌లో జాతీయ రికార్డును తిరగరాశాడు. గుర్దీప్‌ సింగ్‌ (+105 కిలోల) మొత్తం 371 కిలోలు (171+200) లిఫ్ట్‌ చేసి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో నూతన జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఇక జూనియర్‌ పురుషుల 105 కిలోల విభాగంలో లవ్‌ప్రీత్‌ సింగ్‌ (150+175) 325 కిలోలు ఎత్తి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు.
sports
10,526
22-06-2017 01:36:23
మహేశ్‌ సన్నివేశాలు మొదలయ్యాయి
హీరో మహేశ్‌, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో తయారవుతున్న రెండో చిత్రం ‘భరత్‌ అను నేను’. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాయికగా ముంబై అమ్మాయి, ‘ఎం.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ ఫేమ్‌ కియారా ఆడ్వాణీ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఇప్పటికే మే నెలలో తొలి షెడ్యూల్‌ను నిర్వహించారు. ఎ.ఆర్‌. మురుగదాస్‌ సినిమా ‘స్పైడర్‌’తో బిజీగా ఉన్న మహేశ్‌, ఆ సినిమా టాకీ పార్ట్‌ను పూర్తిచేసి, బుధవారమే తొలిసారిగా ‘భరత్‌ అను నేను’ సెట్స్‌పై అడుగుపెట్టారు. బేగంపేటలోని ఒక క్లబ్బులో మహేశ్‌, మరికొంతమంది ఆర్టిస్టులపై దర్శకుడు శివ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుందని నిర్మాత దానయ్య తెలిపారు. ఇప్పటి వరకూ పొలిటీషియన్‌గా తెరపై నటించని మహేశ్‌, తొలిసారిగా ఇందులో ముఖ్యమంత్రి గా కనిపించనుండటం విశేషం. పొలిటికల్‌ డ్రామా మేళవించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని శివ రూపొందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి రవి కె. చంద్రన్‌ ఛాయాగ్రాహకుడు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది దర్శక నిర్మాతల సంకల్పం.
entertainment
505
10-07-2017 00:30:53
రెరా చట్టంతో బిల్డర్లకు కళ్లెం
ఇల్లు ప్రతి ఒక్కరికీ ప్రాథమిక అవసరం. అయితే ఈ రోజుల్లో సొంతిల్లు సమకూర్చుకోవడం అంత తేలిక కాదు. అప్పో సప్పో చేసి సొంతిల్లు కొందామన్నా అనేక సమస్యలు. ఈ సమస్యలకు చెక్‌ పెట్టేలా ప్రభుత్వం తీసుకొచ్చిన రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (రెరా) చట్టం గురించి ‘ఆంధ్రజ్యోతి బి+’ పాఠకుల కోసం ‘యాస్పైర్‌ హోమ్‌ ఫైనాన్స్‌’ కార్పొరేట్‌ ప్లానింగ్‌ అండ్‌ స్ట్రాటజీ హెడ్‌ కల్పేష్‌ దవే వివరించారు. రెరా చట్టం ఏం చెబుతోందంటే..ఈ చట్టం ప్రకారం బిల్డర్లు ఇంకా పూర్తిగాని ప్రాజెక్టుల ఒరిజినల్‌ అప్రూవ్‌డ్‌ ప్లాన్స్‌ను అధికారులకు సమర్పించాలి. ఒరిజినల్‌ ప్లాన్‌లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా, ఆ వివరాలనూ అధికారులకు ఇవ్వాలి. ఇళ్లు లేదా ఫ్లాట్ల కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన నిధుల వివరాలతో పాటు, ఆ నిధులను ఎలా వినియోగిస్తున్నారనే విషయాన్నీ తెలియజేయాలి. ఇంకా ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత కాలం పడుతుంది? ఎపుడు డెలివరీ ఇస్తారు? అనే విషయాలనూ తెలియజేయాలి. గతంలోలా తమ ఇష్టమొచ్చినట్టుగాక ఎవరైనా సర్టిఫైడ్‌ ఇంజినీర్‌/ఆర్కిటెక్ట్‌ లేదా ప్రాక్టీసింగ్‌ సిఎ ఇందుకు సంబంధించిన ఇచ్చిన కాపీ ద్వారా కొనుగోలుదారుడికి, అధికారులకు ఈ విషయాలు తెలియజేయాలి. కొనుగోలుదారుల లబ్దిఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు లేదా త్వరలో నిర్మాణం చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ రెరా చట్టం పరిధిలోకి వస్తాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టులన్నీ రెరా చట్టం కింద నమోదై తీరాలి. ఈ ప్రాజెక్టుల్లో ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనుక్కుంటే ఒప్పందంలోని షరతుల ప్రకారం బిల్డర్‌ సకాలంలో అందజేయాలి. లేకపోతే బిల్డర్‌ మీద జరిమానా కూడా పడుతుంది.  ధరలు ఎలా ఉంటాయి..రెరా చట్టం, జిఎస్టి ప్రభావం రియల్టీ మార్కెట్‌పైనా పడుతుంది. అయితే ఈ ప్రభావం ఎంత అనేది కనీసం ఆరు నుంచి 12 నెలలు గడిస్తేగానీ స్పష్టంగా చెప్పలేం. కొత్తం చట్టంతో కొనుగోలుదారులు కార్పెట్‌ ఏరియాకు (నివాసానికి సంబంధించిన గోడల మధ్య ఉండే ప్రాంతం) మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతోంది. ఇదివరకటిలా సూపర్‌ బిల్డప్‌ ఏరియా పేరు చెప్పే బిల్డర్లు కొనుగోలుదారులను దోచుకోవడం ఇక కుదరదు. నిర్మాణ వ్యయం తగ్గి బిల్డర్లు ఆ లాభాన్ని కొనుగోలుదారులకు బదిలీ చేసే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. అయితే ఇక్కడ ధరలను నిర్ణయించే ప్రధాన అంశం ‘డిమాండ్‌-సరఫరా’ అనే విషయం గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులకు రక్షణ అన్నిటికంటే ముఖ్యమైంది కొనుగోలుదారులకు రక్షణ. ఇప్పటి వరకు బిల్డర్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన నిధుల్ని వేరే ప్రాజెక్టులకు మళ్లించడం లేదా జేబులో వేసుకుని కూర్చునే వారు. ఇపుడిక ఆ పప్పులు ఉడకవు. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన నిధుల్లో 70 శాతాన్ని ఎస్ర్క్యూ ఖాతాకు బదిలీ చేయాలి. ఈ నిధుల్ని వేరే ప్రాజెక్టులకు మళ్లించకుండా బిల్డర్‌ కేవలం నిర్ణీత ప్రాజెక్టు కోసమే ఖర్చు చేస్తున్నట్టు వారు నియమించుకున్న సిఎలు, ఇంజినీర్లు ధ్రువీకరిస్తే తప్ప ఈ ఖాతాలోని నిధులు బిల్డర్‌కు అందవు. బిల్డర్లు, డెవలపర్లకు ప్రయోజనాలురెరా చట్టం కింద నమోదైన ప్రతి రియల్టీ ప్రాజెక్టుకూ ఒక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇస్తారు. ఈ నంబర్‌ అందిన మూడు నెలల్లోగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రమోటర్లు ఆ విషయాన్ని రెరా చట్టానికి సంబంధించి వెబ్‌సైట్‌లోనూ నమోదు చేయాలి. లేకపోతే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అమ్మకాలు, మార్కెటింగ్‌ను అనుమతించరు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు, ప్రచార కార్యక్రమాల్లోనూ ‘రిజిస్ట్రేషన్‌ నంబర్‌’ తప్పనిసరిగా కోట్‌ చేయాలి. దీని వలన అల్లాటప్పా బిల్డర్లు రియల్టీ బిజినెస్‌ నుంచి కనుమరుగయ్యే అవకాశం ఉంది.
business
14,211
11-12-2017 04:41:29
ఐఎస్‌పై విజయానికి ప్రతీకగా ఇరాక్‌ బలగాల పెరేడ్‌
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)పై సాధించిన విజయానికి ప్రతీకగా ఇరాక్‌ బలగాలు ఆదివారం పెరేడ్‌ నిర్వహించాయి. మూడేళ్ల పాటు జరిపిన పోరులో జిహాదీ మూకలను తరిమికొట్టామని ఇరాక్‌ ప్రధాని హైదర్‌ అల్‌-అబాదీ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం ఈ కవాతు చేపట్టింది. అయితే ఐఎస్‌ ఉగ్రవాదులు ప్రాధాన్యం కోల్పోయి ఉండొచ్చని.. కానీ పరాజితులు కాలేదని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే హెచ్చరించారు.
nation
7,641
04-08-2017 18:25:42
ముదురుతోన్న 'బాబుమొషాయ్ బందూక్ బాజ్' వివాదం
సినిమాలో తమకు అభ్యంతరం ఉన్న సీన్లను కట్ చేయడం సెన్సార్ బోర్డు పని. అయితే త్వరలోనే బాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు రాబోయే సినిమాకు మాత్రం ఈ విషయంలో అతిగా కోతలు పెట్టి వారికి ఊహించని షాక్ ఇచ్చిందట. కొంతకాలంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు సెన్సార్ బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆగస్టులో విడుదల కాబోతున్న 'బాబుమొషాయ్ బందూక్ బాజ్' సినిమా విషయంలో సెన్సార్ బోర్డు అతిగా కట్స్ సూచించడంతో వివాదం మొదలైంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి సెన్సార్‌లో మొత్తం 48 సీన్లకు కోత పెట్టారనే వార్త ఇప్పుడు బీ టౌన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, బిదిత బాగ్ తదితరులు నటించిన ఈ సినిమాలో హాట్ సీన్లతో పాటు అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని భావించిన సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహ్లనీ ఈ సినిమాపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడంతో ఈ సినిమాకు ఉన్న కట్స్ పడ్డాయనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలోని పలు సన్నివేశాలను కట్ చేసి విషయం వాస్తవమే అయినా మొత్తం సీన్లకు కోత పెట్టలేదని సెన్సార్ బోర్డు వివరణ ఇస్తోందట. అయితే దీనిపై దర్శకనిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో కొన్ని కోణాలు ప్రేక్షకులకు అర్థంకావాలంటే కొన్ని సీన్లు కచ్చితంగా ఉండాలని, అలాంటి సీన్లను కట్ చేసుకుంటూ పోతే ఇక సినిమా ఎందుకుని వాళ్లు వాదిస్తున్నారు. ఇక తాను అసభ్యకర దృశ్యాల్లో నటించానని వస్తున్న ఆరోపణలపై బిదిత కూడా సెన్సార్ బోర్డు తీరును తీవ్రంగా తప్పుబడుతోంది. మరోవైపు సెన్సార్ బోర్డు తీరుపై కోర్టుకు వెళ్లాలని 'బాబుమొషాయ్ బందూక్ బాజ్' నిర్మాతలు భావిస్తున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. మరి ఈ వివాదం ఎక్కడికి వెళుతుందో చూడాలి.
entertainment
6,466
15-11-2017 16:10:34
'సైరా' ఆలస్యానికి కారణమిదేనా..!
వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఆ స్టార్ హీరో సినిమా కోసం భారీస్థాయిలో విదేశీ జూనియర్ ఆర్టిస్టులు రాబోతున్నారట. అయితే సినిమాలో నటించబోయే నటుల డేట్స్ కుదరకపోతే సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే షూటింగ్ మొదలుకావాల్సిన మెగాస్టార్ నయా మూవీ 'సైరా' ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంది. ఈ సినిమాలో నటించేందుకు కమిటైన నటుల డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం కొందరు టెక్నీషియన్లు కూడా అందుబాటులో లేకపోవడం వల్లే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‎డేట్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‎లో చక్కర్లు కొడుతోంది.  బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం బ్రిటన్ నుంచి దాదాపు 200 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులను రప్పించబోతున్నారట. వాళ్లంతా సినిమాలో బ్రిటిష్ సైనికులుగా నటించబోతున్నారట. సినిమా న్యాచురల్‎గా ఉండేందుకు కాస్త ఖర్చు ఎక్కువైనా బ్రిటన్ నుంచి జూనియర్ ఆర్టిస్టులను తీసుకురాబోతున్నారట దర్శనిర్మాతలు. మరోవైపు తరచూ వాయిదా పడుతున్న 'సైరా' షూటింగ్ డిసెంబర్ 6న అయినా మొదలవుతుందా అనే చర్చ జరుగుతోంది.  సినిమా కోసం హీరో చిరంజీవి సిద్ధంగానే ఉన్నా అందులో నటించబోయే ఇతర నటులు, నిర్మాత రామ్‎చరణ్ బిజీగా ఉండటం ఇలాంటి సందేహాలు కలిగేలా చేస్తోంది. అయితే ఆలస్యమైనా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలని నిర్మాత రామ్‎చరణ్ గట్టిగా డిసైడయ్యాడని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి 'సైరా' షూటింగ్ మొదలయ్యే తేదీ దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన మరెన్ని విశేషాలు బయటకు వస్తాయో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
entertainment
8,790
20-09-2017 20:08:48
ప్రభాస్‌కి శ్రద్దాకపూర్ సర్‌ప్రైజ్..
టాలీవుడ్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ జంటగా 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీబడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ప్రభాస్‌తో గత కొద్దిరోజులుగా సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది శ్రద్దాకపూర్. అయితే ప్రభాస్‌తో షూటింగ్ ప్రారంభించకముందే ప్రభాస్ సినిమాలన్నీ చూసేసిందట శ్రద్దా. ప్రభాస్‌తో 'సాహో' సెట్‌లో అడుగుపెట్టిన రోజే ఆ విషయాన్ని ప్రభాస్‌తో చెప్పి ఆయనను సర్‌ప్రైజ్ చేసిందని యూనిట్ వర్గాల మాట. శ్రద్దా కపూర్ కి ఇది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం కోసం శ్రద్దా తెలుగు నేర్చుకునే పనిలో పడింది. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లో 'బాహుబలి' సిరీస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులతో జాగ్రత్తగా నిర్మాణ పనులు చేపడుతున్నారు.
entertainment
18,105
11-04-2017 02:03:12
కొత్త పొత్తులకు స్వాగతం: జైట్లీ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): కొత్త పొత్తులను స్వాగతించాలని.. మరిన్ని పార్టీలను చేర్చుకొని, కూటమిని మరింత బలోపేతం చేయాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) తీర్మానించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల రెండో భేటీ సోమవారం రాత్రి ఢిల్లీలోని భారతీయ ప్రవాస కేంద్రంలో జరిగింది. మూడు గంటలకుపైగా జరిగిన భేటీ వివరాలను బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు విలేకరులకు వెల్లడించారు. మొత్తం 33 పార్టీల ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారని, ఎన్డీఏను మరింత బలోపేతం చేయాలని, కొత్తగా వచ్చే పార్టీలను కూడా కూటమిలో చేర్చుకోవాలని ఈ సందర్భంగా తీర్మానించామని చెప్పారు. ఆయా రాషా్ట్రల్లో ఎన్నికల సందర్భంగా కొత్త పొత్తులు కుదురుతుంటాయని, అసోం, యూపీ, కేరళల్లో ఇలాగే జరిగిందని, చాలా కొత్త పార్టీలు ఎన్డీఏలో చేరాయని జైట్లీ గుర్తు చేశారు. కాగా, టీఆర్‌ఎ్‌సకు కూడా ఆహ్వానం పలుకుతారా? అని ప్రశ్నించగా, అలాంటి ప్రతిపాదన ఏమీ ప్రస్తుతం లేదన్నారు.
nation
4,153
06-09-2017 04:28:46
ఈ విధానం మంచిదేనా?
టీవీలో అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు చూపకపోవటమే మంచిదనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. టీవీలో ప్రజలు చూస్తున్నారనే ఆనందంలో అన్ని పార్టీల వారు అయిన దానికీ కాని దానికీ విమర్శలు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. టీవీ ప్రేక్షకులకు ఉత్కంఠను, కనువిందును కలుగజేస్తున్నారు. అదే ఈ విధానం లేకపోతే అధికార, ప్రతిపక్షాలు అర్థవంతమైన సద్విమర్శలు చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు, కార్యక్రమాలు చేపట్టేవారు. కనుక దేశ నాయకులందరూ ఈ విధానం గురించి ఆలోచించాలి.- జి. శ్రీరామమూర్తి, వినుకొండ, గుంటూరు జిల్లా
editorial
5,561
16-03-2017 12:13:51
నటనకు రవితేజ దూరం?
ఇటీవలి కాలంలో రవితేజ సినిమాలు విడుదల కాలేదు. విడుదలైన ఒకటి రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. దాంతో చాలా గ్యాప్‌ తీసుకుని రవితేజ ఓ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కూడా గత అనుభవాలనే మిగిలిస్తే ఇక నటనకు స్వస్తి చెప్పి డైరక్టర్‌గా అవతారం ఎత్తాలన్నది రవితేజ ఆలోచనట! రవితేజ మొదట్లో దర్శకత్వ శాఖలో పనిచేసే నటన వైపు వచ్చాడు. సో...తనకు పరిచయమున్న దర్శకత్వం వైపు వెడితే కెరీర్‌ గాడిలో పడుతుంది అని రవితేజ ఆలోచన! మాస్‌ మహరాజగా పేరు తెచ్చుకున్న రవితేజ ఇక మాస్‌ డైరక్టర్‌గా కూడా అదరగొడతాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
entertainment
10,122
15-11-2017 22:29:52
భక్తిరస దృశ్యకావ్యం
రవీంద్ర గోపాల ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘రాఘవేంద్ర మహత్యం’. పి.సి.రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో కృష్ణచంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోద్‌కుమార్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల్ని ఇటీవల హైదరాబాద్‌లో సి.కల్యాణ్‌ విడుదల చేశారు. ‘‘నటుడిగా, నిర్మాతగా రవీంద్ర గోపాల చాలా కష్టపడి ఈ సినిమా పూర్తి చేశారు. దీనికి కొనసాగింపు కూడా తియ్యాలి’’ అని కల్యాణ్‌ అన్నారు. రవీంద్ర గోపాల మాట్లాడుతూ ‘‘రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌ వంటి హీరోలు రాఘవేంద్రస్వామి సినిమాలు చేశారు. ఆ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. చక్కటి భక్తిరస దృశ్య కావ్యంగా మలిచాం’’ అని అన్నారు.
entertainment
9,246
22-02-2017 14:28:37
మహేశ్ టీజర్‌లో సాలీడే స్పెషల్ అట్రాక్షన్?
మహేశ్‌బాబు, మురుగదాస్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమాకు సంబంధించి టీజర్ త్వరలో విడుదల కాబోతోంది. లండన్‌లో టీజర్‌ను ప్రత్యేక శ్రద్ధతో సిద్ధం చేయిస్తోందట చిత్ర బృందం. ఇప్పుడు ఈ టీజర్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. టీజర్‌లో ‘సాలీడు’ స్పెషల్ అట్రాక్షన్ అని టాక్. టీజర్‌లో ఈ సాలీడు ప్రాముఖ్యమేంటి? అని అనిపించొచ్చు. కానీ, సినిమాలో మహేశ్ ఓ గూఢచారిగా కనిపిస్తాడని ఫిల్మ్‌నగర్ గాసిప్. మరి గూఢచారి అంటే అందుకు తగిన స్పై పరికరాలు వాడాలి కదా. ఆ పరికరాలే స్పైయింగ్ చేసే రోబోలు. ఆ రోబోనే ఈ సాలీడు అని టాక్. ఆ రోబో సాలీడు కంప్యూటర్ గ్రాఫిక్స్‌నే రూ.35 లక్షల ఖర్చుతో లండన్‌లోని ఓ వీఎఫ్‌ఎక్స్ సంస్థతో చేయిస్తున్నారని వినిపిస్తోంది. దీంతో ఆ రోబో సాలీడు వల్లే టీజర్ ఆలస్యమవుతోందని టాక్. అంటే గూఢచారి మహేశ్‌కు ఈ రోబో సాలీడు సమాచారాన్ని చేరవేస్తుందన్నమాట. కాగా, ఈ సినిమాకు ‘సంభవామి యుగే యుగే’ టైటిల్ పెట్టినట్టు.. విన్నర్ ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో నిర్మాత పీవీపీ లీక్ చేసిన సంగతి తెలిసిందే. చిత్ర బృందం మాత్రం అది తమ సినిమా టైటిల్ కాదంటూ మరో ట్విస్ట్ ఇస్తోంది.
entertainment
19,881
06-09-2017 02:35:59
మెరిసిన వార్నర్‌, హ్యాండ్స్‌కోంబ్‌
ఆస్ట్రేలియా 225/2 ఫ బంగ్లా 305 చిట్టగాంగ్‌: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో ఆస్ర్టేలియా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (88 బ్యాటింగ్‌), పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (69 బ్యాటింగ్‌), కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (58) అర్ధ సెంచరీలతో రాణించడంతో రెండో రోజైన మంగళవారం ఆట చివరకు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అంతకుముందు 253/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లా 305 వద్ద ఆలౌటైంది. లియాన్‌ 7 వికెట్లు తీశాడు.  ఆసీస్‌ టీమ్‌ బస్సుపై రాళ్ల దాడి: ఆస్ర్టేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లదాడి జరగడం కలకలం సృష్టించింది. సోమవారం ఆట ముగిశాక ఆటగాళ్లు హోట ల్‌కు తిరిగి వస్తుండగా దుండగులు రాళ్లు విసరడంతో బస్సు అద్దం పగిలింది. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. దాంతో, జట్టు భద్రతను కట్టు దిట్టం చేశారు.
sports
2,586
28-03-2017 23:54:42
మిడ్‌సెషన్‌ మెరుగు (బుధవారానికి)
ధోరణి: గ్రహగతులను బట్టి నిలకడ/నిస్తేజంగా ప్రారంభమై 10.25 నుంచి 2.45 గంటల మధ్యలో మెరుగ్గా ఉంటూ ముగింపు సమయంలో నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.
business
2,121
12-10-2017 02:02:06
ఆంధ్రా బ్యాంక్‌ ఇడిగా కుల్‌ భూషణ్‌ జైన్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కుల్‌ భూషణ్‌ జైన్‌ బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈయన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తన కెరీర్‌ను ప్రారంభించిన జైన్‌.. బ్రాంచ్‌ హెడ్‌, జోనల్‌ హెడ్‌, నేషనల్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ సౌత్‌, నార్త్‌కు హెడ్‌గా వ్యవహరించారు. క్రెడిట్‌, ట్రెజరీ, ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో జైన్‌కు అపారమైన అనుభవం ఉంది.
business
13,027
05-05-2017 14:44:32
నిర్భయ కేసులో నలుగురికి ఉరిశిక్ష : సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2013లో విచారణ కోర్టు ఈ కేసులో నలుగురిని దోషులుగా నిర్దారిస్తూ ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షను హైకోర్టు నిర్ధారించింది. అయితే తమకు పడిన శిక్షను నిందితులైన అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వీరి అప్పీల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. నిర్భయ కేసు అరుదైనదని, ఇది అత్యంత క్రూరమైన నేరమని, దోషులకు ఉరిశిక్షే సరి అని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఒకే తీర్పును ప్రకటించింది. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నేరం చేయకూడదని వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీసులు తిరుగులేని సాక్ష్యాలిచ్చారని, నేర తీవ్రత సమాజం మొత్తాన్ని కదిలించిందని పేర్కొంది. తిసభ్య బెంచ్ తీర్పు చెప్పగానే కోర్టు హాలు చప్పట్లతో మార్మోగింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై నిర్భయ తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ కుటుంబ విజయమని ఆయన పేర్కొన్నారు. 2012 డిసెంబర్ 16న 23 ఏళ్ల మెడికో విద్యార్థి నిర్భయపై ఆరుగురు యువకులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీ నడివీథిలో ఓ బస్సులో జరిగిన ఈ కిరాతకం అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. ఈ సామూహిక అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో విద్యార్థిని సింగపూర్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2013లో విచారణ కోర్టు ఈ కేసులో నలుగురిని దోషులుగా నిర్దారిస్తూ ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షను హైకోర్టు నిర్ధారించింది. అయితే తమకు పడిన శిక్షను నిందితులైన అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వీరి అప్పీల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. నిర్భయ కేసు అరుదైనదని, ఇది అత్యంత క్రూరమైన నేరమని, దోషులకు ఉరిశిక్షే సరి అని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఒకే తీర్పును ప్రకటించింది. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నేరం చేయకూడదని వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీసులు తిరుగులేని సాక్ష్యాలిచ్చారని, నేర తీవ్రత సమాజం మొత్తాన్ని కదిలించిందని పేర్కొంది. తిసభ్య బెంచ్ తీర్పు చెప్పగానే కోర్టు హాలు చప్పట్లతో మార్మోగింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై నిర్భయ తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ కుటుంబ విజయమని ఆయన పేర్కొన్నారు. 2012 డిసెంబర్ 16న 23 ఏళ్ల మెడికో విద్యార్థి నిర్భయపై ఆరుగురు యువకులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీ నడివీథిలో ఓ బస్సులో జరిగిన ఈ కిరాతకం అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. ఈ సామూహిక అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో విద్యార్థిని సింగపూర్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
nation
20,991
04-08-2017 02:06:42
పాక్‌, ఇంగ్లండ్‌ల్లో విజయాలు మరిచావా ?
