SNo
int64 0
21.6k
| date
stringlengths 19
19
| heading
stringlengths 3
91
⌀ | body
stringlengths 6
38.7k
| topic
stringclasses 5
values |
---|---|---|---|---|
9,080 | 28-01-2017 23:03:54 | వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు: రాంగోపాల్ వర్మ | హైదరాబాద్: స్నేహితులు వెన్నుపోటు పొడుస్తారని, అదే శతృవులైతే నేరుగా ఎదురుగా వచ్చి దాడికి దిగుతారని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. స్నేహితులనుంచి రక్షించుకోవడం కష్టమని కూడా వర్మ ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీవితంలో విజయం సాధించాలంటే మంచి స్నేహితులు ఉండాలని, అయితే అద్భుతమైన విజయం సాధించాలంటే శక్తిమంతమైన శతృవులు ఉండాలని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. దీనికి బదులిస్తూ వర్మ స్నేహితులు, శతృవులపై ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. | entertainment |
9,639 | 05-10-2017 14:46:12 | ''గబ్బర్‌సింగ్ 3''- ఈ డైరెక్టర్ స్టోరీతో రెడీ! | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్‌సింగ్' చిత్రంతో తిరుగులేని హీరోగా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించాడు. ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా పవన్ అభిమాని కావడంతో, ఆ సినిమాతో అభిమానిగా తన ప్రతాపం మొత్తం చూపించాడు. పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్‌ని ఆ చిత్రంతో అందించాడు హరీష్. ఆ చిత్రం ఇచ్చిన విజయంతో పవన్ కూడా గబ్బర్‌పై మమకారాన్ని పెంచుకుని, ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో 'సర్దార్ గబ్బర్‌సింగ్' చేశాడు. ఆ చిత్ర రిజల్ట్ సంగతి ప్రక్కన పెడితే, గబ్బర్‌సింగ్ సిరీస్‌తో మరో పార్ట్ వస్తుందని ఆ సినిమా చివరిలో 'రాజా సర్దార్ గబ్బర్‌సింగ్' అంటూ చిన్న హింట్ ఇచ్చారు. మరి ఇదే అదనుగా అనుకున్నాడో, లేక పవన్‌కి సరిపడా మరో కథ ఏదైనా తయారు చేసుకున్నాడో తెలియదు కానీ, పవన్ అపాయింట్‌మెంట్ కోసం హరీష్ వేచి చూస్తున్నాడని మాత్రం తాజాగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ సన్నిహితులు తెలుపుతున్న ప్రకారం హరీష్ అద్భుతమైన కథని పవన్‌కి రెడీ చేశాడని చెబుతున్నారు. అది 'గబ్బర్‌సింగ్ 3'గా తెరకెక్కుతుందా లేక మరో టైటిల్‌తో వస్తుందా అనేది ప్రక్కన పెడితే, ముందు ఈ సినిమా చేయడానికి పవన్ రెడీగా ఉండాలి కదా! అనే కామెంట్స్ కూడా వినవస్తున్నాయి. అక్టోబరు నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని పవన్ చెప్పిన విషయంతో పాటు, ప్రస్తుతం అతను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ తర్వాత మరో సినిమాకి కమిట్ అయినట్లుగా అయితే వార్తలు రాలేదు. మరి ఇలాంటి టైమ్‌లో ఎంత మంచి కథ అయినా పవన్ చేస్తాడని హరీష్ అనుకోవడం అత్యాశే అవుతుందని హరీష్ గురించి అనుకుంటున్నారు. | entertainment |
