SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
2,256
03-02-2017 23:56:30
‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఐఫోన్లు
జూన్‌ నుంచి బెంగళూరులో ఉత్పత్తి! బెంగళూరు : యాపిల్‌ కంపెనీకి చెందిన ఐఫోన్లపై త్వరలోనే మేడ్‌ ఇన్‌ ఇండియా పేరు కనిపించనుంది. ఈ ఫోన్లు బెంగళూరులోని ప్లాంట్‌ నుంచి బయటకు రానున్నాయి. ఎప్పుడు ఇవి మార్కెట్లోకి వస్తాయన్న దానిపై అధికారికంగా ప్రకటన వెలువడకపోయినప్పటికీ జూన్‌ నుంచి వీటి తయారీ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. యాపిల్‌కు భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఐఫోన్లను ఇక్కడే అసెంబుల్‌ చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. యాపిల్‌ను ఆకర్షించేందుకు కర్ణాటక రాష్ట్ర మంత్రులు, అధికారులు కూడా పలుమార్లు యాపిల్‌ అధికారులను కలిసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలను గురించి వివరించడంతో యాపిల్‌ తన అసెంబ్లింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
business
10,549
30-12-2017 22:36:11
గడ్డం తీసేయాలి గురూ!
కథ మారుతోంది! కథను నడిపించే కెప్టెన్‌ మారుతున్నారు! అప్పుడు కథానాయకుడు కూడా కొత్తగా కనిపించాలి కదా! కొత్తగా కనిపించాలంటే? లుక్‌ ఛేంజ్‌ చేయాలి. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘రంగస్థలం’ కోసం రామ్‌చరణ్‌ బాగా గడ్డం పెంచారు. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్‌ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ జనవరి 19న ప్రారంభం కానుంది. ఈలోపు రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రీకరణ పూర్తి చేసి లుక్‌ ఛేంజ్‌ చేయాలి. అంటే... గడ్డం తీసేయాలి కదా! చరణ్‌ కొత్త లుక్‌ ఎలా ఉండబోతుందో మరి? వెయిట్‌ అండ్‌ సీ!! ట్రిపుల్‌ హ్యాట్రిక్‌కి సెకండ్‌ స్టెప్‌ :మాస్‌... రామ్‌చరణ్‌ మాంచి మాస్‌ హీరో. మరి, బోయపాటి? ఊర మాస్‌ దర్శకుడు! సేమ్‌ టైమ్‌ హీరోని మంచి స్టైలిష్‌గానూ చూపిస్తారు. దాంతో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టు బోయపాటి సూపర్‌ స్టోరీ రెడీ చేశారట! ఈ సినిమాతో ఆయన ట్రిపుల్‌ హ్యాట్రిక్‌లో సెకండ్‌ స్టెప్‌ వేయబోతున్నారు. ఇప్పటివరకూ బోయపాటి ఏడు సినిమాలు చేశారు. ఏడూ హిట్టే! ‘సరైనోడు’తో డబుల్‌ హ్యాట్రిక్‌ అందుకున్న ఆయన... ఈ ఏడాది విడుదలైన ‘జయ జానకీ నాయక’తో ట్రిపుల్‌ హ్యాట్రిక్‌లో ఫస్ట్‌ స్టెప్‌ సక్సెస్‌ఫుల్‌గా వేశారు. రామ్‌చరణ్‌ సినిమా సెకండ్‌ స్టెప్‌ అన్నమాట! 2018 దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో కథానాయికగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పేరు పరిశీలనలో ఉందట!
entertainment
17,093
31-03-2017 02:30:33
భారత్‌లో ఉండాలా.. ‘వందేమాతరం’ పాడండి
మీరట్‌ కార్పొరేషన్‌ హౌస్‌లో రగడ మీరట్‌, మార్చి 30: యూపీలో వందేమాతరం రగడ కాకపుట్టిస్తోంది. వందేమాతర గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని మేయర్‌.. కాదూ కూడదంటూ బహిష్కరించిన ముస్లిం సభ్యులు.. భారత్ లో ఉండాలంటే, వందేమాతరం పాడాల్సిందేనంటూ బీజేపీ కార్పొరేటర్ల నినాదాలు... ఇలా యూపీలోని మీరట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. మంగళవారం హౌస్‌ సమావేశం కాగానే.. సభ్యులంతా తమ స్థానాల్లోంచి లేచి నిలబడి వందేమాతర గీతాన్ని ఆలపించారు. అంతలో ఓ ఏడుగురు ముస్లిం కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. ఈ దశలో ‘‘మీరు భారతలో ఉండాలనుకుంటే.. వందేమాతర గీతాన్ని పాడాల్సిందే’’నంటూ బీజేపీ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. అయితే ఈ వివాదం అక్కడితో సమసిపోలేదు.. గీతాలాపన ముగిశాక ముస్లిం సభ్యులు లోనికి వచ్చేందుకు ప్రయత్నించినా బీజేపీకి చెందిన మేయర్‌ హరికాంత అహ్లువాలియా వారిని అనుమతించలేదు. అంతేకాదు.. సదరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయాలని మున్సిపల్‌ బోర్డు నిర్ణయించింది. కాగా ఇది సీరియస్‌ అంశమని, వందేమాతర గీతాన్ని హౌస్‌లో సభ్యులంతా తప్పనిసరిగా ఆలపించాల్సిందేనని మేయర్‌ స్పష్టం చేశారు. దీనిపై ముస్లిం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. షరియా చట్టం వందేమాతరం ఆలపించేందుకు అంగీకరించదని, ఈ విషయంలో తాము హౌస్‌ను బహిష్కరిస్తూనే ఉంటామని, అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయుంచేందుకు వెనుకాడమన్నారు.
nation
17,659
15-07-2017 02:06:21
నీట్‌ను రద్దు చేయలేం: సుప్రీం
న్యూఢిల్లీ, జూలై 14: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) 2017ను రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. 11 లక్షల మంది అభ్యర్థుల్లో ఆరులక్షల మందికిపైగా ఉత్తీర్ణత సాధించి, కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా మొదలైన దశలో పరీక్ష ఫలితాలకు అంతరాయం కలిగించడం అత్యంత కష్టమైన ప్రక్రియ అని పేర్కొంది. 6.11 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయమైనందున, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, ప్రవేశాల ప్రక్రియ కొనసాగాలని దీపక్‌ మిశ్రా సారథ్యంలోని సుప్రీంకోర్టు తిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. సీబీఎ్‌సఈ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ మనీందర్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ.. ఇంగ్లిషు, హిందీతో పాటు 8 స్వదేశీ భాషల్లో ప్రశ్నపత్రాలను ఇచ్చామని, అన్ని క్వశ్చన్‌ పేపర్లలో ప్రశ్నల కాఠిన్యస్థాయి ఒకే విధంగా ఉందని స్పష్టం చేశారు. ఎనిమిది విభిన్న భాషల్లో 1.48 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, దీంతో క్వశ్చన్‌ పేపర్ల లీకేజీ సమస్యకు చెక్‌ పడిందన్నారు. కాగా సీబీఎ్‌సఈ అఫిడవిట్‌ను పరిశీలిస్తామని, మూడురోజుల్లో దాఖలు చేయాలని బోర్డును ఽధర్మాసనం ఆదేశిస్తూ విచారణను 31కి వాయిదా వేసింది.
nation
14,529
14-04-2017 02:36:22
అఫ్ఘాన్‌లో అత్యంత భారీ బాంబుదాడి
వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 13: అఫ్ఘానిస్థాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ కాంప్లెక్స్‌పై గురువారం అతిపెద్ద నాన్‌-న్యూక్లియర్‌ బాంబుతో అమెరికా దాడి చేసింది. నన్‌గర్హర్‌ ప్రావిన్స్‌లోని అచిన్‌ జిల్లాలో ఉన్న ఐసిస్‌ ‘‘టన్నెల్‌ కాంప్లెక్స్‌’’పై జీబీయూ-43/బీ బాంబును అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా బలగాలు ప్రయోగించాయి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:32 గంటలకు ఈ దాడి జరిగింది. 21,600 పౌండ్లు (9797 కిలోలు) బరువుండే ఈ భారీ బాంబును అన్ని బాంబులకు తల్లిగా పిలుస్తారు.
nation
4,629
10-02-2017 16:08:02
స్టార్‌ హీరో సరసన ‘పెళ్లిచూపులు’ హీరోయిన్‌!
 అయితే తాజాగా ఆమెకు ఓ బంపరాఫర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌, స్టార్‌ హీరో విక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా రీతూవర్మను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘పెళ్లిచూపులు’ చూసిన గౌతమ్‌ మీనన్‌కు రీతూ నటన బాగా నచ్చిందట. అందుకే తన సినిమాలో ఛాన్సిచ్చాడట. రీతూకు ఇది నిజంగా గొప్ప అవకాశమే. సహాయ పాత్రలో కనిపించిన నటి ఏకంగా విక్రమ్‌, గౌతమ్‌ మీనన్‌ సినిమాలో హీరోయిన్‌ అవకాశం అందుకోవడమంటే పెద్ద గెలుపే.
entertainment
11,824
12-07-2017 02:21:29
అమెరికాలో విమాన ప్రమాదం
ఇండియానాలో స్థిరపడిన తెలుగు దంపతుల దుర్మరణంమృతుల స్వస్థలం మచిలీపట్నం.. ఆలస్యంగా వెలుగులోకి మచిలీపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన దంపతులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలపటపు ఉమామహేశ్వరరావు (63), ఆయన భార్య సీత (61) ఉత్తర అమెరికాలోని ఇండియానాలో స్థిరపడ్డారు. వైద్య వృత్తిలో ఉన్న ఉమామహేశ్వరరావుకు లోగన్‌ స్పోర్ట్‌లో రాజ్‌ క్లినిక్‌ ఉంది. ఓహియో రాష్ట్రం వాటర్‌ఫోర్డ్‌ సమీపంలో ఈనెల 8న వారు ప్రయాణిస్తున్న చార్టెడ్‌ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ మరణించారు.
nation
17,180
29-09-2017 15:21:30
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
ముంబై : ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ (ప్రభాదేవి) రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. మృతుల్లో ఒక్కొక్కరి కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున నష్ట పరిహారం చెల్లించనున్నట్లు రాష్ట్ర మంత్రి వినోద్ తావడే ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ దుర్ఘటనలో 22 మంది మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డారు.
nation
14,084
20-06-2017 02:24:18
పంజాబ్‌ రైతులకు రుణమాఫీ
అప్పు ఎంతున్నా.. రూ. 2 లక్షల వరకు మాఫీ: అమరీందర్‌చండీగఢ్‌, జూన్‌ 19: రైతుల ఆందోళనలకు ప్రభుత్వాలు దిగి వస్తున్నాయి. పంజాబ్‌లో కొత్తగా రుణమాఫీ ప్రకటిస్తే.. మహారాష్ట్రలో ప్రాథమిక రుణసాయం కింద రైతులకు రూ. 10వేల చొప్పున అందించాలని నిర్ణయించారు. పంజాబ్‌ రైతులకు ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రుణమాఫీ వరం ప్రకటించారు. చిన్న, సన్నకారు రైతులకు రుణమొత్తం ఎంతున్నా.. అందులోంచి రూ. 2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఇక మహారాష్ట్రలో కొంత ఆలస్యంగానైనా రైతులకు తాత్కాలిక రుణసాయాన్ని అందించడం మొదలుపెట్టారు. నాట్లు వేసుకోడానికి వీలుగా రూ. 10వేల చొప్పున ఇస్తున్నారు.
nation
8,570
02-07-2017 17:26:20
ప్రభాస్‌కైతే కత్రిన ఓకే చెప్పేస్తుందట!
ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ సినిమా చేయాలని చాలా మంది హీరోయిన్లు తహతహలాడుతున్నారు. ఆ మొన్న బాలీవుడ్ క్యూట్ బేబి అలియా భట్.. ప్రభాస్‌తో సినిమా చేయాలనుందంటూ మనసులోని మాటను బయటపెట్టింది. తాజాగా పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్ కూడా ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందంటూ తన మనసులోని మాటనూ చెప్పేసింది. శనివారం దుబాయ్‌లో సైమా అవార్డుల వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఆ అవార్డుల కార్యక్రమానికి హాజరైన కత్రినా కైఫ్‌ను హోస్ట్ ఓ ప్రశ్న వేశాడట. దక్షిణభారత సినిమాల్లో నటించాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారని హోస్ట్ ప్రశ్నించగా.. ప్రభాస్‌తో చేయాలనుందంటూ టపీమని సమాధానం చెప్పేసిందట కత్రినా. అదే తమిళంలో అయితే చియాన్ విక్రమ్‌తో సినిమా చేస్తానని చెప్పిందట. బాహుబలి సినిమాలో ప్రభాస్ చాలా అద్భుతంగా నటించాడని, సినిమాలో ప్రభాస్ మానరిజం చాలా బాగా నచ్చిందని, అందుకే ప్రభాస్‌తో సినిమా చేయాలనుందని ఆమె చెప్పడం విశేషం.
entertainment
17,729
26-03-2017 15:26:05
యోగికి తొలి పరీక్ష....రైతు ఆత్మహత్యా యత్నం
గోరఖ్‌పూర్ : పేరుకుపోయిన రుణాలను తీర్చే దారిలేక ఓ రైతు యూలోని గోరఖ్‌పూర్ ఆలయం ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అయితే స్థానికులు సకాలంలో అతని ప్రయత్నాన్ని అడ్డుకుని ప్రాణాపాయం నుంచి కాపాడారు. పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు అతన్ని తరలించారు. బలియా జిల్లా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతు రాజ్‌కుమార్ భారతి తనను చావనీయండంటూ కంటతడి పెట్టాడు. 'నా బాధ వినేవాళ్లే లేకుండా పోయారు. అప్పులు పేరుకుపోయాయి. ఆరోగ్యం క్షీణించింది. నాకు సహాయం కావాలి' అని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తీసుకున్న రుణాలు వైద్యచికిత్సకే ఖర్చయ్యాయని భోరుమన్నాడు. అయితే తనకు సహాయం చేయండంటూ ఆయన చేసిన విజ్ఞప్తి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లిందా లేదా అనేది ఇంకా తెలియలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రైతు రుణాల మాఫీపై మంత్రివర్గ తొలిసమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ యూపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే రైతు రుణాల మాఫీని ఆర్థిక మంత్రి జైట్లీ ఇటీవల తోసిపుచ్చారు. రాష్ట్రాలు తమ సొంత వనరుల నుంచే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒక రాష్ట్రానికి సహాయం చేసి ఇతరులను ఉపేక్షించే విధానం కేంద్రం తీసుకునేది లేదని కూడా ఆయన తేల్చిచెప్పారు. యోగి ఆదిత్యనాథ్ తొలి కేబినెట్ సమావేశంలో కానీ ఇంతవరకూ కానీ రైతు రుణ మాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
nation
21,538
09-10-2017 02:09:49
నకమురా హ్యాట్రిక్‌
హోండురస్‌పై జపాన్‌ ఘన విజయంగువాహటి: కీటో నకమురా హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగడంతో జపాన్‌ అద్భుత బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-ఇ పోరులో జపాన్‌ 6-1తో హోండురస్‌ను ఉతికి ఆరేసింది. నకమురా 20, 30, 43 నిమిషాల్లో వరుసగా మూడు గోల్స్‌ సాధించా డు. కుబో (45), మియాష్రియో (51), టోయిచి (90) తలో గోల్‌తో రాణించారు. హోండురస్‌ తరఫున 36 నిమిషంలో పాట్రిక్‌ పాలసియో ఏకైక గోల్‌ చేశాడు. కాలెడోనియాపై ఫ్రాన్స్‌ పంజా: టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఫ్రాన్స్‌ టోర్నీని ఘనంగా ఆరంభించింది. గ్రూప్‌-ఈలో తన తొలి పోరులో ఫ్రాన్స్‌ 7-1తో అరంగేట్రం జట్టు న్యూ కాలెడోనియాను మట్టికరిపించింది. అమైన్‌ గోవిరి (20, 33వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో రాణించాడు. బెర్నార్డ్‌ ఇవా, కియామ్‌ వానెసె (సెల్ఫ్‌ గోల్స్‌), క్లాడియో గోమ్స్‌, విల్సన్‌ ఇసిడోర్‌, మాక్సె న్స్‌ కాక్యురెట్‌ తలో గోల్‌ సాధించారు. కాలెడోనియా తరఫున చివరి నిమిషంలో సిద్రి గోల్‌ కొట్టాడు.  సాంచో డబుల్‌ ధమాకా: జొడాన్‌ సాంచో డబుల్‌ ధమాకా మోగించడంతో ఇంగ్లండ్‌ 4-0తో చిలీని చిత్తుగా ఓడించింది. 51, 60వ నిమిషాల్లో సాంచో రెండు గోల్స్‌ కొట్టాడు. హడ్సన్‌ ఒడోయి (5వ నిమిషం), ఏంజెల్‌ గోమ్స్‌ (81 నిమిషం) చెరో గోల్‌తో సత్తా చాటారు. రెండుసార్లు చాంపియన్‌ మెక్సికోకు ఇరాక్‌ దడపుట్టించింది. గ్రూప్‌-ఎఫ్‌లో జరిగిన మరో పోరులో మెక్సికోను 1-1తో ఇరాక్‌ అద్భుత రీతిలో నిలువరించింది.
sports
943
31-10-2017 00:11:52
జిఎస్టితో కలిపే ఎంఆర్‌పి ధర
ఎక్కువ వసూలు చేస్తే శిక్షించాలి: మంత్రుల కమిటీన్యూఢిల్లీ: కొంత మంది వ్యాపారులు వినియోగదారుల నుంచి గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పి)కు తోడు జిఎస్టి పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీరి ఆగడాలకు చెక్‌పెట్టేందుకు జిఎస్టితో కలిపే ఎంఆర్‌పిని ముద్రించాలని జిఎస్టిపై ఏర్పాటైన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల స్థాయి కమిటీ సిఫారసు చేసింది. దీనిని అతిక్రమించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోమ్‌ ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని కమిటీ కోరింది. వచ్చే నెల 10న గౌహతిలో జరిగే జిఎస్టి మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెస్టారెంట్లు, మాల్స్‌లో అమ్మే ప్యాకేజ్డ్‌ వస్తువులన్నిటికీ ఈ నిబంధన వర్తింపజేయాలని మంత్రుల కమిటీ సిఫారసు చేసింది. అయితే వ్యాపారులు, వ్యాపార సంస్థలు తమ రిటర్న్‌లు ఫైల్‌ చేసేటప్పుడు మాత్రం అమ్మకం ధరను, జిఎస్టిని వేర్వేరుగా చూపాలని కోరింది. ఇంకా రిటర్న్‌ల ఫైలింగ్‌ ఆలస్యమైతే ప్రస్తుతం రోజుకు రూ.100గా ఉన్న జరిమానాను రూ.50కి తగ్గించాలని సూచించింది. రిటర్న్‌ల ఫైలింగ్‌ విధానాన్ని మరింత సులభతరం చేయాలని కూడా కోరింది. రాష్ట్రాల పన్ను ఆదాయాలు వేర్వేరుగా ఉన్నందున జిఎస్టి అమలు విధానాన్ని వికేంద్రీకరించాలని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ కోరారు. అత్యంత ముఖ్యమైన జిఎస్టి పన్ను సంస్కరణని సరైన పద్ధతిలో అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందన్నారు.
business
20,040
02-11-2017 18:04:03
గెలుపు మనది.. నెం. 1 స్థానం వారిది..
న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉంది. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేన 3 వికెట్లు కోల్పోయి 53 పరుగుల తేడా విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టుపై టీం ఇండియా గెలవడంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు టాప్‌లోకి వచ్చింది. 124 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న పాక్.. భారత్ గెలుపుతో పాకిస్థాన్ మొదటి స్థానంలోకి వచ్చింది. శనివారం భారత్, న్యూజిలాండ్‌ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. 16,91 పాయింట్లతో న్యూజిలాండ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉంది. 2,395 పాయింట్లతో వెస్టిండీస్ 3వ స్థానంలో, 2,029 పాయింట్లతో ఇంగ్లాండ్ 4వ స్థానంలో, 2,720 పాయింట్లతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా 5వ స్థానంలో ఉంది.
sports
17,972
12-04-2017 02:24:30
భర్తను హత్యచేసిన నవ వధువు
చెన్నై, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): పెళ్లి జరిగి పదిరోజులైనా కాకుండానే భార్య చేతిలో హత్యకు గురయ్యాడో భర్త. ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు ప్రియుడితో కలిసి ఆమె ఈ దారుణానికి పాల్పడింది. తమిళనాడు విల్లుపురం జిల్లా బన్రూట్టి సమీపంలోని తిరువదికై ప్రాంతానికి చెందిన రమేష్‌(29)కు.. మనకుప్పం గ్రామానికి చెందిన విజీ అనే యువతితో ఈ నెల 2వ తేదీన ఓ ఆలయంలో వివాహం జరిగింది. అత్తింటి పంపకాల్లో నవదంపతులు సోమవారం మధ్యాహ్నం గొడవపడ్డారు. ఈ క్రమంలో రమేష్‌ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. భర్తను ఎవరో చంపేశారంటూ విజీ బిగ్గరగా కేకలు పెడుతూ ఇంటి వెలుపలికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని రమేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. విజీ ప్రవర్తనపై అనుమానంతో తమ శైలిలో విచారించగా తానే ప్రేమికుడితో కలిసి భర్తను హత్యచేసినట్టు అంగీకరించింది. నిద్రపోతున్న రమేష్‌ తలపై రుబ్బు రోలుతో మోది, గొంతు నులిమి హత్య చేశానని అంగీకరించింది.
nation
18,189
15-05-2017 02:02:32
రాన్సమ్‌వేర్‌తో జరభద్రం: సెర్ట్‌-ఇన్‌
న్యూఢిల్లీ, మే 14: ‘సైబర్‌ బాంబ్‌’ రాన్సమ్‌వేర్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇంటర్నెట్‌ యూజర్లను కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా(సెర్ట్‌-ఇన్‌) హెచ్చరించింది. ఎప్పుడెప్పుడు భారత సైబర్‌ వ్యవస్థపై దాడి చేద్దామా అని గుంట కాడి నక్కలా వేచిచూస్తోందని తెలిపింది. ‘వాన్నాక్రై’ అత్యంత వేగంగా విస్తరిస్తోందని, అది ప్రభావిత విండోస్‌ సిస్టంలలో ఫైళ్లను ఎన్‌క్రి్‌ప్ట(మెషీన్‌ కోడ్‌లోకి మార్చడం) చేస్తోందని వెల్లడించింది. మొదటగా కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ను ఎన్‌క్రిప్ట్‌ చేసి ల్యాన్‌ కేబుళ్ల ద్వారా విస్తరిస్తోందని వివరించింది. హానికర అటాచ్‌మెంట్‌ ద్వారా కూడా ఈమెయిల్‌లోకి చేరుతోందని తెలిపింది. రాన్సమ్‌వేర్‌ విండోస్‌ కంప్యూటర్లలోకి రాకుండా ఉండాలంటే ‘ప్యాచ్‌’లను ఆప్లై చేసుకోవాలని చెప్పింది. అయాచిత వెబ్‌సైట్లను, ఈమెయిల్‌ లింకులను ఓపెన్‌ చేయవద్దని సూచించింది.
nation
5,380
23-08-2017 10:49:47
హీరోయిన్ జీవితంతో ట్రిపుల్ తలాక్ ఆటలు...
ముంబై: ముమ్మారు తలాక్ చెప్పి విడాకులిచ్చే పద్ధతి ఇకపై చెల్లబోదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన నేపధ్యంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ దురాచారానికి బలైన వారంతా సుప్రీంకోర్టు తీర్పు తరువాత తమ దీనగాథలను వినిపిస్తున్నారు. సినీ జగత్తులో ఒకప్పుడు వెలుగొందిన హీరోయిన్ జీవితం ట్రిపుల్ తలాక్‌కు అతలాకుతలమైంది. బాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి హీరోయిన్ మీనాకుమారి జీవితం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. అది 1952 నాటి సంగతి. మీనాకుమారి ‘పాకీజా’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. అ సమయంలోనే నిర్మాత కమాల్ అమ్రోహీతో నిఖా జరిగింది. కొంతకాలం తరువాత వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఒకరోజు కోపంతో ఊగిపోతూ ఇంటికి వచ్చిన కమాల్ అమ్రోహీ ఆమెకు మూడు సార్లు తలాక్ చెప్పాడు.  దీంతో మీనాకుమారి నిశ్చేష్టురాలైపోయింది. ఇక మరోసారి పెళ్లిపేరెత్తకూడదని నిశ్చయించుకుని నిస్పారంగా జీవితం గడపసాగింది. అయితే కొంతకాలం తరువాత విచిత్రంగా కమాల్ అమ్రోహీ తిరిగి ఆమె దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మళ్లీ నిఖా చేసుకుందామన్నాడు. ఈ నేపధ్యంలో ముస్లిం మత పెద్దలు... ఒకసారి నిఖా చేసుకున్న మహిళతో మరోమారు నిఖా చేసుకునేందుకు అవకాశం లేదని చెప్పారు. అయితే ఇందుకు పరిష్కారంగా ముందుగా మీనాకుమారికి మరొకరితో నిఖా జరిపించాలని చెప్పారు. అప్పడు ఆ నూతన వరుడు.. మీనాకుమారికి ట్రిపుల్ తలాక్ చెప్పాల్సి ఉంటుదన్నారు. దీని తరువాతే మీనాకుమారిని... కమాల్ అమ్రోహీ మరోమారు నిఖా చేసుకునేందుకు అర్హుడవుతాడని చెప్పారు. అనున్నట్టు అంతా సవ్యంగానే జరిగింది. అప్పటి హీరోయిన్ జీనత్ అమన్ తండ్రి అమానుల్లా ఖాన్‌తో మీనాకుమారి నిఖా జరిగింది. తరువాత అతను మీనాకుమారికి ట్రిపుల్ తలాక్ చెప్పారు. అప్పుడు కమాల్ అమ్రోహీ మీనా కుమారిని తిరిగి నిఖా చేసుకున్నాడు. కాగా మీనాకుమారి 1972, మార్చి 31న కన్నుమూశారు.
entertainment
8,351
14-09-2017 11:37:34
హీరో విశాల్‌ పోరాటం ఫలించేనా?