న్యూఢిల్లీ: కోహ్లీ సారథ్యంలోని టీమిండియాకు గతంలోని ఏ భారత జట్లూ సాటిరావన్న కోచ్‌ రవిశాస్ర్తి వ్యాఖ్యను మాజీ కెప్టెన్‌ గంగూలీ తిప్పికొట్టాడు. పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ల్లో భారత్‌ విజయాలను మరిచిపోయావా.. అని ప్రశ్నించాడు. ‘15 ఏళ్లలో తొలిసారి పాక్‌ను వారి దేశంలో, 2002లో ఇంగ్లండ్‌లో ఆ జట్టును ఓడించిన విషయాన్ని మరిచినట్టున్నావు. కానీ, నేను జట్లను పోల్చిచూసే విషయాల్లోకి వెళ్లదలుచుకోలేదు’ అన్నాడు. ‘2019 వరకూ శాస్త్రికి బాధ్యతలు అప్పజెప్పాం. ప్రపంచకప్‌ను తిరిగి తీసుకురా గలిగితే ఆ పదవికి అతడు న్యాయం చేసినట్టే. ఆల్‌ ద బెస్ట్‌’ అని గంగూలీ అన్నాడు.
sports
19,178
29-08-2017 03:22:06
టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు
పీకల్లోతు వరదలో 200 మంది భారత విద్యార్థులు హ్యూస్టన్‌, ఆగస్టు 28: గత 13 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అమెరికాను హరికేన్‌ హార్వే ముంచేసింది. ఈ వరదల్లో వందలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. టెక్సా్‌సలోని యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ నీట మునిగింది. పీకల్లోతు వరద నీటిలో 200 మంది భారత విద్యార్థులు చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. షాలిని, నిఖిల్‌ భాటియా అనే ఇద్దరు విద్యార్థులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆస్పత్రి పాలైన విద్యార్థుల కుటుంబీకులు.. అక్కడికి చేరేలా సత్వర ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, హరికేన్‌ హార్వే వల్ల 1.3 కోట్ల మంది ప్రజలు ప్రభావితులయ్యారు. వరద విలయాన్ని సమీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మంగళవారం టెక్సాస్‌ వెళుతున్నారు. వరదల సమయంలోనూ అరుదైన వ్యాధి లీష్మానియాసి్‌సకు వాడే ఔషధాన్ని టెక్సాస్‌ ఆస్పత్రికి పంపించారు భారత సంతతి అమెరికన్‌ సీఈవో హరీశ్‌ కథరాని. సౌత్‌సైడ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ్‌సకు సీఈవో అయిన ఆయన.. రాత్రికిరాత్రే 49 వేల డాలర్ల ఖరీదైన ఔషధాన్ని పంపించారు.
nation
8,681
05-11-2017 11:47:38
చిరంజీవిగారిని కలిసిందే ఇష్యూ చేస్తారెందుకు?: జీవిత
ఇటీవల తన సినిమా గరుడవేగ ప్రీమియర్ షోకి రావాలని రాజశేఖర్, జీవిత దంపతులు చిరంజీవిని కలిసిన విషయం విదితమే. సినిమాకు ఎందరో ప్రముఖులను ఆహ్వానించింది ఈ జంట.. కానీ చిరంజీవిని కలిసింది మాత్రం బాగా వైరల్ అయింది. దీనిపై జీవిత స్పందించారు.  "ఎందుకు ప్రతి ఒక్కరూ చిరంజీవి గారిని కలిసింది ఇష్యూ చేస్తారో నాకు తెలియట్లేదు. మేము ఎన్నో ఈవెంట్స్‌లో చాలా సార్లు కలిశాం. మా మధ్య శతృత్వం ఏమీ లేదు. మేము సీఎం, మహేష్ బాబు వంటి సెలబ్రిటీలను ఎందరినో కలిసి ప్రీమియర్ షోకి రావాలని ఆహ్వానించాం. అలాగే చిరంజీవి గారిని కూడా ఆహ్వానించాం." అన్నారు జీవిత. అయితే జీవిత అన్నయ్య సడెన్‌గా మృతిచెందడంతో ప్రీమియర్ షో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి సక్సెస్ బాటలో నడుస్తోంది. తమకు సినిమా బావుందని చాలా మంది మెసేజ్ చేస్తున్నారని.. చాలా ఆనందంగా ఉందని జీవిత పేర్కొన్నారు.ఇటీవల తన సినిమా గరుడవేగ ప్రీమియర్ షోకి రావాలని రాజశేఖర్, జీవిత దంపతులు చిరంజీవిని కలిసిన విషయం విదితమే. సినిమాకు ఎందరో ప్రముఖులను ఆహ్వానించింది ఈ జంట.. కానీ చిరంజీవిని కలిసింది మాత్రం బాగా వైరల్ అయింది. దీనిపై జీవిత స్పందించారు.  "ఎందుకు ప్రతి ఒక్కరూ చిరంజీవి గారిని కలిసింది ఇష్యూ చేస్తారో నాకు తెలియట్లేదు. మేము ఎన్నో ఈవెంట్స్‌లో చాలా సార్లు కలిశాం. మా మధ్య శతృత్వం ఏమీ లేదు. మేము సీఎం, మహేష్ బాబు వంటి సెలబ్రిటీలను ఎందరినో కలిసి ప్రీమియర్ షోకి రావాలని ఆహ్వానించాం. అలాగే చిరంజీవి గారిని కూడా ఆహ్వానించాం." అన్నారు జీవిత. అయితే జీవిత అన్నయ్య సడెన్‌గా మృతిచెందడంతో ప్రీమియర్ షో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి సక్సెస్ బాటలో నడుస్తోంది. తమకు సినిమా బావుందని చాలా మంది మెసేజ్ చేస్తున్నారని.. చాలా ఆనందంగా ఉందని జీవిత పేర్కొన్నారు.ఇటీవల తన సినిమా గరుడవేగ ప్రీమియర్ షోకి రావాలని రాజశేఖర్, జీవిత దంపతులు చిరంజీవిని కలిసిన విషయం విదితమే. సినిమాకు ఎందరో ప్రముఖులను ఆహ్వానించింది ఈ జంట.. కానీ చిరంజీవిని కలిసింది మాత్రం బాగా వైరల్ అయింది. దీనిపై జీవిత స్పందించారు.  "ఎందుకు ప్రతి ఒక్కరూ చిరంజీవి గారిని కలిసింది ఇష్యూ చేస్తారో నాకు తెలియట్లేదు. మేము ఎన్నో ఈవెంట్స్‌లో చాలా సార్లు కలిశాం. మా మధ్య శతృత్వం ఏమీ లేదు. మేము సీఎం, మహేష్ బాబు వంటి సెలబ్రిటీలను ఎందరినో కలిసి ప్రీమియర్ షోకి రావాలని ఆహ్వానించాం. అలాగే చిరంజీవి గారిని కూడా ఆహ్వానించాం." అన్నారు జీవిత. అయితే జీవిత అన్నయ్య సడెన్‌గా మృతిచెందడంతో ప్రీమియర్ షో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి సక్సెస్ బాటలో నడుస్తోంది. తమకు సినిమా బావుందని చాలా మంది మెసేజ్ చేస్తున్నారని.. చాలా ఆనందంగా ఉందని జీవిత పేర్కొన్నారు.
entertainment
21,102
30-05-2017 01:39:17
ఫేవరెట్లుగా సైనా, సాయి
నేటి నుంచి థాయ్‌ గ్రాండ్‌ ప్రీబ్యాంకాక్‌: సుదీర్మకప్‌ను మిస్‌ అయిన భారత టాప్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌.. థాయ్‌లాండ్‌ గ్రాండ్‌ ప్రీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పురుషుల విభాగంలో సాయిప్రణీత కూడా టైటిల్‌పై గురిపెట్టాడు. మంగళవారం జరిగే క్వాలిఫయర్స్‌తో టోర్నీ మొదలుకానుంది. రెండో సీడ్‌ నెహ్వాల్‌.. తొలి రౌండ్‌లో స్లొవేకియా షట్లర్‌ మార్టినా రెపిస్కాతో తలపడనుంది. క్వార్టర్స్‌ వరకు సైనా ప్రయాణం సాఫీగానే సాగే అవకాశం ఉంది. గట్టి పోటీ ఇవ్వగలిగిన మిచెల్‌ లీ (కెనడా), నాలుగో సీడ్‌ బుసానన్ ఆంగ్‌బామ్‌రంగ్‌పన్ (థాయ్‌ లాండ్‌) మరో పార్శ్వంలో ఉన్నారు. ఒకవేళ సైనా ఫైనల్‌కు చేరితే టాప్‌ సీడ్‌ రచనోక్‌తో తలపడే అవకాశం ఉంది. ఇక సింగపూర్‌ ఓపెన చాంప్‌ సాయి ప్రణీత అంతర్జాతీయ సర్క్యూట్‌లో తనదైన గుర్తింపు కోసం కష్టపడుతున్నాడు. తొలి రౌండ్‌లో ఇండోనేసియా ఆటగాడు నాథనైల్‌ ఎర్నెస్టోతో ప్రణీత పోటీపడనున్నాడు. గాయంతో ఏడాదిపాటు కోర్టుకు దూరమైన గురుసాయి దత, ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న పారుపల్లి కశ్యప్‌, సౌరభ్‌ వర్మ, మహిళల సింగిల్స్‌లో రితుపర్ణ, రుత్విక శివాని, శ్రీ కృష్ణప్రియ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
sports
10,500
13-09-2017 16:35:59
బాలకృష్ణపై ఫోకస్ పెట్టిన మెగా ఫ్యామిలీ డైరెక్టర్
ఇప్పటివరకు ఎక్కువగా కుర్ర హీరోలు, క్రేజీ హీరోలతోనే పని చేసిన ఆ యంగ్ డైరెక్టర్. ఈసారి సీనియర్ హీరోను టార్గెట్ చేశాడట. ఆయనకు ఎలాగైనా కథ చెప్పి ఒప్పించేందుకు తన గురువు సాయం తీసుకోబోతున్నాడట ఆ దర్శకుడు. టాలీవుడ్‌లోని మిగతా హీరోలతో పోలిస్తే బాలకృష్ణకు ఒక ప్రత్యేకత ఉంది. కథ నచ్చితే దర్శకుడి ట్రాక్ రికార్డ్‌ను పట్టించుకోకుండా సినిమా చేయడానికి రెడీ అయిపోతారు బాలయ్య. అందుకే తమ కథలో బాలయ్యను మెప్పిస్తే చాలని చాలామంది దర్శకులు భావిస్తుంటారు. ఈ ప్రయత్నంలో ఎంతో మంది దర్శకులు సక్సెస్ సాధించారు కూడా. తాజాగా బాలకృష్ణను తన స్క్రిప్ట్‌తో మెప్పించాలని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 'డీజే' సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో డీలా పడిపోయిన హరీశ్ శంకర్. ఆ తరువాత 'దాగుడు మూతలు' అనే సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ కన్ను బాలకృష్ణ మీద పడిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. బాలకృష్ణకు కథ చెప్పేందుకు తన గురువు అయిన దర్శకుడు పూరి జగన్నాథ్ సాయం తీసుకోవాలని హరీశ్ శంకర్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. బాలయ్య కోసం హరీశ్ శంకర్ రెండు మూడు కథలు సిద్ధం చేసి పెట్టుకున్నాడని, ఆయన టైమ్ ఇచ్చిన వెంటనే స్టోరీ చెప్పాలని భావిస్తున్నాడని సినీజనం చర్చించుకుంటున్నారు. బాలకృష్ణతో మరో సినిమా చేస్తానని పూరి జగన్నాథ్ ప్రకటించడంతో ఆయనకంటే ముందే బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకోవాలని హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా తన కథతో బాలయ్యను హరీశ్ శంకర్ మెప్పించగలిగితే మరో రేర్ కాంబినేషన్‌లో సినిమా వచ్చినట్టే.
entertainment
12,747
11-02-2017 00:51:29
ఇంజనీరింగ్‌ కోర్సులకూ.. ఒకే ప్రవేశ పరీక్ష!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి ఇకపై విద్యార్థులు వేర్వేరు ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలలన్నిటికీ కలిపి ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2018-19 విద్యాసంవత్సరం నుంచే నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ)ను కేంద్ర మానవవనరుల శాఖ ఆదేశించింది.  ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. వైద్యకోర్సులకు నిర్వహిస్తున్న ఎన్‌ఈఈటీ(నీట్‌) తరహాలోనే.. ఈ పరీక్ష విధా నం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం.. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి కర్ణాటక కెసెట్‌ను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ను నిర్వహిస్తున్నాయి. అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ), ట్రిపుల్‌ ఐటీ వంటి సంస్థల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్‌, ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్డ్స్‌ వంటి పరీక్షలను నిర్వహిస్తున్నారు.  ఇలా వేర్వేరు పరీక్షలకు హాజరుకావడం విద్యార్థులకు భారంగా పరిణమిస్తోంది. ఒకే ప్రవేశ పరీక్షతో.. విద్యార్థులకు పలు పరీక్షలు రాసే ఇబ్బంది తప్పుడంతోపాటు ఇంజనీరింగ్‌ కోర్సుల్లో నాణ్యత పెరగడం.. ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రవేశాల్లో పారదర్శక విధానాన్ని తీసుకొచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
nation
9,228
29-10-2017 22:40:05
నిలుచోవాల్సిందే
‘‘జాతీయ గీతం వినిపించగానే ఎవరైనా లేచి నిలుచోవాల్సిందే. దేశభక్తి అనేది మనసులో పొంగే గొప్ప ఉద్వేగం. దాన్ని సహజంగా బయటపెట్టాలి’’ అని అంటున్నారు సన్నీలియోన్‌. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తేరా ఇంతిజార్‌’. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె జాతీయ గీతం గురించి ప్రస్తావించారు.
entertainment
6,200
10-12-2017 10:55:38
ఆయ‌న కాళ్ల‌మీద ప‌డి న‌మ‌స్కారం చేశా: ముర‌ళీమోహ‌న్‌
ఓ వారాల‌బ్బాయి జ‌య‌భేరి - 18‘యాదోం కి బారాత్’ అని హిందీలో ఓ సినిమా వ‌చ్చింది. ధ‌ర్మేంద్ర హీరోగా చేశారు. తెలుగులో ఆ సినిమా నిర్మించేందుకు పీతాంబ‌రంగారు హక్కులు తీసుకున్నారు. ఆ సినిమాకు ఎస్‌.డి.లాల్‌గారు డైరెక్ట‌ర్‌. ఆయ‌న బ్ర‌ద‌ర్‌ ఎస్‌.ఎస్‌.లాల్‌గారు కెమెరామేన్.ఆ సినిమాలో ముగ్గురు అన్న‌ద‌మ్ములు ఉంటారు. ఎన్.టి.రామారావుగారు అన్న‌గా న‌టించారు. బాల‌య్య‌బాబుగారు, నేనూ త‌మ్ముళ్లుగా చేశాం. అందులో విష‌యం ఏంటంటే.. ముగ్గురు అన్న‌ద‌మ్ములు చిన్న‌ప్పుడే విడిపోతారు. అక్క‌డి నుంచి పెరిగి పెద్ద‌య్యేక్ర‌మంలో ఒక‌రినొక‌రు క్రాస్ అవుతూనే ఉంటారు. కానీ ఎవ‌రు ఎవ‌రో ఎవ‌రికీ తెలియ‌ద‌న్న‌మాట‌. సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే సినిమా. చాలా చ‌క్క‌గా ఉంటుంది. అవ‌కాశం ఎలా వ‌చ్చిందంటే..!ఆ రోజు నేను ఏదో ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నాను. బోయ్ వ‌చ్చి, ‘మీకోసం పీతాంబ‌రంగారు, ఆయ‌న‌తో లాల్‌గారు వ‌చ్చారండీ’ అన్నాడు. షాట్ మ‌ధ్య‌లో ఆపి నేను బయటకు రాబోతుంటే పీతాంబ‌రంగారు అక్క‌డినుంచే ‘ఏం ఫ‌ర్వాలేదు. షాట్ పూర్తి చేసుకుని రండి’ అని సైగ చేశారు. స‌రేన‌ని షాట్ అయ్యాక వెళ్లాను. షూటింగ్ జ‌రుగుతుంటే వాళ్లు కూడా అంతసేపు చూస్తూనే ఉన్నారు. న‌న్ను క‌లిసి ‘మేం ఇలా ఓ సినిమా చేస్తున్నామండీ.. చాలా మంచి సినిమా. క‌ల‌ర్ సినిమా. ఎన్టీరామారావుగారు హీరో. ఆయనకు ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ ఉంటారు. అందులో మీరు ఒక బ్ర‌ద‌ర్‌. ఎన్టీఆర్‌గారు షూటింగ్‌లో ఉన్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు మ‌ధ్యాహ్నం తీసుకెళ్తాం. ఆయ‌న మిమ్మ‌ల్ని చూసి ఓకే చేస్తే మీరే ఆ పాత్ర‌లో చేద్దురుగానీ’ అన్నారు. ఎన్టీఆర్ గారి సినిమా అన‌గానే ఒకర‌క‌మైన ఉద్వేగం క‌లిగింది. ఆయ‌న్ని ఒక్క‌సారి చూస్తే చాల‌నుకునేవారు ఎంద‌రున్నారో నాకు తెలుసు.         అలాంటిది ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డం, అదీ కెరీర్ ప్రారంభంలో ఉన్న‌వాళ్ల‌కు ఇలాంటి అవ‌కాశం రావ‌డం మామూలు విష‌యం కాదు. అందుకే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అన్నట్టుగానే లంచ్ టైమ్‌లో ఎన్టీఆర్‌గారు ఉన్న లొకేష‌న్‌కి వెళ్లాం. ప‌ల్లెటూరునుంచి వ‌చ్చినవాడిని క‌దా, ఎవ‌రికీ న‌మ‌స్కారం పెట్ట‌డం కూడా చేత‌కాదు నాకు. మ‌న ఊళ్ల‌ల్లో న‌మ‌స్కారాలు పెట్ట‌డం వంటివి ఉండ‌వు క‌దా. తెలిసిన వాళ్ళైతే న‌వ్వుతాం. లేకుంటే వ‌రుస‌లు పెట్టి ప‌ల‌క‌రించుకుంటాం అంతే క‌దా. అంత‌కుమించి న‌మ‌స్కారాలు పెట్ట‌డాలు లాంటివి ఎందుకు ఉంటాయి? అయినా నేను న‌మ‌స్కారం పెట్టాను. చేతుల‌తో కాదు.. ఏకంగా కాళ్ళమీదప‌డి న‌మ‌స్కారం చేశాను. ఇంత‌కీ చేసింది ఎవ‌రిక‌నుకున్నారు? ఎన్టీఆర్‌గారికి. మేం ఆ లొకేష‌న్‌లోకి వెళ్లేస‌రికి ఎన్టీఆర్‌గారు ట‌చ‌ప్ చేసుకుంటూ మేక‌ప్ రూమ్‌లో ఉన్నారు. ‘ఏవండీ వాళ్లు వ‌చ్చారండీ’ అని ఎవ‌రో ఆయ‌న‌తో అన్నారు. వెంట‌నే ఆయ‌న ఇటు తిరిగారు కుర్చీలో నుంచి. చూడ‌గానే.. అస‌లు ఆ ఫిగ‌ర్‌ని చూసేస‌రికి.. ఏదో ఒక గొప్ప ఫీలింగ్ వ‌చ్చేసింది. నాకు తెలియ‌కుండా వెళ్లిపోయి పాదాల‌కు న‌మ‌స్కారం పెట్టేశా.      త‌ర్వాత అనిపించింది.. అస‌లు న‌మ‌స్కారం ఎలా పెట్టాను? అని. ఆ ప‌ర్స‌నాలిటీని చూసేస‌రికి నాకు తెలియ‌కుండా జ‌రిగిపోయిందంతే. ‘ఆ బ్ర‌ద‌ర్ లేవండీ. విన్నాం మీ గురించి’ అన్నారు ఎన్‌.టి.ఆర్‌. ఆయ‌న నాతో ప‌లికిన తొలి ప‌లుకులు అవి. ఇప్ప‌టికీ అక్ష‌రం అక్ష‌రం నాకు గుర్తే. ‘బ్ర‌ద‌ర్‌.. ఈ సినిమాలో మీది చాలా మంచి పాత్ర‌. పేరుకు నేను హీరోనే కానీ, అస‌లు ఇందులో నాకు ఒక్కపాట కూడా లేదు. పాట‌ల‌న్నీ మీకూ, బాల‌య్య‌బాబుకే ఉన్నాయి. మ‌నం ముగ్గురం అన్న‌ద‌మ్ములుగా చేస్తున్నాం. మీకు చాలా మంచిపేరు వ‌స్తుంది. ఏం సందేహించ‌కుండా చేయండి. మంచి భ‌విష్య‌త్తు ఉంది మీకు’ అన్నారు. వెంట‌నే నేను ‘‘అలాగే అన్న‌గారూ.. త‌ప్ప‌కుండా అండీ’’ అన్నాను. ఆ మాట‌లు కూడా నా నోటినుంచి ఎలా వ‌చ్చాయో తెలియ‌దు. అంత త‌న్మ‌య‌త్వంలో ఉన్నాను. ముహూర్తం షాట్..!యాదోం కి బారాత్‌ చిత్రం ‘ముహూర్తం షాట్‌’ చాలా కోలాహ‌లంగా చిత్రీక‌రించారు. ఈ ముగ్గురు బ్ర‌ద‌ర్స్ అనుకోకుండా అలా క్రాస్ అవుతూ క‌న‌ప‌డ‌టం ఫ‌స్ట్ షాట్ కింద తీశారు. ఎన్టీఆర్‌గారు సిగ‌రెట్ నోట్లో పెట్టుకుని లైట‌ర్ కోసం వెతుకుతూ ఉంటే, నేను ప‌క్క‌నుండి అగ్గిపెట్టె వెలిగించి ఇవ్వ‌డం, మ‌ధ్య‌లో బాల‌య్య‌బాబు వ‌చ్చి ‘ఎక్స్ క్యూజ్‌మీ’ అని అన‌గానే మేమిద్ద‌రం అలా చూడటం.. అద‌న్న‌మాట ఆ షాట్‌. చూసిన వాళ్లంద‌రూ ఓకే అని చప్పట్లు కొట్టేశారు. ప్ర‌ముఖహీరో, త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌గారు ఈ ముహూర్తం షాట్‌కి క్లాప్ కొట్టారు. ఇంకెవ‌రో ప్ర‌ముఖుడు స్విచ్ఛాన్ చేశారు. దానికి ఆ రోజుల్లోనే ప్రెస్‌వాళ్లు చాలామంది వ‌చ్చారు. నా కెరీర్‌లో తొలి సారి సూట్ వేసుకుని న‌టించిన షాట్ అదే.           