3,895 | 10-11-2017 01:34:39 | ఆదివాసులకే ఎస్టీ రిజర్వేషన్లు | ప్రభుత్వాలు తమను కరుణించే స్థితిలో లేవని ఆదివాసులు ఆలస్యంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తే, భీం పోరాట స్ఫూర్తితో ఇంద్రవెల్లి అమరత్వాన్ని నింపుకొని ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు. ఆదివాసీ ప్రతిఘటనలతో ఏ ప్రభుత్వాలు స్థిరత్వాన్ని సాధించవు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాలను విస్మరించకుండా వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గత కొంత కాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మైదాన ప్రాంత గిరిజనులైన లంబాడాలకు ఆదివాసులకు మధ్య ఆరిపోని చిచ్చు రగులుకుంటున్నది. 1976లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత లేకుండా లంబాడాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో చేర్చడం వల్ల భూమి పుత్రులైన ఆదివాసులకు తీరని అన్యాయం జరిగింది. స్వార్థ రాజకీయాల కోసం తీసుకున్న ‘‘ఒక ప్రభుత్వ నిర్ణయం’’ వల్ల ఆదివాసులు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. ఆదివాసుల నిత్య ప్రతిఘటనలను గుర్తించిన అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం వారి మనుగడకు ప్రత్యేక రక్ష ణలు కల్పించింది. అవివారికి చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సహజసిద్ధంగా సంక్రమించినవే. వారికి తెలియని రాజ్యం వారిని శాసిస్తూ ఇచ్చినవి కావు. కాని ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశం సాధించింది వారి హక్కులను క్రమంగా కాలరాయడమే. ఆ కోవలోనే వివిధ జాతులకు, కులాలకు షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్ ఇవ్వడం. ఇపుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ కుట్ర చేస్తున్నది. ఆదివాసీలు కేంద్రంగా షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్ ఉండాలి. ఇతర కులాలను, జాతులను చేర్చితే భూమి పుత్రులైన ఆదివాసుల హక్కులు హరించడమే అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, వివిధ రాష్ట్రాలలో గిరిజనులు కాని బంజారాలను షెడ్యూల్డ్ ట్రైబ్‌లో చేర్చడంవల్ల ఆదివాసీ ప్రాంతాలు నిప్పుల గుండాలుగా మండుతున్నాయి. ఆదివాసులు ఈ అనాలోచిత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిరంతర ఉద్యమ బాటలో పయనిస్తున్నారు. మైదాన ప్రాంత గిరిజన తెగకు వ్యతిరేకంగా ‘సహాయ నిరాకరణ ఉద్యమాన్ని’ మొదలుపెట్టారు. ‘లంబాడాలను యస్.టి జాబితా నుండి తొలగించాలని’, అక్రమంగా తమపై పెడుతున్న కేసులను రద్దు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు ఇంద్రవెల్లి నుండి ఊట్నూర్ వరకు ‘మహా పాదయాత్ర’ (లాంగ్‌మార్చ్) చేశారు. ఏజెన్సీలో ‘వరస సంఘటనల నేపథ్యం’ ఆదివాసుల ఐక్యతను పరిపుష్టం చేసింది. సాంస్కృతికంగా ఆదివాసులు విభిన్న ఆచారాలు, వ్వవహారాలు కలిగి ఉంటారు. తమ సంప్రదాయాలకు భంగం వాటిల్లితే సహిం చరు. ‘‘నిజాం రాజే’’ వీరికి లెక్కలేదు. జోడెన్ ఘాట్లోని భీం స్మారక మ్యూజియంలో ఏర్పాటుచేసిన లంబాడా తెగ సాంస్కృతిక ప్రతీకైన స్త్రీ విగ్రహాన్ని భీం వర్ధంతికి ముందు రాత్రి కొందరు ఆది వాసులు దహనం చేశారు. ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన మ్యూజియంలో వారి సాంస్కృతిక ప్రతీకలను కనుమరుగు చేసే కుట్రగా ఆదివాసులు భావించారు. ‘‘హైదరాబాదులో ‘బంజార భవన్’, ‘ఆదివాసి భవన్’లు వేరు వేరుగా కడుతున్నపుడు భీం స్మారక మ్యూజియంలో బంజారాల సాంస్కృతిక ప్రతీకలు పెట్టడం ఎంతవరకు సమంజస’’మని ఆదివాసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. భీం వర్ధంతిలో పాల్గొన్న నాయకులు దహనం చేసిన ఆదివాసులను తప్పకుండా శిక్షిస్తామని ప్రతినబూనారు. ఇరవై ఏడు మంది ఆదివాసులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు రోజుకు ముగ్గురు చొప్పున అరెస్టు చేసి ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వం ఇతర తెగకు చెందిన సాంస్కృతిక ప్రతీక పెట్టడం ద్వారా ఆదివాసులను అవమానపర్చడమే కాకుండా కుమ్రం భీం వర్ధంతిని నిర్లక్ష్యంగా జరిపి, ఆదివాసుల ఆగ్రహాన్ని మూటకట్టుకున్నది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగానే కనపడుతున్నది. భీం గోండులకు ఆరాధ్యుడు, చిరస్మరణీయుడు. వారి కోసం తన జీవితాన్ని రక్త తర్పణం చేసిండు. నిజాం రాజును ఎదిరించి నిలబడిన ధీరుడు. నేటికి ఆయన చూపిన మార్గంలోనే జల్, జంగల్, జమీన్ కోసం ప్రభుత్వాలతో నిత్యం ఘర్షణ పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 06.10.2017న కుమ్రం భీం వర్ధంతిని ఎటువంటి ప్రాచుర్యం కలిపించకుండా మొక్కుబడిగా జరిపింది. కనీసం ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలైన ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సెలవు ప్రకటించి పండగలా కుమ్రం భీం వర్ధంతిని జరుపవలసి ఉండే. కాని, జిల్లా యంత్రాంగాలు ఆ పని చేయలేదు. కేవలం కొందరు ప్రజాప్రతినిధులతో ‘‘అటుకులు తిని చేతులు కడుక్కున్నట్లుగా’’ కార్యక్రమం నిర్వహించింది. మైదాన ప్రాంత గిరిజనుల ఆధ్యాత్మిక ప్రతీకలకు లక్షలు కేటాయిస్తున్నపుడు గోండు వీరుడు కుమ్రం భీం పట్ల వివక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారు? బతుకమ్మ ఆడని ఆదివాసులు అట్లనే అణగారిపోనీ అని ప్రభుత్వం అనుకుంటున్నదా? తమకు జరుగుతున్న అన్యాయాలపట్ల కలత చెందిన ఆదివాసులు అక్టోబర్ 12నాడు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సమావేశమై తమ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ఆదివాసులతో సంద్రమైంది. దాదాపు ఇరవైవేల మంది ఆదివాసులు పాల్గొన్నారు. గత కొంత కాలంగా తమ అవకాశాలన్నీ దోచుకుంటున్న మైదాన ప్రాంత గిరిజనులకు వ్యతిరేకంగా, వారి సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఇక ఏమాత్రము సహించమంటూ ఆవేశంగా కదిలారు. ప్రభుత్వం చేసే వింతపనులు ఎట్లా ఉంటాయంటే... అడవి ఆదివాసుల దగ్గర ఉంటే ఎక్కడో నిర్మల్‌లో తేనె ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చేస్తే చేశారు. ఆదివాసుల నుండి కష్టపడి తేనె సేకరిస్తారనుకుంటే, తీరా ప్రారంభోత్సవం రోజే దోసెడు తేనె కూడా రిఫైన్ చేయని సెకండ్ హ్యాండ్ యంత్రాలతో ముగింపు ఉత్సవం కూడా జరుపుతారు. ఇదీ ఆదివాసుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత! నిత్యం ఉండే సమస్యలతో సతమతమవుతున్న ఆదివాసులు అభద్రతా భావంలో బతుకీడుస్తున్నారు. 