చెన్నై: తమిళ్‌ రాకర్స్‌... కొన్నేళ్లుగా కోలీవుడ్‌ నిర్మాతలకి నిద్రలేకుండా చేస్తున్న ఆన్‌లైన్‌ పైరసీ వెబ్‌సైట్‌. తమిళ్‌గన్‌ వంటి మరిన్ని పైరసీ వెబ్‌సైట్లు కూడా తోడవ్వడంతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. సినిమాలు విడుదలైన గంటల్లోనే ఈ వెబ్‌సైట్లలో దర్శనమిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ పైరసీపై కోలీవుడ్‌ యుద్ధం చేస్తోంది. ఇదివరకు ఏ సినిమా నెట్‌లో దర్శనమిస్తే ఆ సినిమా నిర్మాత మాత్రమే మీడియా ముందుకొచ్చి గళమెత్తేవారు. అయితే నడిగర్‌ సంఘం ఎన్నికల తరువాత కోలీవుడ్‌ చాలా మార్పువచ్చింది. నటుడు విశాల్‌ రియల్ హీరోగా మారి విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు. నడిగర్‌ సంఘం అవినీతిని ప్రశ్నిస్తూ మొదలుపెట్టిన ఆ పోరాటం ప్రస్తుతం పైరసీని అరికట్టేదిశగా సాగుతోంది.  ఏ హీరో సినిమా అయినా సరే, పైరసీకి సంబంధించిన చిన్నపాటి సమాచారం అందినా, తన కళ్లలో పడినా వెంటనే యాక్షన్‌లోకి దిగిపోతున్నారు విశాల్. గతంలో పైరసీ సీడీల విక్రయాలకు నిలయమైన చెన్నై బర్మాబజార్‌లోను, సినిమా షూటింగ్‌ కోసం వెళ్లిన కారైకుడిలోను పైరసీ సీడీల విక్రయాన్ని ఎంతో ధైర్యంగా విశాల్‌ అడ్డుకున్నారు. ప్రైవేటు బస్సుల్లో, లోకల్‌ కేబుల్‌ టీవీల్లో కొత్త సినిమాల ప్రసారానికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. అది ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంది. తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆన్‌లైన్‌ పైరసీని అరికట్టడమే తన ప్రధాన ధ్యేయమని విశాల్‌ ప్రకటించారు. దాంతో తమిళ రాకర్స్‌, తమిళ్‌గన్‌ వెబ్‌సైట్ల నిర్వాహకులు మరింత రెచ్చిపోయారు. దమ్ముంటే అడ్డుకోమని సోషల్‌ మీడియా ద్వారా సవాలు విసిరారు. ఈ వెబ్‌సైట్ల అడ్మిన్లు విదేశాల్లో ఉంటూ ఇక్కడ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, అందువల్లే వాటిని అడ్డుకోవడం కష్టసాధ్యమవుతోందని సైబర్‌ పోలీసులు సైతం నిస్సహాయతను ప్రదర్శించారు.  ఈ పరిస్థితుల్లో గత మంగళవారం రాత్రి చెన్నై ట్రిప్లికేన్‌లో తమిళగన్‌ అడ్మిన్‌గా భావిస్తున్న గౌరి శంకర్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. మొదట సదరు వ్యక్తి తమిళ్‌ రాకర్స్‌ అడ్మిన్‌ అంటూ ప్రచారం జరగడంతో.. సదరు వెబ్‌సైట్‌ నిర్వాహకులు సోషల్‌ మీడియాలో అవాస్తవం అని ప్రకటించారు. మరికొద్దిసేపటికే తమిళగన్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకులు ‘అమాయకుల్ని అరెస్టు చేయకండి. మీకు చేతనైతే ‘తుప్పరివాలన్‌’ని కాపాడుకోండి’ అని సవాలు విసిరారు. పైరసీని అడ్డుకొనేందుకు విశాల్‌ తీవ్రంగా కృషిచేస్తున్న నేపథ్యంలో గురువారం విడుదలైన విశాల్‌ ‘తుప్పరివాలన్‌’ను పైరవీదారులు టార్గెట్‌ చేసుకున్నారు. ప్రస్తుతం గౌరీశంకర్‌ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. అతను ఎవరన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. పైరసీని అడ్డుకొనేందుకు విశాల్‌ చేస్తున్న పోరాటం ఫలించాలని కోలీవుడ్‌ నిర్మాతలు కోరుకుంటున్నారు. అయితే పైరవీదారులు విసురుతున్న సవాళ్లు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
entertainment
12,656
20-07-2017 18:44:17
‘అమెరికా అంటే అంతులేని ఏటీఎం’
వాషింగ్టన్ : అమెరికా-పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? ఒకదాని గురించి మరొకటి ఏమనుకుంటున్నాయి? ఒకదానిని మరొకటి ఎలా ఉపయోగించుకుంటున్నాయి? అమెరికా ఇస్తున్న నిధులను పాకిస్థాన్ ఏవిధంగా ఉపయోగించుకుంటోంది? ఈ వివరాలను అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు డిఫెన్స్ కాంట్రాక్టర్ తన పుస్తకంలో రాశారు. డిఫెన్స్ కాంట్రాక్టర్ రేమండ్ డేవిస్ ‘ది కాంట్రాక్టర్’ అనే పుస్తకాన్ని రాశారు. అమెరికాను అపరిమిత ఏటీఎంగా పాకిస్థాన్ భావిస్తోందని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు ఎంత సొమ్ము ఇచ్చినా సరిపోదన్నారు. అమెరికా నుంచి పాకిస్థాన్ స్వీకరిస్తున్న ఆర్థిక సాయం మార్చి, మార్చి వాడే మందులా మారిందని, ఆ మందు లేకుండా మనుగడ సాగించలేకపోతోందని పేర్కొన్నారు. సీఐఏ కాంట్రాక్టర్‌గా డేవిస్‌కు పాకిస్థాన్ గురించి బాగా తెలుసు. అమెరికా ఇస్తున్న నిధుల్లో అత్యధిక భాగం పాకిస్థాన్ సైన్యానికే చేరుతోందని, ప్రజలకు అందడం లేదని తన పుస్తకంలో పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారని రాశారు. ఆ దేశం పార్లమెంటరీ ఫెడరల్ రిపబ్లిక్ అని, అధ్యక్షుడు రాజ్యాధిపతిగా ఉన్నారని, ప్రదాన మంత్రి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవాధికారం సైన్యం చేతిలో ఉన్నట్లు అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఉగ్రవాదులందరూ మాయమైపోతే, పైకి కనిపిస్తున్న పరిమితి లేని ఏటీఎం (అమెరికా నుంచి సహాయం) కూడా అదృశ్యమవుతుందని పేర్కొన్నారు. అమెరికా నుంచి పొందుతున్న వార్షిక సహాయంపైనా, 18.2 కోట్ల మంది ప్రజల్లో కేవలం 20 లక్షల కన్నా తక్కువ మంది చెల్లిస్తున్న ఆదాయపు పన్నుపైనా ఆధారపడి పాకిస్థాన్ మనుగడ సాగిస్తోందన్నారు. పాకిస్థాన్ పరిస్థితిని వడ్డీ మీద బతికేవాళ్ళతో డేవిస్ పోల్చారు. ఇద్దరు పాకిస్థానీల హత్య కేసులో డేవిస్ (42)ను 2011లో లాహోర్‌లో అరెస్టు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంక్షోభం ఏర్పడింది.
nation
4,173
07-10-2017 00:52:08
‘సమాచార హక్కు’పై వీడని అనుమానాలు
సమాచార హక్కు చట్టంలో చెప్పిన విధంగా పౌరులకు సమాచార హక్కును కలిగించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఏమేరకు ఉందో ఆచరణలో ఇంకా తేలలేదనే అనాలి. కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా చట్టం అమలులో మరింత కొత్తదనం తీసుకురావచ్చు. పౌరుల అవసరాలేంటో అధ్యయనం చేయాలి, విశ్లేషణ చేయాలి. పౌరుల సమాచార అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ అథారిటీలు స్పందించాలి. పౌరులకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వ శాఖల ద్వారా పొందేందుకు ఉద్దేశించిన 2005 సమాచార హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు కమిషన్‌ను ఏర్పాటుచేసి, ప్రధాన సమాచార కమిషనర్‌తో సహా ఒక సమాచార కమిషనర్‌ను కూడా నియమించింది. గవర్నర్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. సమాచారం పొందే హక్కు కావాలని కోరుకునే ఎంతోమంది తెలంగాణ ప్రజల అభీష్టంతో పాటు రాజ్యాంగబద్ధమైన ఒక బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరవేర్చినట్లయింది. న్యాయస్థానాలను ఆశ్రయించిన సమాచార హక్కు ఉద్యమ సామాజిక కార్యకర్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఇక ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టాన్ని ఎంతమేరకు ఉపయోగించుకుంటారన్నదే ముందున్నది! ఇతర ప్రభుత్వ చట్టాల మాదిరి కాకుండా, సమాచార హక్కు చట్టం విజయవంతం కావాలంటే, అది ప్రజల మీదే ఆధారపడి వుంటుంది. ప్రజలను ఎంత గొప్పగా చైతన్యపరిస్తే, అంత గొప్పగా ఈ చట్టం అమలయ్యే వీలుంది. చట్టాన్ని సద్వినియోగం చేసుకుని సమాచారం పొందడానికి పౌరుల్లో చైతన్యం తీసుకుని రావడమెలా అని సామాజిక కార్యకర్తలు ఆలోచన చేయాలి. సమాచార హక్కు చట్టం ఆవిర్భావం, దాని పూర్వాపరాలు, అవసరం, పరిణామ క్రమం నెమరేసుకుంటే, దాని మూలాలు, అలనాటి ఎన్డీయే ప్రభుత్వ హయాంలో, ఆ మాటకొస్తే, ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రిగా వున్న రోజుల విషయం మదిలో మెదలుతాయి. ఎన్డీయే ప్రభుత్వం సమాచార స్వేచ్ఛ చట్టం తెచ్చినప్పటికీ, దాని విధి-విధానాలను రూపొందించడంలో వైఫల్యం చెందడంతో, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వ సారథి ప్రధాని మన్మోహన్ సింగ్ 2005 జూన్‌ 21న సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి, అంతకు ఒక వారం కిందే అలనాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చట్టానికి రాజముద్ర వేసినప్పటికీ, రాష్ట్రపతికీ, ప్రధానికీ మధ్య చోటు చేసుకునే ‘సమాచార మార్పిడి’ బహిర్గతం చేయడం సరైంది కాదని మన్మోహన్‌ బాహాటంగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా, ప్రభుత్వాధికారులు ఫైళ్ళ మీద రాసే వ్యాఖ్యలు కూడా రహస్యంగా ఉంచాలనీ, అలా చేయకపోతే, నిర్ణయాధికార ప్రక్రియ ఇబ్బందులకు గురవుతుందనీ అన్నారు. కాకపొతే, పౌరులకు సమాచారహక్కు చట్టం సాధికారతను సమకూరుస్తుందనీ, తమ విషయం లో ప్రభుత్వం తప్పు చేస్తున్నదన్న భావనను ఈ చట్టం తొలగిస్తుందనీ ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ ప్రపంచంలో ఎక్కడాలేని రీతిలో మన సమాచారహక్కు చట్టం రూపొందించబడడం గొప్ప విషయమే! భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు నిండుతున్న సందర్భంగా 1997 మే నెలలో, అప్పటి ప్రధాని గుజ్రాల్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో, వారంతా అంగీకరించిన ‘నవ సూత్ర ప్రణాళిక’, ఒక విధంగా చెప్పుకోవాలంటే, సమాచారహక్కు చట్టానికి అసలైన నాందీ ప్రస్తావన అనాలి. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు గడిచినా, కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రజలకు నమ్మకం కుదరలేదనీ, వారి నమ్మకం పూర్తిగా వమ్ము కాకముందే, పారదర్శకతతో, బాధ్యతాయుతంగా, జవాబుదారీగా, పౌరులకు స్నేహ హస్తం అందించే రీతిలో ప్రభుత్వాలు పనిచేయడానికి ఆ నవసూత్ర కార్యాచరణ పథకాన్ని పార్టీలకతీతంగా ముఖ్యమంత్రుల సమావేశం అంగీకరించింది. ఆ తీర్మానానికి అనుగుణంగా సమాచార స్వేచ్ఛ హక్కు చట్టాన్ని రూపొందించాలనీ, అది విజయవంతం కావాలంటే, ప్రతి ప్రభుత్వ శాఖలో సిటిజెన్ చార్టర్లు తయారు చేసి అమలు చేయాలనీ, పౌర సేవా -సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలనీ నిర్ణయించడం జరిగింది. దురదృష్టవశాత్తూ వీటిలో చాలా వరకు కాగితం మీదే మిగిలిపోయాయి. దరిమిలా వచ్చిందే సమాచార హక్కు చట్టం. ఇది ఆబాలగోపాలం ప్రజల్లో అనేక ఆశలు కలిగించింది. ప్రజాస్వామ్యంలో పౌరుడికి, తాను కావాలనుకునే ప్రభుత్వ సంబంధమైన సమాచారం లభించడం, ఆ సమాచారం పారదర్శకంగా వుండడం సమాచార హక్కు చట్టం రావడానికి ప్రధాన కారణం. అసలింతకూ ఈ సమాచారం అంటే ఏమిటి? ప్రభుత్వ శాఖలకు (పబ్లిక్ అథారిటీగా చట్టం పేర్కొంది) సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ–మెయిల్స్‌, వ్యాఖ్యలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్ పుస్తకాలు, ఒడంబడికలు, నివేదికలు, పత్రాలు, అన్నిరకాల డాటా మొదలైనవన్నీ సమాచారం కిందికే వస్తాయి. ప్రభుత్వం నుంచి తగు మోతాదులో ఆర్థిక సహాయం పొందుతున్న ప్రభుత్వ- ప్రభుత్వేతర వ్యవస్థ కానీ, సంస్థ కానీ, పబ్లిక్ అథారిటీగా చట్టం నిర్ణయించింది. వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం పౌరులకు అందుబాటులో, సులభంగా పొందేందుకు వీలుగా, బహిర్గతం చేయాలి. ప్రతి పబ్లిక్ అథారిటీ, పౌరులు కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు పౌర సమాచార అధికారులను వారి-వారి శాఖల్లో కింది నుంచి పైదాకా నియమించాలి. వీరి దగ్గర నుంచి అడిగిన సమాచారం నిర్ణీత గడువులోగా లభించకపోతే, సమాచార కమిషన్‌ను ఆశ్రయించడానికి పౌరులకు హక్కుంది. సమాచార కమిషనర్ విచారణ జరిపి సంబంధిత అధికారి మీద తగు విధంగా చర్య తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంతో సహా చాలా రాష్ట్రాలు, కేంద్రం సమాచార కమిషన్లను ఏర్పాటు చేసినప్పటికీ, చట్టం అమలుకు సంబంధించి వీడని అనుమానాలెన్నో వున్నాయి. చట్టంలో చెప్పిన విధంగా పౌరులకు సమాచారహక్కును కలిగించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఏమేరకుందో ఆచరణలో ఇంకా తేలలేదనే అనాలి. ప్రతి పబ్లిక్ అథారిటీ తన సంస్థకు సంబంధించిన రికార్డులన్నింటినీ కేటలాగ్ -ఇండెక్స్ చేసి, కంప్యూటర్‌లోకి ఎక్కించి, అన్నిరకాలుగా, అన్నిచోట్ల పౌరులకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా లభించే విధంగా నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయాలి. తన సంస్థకు సంబంధించి అమలుపరుస్తున్న కార్యక్రమాలు, నిర్వహిస్తున్న విధులు, ఉద్యోగుల అధికారాలు, వారి బాధ్యతలు, నిర్ణయాలు తీసుకునే విధానం, పర్యవేక్షణ – జవాబుదారీ వివరాలు, జీత-భత్యాల వివరాలు, బడ్జెట్ కేటాయింపులు, సంస్థ ఇస్తున్న రాయితీలు పర్మిట్లు తదితర వివరాలన్నీ బహిర్గతం చేయాలి. సంబంధిత పబ్లిక్ అథారిటీ పౌరులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు కల్పించిన సౌకర్యాల గురించి, పనివేళల వివరాలు, సంస్థలో నియమించిన పౌరసమాచార అధికారుల వివరాలు బాహాటంగా ప్రకటించాలని చట్టం చెబుతున్నది. ఎన్ని ప్రభుత్వ శాఖలు వీటిని అమలు చేశాయనేది జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. చట్టంలో చెప్పబడిన మరో ప్రధానమైన అంశం ‘తగు మోతాదులో ప్రభుత్వ నిధులు’ పొందుతున్న ఏ సంస్థ అయినా పబ్లిక్ అథారిటీగానే పరిగణించాలని. అయితే ఈ మోతాదు ఎంత అనేది నిర్వచనం సరిగ్గాలేదు. రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం చేసిన సూచనల్లో కొంత స్పష్టత వచ్చినా పూర్తిగా అవగతం కాలేదు. సాధారణంగా ప్రభుత్వ శాఖ చేసే ఎలాంటి పనైనా ప్రభుత్వ నిధులతో ఏదేని ప్రభుత్వేతర సంస్థ చేస్తుంటే అది పబ్లిక్ అథారిటీగా పరిగణించాలని ఆ సంఘం సూచించింది. నిధుల మోతాదు ఎంత అనే విషయమై అస్పష్టత వున్న కారణాన చాలా ఎన్జీవోలు సమాచార హక్కు చట్టం కింద రాకుండా జాగ్రత్తపడుతున్నాయి. అలాగే బహిర్గతం చేయకూడని సమాచారాన్ని అడిగిన పౌరులకు ఇవ్వడానికి పబ్లిక్ అథారిటీ తిరస్కరించవచ్చని, చట్టపరిధిలో ఇవ్వగలిగే సమాచారాన్ని మాత్రమే పొందే హక్కు పౌరులకు వుందని అనడమంటే లక్ష్మణరేఖ గీసినట్లే అనుకోవాలి. దీన్ని తొలగించే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసిన దాఖలాలు లేవు. కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా చట్టం అమలులో మరింత కొత్తదనం తీసుకునిరావచ్చు. అసలు పౌరుల అవసరాలేంటో అధ్యయనం చేయాలి, విశ్లేషణ చేయాలి. పౌరుల సమాచార అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ అథారిటీలు స్పందించాలి.వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని, అనుభవజ్ఞులను సమాచార కమిషనర్లుగా ఎంపిక చేయడం చాలా క్లిష్టమైన వ్యవహారం. రాజకీయ వాసన లేకుండా ఎలాంటి పనీ జరగని మన దేశంలో, వివిధ రాష్ట్రాలలో సమాచార కమిషనర్ల పదవికి రాజకీయాలకు అతీతులైన వ్యక్తులు దొరుకుతారా? అయితే తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల్లో ఇది సాధ్యమైంది కనుక చట్టం చెప్పినట్లు జరిగే అవకాశాలు ఉండవచ్చు. అలాగే ప్రతి పబ్లిక్ అథారిటీకి కావాల్సిన సమర్థులైన, యోగ్యులైన, పౌర సమాచార అధికారులు దొరికే విషయంలో కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు. ఇవన్నీ ఇలా వుంటే పౌరులు కోరుకునేది ఆసక్తికరంగా వుంది. తమని గౌరవంగా, మర్యాదగా చూడాలనీ; ప్రభుత్వ కార్యకలాపాలు సులభతరం చేయాలనీ; తగిన సమయంలో నమ్మకమైన సహాయం అందించాలనీ; తమ గొంతు వినాలనీ; తమ మాట పరిగణనలోకి తీసుకోవాలనీ; నియమ-నిబంధనలకన్నా సహాయం చేయడమే తమకు కావాలనీ వారంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ద్వారా ఈ దిశగా ముందుకు పోతుందని ఆశిద్దాం.వనం జ్వాలా నరసింహారావు పౌరులకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వ శాఖల ద్వారా పొందేందుకు ఉద్దేశించిన 2005 సమాచార హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు కమిషన్‌ను ఏర్పాటుచేసి, ప్రధాన సమాచార కమిషనర్‌తో సహా ఒక సమాచార కమిషనర్‌ను కూడా నియమించింది. గవర్నర్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. సమాచారం పొందే హక్కు కావాలని కోరుకునే ఎంతోమంది తెలంగాణ ప్రజల అభీష్టంతో పాటు రాజ్యాంగబద్ధమైన ఒక బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరవేర్చినట్లయింది. న్యాయస్థానాలను ఆశ్రయించిన సమాచార హక్కు ఉద్యమ సామాజిక కార్యకర్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఇక ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టాన్ని ఎంతమేరకు ఉపయోగించుకుంటారన్నదే ముందున్నది! ఇతర ప్రభుత్వ చట్టాల మాదిరి కాకుండా, సమాచార హక్కు చట్టం విజయవంతం కావాలంటే, అది ప్రజల మీదే ఆధారపడి వుంటుంది. ప్రజలను ఎంత గొప్పగా చైతన్యపరిస్తే, అంత గొప్పగా ఈ చట్టం అమలయ్యే వీలుంది. చట్టాన్ని సద్వినియోగం చేసుకుని సమాచారం పొందడానికి పౌరుల్లో చైతన్యం తీసుకుని రావడమెలా అని సామాజిక కార్యకర్తలు ఆలోచన చేయాలి. సమాచార హక్కు చట్టం ఆవిర్భావం, దాని పూర్వాపరాలు, అవసరం, పరిణామ క్రమం నెమరేసుకుంటే, దాని మూలాలు, అలనాటి ఎన్డీయే ప్రభుత్వ హయాంలో, ఆ మాటకొస్తే, ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రిగా వున్న రోజుల విషయం మదిలో మెదలుతాయి. ఎన్డీయే ప్రభుత్వం సమాచార స్వేచ్ఛ చట్టం తెచ్చినప్పటికీ, దాని విధి-విధానాలను రూపొందించడంలో వైఫల్యం చెందడంతో, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వ సారథి ప్రధాని మన్మోహన్ సింగ్ 2005 జూన్‌ 21న సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి, అంతకు ఒక వారం కిందే అలనాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చట్టానికి రాజముద్ర వేసినప్పటికీ, రాష్ట్రపతికీ, ప్రధానికీ మధ్య చోటు చేసుకునే ‘సమాచార మార్పిడి’ బహిర్గతం చేయడం సరైంది కాదని మన్మోహన్‌ బాహాటంగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా, ప్రభుత్వాధికారులు ఫైళ్ళ మీద రాసే వ్యాఖ్యలు కూడా రహస్యంగా ఉంచాలనీ, అలా చేయకపోతే, నిర్ణయాధికార ప్రక్రియ ఇబ్బందులకు గురవుతుందనీ అన్నారు. కాకపొతే, పౌరులకు సమాచారహక్కు చట్టం సాధికారతను సమకూరుస్తుందనీ, తమ విషయం లో ప్రభుత్వం తప్పు చేస్తున్నదన్న భావనను ఈ చట్టం తొలగిస్తుందనీ ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ ప్రపంచంలో ఎక్కడాలేని రీతిలో మన సమాచారహక్కు చట్టం రూపొందించబడడం గొప్ప విషయమే! భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు నిండుతున్న సందర్భంగా 1997 మే నెలలో, అప్పటి ప్రధాని గుజ్రాల్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో, వారంతా అంగీకరించిన ‘నవ సూత్ర ప్రణాళిక’, ఒక విధంగా చెప్పుకోవాలంటే, సమాచారహక్కు చట్టానికి అసలైన నాందీ ప్రస్తావన అనాలి. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు గడిచినా, కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రజలకు నమ్మకం కుదరలేదనీ, వారి నమ్మకం పూర్తిగా వమ్ము కాకముందే, పారదర్శకతతో, బాధ్యతాయుతంగా, జవాబుదారీగా, పౌరులకు స్నేహ హస్తం అందించే రీతిలో ప్రభుత్వాలు పనిచేయడానికి ఆ నవసూత్ర కార్యాచరణ పథకాన్ని పార్టీలకతీతంగా ముఖ్యమంత్రుల సమావేశం అంగీకరించింది. ఆ తీర్మానానికి అనుగుణంగా సమాచార స్వేచ్ఛ హక్కు చట్టాన్ని రూపొందించాలనీ, అది విజయవంతం కావాలంటే, ప్రతి ప్రభుత్వ శాఖలో సిటిజెన్ చార్టర్లు తయారు చేసి అమలు చేయాలనీ, పౌర సేవా -సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలనీ నిర్ణయించడం జరిగింది. దురదృష్టవశాత్తూ వీటిలో చాలా వరకు కాగితం మీదే మిగిలిపోయాయి. దరిమిలా వచ్చిందే సమాచార హక్కు చట్టం. ఇది ఆబాలగోపాలం ప్రజల్లో అనేక ఆశలు కలిగించింది. ప్రజాస్వామ్యంలో పౌరుడికి, తాను కావాలనుకునే ప్రభుత్వ సంబంధమైన సమాచారం లభించడం, ఆ సమాచారం పారదర్శకంగా వుండడం సమాచార హక్కు చట్టం రావడానికి ప్రధాన కారణం. అసలింతకూ ఈ సమాచారం అంటే ఏమిటి? ప్రభుత్వ శాఖలకు (పబ్లిక్ అథారిటీగా చట్టం పేర్కొంది) సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ–మెయిల్స్‌, వ్యాఖ్యలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్ పుస్తకాలు, ఒడంబడికలు, నివేదికలు, పత్రాలు, అన్నిరకాల డాటా మొదలైనవన్నీ సమాచారం కిందికే వస్తాయి. ప్రభుత్వం నుంచి తగు మోతాదులో ఆర్థిక సహాయం పొందుతున్న ప్రభుత్వ- ప్రభుత్వేతర వ్యవస్థ కానీ, సంస్థ కానీ, పబ్లిక్ అథారిటీగా చట్టం నిర్ణయించింది. వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం పౌరులకు అందుబాటులో, సులభంగా పొందేందుకు వీలుగా, బహిర్గతం చేయాలి. ప్రతి పబ్లిక్ అథారిటీ, పౌరులు కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు పౌర సమాచార అధికారులను వారి-వారి శాఖల్లో కింది నుంచి పైదాకా నియమించాలి. వీరి దగ్గర నుంచి అడిగిన సమాచారం నిర్ణీత గడువులోగా లభించకపోతే, సమాచార కమిషన్‌ను ఆశ్రయించడానికి పౌరులకు హక్కుంది. సమాచార కమిషనర్ విచారణ జరిపి సంబంధిత అధికారి మీద తగు విధంగా చర్య తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంతో సహా చాలా రాష్ట్రాలు, కేంద్రం సమాచార కమిషన్లను ఏర్పాటు చేసినప్పటికీ, చట్టం అమలుకు సంబంధించి వీడని అనుమానాలెన్నో వున్నాయి. చట్టంలో చెప్పిన విధంగా పౌరులకు సమాచారహక్కును కలిగించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఏమేరకుందో ఆచరణలో ఇంకా తేలలేదనే అనాలి. ప్రతి పబ్లిక్ అథారిటీ తన సంస్థకు సంబంధించిన రికార్డులన్నింటినీ కేటలాగ్ -ఇండెక్స్ చేసి, కంప్యూటర్‌లోకి ఎక్కించి, అన్నిరకాలుగా, అన్నిచోట్ల పౌరులకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా లభించే విధంగా నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయాలి. తన సంస్థకు సంబంధించి అమలుపరుస్తున్న కార్యక్రమాలు, నిర్వహిస్తున్న విధులు, ఉద్యోగుల అధికారాలు, వారి బాధ్యతలు, నిర్ణయాలు తీసుకునే విధానం, పర్యవేక్షణ – జవాబుదారీ వివరాలు, జీత-భత్యాల వివరాలు, బడ్జెట్ కేటాయింపులు, సంస్థ ఇస్తున్న రాయితీలు పర్మిట్లు తదితర వివరాలన్నీ బహిర్గతం చేయాలి. సంబంధిత పబ్లిక్ అథారిటీ పౌరులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు కల్పించిన సౌకర్యాల గురించి, పనివేళల వివరాలు, సంస్థలో నియమించిన పౌరసమాచార అధికారుల వివరాలు బాహాటంగా ప్రకటించాలని చట్టం చెబుతున్నది. ఎన్ని ప్రభుత్వ శాఖలు వీటిని అమలు చేశాయనేది జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. చట్టంలో చెప్పబడిన మరో ప్రధానమైన అంశం ‘తగు మోతాదులో ప్రభుత్వ నిధులు’ పొందుతున్న ఏ సంస్థ అయినా పబ్లిక్ అథారిటీగానే పరిగణించాలని. అయితే ఈ మోతాదు ఎంత అనేది నిర్వచనం సరిగ్గాలేదు. రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం చేసిన సూచనల్లో కొంత స్పష్టత వచ్చినా పూర్తిగా అవగతం కాలేదు. సాధారణంగా ప్రభుత్వ శాఖ చేసే ఎలాంటి పనైనా ప్రభుత్వ నిధులతో ఏదేని ప్రభుత్వేతర సంస్థ చేస్తుంటే అది పబ్లిక్ అథారిటీగా పరిగణించాలని ఆ సంఘం సూచించింది. నిధుల మోతాదు ఎంత అనే విషయమై అస్పష్టత వున్న కారణాన చాలా ఎన్జీవోలు సమాచార హక్కు చట్టం కింద రాకుండా జాగ్రత్తపడుతున్నాయి. అలాగే బహిర్గతం చేయకూడని సమాచారాన్ని అడిగిన పౌరులకు ఇవ్వడానికి పబ్లిక్ అథారిటీ తిరస్కరించవచ్చని, చట్టపరిధిలో ఇవ్వగలిగే సమాచారాన్ని మాత్రమే పొందే హక్కు పౌరులకు వుందని అనడమంటే లక్ష్మణరేఖ గీసినట్లే అనుకోవాలి. దీన్ని తొలగించే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసిన దాఖలాలు లేవు. కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా చట్టం అమలులో మరింత కొత్తదనం తీసుకునిరావచ్చు. అసలు పౌరుల అవసరాలేంటో అధ్యయనం చేయాలి, విశ్లేషణ చేయాలి. పౌరుల సమాచార అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ అథారిటీలు స్పందించాలి.వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని, అనుభవజ్ఞులను సమాచార కమిషనర్లుగా ఎంపిక చేయడం చాలా క్లిష్టమైన వ్యవహారం. రాజకీయ వాసన లేకుండా ఎలాంటి పనీ జరగని మన దేశంలో, వివిధ రాష్ట్రాలలో సమాచార కమిషనర్ల పదవికి రాజకీయాలకు అతీతులైన వ్యక్తులు దొరుకుతారా? అయితే తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల్లో ఇది సాధ్యమైంది కనుక చట్టం చెప్పినట్లు జరిగే అవకాశాలు ఉండవచ్చు. అలాగే ప్రతి పబ్లిక్ అథారిటీకి కావాల్సిన సమర్థులైన, యోగ్యులైన, పౌర సమాచార అధికారులు దొరికే విషయంలో కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు. ఇవన్నీ ఇలా వుంటే పౌరులు కోరుకునేది ఆసక్తికరంగా వుంది. తమని గౌరవంగా, మర్యాదగా చూడాలనీ; ప్రభుత్వ కార్యకలాపాలు సులభతరం చేయాలనీ; తగిన సమయంలో నమ్మకమైన సహాయం అందించాలనీ; తమ గొంతు వినాలనీ; తమ మాట పరిగణనలోకి తీసుకోవాలనీ; నియమ-నిబంధనలకన్నా సహాయం చేయడమే తమకు కావాలనీ వారంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ద్వారా ఈ దిశగా ముందుకు పోతుందని ఆశిద్దాం.వనం జ్వాలా నరసింహారావు
editorial
1,104
14-10-2017 00:38:23
ఐసిఎఐ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మన్‌గా చంద్రశేఖర్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఎఐ), హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మన్‌గా చంద్రశేఖర్‌ రాజనాల ఎన్నికయ్యారు. 2017-19 కాలానికి ఈయన చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కాగా వైస్‌ చైర్మన్‌గా మునిశేఖర్‌ దారపనేని, సెక్రటరీగా క ళ్యాణి పెమ్మరాజు, కోశాధికారిగా చంద్రశేఖర్‌ రెడ్డి పొనుగోటి ఎన్నికయ్యారు.