అంత‌కు ముందు సూట్‌లు వేసుకునేటంత వేషం కూడా నేనెప్పుడూ చేయ‌లేదు. ఆ సినిమా జ‌రిగిన‌న్ని రోజులూ నాకు అమితానంద‌మే. బాల‌య్య‌బాబుతో నేను తొలిసారి న‌టించ‌డం కూడా ఆ చిత్రంలోనే. అందులో బాల‌య్య‌బాబు గిటార్ వాయించే పాత్ర‌లో క‌నిపిస్తారు. నేనూ మ‌న ల‌త‌గారూ కాంబినేష‌న్‌. ఎన్టీఆర్‌గారిని ప్రేమిస్తున్న అమ్మాయిగా కాంచ‌న‌గారు న‌టించారు. అందులో నాకు రెండు మంచి డ్యూయ‌ట్లు ఉన్నాయి. ఆ త‌ర్వాత ఒక ఫ్యామిలీ సాంగ్ కూడా ఉంది. ఆ సినిమా చేస్తున్న‌ప్పుడు ఎన్టీఆర్‌గారు నాపట్ల చూపించిన అభిమానాన్ని మాట‌ల్లో చెప్ప‌లేం. అంత బాగా ద‌గ్గ‌ర‌కు తీశారు. అంత ఆనందంగానే సినిమా రిలీజైంది. సూప‌ర్ హిట్ అయింది. ఈ చిత్ర శ‌త‌దినోత్స‌వం కూడా ఘనంగా నిర్వ‌హించారు. నా కెరీర్లో వందరోజుల షీల్డ్ పుచ్చుకుంది కూడా ఆ సినిమాకే. ‘అన్న‌ద‌మ్ముల అనుబంధం’ 100 రోజుల వేడుక‌కు మ‌ళ్లీ ఎంజీఆర్‌గారు వ‌చ్చారు. న‌న్ను గుర్తుప‌ట్టి అభినందించారు.         ఆయ‌నే కాదు, అప్ప‌టినుంచి అంద‌రూ న‌న్ను గుర్తుప‌ట్ట‌సాగారు. అయితే ముర‌ళీమోహ‌న్ అని కాదు. నేను బ‌య‌టికి ఎక్క‌డికి వెళ్లినా అస‌లు న‌న్ను ముర‌ళీమోహ‌న్ అనే పేరుతో పిలిచేవారు కాదు. కొత్త ఆర్టిస్ట్‌ని కదా. అందుకే ముర‌ళీమోహ‌న్ అనే పేరు వాళ్ల‌కు స‌రిగా రిజిస్ట‌ర్ కాలేదు. అందుక‌ని ‘వీడు ఫ‌లానా సినిమాలో చేశాడురా’ అని కొంద‌రు అంటే, ‘రేయ్‌.. వీడు అన్న‌ద‌మ్ముల అనుబంధంలో, ఎన్టీఆర్ త‌మ్ముడురా’ అని గుర్తుప‌ట్ట‌సాగారు. ఎన్టీఆర్ త‌మ్ముడు అనే పేరుకోసం ఎంతోమంది ఎదురుచూస్తారు. కానీ ఆ అదృష్టం నాకు చాలా సుల‌భంగా ద‌క్కింది. ఆ సినిమా త‌ర్వాత ఇక నేనస‌లు తిరిగి చూడాల్సిన అవ‌సరం రాలేదు. గ‌ట్టిగా చెప్పాలంటే నాకు ఖాళీయే లేదు. సినిమా షూటింగ్ లేదంటే విజ‌య‌వాడ బ‌య‌లుదేర‌డం, అక్క‌డ బిజినెస్ చూసుకుని మ‌రుస‌టిరోజు బయలుదేరి మద్రాసు చేరుకోవడం’. చాలా హెక్టిక్ అయిందిఇక ఒక స్టేజ్‌కి వ‌చ్చేస‌రికి ఇంటికి వెళ్ల‌డానికి కూడా కుద‌ర‌లేదు. భార్యా పిల్ల‌ల‌తో ఫోన్లోనే మాట్లాడేవాడిని. ఏదైనా అత్య‌వ‌స‌రం అయితే, గ్యాప్ చూసుకుని వెంట‌నే వెళ్లి వ‌చ్చేవాడిని. ఒకానొక స‌మ‌యానికి అది కూడా ఇబ్బందిగా మారింది. ‘‘ఇక మ‌నం సెటిల్ అయిన‌ట్టే’’ అనిపించింది. అందుకే బెజ‌వాడవెళ్లి పార్ట్‌న‌ర్‌తో మాట్లాడాను. ‘‘నేను వ్యాపారం మీద దృష్టి పెట్టలేక‌పోతున్నాను. ఫ్యామిలీ కోసం కూడా స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నాను. అందుకే వ్యాపారాన్ని క్లోజ్ చేసి ఆ స‌మ‌యాన్ని ఫ్యామిలీ కోసం కేటాయించాల‌నుకుంటున్నాను. మీరు కంటిన్యూ చేసుకుంటే చేసుకోండి. నేను నా వాటా మీకే ఇచ్చేస్తాను’’ అన్నాను.           ‘మీరు వృద్ధిలోకి రావ‌డం చాలా ఆనందంగా ఉంది. రేపు మీరు పెద్ద స్టార్ అయితే మా పార్ట్ న‌ర్ అని గ‌ర్వంగా చెప్పుకుంటాను. వ్యాపారంలో నేను ఎంత కృషి చేశానో, మీరు అంత‌క‌న్నా ఎక్కువే చేశారు. మీరు లేకుండా నేను ఒక్క‌డినే చేయ‌లేను, క్లోజ్ చేసేద్దాం’’అన్నారు ఆయన. అప్పుడు బిజినెస్‌ని క్లోజ్ చేశాం. అప్పుడే ఫ్యామిలీని చెన్నైకి తీసుకొచ్చాను. మ‌ద్రాసులో కాపురంఅప్పుడు మా బాబు బాగా చిన్నవాడు. ఒక‌టో త‌ర‌గ‌తేమో చ‌దువుతున్నాడు. రామ‌కృష్ణా మిష‌న్‌స్కూల్లో చేర్పించాను. పాప మూడోక్లాసుకేమో వ‌చ్చింది. అమ్మాయిని శార‌దా విద్యాల‌యలో చేర్పించాను. స్కూలు పూర్త‌య్యే వ‌ర‌కు వాళ్లు అక్క‌డే చ‌దువుకున్నారు. అక్క‌డినుంచి బాబు ల‌యోలా కాలేజీకి వెళ్లారు. స్టెల్లామేరీస్‌లో అమ్మాయి చేరింది. ద‌ర్శ‌కేంద్రుడితో ప‌రిచ‌యం ఎర్లీ డేస్‌లో నేను నటించిన సినిమాల్లో క్రాంతికుమార్‌గారి బ్యాన‌ర్‌లో చేసిన చిత్రాలు నాకు చాలా కీల‌కం. ఒక ర‌కంగా నా హోమ్ బ్యాన‌ర్‌లాంటిది అది. హ‌నుమాన్‌ప్ర‌సాద్‌,గారు, క్రాంతికుమార్‌గారు పార్ట్ న‌ర్స్. ‘త‌ల్లీకూతుళ్లు’ చిత్రాన్ని క‌లిసే తీశారు. ఆ త‌ర్వాత ఎవ‌రి సినిమాలు వాళ్లు తీసుకున్నారు. క్రాంతికుమార్‌గారు సొంతసినిమాలు మొద‌లుపెట్టాక ‘ఊర్వ‌శి’, ‘శార‌ద‌’ చిత్రాలు పూర్తిచేసి, ‘జ్యోతి’ అనే సినిమా చేశారు. రాఘ‌వేంద్ర‌రావుగారు అప్ప‌టికే ‘బాబు’, ‘రాజా’ అని రెండు సినిమాలు చేశారు. ‘జ్యోతి’ ఆయ‌న‌ మూడోసినిమా. దానికి న‌న్ను హీరోగా సెల‌క్ట్ చేశారు. హీరోయిన్‌గా ఎవ‌రిని పెట్టాలా? అని ర‌క‌ర‌కాలుగా ఆలోచిస్తున్నారు.. అప్పుడు తాళ్లూరి రామేశ్వ‌రి ముంబైలో ఉంది. హీరోయిన్‌గా ఆమె స‌రిపోతుంద‌ని అంద‌రూ కూర్చుని నిర్ణ‌యించి ఫోన్లు చేశారు. ఆ అమ్మాయి వ‌చ్చింది. సినిమా రికార్డింగ్ రోజున ఆ అమ్మాయిని నాక్కూడా ప‌రిచ‌యం చేశారు.           కానీ ఎందుకో ఆ అమ్మాయి లుక్స్, న‌ట‌నప‌రంగా వాళ్లు శాటిస్‌ఫై కాలేదు. ఇంకెవ‌రినైనా చూద్దాం.. ఇంకెవ‌రినైనా చూద్దాం అని అనుకునేవారు. రోజూ నేను సాయంత్రం పూట ఖాళీగా ఉంటే క్రాంతికుమార్‌గారి ఆఫీసులో కూర్చునేవాడిని. ‘ఏ సినిమాలు చేస్తున్నావు ఇప్పుడు’ అని ఒక రోజు రాఘ‌వేంద్ర‌రావుగారు అడిగారు. ‘ల‌క్ష్మ‌ణ రేఖ‌’ అని ఒక సినిమా చేస్తున్నానండీ’’ అని చెప్పా. ‘హీరోయిన్ ఎవ‌రు?’ అని అడిగారు. ‘‘జ‌య‌సుధ అని ఒక‌మ్మాయి ఉందండీ’’ అన్నా. ‘బాగా న‌టిస్తోందా?’ అని అడిగారు. ‘‘మంచి ఫేసు అండీ. చాలా బాగా చేస్తోంది’’ అన్నా.ఇంకా ఉందిడా. చల్లా భాగ్యలక్ష్మీసెల్ : 88850 55528
entertainment
5,369
11-08-2017 20:49:29
అందుకు రూ.32.5 కోట్లు చెల్లించిన సల్లూ భాయ్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ రియల్ లైఫ్‌లోనూ దబంగ్ మేన్ అనిపించుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం తన సినిమాల వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాడు సల్లూభాయ్. వరుస విజయాలతో ఊపుమీదున్న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు ఈ ఏడాది 'ట్యూబ్ లైట్'‌తో బ్రేక్ పడింది. 'ట్యూబ్ లైట్' చిత్రానికి సల్మాన్ నిర్మాత కూడా కావడంతో.. డిస్ట్రిబ్యూటర్స్ అంతా నష్టపరిహారం కోసం కండలవీరుడు ఇంటిముందు క్యూ కట్టారు. అయితే సల్లూభాయ్ ఏమాత్రం తప్పించుకోకుండా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ను ఆదుకుంటానని ప్రకటించాడు. దానికి సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ కూడా సపోర్ట్ ఇచ్చాడు. ఇప్పటి వరకూ 'టైగర్ జిందా హై' షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న సల్మాన్ ఇటీవల ముంబయ్ తిరిగి వచ్చాడు. రాగానే అన్నమాట ప్రకారం నష్టపోయిన వారికి 32.5 కోట్ల వరకూ నష్టపరిహారం చెల్లించాడట. దక్షిణాదిన కూడా అగ్ర కథానాయకుల సినిమాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. పవన్ కళ్యాణ్ గత చిత్రాలు 'సర్దార్ గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు', మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం', సూర్య 'సింగం-3', విజయ్ 'భైరవ' ఇలా భారీ బడ్జెట్‌తో రూపొంది భారీ బిజినెస్ చేసిన ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. మరి సల్మాన్ లా ఈ సౌత్ స్టార్స్ కూడా తమ పారితోషికంలో కొంత భాగాన్ని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కు అందచేస్తారేమో చూడాలి…
entertainment
11,866
11-09-2017 19:35:18
'బ్లూవేల్ గేమ్'పై కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మృత్యుక్రీడ 'బ్లూవేల్ గేమ్'పై పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు కన్నెర్ర చేసింది. బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌పై స్టే ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. ప్రపంచంలోని పలు దేశాల్లో ఆత్మహత్మలను ప్రేరేపిస్తూ 'మృత్యు క్రీడ'గా భయోత్పాతం సృష్టిస్తున్న బ్లూవేల్ గేమ్ ఇటీవల ఇండియాలోని పలు రాష్ట్రాల్లో ఈ ప్రభావం చూపుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు అధీనంలో సాగే ఈ 50 రోజుల ఆన్‌లైన్ గేమ్‌‌ ఎందరో అమాయకులను బలిగొంటోంది. ఈ గేమ్ ఆడాలనుకునే వ్యక్తికి ముందుగా 'వేల్' బొమ్మ గీయమన్న ఆదేశాలు వెళ్తాయి. ఆ తర్వాత ఒంటిమీద ఆ బొమ్మను ముద్రించుకొమ్మంటారు. ఆ తర్వాత హారర్ చిత్రాలను ఒంటిరిగా చూడాలనే టాస్క్ ఇస్తారు. ఇలాంటి పలు ఛాలెంజ్‌ల తర్వాత ఆత్మహత్య చేసుకోవాలంటూ ఫైనల్ ఛాలెంజ్ విసురుతారు. రష్యాకు చెందిన సైకాలజీ విద్యార్థి ఫిలిఫ్ బుడైకిన్ ఈ గేమ్ క్రియేట్ చేసినట్టు చెబుతారు. ఇటీవల ఈ గేమ్ ఆడుతూ ముంబై, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో మృత్యువాత పడిన ఘటనలు వెలుగుచూశాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ ఆన్‌లైన్ గేమ్‌ పరిణామాలపై దృష్టి సారించింది. ఈ గేమ్‌కు సంబంధించిన లింక్‌లు తొలగించాలంటూ గూగుల్, ఫే‌స్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, మైక్రోసాఫ్ట్, యాహూ వంటి సోషల్ మీడియా దిగ్గజాలను ఆదేశించింది. మేనకా గాంధీ సైతం ఈ గేమ్ దుష్పరిణామాలను హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు.
nation
11,156
27-03-2017 20:55:56
వైద్య పరీక్షల అనంతరం.. లోక్‌సభకు హాజరైన సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చాలా కాలం తర్వాత పార్లమెంట్‌కు వచ్చారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఫలితాలకు ముందు మార్చి 8న వైద్య పరీక్షల కోసం సోనియా గాంధీ విదేశాలకు వెళ్ళారు. కాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫలితాల అనంతరం మార్చి 16న సోనియా వద్దకు ప్రయాణమయ్యారు. వీరిద్దరు కలిసి మార్చి 24న శుక్రవారం భారత్‌కు తిరిగివచ్చారు. వైద్య పరీక్షల అనంతరం సోనియా గాంధీ సోమవారం లోక్‌సభా కార్యక్రమాలకు హాజరయ్యారు. జీఎస్టీ బిల్లు గురించి మల్లికార్జున ఖర్గేతో చర్చించారు.
nation
16,426
13-09-2017 17:15:34
ఆ ఇద్దరినీ గుర్తుపట్టగలరా?
అహ్మదాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని అందరికీ తెలుసు. ఆయన విదేశాలకు వెళ్ళేటపుడు, స్వదేశంలో పర్యటించేటపుడు తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటారు. ఆయన ధరించే దుస్తుల్లో కుర్తాకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. బుధవారం మన దేశానికి వచ్చిన జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే కూడా ఆ ఫ్యాషన్‌కు ముగ్ధుడయ్యారు. షింజో అబేతో పాటు ఆయన సతీమణి అకీ అబే కూడా భారతీయ శైలిలో వస్త్రాలను ధరించి, మన దేశం పట్ల వారికిగల గౌరవాభిమానాలను చాటుకున్నారు. షింజో అబే తెల్లని కుర్తా, లాల్చీ, ఆకాశ నీలి రంగు కుర్తా ధరించారు. అదేవిధంగా ఆయన సతీమణి అకీ అబే ముదురు ఎరుపు, బంగారు వర్ణంగల సల్వార్, కమీజ్, బంగారు రంగులో మెరిసిపోయే దుపట్టా ధరించారు. అబే దంపతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం 8 కి.మీ. పొడవున రోడ్ షో నిర్వహించి, సబర్మతి ఆశ్రమం చేరుకున్నారు. అక్కడ మహాత్మా గాంధీకి షింజో అబే, అకీ అబే, నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఆశ్రమం మొత్తం కలియదిరుగుతూ అక్కడి విశేషాలను అబే దంపతులకు మోదీ వివరించారు.
nation
20,024
06-12-2017 01:54:22
విజయం ఊరిస్తోంది!
ఇంగ్లండ్‌కు 178 రన్స్‌.. ఆసీస్‌కు 6 వికెట్లు అడిలైడ్‌: ఆస్ర్టేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు రసవత్తరంగా మారింది. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న డే/నైట్‌ టెస్టులో విజయం ఇరుజట్లనూ ఊరి స్తోంది. ఆతిథ్య ఆసీస్‌ నిర్దేశించిన 354 పరుగుల లక్ష్య ఛేదన కు దిగిన ఇంగ్లండ్‌ నాలుగోరోజైన మంగళవారం ఆట ముగిసేసరికి 4వికెట్లు కోల్పోయి 176 రన్స్‌ చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ (67 బ్యాటింగ్‌) పోరాడుతున్నాడు. అతనికి తోడుగా క్రిస్‌ వోక్స్‌(5 బ్యాటింగ్‌) క్రీజులో ఉ న్నాడు. మిచెల్‌ స్టార్క్‌ రెండు వికెట్లు పడ గొట్టాడు.. మరొక్కరోజు మాత్రమే మిగిలున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే రూట్‌ సేన ఇంకా 178 పరుగులు చేయాలి. 6వికెట్లు పడగొడితే కంగారూలను గెలుపు వరిస్తుంది. అయితే రూట్‌తోపాటు మొయిన్‌ అలీ, బెయి ర్‌స్టోలను నమ్ముకున్న ఇంగ్లండ్‌ ఆఖరి రోజు ఆసీస్‌ బౌలర్లను ఎదురొడ్డి ఏ మేరకు పోరాడుతుందో చూడాలి. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 53/4తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ మరో 85 పరుగులు జోడించి 138 వద్ద ఆలౌటైంది. జేమ్స్‌ ఆండర్సన్‌ (5/43) కంగారూ గడ్డపై తొలిసారిగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. క్రిస్‌ వోక్స్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 442/8 డిక్లేర్డ్‌, ఇంగ్లండ్‌ 227 చేశాయి. ఆండర్సన్‌ సాధించెన్‌!ఇంగ్లండ్‌ ఏస్‌ పేసర్‌కు 130 టెస్టుల అనుభవం ఉంది. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్ల క్లబ్‌లోనూ చేరాడు. నాలుగు సార్లు ఆస్ర్టేలియా పర్యటనకు వెళ్లాడు. ఆసీస్‌ గడ్డపై 15 టెస్టులాడాడు. కానీ.. ఐదు వికెట్ల ప్రదర్శన ఒక్కసారైనా చేయలేదు. కెరీర్‌ చరమాంకంలో ఉన్న ఆండర్సన్‌కు ఇప్పుడు ఆ వెలితి కూడా తీరింది. అడిలైడ్‌ టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టిన అతడు ఆసీస్‌ గడ్డపై తొలిసారిగా ఈ ఘనత సాధించాడు.
sports
7,945
31-03-2017 22:43:05
వేడుక చూడాల్సిందే!
హీరో నాగచైతన్య ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ అంటున్నారు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఆయన చేస్తున్న చిత్రానికి ఈ పేరే పెట్టారు. ఉగాదికి ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయాలనుకున్నప్పుడు నిర్మాత అక్కినేని నాగార్జునకూ, దర్శకుడికీ మధ్య పెద్ద చర్చే నడిచింది. నాగ్‌ ఒక లుక్‌ను సెలక్ట్‌ చేస్తే, కల్యాణ్‌కృష్ణ ఇంకో లుక్‌పై మనసు పడ్డారు. ‘‘మధ్యలో నన్ను ఇన్‌వాల్వ్‌ చేయకండి’’ అని తటస్థ వైఖరి అవలంబించారు చైతు. ఎవరి మాట నెగ్గుతుందో, ఏ లుక్‌ బయటకొస్తుందో చూద్దామన్నారు. ఉగాది రోజున రెండు లుక్స్‌నూ రిలీజ్‌ చేసి, కొడుకుకు తగిన రీతినే సమాధానమిచ్చారు నాగ్‌. ఒకటి - యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన చైతు మాస్‌ లుక్‌ కాగా, మరొకటి - ఏదో వేడుక సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో చైతు, హీరోయిన్ రకుల్‌ప్రీత్ ఉల్లాసంగా డాన్స్ చేస్తున్న లుక్‌. వీటిలో మొదటిది తన ఛాయిస్‌ అనీ, రెండోది డైరెక్టర్‌ ఛాయిస్‌ అనీ చెప్పారు నాగార్జున. రెండింటికీ మంచి స్పందనే వచ్చింది. తనకు లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ తెచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ తరహాలో ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ చిత్రం చైతు కెరీర్‌కు కొత్త దిశనిస్తుందని నాగ్‌ నమ్ముతున్నారు. నటుడిగా ‘ప్రేమమ్‌’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న చైతు ఈ సినిమాతో కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించగలననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగ్‌ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’తో దర్శకుడిగా పరిచయమై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న కల్యాణ్‌కృష్ణ.. ఈ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంతో ద్వితీయ విఘ్నాన్ని సునాయాసంగా అధిగమిస్తానంటున్నారు. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమా జూన్ లేదా జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
entertainment
15,929
28-10-2017 17:04:36
యోగి ఆదిత్యనాథ్ ‘పవిత్ర’ నిర్ణయాలు
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పవిత్ర స్థలాల్లో మాంసం, మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర సాంస్కృతిక, మతపరమైన వ్యవహారాల మంత్రి లక్ష్మీనారాయణ చౌదరి తెలిపారు. బృందావన్ నగర పాలిక పరిషత్, మధుర జిల్లాలోని బర్సానా నగర పంచాయతీలను పవిత్ర తీర్థ స్థలాలుగా ప్రకటించినట్లు తెలిపారు. వీటి పరిథిలో మద్య, మాంసం విక్రయాలను నిషేధించినట్లు పేర్కొన్నారు. ఈ రెండు పురపాలక సంఘాలను మతపరమైన పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. శ్రీకృష్ణుడు జన్మించిన బృందావనం, రాధ జన్మించిన బర్సానాలను పవిత్ర యాత్రా స్థలాలుగా నోటిఫై చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్ అవస్థి తెలిపారు. లక్షలాది మంది యాత్రికులు వస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ప్రాంతాలను పవిత్ర స్థలాలుగా ప్రకటించినట్లు వివరించారు.
nation
7,330
15-10-2017 16:53:44
ఆ హీరోతోనే బండ్ల గణేష్ రీ-ఎంట్రీ!