1976లో యస్టీలుగా గుర్తించబడిన లంబాడ తెగ వల్ల ఆదివాసీలమైన తాము పరాయీకరణకు గురవుతున్నామని, తమభూములు, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఆక్రమణకు గురైనాయని ఆందోళన చెందారు. విద్య ఉద్యోగావకాశాల్లో తమకు జరుగుతున్న వివక్ష రెండు మూడు తరాలు కోలుకోలేని విధంగా తయారైందని కలత చెందారు. నిజానికి, నూటికి తొంభై శాతం ఉద్యోగాలన్నీ వలసవచ్చిన మైదాన ప్రాంత గిరిజనుల వశమయ్యాయి. ఈ నిష్పత్తి వల్ల ఆదివాసులకు చెందాల్సిన సంక్షేమం గురించి ఆ గిరిజన ఉద్యోగులు ఎందుకు ఆలోచిస్తారు. ఆదివాసులకు మేలు చేయాలన్న సంకల్పం వారికి అసలే ఉండదు. ఈ విపత్కర పరిస్థితిలో ఆదివాసులు మనుగడ సాగించడం చాలా కష్టం. ఇది వారిని పోరాటానికి పురికొల్పింది. అదే రోజు భారీ ర్యాలిగా కదిలిన ఆదివాసులు జిల్లా కలెక్టర్ కు తమ గోడు వెళ్లబోసుకుంటామంటే, వారిని లోపలికి రానీయకుండా ‘తలుపులు మూసి’ అవమానపర్చారు. కడుపు రగిలిన ఆదివాసులు ‘తమకో న్యాయం ఇతరులకొక న్యాయమా..?’ అంటూ ఆవేదన చెందారు. ప్రభుత్వాలు తమను కరుణించే స్థితిలో లేవని ఆదివాసులు ఆలస్యంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తే, భీం పోరాట స్ఫూర్తితో ఇంద్రవెల్లి అమరత్వాన్ని నింపుకొని ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు. యుద్ధం సంధికాలంలో ఉన్నదని తెలిసి కూడా ప్రభుత్వం పరిష్కారం దిశగా ఆలోచించకుండా మూడు వందల మందిపై కేసులు పెట్టి అరెస్టు చేసే యోచనలో ఉండడం దారుణం. ఆదివాసీ ప్రతిఘటనలతో ఏ ప్రభుత్వాలు స్థిరత్వాన్ని సాధించవు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాలను విస్మరించకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి.బి. వేణుగోపాల్ రెడ్డిఆదిలాబాద్ జిల్లా అధ్యయన వేదిక గత కొంత కాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మైదాన ప్రాంత గిరిజనులైన లంబాడాలకు ఆదివాసులకు మధ్య ఆరిపోని చిచ్చు రగులుకుంటున్నది. 1976లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత లేకుండా లంబాడాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో చేర్చడం వల్ల భూమి పుత్రులైన ఆదివాసులకు తీరని అన్యాయం జరిగింది. స్వార్థ రాజకీయాల కోసం తీసుకున్న ‘‘ఒక ప్రభుత్వ నిర్ణయం’’ వల్ల ఆదివాసులు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. ఆదివాసుల నిత్య ప్రతిఘటనలను గుర్తించిన అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం వారి మనుగడకు ప్రత్యేక రక్ష ణలు కల్పించింది. అవివారికి చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సహజసిద్ధంగా సంక్రమించినవే. వారికి తెలియని రాజ్యం వారిని శాసిస్తూ ఇచ్చినవి కావు. కాని ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశం సాధించింది వారి హక్కులను క్రమంగా కాలరాయడమే. ఆ కోవలోనే వివిధ జాతులకు, కులాలకు షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్ ఇవ్వడం. ఇపుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ కుట్ర చేస్తున్నది. ఆదివాసీలు కేంద్రంగా షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్ ఉండాలి. ఇతర కులాలను, జాతులను చేర్చితే భూమి పుత్రులైన ఆదివాసుల హక్కులు హరించడమే అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, వివిధ రాష్ట్రాలలో గిరిజనులు కాని బంజారాలను షెడ్యూల్డ్ ట్రైబ్‌లో చేర్చడంవల్ల ఆదివాసీ ప్రాంతాలు నిప్పుల గుండాలుగా మండుతున్నాయి. ఆదివాసులు ఈ అనాలోచిత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిరంతర ఉద్యమ బాటలో పయనిస్తున్నారు. మైదాన ప్రాంత గిరిజన తెగకు వ్యతిరేకంగా ‘సహాయ నిరాకరణ ఉద్యమాన్ని’ మొదలుపెట్టారు. ‘లంబాడాలను యస్.