business
18,573
21-12-2017 00:56:07
ఆస్పత్రిలో జయ.. వీడియో
విడుదల చేసిన ఎమ్మెల్యే వెట్రివేల్‌ఆయనది నమ్మకద్రోహం: శశి మేనకోడలుఅది మార్ఫింగ్‌: జయ స్నేహితురాలుఎన్నికల సంఘం సీరియస్‌.. కేసు నమోదుచెన్నై, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఏ పరిస్థితిలో ఆస్పత్రిలో చేరారు? అక్కడ ఎలా గడిపారు? ఏ పరిస్థితిలో తుదిశ్వాస విడిచారు? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ బయటి ప్రపంచానికి తెలియదు. అయితే, అనూహ్యంగా జయ ఆస్పత్రిలో ఉన్నప్పటి ఓ వీడియోను అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నేత దినకరన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యే వెట్రివేల్‌ బుధవారం మీడియాకు విడదల చేయడం సంచలనంగా మారింది. వెట్రివేల్‌ మాట్లాడుతూ... జయ మృతిపై అనుమానాలున్నాయంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, శశికళపై అభాండాలు వేస్తున్నారని, అందుకే తాను ఈ వీడియోను విడుదల చేశానని తెలిపారు.  వీడియోను విడుదల చేయడం ఇష్టం లేకపోయినా జయ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే దుష్ప్రచారాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకే వీడియోను విడుదల చేశానన్నారు. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాత్రం కాదన్నారు. జయ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ధర్మయుద్ధం అంటూ ప్రగల్భాలు పలికిన పన్నీర్‌సెల్వంకు ఈ వీడియో సరైన సమాధానం చెబుతుందన్నారు.  కాగా, జయ మృతిపై జరుగుతున్న విచారణ సంఘానికి సమర్పించేందుకు ఆ వీడియోను తామే దినకరన్‌కు ఇచ్చామని శశికళ తమ్ముడి కుమార్తె కృష్ణప్రియ తెలిపారు. ఆ వీడియోను బహిర్గతం చేసి వెట్రివేల్‌ తమకు ద్రోహం చేశారని ఆరోపించారు. జయ అనుమతితోనే శశికళ వీడియో తీశారని, భద్రపరిచారని చెప్పారు. ఆ వీడియోను జయ అపోలో ఆసుపత్రి జనరల్‌ వార్డులో ఉన్నప్పుడు తీసిందన్నారు. కాగా, జయ వీడియోను విడుదల చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అని డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విమర్శించారు. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముందు విడుదల చేయడం రాజకీయ లబ్ది కోసమేనన్నారు. ఇదిలావుంటే, ఆసుపత్రిలో జయ వీడియో నకిలీదని ఆమె క్లాస్‌మేట్‌ గీత ఆరోపించారు. విదేశాల్లో కంప్యూటర్‌ మార్ఫింగ్‌ ద్వారా దీనిని రూపొందించారని అనుమానం వ్యక్తం చేశారు.  కాగా, వెట్రివేల్‌ విడుదల చేసిన వీడియో వాస్తవమైనదేని, అయితే, దీనిని తాము తీయలేదని అపోలో ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు జయ వీడియోను విడుదల చేయడంపై తమిళనాడు ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారి ప్రవీణ్‌నాయర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీ చానెళ్లలో ప్రసారం చేయరాదంటూ ఆంక్షలు విధించారు. మరోపక్క, జయ మృతిపై ఏర్పాటైన విచారణ సంఘం కూడా వెట్రివేల్‌ చర్యలపై ఆగ్రహించింది. తక్షణమే వెట్రివేల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ వీడియోలో ఏముందంటే..20 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో జయ నైటీ ధరించి, రెండు కాళ్లను చాపుకుని దిండుకు తల ఆనించి బెడ్‌పై కూర్చున్నారు. ఎదురుగా దేన్నో(టీవీ) చూస్తున్నట్లు ఉన్నా రు. జుట్టు రెండు జడలు వేసుకుని రిబ్బన్‌ కట్టుకుని ఉన్నారు. శివాజీ గణేశన్‌ నటించిన తమిళ చిత్రం ముదల్‌ మర్యాదై క్లైమాక్స్‌లోని రాసావే వరుత్తమా అనే శోకపూరితమైన పాట హమ్మింగ్‌ మ్యూజిక్‌ వినిపిస్తుండగా జయ తన ఎడమచేతిలో పట్టుకున్న ప్లాస్టిక్‌ గ్లాస్‌లోని జ్యూస్‌ను పైకెత్తి సిప్‌ చేసుకుంటూ కనిపించారు. కుడిచేతి భుజానికి బీపీ కొలిచే పరికరం చుట్టి ఉంది. మధుమేహం కారణంగా జ య కాలి వేళ్లను తొలగించారని వచ్చిన పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టేవిధంగా ఆమె కాళ్లు స్పష్టంగా అన్ని వేళ్లతో గులాబీ రంగులో కనిపిస్తున్నాయి.
nation
2,396
01-04-2017 23:22:44
50,000 మెగావాట్లు దాటిన ఎన్‌టిపిసి సామర్థ్యం
జ్యోతినగర్‌ (గోదావరిఖని): కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని జాతీయ థర్మల్‌ విద్యుత సంస్థ (ఎన్‌టిపిసి) మరో మైలురాయిని అధిగమించింది. కంపెనీ స్థాపిత విద్యుత ఉత్పత్తి సామర్ధ్యం 50,000 మెగావాట్లు దాటింది. ఉత్తరప్రదేశ్‌లోని ఊంచాహార్‌ ఏర్పాటు చేసిన విద్యుత కేంద్రం లో 500 మెగావాట్ల యూనిట్‌ శుక్రవారం ఉత్పత్తి ప్రారంభించడంతో ఎన్‌టిపిసి స్థాపిత విద్యుత ఉత్పత్తి సామర్ధ్యం 50,498 మెగావాట్లకు చేరింది. ‘24 గంటలూ విద్యుత సరఫరా దిశగా ఇది మరో మైలురాయు’ అని కేంద్ర విద్యుత శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు కింద 1,600 మెగావాట్ల కొత్త ప్రాజెక్టును కూడా ఎన్‌టిపిసి ఏర్పాటు చేస్తోంది.
business
11,599
16-05-2017 20:27:36
ఆ వ్యవస్థలకు స్వేచ్ఛనిచ్చాం : వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ నిర్వహిస్తున్న దాడుల వెనుక తమ పాత్ర ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, ఆయన తనయుడు కార్తి చిదంబరం ఇళ్ళపై జరిగిన ఐటీ, సీబీఐ దాడుల్లో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ చిదంబరం, ఆయన  తనయుడు కార్తి, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి లేదా ములాయం సింగ్‌... ఇలా ఎవరిపైన అయినా ఐటీ కానీ, సీబీఐ కానీ దాడులు జరిపి, కేసులు పెట్టినపుడు ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదన్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగపరుస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. ప్రభుత్వ వ్యవస్థలను తాము ఉపయోగించుకోవడంగానీ, దుర్వినియోగం చేయడం కానీ చేయలేదన్నారు. సీబీఐ, ఐటీ, ఈడీలకు స్వతంత్రంగా పని చేసే స్వేచ్ఛనిచ్చామన్నారు. ఇదిలావుండగా, మంగళవారం ఉదయం రెండు వేర్వేరు సంఘటనల్లో సీీీబీఐ, ఐటీ సోదాలు జరిగాయి. ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడుల అనుమతులివ్వడంలో అక్రమాలు జరిగినట్లు కేసు నమోదు కావడంతో చిదంబరం, ఆయన కుమారునికి చెందిన 14 ప్రదేశాలపై సీబీఐ దాడులు జరిపింది. రూ.1000 కోట్ల విలువైన బినామీ భూముల వ్యవహారాలకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సన్నిహితులకు చెందిన ప్రదేశాలపై ఐటీ దాడులు జరిగాయి. ఢిల్లీ, గురుగ్రామ్, రేవారిలలో 100 మందికిపైగా అధికారులు పాల్గొన్నారు.
nation
14,748
02-12-2017 02:46:15
పాదయాత్ర చేస్తున్న స్వామీజీ పైకి లారీ
బెంగళూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మైసూరు చాముండేశ్వరీ దేవి దర్శనం కోసం గుజరాత్‌ నుంచి పాదయాత్రగా వస్తున్న స్వామీజీ అమ్మవారి దర్శనం చేసుకోకుండానే రోడ్డు ప్రమాదానికి బలైపోయారు. గుజరాత్‌ నుంచి మైసూరుకు పాదయాత్రగా వస్తున్న ఐదుగురు స్వామీజీల బృందాన్ని కర్ణాటక రాష్ట్రం దావణగెరె పరిఽధిలో నాలుగవ నంబరు జాతీయ రహదారిపై కలపనహళ్లి వద్ద వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వామీజీ సురంగనాథ్‌ (55)తో పాటు దావణగెర తాలూకాకు చెందిన పూలవ్యాపారి గంగాధర్‌(50) అక్కడికక్కడే మృతి చెందాడు.
nation
6,469
21-12-2017 16:13:17
సాయిధరమ్ తేజ్ కూడా దిగుతున్నాడు
తెలుగులో వెబ్ సిరీస్‌ల హవా మొదలైంది. రానా, వర్మలు ప్రస్తుతం ఇందులో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్‌లపై తాజాగా ఓ మెగా హీరో కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. తాజాగా సాయిధరమ్ తేజ్ ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. కల్యాణ్ శంకర్ అనే వ్యక్తి నటిస్తూ.. తెరకెక్కిస్తున్న 'నేను మీ కల్యాణ్' అనే వెబ్ సిరీస్‌లో సాయిధరమ్ తేజ్ కూడా ఓ పాత్ర చేస్తున్నాడంట. స్నేహం, ప్రేమ, బంధాలు-అనుబంధాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక సాయిధరమ్ తేజ్ పాత్రకున్న విశేషం ఏమిటంటే.. ఈ వెబ్ సిరీస్‌లో తన నిజ జీవితంలోని పాత్రనే ఇందులో చేస్తున్నాడట. ఈ వెబ్ సిరీస్‌లో చేయబోతున్నట్లుగా సాయిధరమ్ కూడా తెలిపాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘వేరే పాత్రల్లో నటించడమనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వెబ్ సిరీస్‌లో నా పాత్రలో నేనే కనిపించనుండటం కొత్త అనుభూతిని ఇస్తోంది. నన్ను నేనుగా తెరపై చూసుకునే ఛాన్స్ రావడం నిజంగా సంతోషం కలిగించే విషయం. ముందు ముందు ఇలాంటి వెబ్ సిరీస్‌లకే ఆదరణ లభించే అవకాశం ఉంది. యూత్ అంతా వీటిపై దృష్టిపెడితే.. ఇవి పాపులర్ అవడానికి ఎంతో కాలం పట్టదు..’’ అంటూ తెలిపారు.
entertainment
18,627
23-05-2017 03:21:47
ఐఏఎస్‌ తివారీ మృతి కేసు సీబీఐకి
ఉత్తరప్రదేశ్‌ సర్కారు సిఫారసుబెంగళూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక కేడర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనురాగ్‌ తివారీ అనుమానాస్పద మృతి కేసు సోమవారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేంద్రానికి ఉత్తరప్రదేశ్‌ సర్కారు సిఫారసు చేసింది. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తివారీ కుటుంబసభ్యులు సోమవారం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. కర్ణాటక సీఎంను కూడా కలిసి సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయాలని ఈ సందర్భంగా వారితో యోగి పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో.. తివారీ భార్య, కుటుంబ సభ్యులు మరో రెండు రోజుల్లో బెంగళూరుకు రానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కర్ణాటకలో పౌర, ఆహారసరఫరాల శాఖలో అవినీతిని అడ్డుకున్న కారణంగానే తన భర్త హత్యకు గురయ్యారని, సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కర్ణాటక సీఎంను వారు కోరనున్నారు. తనకు ప్రాణభయం ఉందని, కర్ణాటకలో పనిచేయలేకపోతున్నానని రెండు నెలల క్రితమే తివారీ తనకు తెలిపాడంటూ ఆయన సోదరుడు మయాంక్‌ ఇప్పటికే మీడియాకు వెల్లడించారు. మొత్తానికి యూపీ సర్కారు సిఫారసు దరిమిలా.. కర్ణాటక ప్రభుత్వం కూడా కేసును సీబీఐకు అప్పగించాలని కోరే అవకాశాలున్నాయి. కాగా, లఖ్‌నవ్‌లోని హజ్రతగంజ్‌ పోలీస్‌ స్టేషనలో తివారీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. దీనిని హత్య కేసుగా నమోదు చేసినట్టు సర్కిల్‌ ఆఫీసర్‌ అవినాశ్‌ కుమార్‌ మిశ్రా వెల్లడించారు.
nation
8,718
31-10-2017 23:17:54
ఛేజింగ్‌ కోసం అబుదాబీకి!
‘బాహుబలి’ తర్వాత పెరిగిన ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకొని ‘సాహో’ నిర్మాణంలో ఎక్కడా రాజీపడటంలేదు యూవీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీ, ప్రమోద్‌. సుజిత్‌ దర్శకత్వంలో తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో రూ. 150 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమాలో కీలకమైన ఛేజింగ్‌ను అబుదాబీలో చిత్రీకరించడానికి నిర్మాతలు. అక్కడ 15-20 రోజుల పాటు చిత్రీకరించే ఈ ఛేజింగ్‌కు హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బాట్స్‌ సారథ్యం వహిస్తున్నారు. ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’, ‘రష్‌ అవర్‌’ తదితర చిత్రాలకు ఆయన పనిచేశారు. వందలాది కార్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు పాల్గొనే ఈ ఛేజ్‌లో ప్రభాస్‌ డూప్‌ లేకుండా నటిస్తారని సమాచారం. ఈ ఛేజింగ్‌ను చిత్రీకరించడానికి అబుదాబీ సరైన ప్రదేశమని యూనిట్‌ అభిప్రాయంతో ఈ నెల 15 తర్వాత అక్కడ షూటింగ్‌ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ విలన్‌గా నటిస్తున్నారు.
entertainment
11,523
03-01-2017 23:23:19
శబరిమలలో అప్పం రగడ
ప్రసాదం తయారీని నిలిపివేసిన నిర్వాహకులు కేరళ ప్రభుత్వం సీరియస్‌ హుటాహుటిన శబరిమలకు మంత్రి తిరువనంతపురం: ఆలయ నిర్వహణ అధికారుల కారణంగా శబరిమలలోని అయప్ప పుణ్యక్షేత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. అక్కడ అప్పం రూపంలో భక్తులకు అందజేసే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. భక్తులు తెచ్చే బియ్యంతోనే ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అయితే మకరజ్యోతి ఉత్సవాల సందర్భంగా అప్పం ప్రసాదం తయారీని ఆలయ నిర్వహణ అధికారులు నిలిపివేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆహార భద్రత అధికారులు నాణ్యతలేదనే అనుమానాలను వ్యక్తం చేయడంతో ఆలయ ప్రత్యేక కమిషనర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం భక్తుల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో కేరళ ప్రభుత్వం తక్షణం స్పందించింది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ మంగళవారం హుటాహుటిన శబరిమలకు బయలుదేరి వెళ్లారు. ఆలయ అధికారులు అకారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తప్పుబట్టారు. అప్పం ప్రసాదం తయారీని నిలిపివేయడం తగదని, భక్తులు తీసుకొచ్చే బియ్యం నాణ్యతపై అనుమానాలు అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. అయ్యప్ప దర్శనం కోసం విచ్చేసే భక్తులు అప్పం, అరవన ప్రసాదాలను పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ రెండు ప్రసాదాలను తీసుకోకుండా తిరిగివెళ్లరు.
nation
6,066
09-07-2017 10:47:52
‘సరైనోడు’ తర్వాత అంతా మారిపోయింది: ఆది పినిశెట్టి
30 ఏళ్ల కెరీర్‌లో 40 సినిమాలు తీసిన అగ్ర దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడు... హీరోగా తెలుగు సినిమాతో పరిచయమైనప్పటికీ, తమిళంలో విభిన్నమైన పాత్రల ద్వారా క్రేజ్‌ సంపాదించుకున్నాడు... ప్రస్తుతం తెలుగులో ప్రధాన భూమికలు పోషిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు... ‘మృగం’, ‘వైశాలి’, ‘మరకతమణి’ వంటి తమిళ అనువాదాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్న ఆది పినిశెట్టి ‘సరైనోడు’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత బిజీ అయ్యాడు. ‘‘మా నాన్న తెలుగులో అగ్ర దర్శకుడైనప్పటికీ మేము చెన్నైలో ఉండేవాళ్లం కాబట్టి అక్కడ నేను సెలబ్రిటీ కొడుకులా కాకుండా సాదాసీదాగానే పెరిగాను. పైలట్‌ అవుదామనుకుని అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను’’ అంటూ ఆది పినిశెట్టి చెబుతున్న విశేషాలు... నాన్నగారిది పాలకొల్లు. నేను పుట్టింది అమ్మగారి ఊరు గుంటూరులో అయినా పెరిగింది మాత్రం చెన్నైలోనే. తాతగారు పినిశెట్టి శ్రీరాములుకు నాటకరంగంలో మంచి పేరుంది. ‘ఆదర్శ నాట్య మండలి’ పేరిట ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అల్లు రామలింగయ్య, రేలంగి నరసింహారావు వంటి అనేకమందికి ఆ నాట్యమండలితో అనుబంధం ఉండేది. నాన్న సినీరంగంపై ఆసక్తితో చెన్నైకు వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. అన్నయ్య (సత్యప్రభాస్‌ పినిశెట్టి), నేనూ చెన్నైలోని ‘డాన్‌ బాస్కో’ స్కూల్లో చదువుకున్నాం. ఇంటి ముందు నాలుగు కార్లు ఉన్నా సరే, స్కూలుకు బస్సులోనే వెళ్లేవాళ్లం. సింపుల్‌గా ఉండటం చిన్నప్పటినుంచే అలవాటు చేశారు నాన్న. సత్యరాజ్‌గారి అబ్బాయి శిబిరాజ్‌, ప్రభుగారి అబ్బాయి విక్రమ్‌ప్రభు నాతో పాటే చదువుకున్నారు. సెలవుల్లో మాత్రం పాలకొల్లుకు వెళ్లేవాళ్లం. నాన్నగారిది పెద్ద కుటుంబం. ఎప్పుడూ సందడిగా ఉండేది. ఎక్కడున్నా సరే నేను చాలా తొందరగా ఒక గ్రూపు ఏర్పాటుచేసుకుంటాను. ఆ విధంగా పాలకొల్లులో నా వయసువారితో కలిసి చెరువులో చేపలు పట్టడం, చుట్టుపక్కల జరిగే జాతరలకు వెళ్లడం బాగుండేది. అమ్మగారి ఊరిలో కూడా ఇదే తంతు. పైలట్‌ కావాలనుకున్నా... నాకు ఐదారేళ్ల వయసు వచ్చేసరికే నాన్నగారు తెలుగులో టాప్‌ డైరెక్టర్‌. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, మోహన్‌బాబులాంటి అగ్ర హీరోలతో సినిమాలు తీస్తూ నిరంతరం షూటింగులతో బిజీగా ఉండేవారు. ఆ రోజుల్లో సినిమావాళ్లంతా చెన్నైలోనే ఉండేవారు కాబట్టి హీరోల పుట్టినరోజు వేడుకలకు నాన్న మమ్మల్ని సరదాగా వెంట తీసుకెళ్లేవారు. చుట్టూ సినిమా వాతావరణం ఉన్నప్పటికీ నాన్నగారికి మాత్రం మా ఇద్దర్నీ బాగా చదివించాలనే కోరిక ఉండేది. అందుకే ఆ బాధ్యతను అమ్మకు అప్పగించారు. దాంతో నేను ఏది షేర్‌ చేసుకోవాలన్నా అమ్మతోనే. అంత పెద్ద డైరెక్టర్‌ అయినా సరే నాన్నకు షూటింగు, ఇల్లు తప్ప వేరే వ్యాపకాలు ఉండేవి కావు. షూటింగ్‌ అయిపోగానే ఇంటికొచ్చి మాతో గడిపేవారు. నాన్నతో నాకు చనువెక్కువ. తను ఇంటికొచ్చేసరికి నేను నిద్రపోతే, నిద్రలేపి మరీ ఏదైనా తినిపించేవారు. పండగలకు, పబ్బాలకు ఆయన టీమ్‌ మొత్తం మా ఇంట్లోనే ఉండేది. అరవై, డెబ్బై మందితో ఇల్లంతా కళకళలాడేది. చెన్నైలోని ఎస్‌వీసీఈ (శ్రీ వెంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌)లో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చేశాను. నాన్నగారు పెద్ద డైరెక్టర్‌ అయినప్పటికీ కాలేజీలో నన్నెవరూ సెలబ్రిటీ కొడుకులా చూసేవారు కాదు. దానికి కారణం నా ఫ్రెండ్స్‌కు తమిళ సినిమాలే తప్ప తెలుగు సినిమాలతో పరిచయం ఉండేది కాదు. కాలేజీ సిటీకి 45 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కాలేజీ బస్సులో వెళ్లడం, అప్పుడప్పుడు కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు, షికార్లకు చెక్కేయడం, బైకు మీద చెన్నై వీధుల్లో తిరగడం మర్చిపోలేని అనుభవం. ఎప్పుడో ఒకసారి అది కూడా సెలవుల్లోనే నాన్నగారి షూటింగులకు వెళ్లేవాణ్ణి. చదువు పాడవుతుందని నాన్న అడ్డు చెప్పడంతో, నేను కూడా షూటింగులంటే పెద్దగా ఆసక్తి చూపేవాడిని కాదు. ఇంజనీరింగ్‌ అయిపోయిన తర్వాత పైలట్‌ కావాలనే కల ఉండేది. సినిమాల్లోకి రావడం ‘ఒక విచిత్రం’...నాన్నగారి కోసం ఇంటికొచ్చే చాలామంది నిర్మాతలు ‘మీ అబ్బాయిని హీరో చేస్తారా?’ అంటూ అడిగేవారు. ఆయన వారికి ఏం సమాధానం చెప్పేవారు కాదు. నేను కూడా సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టేవాణ్ణి కాదు. ఒకరోజు డైరెక్టర్‌ తేజగారు నా గురించి నాన్నగారి దగ్గర ప్రస్తావించడం... ఆయన చెప్పిన కథ కొత్తగా ఉండటంతో సరదాగా సరే అన్నాను. అప్పటికీ నటన అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. నెలన్నర పాటు వైజాగ్‌లో సత్యానంద్‌గారి దగ్గర శిక్షణ తీసుకోమన్నారు. ఆ తర్వాత ‘ఒక విచిత్రం’ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. కెమెరాముందు తేజగారు చెప్పినట్టు చేశాను కానీ అప్పటికి నటనపట్ల సీరియస్‌గా లేను. సినిమా పూర్తయిన తర్వాత అమెరికాలోని పనామా యూనివర్శిటీలో పైలెట్‌ ట్రైనింగ్‌కు అప్లయ్‌ చేశాను. అదే సమయంలో తమిళ ‘మృగం’లో హీరోగా తొలి అవకాశం వచ్చింది. అది కూడా ఒక డిఫరెంట్‌ సినిమా. నిజానికి అలాంటి పాత్రను ఏ హీరో కూడా ఒప్పుకోడు. కానీ నాకు పాత్ర బాగా నచ్చి చేశా. అందులో నా నటన అందరికీ నచ్చింది. ఆ సినిమా తర్వాత నటనపై సీరియస్‌నెస్‌ వచ్చింది. రెగ్యులర్‌ హీరోగా కాకుండా డిఫరెంట్‌ సినిమాలు చేస్తే తప్పకుండా క్లిక్‌ అవుతాననే నమ్మకం ఏర్పడింది. నా నమ్మకం నిజమై ‘ఈరం’ (తెలుగులో వైశాలి) సూపర్‌హిట్‌ కావడంతో వెనక్కి తిరిగిచూసుకునే అవకాశం రాలేదు. తమిళంలో నాకు గుర్తింపు వచ్చిన తర్వాత ప్రతీ సినిమా తెలుగులోకి కూడా అనువాదమవుతూ వచ్చింది. ‘ఏకవీర’, ‘మరకతమణి’ అలా వచ్చినవే. ‘సరైనోడు’ అన్నారంతా...తెలుగులో తొలి సినిమా చేసినా ఆ తర్వాత తమిళంలో గుర్తింపు తెచ్చుకోవడం, వాటి అనువాదాల ద్వారా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించడం వింతైన అనుభవం. ‘ఒక విచిత్రం’ తర్వాత ఏడేళ్లకు (2013) తెలుగులో స్ట్రయిట్‌ సినిమా ‘గుండెల్లో గోదారి’ చేశాను. అన్నయ్య డైరెక్ట్‌ చేసిన ద్విభాషా చిత్రం ‘మలుపు’ తర్వాత అదే యేడాది (2016) ‘సరైనోడు’ ద్వారా తెలుగులో కొత్త ఇమేజ్‌ వచ్చింది. అల్లు అర్జున్‌ పాత్రతో పాటు నా పాత్ర కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ సినిమా తర్వాత హీరోగా చేయమని అరడజను ఆఫర్లు వచ్చాయి. కానీ కెరీర్‌ పట్ల నాకు స్పష్టత ఉంది. అందుకే ఏదిపడితే అది ఒప్పుకోకుండా డిఫరెంట్‌ సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నా. నేను సినిమాలు చేస్తున్నది డబ్బు కోసం మాత్రమే కాదు... నా సంతృప్తి కోసం. ఏదో ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని వెరైటీ రోల్స్‌ చేశాననే తృప్తి ఉండాలి కదా. నాని ‘నిన్ను కోరి’, రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’, త్రివిక్రమ్‌-పవన్‌కళ్యాణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నా. ఒకవైపు తమిళంలో హీరోగా చేస్తూనే, తెలుగులో ప్రధాన పాత్రలు, నెగిటివ్‌ రోల్స్‌ చేయడం ద్వారా నటుడిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నా. మొదటి నుంచి నా కెరీర్‌ను గమనిస్తే హీరోనా, విలనా అనే తేడాలు నేనెప్పుడూ పట్టించుకోలేదు. ఛాలెంజింగ్‌గా ఉన్న ఎలాంటి పాత్రనైనా చేసేందుకు సిద్ధపడ్డా. ఇక ముందు కూడా నా జర్నీ ఇలాగే కొనసాగుతుంది. ఇప్పటికీ సెలబ్రిటీ గుర్తింపు కన్నా సింపుల్‌గా ఉండటాన్నే ఇష్టపడతా. చెన్నైలో ఉన్నా హైదరాబాద్‌లో ఉన్నా టీషర్ట్‌, జీన్స్‌ వేసుకుని బైక్‌ మీదే సిటీ అంతా తిరుగుతా. వివిధ ప్రాంతాలు తిరుగుతూ రకరకాల మనుషులతో మాట్లాడుతూ వారి వారి సంస్కృతి గురించి, జీవన విధానం గురించి తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. చెన్నైలో నా క్లోజ్‌ఫ్రెండ్స్‌ చాలామందే ఉన్నారు. వాళ్లు నా సినిమాలు చూసి విమర్శిస్తూ, ఏడిపించడం సరదాగా అనిపిస్తుంది. పేరెంట్స్‌ పెళ్లి చేసుకొమ్మని చాన్నాళ్లుగా పోరుతున్నారు. బహుశా ఈ యేడాదితో బ్యాచిలర్‌ లైఫ్‌కు పుల్‌స్టాప్‌ పెడతానేమో. తప్పకుండా అమ్మనాన్నలు చూసిన అమ్మాయినే చేసుకుంటా. ఈ లోపు నాకెవరైనా నచ్చితే చెప్పలేను. ప్రేమ ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో తెలియదు కదా. అయితే ఇంట్లోవాళ్లు మాత్రం నా ఇష్టాన్ని కాదనరని కచ్చితంగా చెప్పగలను. ఇప్పటిదాకా ఏ విషయంలో కూడా వారి అభిప్రాయాలను నాపై బలవంతంగా రుద్దలేదు. మొదట్నుంచి పేరంట్స్‌ ఆ ఫ్రీడమ్‌ నాకిచ్చారు. అది సినిమాలైనా, జీవితమైనా!ఫ్యాషన్‌ దుస్తులు సినిమాలకే పరిమితం. బయట సింపుల్‌గా ఉంటా.పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్‌ అంటే ఇష్టం.అమ్మ చేతివంటను అస్సలు మిస్సవ్వను. చేపల కూర, బంగాళదుంప వేపుడు బాగా చేస్తుంది. సీఫుడ్‌ ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తా. అరుదుగా దొరికే పులస చేపలు ఇష్టంగా తింటా.నాన్న తీసిన సినిమాల్లో పుణ్యస్త్రీ, ముత్యమంతముద్దు, పెదరాయుడు, జ్వాల, రుక్మిణి బాగా నచ్చుతాయి.‘ఏకవీర’ 18వ శతాబ్దంలో జరిగిన కథ కాబట్టి ఆ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డా.డ్రీమ్‌రోల్స్‌ అంటూ ఏవీ లేవు. నటుడిగా ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేయాలనుకుంటా.డైరెక్షన్‌ వైపు వెళ్లే ఆలోచన లేదు.- చల్లా శ్రీనివాస్‌
entertainment
18,618
05-02-2017 02:08:27
వలసలపై నిషేధం ఎత్తివేత!
వాషింగ్టన్‌, ఫిబ్రవరి 4: న్యాయస్థానం దెబ్బకు ట్రంప్‌ సర్కార్‌ దిగి వచ్చింది. ఏడు ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వలసలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ‘చెల్లుబాటయ్యే వీసాలు ఉన్న వారు వచ్చేయవచ్చు’ అని ప్రకటించింది. దీనంతటికీ కారణం... సియాటెల్‌లోని అమెరికా డిస్ట్రి‌క్ట్‌ జడ్జి (ఫెడరల్‌ జడ్జి) జేమ్స్‌ రాబర్ట్‌ జారీ చేసిన ఆదేశాలే! ట్రంప్‌ జారీ చేసిన నిషేధాజ్ఞలపై వాషింగ్టన్‌ స్టేట్‌ అటార్నీ జనరల్‌(ఏజీ) బాబ్‌ ఫెర్గ్యూసన్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తిస్థాయి సమీక్ష జరిగేదాకా... వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదని జేమ్స్‌ రాబర్ట్‌ స్పష్టం చేశారు. ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను నిలిపివేశారు. నిషేధం ఎదుర్కొంటున్న ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను కానీ, రాకపోకలను కానీ అధికారులు అడ్డుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వర్గాలు తొలుత బింకం ప్రదర్శించాయి. సియాటెల్‌ డిసి్ట్రక్ట్‌ జడ్జి ఆదేశాలను నిలిపివేయాల్సిందిగా అత్యవసర ఆదేశాలు కోరుతూ అప్పీలు చేస్తామని తెలిపాయి.         ‘‘ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌కు చట్టబద్ధత ఉంది. దానిని అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. డిసి్ట్రక్ట్‌ జడ్జి ఆదేశాలను నిలిపివేయాల్సిందిగా వెంటనే కోరుతాం’’ అని తెలిపింది. అయితే... ఆ కొద్దిసేపటికే అమెరికా విదేశాంగ శాఖ, అంతర్గత భద్రత శాఖల నుంచి వేర్వేరుగా ప్రకటనలు వెలువడ్డాయి. ‘‘ఇరాక్‌, సిరియా, ఇరాన్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, యెమన్‌ల నుంచి అమెరికాకు వలసలను నిషేధిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలను నిలిపివేస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు. ‘‘ట్రంప్‌ ఆదేశాల మేరకు ఆ ఏడు దేశాలకు చెందిన సుమారు 60వేల వీసాలను రద్దు చేశాం. వీసాలపై రద్దు ముద్ర పడని వారు, ఇతర నిబంధనలకు లోబడి అమెరికాకు రావొచ్చు’’ అని తెలిపారు. కోర్టు తీర్పు, ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయంపై వాషింగ్టన్‌ స్టేట్‌ అటార్నీ జనరల్‌ బాబ్‌ ఫెర్గ్యూసన్‌ హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ చెల్లదని తెలిపారు. ‘‘మన రాజ్యాంగం ఇంకా అమలులోనే ఉందని రుజువైంది. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు! అధ్యక్షుడితో సహా అందరికీ ఇది వర్తిస్తుంది’’ అని తెలిపారు. అమెరికా కోసమే నిషేధం: ట్రంప్‌  నల్ల జాతి నేతలకు విందు...దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ‘ఆఫ్రికన్‌ అమెరికన్‌’ (నల్లజాతీయుల)ను గుర్తు చేసుకుంటూ అమెరికాలో ప్రతి ఏటా ఫిబ్రవరి నెలను ‘బ్లాక్‌ హిస్టరీ మంత’గా జరుపుకొంటారు. ఈ అంశాన్ని కూడా ట్రంప్‌ ప్రస్తావించారు. నల్లజాతికి చెందిన నేతలకు వైట్‌హౌ్‌సలో విందు ఇస్తున్నట్లు తెలిపారు. మరోవైపు... కొన్ని బడా బ్యాంకులు విధిస్తున్న ఆంక్షలను రద్దు చేస్తూ ట్రంప్‌ కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలే ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్నాయని తెలిపారు. దీనిపై అమెరికా స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
nation
10,145
23-08-2017 12:49:27
'వెళ్లిపోమాకే'.. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ: దిల్ రాజు
ఓ చిన్న సినిమా.. దిల్‌ రాజుకు తెగ నచ్చేసిందట. ఈ యంగ్ టీమ్‌కు నా ఫుల్ సపోర్ట్ అంటున్నారు. యాకుబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన వెళ్లిపోమాకే సినిమాను దిల్ రాజు విడుదల చేయనున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని.. మేకింగ్ తనకు బాగా నచ్చిందని.. యాకుబ్ అలీ డైరెక్షన్.. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని దిల్ రాజు తెలిపారు. విశ్వక్సేన్ సహా ఏడెనిమిది క్యారెక్టర్స్ మధ్య కథ సాగుతుందని.. ఇదో వినూత్న ప్రయోగమే వెళ్లిపోమాకే మూవీగా తెలుస్తోంది. ఈ మూవీని సెప్టెంబర్ 2న రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజు ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ యాకుబ్ అలీ అన్నారు.
entertainment
1,551
12-06-2017 14:06:40
రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్..!