కమెడియన్‌గా టాలీవుడ్‌లో నటించిన బండ్ల గణేస్ అనూహ్యంగా నిర్మాతగా మారి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వంటి వారితో సినిమాలు చేసిన బండ్ల గణేష్, నిర్మాతగా తొలిచిత్రం మాత్రం రవితేజతోనే చేశాడు. పరుశురామ్ దర్శకత్వంలో 'ఆంజనేయులు' టైటిల్‌తో వచ్చిన రవితేజ సినిమానే బండ్ల గణేష్ నిర్మాతగా తొలి సినిమా. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ ప్రొడ్యూసర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. కానీ కొంతకాలంగా బండ్ల గణేష్ సినిమాలకు దూరంగా ఉంటూ సైలెన్స్‌ని మెయింటేన్ చేశాడు. ఈ మధ్యే మళ్లీ సినిమాలు చేస్తానంటూ పవన్, ఎన్టీఆర్‌లతో టచ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. బండ్ల గణేష్ ప్రొడ్యూసర్‌గా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అది కూడా మళ్లీ రవితేజతోనే అనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే రవితేజతో చేసే సినిమా కన్ఫర్మ్ అయిందని, త్వరలోనే అఫీషియల్‌గా ఈ విషయాన్ని బండ్ల గణేష్ ప్రకటించబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో సంచరిస్తోంది. శ్రీదేవి ఇప్పటి వరకు చేయని ఆ ఒక్క పని ఏంటో తెలుసా?  రవితేజ జీవితంలోని కొన్ని కీలక ములుపులు ఇవే..
entertainment
15,447
15-02-2017 00:52:08
సినిమాలు, డాక్యుమెంటరీలలో జాతీయగీతానికి నిలబడనక్కర్లేదు
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: థియేటర్లలో జాతీయగీతాన్ని వినిపించేటప్పుడు పాటించాల్సిన నియమనిబంధనలపై గందరగోళానికి సుప్రీంకోర్టు మంగళవారం తెరదించింది. సినిమా కథలో భాగంగా లేక, న్యూస్‌రీల్‌లోగానీ, లేదా ఏదైనా డాక్యుమెంటరీలోగానీ జాతీయ గీతం వినిపించినప్పుడు థియేటర్‌లోని ప్రేక్షకులు నిలబడాల్సిన అవసరం లేదని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ భానుమతిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మూడు సందర్భాలలో ప్రేక్షకులు లేచి నిలబడాల్సి ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని పిటిషనర్లలో ఒకరైన శ్యామ్‌ నారాయణ్‌ చౌక్సీ వేసిన పిల్‌పై ధర్మాసనం తాజా ఉత్తర్వులిచ్చింది.
nation
6,412
08-01-2017 17:40:28
చిరంజీవి, నాగార్జున, పవన్ ఇంట్లో పాములు పట్టాను: సాయికిరణ్
ఎవరైనా ఇంటికి ‘కుక్కలున్నాయి జాగ్రత్త’ అనే బోర్డు పెట్టుకుంటారు. కానీ, ఓ నటుడు మాత్రం ‘పాములున్నాయి జాగ్రత్త’ అన్న బోర్డు పెట్టుకున్నాడు. ఆ నటుడెవరో కాదు.. నువ్వేకావాలి సినిమాలో ‘అనగనగా ఆకాశం ఉంది..’ అనే పాట గుర్తుందా? ఆ పాటలో కనిపించే సాయికిరణ్. అవును సాయికిరణ్‌కు పాములు పట్టడమంటే హాబీనట. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వివరాలను వెల్లడించాడు సాయికిరణ్. శివుడికి భక్తుడైనందువల్ల పాములను కాపాడే బాధ్యతను తీసుకున్నానని చెప్పిన అతడు.. చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గురించి వివరించాడు. అంతేకాదు.. సినీ ప్రముఖులైన నాగార్జున, చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోల ఇళ్లలోనూ పాములను పట్టానని చెప్పుకొచ్చాడు. పాములు పట్టడం ఎలా అలవాటైందన్న దాని గురించి సాయికిరణ్ ఇంకా ఏమన్నాడంటే..                ‘‘చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు.. చెట్లకు వానపాములు ఎంత మేలు చేస్తాయో మా సైన్స్ టీచర్ చెప్పారు. చెట్ల మొదళ్లలో వాటిని వేయాలని చెప్పారు. దీంతో ఒక రోజు ఇంటి దగ్గర వానపాములను పట్టి చెట్లకు వేస్తున్నాను. అప్పుడే వానపాము అనుకుని చిన్న త్రాచు పామును పట్టుకున్నాను. అదేమో నా వేలుకు చుట్టుకుని బుసలు కొడుతోంది. చెట్టు మొదలు వద్ద పెట్టి మట్టి కప్పేసినా.. మళ్లీ బయటకు వచ్చేస్తోందది. దీంతో దానికి నన్ను వదిలి వెళ్లడం ఇష్టం లేదేమోననుకుని.. మళ్లీ దానిని పట్టుకున్నాను. ఇంతలో మా ఇంట్లో వాళ్లొచ్చి దానిని కింద పడేసి చంపేశారు. అదేంటో తెలుసా..? కరిస్తే చచ్చిపోతావు అని చెప్పేవరకు నాకు అది పామని తెలియదు. కానీ, ఆ పాముని చంపినప్పుడు చాలా బాధేసింది. అదేం చెయ్యలేదు కదా. తప్పు మనదేనేమో.. వాటిని అనవసరంగా చంపుతున్నామని అనిపించింది. ఇక, ఇంకోసారి స్కూలు నుంచి వస్తుండగా.. రోడ్డుపై ఓ పెద్ద త్రాచుపాము చుట్టూ జనం మూగారు. దాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను వెళ్లి ఆపాను. ఎందుకు చంపుతున్నారని ప్రశ్నించాను. అయితే.. నువ్వెళ్లి పట్టుకో అనడంతో ముందుకెళ్లాను. బుసలు కొడుతూ మీదకొస్తుండడంతో పక్కనున్న ఓ వ్యక్తి నన్ను లాగేశాడు. ఆ తర్వాత వాళ్లంతా ఆ పామును చంపేశారు. అప్పుడు ఇంకా చాలా బాధేసింది. అందుకే సైనిక్‌పురిలో ఉండే పాములను సంరక్షించే ఓ సంస్థలో శిక్షణ తీసుకున్నాను. పాములు పట్టుకోవడం నేర్చుకున్నాను. అప్పట్నుంచి 3 వేల పై చిలుకు పాములను పట్టాను. చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్, నాగబాబు వంటి ప్రముఖుల ఇళ్లలో పాములు పట్టాను. అన్నపూర్ణ స్టూడియోస్‌లో రెండు సార్లు పాముల్ని పట్టుకున్నాను. అలా పాముల్ని పట్టుకున్నప్పుడు కొన్ని వందల సార్లు పాములు నన్ను కరిచాయి కూడా. కానీ, విషపూరిత సర్పాలు కరిసింది మాత్రం ఒక్కసారే’’ అని చెప్పాడు.                      అంతేకాదు.. ఓ సారి తాను పట్టిన పాము తప్పించుకుని ఇంట్లో గోడపైకి ఎక్కిన సందర్భాన్ని వివరించాడు. ఓ సారి పది అడుగుల జెర్రిపోతును పట్టుకున్నానని, ఓ సంచిలో వేసి ఇంట్లో పెడితే తప్పించుకుని ఇంటి పైన సబ్జాపై ఎక్కిందని చెప్పాడు. అంతలోని అమ్మ ఫోన్ చేసి ఎక్కడున్నావ్ రా అని అనేసరికి.. తప్పించుకుందా? అని తాను ప్రశ్నించానని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికెళ్లి ఆ పామును మళ్లీ పట్టేశానని వివరించాడు. ఇంకోసారి తన కార్పెంటర్ ఇంట్లో త్రాచు పామును పట్టేటప్పుడు ఎదురైన అనుభవాన్నీ సాయికిరణ్ వివరించాడు.                      ‘‘ఓ సారి మా కార్పెంటర్ కృష్ణ నా దగ్గరకు వచ్చి.. సార్ మా ఇంట్లోకి పాము వచ్చింది పట్టాలి సార్ అన్నాడు. సరే అని వెళ్లాను. అతడుండేదేమో చిన్న గుడిసె. లోపలికి వెళ్లి చూస్తే ఆ గుడిసె వాసానికి పెద్ద త్రాచు పాము చుట్టుకుని ఉంది. ఒక్కో చుట్టును తీస్తూ జాగ్రత్తగా పామును బస్తాలో వేసేందుకు ప్రయత్నించాను. చివరగా ఒక చుట్టు తీసేటప్పుడే కరెక్ట్‌గా కరెంట్ పోయింది. అదేమో నా మీదకు బుసలు కొడుతూ దూస్తోంది. టార్చ్ కూడా లేదు. దాని కాటు ఎక్కడ పడుతుందోనన్న టెన్షన్. వాడిని పిలిస్తే.. చిన్నగా కరెంట్ పోయిందా సార్ అంటూ వచ్చాడు. కోపమొచ్చి అవున్రా.. ఏదైనా లైట్ పెట్టు అంటే.. లైట్ లేదు సార్ అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. చివరకు అక్కడే ఉండే ఆటోవాళ్లు తమ దగ్గర ఉన్న ఫోన్ టార్చ్‌ను వేశారు. హమ్మయ్యా అనుకుంటూ పామును బస్తాలో వేశాను. కానీ, కరెంట్ పోయే సరికి అప్పుడే నా పని అయిపోయిందిరా బాబు అనుకున్నాను. కానీ, దేవుడి దయ వల్ల బతికి బట్ట కట్టగలిగాను’’ అని చెప్పుకొచ్చాడు సాయికిరణ్.
entertainment
15,408
01-01-2017 12:57:56
నన్ను బతకనివ్వండి ప్లీజ్ : అధికార పార్టీ అగ్ర నేత
లండన్ : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌కు, ఆయన కుమారుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు మధ్య తాను చిచ్చు పెట్టలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ స్పష్టం చేశారు. ‘‘నా బతుకు నన్ను బతకనివ్వండి’’ అని తనపై ఆరోపణలు చేస్తున్నవారికి విజ్ఞప్తి చేశారు. వివాదానికి తానే కారణమని భావిస్తే తనను వదిలిపెట్టేయాలని, తనకు విముక్తి కల్పించాలని ములాయం సింగ్ యాదవ్‌ను కోరారు. ప్రస్తుతం తనను విలన్‌గా చిత్రీకరిస్తుండటం నుంచి తనను కాపాడాలని ములాయంను కోరుతున్నట్లు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్లు ఎవరికి వస్తున్నాయో, ఎవరికి రాలేదో తనకు తెలియదని తెలిపారు.
nation
4,391
12-02-2017 23:26:31
చెరసాలలో చామంతులు
  వరవరరావు
editorial
3,770
14-10-2017 01:48:39
మార్క్సిస్టు పాలనలో మారణకాండ
కేరళలో సీపీఎంను అధికారం నుండి తొలగించడానికి ఆర్ఎస్ఎస్ ఏమీ చేయనవసరం లేదు, ప్రజలే చేస్తారు. గత రెండు మూడు పర్యాయాలుగా సీపీఎం ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు అభివృద్ధి అంశాలు తిరోగమనం పడుతున్నాయనేది ఒక వాస్తవం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేరళలో కొన్ని దశాబ్దాలుగా సీపీఎం చేతిలో వరుస హత్యలకు గురవుతూనే ఉన్నారు. 1959లో జరిగిన మొదటి హత్య నుండి ఈ వరుస హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ హత్యాకాండను మొదటి సారిగా ఇప్పుడు దేశం, ముఖ్యంగా మీడియా గుర్తిస్తున్నది. ప్రజాస్వామ్య విలువల ప్రకారం విస్తృత చర్చ జరగడం ద్వారా అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నది సత్యం. అదే ప్రయత్నంతో భారతీయ జనతా పార్టీ అక్టోబర్ 3 నుండి పక్షం రోజుల పాటు జనరక్ష యాత్రను నిర్వహిస్తున్నది. ఆ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. అందులో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఇదే సమయంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా సీపీఎం కార్యాలయాల వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే నవంబర్ 11న ఏబీవీపీ దేశవ్యాప్తంగా కార్యకర్తలు, విద్యార్థులతో ‘చలో తిరువనంతపురం’ పిలుపునిచ్చింది. కేరళలో సీపీఎం అసహన హత్యా రాజకీయాలను చర్చనీయాంశంగా మార్చి సీపీఎం పార్టీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగడాలను యావత్ ప్రపంచానికి తెలియజేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది.  కేరళ రాష్ట్రంలో రక్తపాతం స్థానిక శాంతి భద్రతల సమస్యేనని, రాష్ట్రంలో విస్తరించడానికి ఆర్ఎస్ఎస్ కుట్రపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, అధికార సీపీఎం పార్టీ ఆరోపిస్తున్నాయి. కేరళలో స్వయం సేవకులు వారి రక్తం, చెమటలను ధారవోస్తూ, కష్టపడి పనిచేయడం ద్వారా సంఘం తన పని అక్కడ విస్తరిస్తోంది. రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ శాఖలకు వస్తున్నారు. ఇది ఈ మధ్యన ప్రారంభమైంది కాదు. గత 40, 50 ఏళ్ల నుండి జరుగుతున్నదే. రాష్ట్రంలో అన్ని వైపులా, మారుమూలలకు కూడా ఆర్ఎస్ఎస్ వ్యాప్తి చెందుతున్నది. అలా ఆర్ఎస్ఎస్ శాఖలకు, కార్యక్రమాలకు హాజరవుతున్న అణగారిన వర్గాలలో భయం కలిగించడం, తద్వారా ఆర్ఎస్ఎస్‌లో కొత్తవారు చేరకూడదనే ఉద్దేశంతోనే సీపీఎం పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై హింసకు పాల్పడుతూ వారిని దారుణంగా హత్య చేయిస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ విస్తరించడం కోసమే ఆర్ఎస్ఎస్ రాజకీయ హింసను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి నిందిస్తున్నారు. వామపక్ష నాయకులు, కుహనా లౌకికవాదులు అదే విధంగా ఆరోపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్, స్వయంసేవకులు, రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు కేరళ రాష్ట్రంలోనూ, ఆ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా అధికారంలో లేరు. ఆర్ఎస్ఎస్ కుట్ర పూర్వకంగా వ్యవహరిస్తుంటే అధికారంలో ఉన్నవారు విచారణ జరిపించి ‘వాస్తవం ఇది’ అని ప్రపంచానికి ఎందుకు చూపించడం లేదు? వాస్తవం ఏమిటంటే సీపీఎం కార్యకర్తలు కేవలం ఆర్ఎస్ఎస్ వారిపైన హింసకు పాల్పడడం లేదు. ముస్లిం లీగ్ కార్యకర్తలను కూడా వారు హతమార్చారు. సీపీఎం నుండి విడిపోయిన వారినీ వదలలేదు. గతంలో సీపీఎం బెంగాల్‌లో కూడా అధికారంలో ఉంది. అక్కడ ఇటువంటి ఆరోపణలు రాలేదు. కేరళ రాష్ట్రంలోనే ఎందుకు వస్తున్నాయి? కేరళలో ఆర్ఎస్ఎస్ తన శాఖలను విస్తరించుకుంటూ, అక్కడి సమాజంలో లోతుగా పాతుకుపోతున్నదనేది వాస్తవం. అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం పెరుగుతున్నది. సామజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాల్లో పని చేస్తున్నది. స్వయం సేవకులు రాజకీయ శక్తిగా కూడా ఎదుగుతున్నారు. అక్కడి హిందువుల్లో ఆర్ఎస్ఎస్‌కు మద్దతు పెరుగుతున్నది. అదే సీపీఎంకు భయం కలిగిస్తున్నది. వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి సంస్థకు తమ కార్యాచరణతో విస్తరించుకొనే సర్వ హక్కులు ఉన్నాయి. అదే ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ, బీఎంఎస్, బీజేపీలు చేస్తున్నది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేయడమే సీపీఎం సంస్కృతి. వారు మరెవ్వరి సహకార సంఘాన్ని నమోదు చేసుకోనివ్వరు. పాఠశాల నడపనివ్వరు. కేరళ రాష్ట్రంలో అసహన హత్యాకాండ స్థానిక శాంతి భద్రతల అంశం కాదు, సీపీఎం కుట్ర అనడానికి సాక్ష్యం ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా అటువంటి అనేక కేసులతో సంబంధం కలిగి ఉండడమే. 1969లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రామకృష్ణన్ హత్యకేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన నిందితుడు. స్వయంగా ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు విజయన్‌పై చాలా కేసులు నమోదయ్యాయి. ఇతర పార్టీ నాయకులపై కూడా కేసులున్నాయి. ప్రస్తుతం వరుసగా జరుగుతున్న హత్యలకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యూహాత్మక మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంది. సీపీఎం చేసిన హత్యలకు సంబంధించి తలస్సేరి, పయన్నూర్, కదిరూర్, ధర్మదయం, మత్తనూర్, ఇరిట్టి, చక్రకాల్, న్యూమహె, కొలవల్లూర్ పోలీస్ స్టేషన్లలో సుమారు 200 కేసులు నమోదు అయ్యాయి. వీటిల్లో 55 సంఘటనలు 2016 మే 16న కేవలం మూడు గంటల వ్యవధిలో నమోదు కావడం సీపీఎం అసహన హత్యకాండకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. చాలా సందర్భాల్లో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.  కేరళ ప్రభుత్వం అసలు ఏమీ చేయడం లేదని కాదు. కొద్దిమందిని అరెస్ట్ చేస్తున్నారు. అయితే ముఖ్యులను వదిలేస్తున్నారు. ప్రధాన అంశాన్ని చేర్చడం లేదు. ఇదంతా స్థానిక శాంతి భద్రతల సమస్య అని తేలికచేసి చూపుతున్నారు. సీపీఎం అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ హత్యల సంఖ్య పెరుగుతున్నది. దీనిని ఏమనుకోవాలి? దీనికి వారి వ్యూహాత్మక మద్దతు ఉంది. ఎందుకంటే సంఘటనలు జరిగినప్పుడు ఆ స్థలంలో ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం చూస్తే ప్రభుత్వాల్లో ఉన్నవారు ఏ స్థాయిలో వారిని ప్రభావితం చేస్తున్నారో అర్థం అవుతున్నది. విజయన్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘ఈ హింస ఆగిపోవాలంటే ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్ఎస్ఎస్‌ను నియంత్రించాలి’ అన్నారు. హింస, హత్యలకు కారణమైన తమ పార్టీని, క్యాడర్‌ను ముఖ్యమంత్రి నియంత్రించాలి. సంఘటనలు జరిగిన ప్రతిసారీ కొందరు ప్రముఖ వ్యక్తుల చొరవతో శాంతి సమావేశాలు జరిగాయి. తమ కార్యకర్తలను అదుపుచేయలేమని చర్చలు జరిగిన సందర్భాల్లో సీపీఎం నాయకులే చెబుతుండడం గమనించాలి. ఒక పర్యాయం జస్టిన్ కృష్ణయ్యర్ శాంతి చర్చలు జరిపారు. కొంతకాలం తర్వాత అవే సంఘటనలు పునరావృతమయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 400మంది ఆర్ఎస్ఎస్, ఇతర కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. ఇటువంటి చర్యలకు ప్రభుత్వం వ్యూహాత్మక మద్దతు ఇస్తున్నప్పుడు, ఎటువంటి మద్దతు లేని సంఘ్ కార్యకర్తలు కొన్నిసార్లు ఆత్మరక్షణ చర్యలకు పాల్పడి ఉండవచ్చు. అటువంటి సంఘటనల్లో పాల్గొన్న చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసారు. వారిలో చాలామంది జైలుశిక్ష అనుభవిస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. నక్సలైట్ల హింసను వ్యతిరేకిస్తున్న మాదిరిగానే మార్క్సిస్టుల హింసను కూడా సహజంగానే ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుంది. ఇంతకుముందు కన్నూరులో జరిగిన హింస ఇప్పుడు త్రివేండ్రంకు వ్యాప్తి చెందినట్లు కనబడుతున్నది. అరెస్టు అయిన కొందరు సీపీఎం కార్యకర్తలు కోర్టు నుండి బెయిల్ పొందారు. వారు కన్నూర్ జిల్లాలో ప్రవేశించరాదని కోర్టు షరతు విధించింది. వారు ఇప్పుడు త్రివేండ్రం కేంద్రంగా హత్యలు, దాడులు చేస్తూ, స్థానికంగా శిక్షణ కేంద్రాలు నడుపుతున్నారు. అందుకే ఈ హత్యల పరంపర త్రివేండ్రంకు వ్యాప్తి చెందుతున్నది. మరో వంక వారు ఇతర శక్తులతో కుమ్మక్కు కావడం జరుగుతున్నది. ప్రతి సారీ ఇదంతా సంఘ్ పరివార్ వ్యూహం అని అంటున్నారు. సీపీఎం వ్యూహం అని ఒక్కసారి కూడా ఎవరూ వారిని ప్రశ్నించడం లేదు. సంఘ్ ఇటువంటి పనులు చేయదు. వ్యక్తులను కలుపుకుంటూ తన పని తాను చేసుకుపోతుంది. బలం పుంజుకొని, అధికారంలోకి రావడానికి బీజేపీకి తన సొంత రాజకీయ, ఎన్నికల వ్యూహం ఉన్నది. కేరళలో సీపీఎంను అధికారం నుండి తొలగించడానికి ఆర్ఎస్ఎస్ ఏమీ చేయనవసరం లేదు, ప్రజలే చేస్తారు. గత రెండు మూడు పర్యాయాలుగా సీపీఎం ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు తిరోగమనం పట్టాయనేది వాస్తవం.కొట్టె మురళీకృష్ణ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేరళలో కొన్ని దశాబ్దాలుగా సీపీఎం చేతిలో వరుస హత్యలకు గురవుతూనే ఉన్నారు. 1959లో జరిగిన మొదటి హత్య నుండి ఈ వరుస హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ హత్యాకాండను మొదటి సారిగా ఇప్పుడు దేశం, ముఖ్యంగా మీడియా గుర్తిస్తున్నది. ప్రజాస్వామ్య విలువల ప్రకారం విస్తృత చర్చ జరగడం ద్వారా అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నది సత్యం. అదే ప్రయత్నంతో భారతీయ జనతా పార్టీ అక్టోబర్ 3 నుండి పక్షం రోజుల పాటు జనరక్ష యాత్రను నిర్వహిస్తున్నది. ఆ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. అందులో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఇదే సమయంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా సీపీఎం కార్యాలయాల వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే నవంబర్ 11న ఏబీవీపీ దేశవ్యాప్తంగా కార్యకర్తలు, విద్యార్థులతో ‘చలో తిరువనంతపురం’ పిలుపునిచ్చింది. కేరళలో సీపీఎం అసహన హత్యా రాజకీయాలను చర్చనీయాంశంగా మార్చి సీపీఎం పార్టీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగడాలను యావత్ ప్రపంచానికి తెలియజేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది.  కేరళ రాష్ట్రంలో రక్తపాతం స్థానిక శాంతి భద్రతల సమస్యేనని, రాష్ట్రంలో విస్తరించడానికి ఆర్ఎస్ఎస్ కుట్రపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, అధికార సీపీఎం పార్టీ ఆరోపిస్తున్నాయి. కేరళలో స్వయం సేవకులు వారి రక్తం, చెమటలను ధారవోస్తూ, కష్టపడి పనిచేయడం ద్వారా సంఘం తన పని అక్కడ విస్తరిస్తోంది. రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ శాఖలకు వస్తున్నారు. ఇది ఈ మధ్యన ప్రారంభమైంది కాదు. గత 40, 50 ఏళ్ల నుండి జరుగుతున్నదే. రాష్ట్రంలో అన్ని వైపులా, మారుమూలలకు కూడా ఆర్ఎస్ఎస్ వ్యాప్తి చెందుతున్నది. అలా ఆర్ఎస్ఎస్ శాఖలకు, కార్యక్రమాలకు హాజరవుతున్న అణగారిన వర్గాలలో భయం కలిగించడం, తద్వారా ఆర్ఎస్ఎస్‌లో కొత్తవారు చేరకూడదనే ఉద్దేశంతోనే సీపీఎం పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై హింసకు పాల్పడుతూ వారిని దారుణంగా హత్య చేయిస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ విస్తరించడం కోసమే ఆర్ఎస్ఎస్ రాజకీయ హింసను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి నిందిస్తున్నారు. వామపక్ష నాయకులు, కుహనా లౌకికవాదులు అదే విధంగా ఆరోపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్, స్వయంసేవకులు, రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు కేరళ రాష్ట్రంలోనూ, ఆ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా అధికారంలో లేరు. ఆర్ఎస్ఎస్ కుట్ర పూర్వకంగా వ్యవహరిస్తుంటే అధికారంలో ఉన్నవారు విచారణ జరిపించి ‘వాస్తవం ఇది’ అని ప్రపంచానికి ఎందుకు చూపించడం లేదు? వాస్తవం ఏమిటంటే సీపీఎం కార్యకర్తలు కేవలం ఆర్ఎస్ఎస్ వారిపైన హింసకు పాల్పడడం లేదు. ముస్లిం లీగ్ కార్యకర్తలను కూడా వారు హతమార్చారు. సీపీఎం నుండి విడిపోయిన వారినీ వదలలేదు. గతంలో సీపీఎం బెంగాల్‌లో కూడా అధికారంలో ఉంది. అక్కడ ఇటువంటి ఆరోపణలు రాలేదు. కేరళ రాష్ట్రంలోనే ఎందుకు వస్తున్నాయి? కేరళలో ఆర్ఎస్ఎస్ తన శాఖలను విస్తరించుకుంటూ, అక్కడి సమాజంలో లోతుగా పాతుకుపోతున్నదనేది వాస్తవం. అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం పెరుగుతున్నది. సామజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాల్లో పని చేస్తున్నది. స్వయం సేవకులు రాజకీయ శక్తిగా కూడా ఎదుగుతున్నారు. అక్కడి హిందువుల్లో ఆర్ఎస్ఎస్‌కు మద్దతు పెరుగుతున్నది. అదే సీపీఎంకు భయం కలిగిస్తున్నది. వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి సంస్థకు తమ కార్యాచరణతో విస్తరించుకొనే సర్వ హక్కులు ఉన్నాయి. అదే ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ, బీఎంఎస్, బీజేపీలు చేస్తున్నది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేయడమే సీపీఎం సంస్కృతి. వారు మరెవ్వరి సహకార సంఘాన్ని నమోదు చేసుకోనివ్వరు. పాఠశాల నడపనివ్వరు. కేరళ రాష్ట్రంలో అసహన హత్యాకాండ స్థానిక శాంతి భద్రతల అంశం కాదు, సీపీఎం కుట్ర అనడానికి సాక్ష్యం ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా అటువంటి అనేక కేసులతో సంబంధం కలిగి ఉండడమే. 