టి జాబితా నుండి తొలగించాలని’, అక్రమంగా తమపై పెడుతున్న కేసులను రద్దు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు ఇంద్రవెల్లి నుండి ఊట్నూర్ వరకు ‘మహా పాదయాత్ర’ (లాంగ్‌మార్చ్) చేశారు. ఏజెన్సీలో ‘వరస సంఘటనల నేపథ్యం’ ఆదివాసుల ఐక్యతను పరిపుష్టం చేసింది. సాంస్కృతికంగా ఆదివాసులు విభిన్న ఆచారాలు, వ్వవహారాలు కలిగి ఉంటారు. తమ సంప్రదాయాలకు భంగం వాటిల్లితే సహిం చరు. ‘‘నిజాం రాజే’’ వీరికి లెక్కలేదు. జోడెన్ ఘాట్లోని భీం స్మారక మ్యూజియంలో ఏర్పాటుచేసిన లంబాడా తెగ సాంస్కృతిక ప్రతీకైన స్త్రీ విగ్రహాన్ని భీం వర్ధంతికి ముందు రాత్రి కొందరు ఆది వాసులు దహనం చేశారు. ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన మ్యూజియంలో వారి సాంస్కృతిక ప్రతీకలను కనుమరుగు చేసే కుట్రగా ఆదివాసులు భావించారు. ‘‘హైదరాబాదులో ‘బంజార భవన్’, ‘ఆదివాసి భవన్’లు వేరు వేరుగా కడుతున్నపుడు భీం స్మారక మ్యూజియంలో బంజారాల సాంస్కృతిక ప్రతీకలు పెట్టడం ఎంతవరకు సమంజస’’మని ఆదివాసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. భీం వర్ధంతిలో పాల్గొన్న నాయకులు దహనం చేసిన ఆదివాసులను తప్పకుండా శిక్షిస్తామని ప్రతినబూనారు. ఇరవై ఏడు మంది ఆదివాసులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు రోజుకు ముగ్గురు చొప్పున అరెస్టు చేసి ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వం ఇతర తెగకు చెందిన సాంస్కృతిక ప్రతీక పెట్టడం ద్వారా ఆదివాసులను అవమానపర్చడమే కాకుండా కుమ్రం భీం వర్ధంతిని నిర్లక్ష్యంగా జరిపి, ఆదివాసుల ఆగ్రహాన్ని మూటకట్టుకున్నది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగానే కనపడుతున్నది. భీం గోండులకు ఆరాధ్యుడు, చిరస్మరణీయుడు. వారి కోసం తన జీవితాన్ని రక్త తర్పణం చేసిండు. నిజాం రాజును ఎదిరించి నిలబడిన ధీరుడు. నేటికి ఆయన చూపిన మార్గంలోనే జల్, జంగల్, జమీన్ కోసం ప్రభుత్వాలతో నిత్యం ఘర్షణ పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 06.10.2017న కుమ్రం భీం వర్ధంతిని ఎటువంటి ప్రాచుర్యం కలిపించకుండా మొక్కుబడిగా జరిపింది. కనీసం ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలైన ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సెలవు ప్రకటించి పండగలా కుమ్రం భీం వర్ధంతిని జరుపవలసి ఉండే. కాని, జిల్లా యంత్రాంగాలు ఆ పని చేయలేదు. కేవలం కొందరు ప్రజాప్రతినిధులతో ‘‘అటుకులు తిని చేతులు కడుక్కున్నట్లుగా’’ కార్యక్రమం నిర్వహించింది. మైదాన ప్రాంత గిరిజనుల ఆధ్యాత్మిక ప్రతీకలకు లక్షలు కేటాయిస్తున్నపుడు గోండు వీరుడు కుమ్రం భీం పట్ల వివక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారు? బతుకమ్మ ఆడని ఆదివాసులు అట్లనే అణగారిపోనీ అని ప్రభుత్వం అనుకుంటున్నదా? తమకు జరుగుతున్న అన్యాయాలపట్ల కలత చెందిన ఆదివాసులు అక్టోబర్ 12నాడు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సమావేశమై తమ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ఆదివాసులతో సంద్రమైంది. దాదాపు ఇరవైవేల మంది ఆదివాసులు పాల్గొన్నారు. గత కొంత కాలంగా తమ అవకాశాలన్నీ దోచుకుంటున్న మైదాన ప్రాంత గిరిజనులకు వ్యతిరేకంగా, వారి సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఇక ఏమాత్రము సహించమంటూ ఆవేశంగా కదిలారు. ప్రభుత్వం చేసే వింతపనులు ఎట్లా ఉంటాయంటే... అడవి ఆదివాసుల దగ్గర ఉంటే ఎక్కడో నిర్మల్‌లో తేనె ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చేస్తే చేశారు. ఆదివాసుల నుండి కష్టపడి తేనె సేకరిస్తారనుకుంటే, తీరా ప్రారంభోత్సవం రోజే దోసెడు తేనె కూడా రిఫైన్ చేయని సెకండ్ హ్యాండ్ యంత్రాలతో ముగింపు ఉత్సవం కూడా జరుపుతారు. ఇదీ ఆదివాసుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత! నిత్యం ఉండే సమస్యలతో సతమతమవుతున్న ఆదివాసులు అభద్రతా భావంలో బతుకీడుస్తున్నారు. 1976లో యస్టీలుగా గుర్తించబడిన లంబాడ తెగ వల్ల ఆదివాసీలమైన తాము పరాయీకరణకు గురవుతున్నామని, తమభూములు, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఆక్రమణకు గురైనాయని ఆందోళన చెందారు. విద్య ఉద్యోగావకాశాల్లో తమకు జరుగుతున్న వివక్ష రెండు మూడు తరాలు కోలుకోలేని విధంగా తయారైందని కలత చెందారు. నిజానికి, నూటికి తొంభై శాతం ఉద్యోగాలన్నీ వలసవచ్చిన మైదాన ప్రాంత గిరిజనుల వశమయ్యాయి. ఈ నిష్పత్తి వల్ల ఆదివాసులకు చెందాల్సిన సంక్షేమం గురించి ఆ గిరిజన ఉద్యోగులు ఎందుకు ఆలోచిస్తారు. ఆదివాసులకు మేలు చేయాలన్న సంకల్పం వారికి అసలే ఉండదు. ఈ విపత్కర పరిస్థితిలో ఆదివాసులు మనుగడ సాగించడం చాలా కష్టం. ఇది వారిని పోరాటానికి పురికొల్పింది. అదే రోజు భారీ ర్యాలిగా కదిలిన ఆదివాసులు జిల్లా కలెక్టర్ కు తమ గోడు వెళ్లబోసుకుంటామంటే, వారిని లోపలికి రానీయకుండా ‘తలుపులు మూసి’ అవమానపర్చారు. కడుపు రగిలిన ఆదివాసులు ‘తమకో న్యాయం ఇతరులకొక న్యాయమా..?’ అంటూ ఆవేదన చెందారు. ప్రభుత్వాలు తమను కరుణించే స్థితిలో లేవని ఆదివాసులు ఆలస్యంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తే, భీం పోరాట స్ఫూర్తితో ఇంద్రవెల్లి అమరత్వాన్ని నింపుకొని ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు. యుద్ధం సంధికాలంలో ఉన్నదని తెలిసి కూడా ప్రభుత్వం పరిష్కారం దిశగా ఆలోచించకుండా మూడు వందల మందిపై కేసులు పెట్టి అరెస్టు చేసే యోచనలో ఉండడం దారుణం. ఆదివాసీ ప్రతిఘటనలతో ఏ ప్రభుత్వాలు స్థిరత్వాన్ని సాధించవు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాలను విస్మరించకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి.బి. వేణుగోపాల్ రెడ్డిఆదిలాబాద్ జిల్లా అధ్యయన వేదిక | editorial |
345 | 09-01-2017 23:37:45 | 8300 వద్ద అప్రమత్తం | సూచన: 8200కన్నా దిగజారితే స్వల్పకాలిక ఇన్వెస్టర్లు/ట్రేడర్లు స్వల్పకాలానికి వైదొలగే విషయం పరిశీలించవచ్చు. వి. సుందర్ రాజా | business |