న్యూఢిల్లీ: డిజిటల్ లైఫ్‌కు డేటానే ప్రాణమని పదే పదే చెప్పే రిలయన్స్ జియో తాజాగా మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఎల్‌వైఎఫ్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వినియోగదారులందరికీ 20 శాతం అధికంగా డేటా ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే రూ.6,600 నుంచి రూ.9,700 విలువైన హ్యాండ్‌సెట్లపై... అంటే ‘వాటర్’ సబ్‌బ్రాండ్ మోడల్ కిందికి వచ్చేవాటిపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఎల్‌వైఎఫ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు కొత్త ఆఫర్ ప్రకారం రోజుకు 1 జీబీ 4జీ డేటా స్థానంలో 1.2 జీబీ డేటా అందుకుంటారు. ఎల్‌వైఎఫ్ హ్యాండ్‌సెట్ల అమ్మకాలు స్థిరత్వం కోల్పోతున్న నేపథ్యంలోనే జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. లైఫ్ స్మార్ట్ ఫోన్ల ప్రారంభ ధరలు రూ.2,999 నుంచే ఉండడం... ఉచిత 4జీ డేటా ఇస్తుండడంతో ఈ మోడల్ ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడైన విషయం తెలిసిందే. సినారె గురించి చాలామందికి తెలియని విషయాలివి..
business
18,430
26-07-2017 03:26:26
భారత్‌ తగ్గాల్సిందే!
సంక్షోభ నివారణకు ఇదే మార్గంచైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ తొలి స్పందనబీజింగ్‌, జూలై 25: డోక్లాం సంక్షోభంపై ఇన్నాళ్లుగా అధికార మీడియాను అడ్డుపెట్టుకుని ప్రతిరోజూ భారత్‌ను బెదిరిస్తున్న చైనా ప్రభుత్వం.. ఇప్పుడు ముసుగు తొలగించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యి తొలిసారి ఈ వివాదంపై స్పందించారు. భారత్‌ మనస్సాక్షితో వ్యవహరించి తన సేనలను సరిహద్దు నుంచి వెనక్కి మళ్లించాలని సూచించారు. డోక్లాంలో తన సేనలను మోహరించడం ద్వారా భారత్‌ తప్పుచేసిందని పరోక్షంగా అన్నారు. అయితే, ఏకపక్షంగా సరిహద్దులు మార్చాలని చైనా చూస్తోందని, దీనికి భారత్‌ ఒక్కనాటికీ అంగీకరించదని, డోక్లాం నుంచి చైనా వైదొలిగితే భారత దళాలను ఉపసంహరించుకుంటామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ గత గురువారమే తెగేసి చెప్పారు.  చైనాశక్తి ముందు భారత్‌ నిలువలేదంటూ చైనా కయ్యానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో బీజింగ్‌లో వచ్చే గురు, శుక్రవారాల్లో జరగనున్న బ్రిక్స్‌ దేశాల జాతీయ భద్రతాసలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) భేటీకి భారత ఎన్‌ఎ్‌సఏ అజిత్‌ దోవల్‌ హాజరు కానున్నారు. సంక్షోభ పరిష్కారంపై ఈ సందర్భంగా చైనా ఎన్‌ఎ్‌సఊ యాంగ్‌ జీచీతో ఆయన చర్చిస్తారని భావిస్తున్నారు. సరిహద్దు సమస్యల పరిష్కారంపై ఉభయదేశాల మధ్య జరిగే చర్చలకు వీరిద్దరూ ప్రత్యేక ప్రతినిధులు కూడా కావడం గమనార్హం. అయితే దీనిపైనా చైనా దుమారం రేపుతోంది. దోవల్‌ పర్యటనతో సమస్యకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని ‘చైనా డైలీ’ వ్యాఖ్యానించగా.. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక మాత్రం దోవల్‌పై విషం కక్కింది.
nation
12,575
12-11-2017 18:51:45
సౌదీలో లెబనాన్ ప్రధాని కిడ్నాప్!
న్యూఢిల్లీ: అధికారిక పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లిన లెబనాన్ ప్రధాని సాద్ హరరి తన రాజీనామాను ప్రకటించిన తర్వాతి రోజు నుంచి కనిపించకుండా పోవడం సంచలనం సృష్టిస్తోంది. హరిరి గతవారం సౌదీ వెళ్లగా ఆ తర్వాతి రోజే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కలకలం రేపారు. అనూహ్యంగా ఆ తర్వాతి రోజు నుంచి ఆయన జాడ కనిపించకుండా పోయింది. దీంతో లెబనాన్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సౌదీలో హరిరి కిడ్నాప్ అయ్యారంటూ వార్తలు రావడంతో లెబనాన్ అధ్యక్షుడు మైఖెల్ అవాన్ సౌదీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. సౌదీ వచ్చిన తమ ప్రధాని ఇప్పటి వరకు స్వదేశానికి ఎందుకు చేరుకోలేదో చెప్పాలని కోరారు. సౌదీ పర్యటనకు వెళ్లిన హరిరి ఈనెల 4న రియాద్‌లో మాట్లాడుతూ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. లెబనాన్‌పై ఇరాన్ ఆధిపత్యం కారణంగా తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రకటన తర్వాత ఆయన తిరిగి లెబనాన్ వెళ్లకపోగా ఆయన జాడ కూడా తెలియరాలేదు. దీంతో లెబనాన్‌లో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.
nation
7,120
04-01-2017 12:59:11
మహేశ్, నాగార్జున, సమంత, సానియాలకు కేటీఆర్ ‘చేనేత’ సవాల్!
ఎముకలు కొరికే చలిలో దేహాన్ని వణికించే ఐస్ గడ్డలతో ఓ చాలెంజ్. అదే ఐస్ బకెట్ చాలెంజ్. చాలెంజ్ ఏం లేదు... జస్ట్ ఐస్ ముక్కలను ఒంటి మీద కుమ్మరించుకోవడమే. ఆ తర్వాత రైస్ బకెట్ చాలెంజ్. లేని వాళ్లకు బకెట్ బియ్యాన్ని ఉచితంగా అందించడం. సోషల్ కాజ్ కోసం ఓ వ్యక్తి విసిరిన సవాల్ అది. కానీ, ఐస్ బకెట్‌కు వచ్చినంత క్రేజ్ మాత్రం రాలేదు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సెలెబ్రిటీలకు ఓ సవాల్ విసిరారు. ఆయనా ఓ మంచి పని కోసమే ఆ సవాల్‌ను విసిరారు. మహేశ్ సహా టాలీవుడ్ స్టార్లు, క్రీడాకారులకు ఆ చాలెంజ్‌ను స్వీకరించాలని సూచించారు. ఇంతకీ ఆ సవాల్ ఏంటంటే.. చేనేత వస్త్రాలను ధరించాలని. చేనేత వస్త్రాలకు డిమాండ్ తగ్గిపోవడం, చేనేత కార్మికులకు ఉపాధి తగ్గిపోతుండడంతో.. వాటికి ప్రాచుర్యం కల్పించేలా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, మన్మథుడు నాగార్జున, మంచు లక్ష్మి, వివేక్ ఒబెరాయ్, సమంత, సానియా మీర్జా, ఇతర సినీ స్టార్లకు ఈ సవాల్‌ను ప్రతిపాదించారు. ‘‘చేనేత కార్మికులను ఆదుకోవడానికి నేను చేనేత వస్త్రాలను ధరిస్తున్నా.. మరి మీరు ధరిస్తారా?’’ అంటూ వారిని ఓ రకంగా నిలదీసినంత పనిచేశారు. ఇక, ఈ చాలెంజ్‌ను కమల్ హాసన్, సానియా మీర్జా వెంటనే స్వీకరించారు. తాను ఈ సవాల్‌కు సిద్ధమని, తన తండ్రి తన జీవితాంతం చేనేత వస్త్రాలనే ధరించారని కమల్ స్పందించారు. ఇక, ఆస్ట్రేలియన్ ఓపెన్ పూర్తై హైదరాబాద్ రాగానే చేనేత వస్త్రాలనే ధరిస్తానని సానియా మీర్జా చెప్పింది. అంతేగాకుండా సహ క్రీడాకారులైన మహేశ్ భూపతి, రోహన్ బోపన్న, షట్లర్ పీవీ సింధు, రానా దగ్గుబాటిలకు ఈ సవాల్‌ను విసిరింది సానియా. మరి కేటీఆర్ విసిరింది మంచి సవాలే అయినా.. దానిని ఎంత మంది స్వీకరిస్తారో? మరి చేనేతకు ఎంత ప్రాచుర్యం లభిస్తుందో చూడాలి.
entertainment
18,054
16-02-2017 21:26:54
పళనిస్వామి సర్కార్‌ను కూల్చేందుకు పన్నీర్ సరికొత్త వ్యూహం!
చెన్నై: తమిళనాట రాజకీయ ఉత్కంఠకు గురువారంతో తెరపడిందని అందరూ అనుకున్నా పన్నీర్‌సెల్వం ఇప్పుడిప్పుడే కొత్త వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ 4:30 గంటలకు కొత్త సీఎంగా చిన్నమ్మ నమ్మినబంటు పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీఎం కావాలనుకున్న పన్నీర్‌‌కు కన్నీరే మిగిలింది. ఇవాళ సాయంత్రం 8:45 తర్వాత మొత్తం సీన్‌‌ను పన్నీర్ మార్చేశారు. ఆయన ఇంటి నుంచి నేరుగా జయలలిత సమాధివద్దకు చేరుకుని దీక్షకు దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మ’ ఆశయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చడమే తన లక్ష్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, కానీ తనకు ప్రజల మద్దతు ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవారెవరూ జయ అనుచరులు కాదని, పార్టీని శశికళ వారసత్వ పార్టీగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్తామని తేల్చిచెప్పారు. ఇది అమ్మ ప్రభుత్వం కాదు.. శశికళ సర్కార్ అంటూ పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు.  ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి నియోజక వర్గంలో పర్యటించి అమ్మ ప్రభుత్వం రావాల్సిన ప్రజలకు వివరిస్తామని పన్నీర్ చెప్పారు. జయలలిత ఉన్నంతకాలం దగ్గరకు రాని వాళ్లు ఇప్పుడు పార్టీలో చేరిపోయారని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని సెల్వం సెలవిచ్చారు.
nation
11,054
23-01-2017 03:18:33
దళితులు, బీసీలకు భూపంపిణీ
పేదలకు ఇళ్లు, చౌక ధరలకు చక్కెర, నెయ్యి బాలికలకు పీజీ వరకు ఉచిత విద్య పంజాబ్‌ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో జలంధర్‌, జనవరి 22: పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ)తో కలిసి వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. ఈసారి అ సెంబ్లీ ఎన్నికల్లో జనాకర్షక పథకాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. దళితులు, వెనుకబడిన వర్గాల వారికి భూపంపిణీ, పేదలకు పక్కా ఇళ్లు, చౌక ధరలకు చక్కెర, నెయ్యి అందించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. ఇటువంటి పలు పథకాలను అమలు చేయనున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ మేరకు బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆదివారం విడుదల చేశారు. నీలం రంగు కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.25కే కిలో చొప్పున రెండు కిలోల నెయ్యి, రూ.10కి కిలో చొప్పున 5కిలోల చ క్కెర అందజేయనున్నట్లు బీజేపీ పేర్కొంది. ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, అకస్మాత్తుగా చనిపోయిన రైతు కుటుంబాలకురూ.10 లక్షల సాయం చేయనున్నట్లు తెలిపింది. బాలికలకు పీజీ వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు, ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 60 ఏళ్లకు పెంచనున్నట్లు, ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేయనున్నట్లు, జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరోవైపు అకాలీదళ్‌ తమ మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తామని పేర్కొంది
nation
6,803
14-06-2017 22:57:34
విడుదలైన 'పరి' పోస్టర్
'ఎన్.హెచ్. 10' చిత్రంతో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకుంది ప్రముఖ కథానాయిక అనుష్కశర్మ. ఆ తర్వాత వచ్చిన ఘోస్ట్ కామెడీ మూవీ 'ఫిలౌరీ' ఆమెకు పెద్దంత పేరు, డబ్బులు తెచ్చిపెట్టలేదు. అయినా... మంచి కథ దొరికితే నిర్మాతగా కొనసాగుతానని అనుష్క శర్మ చెప్పకనే చెబుతోంది. ప్రొసిత్ రాయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అనుష్కశర్మ ఇటీవల 'పరి' పేరుతో ఓ సినిమాను మొదలెట్టింది. షూటింగ్ ప్రారంభం రోజునే తాను పోషించబోతున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ట్వీట్ చేసింది. కథ గురించి టీమ్ పెదవి విప్పకపోయినా... ఇదో హారర్ మూవీ అనే భావన ఈ పోస్టర్ చూస్తే అర్థమౌతోంది. మరి ఈ 'పరి' అయినా అనుష్కశర్మకు చక్కని విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
entertainment
2,881
11-10-2017 00:22:49
క్యు2 ఫలితాలపై ఆశలు
మూడో రోజూ లాభాల్లో సూచీలుమళ్లీ 10000 పైకి నిఫ్టీముంబై: ఈ వారం నుంచి మొదలవుతున్న కార్పొరేట్‌ కంపెనీల రెండో త్రైమాసికం ఫలితాలపై మార్కెట్‌ వర్గాల భారీ ఆశలు మంగళవారం మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. వరుసగా మూడో రోజు కూడా లాభాల బాటలోనే నడిచిన సెన్సెక్స్‌ మూడు వారాల గరిష్ఠ స్థాయిని తాకగా నిఫ్టీ మరోసారి మానసిక అవధి 10000 పాయింట్లకు ఎగువన ముగిసింది. కార్పొరేట్‌ ఫలితాలకు ముందు తమ చేతిలో మరిన్ని షేర్లు ఉంచుకోవాలన్న లక్ష్యంతో ఇన్వెస్టర్లు ఫండమెంటల్స్‌ బలంగా ఉన్న కంపెనీల షేర్లు కొనుగోలు చేశారు. గురువారం క్యు2 ఫలితాలు ప్రకటించడం ద్వారా ఎప్పటిలాగానే త్రైమాసిక ఫలితాల సీజన్‌కు టిసిఎస్‌ నాంది పలుకుతుంది.  తదుపరి ఫలితాలు ప్రకటించనున్న అగ్రగామి కంపెనీల్లో ఆర్‌ఐఎల్‌ కూడా ఉంది. ఫార్మా, ఆయిల్‌, గ్యాస్‌, బ్యాంకింగ్‌ స్టాక్‌లు ఇచ్చిన మద్దతుతో సెన్సెక్స్‌ 77.52 పాయింట్లు పెరిగి 31924.41 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 28.20 పాయింట్ల వృద్ధితో 10016.95 పాయింట్ల వద్ద క్లోజయింది. సెబి గణాంకాల ప్రకారం సోమవారం దేశీయ సంస్థలు 55.42 కోట్ల రూపాయల విలువ గల షేర్లు కొనుగోలు చేయగా ఎఫ్‌పిఐలు 475.11 కోట్ల రూపాయల విలువ గల షేర్లు విక్రయించాయి.సెన్సెక్స్‌లో లాభపడిన షేర్లలో లుపిన్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ షేరు 1.99 శాతం లాభంతో 1,060.50 రూపాయల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్‌ 1.29 శాతం లాభంతో రెండో స్థానంలో నిలవగా పవర్‌గ్రిడ్‌, యాక్సిస్ బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌, కోల్‌ ఇండియా షేర్లు కూడా లాభపడిన వాటిలో ఉన్నాయి.క్యు2లో లాభలో 96 శాతం క్షీణత ప్రకటించిన కారణంగా సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ షేరు 6 శాతానికి పైగా పడిపోయింది. బిఎస్ ఇలో 6.24 శాతం దిగజారి 30.05 రూపాయల వద్ద ముగియగా ఎన్‌ఎస్‌ఇలో 8.26 శాతం దిగజారి 29.40 రూపాయల వద్ద క్లోజయింది.బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నిధుల సమీకరణబ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వ్యాపార విస్తరణ కార్యకలాపాల కోసం టయర్‌ 1 బాండ్ల జారీ ద్వారా 1,650 కోట్ల రూపాయలు సమీకరించనుంది. ఒక విడత లేదా పలు విడతల్లో 500 కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంగా బాండ్లు జారీ చేస్తామని, అధిక సబ్‌స్ర్కిప్షన్‌ వచ్చినట్టయితే 1,650 కోట్ల రూపాయల వరకు ఉంచుకునే స్వేచ్ఛ తమ చేతిలో ఉంచుకుంటామని తెలిపింది.
business
14,285
06-02-2017 02:49:30
ఇరుదేశాల మధ్య కశ్మీరే ప్రధాన సమస్య
‘‘భారత్-పాక్‌ మధ్య కశ్మీర్‌ ఓ ప్రధాన వివా దం. దీనిని పరిష్కరించనంత వరకు కశ్మీరీల కు శాంతిసౌభాగ్యాలు చేకూరవు. ఐరాస తీర్మానాలు కశ్మీర్‌ ప్రజలకు సమకూర్చిన స్వయం నిర్ణయాధికారాన్ని భారత కాలరాస్తోంది. భారత ఎంత దమనకాండను సాగిస్తున్నా..స్వేచ్ఛా వాయువులు పీల్చాలన్న కశ్మీరీల ఆకాంక్షను దెబ్బకొట్టలేకపోయింది. అక్కడ రక్తపుటేర్లను భారత ఆపాలి. ప్రజాభిప్రాయ సేకరణకు అంగీకరించాలి’’ -నవాజ్‌ షరీఫ్‌ , పాకిస్థాన్‌ ప్రధాని
nation
20,908
21-01-2017 17:23:07
జల్లికట్టుపై సెహ్వాగ్ సంచలన స్పందన..
న్యూఢిల్లీ: జల్లికట్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. హింసకు తావు లేకుండా తమిళులు భారీగా నిరశనలు తెలిపడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీకి సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన తీరులో విభిన్నంగా స్పందించాడు. తన స్పందనను ట్విట్టర్‌లో తమిళ భాషలోనే తెలియజేసి ఆశ్చర్యపరిచాడు. ఏమన్నాడంటే.. ‘అద్భుతమైన తమిళ ప్రజలకు తన గౌరవ వందనాలు తెలిపాడు. ఇలానే శాంతయుతమైన నిరశలనే కొనసాగించండి అంటూ ప్రమేతో మీ సెహ్వాగ్’ అని కామెంట్ చేశాడు. దీంతో తమిళ ప్రజలు ఈ ట్వీట్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. తమిళులు ఎంతో ఆనందించాల్సిన ట్వీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ః   తమిళుల సంప్రదాయంలో భాగమైన జల్లికట్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వన్ జల్లికట్టుపై ఆర్డినెన్స్ తేవాలని ప్రధాని మోదీకి లెటర్ కూడా రాసారు. సినిమా సెలబ్రిటీలందరూ ఒక్కతాటిపైకి వచ్చి మద్దతునిచ్చారు. తమిళ ప్రజలు, ప్రముఖులు మెరీనా బీచ్ తీరంలో భారీగా చేరుకుని హింసకు తావులేకుండా పెద్ద ఎత్తున నిరశనలు తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు అంగీకరించిన సంగతి తెలిసిందే.
sports
19,989
13-08-2017 15:33:36
సెహ్వాగ్‌ ట్వీట్.. నెటిజన్ల ఫైర్!
లక్నో: టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్ గోరఖ్‌పూర్ ఆస్పత్రిలోని చిన్నారుల మరణాలు ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశాడు. అభంశుభం తెలియని చిన్నారులు మృత్యవాత పడడం బాధాకరమని పేర్కొన్నాడు. 1978లో తొలిసారి మెదడువాపు వ్యాధి వచ్చిందని పేర్కొన్న సెహ్వాగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 వేల మందికిపైగా చిన్నారులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కూడా అదే ఏడాది అంటే 1978లో జన్మించానని పేర్కొన్నాడు. అయితే అసలు సమస్య అంతా అక్కడే వచ్చింది. చిన్నారులకు వచ్చిన వ్యాధి కారణంగానే వారు మృత్యువాత పడినట్టు ఆయన ట్వీట్ చెబుతుండడంతో నెటిజన్లు వీరూపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆక్సిజన్ అందక పసిపిల్లలు చనిపోతే ఆ విషయాన్ని ఎత్తిచూపడం మానేసి ఇంకోదో చెబుతున్నారని మండిపడుతున్నారు. పిల్లల మృతికి కారణమైన ప్రభుత్వం గురించి ఒక్క మాటైనా సెహ్వాగ్ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
sports
14,622
11-10-2017 00:35:16
బ్రిటన్‌ వర్సిటీలో సాంకేతిక భాషా కోర్సు
లండన్‌, అక్టోబరు 10: భావి భారత ఇంజనీర్ల కోసం బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయం కొత్తగా సాంకేతిక భాషాకోర్సును ప్రారంభిస్తోంది. సాంకేతికపరమైన ఆంగ్లభాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఈ కోర్సును ఆన్‌లైన్‌లో ఉచితంగా అందజేస్తున్నారు. బర్మింగ్‌హాం వర్సిటీలో ఎలక్ర్టానిక్‌, ఎలక్ర్టికల్‌, సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌లో నేరుగా చేరే భారత విద్యార్థులు మూడువారాల పాటు ఈ కోర్సు పొందొచ్చు.
nation
18,393
25-11-2017 00:32:53
ఆధార్‌తో 500మంది పిల్లలు దొరికారు
యూఐడీఏఐ సీఈవో భూషణ్‌ పాండేన్యూఢిల్లీ, నవంబరు 24: తప్పిపోయిన 500 మందికిపైగా పిల్లల ఆచూకీ ఆధార్‌ సాయంతో లభ్యమైందని యూఐడీఏఐ (భారతదేశ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. గతకొన్ని నెలల్లోనే వీరి ఆచూకీ దొరికిందని ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌-2017 కార్యక్రమంలో తెలిపారు. అనాథాశ్రమాల్లోని చిన్నారులకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ చేపట్టినప్పుడు వారి వివరాలతో ఇదివరకే ఆధార్‌ ఉన్నట్లు తెలిపారు.  దీని ద్వారా తప్పిపోయిన పిల్లల ఆచూకీని తెలుసుకునే వీలుందన్నారు. చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలు పెద్దయ్యాక దొరకడం లాంటి సన్నివేశాలు సినిమాల్లోనే కనిపించేవని, కానీ ఇప్పుడు ఆధార్‌ వల్ల కూడా సాధ్యమవుతుందని అజయ్‌ చమత్కరించారు. సీఆర్‌ఐ అనే స్వచ్ఛంద సంస్థ లెక్కల ప్రకారం 2013 నుంచి 2015 వరకు చిన్నారులు తప్పిపోతున్న కేసులు 84 శాతం పెరిగాయి. ప్రతిరోజు దాదాపు 180 మంది పిల్లలు తప్పిపోతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆధార్‌ వివరాలను ప్రభుత్వ పథకాలకు అనుసంధానించడం ద్వారా నకిలీలను తొలగించడంతో పాటు ఏటా 10 బిలియన్‌ డాలర్లు ఆదా చేయవచ్చని అన్నారు.
nation
14,551
28-05-2017 17:03:34
జమ్మూ‌కశ్మీర్ వేర్పాటువాద నేత.. యాసిన్ మాలిక్ అరెస్ట్
శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటువాద నేత, జేకేఎల్ఎఫ్ చీఫ్ మహమ్మద్ యాసిన్ మాలిక్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. శ్రీనగర్‌లోని మైసుమాలో ఆయన్ను అదుపులోకి తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించారు. శనివారం పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ వారసుడు సబ్జార్‌ అహ్మద్‌ బట్‌, ఫైజాన్ అహ్మద్ కుటుంబాలను యాసిన్ మాలిక్ పరామర్శించారు.  ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కశ్మీర్ వేర్పాటువాద నేతలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాసిన్ మాలిక్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
nation
14,697
27-04-2017 04:20:40
బాధలు పడేది ప్రజలే కదా!
 వారికి ఆహారం అక్కర్లేదంటారా!?  రాష్ట్రాలపై సుప్రీం మండిపాటు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): కరువు పీడిత రాషా్ట్రల్లో ఆహార భద్రత చట్టం అమలుపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక రాష్ట్రాలు ఆహార కమిషన్లను ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసినా వాటిని అమల్లోకి తీసుకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రస్థాయిలో తక్షణం ఆహార కమిషన్లను ఏర్పాటు చేయాలంటూ మార్చి 22న తాము జారీ చేసిన ఆదేశాల అమలుపై న్యాయమూర్తులు జస్టిస్‌ మదన బి లోకూర్‌, జస్టిస్‌ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం బుధవారం సమీక్ష జరిపింది. ఈ సందర్భంగా, చట్ట ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆహార కమిషనను ఏర్పాటు చేశామని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఉదయ్‌కుమార్‌ సాగర్‌ ధర్మాసనానికి చెప్పారు. చైర్మన, ఐదుగురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి పేర్లతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించారు. ఇందుకు ధర్మాసనం సమ్మతించింది. ఇక, చట్ట నిబంధనల ప్రకారం కమిషన చైర్మన, సభ్యులు, సభ్య కార్యదర్శి ఎంపికకు కమిటీని ఏర్పాటు చేశామని, మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రభాకర్‌, సీఎస్‌ దినేశకుమార్‌ చెప్పారు. దాంతో, ‘మూడు నెలల గడువు ఎందుకు? 3-4 ఏళ్ల వరకూ కూడా చేయొచ్చు కదా! బాధలు పడేది ప్రజలే కదా!!’ అని జస్టిస్‌ లోకూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసలు ఏ నిబంధనల ప్రకారం మూడు నెలల గడువు తీసుకుంటున్నారు? ఒక్కో రాష్ట్రం ఒక్కో నిబంధన, పద్ధతి చెబుతోంది?’’ అని జస్టిస్‌ రమణ ప్రశ్నించారు. నెల రోజుల్లోపే కమిషనను ఏర్పాటు చేయాలని సీఎ్‌సను ఆదేశించారు. కాగా, కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల నియామకానికి పత్రికా ప్రకటన ఇచ్చిన మధ్యప్రదేశ్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషనలో ఎస్సీ, ఎస్టీ సభ్యులను నియమించలేదని మహారాష్ట్ర సీఎస్‌ చెప్పగా.. ‘‘సమాజంలో అత్యంత అణగారిన వర్గాల ప్రజలను ఆదుకునేది ఇలాగేనా?’’ అని జస్టిస్‌ లోకూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు 9న జరుగుతుందని ధర్మాసనం ప్రకటించింది.
nation
4,006
14-11-2017 00:25:43
గ్రూప్–3 ఫలితాలెప్పుడు?
నవ్యాంధ్రలోని చాలా పంచాయతీలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. అనేక పంచాయతీల్లో గ్రామ సుపరిపాలనకు కీలకమైన పంచాయతీ కార్యదర్శులు లేకపోవడంతో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలు అందడంలేదు. కార్యదర్శులు తగినంత మంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించడంతో ఏ పల్లెకూ న్యాయం చేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మొదట్లో పంచాయతీ కార్యదర్శుల నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫలితంగా ఏపీపీఎస్సీ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్‌–3 కేటగిరీ కింద విడుదలైన పంచాయతీకార్యదర్శి ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్, మెయిన్స్ అని రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికి మూడు నెలలు దాటినా ఫలితాలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు. ఫలితాల కోసం అభ్యర్థులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల దయతలచి పంచాయతీ కార్యదర్శి నియామక పక్రియ వేగవంతమయ్యేలా చూడాలి.- బి. రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూరు.
editorial
2,508
08-04-2017 16:20:35
జియో మరో సర్‌ఫ్రైజ్!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ‘సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్’ నిలిచిపోతుందే అని ఫీలయ్యేవారికి ఇది నిజంగా తీపివార్తే.. టెలికం నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఈ ఆఫర్‌ను నిలిపివేయాలని ట్రాయ్ ఇటీవల జియోను ఆదేశించించిన విషయం తెలిసిందే. దీంతో ట్రాయ్ ఆదేశాలకు శిరసావహించి ‘‘పూర్తిగా అమలుచేసే ప్రక్రియలో’’ ఉన్నామని జియో కూడా ప్రకటించింది.  ట్రాయ్ ఆదేశాలను పాటిస్తున్నామని చెబుతూనే... మరికొద్ది రోజుల పాటు ‘సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్’ను కొనసాగించే అవకాశాలున్నట్టు సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు వినియోగదారులకు సర్‌ప్రైజ్ ఇస్తూ అధికారిక వెబ్‌సైట్లో ఓ ప్రకటన కూడా ఉంచింది. ‘‘మరికొద్ది రోజుల్లో’’ ఈ ఆఫర్ నిలిచి పోతుందనీ.. ఈ లోగా రూ.303 లేదా ఆపైన రీచార్జ్ చేసుకున్న వారికి అదనంగా ఇచ్చే మూడునెలల కాంప్లిమెంటరీ ఆఫర్ వర్తిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. దీన్నిబట్టి అధికారికంగా  నిలిపివేసేలోగా మరింత మందిని ఈ ఆఫర్‌లో భాగస్వాములను చేయాలని కంపెనీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. గడువుకూడా మరో వారం రోజుల్లో ముగియనుండడంతో... ఎంతమంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారో చూడాలి మరి.
business
8,594
24-11-2017 21:48:25
పరిణీతి కన్నా ఇలియానా మిన్న అయిందా..?
సౌత్‌లో తన అందాలతో మెప్పించిన ఆ గోవాకోవా ఇప్పుడో హిందీ చిత్రంలో ఒక పాత్రను దక్కించుకుందట. అంతకుముందు ఆ పాత్రను ఓ బాలీవుడ్ బ్యూటీకి ఆఫర్ చేశారట. కానీ అది చివరకు గోవా భామకే దక్కింది. నాజూకు నడుమొంపులతో ఒకప్పుడు టాలీవుడ్ లో వయ్యారాలు ఒలకపోసిన ఇలియానా ఇక్కడ ఆఫర్స్ రాక , లేక బాలీవుడ్‌ను ఆశ్రయించింది. బాలీవుడ్‌లో అమ్మడి అందచందాలకయినా సరే కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇలియానాకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట.  ఇటీవల జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న ఓ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాను అనుకున్నారు. అయితే పాత్ర ప్రకారం అది ఇలియానా ధరిస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆ పాత్రకోసం ఇలియానాను ఫైనల్ చేశారు.  ప్రేమికులయిన తాహిర్ ఆలీ, ఉజ్మా అహ్మద్ ‌ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్నఈ చిత్రం ఇలియానా తనకు దక్కిన అరుదైన అవకాశంగా భావిస్తోంది. సైఫ్ ఆలీ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇల్లీ బేబీకి ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటున్న ఇలియానా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన పరిణీతి చోప్రా పోషించాల్సిన పాత్రనే ఎగరేసుకుపోయిందని ఇల్లీ గురించి చెవులు కొరుక్కుంటున్నారు బి టౌన్ జనం. మరి ఇలియానాకి ఈ పాత్ర ఏ స్థాయి ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
entertainment
3,133
28-07-2017 02:02:47
మార్కెట్లోకి మైలాన్‌ హెపటైటిస్‌ సి ఔషధం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెపటైటిస్‌ సి చికిత్సలో వినియోగించే ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ ఔషధం వెలాపటాస్విర్‌ 100 ఎంజి/సోఫోసుబువిర్‌ 400 ఎంజి టాబ్లెట్లను దేశీ మార్కెట్లోకి విడుదల చేసినట్లు మైలాన్‌ ఫార్మాసూటికల్స్‌ తెలిపింది.
business
8,547
02-08-2017 13:16:12
ఒక్క సీన్ కోసం 3 రోజులు.. 20 టేకులు, అయినా...
ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు, ఇప్పుడు విలన్‌గా మారిపోయారు. విలక్షణ విలనిజంతో కట్టిపడేస్తున్నారు. బాలయ్య లెజెండ్ సినిమాతో విలన్‌గా తన కెరీర్‌ రూటును ఆయన మార్చేశారు. విలన్‌గానే కాదు, తండ్రిగా, మామయ్యగా, కేరెక్టర్ ఆర్టిస్టుగా తనలోని నటనా పాటవాన్ని ప్రేక్షకులకు ఆయన చూపిస్తున్నారు. ఇటీవలే పటేల్ సార్‌తో విభిన్నమైన గెస్చర్‌తో ఆయన ఆకట్టుకున్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడకపోయినా, ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జయజానకి నాయక. ఈ సినిమాలోనూ విలన్‌గా నటిస్తున్నారు మ్యాన్లీ హీరో జగపతిబాబు.           అయితే, ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం జగపతిబాబు తెగ కష్టపడిపోయారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. సినిమాలోని ఓ కీలకమైన సన్నివేశం కోసం బోయపాటి అనుకున్న ఎక్స్‌ప్రెషన్‌ను జగపతిబాబు ఇవ్వలేకపోయారట. అందుకోసం 3 రోజులపాటు 20 టేకులు తిన్నా ఆ సీన్‌ను అనుకున్నట్టు తీయలేకపోయారట. దీంతో ఆ సన్నివేశాన్ని డబ్బింగ్, ఎడిటింగ్‌లో సవరించారట. ఆ సీనేంటో ఆయన చెప్పకపోయినా, ఆ డైలాగ్‌ను మాత్రం సినిమా సక్సెస్ మీట్‌లో చెబుతానంటూ సినిమా విజయంపై ఆయన చాలా నమ్మకంగా ఉన్నారు. మరి, ఆ సీనేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!!
entertainment
8,841
18-05-2017 11:02:18
మీడియా ఎదుటే ప్రియాంకకు హాలీవుడ్ హీరో ముద్దు
హాలీవుడ్‌లో ఫస్ట్ మూవీ రిలీజ్‌కు ముందే వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ప్రియాంక చోప్రా. ఇందులో జేమ్స్ బాండ్ సినిమా కూడా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. క్వాంటికో టీవీ సిరీస్‌తో హాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన ప్రియాంక తొలి చిత్రం 'బేవాచ్' విడుదలకు ముందే పాప్యులర్ అవుతోంది. 25 ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా మియామీలో వరల్డ్ ప్రీమియర్ జరిగింది. పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఈ షోకు హాజరయ్యారు. ప్రియాంక మీడియాతో మాట్లాడుతున్న టైమ్‌లో సడెన్‌గా వెనకనుంచి వచ్చి బుగ్గపై ఓ ముద్దు పెట్టాడు హీరో రాక్ అలియాస్ డ్వేన్ జాన్సన్... ఈ సడెన్ కిస్ ఇప్పుడు ప్రియాంకకు మరింత ప్రాచుర్యం తెచ్చిపెట్టింది. 'బేవాచ్' సినిమా విడుదలకు ముందే వరుస అవకాశాలు ప్రియాంకను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. హాలీవుడ్ ప్రొడ్యూసర్ పాల్ బెర్నాన్ తన సినిమాలో ప్రియాంక హీరోయిన్ అని ప్రకటించాడు... సిలాస్ హోవార్డ్స్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో ఆక్టేవియా స్పెన్సర్స్.. జిమ్ పార్సన్స్ కీలక పాత్రధారులు... ఇదిలా ఉంటే మరో బంపర్ ఆఫర్ కూడా కొట్టేసిందట ఈ అందాల భామ... హాలీవుడ్ ఛాన్సులన్నీ ఒకెత్తు... జేమ్స్ బాండ్ సినిమాలో అవకాశం మరో ఎత్తు అంటుంటారు... ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ప్రియాంకను వరించబోతోందట... గ్లామర్‌తో పాటు యాక్షన్ రోల్స్ కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే ప్రియాంకను బాండ్ గర్ల్‌గా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారట హాలీవుడ్ నిర్మాతలు... ఇదే నిజమైతే ఫస్ట్ ఇండియన్ బాండ్ గర్ల్ ప్రియాంకనే అవుతుంది. మరి ఆ రేర్ ఫీట్ ప్రియాంక సాధిస్తుందేమో చూద్దాం..
entertainment
21,588
01-12-2017 15:40:14
కుంబ్లే కోసం సెలక్టర్లతో యుద్ధం చేశా: గంగూలీ
ముంబై: 2003-04లో ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా జట్టు నుంచి అనిల్ కుంబ్లేను తప్పించాలని సెలక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారట. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడట. జట్టులో కుంబ్లే ఉండాల్సిందేనని తేల్చి చెప్పాడట. అందుకోసం సెలక్టర్లతో చిన్నపాటి యుద్ధమే చేసినట్టు ‘దాదా’ తాజాగా చెప్పుకొచ్చాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గంగూలీ మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘2003లో ఆస్ట్రేలియా టూర్‌కు ముందు సెలక్షన్ కమిటీ మీటింగ్‌కు హాజరయ్యా. నేనప్పుడు కెప్టెన్‌గా ఉన్నా. అనిల్ కుంబ్లేను జట్టులోకి తీసుకునేందుకు సిద్ధంగా లేరన్న విషయం నాకు తెలిసింది. కుంబ్లే మ్యాచ్ విన్నరని, అతడు జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టా’’ అని గంగూలీ గుర్తు చేసుకున్నాడు.  జట్టులో కుంబ్లే లేకుంటే తాను ఆడలేనని కోచ్ జాన్ రైట్‌కు తెగేసి చెప్పానని పేర్కొన్నాడు. పదేళ్లపాటు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కుంబ్లే ఆ సమయంలో ఫామ్ కోల్పోయాడని, అయితే అది తాత్కాలికమేనని తాను భావించానని గంగూలీ వివరించాడు. కుంబ్లేను ఇప్పుడు జట్టు నుంచి తప్పిస్తే ఆయన ఇంకెప్పుడూ భారత్ తరపున ఆడడని రైట్‌కు చెప్పానని, కుంబ్లేను జట్టులోకి తీసుకోకుంటే సెలక్షన్ షీట్‌పై సంతకం పెట్టనని చెప్పానని పేర్కొన్నాడు. దీనికి సెలక్టర్లు తనపై కొంత అసహనంగా చూశారని పేర్కొంటూ.. ‘‘నువ్వు సరిగా ఆడకపోయినా, జట్టు సరైన ప్రదర్శన కనబరచకున్నా, కుంబ్లే సరిగా ఆడకున్నా జట్టు నుంచి మొదట వెళ్లిపోయేది నువ్వే’’ అని సెలక్టర్లు తనను హెచ్చరించారని దాదా గుర్తు చేసుకున్నాడు. దానికి తాను ‘‘సరే మంచిది. రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధం. చూద్దాం ఏం జరుగుతుందో’’ అని వారికి చెప్పానని పేర్కొన్నాడు.  ఆస్ట్రేలియా టూర్‌లో కుంబ్లే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. విజయగర్వంతో గంగూలీ భారత్‌లో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లోనే కాదు.. ఆ ఏడాదంతా కుంబ్లే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 80 వికెట్లు తీసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న స్పిన్నర్‌గా కుంబ్లే రికార్డు సృష్టించాడని గంగూలీ వివరించాడు.  టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఇండియన్ క్రికెటర్ కుంబ్లేనే. 132 మ్యాచుల్లో 619 వికెట్లు తీసుకున్నాడు. న్యూఢిల్లీలో పాక్‌తో జరిగిన టెస్టులో 74 పరుగులిచ్చి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 271 వన్డేల్లో 337 వికెట్లు నేలకూల్చాడు. టీమిండియా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కంటే ముందు కోచ్‌గా పనిచేశాడు.
sports
2,366
04-09-2017 00:14:26
5000 కోట్ల డాలర్ల లీగ్‌లో బిర్లా
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఇటీవల ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ను (ఎబిసిఎల్‌) లిస్టింగ్‌ చేయడంతో ఐదు వేల కోట్ల డాలర్లకు (రూ.3.20 లక్షల కోట్లు) పైబడి మార్కెట్‌ విలువ సాధించిన టాప్‌లీగ్‌లో స్థానం పొందింది. 13,200 కోట్ల డాలర్ల (రూ.8.45 లక్షల కోట్లు) మార్కెట్‌ విలువతో టాటాలే ఈ లీగ్‌లో ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు. టాటా గ్రూప్‌లో 29 లిస్టెడ్‌ కంపెనీలున్నాయి. టాప్‌లీగ్‌లో టాటాల తర్వాత స్థానాల్లో హెచ్‌డిఎ్‌ఫసి గ్రూప్‌ (రూ.7,54,542.26 కోట్లు), రిలయన్స్‌ గ్రూప్‌ (రూ.5,24,011.39 కోట్లు) ఉన్నాయి.  ఎబిసిఎల్‌ లిస్టింగ్‌తో కుమారమంగళం బిర్లా యాజమాన్యంలోని ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఉమ్మడి మార్కెట్‌ విలువ శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 5350 కోట్ల డాలర్లకు (రూ.3,42,354.87 లక్షల కోట్లు) చేరింది. అదే సమయానికి ఈ గ్రూప్‌లోని అల్ర్టాటెక్‌ 1,10,097.70 కోట్లు, గ్రాసిమ్‌ 76,881.73 కోట్లు, హిండాల్కో 54,607.06 కోట్లు, ఐడియా సెల్యులార్‌ 32,064.91 కోట్లు, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ 13,155.73 కోట్లు, ఆదిత్య బిర్లా మనీ 547.71 కోట్ల రూపాయల మార్కెట్‌ విలువతో ఉన్నాయి.
business
18,594
20-09-2017 02:40:09
మీ దేశాన్ని నాశనం చేస్తాం
అమెరికా సహనాన్ని పరీక్షించొద్దుతక్షణం అణు కార్యక్రమాన్ని నిలిపేయాలిఉత్తర కొరియాకు ట్రంప్‌ హెచ్చరికన్యూయార్క్‌, సెప్టెంబరు 19: ఉత్తరకొరియాను సమూలంగా నాశనం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి 72వ సర్వసభ్య సమావేశం మంగళవారం ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి ఈ భేటీకి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగించారు. ఐరాస వేదికపై ఇదే ఆయన తొలి ప్రసంగం. ఈ సందర్భంగా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జంగ్‌ ఉన్‌ను ‘రాకెట్‌ మ్యాన్‌’గా పేర్కొన్న ట్రంప్‌, తక్షణం అణుక్షిపణుల తయారీని నిలిపివేయాలని హెచ్చరించారు. అమెరికా సహనాన్ని పరీక్షించవద్దని హితవు పలికారు.  ఇరాన్‌తో 2015లో అమెరికా చేసుకున్న అణు ఒప్పందం తమ దేశాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేసిందన్నారు. ఉగ్రవాద సంస్థలకు సురక్షిత ప్రాంతాలుగా ఉన్న దేశాలను వెలివేయాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు. అల్‌ కాయిదా, హిజ్‌బుల్‌, తాలిబన్‌ తదితర ఉగ్రసంస్థలకు ఆర్థిక మద్దతు ఇచ్చే దేశాల నిజ స్వరూపాన్ని ప్రపంచ యవనికపై ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులకు మద్దతు పలుకుతోందంటూ పాక్‌పై వారంరోజుల క్రితం ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. కాగా, ఉత్తరకొరియా ఎక్కడ అణు యుద్ధానికి దిగుతదోనని ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచం ఇంత ఆందోళనకు ఎన్నడూ గురి కాలేదన్నారు. ఉత్తరకొరియా అణుపరీక్షల దూకుడు ఆందోళనకు గురి చేస్తోందన్నారు.
nation
2,673
21-09-2017 00:06:13
రూ.5,000 కోట్లు హాంఫట్‌
ట్రాయ్‌ నిర్ణయంపై టెల్కోల విమర్శన్యూఢిల్లీ: ఇంటర్‌ కనెక్షన్‌ చార్జీల (ఐయుసి)ను తగ్గిస్తూ టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్‌’ తీసుకున్న నిర్ణయాన్ని టెలికాం సంస్థల విమర్శించాయి. ఈ నిర్ణయం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం తమ ఆదాయాలకు రూ.5,000 కోట్ల వరకు గండిపడుతుందని ఈ సంస్థలకు ప్రాతినిధ్య వహించే భారత సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం (సిఔఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ చెప్పారు.  ఏ ప్రాతిపదికపై ట్రాయ్‌ ఐయుసి చార్జీలను నిమిషానికి 14 పైసల నుంచి ఆరు పైసలకు తగ్గించిందో చెప్పాలని డిమాం డ్‌ చేశారు. ట్రాయ్‌ పేర్కొన్న విధంగా ప్రస్తుత ఆపరేటర్లందరూ రిలయన్స్‌ జియో మాదిరిగా ఐయుసి కోసం వోల్టే టెక్నాలజీకి మారడం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. అలా మారితే దాదాపు 70 శాతం మంది ఉపయోగిస్తున్న 2జి టెలికాం సేవలు దెబ్బతింటాయని అన్నారు. రిలయన్స్‌ జియోకు మరింత శక్తి ట్రాయ్‌ నిర్ణయంతో కొత్తగా టెలికాం రంగంలోకి దిగిన రిలయన్స్‌ జియోకు మరింత పోటీ సామర్ధ్యం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఐయుసి చార్జీలు తగ్గించడంతో కంపెనీకి దాదాపు రూ.5,000 కోట్లు ఆదా కానున్నాయి. ఈ మొత్తంతో జియో పోటీ కంపెనీలను దెబ్బతీసేలా మరింత ఆకర్షణీయమైన టారిఫ్ లతో కొత్త ఆఫర్లు ప్రకటిస్తుందని భావిస్తున్నారు. 2020నుంచి ఐయుసి చార్జీలు పూర్తిగా రద్దవుతాయన్న ట్రాయ్‌ ప్రకటనా రిలయన్స్‌ జియోకి కలిసొచ్చేదే. ట్రాయ్‌ తాజా నిర్ణయాలతో ఐడియా సెల్యులార్‌ బాగా దెబ్బతినే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా.  మాకేం లాభం లేదు : రిలయన్స్‌ జియోఇంటర్‌ కనెక్షన్‌ చార్జీలు తగ్గించడం తమకు మరింత మేలు చేస్తుందన్న వాదనని రిలయన్స్‌ జియో తోసిపుచ్చింది. నిజానికి 2011లోనే ఈ చార్జీలను రద్దు చేయాల్సి ఉన్నా ట్రాయ్‌ ఈ విషయంలో ఇప్పటికే ఆరేళ్లు ఆలస్యం చేసిందని తెలిపింది. ‘కొత్త ఛార్జీలతో కొత్తగా మాకు చేకూరే ప్రయోజనమేమీ లేదు. మేము ఇప్పటికే మాకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేశాం. ట్రాయ్‌ నిర్ణయంతో మాకు మేలు జరుగుతుందనే ఆరోపణలను తోసిపుచ్చుతున్నాం’ అని ఒక ప్రకటన విడుదల చేసింది.
business
16,210
07-07-2017 15:36:41
గంగా, యమున నదులకు మానవ సమాన హక్కుల ఆదేశంపై.. సుప్రీం స్టే
న్యూఢిల్లీ: గంగా, యమున నదులకు మానవులతో సమానంగా జీవించే హక్కులు కల్పిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశంపై సుప్రీం కోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. భారత్‌లో అతి పెద్ద నదులైన గంగా, యమున కలుషితం కావడంపై మార్చి నెలలో ఉత్తరాఖండ్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆ జీవ నదులను శుభ్రంగా ఉంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గంగా, యమున నదులకు ప్రాణమున్న మానవుల మాదిరి సమాన హక్కుల హోదా కల్పిస్తూ ఆదేశం ఇచ్చింది.  దీంతో ఆ నదులను కలుషితం చేసే వారికి మానవులను బాధించే మాదిరిగా పరిగణించి ఆ మేరకు పరిహారం, శిక్షలు విధిస్తారు. అయితే ఉత్తరాఖండ్ హైకోర్టు జారీ చేసిన ఈ ఆదేశంపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం గంగా, యమున నదులకు ఉత్తరాఖండ్ హైకోర్టు జారీ చేసిన మానవ సమాన హక్కుల ఆదేశంపై స్టే ఇచ్చింది.
nation
11,581
15-02-2017 00:29:16
వేదనిలయం ఇక స్మారక మందిరం!
చెన్నై, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు దివంగత సీఎం జయలలిత నివసించిన పోయెస్‌ గార్డెన్‌లోని ‘వేద నిలయం’ త్వరలోనే స్మారకమందిరం కానుందా? జరుగుతున్న పరిణామాలు, విశ్లేషకుల అభిప్రాయాలను బట్టి అవుననే అనిపిస్తోంది. జయ నెచ్చెలి శశికళ, శశి సోదరుడి భార్య ఇళవరసి ఇన్నాళ్లుగా ఇదే నివాసంలో ఉన్నారు. అయితే అక్రమాస్తుల కేసులో తాజాగా శశికళ, ఇళవరసిలను సుప్రీం కోర్టు దోషులుగా తేల్చి, శిక్షలు ఖరారు చేసింది. దీంతో వారు బెంగళూరు జైలుకు వెళ్లడం ఖాయమైపోవడంతో వేదనిలయ ం ఖాళీ కానుంది. శశికళ భర్త నటరాజన ఈ భవనంలోనే నివసిస్తుండగా, జయ మేనల్లుడు దీపక్‌ అప్పుడప్పుడూ వచ్చి వెళ్తున్నారు. కానీ వారికి ఆ ఇంటిపై ఎలాంటి అధికారం లేదని, పనిమనుషులు కూడా వారిని లెక్క చేయరని సమాచారం. దీంతో అది ఇప్పుడు యజమాని లేని ఇల్లుగా కళతప్పింది.  ఇక వేద నిలయాన్ని స్మారకమందిరం చేయాలన్న డిమాండ్‌తో ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం వారం రోజులుగా సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. దీనికి అన్నాడీఎంకే వర్గాలు, ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ‘‘మా అమ్మ(జయలలిత) నివసించిన వేదనిలయం మాకు మందిరంతో సమానం. ఆ భవనంలో ఇతరులు నివసించేందుకు వీల్లేదు’’ అంటూ అరంతంగి నుంచి వచ్చిన పార్టీ ప్రతినిధి గణేశ్‌ పేర్కొన్నారు. మరోవైపు వేదనిలయాన్ని ఇళవరసి పేరుతో జయ వీలునామా రాసినట్లుగా వార్తలొచ్చాయి. మొత్తంగా తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భవనాన్ని స్మారకమందిరం చేయడం ప్రభుత్వానికి సులభం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అక్రమాస్తుల కేసులో జయ, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌కు సంబంధించి 250కి పైగా ఆస్తులను కోర్టు ఇప్పటికే అటాచ్‌ చేసింది. సుప్రీం తీర్పు వెలువడటంతో అధికారులు వీటిని స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి.
nation
7,034
11-07-2017 09:27:28
విరాట్ కోహ్లీ లవర్‌కి ఆ కేసులో క్లీన్ చిట్
ముంబయి : బాలీవుడ్ ప్రముఖ నటి, క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రియురాలైన అనుష్కశర్మకు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎట్టకేలకు క్లీన్ చిట్ ఇచ్చింది. ముంబయి నగరంలోని వెర్సోవా టవర్ లోని 20వ అంతస్థులోని ఫ్లాట్ లో నివాసముంటున్న అనుష్కశర్మ తన ఫ్లాట్ ముందున్న కామన్ ఏరియాలో పెద్ద ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్సు ఏర్పాటు చేసి, దానికి పది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో చెక్క బాక్సు ఏర్పాటు చేసిందని అదే టవర్ లో నివశిస్తున్న సునీల్ బాత్రా ముంబయి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఇలా కామన్ ఏరియాలో విద్యుత్ జంక్షన్ బాక్సు ఏర్పాటు చేయడం అగ్నిమాపక శాఖ నిబంధనలకు విరుద్దమని సునీల్ బాత్రా మున్సిపల్ అధికారులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ముంబయి మున్సిపల్ అధికారులు మొదట అనుష్క చర్య అభ్యంతరకరమని పేర్కొన్నారు. మళ్లీ రెండు నెలలకే మున్సిపల్ అధికారులు మాట మార్చేశారు. అనుష్క తన ఫ్లాట్ కు చెందిన ప్రదేశంలోనే విద్యుత్ జంక్షన్ బాక్సు ఏర్పాటు చేసుకున్నారని, ఆమె మున్సిపల్ నిబంధనలను అతిక్రమించలేదని అధికారులు తేల్చేసి ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. తన ఫ్లాట్ ముందున్న కామన్ ఏరియా అనుష్కదే కాబట్టి అందులో ఆమె ఇష్టప్రకారం జంక్షన్ బాక్సు ఏర్పాటు చేసుకోవచ్చని తేల్చేశారు. దీంతో అనుష్కపై ఫిర్యాదు చేసిన సునీల్ బాత్రా బీఎంసీ అధికారుల తాజా సమాధానంతో నివ్వెరపోయారు.
entertainment
19,570
11-04-2017 19:48:14
పూణె కెప్టెన్‌గా స్మిత్‌కు బదులు రహానె ఎంట్రీ..
పూణె : ఐపిఎల్ పదో సీజన్‌లో భాగంగా ఈ రోజు రైజింగ్ పూణె సూపర్‌జెయింట్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన పూణె ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలి బ్యాటింగ్ చేయనుంది. అయితే టాస్ వేసేటప్పుడు ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్‌తో పాటు పూణె కెప్టెన్‌గా స్మిత్‌కు బదులుగా రహానే వచ్చాడు. ఈ సందర్భంగా రహానె మాట్లాడుతూ స్మిత్‌కు ఆరోగ్యం బాగోలేదని, కడుపు నెప్పి కారణంగా తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. దీంతో తాను కెప్టెన్‌గా మారాల్సివచ్చిందని రహానె తెలిపాడు. ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ తమ జట్టులో ఒక మార్పు జరిగిందని, కార్లోస్ బ్రాత్‌వైట్ స్థానంలో బౌలర్ అండర్సన్ వచ్చాడని తెలిపాడు. జట్ల వివరాలు..ఢిల్లీ డేర్ డెవిల్స్ : ఆదిత్య తారె, శ్యామ్ బిల్లింగ్స్, కరుణ్ నాయర్, సంజూ శాంమ్సన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కోరీ అండర్సన్, క్రిస్ మోరిస్, ప్యాట్ కమ్మిన్స్, అమిత్ మిశ్రా, షహ్బాజ్ నదీమ్, జహీర్ ఖాన్(కెప్టెన్). రైజింగ్ పూణె సూపర్‌జెయింట్ : అజింక్య రహానె(కెప్టెన్), డు ప్లెసిస్, మయంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, ధోనీ(వికెట్ కీపర్), భాటియా, దీపక్ చహర్, ఆడమ్ జంపా, అశోక్ దిండా, ఇమ్రాన్ తహీర్.
sports
1,335
10-08-2017 02:09:41
ఇన్వెస్టర్లే బకరాలు
డొల్ల కంపెనీల మాయాజాలంముంబై: తిమ్మిని బమ్మిని చేయడం ఇంద్రజాలం. కొంత మంది ప్రమోటర్లు వీరిని మించి పోయారు. తమ టక్కు టమార విద్యలతో పైసాకూ పనికిరాని కంపెనీల షేర్లనూ భారీ ధరలకు ఇన్వెస్టర్లకు అంటగడుతూ ‘లాభాల’ పండగ చేసుకుంటున్నారు. గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఫార్మా, ఫ్లోరీకల్చర్‌, గ్రానైట్‌, అక్వా పేర్లతో అనేక కంపెనీలు మార్కెట్‌కు వచ్చాయి. వాటి ప్రచారాన్ని నమ్మి ఆ కంపెనీల షేర్లు కొన్న ఇన్వెస్టర్లు లబోదిబోమంటూ ఏడుస్తుంటే, ప్రమోటర్లు మాత్రం సైలెంట్‌గా దుకాణాలు ఎత్తేశారు. ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా ఆ కంపెనీల పేర్లు కనిపించవు.  ఆ ఇష్యూల ద్వారా సమీకరించిన వందల కోట్ల నిధులు, ఆస్తులు దర్జాగా ప్రమోటర్ల జేబుల్లోకి చేరిపోయాయి. వారి మాయ మాటలు నమ్మి ఆ ఇష్యూల్లో ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లకు మాత్రం ఏడుపొక్కటే మిగిలింది. ప్రమోటర్లు మోసం గురించి తెలిసినా ప్రభుత్వంగానీ, స్టాక్‌ మార్కెట్‌ వాచ్‌డాగ్‌ సెబిగానీ ఈ బడా కేటుగాళ్లపై ఒక్క చర్య కూడా తీసుకోలేక పోయాయి. భారత స్టాక్‌ మార్కెట్లో ఎప్పటి నుంచో ఈ గూడు పుఠాని నడుస్తోంది. బిజినెస్‌ లేకపోయినా తప్పుడు చిరునామాలు, తప్పుడు రిటర్న్‌లతో ఈ కంపెనీలు ఇప్పటి వరకు నెట్టుకొచ్చాయి. ఇన్వెస్టర్ల అమాయకత్వమే ఈ కంపెనీల ప్రమోటర్లకు శ్రీరామ రక్ష. ఇక్కడ రిటైల్‌ ఇన్వెస్టర్లతో పాటు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వంటి బిగ్‌బుల్‌నీ ఈ కేటుగాళ్లు నమ్మించారంటే, ఈ మోసాల్లో ఎంత ముదిరిపోయారో అర్థం చేసుకోవచ్చు. స్టాక్‌ మార్కెట్లో దీన్నే ‘గ్రేట్‌ ఫూల్‌ థియరీ’ అంటారు.  ఏ మాత్రం ఫండమెంటల్స్‌ లేకపోయినా ఒక కంపెనీ షేర్లను తక్కువ ధరకు కొని, మార్కెట్‌ను ఏదోలా మాయ చేసి మరో ఇన్వెస్టర్‌కు అఽధిక ధరకు అమ్ముకుని భారీ లాభాలు కళ్లజాడడమే గ్రేట్‌ ఫూల్‌ థియరీ. ఇలాంటి కేటుగాళ్లకు ఇటీవల ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లేదా చాట్‌ గ్రూపులు వేదికలుగా మారాయి. కొన్ని బ్రోకరేజ్‌ సంస్థలకూ ఇందులో పాత్ర ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థలు ఈ డొల్ల కంపెనీల షేర్లు ఇన్వె్‌స్టమెంట్‌కు బాగున్నాయి. త్వరగా కొనుక్కోండి అని ఎస్‌ఎంఎ్‌సలు పంపి మరీ కొనిపించినట్టు సమాచారం. అడ్డగోలుగా పెరుగుదల గత జనవరి నుంచి ఈ డొల్ల కంపెనీల్లో కొన్ని కంపెనీల షేర్లు అడ్డగోలుగా పెరిగిపోయాయి. సెబి డొల్ల కంపెనీగా పేర్కొన్న ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేరు ధర ఏకంగా 208 శాతం పెరిగింది. పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌ షేరు ధరా 82 శాతం పెరిగింది. జెకుమార్‌ ఇన్‌ఫ్రా షేరు ధరా 38 శాతం లాభపడింది. ఇప్పుడు సెబి తీసుకున్న చర్యలతో ఈ కంపెనీల షేర్లలో చిక్కుకు పోయిన ఇన్వెస్టర్లు మరిన్ని కష్టాల్లో పడ్డారు. ఇవి డొల్ల కంపెనీలన్న ముద్రతో వీటి ధర మరింత పడిపోయే ప్రమాదం ఏర్పడింది. 31 లక్షల మందిసెబి తాజాగా 331 కంపెనీలు డొల్ల కంపెనీలంటూ ఒక జాబితా విడుదల చేసింది. ఈ కంపెనీల షేర్లలో ట్రేడింగ్‌నూ నెలకు ఒక్క రోజుకే పరిమితం చేయాలని సెబి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లనూ ఆదేశించింది. దీంతో ఈ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్‌ చేసిన 31 లక్షల మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు పెద్ద ఊబిలో కూరుకు పోయారు. ఈ కంపెనీల షేర్ల విలువ ఎంత లేదన్నా రూ.9,000 కోట్ల వరకు ఉం టుందని అంచనా.
business
15,572
14-11-2017 14:22:12
భారత్, బ్రిటన్ పరువు పోరు... గెలుపెవరిదో?