1969లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రామకృష్ణన్ హత్యకేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన నిందితుడు. స్వయంగా ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు విజయన్‌పై చాలా కేసులు నమోదయ్యాయి. ఇతర పార్టీ నాయకులపై కూడా కేసులున్నాయి. ప్రస్తుతం వరుసగా జరుగుతున్న హత్యలకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యూహాత్మక మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంది. సీపీఎం చేసిన హత్యలకు సంబంధించి తలస్సేరి, పయన్నూర్, కదిరూర్, ధర్మదయం, మత్తనూర్, ఇరిట్టి, చక్రకాల్, న్యూమహె, కొలవల్లూర్ పోలీస్ స్టేషన్లలో సుమారు 200 కేసులు నమోదు అయ్యాయి. వీటిల్లో 55 సంఘటనలు 2016 మే 16న కేవలం మూడు గంటల వ్యవధిలో నమోదు కావడం సీపీఎం అసహన హత్యకాండకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. చాలా సందర్భాల్లో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.  కేరళ ప్రభుత్వం అసలు ఏమీ చేయడం లేదని కాదు. కొద్దిమందిని అరెస్ట్ చేస్తున్నారు. అయితే ముఖ్యులను వదిలేస్తున్నారు. ప్రధాన అంశాన్ని చేర్చడం లేదు. ఇదంతా స్థానిక శాంతి భద్రతల సమస్య అని తేలికచేసి చూపుతున్నారు. సీపీఎం అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ హత్యల సంఖ్య పెరుగుతున్నది. దీనిని ఏమనుకోవాలి? దీనికి వారి వ్యూహాత్మక మద్దతు ఉంది. ఎందుకంటే సంఘటనలు జరిగినప్పుడు ఆ స్థలంలో ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం చూస్తే ప్రభుత్వాల్లో ఉన్నవారు ఏ స్థాయిలో వారిని ప్రభావితం చేస్తున్నారో అర్థం అవుతున్నది. విజయన్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘ఈ హింస ఆగిపోవాలంటే ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్ఎస్ఎస్‌ను నియంత్రించాలి’ అన్నారు. హింస, హత్యలకు కారణమైన తమ పార్టీని, క్యాడర్‌ను ముఖ్యమంత్రి నియంత్రించాలి. సంఘటనలు జరిగిన ప్రతిసారీ కొందరు ప్రముఖ వ్యక్తుల చొరవతో శాంతి సమావేశాలు జరిగాయి. తమ కార్యకర్తలను అదుపుచేయలేమని చర్చలు జరిగిన సందర్భాల్లో సీపీఎం నాయకులే చెబుతుండడం గమనించాలి. ఒక పర్యాయం జస్టిన్ కృష్ణయ్యర్ శాంతి చర్చలు జరిపారు. కొంతకాలం తర్వాత అవే సంఘటనలు పునరావృతమయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 400మంది ఆర్ఎస్ఎస్, ఇతర కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. ఇటువంటి చర్యలకు ప్రభుత్వం వ్యూహాత్మక మద్దతు ఇస్తున్నప్పుడు, ఎటువంటి మద్దతు లేని సంఘ్ కార్యకర్తలు కొన్నిసార్లు ఆత్మరక్షణ చర్యలకు పాల్పడి ఉండవచ్చు. అటువంటి సంఘటనల్లో పాల్గొన్న చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసారు. వారిలో చాలామంది జైలుశిక్ష అనుభవిస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. నక్సలైట్ల హింసను వ్యతిరేకిస్తున్న మాదిరిగానే మార్క్సిస్టుల హింసను కూడా సహజంగానే ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుంది. ఇంతకుముందు కన్నూరులో జరిగిన హింస ఇప్పుడు త్రివేండ్రంకు వ్యాప్తి చెందినట్లు కనబడుతున్నది. అరెస్టు అయిన కొందరు సీపీఎం కార్యకర్తలు కోర్టు నుండి బెయిల్ పొందారు. వారు కన్నూర్ జిల్లాలో ప్రవేశించరాదని కోర్టు షరతు విధించింది. వారు ఇప్పుడు త్రివేండ్రం కేంద్రంగా హత్యలు, దాడులు చేస్తూ, స్థానికంగా శిక్షణ కేంద్రాలు నడుపుతున్నారు. అందుకే ఈ హత్యల పరంపర త్రివేండ్రంకు వ్యాప్తి చెందుతున్నది. మరో వంక వారు ఇతర శక్తులతో కుమ్మక్కు కావడం జరుగుతున్నది. ప్రతి సారీ ఇదంతా సంఘ్ పరివార్ వ్యూహం అని అంటున్నారు. సీపీఎం వ్యూహం అని ఒక్కసారి కూడా ఎవరూ వారిని ప్రశ్నించడం లేదు. సంఘ్ ఇటువంటి పనులు చేయదు. వ్యక్తులను కలుపుకుంటూ తన పని తాను చేసుకుపోతుంది. బలం పుంజుకొని, అధికారంలోకి రావడానికి బీజేపీకి తన సొంత రాజకీయ, ఎన్నికల వ్యూహం ఉన్నది. కేరళలో సీపీఎంను అధికారం నుండి తొలగించడానికి ఆర్ఎస్ఎస్ ఏమీ చేయనవసరం లేదు, ప్రజలే చేస్తారు. గత రెండు మూడు పర్యాయాలుగా సీపీఎం ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు తిరోగమనం పట్టాయనేది వాస్తవం.కొట్టె మురళీకృష్ణ
editorial
13,340
17-12-2017 04:40:12
వారిని కాల్చి చంపాలి
ముంబై పేలుళ్లలో సజీవంగా పట్టుబడి ఉరిశిక్షకు గురైన ఉగ్రవాది కసబ్‌కు వర్ధంతి జరిపేవారిని తుపాకీతో కాల్చి చంపాలి. అమాయకుల చావుకు కారకుడైన ఉగ్రవాదిని ఉరితీసేందుకు అంతకాలం అవసరమా? అలాంటి ద్రోహులను మూడు రోజుల్లోనే ఉరితీయాలి...తుపాకీతో కాల్చిపడేయాలి. దేశద్రోహులు, ఉగ్రవాదుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. దేశద్రోహులు, ఉగ్రవాదులకు క్షమాభిక్ష అవసరం లేదు.- కర్ణాటక గవర్నర్‌ వాజుభాయ్‌వాలా
nation
7,743
16-12-2017 18:37:21
‘అజ్ఞాతవాసి’ టీజర్: పవన్ చర్యలు ఊహాతీతం
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్.. ఇందులోని రెండు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. చేస్తూనే ఉన్నాయి. ఇక డిసెంబరు 16న టీజర్ రిలీజ్ అని మూడు రోజుల కిందటే ప్రకటించారు. ఇక అప్పటి నుండి ఈ టీజర్ కోసం సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ తో పవన్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. టీజర్ రావడమే ఆలస్యం.. ఇంక వ్యూస్ - లైక్స్ విషయంలో రికార్డుల మోత మోగించాలని అభిమానులు ఇప్పటికే పథకాలు రచించారు. ఇక వారి ఆత్రుతని అర్ధం చేసుకున్న చిత్ర యూనిట్ టీజర్‌ని విడుదల చేసింది. ఊహించినట్లుగానే ఈ టీజర్‌తో సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచే విధంగానే ఉంది. ఇక టీజర్ విషయానికి వస్తే..‘‘మధురాపురి సదనా.. మృదు వదన... మధుసూదన’’ (అత్తారింటికి దారేది చిత్రంలోని ‘దేవ దేవం భజే’ సాంగ్ తరహాలో) బ్యాగ్రౌండ్ సాంగ్‌తో మొదలైన టీజర్ అడుగడుగునా అత్తారింటికి దారేది సినిమాని తలపిస్తూ నడిచింది. వారణాసి సీన్‌తో మొదలై, యాక్షన్ ఎపిసోడ్, చుట్టూ గ్యాంగ్, ఇంట్లో కామెడీ, వారణాసి సాధువులతో నడుస్తూ అనేక యాంగిల్స్‌లో పవన్ దర్శనమిచ్చారు. భారీ తారాగణం ఉన్నట్లుగా ఒక్కో పాత్రని చూపించిన ఈ టీజర్‌లో కీర్తిసురేష్, అను ఇమ్మానుయేల్‌ల పాత్రలు కూడా రివీల్ చేశారు. పవన్ కల్యాన్ చేస్తున్న కొన్ని చర్యలను చూసి.. వీడి చర్యలు ఊహాతీతం వర్మ.. అని మురళీశర్మ అంటే థట్స్ బ్యూటీ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ ఒక్కటి మాత్రమే ఈ టీజర్‌లో పొందుపరిచారు. ఇక ఈ టీజర్‌లో పవన్ మాట్లాడిన డైలాగ్ ఏదైనా ఉంది అంటే అది ‘ఓ మై గాడ్’ మాత్రమే. ఓవరాల్‌గా టీజర్ అంతా అత్తారింటికి దారేదిని తలపిస్తున్నా.. మధ్యలో ఖుష్బూ కనిపించడం, పవన్ బ్యాగ్ పట్టుకుని నడిచి వెళ్లిపోతుండడం చూస్తుంటే మాత్రం ఈ ‘అజ్ఞాతవాసి’ వేరు అని అనిపిస్తుంది. ఓ పవర్ ఫుల్ డైలాగ్‌తో పవన్ వస్తాడని వేచి చూసిన అభిమానులకు నిరాశను కలిగించినా.. టీజర్ అంతా పవనే కనిపించడం మాత్రం వారికి ఫుల్ మీల్సే.  పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్.. ఇందులోని రెండు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. చేస్తూనే ఉన్నాయి. ఇక డిసెంబరు 16న టీజర్ రిలీజ్ అని మూడు రోజుల కిందటే ప్రకటించారు. ఇక అప్పటి నుండి ఈ టీజర్ కోసం సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ తో పవన్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. టీజర్ రావడమే ఆలస్యం.. ఇంక వ్యూస్ - లైక్స్ విషయంలో రికార్డుల మోత మోగించాలని అభిమానులు ఇప్పటికే పథకాలు రచించారు. ఇక వారి ఆత్రుతని అర్ధం చేసుకున్న చిత్ర యూనిట్ టీజర్‌ని విడుదల చేసింది. ఊహించినట్లుగానే ఈ టీజర్‌తో సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచే విధంగానే ఉంది. ఇక టీజర్ విషయానికి వస్తే..‘‘మధురాపురి సదనా.. మృదు వదన... మధుసూదన’’ (అత్తారింటికి దారేది చిత్రంలోని ‘దేవ దేవం భజే’ సాంగ్ తరహాలో) బ్యాగ్రౌండ్ సాంగ్‌తో మొదలైన టీజర్ అడుగడుగునా అత్తారింటికి దారేది సినిమాని తలపిస్తూ నడిచింది. వారణాసి సీన్‌తో మొదలై, యాక్షన్ ఎపిసోడ్, చుట్టూ గ్యాంగ్, ఇంట్లో కామెడీ, వారణాసి సాధువులతో నడుస్తూ అనేక యాంగిల్స్‌లో పవన్ దర్శనమిచ్చారు. భారీ తారాగణం ఉన్నట్లుగా ఒక్కో పాత్రని చూపించిన ఈ టీజర్‌లో కీర్తిసురేష్, అను ఇమ్మానుయేల్‌ల పాత్రలు కూడా రివీల్ చేశారు. పవన్ కల్యాన్ చేస్తున్న కొన్ని చర్యలను చూసి.. వీడి చర్యలు ఊహాతీతం వర్మ.. అని మురళీశర్మ అంటే థట్స్ బ్యూటీ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ ఒక్కటి మాత్రమే ఈ టీజర్‌లో పొందుపరిచారు. ఇక ఈ టీజర్‌లో పవన్ మాట్లాడిన డైలాగ్ ఏదైనా ఉంది అంటే అది ‘ఓ మై గాడ్’ మాత్రమే. ఓవరాల్‌గా టీజర్ అంతా అత్తారింటికి దారేదిని తలపిస్తున్నా.. మధ్యలో ఖుష్బూ కనిపించడం, పవన్ బ్యాగ్ పట్టుకుని నడిచి వెళ్లిపోతుండడం చూస్తుంటే మాత్రం ఈ ‘అజ్ఞాతవాసి’ వేరు అని అనిపిస్తుంది. ఓ పవర్ ఫుల్ డైలాగ్‌తో పవన్ వస్తాడని వేచి చూసిన అభిమానులకు నిరాశను కలిగించినా.. టీజర్ అంతా పవనే కనిపించడం మాత్రం వారికి ఫుల్ మీల్సే.
entertainment
19,455
22-09-2017 12:13:49
బీసీసీఐపై పాకిస్తాన్ కేసు.. లీగల్ ఖర్చుల కోసం ఏకంగా రూ.6.5 కోట్లు!
కరాచీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ఐసీసీ నేతృత్వంలోని వివాద పరిష్కార కమిటీకి ఫిర్యాదు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. తమతో చేసుకున్న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం పాకిస్తాన్ జట్టుతో భారత్ ఆడడం లేదని... అందువల్ల తమకు బీసీసీఐ నుంచి పరిహారం ఇప్పించాలని పీసీబీ వాదించనుంది. ఐసీసీ కమిటీ ముందు సమర్థంగా వాదించేలా పీసీబీ చైర్మన్ నజాం సేథి ఇప్పటికే ఓ బ్రిటీష్ లీగల్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికోసం ఆయనతో పాటు పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుభాన్ అహ్మద్ కూడా లండన్ చేరుకున్నారు. ఐసీసీ కమిటీ ముందు కేసు వేసి బలంగా వాదన వినిపించేందుకు లీగల్ ఖర్చుల కోసం పీసీబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అక్షరాలా రూ. 6.5 కోట్లకు పైగా కేటాయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా పీసీబీ కేసు వేసే అవకాశం ఉందనీ... బీసీసీఐ నుంచి పరిహారం రాబట్టుకునేందుకు పాకిస్తాన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. 2015-2023 సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగేలా 2014లో బీసీసీఐ, పీసీబీలు ఎంవోయూపై సంతకాలు పెట్టాయి. ఈ ఎంవోయూ ప్రకారం మ్యాచ్‌లు జరగనందున బీసీసీఐ నుంచి పరిహారం రాబట్టాలని పాక్ బోర్డు భావిస్తోంది. ‘‘భద్రతా కారణాల వల్ల భారత ప్రభుత్వం తమ జట్టును పాకిస్తాన్ పంపడం ఇష్టం లేకపోయినా, పాక్ జట్టును ఆహ్వానించకపోయినా... కనీసం వేరే దేశాల్లో ఆడదామని కూడా 2015 నుంచి పీసీబీ పలుమార్లు బీసీసీఐను కోరింది. అయినా బీసీసీఐ స్పందించక పోవడం వల్ల పీసీబీ ఈ కేసులో విజయం సాధిస్తుందని గట్టి నమ్మకం ఉంది...’’ అని పీసీబీ అధికారి పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా పాకిస్తాన్‌పై ఎలాంటి ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడలేమని బీసీసీఐ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
sports
5,005
12-09-2017 10:09:15
'అర్జున్ రెడ్డి' హీరోయిన్‌ను వెతుక్కుంటూ వస్తున్న ఛాన్స్‌లు
అర్జున్ రెడ్డి సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. సినిమా ఛాన్సుల కోసం తల్లిదండ్రులను సైతం ఎదురించి పోరాడింది. చివరికి వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకుంది. ఒక్కసారి పేరు వచ్చిందంటే.. ఇంకేముంది ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుతం అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేను కూడా ఛాన్సులు వెతుక్కుంటూ వస్తున్నాయట. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ఛాన్సును ఈ ముద్దుగుమ్మ ఎగరేసుకు పోయిందని టాక్. 100% లవ్ తమిళ రీమేక్ అయిన 100% కాదల్‌లో మొదట లావణ్య హీరోయిన్‌‌గా నటించాల్సి ఉంది. అయితే ఆమె తప్పుకోవడంతో ఇప్పుడు ఆ ఛాన్స్‌ను షాలినిని వరించిందట. మహానటిలో సైతం ఓ ముఖ్య పాత్రకు ఆమె ఛాన్స్ కొట్టేసిందనే విషయం విదితమే.
entertainment
2,429
10-04-2017 23:25:52
ఎల్‌ అండ్‌ టికి భారీ ఆర్డర్‌
ఖతార్‌ నుంచి ఎల్‌ అండ్‌ టి అనుబంధ సంస్థ ఎల్‌ అండ్‌ టి కన్‌స్ట్రక్షన్‌ రూ.5,250 కోట్ల విలువైన భారీ ఆర్డర్‌ సంపాదించింది. ఈ ఆర్డర్‌ కింద ఖతార్‌ జనరల్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ కార్పొరేషన్‌ కంపెనీకి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, నెట్‌వర్క్‌ విస్తరణ పనులు చేపట్టనున్నట్టు ఎల్‌ అండ్‌ టి పేర్కొంది.
business
5,635
01-06-2017 12:14:30
మేము విడిపోయినా.. అతడి జాకెట్ నా దగ్గరే ఉంది: ప్రియాంక!
ఏజ్ మీద పడుతున్నా... ఇప్పటికీ హీరోయిన్‌గా రాణించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్న ఆ బాలీవుడ్ బ్యూటీ... తన మాజీ లవర్ ఎవరనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించిందట. బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. హాలీవుడ్‌లో 'బేవాచ్' ద్వారా సందడి చేసిన ప్రియాంక చోప్రా... మళ్లీ బాలీవుడ్‌లో సినిమా చేయబోయేది ఎప్పుడనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముదురు భామను క్రేజీ హీరోలు, స్టార్ హీరోలు పక్కన పెట్టడం వల్లే అమ్మడు బీ టౌన్‌లో సినిమాలు చేయడం తగ్గించిందని కొందరు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా తన పాత జాకెట్ స్టోరీ చెప్పే క్రమంలో... స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన పాత బాయ్ ఫ్రెండ్ అనే విషయాన్ని రివీల్ చేసిందట పీసీ. 'బేవాచ్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అనేక యాక్టివిటీస్ చేపడుతున్న ప్రియాంక.. తాజాగా డర్టీ లాండ్రీ అనే ఓ టీవీ షోకి హాజరైందట. ఈ కార్యక్రమానికి ఓ బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకుని వచ్చిన ప్రియాంక.. షో టైటిల్ తగినట్లుగా ఈ పాత జాకెట్‌తో వచ్చానని సమాధానం ఇచ్చిందట. అయితే.. ఈ షోని నిర్వహిస్తున్న హోస్ట్.. మీ జాకెట్ గురించి చెప్పమని అడగ్గా... 'ఇది నా మాజీ బాయ్ ఫ్రెండ్ జాకెట్ అని... ఇద్దరం విడిపోయినా ఇది మాత్రం తన దగ్గర ఉండిపోయిందని వెల్లడించిందట. ఈ డీటైల్స్‌ను బేస్ చేసుకుని షారుఖ్ ఖాన్ గురించే ప్రియాంక ఈ కామెంట్స్ చేసిందంటూ ఓ అభిమాని ట్విట్టర్‌లో ట్వీట్ చేయగా.. ఆ పోస్ట్‌కు ప్రియాంక మొదటగా లైక్ కొట్టిందట. ఆ తరువాత పీసీ దాన్ని అన్ లైక్ చేసినా... అప్పటికే ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో... షారుఖ్, ప్రియాంక మధ్య ఒకప్పుడు ఎఫైర్ ఉందనే న్యూస్ నిజమే అని చాలామంది మళ్లీ చర్చించుకోవడం మొదలుపెట్టారట. మొత్తానికి షారుఖ్, ప్రియాంక ప్రేమ వ్యవహారం హాట్ న్యూస్‌గా మారడంతో... దీనిపై కింగ్ ఖాన్ ఎలా రియాక్ట్ అవుతాడనే దానిపై సినీ సెలబిట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  బాహుబలి గురించి ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వండి.. రూ.10 వేల బహుమతులు గెలుచుకోండి
entertainment
18,718
21-02-2017 09:05:09
దేశ ఆర్ధిక రాజధానిలో ఎన్నికల కోలాహలం...
ముంబై: దేశంలోనే అత్యంత ధనిక పౌర సంస్థగా పేరున్న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచి ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఎన్నికల కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన హోరాహోరీగా ప్రచారం చేసింది. ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు కూడా ధీటుగా బరిలో నిలిచాయి. ముంబైలో ధనికుల మొదలు నిరుపేదల దాకా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య తాగునీరు.  తమకు అధికారమిస్తే 24 గంటలు నీటి సరఫరా అందిస్తామని పార్టీలన్నీ హామీ ఇచ్చాయి. వాస్తవానికి ఇంతకు ముందు ఎన్నికల్లో కూడా ఇదే హామీ గుప్పించినప్పటికీ ఇంత వరకు ఏ పార్టీ ఈ హామీని నిలబెట్టుకోలేదు. కాగా మొత్తం 227 స్థానాల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏటా 30 వేల కోట్ల బడ్జెట్ ఖర్చుపెట్టే బీఎంసీ... దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపు పొందింది.
nation
15,416
20-05-2017 02:47:35
కేన్సర్‌ తీవ్రతను తగ్గించే బాదం, జీడి పప్పు
వాషింగ్టన్‌, మే 19: బాదం, జీడిపప్పు, ఆక్రోట్‌ తదితర కాయగింజలను వారానికి 50 గ్రాములు ఆపైన తీసుకుంటే పేగు కేన్సర్‌ బాధితుల జీవితకాలం పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈమేరకు అమెరికాలో జరిగిన అధ్యయనంలో సుమారు 826 మంది బాధితులను పరీక్షించి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు దన ఫార్మర్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు తెలిపారు. ఈ బాధితులలో పేగు కేన్సర్‌ మూడో దశలో ఉందని చెప్పారు. వీరికి వారానికి 56 గ్రాముల బాదం, జీడిపప్పు అందించామని వివరించారు. అనంతరం బాధితులను పరీక్షించగా.. వారిలో కేన్సర్‌ తిరగబెట్టే ప్రమాదం 42 శాతం తగ్గుతుండగా.. పేగు కేన్సర్‌తో మరణించే ముప్పు 57 శాతం తగ్గుతోందని తేలిందన్నారు.
nation
19,765
16-03-2017 02:51:52
సెమీస్‌లో జార్ఖండ్‌, బెంగాల్‌
 విజయ్‌ హజారే ట్రోఫీ న్యూఢిల్లీ: విజయ్‌ హజారే ట్రోఫీలో జార్ఖండ్‌, బెంగాల్‌ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో ధోనీ సారథ్యంలోని జార్ఖండ్‌ 6 వికెట్లతో విదర్భపై గెలిచింది. తొలుత విదర్భ 50 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులే చేసింది. కెప్టెన్‌ ఫజల్‌ (2), జితేష్‌ శర్మ (7), సిద్దేశ్‌ (0), అంబటి రాయుడు (2) విఫలం కాగా.. రవి (62) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అనంతరం ఇషాంక్‌ జగ్గీ (41 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (35), ప్రత్యూష్‌ (33), ధోనీ (18 నాటౌట్‌) రాణించడంతో.. జార్ఖండ్‌ 45.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, మరో క్వార్టర్స్‌లో బెంగాల్‌ 4 వికెట్లతో మహారాష్ట్రపై గెలిచింది. రాహుల్‌ త్రిపాఠి (95), నిఖిల్‌ నాయక్‌ (63) అర్ధ సెంచరీలు చేయడంతో మహారాష్ట్ర నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 318 పరుగులు చేసింది. అనంతరం శ్రీవత్స్ గోస్వామి (74), అనుస్తుప్‌ మజుందార్‌ (66), సుదీప్‌ చటర్జీ (60 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో బెంగాల్‌ 6 వికెట్లు కోల్పోయి 49.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
sports
7,996
29-12-2017 22:35:03
అన్నీ అలాంటివే చెయ్యలేం కదా!
‘‘నాకు ప్రేమకథలు, కుటుంబ నేపథ్యంలో సాగే సినిమాలంటే చాలా ఇష్టం. అలాగని అన్నీ అలాంటి సినిమాలే చెయ్యలేం కదా. అన్నయ్య ‘వేదం’లో కేబుల్‌రాజు పాత్ర, ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర చేసినట్లు నేనూ ఏదన్నా కొత్తగా ప్రయత్నించాలనుకుంటా. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌తోసాగే కాన్సెప్ట్‌ చిత్రాలను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నా’’ అని అల్లు శిరీశ్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా విఐ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ‘ఒక్క క్షణం’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శిరీశ్‌ విలేకర్లతో ముచ్చటించారు. ‘‘ఒక్క క్షణం నా అయిదవ సినిమా. ప్యారలల్‌ లైఫ్‌ అనే పాయింట్‌ వినగానే.. నన్ను హాంట్‌ చేసింది. నాన్నగారికి కూడా కథ బాగా నచ్చింది. చిన్న చిన్న మార్పులు చెప్పారంతే. ఆయన సజెషన్స్‌ ఫాలో అయ్యి ఆనంద్‌ ఈ చిత్రం తెరకెక్కించాడు. నటుడిగా నాకీ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఓ సెక్షన్‌ ఆఫ్‌ ఆడియెన్స్‌ కామెడీ లేదని అంటున్నారు. మరికొందరు ప్యారలల్‌ లైఫ్‌ను కాన్సెప్ట్‌ తీసుకున్నప్పుడు కామెడీ ఎందుకంటున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఉన్నదాని కన్నా ఎక్కువ షూట్‌ చేశాం. మెయిన్‌ కథలోకి త్వరగా వెళ్లాలని ఆ సీన్స్‌ను ఎడిట్‌ చేశాం. ఆనంద్‌ కథను ఎంత బాగా చెప్పాడో అంత కంటే బాగా తీశాడు. ఇందులో ఓ ఫోక్‌ సాంగ్‌ను తొలగించాం. అది అవసరమనే షూట్‌ చేశాం. రన్‌ టైమ్‌ ఎక్కువ అవుతుందని ఎడిట్‌ చేయాల్సి వచ్చింది. అందుకే రోలింగ్‌ టైటిల్స్‌లో ఆ పాటను పెట్టాం. అన్నయ్యకు సినిమా గురించి ముందేమీ తెలీదు. టీజర్‌ నచ్చి సినిమా మొత్తం చూశాడు. బావుందని మెచ్చుకున్నాడు. ప్రస్తుతం రెండు, మూడు కథలు డెవల్‌పమెంట్‌ ేస్టజ్‌లో ఉన్నాయి. కొత్త దర్శకులతో చేయడానికి నేనెప్పుడూ రెడీగా ఉంటా’’ అని అన్నారు.
entertainment
12,313
07-02-2017 01:16:09
విద్యార్థులకు ‘అమ్మో’రికా!
 ఏటా లక్షల సంఖ్యలో విదేశీ విద్యార్థులు  ఎక్కువ మంది పీజీ కోసమే  ఏ కోర్సుల్లో చేరుతున్నారు  వేల కోట్ల ఆదాయం  ప్రత్యామ్నాయంగా యూరప్‌ విదేశీ విద్యార్థుల కారణంగానే అమెరికాలోని చాలా యూనివర్సిటీలు మనుగడ సాగిస్తున్నాయి. వీరిపై ఆంక్షలు విధించే అవకాశమేలేదని ఆయా వర్గాలు కొట్టివేస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఆంక్షలు అమలై, అమెరికాలో చదువుకోలేని పరిస్థితులు కొనసాగితే తాత్కాలికంగా యూరప్‌ వైపు వెళ్లే అవకాశం ఉందంటున్నారు విద్యావేత్తలు. యూరప్‌తోపాటు జర్మనీ, కెనడా, ఆస్ట్రే‌లియా వర్సిటీలను విద్యార్థులు ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  - ఫైజల్‌ హుస్సేన్‌, అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రిన్సటన్‌ రెవ్యూ
nation
7,352
04-05-2017 01:23:48
‘రసవిద్య’ తెలిసిన దర్శకుడు
కథ ఆలంబనగా సంగీతం స్పందనగా.. కెమెరా తన మనో నేత్రంగా మలిచినా చిత్రాలు.. వెండితెరపై విశ్వనాధుడి నిలువెత్తు స్వర్ణ సంతకాలు..! జీవితానికి సంబంధంలేని కాల్పనికత కథ కాలేదు. ఆయన సినిమాలకి కథలుంటాయి జీవితమంత!! జీవితమే ఓ ఒక సృజనాత్మక కలాపం... ఆయన చిత్రాలు సృజనాత్మక సల్లాపాలు. ‘సాంకేతికత’ కి కథని బలిపెట్టని బ్యూటీ, సింప్లిసిటీ ఆఫ్‌ నెరేషన... దే ఆర్‌ సింపుల్‌ ఎట్‌ ప్రొఫౌండ్‌! ఆయన చిత్రాల్లో మాటా ఉంది. మేనమూ ఉంది. దృశ్యమూ ఉంది.. అదృశ్యమూ ఉంది. సంగీతమూ ఉంది.. నిశబ్దమూ ఉంది!! హృదయంలో ఎడారులు విస్తరిస్తున్నాయేమో, ఒక ఇనోసెన్సని సెన్సిటివ్‌నె్‌సని కోల్పోతున్నామేమో అని బెంగపడుతున్న కాలంలో వెండితెర నేపథ్యంలో అనుభూతి చెంగల్వాన్ని పూయించారాయన..! ఘనీభవిస్తున్న స్తబ్ధతలోంచి మనోవీణాతంత్రుల్ని శ్రుతి చేశారాయన. హృదయానికి కాస్త తడిని అద్దిన జీవన ప్రేమికుడాయన!!! మానవ సంబంధాల్లోని గాఢతలేని నిగూఢతనీ ఆవిష్కరించి వెండితెర భావోద్వేగ రాగరంజితం చేసిన మానవీయ, మాననీయ దర్శకులాయన..! ఆయన మలిచిన దృశ్యాలు కొన్నింటిని చూస్తుంటే అనిర్వచనీయ ఉద్విగ్నతలు ముప్పిరిగొంటాయి... అవి రసానుభూతులై విస్తరిస్తాయి..! వెన్నెలంతా మేసి నిశ్చిలంగా నెమరేస్తున్న ఏరైపోతుంది తెర. చూస్తూ చూస్తూ నిశబ్ధమైపోతాం. నిండైన శబ్దమై పోతాం. మానవీయ ఉద్వేగాలకు దృశ్యరూపం కవ్వించడంలో తనదైన శైలి, విషాదానంద వ్యక్తీకరణలో ఊహాశక్తి, భావనాపటిమ ఆశ్చర్యం కలిగిస్తాయి. జీవితంలోని నాటకీయతనీ, చేతనా అంత:శ్చేదనలోని సంఘర్షల్ని పట్టుకుని, దృశ్యరూపమివ్వడం ఆయనకి అలవోకగా అలవడిన ప్రతిభా విశేషం. ‘కళాభివ్యక్తి’కి స్రష్టత్వమే కాదు... ఆత్మను పలికించే ద్రష్టత్వం కూడా ఆలంబన అవుతుంది. సాధారణంగా మంచి కవిత్వం సుఖురావి ప్రియా పరిష్వంగ పరిమణంలో మనల్ని హంట్‌ చేస్తుంది. విశ్వనాధుడి సినిమాలు అలా వెంటాడతాయి. కస్తూరి పరిమళంలా. జీవితకాలం వాటినే మళ్లీ మళ్లీ చూస్తూ హాయుగా బతికేయోచ్చని భరోసా ఇస్తాయి..! ‘దే ఆర్‌ టైమ్‌లెస్‌ అండ్‌ స్పేస్‌లెస్‌..’! తవ్వినకొద్దీ, చూసినకొద్దీ, కొత్త అర్ధాలు, అనుభూతులు, అన్వయాల ఊట ఊరుతూనే ఉంటుంది. ఊటబావిలో తేటనీటి జలాల్లా జలజలా హృదయాల్ని రసప్లావితం చేస్తూ... ఇంటింటికీ వీణ మోసుకు తిరిగినా వినేవాడ ఉండడేమో అని బెంగపడే తరుణంలో తన సంగీతాత్మక చిత్రాలతో తెలుగువాడిగుండెను ఓ సంగీత వాయిద్యంచేసేశారాయన. కెమెరా కన్నులోంచి చూడగానే మనసులో ఊహలు ఊపిరి పోసుకుంటాయనకుంటాను. స్ర్కీనమీద సంపెంగ పరిమళాల సాంబ్రాణి ధూపమేదో వేస్తారాయన. మధురోహాల మల్లెల్ని మనసు ముంగిట్లో ‘జల్లుతారు’. వెండితెర మీద కర్పూర పరిమళమేదో గుప్పుమంటుంది! రొమాంటిక్‌ దృశ్య చిత్రీకరణలో చెయ్యగొట్టే ఫ్రేములుండవు. మనసులో తీయని చిచ్చు పెట్టే దృశ్యాత్మక భావుకత తప్ప. గుప్పెడు గుండెలోకి గంపెడు మల్లెల్ని విసిరేసిన అలికిడి తప్ప. అందులో మోహపు, వ్యామోహపు, నురగలుండవు. తడిపొడి తపనల తహతహలుండవు... ఏవో పులకరింతలు జలదరింపులు తప్ప. అర్ధరాత్రి హఠాత్తుగా నిద్రలేపే ఉద్వేగాలుండవు. నిద్రలో అలవోకగా కమ్మేసే అనుభూతుల పొగడపూల పరిమళాలు తప్ప.మనసు కోయిలచచ కచ్చేరి చేస్తుంది మేనరాగంలో..! హృదయ స్పందన మనసుకందక, మాటలకు చిక్కక మారాం చేస్తుంది... ఏ నిశీధి వేళలోనోయుయ నింగి నుంచి నేలకు రాలిన నక్షత్రాల్ని నిశబ్ధంటగా ఏరుకొచ్చి వెండితెర మీదకి విసిరేసిన కాంతి తెరంతా పరచుకుని వెలుగుల్ని విరజిమ్మిన ఆ నక్షత్ర రజను సరాసరి మన గుండెల్లోకి పూలయుయ పుప్పొడిలా జారిపోయిన భ్రాంతి...! ఆయన చూపించిన స్ర్తీ సౌందర్యం.. ఆ స్ర్తీలోనిది కాదు. ఆయన కళ్లలోనిది. హృదయంలోనిది. ‘బ్యూటీ లైస్‌ ఇన ద అయిస్‌ ఆఫ్‌ ద బీహోల్డర్‌..!అందుకే ఆ సౌందర్యం అంత సంస్కారవంతం...! ‘వండర్స్‌ ఇనవిజిబుల్‌ దట్‌ లవ్స్‌ కీన ఆరోస్‌ మేక్‌’ అంటాడు షేక్‌స్పియర్‌..! విశ్వనాధుడు సంబంధించిన పూల బాణాలు అంతే. అవి చేసిన గాయాలు ఎప్పుడూ పచ్చిగానే ఉంటాయి. కమ్ముకున్న మాధుర్యంతో సలపరిస్తూ..! వేణువూఆయనే మాధవుడు ఆయనే..! కామెడీ ట్రాక్‌లుండవు. కథలో నెరేషనతోపాటు అంతర్లీనంగా హాస్యం పు(పం)డుతుంది... అంతే! మన మోములో చిర్నవ్వు మొలిచే మంత్రమేస్తుంది. ఆ హాస్యంమన మనోసీమని చల్లగా హాయిగా చందన(సు) గంధంలో ఆవరించి అల్లుకునిగుర్తొచ్చినప్పుడల్లా గిలిగింతలు పెడ్తుంది..! ఆయన చిత్రీకరించిన కొన్ని దృశ్యాలు చూస్తుంటే మనసు మబ్బుతునకై కళ్లు వర్షిస్తాయి. బాధ కలుగుతుంది. ఆ బాధ బావుంటుంది(?) భరించాలని ఉంటుంది..! కంటి చెమరింతలో దృశ్యం చెదిరిపోతుందేమోనన్న బెంగ..! మనల్ని మనం మరో డైమెన్షనలో విస్తరించుకుంటాం..! కదిలించి మన మనసుల్ని అర్ర్దీకరించే ‘రసవిద్య’ ఏదో ఉంది ఆయన దగ్గర. ఆయన మిస్టిక్కా స్పిరిచువల్లా ఏదీ కాదు.. సింప్లీ... నేచురల్లీ, ఫుల్లీ, హ్యూమెన!! దట్స్‌ ఆల్‌. సూటింగ్‌ సెట్‌లో ఆయన చురుకుతనంతోపాటు, మేనాన్ని చూశాను... అది మేనంలా కాక యానంలా అనిపించేది. చినుకు కోసం నేల పడుతున్న తపనలా స్వాతిచినుకు కోసం ముత్యపుచిప్ప పడే ఆరాటంలా కనిపించేది....ఆయన చిత్రాల్లోని కొన్ని దృశ్యాల్లోని కొన్ని దృశ్యాల గురించి అమాయకంగానూ, అవివేకంగానూ, అజ్ఞానం ఇచ్చిన ధైర్యంతోనూ ‘ఈ సీను అబ్‌సా్ట్రక్ట్‌గా ఉంది కందండీ’ అను అన్వయాలు చెప్తుంటే... ‘‘ అబ్బే... దానికంత పెద్దపెద్ద పదాలెందుకు... నాకలా స్పూరించింది. అలా... తీశా’’ అని సింపుల్‌గా నవ్వేస్తూ చెప్పే నైజం... ! ‘ఫలానా సినిమా ఎంత అద్భుతంగా తీశారండీ’ అంటే ‘‘ఆ క్రెడిట్‌ నా ఒక్కడిదే కాదు... మాటీమ్‌ అందరి సమష్టి కృషి’ అని వినమ్రంగా చెప్పేస్వభావం..! ఇదంతా కేవలం మోడెస్టీ కాదు... తాత్విక చింతన కాదు... ఇది ఆయన అంతరంగ సంస్కార ప్రభావం... పెరిగిన వాతావరణ సంస్కార ప్రభావం... నిరహంకార, నిరామయా తత్వాల జమిలి కలయిక... ‘ఇట్‌ ఈజ్‌ నాట్‌ సింపుల్‌ టు బి సింపుల్‌’..!! వెండితెరపై గీసుకున్న చిత్రాలు... ఎన్నో... ఎందరివో..! కానీ వెండితెర తన గుండెల్లో దాచుకున్న చిత్రాలు కొన్నే. కొందరివే. అలాంటివారిలో కె.విశ్వనాధ్‌ ఒకరు!! వెండితెరపై వెలుగుతెలుగు సంతకం!చెయ్యగలిగిన దానిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసినదాన్నిబట్టి ఇతరులు మనల్ని అంచనావేస్తారు..! ప్రేక్షకులు ఎప్పుడో పట్టకట్టిన ఆయన సృజనాత్మక ఔనత్యాన్ని ప్రభుత్వం గణించి, పరిగణించి ఇలా (దాదాసాహెబ్‌ఫాల్కే) వంటి అత్యున్నత పురస్కారంతో గౌరవించుకుంది...ఎంతోమంది తెలుగుప్రేక్షకులు, సినీరంగం గర్వపడేలా తెలుగు హృదయాలు ఉప్పొంగేలా ...!! దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డును డిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్న శుభసందర్భంగా ఈ అక్షర పుష్పగుచ్ఛాన్ని వినమ్రంగా సమర్పిస్తూ...- డాక్టర్‌ సుదర్శన్, ప్రముఖ హాస్యనటుడు   అమ్మానాన్నలకు ప్రణామాలు!దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న తరువాత దర్శకుడు కె. విశ్వనాథ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. మునుపెన్నడూ లేని రీతిలో ఫాల్కే అవార్డు విజేతను మాట్లాడాల్సిందిగా కోరారు. మైకు వద్దకు వెళ్ళిన కె. విశ్వనాథ్‌ ప్రసిద్ధ త్యాగరాయ కీర్తన పల్లవిని ప్రస్తావిస్తూ... ‘‘ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు’’ అని తెలుగులో తన కృతజ్ఞతా ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. ఆ మాటకు సభికులందరూ చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. విశ్వనాథ్‌ చాలా క్లుప్తంగా సాగిన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘‘అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, గౌరవప్రదమైన ఈ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు దక్కినందుకు ముందుగా ఆ పై లోకంలో ఉన్న నా తల్లితండ్రులకు ప్రణామాలు. సర్వాంతర్యామి అయిన ఆ దేవదేవుడికీ, గౌరవనీయులైన రాష్టపతికీ, ఇక్కడ హాజరైన జ్యూరీ సభ్యులందరికీ నా నమస్కారాలు. భారతదేశం నలుమూలలా ఉన్న నా అభిమానులకు వినయ పూర్వకంగా నమస్కరిస్తున్నాను. సర్వేజనాః సుఖినోభవన్తు’’ అన్నారు. - దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాథ్‌
entertainment
16,466
25-08-2017 04:48:04
ప్రాథమిక హక్కులను కాపాడే తీర్పు
సుప్రీంకోర్టు మంచి పని చేసింది. ఒక సరైన తీర్పు కోసం పాత తీర్పులను కూడా తోసిపుచ్చింది. ఇది ప్రగతిశీల తీర్పు. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడే తీర్పు. గోప్యత మౌలిక హక్కు. ఏకగ్రీవ తీర్పు సంతోషకర పరిణామం. ప్రజల ప్రాథమిక హక్కులను విస్తృతం చేసే ఏ తీర్పునైనా స్వాగతించాల్సిందే. ఏ ప్రాథమిక హక్కు కూడా సంపూర్ణం కాదు. సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. కాబట్టి ఈ తీర్పుతో ఆధార్‌ రద్దవుతుందనుకుంటే పొరపాటే.-సొలీ సొరాబ్జీ, మాజీ అటార్నీ జనరల్‌
nation
18,872
19-12-2017 03:26:26
బీజేపీకి పటీదార్ల దెబ్బ
గోధ్రాలో బీజేపీ అభ్యర్థికి 250 ఓట్ల మెజారిటీన్యూఢిల్లీ, డిసెంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): గుజరాత్‌ ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తే.. బీజేపీ ప్రధానంగా సౌరాష్ట్ర ప్రాంతంలో దెబ్బతిన్నది. ఉత్తర, కేంద్ర గుజరాత్‌లో 2012లో గెలుచుకున్న అనేక సీట్లను కోల్పోయింది. కాంగ్రెస్‌ గ్రామీణ ప్రాంతాల్లో పటేల్‌ ఓట్లను ఎక్కువగా సంపాదించింది. ఫలితంగాగ్రామీణ గుజరాత్‌లో 19 సీట్లకుగాను 17 కాంగ్రెస్‌కు దక్కాయి. పటీదార్లు ఆధిక్యంగా ఉన్న మోర్బీ జిల్లాలో బీజేపీ రెండు సీట్లు కోల్పోయింది. పటీదార్‌ అనామత్‌ ఆందోళన సమితికి చెందిన అభ్యర్థులు పలువురు కాంగ్రెస్‌ టిక్కెట్లపై పోటీ చేసి గెలిచారు. పటీదార్ల బలం ఉన్న అనేక నియోజవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు అతి తక్కువ మెజారిటీని సాధించారు. ఉదాహరణకు బోటాడ్‌ సీటులో బిజెపి అభ్యర్థికి 906 ఓట్ల ఆధిక్యత మాత్రమే లభించింది. అక్కడ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు 7500 ఓట్లు పొందారు. దాదాపు 16 సీట్లలో 2వేలలోపు ఓట్ల తేడాతో పలువురు అభ్యర్థులు ఓడిపోయారు. అందులో 8 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు. మన్సా సీటును బీజేపీ అభ్యర్థి 524 ఓట్ల తేడాతో కోల్పోగా.. దేవదర్‌ సీటును బీజేపీ 972 ఓట్ల తేడాతో కోల్పోయింది. దాదాపు 2 శాతం మంది ఓటర్లు ఏ అభ్యర్థి పట్లా మొగ్గు చూపకపోవడంతో.. అనేక చోట్ల కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల తలరాతలు మారాయి. ఉదాహరణకు గోధ్రాలో నోటాకు 3,050 ఓట్లు పడగా ముస్లింలు అధికంగా ఉన్న అక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 258 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ కంచుకోట, ప్రధాని మోదీ సొంత పట్టణం ఉన్న ఊంఝాలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఇక, మెహసానా జిల్లాలో భాగమైన వడ్గం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దళిత నేత జిగ్నేష్‌ మేవానీ గెలిచారు. సురేంద్రనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ ఒక్క నియోజకవర్గం తప్ప అన్ని సీట్లనూ గెలుచుకుంది. పటీదార్లు అధికంగా ఉన్న పాటన్‌లో కూడా కాంగ్రెస్‌ గెలిచింది. కాంగ్రెస్‌ మద్దతుతో బీసీ నేత అల్పేశ్‌ ఠాకూర్‌ రాధన్‌పూర్‌లో విజయం సాధించారు.
nation
8,332
29-06-2017 23:06:55
కాలంతో పాటు కామెడీ మారుతోంది!