న్యూఢిల్లీ : భారతదేశం, బ్రిటన్ మధ్య పరువు, ప్రతిష్ఠల పోరు జరుగుతోంది. దీనికి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) వేదికగా మారింది. ఐసీజే ఐదో న్యాయమూర్తి ఎన్నిక విషయంలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో సోమవారం ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ది హేగ్‌లోని ఐసీజేలో న్యాయమూర్తిగా తిరిగి ఎన్నిక కావడానికి భారతదేశానికి చెందిన దల్వీర్ భండారీ, బ్రిటన్‌కు చెందిన క్రిస్టఫర్ గ్రీన్‌వుడ్ పోటీ పడుతున్నారు. ఐసీజేలో మొత్తం 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. మూడేళ్ళకోసారి వీరిలో ఐదుగురిని ఎన్నుకుంటారు. వీరి పదవీ కాలం తొమ్మిదేళ్ళు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, భద్రతా మండలిలో వేర్వేరుగా ఏక కాలంలో ఎన్నికలు జరుగుతాయి. గత గురువారం పోటీలో ఉన్న ఆరుగురిలో నలుగురు ఐక్యరాజ్య సమితి చట్టాల ప్రకారం ఎన్నికయ్యారు. వీరు ఫ్రాన్స్, సోమాలియా, బ్రెజిల్, లెబనాన్ దేశాలకు చెందినవారు. చివరిగా ఉన్న ఐదో స్థానానికి జరుగుతున్న ఎన్నిక తీవ్ర రూపం దాల్చింది. ఐసీజేలో శాశ్వతంగా ఉండే ఐదు దేశాల్లో ఒకటి ఈసారి స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉండటమే దీనికి కారణం. బ్రిటన్ 1946 నుంచి ఐసీజేలో ఉంటోంది. సోమవారం రాత్రి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ భారతదేశానికి చెందిన భండారీ అభ్యర్థిత్వంవైపు మొగ్గు చూపింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బ్రిటన్ అభ్యర్థి గ్రీన్‌వుడ్‌కు మద్దతు యథాతథంగా ఉండేలా శాశ్వత 5 దేశాలు చాకచక్యంగా వ్యవహరించాయి. దీంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఐసీజే ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులకు సాధారణ సభతోపాటు భద్రతా మండలిలోకూడా పరిపూర్ణ ఆధిక్యత ఉండాలి. అంటే సాధారణ సభలో 97 ఓట్లు, భద్రతా మండలిలో 8 ఓట్లు రావాలి. ప్రతిష్టంభన నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేశారు.
nation
13,380
25-01-2017 01:46:05
రైతు రుణమాఫీ!
2 లక్షల వరకు వడ్డీలేని రుణం.. అకాలీల వరాల జల్లు! లూధియానా, జనవరి 24: శాసనసభ ఎన్నికల సందర్భంగా పంజాబ్‌ అధికారపక్షం అకాలీదళ్‌ రైతులపై వరాల వర్షం కురిపించింది. చిన్న రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. రైతులకు ఉచిత విద్యుత కొనసాగిస్తామని ప్రకటించింది. పండించిన వరి, గోధుమ పంటకు మద్దతు ధర మీద క్వింటాల్‌కు 100 రూపాయలు అదనంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఇస్తామని తెలిపింది. రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాన్ని పైసా వడ్డీ లేకుండా ఇస్తామని ప్రకటించింది. బోర్లు లేని రైతులకు ఉచితంగా బోర్లు వేస్తామని, 10 గంటల పాటు అంతరాయం లేకుండా కరెంటు ఇస్తామని తెలిపింది. నెరవేర్చిన హామీలు, కొత్త హామీలంటూ మంగళవారం ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ బాదల్‌ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. పది లక్షల మంది యువతకు ఏదో ఒక పనిలో శిక్షణ ఇస్తామని, ఆ తర్వాత స్వయం ఉపాధికి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తామని ప్రకటించారు. 50 వేల మందికి పైసా డౌన్‌ పేమెంట్‌ కట్టకుండా టాక్సీలు కొనిస్తామని తెలిపారు. యువతకు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. పేదలందరికీ ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు, పేదలకు రూ.లక్ష వరకు ఉచిత వైద్యం తదితర హామీలిచ్చారు.2 లక్షల వరకు వడ్డీలేని రుణం.. అకాలీల వరాల జల్లు!
nation
5,385
04-04-2017 20:03:09
క్వీన్ ఆఫ్ యాక్టింగ్‌కి స్వాగతం: అనుపమ్
అతిలోక సుందరి శ్రీదేవిని క్వీన్ ఆఫ్ యాక్టింగ్‌గా అభివర్ణించాడు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. చాలా కాలం తర్వాత ‘మామ్’ అనే సినిమా ద్వారా వెండితెరపై మెరవబోతుంది. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు బాగానే ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఈ ట్రైలర్ తనకెంతగానో నచ్చిందని చెప్పాడు అనుపమ్. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ శ్రీదేవి మళ్లీ తెరపై కనిపించడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతూనే ‘మామ్’ టీజర్‌ లింక్‌ను కూడా షేర్ చేశాడు. 2012లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాలో నటించిన శ్రీదేవి, చివరిసారిగా తమిళ చిత్రం పులిలో నటించింది. అయితే ‘మామ్’ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
entertainment
15,807
05-06-2017 02:32:05
నిర్మాతగా మారుతున్న ‘గాలి’..?
కుమారుడు హీరోగా తెలుగు సినిమాబెంగళూరు, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి తన కుమారుడు కిరీట్‌రెడ్డిని సినిమా హీరో చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సోదరి బ్రాహ్మణి వివాహ సందర్భంగా జరిగిన డ్యాన్స ఈవెంట్‌లో కిరీట్‌రెడ్డి సినిమా తారలతో కలసి స్టెప్పులు వేసి అదరగొట్టాడు. అప్పటి నుంచి సినిమాపై మోజు పెంచుకున్న కిరీట్‌ను టాలీవుడ్‌కు హీరోగా పరిచయం చేసేందుకు ఓ మంచి డైరెక్టర్‌ కోసం గాలి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా నిర్మించనున్నారు. డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం.
nation
2,311
17-11-2017 23:29:38
ప్రాపర్టీ పాతబడిందా.. రీడెవలప్‌మెంట్‌ ఆప్షన్‌ ఉందిగా..
చంద్రశేఖర్‌ తాతగారు 1950ల్లో విజయవాడకు వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో బందర్‌రోడ్‌లో ఆయన స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడా ఇళ్లు పాతబడింది. ఆ ఏరియా కమర్షియల్‌గా బాగా డెవలప్‌ అయింది. ఉన్న ఇంటిని రీడెవలప్‌ చేయగలిగితే నాలుగు డబ్బులు కళ్లజూడవచ్చన్నది చంద్రశేఖర్‌ ఆలోచన. పాత ఇంటిని తీసేసి స్థలాన్ని రీడెవలప్‌ చేయాలంటే అంత ఖర్చు భరించే స్తోమత లేదు. మరేం చేయాలి. స్నేహితులు ఒక మంచి సలహా ఇచ్చారు. చేతిలో పైసా లేకపోయినా, ఎవరైనా బిల్డర్‌తో ఒప్పందం చేసుకొని వారి సాయంతో మన ఆస్తులను ఉమ్మడిగా రీ డెవలప్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఎలాగంటే..ఇంటి యజమాని ఆ ఆస్తిని ఉమ్మడిగా రీడెవలప్‌ చేసేందుకు బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇక్కడ నిర్మాణ ఖర్చులన్నీ బిల్డరే భరిస్తాడు. అందుకు ప్రతిగా ఇంటి స్థలంలో, డెవలప్‌ చేసిన ప్రదేశం లో కొంత వాటా అతడికి ఇవ్వాలి. బిల్డర్‌ అందులో అదనపు ఫ్లోర్‌ లేదా అదనపు నిర్మాణాలు అభివృద్ధి చేసి అమ్ముకుని తన ఖర్చులు, లాభాలు రాబట్టుకుంటాడు. ఇండిపెండెంట్‌ ఇళ్లను మాత్రమే కాదు పాతబడిన అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లను కూడా ఉమ్మడిగా ఇలా జాయింట్‌ డెవల్‌పమెంట్‌ ద్వారా రీడెవలప్‌ చేసుకోవచ్చు. ఒప్పందం చేసుకునేటపుడే అన్ని వివరాలు పక్కాగా ఉండేటట్టు రాసుకోవాలి. ఒప్పందం..ఒక్కోసారి బిల్డర్‌ భూ యజమానులకు ముందుగానే కొంత మొత్తం గుడ్‌విల్‌ కింద చెల్లిస్తారు. రీడెవలప్‌ చేయాల్సిన ప్రాపర్టీ మంచి ప్రైమ్‌ లొకేషన్‌లో ఉంటే బిల్డర్‌ నిర్మాణం ముగిసే వరకు రెంట్‌ కూడా చెల్లించే అవకాశం ఉంది. ముందుగా చెల్లించాల్సిన మొత్తం, నెలనెలా చెల్లించాల్సిన అద్దె, నిర్మాణం పూర్తయ్యాక బిల్డర్‌-భూ యజమానుల పంపకాల నిష్పత్తి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలనూ ఒప్పందంలో పక్కాగా రాసుకోవాలి. ప్రయోజనాలు ఇక్కడ భవనాల యజమానులు పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. పైసా ఖర్చు పెట్టకుండానే జాయింట్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా ప్రస్తుత అవసరాలకు తగ్గ ఇల్లు లేదా ఫ్లాట్‌ లభిస్తుంది. ఇక వృద్ధులకైతే మరిన్ని డబ్బులు చేతికంది ఇతర మలి వయసులో ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం ఏర్పడుతుంది. పన్నులు ఆస్తుల రీడెవలప్‌మెంట్‌తో లాభాలు వస్తే ఐటి చట్టం ప్రకారం పన్నుల భారం తప్పదు. అయితే ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఈ పన్నుల విధానాన్ని ఇంటి యజమానులకు అనుకూలంగా సులభతరం చేశారు.ఇంతకు ముందు ఇందుకు సంబంధించిన లాభనష్టాలను ఆస్తి బదిలీ జరిగిన వెంటనే లెక్కించే వారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రీడెవల్‌పమెంట్‌ ఏ సంవత్సరం పూర్తయితే ఆ సంవత్సరం నుంచే ఈ లాభనష్టాలను లెక్కిస్తున్నారు.ఒకవేళ భూ యజమాని ప్రాజెక్టు రీడెవల్‌పమెంట్‌ పూర్తిగాక ముందే తన హక్కులను బిల్డర్‌కు బదిలీ చేస్తే వచ్చే లాభనష్టాలను ఆ సంవత్సరం నుంచే లెక్కిస్తారు. రిస్కులు - జాగ్రత్తలు రీడెవలప్‌మెంట్‌ పూర్తయ్యేందుకు చాలా కాలం పడుతుంది. ఒక్కోసారి సంవత్సరాలు కూడా పట్టొచ్చు.జాయింట్‌గా రీడెవలప్‌మెంట్‌కు ఇవ్వాలనుకుంటున్న ఇంటిపై అనేక కుటుంబాలకు హక్కు ఉంటే ఆ కుటుంబాలన్నీ అంగీకరించాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది.భవన నిర్మాణంలో ఉపయోగించే సిమెంట్‌, ఇటుకలు, డోర్లు, ఇతరత్రా వస్తువుల నాణ్యత, చెల్లింపుల విషయం ముందుగానే బిల్డర్‌తో మాట్లాడుకుని ఒప్పందంలో పేర్కొనాలి. లేకపోతే తర్వాత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.బిల్డర్‌ పేరు ప్రతిష్ఠలు, సామర్థ్యం, గతంలో ఆ ప్రాంతంలో అతడు చేపట్టిన ప్రాజెక్టులు, వాటి నాణ్యత, సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగిస్తున్నాడా? లేదా? అనే విషయాలూ తెలుసుకోవాలి.అపార్థాలకు తావు లేకుండా రీడెవలప్‌ చేసే భవనం వివరాలను కూడా ఒప్పందంలో పూర్తిగా పేర్కొనాలి.రీడెవలప్‌మెంట్‌ కోసం ఇచ్చే ముందే యజమానులు ఆ ప్రాం తంలో ఉన్న గిరాకీని పరిగణనలోకి తీసుకోవాలి. డిమాండ్‌ బాగుంటే బిల్డర్‌ వెంటనే నిర్మాణం పూర్తి చేసి ఓనర్‌ వాటా ఓనర్‌కు ఇచ్చి తన వాటా తాను తీసుకుని అమ్ముకుంటాడు. డిమాండ్‌ తగ్గితే బిల్డర్‌ నిర్మాణం ఆలస్యం చేసే అవకాశం ఉంది.ఒప్పందం చేసుకునే ముందే మీ హక్కుల పరిరక్షణ కోసం ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ప్రాపర్టీ కేసులు చూసే ఒక మంచి లాయర్‌ను సంప్రదించి అభిప్రాయం తీసుకోవడం మంచిది.రీడెవలప్‌ చేసే భూమిలో బిల్డర్‌ వాటా, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయితే బిల్డర్‌ చెల్లించాల్సిన పెనాల్టీల వివరాలూ ఒప్పందంలో స్పష్టంగా ఉండాలి.రిజిస్టర్డ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ద్వారా బిల్డర్‌ రీడెవల్‌పమెంట్‌ ప్రాపర్టీ ప్రాంగణంలో అడుగు పెట్టేందుకు అనుమతించాలి. కాంట్రాక్ట్‌ షరతులు ఉల్లంఘిస్తే దీన్ని రద్దు చేసేందుకూ అవకాశం ఉండాలి.
business
19,797
19-09-2017 02:16:29
2 సింధు ర్యాంక్‌..!
న్యూఢిల్లీ: కొరియా ఓపెన్‌ టైటిల్‌ సాధించిన ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు.. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో మరోసారి రెండో ర్యాంక్‌కు ఎగబాకనుంది. గురువారం వెలువరించే ప్రపంచ ర్యాంక్‌ల తాజా జాబితాలో నాలుగు నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకోనుంది. చైనా షట్లర్‌ తై జు ఇంగ్‌ 94,409 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. సింధు 81,106 పాయింట్లతో రెండో స్థానంలో ఉండనుంది.
sports
514
27-09-2017 23:21:13
సైయెంట్‌లో యుటిసి వాటా విక్రయం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇంజనీరింగ్‌ సర్వీసుల సంస్థ సైయెంట్‌లో యుటిసి అనుబంధ సంస్థ క్యారియర్‌ ఇంటర్నేషనల్‌ (మారిషస్‌) తన మైనారిటీ ఈక్విటీ వాటాను బుధవారంనాడు విక్రయించింది. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌ 7న ఒకసారి వాటా విక్రయం జరిగిందని, ఇప్పుడు మిగతా వాటాను కూడా విక్రయించినట్టు సైయెంట్‌ తెలిసింది. 2002 సంవత్సరంలో సైయెంట్‌లో యుటిసి మొదటిసారి పెట్టుబడి పెట్టింది.అప్పటి నుంచి కంపెనీ మంచి వృద్ధిని సాధించిందని, యుటిసికి విశ్వసనీయమైన సర్వీసులు అందించినట్టు సైయెంట్‌ సిఇఒ కృష్ణ బోదనపు తెలిపారు. సైయెంట్‌కి యుటిసి వ్యూహాత్మక కస్టమరే కాకుండా పెట్టుబడిదారు కూడా అని ఆయన చెప్పారు. వాటా విక్రయం అనేది కంపెనీ సాధించిన వృద్ధికి నిదర్శనమని ఆయన తెలిపారు.
business
905
06-08-2017 23:00:48
కన్సాలిడేషన్‌లో మార్కెట్‌
నిఫ్టీ గత సోమవారం కీలక స్థాయి 10150 వరకు వెళ్లి సాధించిన మైనర్‌ రియాక్షన్‌లో మరో కీలక స్థాయి 10000 వరకు దిగజారింది. కాని శుక్రవారం చివరికి 10000కన్నా పైనే నిలకడగా ముగిసి తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది. కాని వీక్లీ చార్టుల్లో మార్కెట్‌ వారం మధ్యస్థ స్థాయిలో గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు నడుమ ముగిసింది. ఇది అనిశ్చిత ధోరణిని సూచిస్తోంది. ఈ వారంలో మరింత కన్సాలిడేషన్‌ ఉండవచ్చనేందుకు ఇది సంకేతం. గత వారంలో 10000 పాయింట్ల వద్ద తీవ్రమైన ఆటుపోట్లు కనిపించాయి. పైగా ఈ కీలక స్థాయిని ఛేదించిన తర్వాత బుల్లిష్‌ ధోరణి మందగించడం, చాలా స్టాక్‌లలో కరెక్షన్‌ చోటు చేసుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా ప్రస్తుతం టెక్నికల్‌గా మార్కెట్‌ 10000కన్నా పైనే ఉన్నందు వల్ల రానున్న కొద్ది రోజుల్లో బలం గా కన్సాలిడేషన్‌ సాధించాల్సి ఉంది. బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం కీలక నిరోధ స్థాయి 10100 పైన నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధం 10150. గత వారం ఏర్పడిన ఈ టాప్‌ కన్నా పైన క్లోజయినప్పుడే కొత్త శిఖరాలకు అడుగులు వేయగలుగుతుంది. కరెక్షన్‌ బాట పట్టినా కూడా మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించాలంటే కనీసం రెండు రోజుల పాటు 10000 పైన బలంగా క్లోజ్‌ కావాలి. బేరిష్‌ స్థాయిలు: 10000 వద్ద విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 9900. తక్షణ అప్‌ట్రెండ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇక్కడ రికవరీ తప్పనిసరి. అంతకన్నా దిగువన స్వల్పకాలిక కరెక్షన్‌లో పడుతుంది. - బ్యాంక్‌ నిఫ్టీకి ప్రధాన నిరోధం 25,200. ఇదే గత వారం ఏర్పడిన ప్రధాన గరిష్ఠ స్థాయి. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఆ స్థాయికన్నా పైన బలంగా క్లోజ్‌ కావాలి. మద్దతు స్థాయి 24,500 వద్ద విఫలమైతే స్వల్పకాలిక కరెక్షన్‌ ముప్పులో పడుతుంది. స్వల్పకాలిక వ్యూహం: 10000 పైన మార్కెట్‌ కన్సాలిడేట్‌ అయినప్పుడే తగు స్టాప్‌లాస్ తో స్వల్పకాలిక ట్రేడర్లు స్వల్పకాలిక బై పొజిషన్లు పరిశీలించవచ్చు. 9900కన్నా దిగజారితే స్వల్పకాలిక ఇన్వెస్టర్లు స్వల్పకాలిక బై పొజిషన్లు కొనసాగించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పాటర్న్‌: 10150 వద్ద అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌ వద్ద నిరోధం ఉంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ను కొనసాగించాలంటే ఈ రేఖకన్నా పైన బలంగా క్లోజ్‌ కావాలి. అలాగే ప్రస్తుతం మార్కెట్‌ 9900 వద్ద ఏటవాలుగా కనిపిస్తున్న మరో రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌ పైన ఉంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ రికవరీ తప్పనిసరి. గత వారం ఏర్పడిన బాటమ్‌ 10000కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. 9900 వద్ద ఏటవాలుగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌ వద్ద మద్దతు ఉంది. మార్కెట్‌ ఇప్పటికీ 20 డిఎంఏ కన్నా పైనే ఉంది. అంతకన్నా దిగజారిటే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.  టైమ్‌: ఈ సూచిక ప్రకారం బుధవారం తదుపరి స్వల్పకాలిక రివర్సల్‌ ఉంది. వీక్లీ చార్టుల ప్రకారం ఈ వారంలో ప్రధాన రివర్సల్‌కు ఆస్కారం ఉంది. సోమవారం స్థాయిలివే...నిరోధం : 10100, 10150 మద్దతు: 10040, 9980        వి.సుందర్‌ రాజా,www.sundartrends.in
business
1,455
02-02-2017 23:32:39
ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి సరికొత్త టెక్‌ ఉత్పత్తులు
హైదరాబాద్‌ : కస్టమర్లు, కార్పొరేట్లకు ఎంతగానో ఉపయోగపడే మూడు సరికొత్త టెక్‌ ఉత్పత్తులను ఇండియన్‌ బ్యాంక్‌ ఆవిష్కరించింది. ఇవి ఎంతో ప్రత్యేకమైనవే కాకుండా వీటిని సులభంగా వినియోగించవచ్చని, పర్యావరణానికి అనుకూలంగా వీటి పనితీరు ఉంటుందని బ్యాంకు పేర్కొంది. తమిళనాడు ఎలక్ర్టిసిటీ బోర్డు బిల్‌ పేమెంట్‌ ‘‘ఐబి కస్టమర్‌ మొబైల్‌ యాప్‌’’, నాన్‌ రిసీట్‌ పోర్టల్‌ కోసం ఇండియన్‌ బ్యాంక్‌ పేమెంట్‌ గేట్‌వే, ఇండియన్‌ బ్యాంక్‌ ద్వారా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ పండ్‌ కలెక్షన్స్‌ పేరుతో ఈ కొత్త ఉత్పత్తులను బ్యాంకు తెచ్చింది. వీటిని బ్యాంకు ఎండి, సిఇఒ మహేష్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ రాజీవ్‌ సమక్షంలో బుధవారం బ్యాంకు కార్పొరేట్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంలో భాగంగా ప్రతి నెలా పలు రకాల టెక్నో ఉత్పత్తులను బ్యాంకు విడుదల చేస్తోంది.
business
12,979
05-10-2017 05:06:43
ఆన్‌లైన్‌ వేధింపుల్లో భారత్‌ టాప్‌
న్యూఢిల్లీ, అక్టోబరు 4: ఆసియా పసిఫిక్‌ దేశాల్లోకెల్లా ఆన్‌లైన్‌ వేధింపుల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. నార్టన్‌ సిమాంటెక్‌ సంస్థ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆస్ట్రేలియా, జపాన్‌ కంటే మనదేశంలోనూ ఆన్‌లైన్‌ వేధింపులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిసింది. దేశంలో 1,035 మందిపై సర్వే నిర్వహిచంగా, ప్రతి 10 మందిలో 8 మంది తాము ఆన్‌లైన్‌ వేధింపులకు గురైనట్లు తెలిపారు.
nation
10,579
05-06-2017 17:24:44
ఆయన పేరును ‘గాడ్’ అని సేవ్ చేసుకున్నా: నిఖిల్
ఎప్పుడొచ్చామన్నది కాదు.. ఎప్పుడొచ్చినా కరెక్ట్ ట్రాక్‌లోనే వెళ్లామా..వచ్చామా.. అన్నదే ముఖ్యం. అవును మరి, సినిమా ఇండస్ట్రీలో అయితే పాటించాల్సిన అక్షర సత్యమది. గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో.. ఆ కష్టానికి వచ్చిన ప్రతిఫలాన్ని నిలబెట్టుకునేందుకూ అంతే కష్టపడాలి. హీరో నిఖిల్ విషయంలో ఇదే జరిగింది. నిఖిల్ సినీ ఎంట్రీ ఇచ్చి నేటి పదేళ్లు. పదేళ్ల క్రితం శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నిఖిల్. ఆ సినిమా ద్వారా చాలా మంది కొత్త కుర్రాళ్లు పరిచయమైనా.. నిలదొక్కుకోవడానికి ఇప్పటికీ వాళ్లు ఆరాటపడుతూనే ఉన్నారు. నిఖిల్ కూడా తొలుత సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసినా.. ఆ తర్వాత రూటు మార్చి తనకు తగిన కథలను ఎంచుకుని అందులో సక్సెస్ అయ్యారు. నిజానికి స్వామిరారా సినిమా వరకు నిఖిల్‌ను చాలా వరకు ఫ్లాపులే పలకరించాయి.                  స్వామిరారా చిత్రం నుంచి తన పంథా మార్చి.. కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, తన నటనను ఎప్పటికప్పుడూ మరింత పదును పెడుతూ ప్రేక్షకుల మన్ననలను పొందారు. అప్పటి నుంచి నిఖిల్‌కు హిట్లే. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా నిఖిల్ ఓ చిన్న పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్‌కు తనతో పనిచేసిన డైరెక్టర్లందరినీ ఆహ్వానించారు. కేక్ కట్ చేశారు. ‘‘ఎన్నో సినిమాల ఆడిషన్లకు వెళ్లాను. కానీ, అవకాశాలు తలుపు తట్టలేదు. ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టాలో తెలియక సతమతమవుతున్న రోజుల్లో శేఖర్ కమ్ముల గారు నాకు దేవుడిలా అవకాశం ఇచ్చారు. ఆయన్ను ఎప్పటికీ మరచిపోలేను. అందుకే ఆయన పేరును నా ఫోన్లో ‘శేఖర్ సార్ గాడ్’ అని సేవ్ చేసుకున్నాను’’ అని చెప్పిన నిఖిల్.. శేఖర్ కమ్ములకు ధన్యవాదాలు తెలిపారు. ఇక, ఆడిషన్స్ సమయంలో ఒక్క సీన్‌తోనే నిఖిల్‌ను ఓకే చేశానంటూ శేఖర్ కమ్ముల ఆ నాటి సంఘటనను గుర్తు చేశారు. కాగా, తన ఫేస్‌బుక్ పేజీలోనూ అభినందనలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు నిఖిల్.
entertainment
19,551
05-01-2017 00:43:27
రంజీ ఫైనల్లో గుజరాత్‌
123 రన్స్‌తో జార్ఖండ్‌ చిత్తుబుమ్రాకు 6 వికెట్లు ముంబైపై ముకుంద్‌, ఇంద్రజిత్‌ శతకాలునాగ్‌పూర్‌: ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో గుజరాత్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. జార్ఖండ్‌తో సెమీఫైనల్లో గుజరాత్‌ 123 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి రంజీ చరిత్రలో రెండోసారి ఫైనల్‌బెర్త్‌ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 235 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జార్ఖండ్‌ నాలుగోరోజైన బుధవారం 111 పరుగులకే ఆలౌటైంది. జస్‌ప్రీత్‌ బుమ్రా (6/29), ఆర్పీ సింగ్‌ (3/25) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అంతకుముందు గుజరాత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్‌ 390, జార్ఖండ్‌ 408 రన్స్‌ చేశాయి. ముంబై లక్ష్యం 251: తమిళనాడుతో మరో సెమీస్‌లో 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నాలుగోరోజు ఆటచివరకు వికెట్లేమీ కోల్పోకుండా 5 రన్స్‌ చేసింది. అంతకుముందు ముకుంద్‌ (122), ఇంద్రజిత్‌ (138) రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌ను తమిళనాడు 356/6 వద్ద డిక్లేర్‌ చేసింది. తమిళనాడు బ్యాట్స్‌మెన్‌ పిచ్‌పై పరిగెత్తడంతో 5 రన్స్‌ పెనాల్టీ విధించారు. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 305, ముంబై 411 (406+5) రన్స్‌ చేశాయి. మ్యాచ్‌కు గురువారమే చివరి రోజు.
sports
16,517
12-07-2017 18:50:09
మద్యం వ్యాపారులకు శుభవార్త!
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి 500 మీటర్ల పరిథిలో మద్యం దుకాణాలను నిర్వహించరాదని గతంలో ఇచ్చిన తీర్పు నుంచి మినహాయింపునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ తీర్పునిచ్చింది.  అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాలేనని, మొత్తం ఆదాయంలో సగానికి పైగా ఈ రంగం నుంచే వస్తోందని సుప్రీంకోర్టు గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం 1,011 దుకాణాలు ఉన్నాయని, జాతీయ, రాష్ట్ర రహదారుల నుంచి 500 మీటర్ల పరిథిలో మద్యం దుకాణాలు ఉండకూడదన్న ఆదేశాల ప్రభావం వీటిలో 916 దుకాణాలపై పడుతోందని గమనించి, తాజా తీర్పునిచ్చింది.
nation
1,187
02-01-2017 23:51:52
ప్రథమార్ధం మెరుగు
గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.  డా.భువనగిరి అమరనాథశాస్త్రి
business
6,582
14-10-2017 11:26:23
శివ‌బాలాజీ ‘బిగ్‌’ పార్టీ!
ఇటీవ‌ల బుల్లితెర మీద సంచ‌ల‌నం సృష్టించిన `బిగ్‌బాస్‌`లో విజేత‌గా నిలిచి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు శివ‌బాలాజీ. తెలుగులో బిగ్‌బాస్ సీజన్-1 విజేత‌గా నిల‌వ‌డంతో ఆయ‌న అంద‌రికీ మ‌రింత చేరువ‌య్యాడు. శ‌నివారం శివ‌బాలాజీ జ‌న్మ‌దినం. ఈ నేప‌థ్యంలో శ‌నివారం సాయంత్రం శివ‌బాలాజీ ఓ పెద్ద పార్టీ ఇవ్వ‌నున్నాడు. `బిగ్‌బాస్‌` షోలో పార్టిసిపేట్ చేసిన వారికి, త‌న స‌న్నిహితులకు శివ‌బాలాజీ ఓ భారీ పార్టీ ఇస్తున్నాడు.
entertainment
4,468
08-02-2017 03:29:02
ఆటోల మీటర్లు పనిచేయవా?
జంట నగరాల ఆటోల మీటర్లు పనిచేయవా? చేసినా వాటి ధరకి రారా? గతంలో రిక్షాలతో బేరమాడి వెళ్లేవారు. నేడు ఆటోలది అదే పరిస్థితి. వీటిపై రాష్ట్ర రవాణా, పోలీస్‌ శాఖల ప్రమేయం శూన్యమేనా? పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. పెరిగినపుడు రేట్లు పెంచుతున్నారు కానీ, తగ్గినపుడు ఒక్కపైసా తగ్గించరు! ఇక నుంచి రాబోయే ఆటో మీటర్లలో కేవలం దూరం మాత్రమే చూపేటట్లు ఉంటే మీటర్ల ఖరీదు గణనీయంగా తగ్గిపోతుంది. పెట్రోలు, గ్యాస్‌, డీజిల్ రేట్లు పెరిగినా, తగ్గినా, కిలోమీటర్‌కి ఒక రేటు నిర్ణయించి, ఆ చార్ట్‌ అన్ని పత్రికలో ప్రచురించాలి. ఆ చార్ట్‌ను ప్రతీ ఆటోలో పెట్టుకోవాలి. చార్టు ప్రకారం ప్రయాణీకులు మీటర్‌ చూపించే దూరాన్ని బట్టి చెల్లిస్తే ఇటు ఆటో వాళ్ళకి అటు ప్రయాణీకులకు న్యాయం చేసిన వారవుతారు. తక్షణం పోలీస్‌ శాఖ కానీ, రవాణా శాఖ కానీ ఈ చర్యకు పూనుకోవాలి.సీవీఆర్‌ కృష్ణ, హైదరాబాద్‌
editorial
13,668
18-01-2017 13:11:46
రాహుల్ కుర్తా ఎలా చిరిగింది?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... సోషల్ మీడియాలో తరచూ నెటిజన్ల కన్ను ఆయనమీదే పడుతుంటుంది. ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘నా కుర్తా జేబు చిరిగిపోయింది. అయినా నాకది పెద్ద విషయం కాదు.. అయితే మోదీజీ చిరిగిన బట్టలు వేసుకోవడం మీరెప్పటికీ చూడలేరు. పేద పక్షాన పోరాడతున్నానని చెబుతూ ఆయన రాజకీయాలు చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. అంతే సందు దొరకడం ఆలస్యం రాహుల్ గాంధీపై ట్విటర్లో జోకులు మోతమోగిపోయాయి. ఇటీవల రాహుల్ గాంధీ చిన్నపాటి విదేశీ పర్యటనకు వెళ్లివచ్చిన సంగతి ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదనీ.. సుదీర్ఘ చరిత్రగల నెహ్రూ-గాంధీల కుటుంబానికి ఏకైక వారసుడైన ఆయనకు కుర్తాలకేం కరువొచ్చిందని ట్విటర్ పక్షులు ప్రశ్నించాయి. మొన్నామధ్య రాహుల్ గాంధీ మోదీపై ‘సూటు బూటు సర్కారు’ విసిరిన అస్త్రం బాగానే పేలినప్పటికీ... స్వయంగా చిరిగిన కుర్తా వేసుకునిమరీ పేదరికంపై చేసిన వ్యాఖ్యలు మాత్రం తిరిగి ఆయన వైపేవస్తున్నాయి. ‘‘ కొత్త కుర్తా కొనుక్కోడానికి డబ్బుల్లేవుగానీ, సంతోషంగా విదేశీ టూర్లు తిరిగి రావడానికి మాత్రం ఉన్నాయా? డ్రామాలు చాలు ఊరుకోండి..’’ అని ఓ యువతి ట్వీట్ చేయగా.. ‘‘రాహుల్ గాంధీకి కుర్తా కొనేందుకు డబ్బుల్లేవట... పాత కుర్తా వేసుకుని తిరుగడం బాలేదు.. మనమంతా తలో రూపాయి సాయం చేద్దాం రండి..’’ అని మరో యువకుడు ట్వీట్ చేశాడు. ‘‘డియర్ రాహుల్ సర్... ఈ ప్రత్యేక విమానంలో వచ్చేటప్పుడు మీ కుర్తా చిరిగిపోయిందా?’’ అని ఫోటోతో సహా పెట్టిన మరో పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది.
nation
14,751
11-04-2017 12:21:18
పాక్‌కు సుష్మా స్వరాజ్ ఘాటు హెచ్చరిక
న్యూఢిల్లీ : కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్ అక్రమంగా శిక్ష విధించడంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా స్పందించారు. రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ కుల్‌భూషణ్ జాదవ్ తప్పు చేసినట్లు రుజువు చేసే సాక్ష్యాధారాలేవీ లేవని స్పష్టం చేశారు. ఆయనకు మరణ శిక్ష విధించడం ముందుగా ప్రణాళిక రచించి హత్య చేయడమేనని ఆరోపించారు. ఈ విషయంలో మరింత ముందుకెళ్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జరిగే పర్యవసానాలను పరిశీలించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హాస్యాస్పదమైన విచారణ జరిపి, శిక్ష విధించారని పాక్‌పై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టులో కుల్‌భూషణ్‌కు బలమైన న్యాయ సహాయం అందజేయవలసిన అవసరం ఉందన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఆయనకు న్యాయం జరిగేలా చేసేందుకు కొత్త మార్గాల్లో ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.
nation
4,615
15-06-2017 00:30:02
అవే నా చివరి సినిమాలు.. అంతా తూఛ్‌..!
- మనోజ్‌సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌లతో హీరో మంచు మనోజ్‌ అందరికీ షాక్‌నిచ్చారు. త్వరలో విడుదల కానున్న ‘ఒక్కడు మిగిలాడు’, దాని తర్వాత చేస్తున్న మరో సినిమా నటుడిగా తన చివరి సినిమాలంటూ బుధవారం ఉదయాన్నే తన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాల త్వారా ఆయన ప్రకటించడంతో కలకలం రేగింది. సినీ వర్గాలతో పాటు సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వాళ్లు దిగ్ర్భాంతికి గురయ్యారు. కారణం ఏమిటంటూ ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు రిప్లైల ద్వారా దాడి చేయడంతో తనదైన శైలిలో అదంతా తన తర్వాతి సినిమా ప్రకటనలో భాగంగా చేశానంటూ తేల్చేశారు! ‘‘నా పోస్ట్‌కు మీడియా స్నేహితుల నుంచి ఈ స్థాయి స్పందన/విమర్శ వస్తుందని ఊహించలేదు. అందరూ నిజంగా భిన్నంగా అర్థం చేసుకున్నారు! నాదైన శైలిలో నా తర్వాతి సినిమా గురించి ప్రకటించాలని అలా ప్లాన చేశాను. కానీ అది సరైన దారిలో వెళ్లలేదు. రేపు నా తర్వాతి సినిమా గురించి అధికారికంగా ప్రకటించాలంటే ఇవాళ్టి వేడి చల్లారాలి. ఓం శాంతి’’ అని మధ్యాహ్నం సోషల్‌ మీడియాలో ఆయన పోస్ట్‌ చేశారు. దీంతో అందరూ హాయిగా నవ్వేసుకున్నారు. మొత్తానికి కొద్ది గంటల సేపు అందరూ తన గురించి మాట్లాడుకొనేలా చేశారు మనోజ్‌.
entertainment
11,571
13-11-2017 20:10:28
చిక్కుల్లో హార్దిక్.. సెక్స్‌ సీడీ బయటకు...
న్యూఢిల్లీ: పటేళ్ల రిజర్వేషన్ పోరాట నేత హార్దిక్ పటేల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన ఉన్నట్టుగా చెబుతున్న ఓ సెక్స్ సీడీ బయటకు వచ్చింది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ...అదికూడా కాంగ్రెస్‌కు ఆయన చేరువవుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ సీడీ వెలుగుచూడటం సంచలనమైంది. ఒక మహిళతో యువకుడు రసపట్టులో ఉన్నట్టు కనిపిస్తున్న ఈ వీడియోపై....మే 16న తీసినట్టు టైమ్ స్టాంప్ కూడా ఉంది. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అచ్చం హార్థిక్ పటేల్‌లానే ఉండటంతో ఈ సీడీ ఆయనదేనంటూ కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. మురికి రాజకీయాలు....మురికి రాజకీయాలు ఎంతపనైనా చేయిస్తాయని, అలాంటి మురికి రాజకీయాలే ఇప్పుడు మొదలయ్యాయని హార్దిక్ పటేల్ 'సెక్స్ సీడీ' పై తన స్పందన తెలిపారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు, గుజరాత్ మహిళల ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగుతున్న ప్రయత్నమిదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. లైంగిక సామర్థ్యం నాలో లోపించలేదు. దిగజారుడు రాజకీయాలను బీజేపీ మానుకోవడం మంచిది. నాపై బురద చల్లేందుకు బీజేపీ సెక్స్ సీడీని విడుదల చేస్తుందని ఇంతకుముందే నేను చెప్పాను. ఇలాంటి మరింత మేత కూడా వారు రిలీజ్ చేయొచ్చు. హార్దిక్ పటేల్ పవర్ ఏమిటో బీజేపీకి తెలుసు కాబట్టే ఇలాంటి దిగజారుడుకు పాల్పడుతోంది' అంటూ హార్దిక్ మండిపడ్డారు. దేశం బయట నుంచే ఈ మార్ఫింగ్ సీడీని అప్‌లోడ్ చేసుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
nation
19,900
03-10-2017 02:00:40
ఫిట్‌నెస్‌ టెస్టులో రైనా, మిశ్రా ఫెయిల్‌!
కోల్‌కతా: ఓ వైపు ఆటగాళ్లంతా జాతీయ జట్టులో స్థానం కోసం పోటీపడుతుంటే డాషింగ్‌ లెఫ్టాండర్‌ సురేష్‌ రైనా, లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా మాత్రం భారత్‌-ఎ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. ఫిట్‌నెస్‌ కారణంగా రైనా, మిశ్రాలను భారత్‌-ఎ టీమ్‌కు ఎంపిక కా లేదు. న్యూజిలాండ్‌-ఎతో వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత్‌-ఎ జట్టును సెలెక్టర్లు సోమవారం ప్రక టించారు. ఫిట్‌నెస్‌ ప్రమాణాలను అందుకోలేక పోయిన రైనా, మిశ్రాలను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇప్పటికే చానాళ్లుగా జాతీయ జ ట్టుకు దూరంగా ఉంటున్న ఈ ఇద్దరి పరిస్థితి ఇ లాగే కొనసాగితే కెరీర్‌ ముగిసే ప్రమాదం లేకపోలేదు.
sports
619
11-01-2017 23:52:37
ముందున్నది ముసుళ్ల పండుగ
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును అతిపెద్ద విపత్తుగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభివర్ణించారు. నోట్ల రద్దు దుష్పలితాలను ఆర్థిక రంగం త్వరలోనే చవి చూస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పెద్ద నోట్ల రద్దుపై ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. నోట్ల రద్దు వల్ల పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయనీ మరింత చేటుకాలం ముందున్నదని ఆయన చెప్పారు. పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నట్టు ప్రధాని మోదీ చేస్తున్న ప్రకటనలను డొల్లమాటలుగా ఆయన కొట్టివేశారు. జిడిపి వృద్ధి రేటు తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.  ఈ సమావేశంలో మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కూడా మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న రోజు కేబినెట్‌ సమావేశానికి సంబంధించిన రికార్డులే లేవని చిదంబరం ఆక్షేపించారు. దేశ చరిత్రలో నోట్ల రద్దు వంటి ప్రహసనం మునుపెన్నడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌బిఐ ప్రతిష్ట కూడా ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ఆర్‌బిఐకి మధ్య విభేదాలు ఉంటాయనీ, అయితే ఆర్‌బిఐని ప్రభుత్వ శాఖగా గతంలో ఏ ప్రభుత్వం కూడా భావించలేదని చిదంబరం దుయ్యబట్టారు. జిడిపి ఒకశాతం తగ్గినా దేశానికి 1.5 లక్షల కోట్ల రూపాయలు నష్టమని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దును ప్రభుత్వం నల్లధనంపై యుద్ధంగా చెప్పుకున్నదనీ, రద్దయిన నోట్లన్నీ బ్యాంకుల్లోకి వచ్చినందున ఇందులో నల్లధనం ఎంతో చెప్పాలని చిదంబరం డిమాండ్‌ చేశారు. నల్లధనం గురించి ప్రభుత్వం అతిగా చేసిన ప్రచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీసిందని ఆయన వ్యాఖ్యానించారు. నగదు రహిత వ్యవస్థ ప్రతిపాదనను కూడా తీవ్రంగా ఆక్షేపించారు. నగదు వాడాలా కార్డు ఉపయోగించాలా అన్నది ప్రజలు వ్యక్తిగత ఇష్టమని అన్నారు. నల్లధనంపై పోరు అంటున్న ప్రధాని, ఈ సారి ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో క్యాపిటేషన్‌ ఫీజులను నివారిస్తారా అని చిదంబరం సవాలు విసిరారు.
business
7,021
12-06-2017 13:32:48
పైసావసూల్‌లో ఎన్టీఆర్ సాంగ్ రీమిక్స్!
గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక విజయం తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో బాలయ్య సినిమా అనగానే నందమూరి అభిమానుల్లో ఏమూలో టెన్షన్. గత రెండు మూడు సినిమాల నుంచి ఫ్లాపులనే ఎదుర్కొంటున్న పూరీతో బాలయ్య సినిమా చేస్తున్నాడేంటి..? అని అభిమానులు ఏ మూలో అనుమానాలు పెట్టుకున్నారు. అయితే.. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను పూరీ విడుదల చేయడంతో అభిమానులు కాస్తంత రిలాక్స్ అయ్యారు. టైటిల్ వెరైటీగా ఉన్నా.. బాలయ్య ఎనర్జీతో నందమూరి అభిమానులు ఫిదా అయ్యారు.           తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అలనాటి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) సినిమాలోని ఓ పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారట. ఈ విషయాన్ని బాలయ్య వెల్లడించారు. అయితే.. ఆ పాట గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఎన్టీఆర్ జీవితచక్రం సినిమాలోని ‘కంటి చూపు చెబుతోంది.. కొంటె నవ్వు చెబుతోంది.. మూగమనసులో మాట ఓ పిల్లా..’ అనే పాటను రీమిక్స్ చేశామని ఆయన వెల్లడించారు. ఆ పాట అందరికీ నచ్చుతుందని అన్నారు. ఇక, ఈ సినిమాలో తొలిసారిగా తాను పాడిన పాట కూడా అభిమానులను అలరిస్తుందని చెప్పుకొచ్చారాయన.
entertainment
17,141
19-04-2017 02:37:01
తమిళ రాజకీయం: కథ ముగిసింది!.. వెత మిగిలింది
కథ ముగిసింది!.. వెత మిగిలింది. ‘అమ్మ’ లేని అన్నాడీఎంకేపై మన్నార్గుడి మాఫియా పడగనీడ పరిసమాప్తమైంది. శశికళ శకం మొదలయ్యీ కాకముందే ముగిసిపోయింది. తమిళనాట మొన్నటిదాకా వర్గాలుగా విడిపోయి తలపడిన సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఒక్కటయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను, ఆమె జైలుకు పోతూ పోతూ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించిన ‘అక్క కుమారుడు’ దినకరన్‌కూ చుక్కలు చూపించారు. దినకరన్‌ కుటుంబం మొత్తాన్ని... అంటే శశికళతో సహా అందరినీ పార్టీ నుంచి బహిష్కరించారు. బహిష్కరణ తీర్మానంలో శశికళ పేరు లేనప్పటికీ... ఉన్నట్లే! బెంగళూరు జైలులో ఉన్న ఆమె ప్రభావం పార్టీపై ఇక పూర్తిగా సున్నా! పళనిస్వామి ఇప్పటికే సీఎంగా ఉండగా... పార్టీ పదవిలో పన్నీర్‌సెల్వం స్థిరపడేందుకు రంగం సిద్ధమవుతోంది! చెన్నై, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌లను పార్టీ నుంచి వెలి వేశారు. వారి కుటుంబాలను పార్టీ, ప్రభుత్వం నుంచి పక్కన పెడుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పళని స్వామి అధ్యక్షతన ఆయన నివాసంలో మంగళవారం రాత్రి 9.45 గంటలకు జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, 122 మంది ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, పార్టీ నిర్వాహకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్నాడీఎంకేతోపాటు ఆ పార్టీ అధికారిక ఎన్నికల చిహ్నమైన రెండాకులను స్తంభింపజేయడానికి కారణాలు, గుర్తును తిరిగి కైవసం చేసుకునే అంశాలపై సమావేశంలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అనంతరం సమావేశ వివరాలను సీనియర్‌ మంత్రి జయకుమార్‌ విలేకరులకు వెల్లడించారు.  పార్టీతోపాటు పాలనలో దినకరన్‌, ఆయన కుటుంబ సభ్యులను పూర్తిగా పక్కనబెట్టాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నిర్వాహకులతోపాటు కోటిన్నర మంది కార్యకర్తల మనోగతం ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. ‘‘దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని పూర్తిగా పక్కనబెట్టి పార్టీని రక్షించుకునేందుకు నేతలమంతా ఐక్యంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాం. జయలలిత స్వర్ణయుగ పాలన కేవలం ఈ నాలుగు నెలలు మాత్రమే కాకుండా, భవిష్యత్‌లో కూడా కొనసాగాలన్న బలమైన ఆకాంక్షతో ఆ ఒక్క కుటుంబాన్ని దూరంగా పెట్టాలని నిర్ణయించాం. తద్వారా పార్టీని కాపాడుకుంటూ ఎన్నికల చిహ్నమైన రెండాకులను స్వాధీనం చేసుకుని ముందుకు సాగుతాం’’ అని ఆయన ప్రకటించారు.  శశికళ పేరును మంత్రి ప్రస్తావించక పోవడం గమనార్హం. పార్టీకి కొత్తగా ప్రధాన కార్యదర్శిని నియమిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. పార్టీని నడిపించేందుకు త్వరలోనే ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పన్నీర్‌ సెల్వం వర్గం నేతలు చర్చలకు వస్తే ఏ క్షణమైనా సిద్ధంగా ఉన్నామన్నారు. దినకరన్‌ వెలిని ఎమ్మెల్యే వెట్రివేల్‌ ఒక్కరే వ్యతిరేకిస్తున్నారని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని కొట్టిపారేశారు.  మంగళవారం ఉదయం నుంచీ తమిళనాట రాజకీయ పరిణామాలు అత్యంత నాటకీయంగా జరిగాయి. బెంగళూరు జైల్లో ఉన్న శశికళతో మాట్లాడేందుకు వెళ్లిన దినకరన్.. మంగళవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో చెన్నైకి చేరుకున్నారు. వచ్చీ రావడంతోనే తన సన్నిహితులతో మంతనాలు జరిపారు. తన గైర్హాజరీలో ఏం జరిగిందంటూ తెల్లవారే వరకూ ఆరా తీశారు. అనంతరం ఉదయం 9.30 గంటలకే విలీన కార్యాచరణ కమిటీ దినకరన్ ఇంటికి వెళ్లింది. రాత్రి నుంచీ జరిగిన చర్చల సారాంశాన్ని వివరించింది. ‘పార్టీకి మీరు రాజీనామా చేస్తారా? లేక పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి మమ్మల్నే తప్పించమంటారా?’ అంటూ కమిటీ సభ్యులు ప్రశ్నించారు.  దీంతో దినకరన్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చినట్లు సమాచారం. ‘‘నాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే, నా ఆదేశాలు లేకుండానే ఎందుకు సమావేశం నిర్వహించాల్సి వచ్చింది? అడిగిన వారందరికీ మంత్రి పదవులు ఇచ్చి, అన్ని కోర్కెలూ తీరుస్తున్నా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఆ సమావేశానికి ఎవరు నేతృత్వం వహించారు? ఎందుకు చేయాల్సి వచ్చింది?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తప్పించి ఆ పదవిని పన్నీర్‌ సెల్వంకు ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా ఆయన మండిపడినట్లు సమాచారం. ‘‘మమ్మల్నే పార్టీ నుంచి తీసేస్తారా? అంత ధైర్యముందా? పార్టీ అంటే ఏంటో తెలుసా? ఎలా నడపాలో తెలిసిన వారెవరు? ఇప్పుడు కొత్తగా మీకు కొమ్ములు మొలుచుకు వచ్చాయా? ఎమ్మెల్యేల్లో అధిక భాగం మావారే. ఆ విషయం మరచి మాట్లాడుతున్నారా?’’ అంటూ దినకరన్‌ శివాలెత్తినట్లు తెలిసింది.  తమను బయటకు గెంటి, ఓపీఎస్‌ను దరి చేర్చుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే వెంటనే తుడిచేయాలని, అంతదాకా వస్తే ఏం చేయడానికైనా తాను వెనకాడబోనని ఆయన తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దాంతో, ‘‘ఇది అందరి అభిప్రాయం. పార్టీ అభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. పరిణామాలు చేయి దాటే వరకూ ఆలస్యం చేయకుండా మీరే రాజీనామా చేస్తే మంచిదన్నది అందరి అభిప్రాయం. లేకుంటే..’’ అంటూ మంత్రులు దినకరన్‌కు అర్థమయ్యేలా వివరించారు. దాంతో ఆయన మౌనం దాల్చినట్లు తెలిసింది. ఎంతసేపటికీ ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో మంత్రులు బయటికి వచ్చేశారు. నేరుగా సచివాలయానికి వెళ్లి జరిగిన విషయం సీఎంకు వివరించినట్లు సమాచారం. ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం అర్ధరాత్రి వరకూ మంత్రి తంగమణి నివాసంలో చర్చలు జరిపిన 26 మంది మంత్రులు.. ఓపీఎస్‌ బృందంతో విలీన చర్చలకు సీఎం ఎడప్పాడి నేతృత్వంలో 9 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మంగళవారం ఉదయం ఎడప్పాడి నివాసంలో ఆయనతో భేటీ అయింది. చర్చల సారాంశాన్ని వివరించింది. రాజీనామాకు శశికళ అంగీకరించకపోతే, దినకరన్‌ను  బయటకు పంపి, ఓపీఎస్‌ వర్గానికి మూడు మంత్రి పదవులు ఇద్దామని ఎడప్పాడి తన మనసులోని మాట చెప్పినట్లు సమాచారం. మంత్రుల చర్చల సారాంశాన్ని దినకరనకు చెప్పి ఆయన్ను ఒప్పించాలని సూచించారు. దాంతో, అక్కడి నుంచి ఆ కమిటీ దినకరన్‌తో చర్చలకు వెళ్లింది. అక్కడి నుంచి వచ్చి సమావేశ వివరాలను సీఎంకు వివరించింది. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలూ విలీన చర్చలు ప్రారంభించాలంటే తొలుత శశికళ కుటుంబాన్ని అన్నాడీఎంకే నుంచి బహిష్కరించాల్సిందేనని మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం షరతు విధించారు. శశి కుటుంబం చేతిలో పార్టీ పగ్గాలు ఉండడానికి వీల్లేదన్నారు. అమ్మ జయ కూడా ఆ కుటుంబాన్ని పార్టీ నుంచి గెంటేశారని, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోనన్న హామీతోనే శశికళ మళ్లీ జయ వద్దకు వచ్చారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే, పన్నీరు వర్గంతో చర్చలకు ప్రాతిపదికను సిద్ధం చేయడానికి వీలుగా దినకరన్‌పై వేటు వేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.  నిజానికి, అన్నాడీఎంకే నిబంధనల ప్రకారం, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి నుంచి ఎవరినైనా పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ తొలగించగలరు. ఆ పదవిలో ఉన్న మధుసూదనన్‌ను తొలగించి తన విశ్వాసపాత్రుడు సెంగోట్టియ్యన్‌ను శశికళ ఆ పదవిలో నియమించారు. మారిన పరిణామాల్లో సెంగోట్టియ్యన్‌ కూడా ఎడప్పాడి వర్గంతో చేతులు కలిపారు. ఆయన ఒక్క ప్రకటనతో శశికళను, దినకరన్‌ను తొలగించగలరు. అయితే, మంగళవారం ఉదయం చర్చలకు వెళ్లినప్పుడు జిల్లా కార్యదర్శులు లేకుండా కేవలం మంత్రులు తమ బహిష్కరణపై ఎలా నిర్ణయం తీసుకుంటారని దినకరన్‌ ప్రశ్నించారు.  ఈ నేపథ్యంలోనే, సీఎం నివాసంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, పార్టీ నిర్వాహకులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వివరించాయి. ఈ నిర్ణయాన్ని పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుందని, ఈ మేరకు పన్నీరు సెల్వం పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
nation
21,194
04-01-2017 02:44:59
మిథాలీకే టీమిండియా పగ్గాలు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల ప్రపంచ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో 14 మంది సభ్యుల భారత బృందాన్ని మిథాలీ రాజ్‌ నడిపించనుంది. ఈ టోర్నీలో మిథాలీని కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఫిబ్రవరి 3 నుంచి 21 వరకు అర్హత మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్‌-ఎలో ఆతిథ్య శ్రీలంక, ఐర్లాండ్‌, జింబాబ్వే, థాయ్‌లాండ్‌తో భారత తలపడనుంది. ఇక గ్రూప్‌-బిలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, పపువా న్యూగినియా ఉన్నాయి. గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి.
sports
7,443
01-08-2017 22:44:19
కిరీటం కాదు.. కృతజ్ఞత
సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా బి.వి.ఎస్.రవి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జవాన్‌’. ‘ఇంటికొక్కడు’ అన్నది ఉపశీర్షిక. మెహరీన్‌ కథానాయిక. దిల్‌ రాజు సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌ పతాకంపై కృష్ణ నిర్మిస్తున్నారు. తమిళ నటుడు ప్రసన్న కీలక పాత్రధారుడు. సోమవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు మనోధైర్యంతో, బుద్ధిబలంలో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్న కథతో రూపొందుతున్న సినిమా ఇది. దేశానికి జవాన్‌ ఎంత అవసరమో.. ప్రతి ఇంట్లో జవాన్‌లాంటి కుర్రాడి అవసరం ఉందని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. ‘కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు... కృతజ్ఞత’’ అంటూ సాగే డైలాగ్‌తో విడుదల చేసిన టీజర్‌కు స్పందన బావుంది. కమర్షియల్‌ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.
entertainment
17,101
15-11-2017 11:51:27
ఆర్మీ రెజిమెంట్‌పై తీవ్రవాదుల మెరుపుదాడి
న్యూఢిల్లీ: ఆర్మీ రెజిమెంట్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగడంతో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ తీవ్రవాది హతమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇవాళ తెల్లవారు జామున మణిపూర్‌లోని చందేల్ జిల్లా సాజిక్ తంపాక్‌లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో 4-అస్సాం రెఫిల్స్‌కి చెందిన సైనికులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు చమోలీ టాప్ వద్దనున్న రెజిమెంట్‌పై మెరుపుదాడికి దిగారు. ఇద్దరు సైనికులను పొట్టనబెట్టుకున్నారు. అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదులను నిలువరించేందుకు భారీ ఎన్‌కౌంటర్ ప్రారంభించారు. ఇప్పటికే ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా... మిగతా ఉగ్రవాదుల పనిపట్టేందుకు భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఘటనా స్థలంలో మృతిచెందిన ఉగ్రవాది నుంచి ఓ ఏకే47తో పాటు రెండు రెండు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు.
nation
15,583
11-06-2017 17:56:31
పోలీస్‌ అధికారిపై.. ఉగ్రవాదుల కాల్పులు
శ్రీనగర్: ఓ పోలీస్ అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఇమామ్ సాహెబ్ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీస్ క్యాంప్ సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.  స్పెషల్ పోలీస్ అధికారి ఖుర్షీద్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి వెంటనే రంగంలోకి దిగిన జవాన్లు ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు.
nation
19,186
05-05-2017 09:37:10
ఎమ్మెల్యేల టూర్‌‌కు బ్రేక్ వేసిన స్పీకర్..
ఆంధ్రజ్యోతి, బెంగళూరు: ఎమ్మెల్యేలు ఉత్తర భారత్‌‌లో సందర్శించేందుకై వెళ్లదలచిన పర్యటనకు స్పీకర్‌ కె.బి.కోళివాడ బ్రేక్‌ వేశాడు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు వెంటాడుతున్న తరుణంలో ఎమ్మెల్యే లు విహార, అవగాహన యాత్రలు చేయడం సమంజసం కాదని స్పీకర్‌ కొట్టిపారేశారు. ఈ నెల 9 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు 8 రోజుల పాటు ఉత్తర భారతకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తొలత స్పీకర్‌ సుముఖత వ్యక్తం చే సినా సీఎం ఇది సరైన సమయం కాదని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో స్పీకర్‌ గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యేల పర్యాటకానికి బ్రేక్‌ పెట్టారు.  రానున్న శాసనసభ సమావేశా ల్లో చర్చించాక ఎమ్మెల్యేల పర్యటనకు నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు ఎటువంటి విహార యాత్రలు ఉండవని స్పష్టం చేశా రు. ఎమ్మెల్యేలు దినేష్‌ గుండూరావ్‌, బసవరాజ పాటిల్‌ బీఎస్‌ పాటిల్‌ నడహళ్ళి హంపయ్య, ఎంకే సోమశేఖ ర్‌, సురే్‌షగౌడ, బి.ఎన.విజయ్‌కుమార్‌, రవిసుబ్రమణ్య, ఎస్‌.రఘు, మల్లిఖార్జున కూబా, హారాడి శ్రీనివాస శెట్టి, కె.బి.ప్రన్న కుమార్‌, కేబీ శాణప్ప, సోమణ్ణ బేవినమరద, ఎం.నారాయణ స్వామి, కాంతరాజులతో కలిపి పర్యటనకు సిద్దయ్యామన్నారు.
nation
14,667
25-10-2017 10:34:57
నేను చెప్పిన వాళ్లకే టిక్కెట్లు ఇవ్వాలి...!