‘‘దశాబ్దం క్రితం వచ్చిన చిత్రాల్లోని జోకులకు ఇప్పుడు ఎవరూ నవ్వడం లేదు. కాలంతో పాటు కామెడీ మారుతోంది. ఇప్పుడు అందరూ సెటిల్డ్‌ కామెడీని ఇష్టపడుతున్నారు’’ అని ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ‘‘ఇన్నేళ్లూ పుట్టినరోజున ఎక్కువగా ఫ్రెండ్స్‌తో స్పెండ్‌ చేసేవాడిని. కానీ ఈ ఏడాది మా కుటుంబసభ్యులతో గడపాలనుకుంటున్నాను. ఈ ఏడాది మా ఆవిడ సర్‌ప్రైజ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తోంది. మా పాప అయాన ఇవిక ఈదర ఇప్పుడిప్పుడే ‘డాడ..’ అని పిలుస్తోంది. ఆయానా అంటే పుష్పం అని అర్థం. ఇవిక అనే పదాన్ని హీబ్రూ నుంచి తీసుకున్నాం. మా నాన్నగారి పేరు కలవాలనే అలా పెట్టాం. తను అన్నప్రాసన రోజు పెన్ను, క్లాప్‌బోర్డు పట్టుకోవడం మా అందరికీ ఆనందాన్ని కలిగించింది. హ్యాపీ బర్త్‌డే అని చెబుతుందేమోనని వేచి చూస్తున్నాను’’ అని అన్నారు. కెరీర్‌ గురించి చెబుతూ ‘‘మేడ మీద అబ్బాయి షూటింగ్‌ పూర్తయింది. డబ్బింగ్‌ జరుగుతోంది. ఆడియో, సినిమా విడుదల తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు స్ర్కిప్ట్‌లను ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాను. నా చిత్రాల పోస్టర్లను చూసుకుంటే దాదాపుగా అన్నీ ఒకేలా అనిపించాయి. అందుకే కాసింత పద్ధతి మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. స్లాప్స్టిక్‌ కామెడీ, స్ఫూఫ్‌లు చేయడానికి ఇప్పుడు సుముఖంగా లేను. కామెడీని పక్కనపెట్టకుండా, అదే సమయంలో కథకు, భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను. ‘శంభో శివ శంభో’, ‘గమ్యం’ వంటి సినిమాల తరహా పాత్రల్లో నటించమని చాలా మంది అడుగుతున్నారు. తప్పకుండా అలాంటి సినిమాలు కూడా చేస్తాను. సముద్రఖని దర్శకత్వంలో ద్విభాషా చిత్రాలు చేయాలనుకున్నాం. మంచి స్ర్కిప్ట్‌ కోసం వెయిట్‌చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈవీవీ గురించి చెబుతూ ‘‘జంధ్యాలగారు - రాజేంద్రప్రసాద్‌గారి కాంబినేషన్‌లాగా, మా నాన్నగారితో నా కాంబినేషన్‌ క్లిక్‌ అయింది. నాన్నగారిని నిజంగా మిస్‌ అవుతున్నాను. ఆయన సినిమాల్లో ప్రతి కమెడియన్‌కీ ఓ పాత్ర ఉండేది. ప్రతి పాత్రకూ సినిమాలో చక్కటి ముగింపు ఉండేది. ఆ తరహా స్ర్కిప్ట్‌ల కోసం చూస్తున్నాను. మా సొంత ప్రొడక్షన్‌లో ప్రస్తుతం సినిమాలు చేయట్లేదు. ఓ వైపు నటన, మరో వైపు ప్రొడక్షన్‌ కష్టమవుతుందని కొద్దిగా ఆపాం. ఓ మంచి సక్సెస్‌ కొట్టేవరకు పూర్తి ఏకాగ్రత సినిమాల మీదనే ఉంచుతున్నాను. ‘పాపం.. నరేశ్‌కి ఓ హిట్‌ వస్తే బావుంటుంది’ అని నా మీద అభిమానంతో ఎవరైనా జాలిగా చూస్తే తట్టుకోలేకపోతున్నాను.(నవ్వుతూ).. నాకు తెలిసి ఎవ్వరూ జాలి చూపులను కోరుకోరు’’ అని అన్నారు. మహేశ్‌తో చేస్తున్న సినిమా గురించి ప్రస్తావించగా.. ‘‘ఒకసారి మాట్లాడాం. సినిమా ఓకే అయితే నేనే ప్రకటిస్తాను’’ అని చెప్పారు.
entertainment
10,723
30-12-2017 23:25:36
సరదా... సరదాగా!
పూజాహెగ్డే, ప్రగ్యాజైస్వాల్‌, మెహరీన్‌, క్యాథరిన్‌ థ్రెస్సా... వెండితెర మీద మెరుపులు మెరిపించిన ఈ కథానాయికలు వేదికపై ఆడిపాడితే ఫ్యాన్స్‌ హార్ట్‌బీట్‌ పెరగడం ఖాయం. ‘బాహుబలి’ సిరీస్‌లో బాహుబలి, దేవసేన, బిజ్జలదేవ , ‘ఫిదా’లో భానుమతి, వరుణ్‌, ‘అర్జున్‌రెడ్డి’లో అర్జున్‌రెడ్డి, ప్రీతి...ఇలా అందరూ పిల్లల్లా మారిపోయి నవ్వులు పంచితే, ఆ మజానే వేరు. ఈ సూపర్‌హిట్‌ పాత్రలన్నిటినీ ‘జీ డ్రామా జూనియర్స్‌’ రియాలిటీ షోలో పాల్గొన్న పిల్లలు గుర్తు చేసి నవ్వించారు. ఈ సరదా, వినోద కార్యక్రమాలకు ‘జీ గోల్డెన్‌ అవార్డ్స్‌-2017’ కార్యక్రమం వేదికైంది. అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ, శేఖర్‌కమ్ముల, నాని, విజయ్‌దేవరకొండ, దేవిశ్రీప్రసాద్‌ లాంటి ఎంతో మంది తెలుగు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్‌ ఇటీవల ఎంతో అట్టహాసంగా నిర్వహించింది. వెండితెర ఇలవేల్పుల ఆటాపాటా, సరదా కబుర్లు... కొత్త ఏడాది ప్రవేశించడానికి ముందుగానే అంటే ఆదివారం సాయంత్రం 4 గంటలకు ‘జీ గోల్డెన్‌ అవార్డ్స్‌-2017’ కార్యక్రమం జీ తెలుగు ఛానల్‌లో ప్రసారమై కనువిందు చేయనుంది.
entertainment
8,215
20-03-2017 22:25:27
నయన్ ‘డోర’కు ముస్తాబులు
హారర్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘డోర’ ఈ నెల 31న విడుదల కానుంది. నయనతార ప్రధాన భూమిక పోషించిన చిత్రమిది. దాస్‌ దర్శకత్వం వహించారు. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌, మెర్విన్ సంగీతాన్ని అందించిన పాటలు ఇటీవల విడుదలయ్యాయి. నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ‘‘కారులో దెయ్యం కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం. స్ర్కీన్‌ప్లే వైవిద్యంగా ఉంటుంది. నయనతార నటన స్పెషల్‌ అట్రాక్షన్ అవుతుంది’’ అని చెప్పారు.
entertainment
7,389
22-04-2017 17:06:19
రూట్ మార్చిన మిల్కీ బ్యూటీ
గ్లామర్‌కు పెట్టింది పేరుగా రాణిస్తున్న మిల్కీ బ్యూటీ తమ్నన్నా... ఇకపై పర్ఫార్మెన్‌కే పెద్ద పీట వేయదలచిందట. మరి ఆ ముచ్చటేంటో ఈ స్టోరీలో చూద్దాం. పాలమీగడలాంటి సొగసులతోనే ఇన్నాళ్లూ నెట్టుకు వచ్చేసిన తమన్నా ఇకపై సీరియస్ యాక్టింగ్‌పై దృష్టి పెట్టిందట. ఇందులో భాగంగా విలక్షణమైన పాత్రలపై దృష్టిసారించిన మిల్కీ బ్యూటీ... మరో అడుగుముందుకేసి సహజంగా ఆకట్టుకోవాలని ఫిక్స్ అయిందట. ఇందులో భాగంగానే తమిళ మూవీ 'స్కెచ్'‌లో మేకప్ లేకుండా నటించబోతోందట. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తన కెరీర్ లో ఓ కలికితురాయిగా మిగిలిపోతుందని ఆశపడుతోంది అమ్మడు. మరోవైపు తెలుగులో కాస్త ఊపు తగ్గడంతో ఆలోచనలో పడ్డ తమన్నా... మళ్లీ పుంజుకునేందుకు కొత్త స్కెచ్ వేస్తోంది. 'బాహుబలి' సినిమా తరువాత సూపర్ బిజీగా మారిపోవడంతో రెమ్యునరేషన్‌ను కూడా పెంచేసిన తమ్మూ.... ఇప్పుడు మళ్లీ రేటు తగ్గించబోతోందట. అర్జెంట్‌గా ఆఫర్లు అందిపుచ్చుకునేందుకు తన పారితోషకంలో భారీ కోత విధించుకోబోతోందట. మరి.. ఈ విషయం విన్న ఫిల్మ్ మేకర్లు అమ్మడి ఇంటి వద్ద క్యూ కట్టేస్తారేమో చూడాలి.
entertainment
11,062
20-09-2017 14:56:03
ఐశ్వర్య, సౌందర్య గాత్రం విని పులకించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న, స్వర్గీయ ఎంఎస్ సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు ప్రధాని మోదీని కలుసుకున్నారు. సుబ్బలక్ష్మి సంగీత వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆమె మనుమరాళ్లు ఐశ్వర్య, సౌందర్యతో పాటు వారి తల్లిదండ్రులు వి.శ్రీనివాసన్, గీతా శ్రీనివాసన్‌ ప్రధానిని కలుసుకుని ఎంఎస్ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1996లో ఐక్యరాజ్యసమితిలో ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఆలపించిన ‘మైత్రీం భజతే’ కీర్తనను మోదీకి ఐశ్వర్య, సౌందర్య ఆలపించి వినిపించారు. ఈ కీర్తన విని పులకించిన ప్రధాని మోదీ  వారిని అభినందించారు. ఈ కీర్తనను ఎంఎస్ సుబ్బలక్ష్మి దాదాపు తన కచేరీలన్నింటిలోనూ పాడి ఆబాలగోపాలాన్ని అలరించేవారు. కంచి పీఠాధిపతి చ్రంద్రశేఖరేంద్ర సరస్వతి సంస్కృతంలో కంపోజ్ చేసిన ఈ కీర్తన మానవాళికి సంతోషం, శుభం చేకూరాలనే పదంతో ముగుస్తుంది. 1998లో సుబ్బలక్ష్మికి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం 'భారతరత్న'తో గౌరవించింది. మోదికి మన్మోహన్‌కు ఉన్న వ్యత్యాసం అదే...  ప్రపంచంలో ఇంత వింతైన, విచిత్రమైన సముద్రం ఇదొక్కటే...
nation
2,102
23-10-2017 02:20:33
మార్కెట్‌ స్ర్టాటజీ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతూ వచ్చిన మార్కెట్లు దీపావళి సందర్భంగా నిర్వహించిన మూరత్‌ ట్రేడింగ్‌లో క్షీణించాయి. మూరత్‌ ట్రేడింగ్‌ రోజు మార్కెట్లు ఈ స్థాయిలో తగ్గటం అనేది గడచిన పదేళ్లలో ఇదే మొదటి సారి. ఏది ఏమైనా మార్కెట్లలో మధ్యమధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్‌ రావటం మంచిది. దీనివల్ల కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉండటంతో పాటు కొత్త సెక్టార్లు, కొత్త స్టాక్స్‌ తెర పైకి వస్తాయి. అలాగే మంచి స్టాక్స్‌ కొనటానికి ఇలాంటి కరెక్షన్స్‌ ఉపకరిస్తాయి. ఇక అక్టోబరు నెల కాంట్రాక్టులు 26 వ తేదీన ముగియనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నాలుగు రోజులకు గాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) వ్యూహం ఇస్తున్నాం. ఇందులో రిలయన్స్‌ ఫ్యూచర్‌ ఒక లాట్‌ ప్రస్తుత ధర 903.55 రూపాయల్లో కొనుగోలు చేయాలి. దీనికి అదనంగా 930 రూపాయల కాల్‌ రెండు లాట్లు 4.50 రూపాయల చొప్పున షార్ట్‌ చేయాలి. 920 రూపాయల పుట్‌ ఒక లాట్‌ 22 రూపాయల్లో కొనుగోలు చేయాలి.  26 వ తేదీ నాడు రిలయన్స్‌ షేరు ధర (స్పాట్‌ మార్కెట్లో) 930 రూపాయల కంటే దిగువన ముగిస్తే లాభం 3,450 రూపాయల నుంచి 13,450 రూపాయల మధ్యన కచ్చితంగా పొందవచ్చు. అంటే షేరు ఇక్కడ నుంచి పడిపోయినా, ఇదే స్థాయిలో ఉన్నా లాభం కచ్చితంగా పొందవచ్చు. కాకుంటే షేరు ధర 26వ తేదీ నాటికి 943 రూపాయల కంటే ఎగువన ముగిస్తే నష్టం వచ్చే అవకాశం ఉన్నందున షేరు ధర భారీగా పెరిగి ఆ స్థాయి అధిగమిస్తుందనిపిస్తే లాభనష్టాలతో సంబంధం లేకుండా వ్యూహం నుంచి వైదొలగాలి.- గొండాల రాంబాబు
business
9,852
12-04-2017 13:20:38
పవన్ ఇంజనీర్ బాబు.. ఫ్యాన్ మేడ్ పోస్టర్!
కాటమరాయుడు సినిమా థియేటర్లో విడుదలై సందడి చేయడం మొదలు పెట్టిన రెండు వారాలకే పవన్ కల్యాణ్ తన సినిమాను పట్టాలెక్కించేశాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమాను ప్రారంభించేశాడు. శరవేగంగా షూటింగ్ చేసేస్తున్నాడు. రోజుకు 12 గంటల పాటు షూటింగ్‌లో కష్టపడుతున్న పవన్ కల్యాణ్.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడట. సినిమాకు సంబంధించిన టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ.. ఇంజనీర్ బాబు అన్న టైటిల్‌ మాత్రం ఫిల్మ్‌నగర్‌లో ప్రచారమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఆగండాగండి.. ఇది అధికారికంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ కాదు, పవన్ కల్యాణ్ అభిమానులు క్రియేట్ చేసిన పోస్టర్. కాటమరాయుడు సినిమాలోని పవన్ ఓ లుక్‌ను తీసుకుని ఉత్సాహవంతులైన అభిమానులు ఈ పోస్టర్‌ను సృష్టించారు. ఇంజనీర్ బాబు అని టైటిల్ పెట్టేసి.. ఇంటి పేరు.. వంటి పేరు అంతా ఇదే అన్న ట్యాగ్‌లైన్‌నూ జోడించేశారు. పీకే25వ సినిమా అంటూ పోస్టర్లో వేసేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరి, ఒరిజినల్ ఫస్ట్‌లుక్, సినిమా టైటిల్ తెలియాలంటే మాత్రం.. మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
entertainment
8,013
25-04-2017 13:08:53
టాప్‌లెస్‌గా నటిస్తా.. అవకాశాలివ్వండి: హీరోయిన్‌
 తమిళంలో దాదాపు 50 సినిమాల్లో నటించిన సుజా వరుణి వెండితెరపై టాప్‌లెస్‌గా కనిపించేందుకు సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈమె నటించిన సినిమాల సంఖ్య ఎక్కువే అయినప్పటికీ.. అందులో ఎక్కువ భాగం ఐటెమ్‌సాంగ్స్‌, అతిథి పాత్రలే. అందుకే వాటితో విరక్తి చెందిన సుజా.. ఈ నిర్ణయం తీసుకుంది. ‘అవసరమైతే వెండితెరపై టాప్‌లెస్‌గా కనిపించే ధైర్యం నాకు ఉంది. అలాగే అవసరం లేకుండా గ్లామర్‌గా కనిపించనని తెగేసి చెప్పే ధైర్యమూ ఉంది. విద్యాబాలన్‌, కంగనా రనౌత్‌, రాధికా ఆప్టే వంటి హీరోయిన్ల మాదిరిగా కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలు చేయాల’ని ఉందని చెప్పింది సుజా వరుణి.
entertainment
21,073
13-01-2017 02:33:16
కుర్రాళ్లు అదుర్స్‌
ముంబై: తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సీనియర్లతో కూడిన భారత-ఎ ఓటమిపాలైనప్పటికీ.. రెండో వామప్‌ పోరులో యువ భారత్ సత్తా చాటింది. ఇక్కడి బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌ లెవెన్‌తో గురువారం జరిగిన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత-ఎ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని భారత-ఎ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 62 బంతులు మిగిలుండగానే ఛేదించింది. కెప్టెన్‌ అజింక్యా రహానె (83 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 91) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు యువ సంచలనం రిషభ్‌ పంత (36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 59), షెల్డన్‌ జాక్సన్‌ (56 బంతుల్లో 7 ఫోర్లతో 59) మెరుపులు తోడవడంతో భారత సునాయాసంగా నెగ్గింది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ సురేష్‌ రైనా (34 బంతుల్లో 7 ఫోర్లతో 45) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లండ్‌ బౌ లర్లలో డేవిడ్‌ విల్లీ, జేక్‌ బాల్‌, ఆదిల్‌ రషీద్‌, మొయిన్‌ అలీ తలో వికెట్‌ పడగొట్టారు.  అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన మోర్గాన్‌ సేన 48.5 ఓవర్లలో 282 పరుగులు చేసి ఆలౌటైంది. జానీ బెయిర్‌స్టో (64), అలెక్స్‌ హేల్స్‌ (51), బెన్‌ స్టోక్స్‌ (38) రాణించారు. ఓ దశలో 211 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను రషీద్‌ (39), విల్లీ (38 నాటౌట్‌) పదో వికెట్‌కు 71 పరుగులు జోడించి ఆదుకున్నారు. దీంతో ఇంగ్లండ్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత బౌలర్లలో పర్వేజ్‌ రసూల్‌ మూడు, షాబాజ్‌ నదీమ్‌, అశోక్‌ దిండా, ప్రదీప్‌ సంగ్వాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌తో ప్రాక్టీస్‌ ముగిసింది. భారత-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్‌ ఉంటుంది. 283 పరుగుల లక్ష్య ఛేదన అంత తేలికేమీ కాదు.. కానీ యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో భారత-ఎ 40 ఓవర్లలోపే ఛేదించింది. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ మధ్యలోనే వైదొలిగిన అజింక్యా రహానె కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా ఫిట్‌నెస్‌ టెస్టులో కూడా పాసయ్యాడు. రహానె, షెల్డన్‌ జాక్సన్‌ జోడీ తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించి గట్టి పునాది వేసింది. హాఫ్‌ సెంచరీ పూర్తయిన తర్వాత జాక్సన్‌ అవుటయ్యాడు. అయితే రహానెకు జతకలిసిన యువ ఆటగాడు రిషభ్‌ పంత ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. దేశవాళీల్లో సంచలనం సృష్టిస్తూ ధోనీ వారసునిగా ప్రశంసలు అందుకుంటున్న ఈ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఫోర్లు, సిక్సర్లతో పరుగుల మోతెక్కించాడు.  భారత్-ఎ తరఫున ఆడుతున్న తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి 36 బంతుల్లోనే 59 రన్స్‌ చేశాడు. దీంతో భారత-ఎ 200 మార్కు కు చేరువైంది. అయితే జోరుమీదున్న రిషభ్‌ను రషీద్‌ అవుట్‌ చేశాడు. భారత 27.3 ఓవర్లలో 197 స్కోరు వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. రెండో వికెట్‌కు 8.4 ఓవర్లలో 78 రన్స్‌ జోడించగా అందులో రిషభ్‌ చేసినవే 59 రన్స్‌ ఉండడం విశేషం. ఆ తర్వాత రైనా జతగా రహానె ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ ఇద్దరూ వేగంగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించారు. సెంచరీకి చేరువైన రహానె 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విల్లీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 32.1 ఓవర్లలో 233/3. ఈ దశలో రైనా, దీపక్‌ హుడా (23 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చక్కని షాట్లతో అలరించిన రైనా విజయానికి మరో 15 రన్స్‌ కావాల్సిన తరుణంలో జేక్‌ బాల్‌ చేతికి చిక్కాడు. అప్పటికే భారత విజయం ఖరారైంది. దీపక్‌ హుడా, ఇషాన్‌ కిషన్‌ (5 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. ఇంగ్లండ్‌ లెవెన్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (హిట్‌ వికెట్‌) (బి) సంగ్వాన్‌ 25, హేల్స్‌ (సి) రహానె (బి) నదీమ్‌ 51, బెయిర్‌స్టో (సి) రిషభ్‌ (బి) దిండా 64, మోర్గాన్‌ (సి) అండ్‌ (బి) నదీమ్‌ 0, స్టోక్స్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) రసూల్‌ 38, బట్లర్‌ (సి) అండ్‌ (బి) రసూల్‌ 0, మొయిన్‌ అలీ (సి) రిషభ్‌ (బి) దిండా 1, వోక్స్‌ (బి) రసూల్‌ 16, రషీద్‌ (సి) రిషభ్‌ (బి) సంగ్వాన్‌ 39, ప్లంకెట్‌ (సి) రిషభ్‌ (బి) కౌల్‌ 8, విల్లీ (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 48.5 ఓవర్లలో 282 ఆలౌట్‌; వికెట్లపతనం: 1-42, 2-116, 3-116, 4-163, 5-164, 6-165, 7-190, 8-198, 9-211; బౌలింగ్‌: సంగ్వాన్‌ 6.5-0-64-2, సిద్ధార్ధ కౌల్‌ 6-0-31-1, దిండా 8-1-55-2, నదీమ్‌ 10-0-41-2, వినయ్‌ కుమార్‌ 7-1-47-0, రసూల్‌ 10-1-38-3, హుడా 1-0-6-0.
sports
13,072
24-12-2017 02:51:42
జై షా కేసులో ‘ది వైర్‌’కు ఊరట
అహ్మదాబాద్‌, డిసెంబరు 23: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జై షా ఆస్తులు 16వేల రేట్లు పెరిగాయంటూ సంచలన కథనాలను వెలువరించిన ‘ది వైర్‌’ వెబ్‌సైట్‌కు కోర్టులో ఊరట లభించింది. ఇకపై షరతులకు లోబడి జై షా వ్యాపారాలకు సంబంధించిన కథనాలను వెలువరించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. జై షా వ్యాపారాలకు మోదీకి సంబంధాలు ఉన్నట్లు పోల్చుతూ ఎలాంటి కథనాలు రాయకూడదని సూచించింది.
nation
10,169
20-09-2017 18:11:33
పాటల్లేకుండా మంచు మనోజ్ సినిమా
పాటల్లేని తెలుగు సినిమాను ఊహించలేం. టాలీవుడ్‌లో ఈ తరహా సినిమాలు ఈ మధ్యకాలంలో రాలేదు. కానీ ఈ ట్రెండ్‌లో ఓ తెలుగు సినిమా ఒక్క పాట కూడా లేకుండా వస్తోంది.  మంచు మనోజ్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ చారిత్రక కధాంశంతో వస్తున్నాడు. ఆ సినిమా 'ఒక్కడు మిగిలాడు'. ఎప్పుడో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సీజీ వర్క్ వల్ల లేట్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. వచ్చేనెల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఒక్క పాట కూడా ఉండదట. యల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ జీవిత చరిత్రగా తెరకెక్కుతున్నఈ సినిమాలో మనోజ్ ప్రభాకరన్‌గా, స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడు.  తమిళ్‌లో 'రావణదేశం'గా ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం. అదే దర్శకుడు అజయ్ నూతక్కి ఇప్పుడీ సినిమాను తెలుగులో 'ఒక్కడు మిగిలాడు'గా రీమేక్ చేసాడని చెప్పుకుంటున్నారు . కమర్షియల్ అంశాల జోలికి పోకుండా, కేవలం ఎమోషనల్ డ్రామాగానే ఈ సినిమాను మలిచాడట దర్శకుడు. అందుకే ఈ సినిమాలో ఎలాంటి రొమాంటిక్ ఎలివేషన్ సాంగ్స్ లేకుండా తెరకెక్కించారట. కేవలం ఒక్క బ్యాగ్రౌండ్ సాంగ్ మాత్రమే ఉంటుందట. అందుకే ఆడియో వేడుక కూడా ఉండదని తెలుస్తోంది. ప్రభాకరన్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. పాటలు లేకుండా తెలుగు సినిమాను ఊహించరు మన ప్రేక్షకులు. మరి పాటల్లేని 'ఒక్కడు మిగిలాడు' మన ఆడియన్స్‌కు ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి.
entertainment
9,988
26-05-2017 14:37:19
‘కాలా’ తర్వాత రజినీ ఇంక సినిమాలు చేయరా?