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే పాటీదార్ వర్గీయుల ఓట్లపై కన్నేసిన కాంగ్రెస్ ‌ముందు పాటీదార్ కోటా నేత హార్దిక్ పటేల్ పలు డిమాండ్ల చిట్టా ఉంచినట్టు తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటే తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలనేది ఆయన ప్రధాన డిమాండ్లలో ఒకటిగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోటా (రిజర్వేషన్) ప్రయోజనాలను పాటీదార్ కులానికి వర్తింపజేయాలని, పాటీదార్ ఉద్యమ సమయంలో అకృత్యాలకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, నాటి హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని హార్దిక్ డిమాండ్లలో ఉన్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి అశోక్ గెహ్లాట్‌ ముందు ఆయన ఈ డిమాండ్లు ఉంచారు. గత సోమవారం సాయంత్రం ఇక్కడి ఓ హొటల్‌లో గెగ్లాట్‌ను హార్దిక్ కలుసుకున్నారు. గుజరాత్ ప్రచారం కోసం వచ్చిన రాహుల్‌ను కూడా హార్దిక్ కలుసుకోవాల్సి ఉన్నప్పటికీ కారణాంతరాల వల్ల వారి సమావేశం రద్దయింది. తమ డిమాండ్లకు తగిన హామీ లభించిన తర్వాతే రాహుల్‌ను కలుసుకోవాలని హార్దిక్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, తాను ఎంపిక చేసిన వ్యక్తులకే టిక్కెట్లు ఇవ్వాలన్న హార్దిక్ డిమాండ్‌ ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పాటీదార్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాటిదార్ అభ్యర్థులను, అదికూడా కాంగ్రెస్‌కు చెందిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయంగా ఆయన తెలిపారు. బయట వ్యక్తులు ఎంపిక చేసిన వారిని అభ్యర్థులుగా నిలబెడితే వారు ఎన్నికైన తర్వాత ప్రత్యర్థి పార్టీకి విధేయత చూపించే అవకాశాలుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాను చెప్పిన వాళ్లకే టిక్కెట్లు ఇవ్వాలన్న హార్దిక్ పటేల్ డిమాండ్‌పై వ్యాఖ్యానించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ దోషి నిరాకరించారు.
nation
3,411
11-12-2017 00:15:34
సిట్టిగువ్వ
రాయిమీదా రాయిగొట్టీరాజుకున్నా నిప్పుబట్టివంటజేసే కంటిపాపాలేడికూనా తోడురాన అచ్చనాలా పిల్లనవ్వూమచ్చలేవీ మల్లెపువ్వుకచ్చకాయా పొదలనీడాఅచ్చిపోయే గాలిజాడ అడవిదొండా తీగసాలూఆకుసోకూ ఊయలూగువెన్నుపూసా ఎండుటేకూజుంటితేనే జున్నుపాలు ఏటిగట్టూ ఎదురుకొయ్యాపొద్దుపొడుపూ మద్దిమానుగడ్డిపూలా బొడ్డుతాడూజువ్విసెట్టూ జీవరాసి కాలిమువ్వా నేలనవ్వాపాలకంకీ రేలపాటగూడెమంచూ గుట్టమీదాపచ్చబొట్టూ పసుపుతాడు కాటికంటీ సీకటమ్మాకన్నుగీటే పూలరెమ్మసల్లగాలి సరసమాడామొండిమానూ మండేనెగడు నింగినేలా సంఘమాలానీలికళ్లా చేపపిల్లబుగ్గమీదా పంటికాటూబుజ్జగించా సిగ్గుమొగ్గ కొండకోనా కోరికమ్మాకక్కడాలూ మొక్కడాలుజొన్నసేలా మన్నుబువ్వాసింతకాయా ఎంతమాయ పుట్టవోలే పొట్టపెరిగేఒట్టుతల్లీ కట్టుజారేతట్టుకోనీ పురిటినొప్పీసిట్టిగువ్వా పుట్టెనవ్వా  అందెశ్రీ
editorial
382
05-11-2017 23:38:36
10,500 పైన మరింత అప్‌ట్రెండ్‌
నిఫ్టీ గత వారం అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ కీలక నిరోధం 10500 వరకు వెళ్లి చివరికి 10452 వద్ద ముగిసింది. ఇది సానుకూలత సంకేతం. 9700 స్థాయి నుంచి ఇండెక్స్‌ బలమైన ర్యాలీ సాధించి పెద్ద కరెక్షన్‌ ఏదీ లేకుండా 750 పాయింట్ల వరకు లాభపడింది. 10500 వద్ద స్వల్ప అప్రమత్త ట్రెండ్‌, నిరోధం ఎదుర్కొంటోంది. బుల్లిష్‌ స్థాయిలు...మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమిస్తే 10500 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ మరింతగా కొనసాగాలంటే ఈ స్థాయి కన్నా పైన బలంగా క్లోజ్‌ కావాలి. అప్పుడు మార్కెట్‌ మరో కొత్త పరిధిలోకి ప్రవేశిస్తుంది. ఆ పైన ఉన్నవన్నీ మానసిక అవధులే.  బేరిష్‌ స్థాయిలు...10500 వద్ద విఫలమైతే స్వల్పకాలిక కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంటుంది. కరెక్షన్‌లో పడితే ప్రధాన మద్దతు స్థాయి 10350. ఇది గత వారం ఏర్పడిన మైనర్‌ బాటమ్‌. ఇక్కడ రికవరీ తప్పనిసరి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. దిగువ టార్గెట్లు 10250, 10000. బ్యాంక్‌ నిఫ్టీ 25200 వద్ద మూడు నెలలుగా ఎదుర్కొంటున్న నిరోధాన్ని ఛేదించి 25650 వద్ద పటిష్ఠంగా ముగిసింది. ఈ ప్రధాన బ్రేకౌట్‌ వల్ల పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌కు ఆస్కారం ఉంది. స్వల్పకాలిక పొజిషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రధాన నిరోధం 26000. ప్రధాన మద్దతు స్థాయి 25400. అంతకన్నా దిగజారితే దిగువ టార్గెట్‌ 25000.స్వల్పకాలిక వ్యూహం : 10350 కన్నా దిగువన గట్టి స్టాప్‌లా్‌సతో స్వల్పకాలిక ఇన్వెస్టర్లు స్వల్పకాలిక బై పొజిషన్లు కొనసాగించవచ్చు. మద్దతు స్థాయిల్లో కరెక్షన్‌ తర్వాతమే మరిన్ని బై పొజిషన్లు పరిశీలించడం శ్రేయస్కరం. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్‌ ఎగువకే ఉన్నా ఓవర్‌బాట్‌ స్థితి ఏర్పడినందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలి.పాటర్న్‌ : 10500 వద్ద అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌ వద్ద స్వల్పకాలిక నిరోధం ఎదురు కావచ్చు. 45 డిగ్రీల కోణంలో ఎగువకు కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌ కన్నా ప్రస్తుతం నిఫ్టీ పైన ఉంది. 10350 వద్ద అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌ కన్నా దిగువకు వస్తే స్వల్పకాలిక బలహీనతలో ప్రవేశిస్తుంది. మార్కెట్‌ ఇప్పటికీ 20, 50 డిఎంఏల కన్నా పైన ఉండడం పాజిటివ్‌ సంకేతం.టైమ్‌: ఈ సూచి ప్రకారం సోమవారం మైనర్‌ రివర్సల్‌ ఉంది. సోమవారం స్థాయిలివే...నిరోధం: 10500, 10600మద్దతు : 10420,10350బజాజ్‌ ఫైనాన్స్‌ (రూ.1841) - కొనుగోలు స్థాయిలకు చేరువలో..రూ.1840 ఎగువన అప్‌ట్రెండ్‌ మొదటి నిరోధం రూ.1910 రెండో నిరోధం రూ.1980రూ.1820 దిగువన డౌన్‌ట్రెండ్‌ మొదటి మద్దతు రూ.1770 రెండో మద్దతు రూ.1720వి.సుందర్‌ రాజా, www.sundartrends.in
business
7,559
25-07-2017 09:31:41
బాబాయ్ రాజకీయ జీవితం కోసం రామ్ చరణ్ త్యాగం!
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో సంక్రాతికల్లా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పవన్ భావిస్తున్నారు. ఈ సినిమా పవన్ కల్యాణ్ రాజకీయ జీవితానికి చాలా ముఖ్యమైనది. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న జనసేనకు ఈ సినిమా జవసత్వాలు అందించే అవకాశం ఉన్నట్లు పవన్ అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి చక్కటి అవుట్‌పుట్‌తో ప్రేక్షకులకు అందించేలా చూడాలని త్రివిక్రమ్‌కు పవన్ సూచించారు. అయితే సినిమా విడుదల ఎప్పుడనే విషయాన్ని చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు. దీంతో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ సందిగ్ధంలో పడ్డాడు. సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ను సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించారు. అయితే పవన్ సినిమా సంక్రాంతికి వస్తుందన్న ఊహాగానాలు రావడంతో రామ్ చరణ్ ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ బాబాయ్ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తామని చెబితే తన సినిమాను ముందుగానే క్రిస్మస్‌కు రిలీజ్ చెయ్యాలని దర్శకనిర్మాతలను చరణ్ కోరుతున్నాడట. బాబాయ్ రాజకీయ జీవితానికి ఈ సినిమా ఎంతో ప్రధానమని, అటువంటి సినిమాతో తనకు క్లాష్ వద్దని చరణ్ భావిస్తున్నాడట. తెలుగు సినిమాల విడుదలక పెట్టింది పేరైన సంక్రాంతి సీజన్‌ను బాబాయ్ కోసం త్యాగం చేస్తున్నాడట చరణ్. రామ్ చరణ్ నిర్ణయంపై అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మెగా హీరోల మధ్య క్లాష్ ఉండకూడదని, చరణ్ మంచి నిర్ణయం తీసుకున్నారని అభిమానులు అభినందిస్తున్నారట. గతేడాది కూడా తన తండ్రి సినిమా ‘ఖైదీ నంబర్ 150’ కోసం ధృవ సినిమాను చరణ్ డిసెంబర్‌లోనే విడుదల చేసిన విషయం విధితమే.
entertainment
6,525
04-11-2017 22:38:25
సినీ ‘భయో’గ్రఫీలు!
ఆత్మకథ రాయడానికి అనుభవం, అర్హత ఉండాలా?.. ఆత్మకథల్లో వాస్తవాలను వక్రీకరించవచ్చా?.. ఒకవేళ వక్రీకరిస్తే నవాజుద్దీన్‌ సిద్ధిఖీలా తిప్పలు తప్పవా?.. ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ‘యాన్‌ ఆర్డినరీ లైఫ్‌’ పుస్తకంలో అసలు ఏముంది...?  సినీరంగంలో ఉన్నదున్నట్లుగా మాట్లాడేవారు చాలా అరుదు. అతిశయోక్తులు కలిపి చెప్పేవారే ఎక్కువ. తారలు రాసే ఆత్మకథల్లోనూ ఇది కనిపిస్తుంది. జరిగింది జరిగినట్లుగా రాసి, తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని స్మూత్‌గా ఆత్మకథలు రాసేసే వాళ్లు కొందరైతే, తమ జీవితచరిత్రనే పుస్తకంగా రాసేసి, అన్నీ తమకు అనుకూలంగా మార్చుకొని, తాము చేసిన చెడ్డపనిని కూడా ఎదుటివారి మీద రుద్దేసి తాము మాత్రమే మంచివారని ప్రూవ్‌ చేసుకోవడానికి తాపత్రయపడే రకం మరికొంతమంది, ఉన్నవీ లేనివీ కల్పించి ఆత్మకథలు తయారు చేసేవాళ్లు ఇంకొంతమంది. నటుడు నవాజుద్దీన్‌ సిద్ధికీ వీటిలో ఏ కోవకు చెందుతాడో కానీ ఆయన ఆత్మకథ ‘యాన్‌ ఆర్డినరీ లైఫ్‌’ పుస్తకం మాత్రం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైంది. నవాజ్‌ మనసులో భావాలకు రచయిత్రి రీతూపర్ణ ఛటర్జీ అక్షర రూపం ఇచ్చారు. అక్టోబర్‌ 16న ఈ పుస్తకం విడుదలైనప్పుడు జనం అంతగా పట్టించుకోలేదు కానీ వారం రోజుల తర్వాత పుస్తకంలోని కొన్ని భాగాలు మీడియాలో రావడంతో గొడవ మొదలైంది. ఈ ఆత్మకథలో మాజీ మిస్‌ ఇండియా, నటి నిహారికా సింగ్‌, స్టేజ్‌ ఆర్టిస్ట్‌ సునీతా రాజ్వర్‌, మరికొందరు మహిళలతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఎటువంటి మొహమాటమూ లేకుండా రాసేశారు నవాజుద్దీన్‌. ‘నా అనుమతి లేకుండా నా గురించి నీ పుస్తకంలో రాస్తావా?’ అని నిహారిక ఓ పక్క, ‘నవాజ్‌ రాసినవన్నీ అబద్ధాలే’ అని సునీత మరో పక్క కారాలూ మిరియాలూ నూరారు. , ఢిల్లీలో ఉండే లాయర్‌ ఏకంగా ఓ అడుగు ముందుకేసి జాతీయ మహిళా కమిషన్‌లో కేసు పెట్టాడు. ‘ తన రాతల వల్ల ఓ వివాహిత జీవితం నాశనమవుతుందన్న స్పృహ కూడా లేకుండా నవాజుద్దీన్‌ ఈ పని చేశాడు. కేవలం డబ్బు కోసం, పబ్లిసిటీ కోసం ఆయన కక్కుర్తి పడి ఇలా చేశాడనుకోవచ్చు’ అని ఆ లాయర్‌ పత్రికల వారికీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదంతా చూసి నవాజ్‌ హడలిపోయాడు. ‘తప్పయిపోయింది బాబోయ్‌’ అని లెంపలు వేసుకొని ‘ నా పుస్తకంలోని కొన్ని అంశాలు. కొంతమందికి మనస్థాపం కలిగించాయని తెలిసింది. వారికి క్షమాపణలు చెబుతూ మార్కెట్‌ నుంచి పుస్తకాన్ని వెనక్కి తీసుకొంటున్నాను’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు నవాజ్‌. ఇలా మార్కెట్‌లోకి వచ్చిన ఆత్మకథను వెనక్కి తీసుకోవడం ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో ఇదేనేమో! ఎవరీ నవాజుద్దీన్‌?ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం బుధానాలో పుట్టి పెరిగిన 43 ఏళ్ల నవాజుద్దీన్‌ సిద్ధికీ నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో శిక్షణ పొందారు. ఆ తర్వాత ముంబై వచ్చి కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు కానీ అవేమీ అతనికి బ్రేక్‌ ఇవ్వలేదు. నవాజ్‌ అంటే ఎవరో అందరికీ తెలిసింది ‘కహానీ’ (2012) చిత్రంతోనే ఆ సినిమాలో షార్ట్‌ టెంపర్‌ ఉన్న ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా నటించాడు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం కలగలేదు. . ‘మిస్‌ లవ్‌లీ’ (2012)లో తొలిసారిగా మెయిన్‌ రోల్‌ పోషించాడు. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఆ తర్వాత ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వస్సేపూర్‌ ‘లంచ్‌ బాక్స్‌’, ‘బ్లాక్‌ ఫ్రైడే’, ‘బాజీరావ్‌ మస్తానీ’ వంటి చిత్రాల్లో నవాజ్‌ సహజమైన నటనకు జనం ఫిదా అయ్యారు . అటువంటి వాడు ఆత్మకథ కారణంగా ఇప్పుడు విమర్శల్లో ఇరుక్కుపోయాడు. ‘యాన్‌ ఆర్డినరీ లైఫ్‌’ పుస్తకంలో వివాదానికి కారణమైన కొన్ని అంశాలు: తొలి గర్ల్‌ఫ్రెండ్‌ సునీతా రాజ్వర్‌ముంబైలో ఒక నాటకం ప్రదర్శిస్తున్పప్పుడు పరిచయమైన సునీత అందించిన అనుభవాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. నేనంటే ఆమెకు ఎంతో ఇష్టం. ప్రతి రోజూ ఆమె మీరా రోడ్‌లో ఉన్న మా ఇంటికి వచ్చేసేది. ఆ రోజుల్లో ప్రేమికుల పేర్లు గోడల మీద రాసుకోవడం ఒక అలవాటు కనుక ఆమె కూడా మా ఇద్దరి పేర్లు గోడల మీద రాసేది. కొన్ని రోజుల తర్వాత ఆమె తన వాళ్లని చూడటానికి ఊరెళ్లింది. అప్పుడు ఏమయిందో ఏమో కానీ ఊరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాతో మాట్లాడటం మానేసింది. ఫోస్‌ చేస్తే తీసేది కాదు. ఒకసారి నేను గట్టిగా నిలదీసి అడిగేసరికి ‘నవాజ్‌! నీ కెరీర్‌ మీద నువ్వు దృష్టి పెట్టు.. నా కెరీర్‌ గురించి నేను ఆలోచించుకుంటాను’ అంది సింపుల్‌గా. అంతలా నాతో సన్నిహితంగా తిరిగిన వ్యక్తి ఇలా అనేసరికి తట్టుకోలేక నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ కోపంతో ఓ బకెట్‌ తెల్ల రంగు తీసుకువచ్చి గోడల మీద ఆమె రాసిన పేర్లని తుడిచేశాను. రెండో గర్ల్‌ఫ్రెండ్‌ సుజానే సుజానే . న్యూజెర్సీకి చెందిన అందమైన యువతి. అమెరికాలో పరిచయమైంది. మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత నన్ను వదిలి ఉండలేక ముంబైకి వచ్చేసి నాతో పాటే ఉండేది. కొన్ని నెలలు ఉన్న తర్వాత వీసా గడువు పూర్తి కావడంతో దాన్ని పొడిగించుకుంది. అప్పుడే ‘మిస్‌ లవ్‌లీ’ షూటింగ్‌ మొదలైంది. నాతో పాటు షూటింగ్‌కు వచ్చేది. చాలా సరదాగా ఉండేవాళ్లం. పొడిగించిన గడువు కూడా పూర్తవడంతో ఆమె అమెరికా వెళ్లిపోయింది. నిహారికతో నా పరిచయం‘మిస్‌ లవ్‌లీ’ షూటింగ్‌లో నిహారిక నాకు పరిచయమైంది. మా ఇద్దరి మధ్య చనువు ఏర్పడిన తర్వాత ఓ రోజు రాత్రి ఇంటికి డిన్నర్‌కు రమ్మని పిలిచింది. నేను వెళ్లాను. తలుపు తట్టగానే అందమైన దేవత నా ఎదురుగా నిలుచున్నట్లనిపించి నోట మాటరాలేదు. ఆమె వేసుకొన్న డ్రస్‌ చూడగానే గుండె లయ తప్పింది. పల్లెటూరి మొరటివాడిని కావడంతో ఇక ఏమీ ఆలోచించకుండా ఆమెని అమాంతం నా చేతుల్లోకి ఎత్తుకొని సరాసరి బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లాను. ఆమెతో శృంగారం జరిపాను. నిహారిక కూడా నాకు అడ్డు చెప్పలేదు. ఆ రోజు నుంచి దాదాపు సంవత్సరన్నర పాటు మా అనుబంధం కొనసాగింది. ఇలా ఆనందంగా రోజులు గడుస్తున్న తరుణంలో అంతవరకూ దూరంగా, మౌనంగా ఉన్న సుజానే నుంచి మెయిల్స్‌ రావడం మొదలైంది. ‘‘అప్పుడే నన్ను మరిచిపోయావా? నాకు ఎందుకు మెయిల్‌ చెయ్యడం లేదు, ఏమైంది నీకు నవాజ్‌’ అని ఆమె మొయిల్స్‌ పెట్టేది. కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉంటేనే సమాధానం దొరుకుతుందని ఆమెకి రిప్లయి ఇచ్చేవాడిని కాదు. ఒకరోజు నేను మెయిల్‌ బాక్స్‌ చెక్‌ చేస్తుంటే సుజానే మెయిల్స్‌ నిహారిక కంటబడ్డాయి. ‘ఎవరీమె’ అని నన్ను నిలదీసింది. ‘ఆమె ఎవరో నీకూ తెలుసు.. సుజానే’ అని చెప్పాను. వెంటనే నిహారిక కళ్లు పెద్దవి చేసి ‘ఓహో.. మీ ఇద్దరి మధ్య ఇంకా వ్యవహారం నడుస్తోందన్న మాట .నువ్వు చేస్తున్నది చాలా తప్పు’ అంది కోపంగా. ఆ రోజు నుంచి సుజానే మెయిల్స్‌కి తనే రిప్లయి ఇచ్చేది. ‘నీతో నేను కంటిన్యూ కాలేను. నన్ను మరిచిపో’ అని నా పేరుతో మొయిల్‌ చేసేది. అది చూసి సుజానే బాగా బాధ పడిందనుకుంటా.. రకరకాలుగా మెయిల్స్‌ ఇచ్చేది. కొన్నాళ్లకి మెయిల్‌ చేసేది నేను కాదనీ ఎవరో లేడీ అని సుజానేకి అర్థమై పోయిందనుకుంటా.. ‘ఎవరు మెయిల్‌ చేస్తున్నారు నవాజ్‌!.. ఆమె ఎవరు’ అని అడిగేది. నేను రిప్లయి ఇవ్వకపోవడంతో సుజానే మెయిల్స్‌ ఇవ్వడం మానేసింది. నాకు బాధనిపించింది కానీ సర్దుకున్నాను. నిహారికాతోనే కొనసాగాలని నిర్ణయించుకొన్నాను. భార్యే ఆ సలహా ఇచ్చిందితన ఆత్మకథ ఇంత సంచలనం సృష్టిస్తుందని నవాజుద్దీన్‌ అసలు ఊహించలేదు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని తల పట్టుకొని కూర్చుంటే, జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోవడం అసాధ్యం కనుక వెంటనే క్షమాపణలు చెప్పి, ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకొంటున్నట్లు ప్రకటించమని నవాజుద్దీన్‌ భార్య అంజలి సలహా ఇచ్చింది. భార్య ఇచ్చిన సలహా దివ్యంగా ఉండటంతో ఆ పనే చేశాడు నవాజుద్దీన్‌. తెలుగులో కూడాతెలుగులో తారలు రాసే ఆత్మకథల సంఖ్య తక్కువ. వాటిల్లో వివాదాప్సద అంశాలు తక్కువ. అయితే సీనియర్‌ నిర్మాత ఎమ్మెస్‌ రెడ్డి నాలుగేళ్ల క్రితం ‘ ఇదీ నా కథ’ పేరుతో రాసిన ఆత్మకథ మాత్రం పరిశ్రమలో అగ్గి రాజేసింది. అందులో సీనియర్‌ ఎన్టీఆర్‌, , సీనియర్‌ నటి జమున, జూనియర్‌ ఎన్టీఆర్‌ , దర్శకుడు గుణశేఖర్‌ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయి. అవి వారి ఇమేజ్‌ని దెబ్బతీసే విధంగా ఉండటంతో ఎమ్మెస్‌ రెడ్డి తనయుడు శ్యాంప్రసాద్‌ రెడ్డి ఆ పుస్తకాలు మార్కెట్‌లో దొరకకుండా చేశారు. అయితే అప్పటికే కొంతమంది ఆ పుస్తకాలు కొనుకొన్నారు. ఎమ్మెస్‌ రెడ్డి మరణానంతరం ‘ఇది నా కథ’ పుస్తకానికి బాగా డిమాండ్‌ పెరిగింది. చాలా మంది ఈ పుస్తకాన్ని కొనడానికి ట్రై చేశారు. దాంతో అంతకుముందు దాన్ని కొన్నవాళ్లు కొన్ని కాపీలు తయారు చేసి పది వేల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకొన్నారంటారు. మురారి ఆత్మకథ సంచలనంతెలుగులో ఇటీవలి కాలంలో విడుదలైన ఆత్మకథల్లో ‘యువచిత్ర’ అధినేత కె.మురారి రాసిన ‘నవ్విపోదురు గాక..’ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. వాస్తవాలను వక్రీకరించకుండా తన జీవితంలో జరిగిన సంఘటనలను నిర్మొహమాటంగా రాశారు మురారి. ఎంతోమందిని ఆకట్టుకొన్న ఈ పుస్తకం కొంతమంది భుజాలు తడుముకొనేలా చేసిందన్నది మాత్రం వాస్తవం.
entertainment
942
09-04-2017 23:31:51
త్వరలో బ్యాంకింగ్‌ ఉద్యోగుల వేతన సవరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎస్‌బి) సిబ్బంది త్వరలో మరో విడత వేతన సవరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన చర్చలను ఈ ఏడాది నవంబర్‌లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం పిఎస్‌బిల యాజమాన్యాలను కోరింది. వీలైనంత త్వరగా ఈ చర్చలు పూర్తయితే నవంబర్‌ నుంచి కొత్త వేతన ఒప్పందాన్ని అమలు చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరు బ్యాంకులు ఎస్‌బిఐలో విలీనం తర్వాత ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 21 బ్యాంకులున్నాయి. 2012 నుంచి అమలవుతున్న వేతన ఒప్పందం ఈ సంవత్సరం అక్టోబర్‌తో ముగుస్తుంది.
business
1,470
23-03-2017 23:36:21
ప్యాకేజింగ్‌లో బిటెక్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్యాకేజింగ్‌కు ప్రాధాన్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్యాకేజింగ్‌లోనూ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నట్టు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ (ఐఐపి) డైరెక్టర్‌ ఎన్‌సి సాహ తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే యుజిసి నుంచి గుర్తింపును పొందనున్నట్టు ఆయన చెప్పారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది నుంచి కోర్సును ప్రారంభిస్తామని, తొలి బ్యాచ్‌లో 70-80 మంది వరకు విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.  ముంబైలోని తమ సెంటర్‌లో ఈ బిటెక్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. రానున్న కాలంలో ఎంటెక్‌ ప్రోగ్రా మ్‌, పిహెచ్‌డి ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సనత నగర్‌లో ఉన్న సెంటర్‌ స్థలం తమ అవసరాలకు సరిపోవడం లేదని, దీన్ని విస్తరించేందుకు అవసరమైన ఐదెకరాల స్థలం కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సెంటర్‌లో పిజి డిప్లొమా కోర్సును ఆఫర్‌ చేస్తున్నామని, రెండేళ్ల కాలానికి 35 మంది ఇందులో చేరుతున్నారని తెలిపారు. గురువారంనాడిక్కడ ‘ఇన్నో విజన్‌ ఇన్‌ ప్యాకేజింగ్‌’ జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా సాహ విలేకరులతో మాట్లాడారు.  విస్తరణలో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్‌, గువహతి, కాకినాడలో సెంటర్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఎగుమతికి అవకాశం ఉన్న 500 ఉత్పత్తులకు సంబంధించిన ప్యాకేజింగ్‌ ప్రమాణాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కోరిందని, ఇప్పటికే ఈ పనిని మొదలుపెట్టినట్టు ఆయన తెలిపారు. 28 పళ్లకు సంబంధించిన ప్యాకేజింగ్‌ ప్రమాణాలను ఇప్పటివరకు అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం దేశీయ ప్యాకేజింగ్‌ మార్కె ట్‌ పరిమాణం 2,800 కోట్ల డాలర్లు ఉందని తెలిపారు. 2020నాటికి ఇది 3,200 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.హైదరాబాద్‌ సెంటర్‌ విస్తరణకు అవసరమైన స్థలానికి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తామని ఐఐపి ప్రాంతీయ చైర్మన్‌ వాగిష్‌ దీక్షిత తెలిపారు.
business
10,084
10-02-2017 17:20:43
అదిరిపోయే స్టెప్పులేసిన మాధురీ దీక్షిత్...
1990లో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘థానేదార్’ మూవీ గుర్తుందా..? అందులో మాధురీ దీక్షిత్ అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారు మతిపోగొట్టిన సాంగ్ ‘తమ్మా తమ్మా’ సాంగ్. తమ్మా తమ్మా సాంగ్ అప్పుడే కాదు.. ఇప్పుడూ సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తుంటుంది. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నామంటే... కరణ్ జోహార్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, అలియా భట్ నటీనటులుగా వస్తున్న ‘బద్రీనాథ్ కి దుల్హానియా’ సినిమాలో ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. అయితే ఈ పాట ద్వారా కుర్రకారు మతిపోగొట్టిన మాధురీ దీక్షిత్ వద్దకు డ్యాన్స్ పాఠాలు నేర్చుకోవడానికి వరుణ్, అలియా భట్ వెళ్లారు. దీంతో మాధురీ ఆ పాటకు సంబంధించి కొన్ని స్టెప్పులు వేసి చూపించారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 1990లో ఎలా అయితే తన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసిందో... నేటికీ అదే హుషారుతో స్పెప్పులేసి అదరగొట్టింది మాధురీ దీక్షిత్. మరోవైపు మాధురీ స్టెప్పులు చూసి అలియా భట్ అవాక్కైపోయింది.
entertainment
83
02-03-2017 00:12:48
కొత్త కుబేరులు ఏటా 1000 మంది
భారత్ జోరు న్యూఢిల్లీ : భారత్‌లో రానున్న పదేళ్ల కాలంలో ఏటా వెయ్యి మంది అమిత సంపన్నులు కుబేరుల జాబితాలో చేరబోతున్నారని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ వెల్త్‌ తెలిపింది. ప్రపంచంలోని కోటీశ్వరుల్లో రెండు శాతం (1.36 కోట్లు), కుబేరుల్లో ఐదు శాతం (2024) మంది ప్రస్తుతం భారతలో ఉన్నారని ఆ సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. 2015, 2016 సంవత్సరాల మధ్య కాలంలో అమిత సంపన్నుల సంఖ్య భారతలో 12 శాతం మేరకు పెరిగిందని, వచ్చే ఏడాది కాలంలో ఇది 150 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. 89 దేశాల్లోని 125 నగరాల్లో అమిత సంపన్నుల జనాభాలో వృద్ధిని నైట్‌ఫ్రాంక్‌ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. గత దశాబ్దిలో భారతలో అమిత సంపన్నుల సంఖ్య 290 శాతం పెరిగినట్టు ఆ నివేదికలో తెలిపింది. 2016 సంవత్సరంలో అమిత సంపన్నుల వృద్ధిరేటులో భారత ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్నదని, వారి వృద్ధి లో ప్రస్తుత జోరు కొనసాగినట్టయితే వచ్చే దశాబ్ది కాలంలో భారత మూడో స్థానానికి చేరిపోతుందని కూడా పేర్కొంది. ప్రపంచంలోని 900 ప్రైవేటు బ్యాంకింగ్‌ సంస్థలు, వెల్త్‌ అడ్వైజర్ల నుంచి అందిన గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. నగరాల వారీ గణాంకాలు పరిశీలిస్తే 1,340 మంది అమిత సంపన్నులతో ముంబై అగ్రస్థానంలో ఉండగా ఢిల్లీ (680), కోల్‌కతా (280), హైదరాబాద్‌ (260) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వెల్త్‌ ఇండెక్స్‌లో 21వ స్థానం ఆక్రమించిన ముంబై..టొరంటో, వాషింగ్టన్‌ డిసి, మాస్కోలకన్నా ముందుంది. అలాగే ఢిల్లీ 35వ ర్యాంక్‌తో బ్యాంకాక్‌, సియాటెల్‌, జకార్తాల కన్నా ముందు నిలిచింది. ‘భవిష్యత సంపద’ విభాగంలో ముంబై 11వ స్థానం ఆక్రమించి చికాగో, సిడ్నీ, పారిస్‌, సియోల్‌, దుబాయ్‌ కన్నా ముందుంది.
business