దక్షిణాదిన సూపర్‌స్టార్‌గా మన్ననలు అందుకుంటున్న నటుడు రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని తమిళనాట డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. అయితే వాటికి సరైన సమాధానాలు ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూపోతున్నారు రజినీ. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘రోబో 2.0’ చేస్తున్న రజినీ.. ఆ తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా ప్రకటన వచ్చేసింది. అల్లుడు ధనుష్‌ నిర్మాణంలో పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కాలా’ సినిమా రజినీకి 164వ సినిమా. ఈ చిత్రం తర్వాత తన సినిమా కెరీర్‌ రజినీ ఫుల్‌స్టాప్‌ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే తన చివరి సినిమాను నిర్మించే అవకాశం ధనుష్‌కు ఇచ్చారట రజినీ. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన పార్టీ పేరును రజినీ ప్రకటించబోతున్నట్టు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీ పేరు, జెండా, గుర్తులను డిసైడ్‌ చేసేందుకు ముగ్గురు వ్యక్తులతో కూడిన కమిటీని కూడా రజినీ ఏర్పాటు చేశారట. ఒక్కసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా సినిమాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారట రజినీ. ఈ నేపథ్యంలో ‘కాలా’యే రజినీ చివరి సినిమా అని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది.
entertainment
533
23-07-2017 00:12:32
అక్రమార్కులపై ఇక దూకుడే
జిఎస్‌టి, నోట్ల రద్దుతో పన్నుల ఎగవేతకు చెక్‌: అరుణ్‌ జైట్లీన్యూఢిల్లీ: నల్లధన బాబులపై మరింత దూకుడు తప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హెచ్చరించారు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ముందు ముందు దేశంలో నగదు లావాదేవీలు జరపడం కష్టమవుతుందన్నారు. జిఎ్‌సటి, పాత పెద్ద నోట్ల రద్దుతో పన్నుల ఎగవేతకు తెరపడి, వసూళ్లూ పెరుగుతాయన్నారు. ‘ఢిల్లీ ఎకనామిక్‌ కాంక్లేవ్‌’లో జైట్లీ ఈ విషయాలు చెప్పారు. ఈ చర్యలతో దేశంలో పన్నులు చెల్లించే వారి సంఖ్యా పెరుగుతుందన్నారు. దేశ, విదేశాల్లో అక్రమంగా పోగేసిన నల్ల ధనంపైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని చెప్పారు.  గతంలోలా పన్నులు ఎగేసి దర్జాగా తిరగడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదన్నారు. గతంలో ఏటా బడ్జెట్‌లో పన్నుల ఎగవేత, నల్లధన వెలికితీత కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం కనిపించలేదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే కఠిన చర్యలకు దిగాల్సి వచ్చిందన్నారు. ఈ చర్యల ప్రభావం దీర్ఘ కాలంలో తీవ్రంగానే ఉంటుందన్నారు. ‘జిఎ్‌సటి, పెద్ద నోట్ల రద్దు, డిజిటైజేషన్‌తో నగదు లావాదేవీలు కష్టమవుతాయి. దీంతో అందరూ నిబంధనలు పాటించక తప్పదు. ఈ చర్యలతో ఇప్పటికే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు పెరిగినట్టు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి’ అని జైట్లీ చెప్పారు. డొల్ల కంపెనీలుదేశంలో పన్నుల ఎగవేత, నల్లధన ప్రవాహాలకు అడ్డాగా మారిన డొల్ల కంపెనీల గురించి జైట్లీ మాట్లాడారు. వ్యాపార సంస్థలతో పాటు రాజకీయ నేతలు, అధికారులూ తమ నల్లధన సంపదను దేశ సరిహద్దులు దాటించేందుకు డొల్ల కంపెనీలను వాడుకుంటున్నట్టు చెప్పారు. ఇలాంటి కంపెనీలపై ఉక్కుపాదం మోపడంతో పాటు, వీరు సంపాదించిన బినామీ ఆస్తుల భరతం పట్టేందుకూ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అక్రమంగా కూడబెట్టిన బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు బినామీ ఆస్తుల చట్టానికీ సవరణలు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో అక్రమ వ్యాపార లావాదేవీలకు తెరపడతాయని తెలిపారు. కేంద్ర రెవెన్యూ శాఖ ఇప్పటికే కొంతమంది బినామీ ఆస్తులపై చర్యలు ప్రారంభించిందన్నారు. దీంతో అక్రమార్కులు వెన్నులో ఇప్పటికే చలి ప్రారంభమైందని చెప్పారు.
business
13,086
19-01-2017 11:29:54
ఘోర రోడ్డు ప్రమాదం... 22 మంది చిన్నారుల మృతి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. ఎటా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఎటా జిల్లాలోని అలిగంజ్‌లో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు తిరగబడింది. 22 మంది చిన్నారులు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. మరో 50 మంది దాకా గాయపడినట్లు తెలిసింది. ఈ చిన్నారులంతా ఎటాలో ఉన్న జేఎస్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది అత్యంత బాధాకర విషయమని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
nation
1,733
09-05-2017 01:05:04
శ్రీవారి సన్నిధిలో నీతా అంబానీ
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సోమవారం రిలయన్స్‌ ఇండసీ్ట్రస్‌ అధినేత ముకేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆదివారం అర్ధరాత్రి తిరుమల చేరుకున్న ఆమె.. సోమవారం వేకువజామున సుప్రభాత సేవ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. సుప్రభాత పఠనం తర్వాత స్వామిని దర్శించుకున్నా రు. అనంతరం ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
business
13,950
17-03-2017 00:02:02
పంజాబ్‌ సీఎంగా అమరిందర్‌ ప్రమాణం
మంత్రులుగా సిద్ధూ సహా 9 మంది కూడా చండీగఢ్‌, మార్చి 16: పంజాబ్‌ ముఖ్యమంత్రిగా అమరిందర్‌ సింగ్‌(75) గురువారం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నవజ్యోతసింగ్‌ సిద్ధూ, మరో 8 మందితో మంత్రులుగానూ గవర్నర్‌ వీపీ సింగ్‌ బద్నోరే ప్రమాణం చేయించారు. పదేళ్ల బీజేపీ-అకాలీదళ్‌ కూటమిని చిత్తు చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అమరిందర్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించారు. సీఎం అభ్యర్థిగా అమరిందర్‌ను ఎన్నికల ముందే కాంగ్రెస్‌ ప్రకటించడంతో పంజాబ్‌ 26వ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. 2002-07లో కూడా పంజాబ్‌ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. సిద్ధూ మంత్రిగా ప్రమాణం చేశాక... అమరిందర్‌ పాదాలకు వందనం చేశారు. తొలుత పార్టీ సీనియర్‌ నాయకుడు బ్రహం మొహింద్ర కేబినెట్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం వీరభద్రసింగ్‌ హాజరయ్యారు. ప్రధాని మోదీ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.
nation
829
17-03-2017 23:59:50
ఉద్యోగాలిస్తున్నాం.. కొల్లగొట్టడం లేదు
ముంబై : భారత ఇన్ఫోటెక్‌ కంపెనీలు అమెరికా ఉద్యోగాలనేమీ కొల్లగొట్టడం లేదని, ఆ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తున్నాయని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ‘‘భారత ఐటి కంపెనీలు 80 దేశాల్లోని 200 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ దేశాల్లో అమెరికా కూడా ఉంది. అమెరికాలో మన ఐటి కంపెనీలు గత ఏడాదిలో 2,000 కోట్ల డాలర్ల పన్నులు చెల్లించాయి. ఆ దేశంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి. అంతేకాకుండా ఎంతో విలువను అందించాయి’’ అని ప్రసాద్‌ పేర్కొన్నారు. భారత ఐటి కంపెనీలు అమెరికాకు ఆస్తిలాంటివేనని, ఈ కంపెనీలు అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయే తప్ప ఉద్యోగాలను దోచుకోవడం లేదన్న విషయాన్ని అమెరికా పాలనా యంత్రాంగం గుర్తించాలని అన్నారు.  ఔట్‌సోర్సింగ్‌, హెచ్‌1-బి వీసాలపై ఆంక్షలు విధించేందుకు వీలుగా అమెరికా ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో రవి శంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటి వల్ల నెలకొనే పరిణామాలపై తమ ఆందోళనలను అమెరికా ఉన్నత స్థాయి అధికారవర్గాలకు తెలియజేసినట్టు ప్రసాద్‌ చెప్పారు. శుక్రవారంనాడిక్కడ ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘బై అమెరికన్‌-హైర్‌ అమెరికన్‌’ నినాదంతో 15,000 కోట్ల డాలర్ల విలువైన భారత ఐటి పరిశ్రమ భవిష్యత అగమ్యగోచరంగా మారింది. మన దేశ కంపెనీలకు వచ్చే రాబడిలో 65 శాతానికి పైగా అమెరికా నుంచే వస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. భారత్‌ను ప్రపంచానికి ఎలక్ర్టానిక్‌ హబ్‌గా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని రవి శంకర్‌ ప్రసాద్‌ అన్నారు. యుపిఎ హయాంలో ఎలక్ర్టానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలోకి 11,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే తమ ప్రభుత్వ కాలంలో 1.27 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పారు. సైబర్‌ సెక్యూరిటీ పెద్ద సమస్యగా మారిందని, దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైవేపై ప్రమాదం జరిగిందని ప్రయాణాన్ని అపలేము కదా అని ఆయన అన్నారు. సైబర్‌ టెక్నాలజీ, డిజిటైజేషన్‌ కూడా అలాంటిదేనని పేర్కొన్నారు. త్వరలోనే డిజిటల్‌ పరిశ్రమ లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోనుందని తెలిపారు.పేటిఎం పేమెంట్స్‌ బ్యాంకు కార్యకలాపాలను ఈ నెల చివరికల్లా ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపక, సిఇఒ విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. బ్యాంకింగ్‌ అనేది అందరికీ అందుబాటులో ఉండాలని, బ్యాంకులో ఖాతాదారు సొమ్ము అనేది ఆస్తే తప్ప అప్పు కాదని అన్నారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న సందర్భంగా శేఖర్‌ శర్మ మాట్లాడారు. తమ పేమెంట్స్‌ బ్యాంకు కొత్త విధానంలో ఉంటుందని, దీని ద్వారా ఫైనాన్షియల్‌ సర్వీసులను లక్షలాది మందికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న పైనాన్షియల్‌ వ్యవస్థ బాధ్యతగా ఉన్న వ్యక్తులకే శిక్షలు విధిస్తోందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొంత మంది కోట్లాది రూపాయలు ఎగవేసి లండన్‌ వంటి నగరాల్లో నివసిస్తున్నా వారిని ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు.ప్రభుత్వం దేశీయ కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంకు చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అన్నారు. అమెరికా, బ్రిటన్‌ వంటి పెద్ద దేశాలకే రక్షణాత్మక ధోరణిని అవలంబిస్తున్న తరుణంలో మన దేశం మాత్రం ఎంత రక్షణాత్మకంగా వ్యవహరించకూడదు అని ఆయన ప్రశ్నించారు. ‘‘మనది అతిపెద్ద దేశం. మనకు అతిపెద్ద మార్కెట్‌ ఉంది. మనం మన పరిశ్రమను కచ్చితంగా రక్షించుకోవాలి’’ అని ఆయన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. చైనా నుంచి చవకగా ఉక్కు దిగుమతి అవుతున్న కారణంగా భారత ఉక్కు పరిశ్రమ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. ప్రభుత్వం కనీస దిగుమతి ధరను అమలు చేసిన ఫలితంగా ప్రస్తుతం దేశీయ ఉక్కు పరిశ్రమ 80 శాతం సామర్థ్యంతో పని చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీని ఫలితంగా ఆ కంపెనీలు తమ రుణాలను చెల్లించగలుగుతున్నాయన్నారు. రానున్న నెలల్లో ఉక్కు కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం 85-90 శాతానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. అయితే ప్రభుత్వం అన్ని ఉత్పత్తులపై యాంటీ డంపింగ్‌ సుంకాన్ని విధించకపోవడం దురదృష్టకరమన్నారు. దిగుమతి సుంకాలను విధించి దేశీయ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
business
2,159
07-11-2017 00:19:41
ఆధార్‌తో 13.28 కోట్ల పాన్‌ల అనుసంధానం
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఆధార్‌తో 13.28 కోట్లకు పైగా శాశ్వత ఖాతా నెంబర్లు (పాన్‌) లింక్‌ అయినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఈ సంఖ్య జారీ అయిన పాన్‌ కార్డుల్లో 39.5 శాతానికి సమానం. ఇప్పటి వరకు దాదాపు 33 కోట్ల పాన్‌ కార్డులు, 115 కోట్ల ఆధార్‌లు జారీ అయ్యాయి. ఆదాయం పన్ను రిటర్ను (ఐటిఆర్‌) దాఖలుకు పాన్‌-ఆధార్‌ అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
business
18,511
02-04-2017 21:47:12
ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్.. చెంపపై కొట్టిన మహిళా కార్యకర్త
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత సంజయ్ సింగ్ చెంపపై ఓ మహిళా కార్యకర్త కొట్టారు. రాజౌరి గార్డెన్ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఆదివారం ఆయన ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. పార్టీలో అవినీతి గురించి చెప్పేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడంతో సంజయ్ సింగ్ చెంపపై కొట్టినట్లు సిమ్రాన్ బేడి తెలిపారు.  అయితే ఆమె చర్యను ఆప్ ఖండించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా సంజయ్ సింగ్ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
nation
971
04-04-2017 02:45:29
కాకినాడకు ‘షెల్‌’ గుడ్‌బై
హైదరాబాద్‌ : కాకినాడ తీరంలో జిఎంఆర్‌ గ్రూప్‌ తలపెట్టిన ఫ్లోటింగ్‌ ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌, ఇప్పట్లో ఫలించే సూచనలు కనిపించడం లేదు. దాదాపు రూ.1,800 కోట్ల పెట్టుబడితో ఏటా 50 లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జి దిగుమతి చేసుకునేలా ఈ ప్రాజెక్టు తలపెట్టారు. ఎపి గ్యాస్‌ డిసి్ట్రబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎపిజిడిసిఎల్‌)కు మెజారిటీ వాటా ఉండే ఈ ప్రాజెక్టులో 26 శాతం చొప్పున వాటా తీసుకునేందుకు విదేశాలకు చెందిన రాయల్‌ డచ్‌ షెల్‌, ఇంజీ గ్లోబల్‌ అనే కంపెనీలు అంగీకరించాయి. దీంతో సెప్టెంబర్‌ 2015లో సిఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రాష్ట్రంలోని పరిశ్రమల గ్యాస్‌ కొరత తీర్చే ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు.
business
6,139
30-05-2017 19:20:22
దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూత
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు (75) తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న దాసరి హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం కన్నుమూశారు. తెలుగు సినీరంగంలో దిగ్గజ దర్శకునిగా, నటునిగా, రచయితగా ఖ్యాతినార్జించిన దాసరి నారాయణరావు మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. కడసారి చూపు కోసం సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్ద బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మే 4, 1942లో జన్మించిన దాసరి తాతా మనుమడు సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సుప్రసిద్ధ నటీనటులకు హిట్ చిత్రాలనందించిన దాసరి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు.
entertainment
2,534
30-05-2017 01:25:24
పెద్ద నోట్ల రద్దు మంచిదేగానీ పేదలపై తీవ్ర ప్రభావం
ప్రపంచబ్యాంకు నివేదికఈ ఏడాది 7.2 శాతం వృద్ధిశ్రమశక్తిలో మహిళల వాటాపెంచాలని సలహాన్యూఢిల్లీ: అవ్యవస్థీకృత రంగాన్ని పెద్ద నోట్ల రద్దు భారీగానే కుదిపేసి ఉంటుందని ప్రపంచబ్యాంకు అభిప్రాయపడింది. అవ్యవస్థీకృత రంగాన్ని పెద్దనోట్ల రద్దుకుదిపేసిన కారణంగా ఈ చర్య సామాజిక ప్రభావం కూడా తీవ్రంగానే ఉండి ఉంటుందని బ్యాంకు పేర్కొంది. అయితే, పెద్ద నోట్ల రద్దు సామాజిక ప్రభావాన్ని అంచనావేసేందుకు మరింత డేటా, ముఖ్యంగా లేబర్‌ మార్కెట్ల డేటా లభ్యత కీలకమని బ్యాంకు పేర్కొంది. డేటా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రభావాన్ని కచ్చితంగా అంచనావేయడం కష్టమని బ్యాంకు అభిప్రాయపడింది. ఇండియా డెవల్‌పమెంట్‌ అప్‌డేట్‌ నివేదికను బ్యాంకు సోమవారం నాడు విడుదల చేసింది. పెద్దనోట్ల రద్దు చర్యపై ప్రశంసలు గుప్పిస్తూనే ఈ నివేదిక పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దేశీయ స్థూల ఆర్థిక రంగంపై పెద్దనోట్ల రద్దు ప్రభావం పరిమితంగానే ఉందనీ, అవ్యవస్థీకృత రంగాన్ని మాత్రం తీవ్రంగా ప్రభావితం చేసిందని బ్యాంకు పేర్కొంది. ఈ చర్య రద్దు ప్రభావం అన్ని రంగాలపై సమానంగా లేదని తెలిపింది. అవ్యవస్థీకృత రంగం వాటా జిడిపిలో కేవలం 40 శాతం మాత్రమే అయినా ఈ శ్రామికవర్గంలో రంగంపై ఆధారపడి జీవిస్తున్నవారి సంఖ్య 90 శాతం ఉంటుందని బ్యాంకు పేర్కొంది. నిరుపేదలు, బడుగువర్గాలు ఉపాధి పొందే అవ్యవస్థీకృత రంగంపై పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల ఈ వర్గాల ఉపాధికి దెబ్బతగిలి ఉంటుందని బ్యాంకు పేర్కొంది. ఈ వర్గాలు క్యాష్‌లెస్‌ చెల్లింపులకు వెంటనే మారడం కూడా అంతసులభం కాదని బ్యాంకు వ్యాఖ్యానించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల నగదు కొరత ఏర్పడటంతో నగదుపై ఆధారపడిన వ్యవసాయం, నిర్మాణం, చిల్లరవ్యాపారం... వంటి రంగాలు దెబ్బతిన్నాయనీ, భారత్‌ జిడిపి వృద్ధి రేటు మూడో త్రైమాసికంలో 7 శాతానికి తగ్గిందని బ్యాంకు తెలిపింది. దీనివల్ల 2016-17 ఆర్థిక వృద్ధి రేటు 6.8 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది. ఈ ఏడాది నుంచి వృద్ధిలో మళ్లీ రికవరీ ఉంటుందని ఈ ఏడాది 7.2 శాతం వచ్చే ఏడాది 7.7 శాతం వృద్ధి రేటుతో భారత్‌ దూసుకుపోయే అవకాశం ఉందని అంచనావేసింది. ఈ ఏడాది ఫిబ్రవరీ నాటికే ఉపాధి హామీ డిమాండ్‌ 2015-16 పూర్తి సంవత్సరాన్ని అధిగమించినట్టు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కూడా తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. అయితే,దీర్ఘకాలంలో పెద్దనోట్ల రద్దు భారత ఆర్థికరంగానికి ఎనలేని మేలుచేస్తుందని ప్రపంచబ్యాంకు కితాబు నిచ్చింది. అవ్యవస్థీకృత రంగం కూడా క్రమంగా వ్యవస్థీకృతమవుతుందని పేర్కొంది. ఈ విషయంలో జిఎ్‌సటి కీలక భూమిక పోషించనున్నట్టు వెల్లడించింది.  ప్రైవేట్‌ ఇన్వెస్ట్‌మెంట్లలో వృద్ధికి మిగులు సామర్ధ్యాలు, రెగ్యులేటరీ, విధానపరమైన చికాకులు, కార్పొరేట్‌ రుణాల భారం వంటి అవరోధాలున్నాయని ఇండియా డెవల్‌పమెంట్‌ అప్‌డేట్‌ నివేదిక రచయిత ఫ్రెడిరికో గిల్‌ సాండర్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రభుత్వం ఇటీవల ఇన్‌ఫ్రాపై భారీగా వ్యయాన్ని పెంచడం, సంస్కరణలను మరింత దూకుడుగా అమలు చేస్తుండటం వల్ల క్రమంగా ప్రైవేట్‌ పెట్టుబడులు ఊపందుకుంటాయని ఆయన అన్నారు. భారతలో లేబర్‌ ఫోర్స్‌లో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండటాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. ప్రపంచంలోని 131 దేశాల జాబితాలో భారత ఈ విషయంలో 120వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌ వంటి చిన్న దేశాల్లో కూడా పారిశ్రామిక రంగంలో దాదాపు 33 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు. భారతలో కేవలం 17 శాతం మంది మాత్రమే ఉన్నారు.
business
2,223
13-01-2017 00:44:11
‘పవన్‌ హన్స్‌’లో అమ్మకానికి ప్రభుత్వ వాటా
న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడుతుండడంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం ఉధృతం చేసింది. ఇందులో భాగంగా ‘పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌’ ఈక్విటీలో తనకున్న 51 శాతం వాటా మొత్తాన్ని విక్రయించాలని నిర్ణయించింది. కంపెనీపై పూర్తి స్థాయి మేనేజ్‌మెంట్‌ హక్కుతో ఈ వాటాను విక్రయిస్తామని తెలిపింది. దీనిపై ఆసక్తి ఉన్న కొనుగోలుదారుడిని వెతికిపెట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు ఫిబ్రవరి 2లోగా బిడ్స్‌ దాఖలు చేయాలని కోరింది. పవన్‌ హన్స్‌ ఈక్విటీలో మిగతా 49 శాతం వాటా ఔన్‌జిసి చేతిలో ఉంది. చమురు అన్వేషణ, ఉత్పత్తి జరిగే మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతా లు, తీర ప్రాంతాలకు అధికారులు, సిబ్బందిని తరలించేందుకు 1985లో పవన్‌ హన్స్‌ను ఏర్పాటు చేశారు.
business
12,632
16-07-2017 20:31:10
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు..!
న్యూఢిల్లీ: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి  అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్‌కు దాదాపు తెరపడినట్టే కనిపిస్తోంది. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని బీజేపీ అధిష్ఠానవర్గం నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. మంగళవారంనాడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానంతరం వెంకయ్యనాయుడు పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే వెంకయ్యనాయుడు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగేందుకు మొగ్గుచూపుతున్నారని, ఇదే విషయాన్ని మోదీ దృష్టికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారని కూడా తెలుస్తోంది. అంతిమంగా మాత్రం మోదీ నిర్ణయమే కీలకం కాబోతోంది. వెంకయ్యనాయుడు పేరును ఎన్డీఏ అధికారికంగా ప్రకటిస్తే దక్షిణాదికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్నిక చేసినట్టు అవుతుంది. ఉత్తరాదికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇప్పటికే ఎన్డీఏ బరిలోకి దింపింది. కాగా, వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇప్పటికే విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన గోపాల్‌కృష్ణ గాంధీతో ఆయన తలపడాల్సి ఉంటుంది.
nation
21,435
28-09-2017 01:49:08
నీ స్నేహితులకే జట్టులో చోటా?
స్మిత్‌పై మాజీ పేసర్‌ హాగ్‌ ఆరోపణబెంగళూరు : భారత్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయిన ఆసీస్‌పై విమర్శల దాడి మొదలైంది. ముఖ్యంగా జట్టు ఎంపిక తీరుపై కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను తీవ్రంగా తప్పుబట్టాడు మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ రాడ్నీ హాగ్‌. తన ‘మిత్రుల’కే తుది జట్టులో స్మిత్‌ చోటు కల్పిస్తున్నాడని ఆరోపించాడు. ‘సన్నిహితులనే జట్టుకు ఎంపిక చేస్తున్నారు. స్మిత్‌ సెలెక్టర్‌ కారాదు. అగర్‌కు అలానే అవకాశం ఇచ్చారు. కార్ట్‌రైట్‌ అలానే చోటు సంపాదిస్తున్నాడు. స్మిత్‌ ఫ్రెండ్‌ అయినందునే నిక్‌ మాడిసన్‌ను ఎంపిక చేశారు. సన్నిహితులైనంత మాత్రాన జట్టుకు ఎంపిక చేస్తారా’ అని హాగ్‌ ఆగ్రహంగా ప్రశ్నించాడు. ‘జట్టు ఎంపిక నిజాయితీగా ఉండాలి. కానీ అలా జరగడంలేదు. కెప్టెన్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు’ అని 70-80 దశకాల్లో ఆస్ర్టేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ పేస్‌ బౌలర్‌ దుయ్యబట్టాడు.
sports
13,445
19-01-2017 02:22:30
నా విద్యార్హత బయటపెట్టవద్దు: స్మృతి
న్యూఢిల్లీ, జనవరి 18: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతల వివాదం కొనసాగుతూనే ఉంది. తన విద్యార్హతలకు సంబంధించి ఎలాంటి రికార్డులను ఆర్టీఐ చట్టం ప్రకారం బయటపెట్టవద్దని స్మృతి ఇరానీ ఢిల్లీ యూనివర్సిటీకి విజ్ఞప్తి చేశారు. కాగా స్మృతి ఇరానీ 10, 12 తరగతులకు సంబంధించి సర్టిఫికెట్లను తనిఖీ చేసుకోవచ్చంటూ కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ మంగళవారం ఆదేశించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ప్రజలకు తన నర్సరీ వివరాలనూ అడిగే హక్కు ఉందని (ఆప్‌ నర్సరీ కా భీ మాంగ్‌లో) వ్యాఖ్యానించారు.
nation