5,289 | 11-09-2017 19:06:09 | విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్...! | కెరీర్ బిగినింగ్‌లో హ్యాట్రిక్ సాధించిన యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆ తర్వాత కాస్తంత చల్లబడ్డాడు. ఇప్పుడు రాజ్ తరుణ్‌కు సక్సెస్ ఇచ్చే బాధ్యతను ఒక యువ దర్శకుడు తీసుకోబోతున్నాడట. 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావా', 'కుమారి 21 ఎఫ్' చిత్రాలతో హ్యాట్రిక్ సాధించాడు రాజ్ తరుణ్. అయితే ఆ తర్వాత మనోడు నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. కేవలం 'ఈడోరకం ఆడోరకం' మాత్రమే పర్వాలేదనిపించింది. ఇక ఈ యేడాది వచ్చిన రాజ్ తరుణ్ చిత్రాలు 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'అంథగాడు' పరాజయం పాలయ్యాయి. దాంతో ఓ మంచి విజయం కోసం ఈ యంగ్ హీరో ఎదురు చూస్తున్నాడు. అయితే 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రంతో యూత్‌ను ఎంటర్ టైన్ చేసిన కొండా విజయ్ కుమార్ రాజ్ తరుణ్‌తో సినిమా చేయబోతున్నాడట. విశేషం ఏమంటే దర్శకుడు కొండా విజయ్ కుమార్ కూడా ఆ మధ్య 'ఒక లైలా కోసం' సినిమాతో పరాజయాన్ని చవిచూశాడు. దాంతో అతనికీ ఓ మంచి హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. సో ఇటు రాజ్ తరుణ్, అటు విజయ్ కుమార్ ఇద్దరూ బిగ్ సక్సెస్‌ను టార్గెట్ చేశారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమాలు రెండు లైన్‌లో ఉన్నాయి. అవి పూర్తి కాగానే కొండా విజయ్ కుమార్ మూవీ సెట్స్ పైకి వెళుతుందట. ఇప్పటికే రాజ్ తరుణ్‌తో మూడు చిత్రాలు నిర్మించిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లోనే అనిల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా వీరికి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. | entertainment |
9,930 | 13-09-2017 11:34:48 | ఆయన పాత్ర పోషించాలని ఉంది: రానా | హైదరాబాద్ సిటీ:‘‘మన దేశంలో క్రికెట్ తప్ప వేరే క్రీడ ఏదీ పెద్దగా తెలియదు చాలా మందికి. కానీ అన్ని క్రీడలనూ ప్రేమించే దేశం గా మలచాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు నటుడు రానా దగ్గుబాటి. ప్రీమియర్ ఫుట్సల్ లీగ్‌లో తెలుగు టైగర్స్ టీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్, సహ యజమానిగా వ్యవహరిస్తురు రానా. ఈ తెలుగు టైగర్స్ యజమానుల బృందాన్ని పరిచయం చేయడంతో పాటుగా టీమ్ లోగో, జర్సీ ఆవిష్కరించడానికి ఓ సమావేశాన్ని బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ‘ఇప్పుడు యువతరం ఇతర గేమ్స్ పట్ల కూడా ఆసక్తి కనబరుస్తోంది. కబడ్డీ లాంటి గేమ్స్‌ను వ్యూవర్ ఫ్రెండ్లీ రూల్స్‌తో ఆసక్తి కరంగా మార్చడంతో దానికెంత క్రేజ్ కలుగుతుందో తెలిసిందే. అదే రీతిలో ప్రీమియర్ ఫుట్సల్ కూడా ఆసక్తి కలిగించనుంది’ అని అన్నారు. తెలుగు రాష్ర్టాల్లో ఆసక్తి ఎక్కువకొత్త స్పోర్ట్ ఏదైనా ప్రాచుర్యం పొందాలంటే కాస్త సమయం పడుతుందంటూ ఆంధ్ర, తెలంగాణాల్లో నూతన క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువంటూ చెప్పారు రానా. ప్రీమియర్ ఫుట్సల్ మ్యాచ్‌లేవీ హైదరాబాద్‌లో జరగకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తాను ఈ లీగ్‌లో ప్రవేశించి ఇప్పుడే కాబట్టి రాబోయే సీజన్‌కు దాన్ని ఇక్కడకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. బయోపిక్‌లో నటిస్తే బాక్సర్ మహమ్మద్ అలీ పాత్ర పోషించాలని ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రీమియర్ ఫుట్సల్ ఫౌండర్లు బ్రిట్టో, విమలా బ్రిట్టో, దినేష్ రాజ్ మాట్లాడుతూ మొదటి సీజన్‌కు వచ్చిన అపూర్వ స్పందనతో ఈ సీజన్‌ను 84 దేశాల్లో ప్రసారం చేయబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, తెలుగు టైగర్స్ సహయజమాని ఈసా మొహమ్మద్, చెన్నయ్ సింగం యజమాని అంజెల్లో రాజేష్,ముంబై టీమ్ సహ యజమాని శుభం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. | entertainment |
6,490 | 08-09-2017 11:10:39 | ఫోటో గ్రాఫర్లపై ప్రముఖ హీరోయిన్ బౌన్సర్ల దాడి | ఓ ప్రముఖ హీరోయిన్.. ఆమె భర్త ఫోటోలను తీసేందుకు యత్నించిన ఫోటో గ్రాఫర్లపై ఆమె బౌన్సర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన ముంబైలో తీవ్ర కలకలం రేపింది. గురువారం ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి.. ఆమె భర్త రాజ్ కుంద్రా కలిసి ముంబైలో ఓ హోటల్ నుంచి బయటకు వస్తుండగా.. అక్కడున్న ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేందుకు యత్నించారు. విధుల్లో హోటల్ బౌన్సర్లు.. ఫోటో గ్రాఫర్లపై విచక్షణా రహితంగా దాడి చేశారు. బాధిత ఫోటో గ్రాఫర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారిస్తున్నారు. | entertainment |
756 | 01-09-2017 23:49:06 | లిస్టింగ్‌తోనే నష్టాలు.. | ఆదిత్య బిర్లా క్యాపిటల్ షేర్లు శుక్రవారం మార్కెట్లో లిస్టయ్యాయి. బిఎ్‌సఇలో రూ.261 వద్ద లిస్టయిన షేర్లు తర్వాత 5 శాతం నష్టంతో రూ.248 వద్ద ముగిసాయి. ఎన్‌ఎ్‌సఇలో రూ.250 వద్ద లిస్టయినప్పటికీ రూ.237 వద్ద ముగిసాయి. ఆదిత్య బిర్లా నువో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ విలీనం నేపథ్యంలో ఆదిత్య బిర్లా నువోలో భాగంగా ఉన్న ఫైనాన్షియల్ సర్వీసె్‌సను విడదీసి ఆదిత్య బిర్లా క్యాపిటల్‌గా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. | business |
10,200 | 22-12-2017 22:41:08 | ఆ మూడూ మన వాళ్లవే! |
ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఐఎండీబీ ( ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) 2017లో జనానికి బాగా చేరువైన టాప్ 10 ఇండియన్ ఫిల్మ్స్ లిస్ట్‌ని శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేధా’ చిత్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభాస్, రానా నటించిన ‘బాహుబలి ది కన్‌క్లూజన్’’, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తొలి మూడు స్థానాల్లో దక్షిణాదికి సంబంధించిన చిత్రాలే ఉండటం ఈసారి విశేషం. అలాగే ఈ మూడు చిత్రాలూ విమర్శకులను సైతం మెప్పించడమే కాకుండా బాక్సాఫీసు దగ్గర ప్రభంజనం సృష్టించాయి. వీటి తర్వాత అమీర్‌ఖాన్ నటించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’, ఇఫ్రాన్ ఖాన్ సినిమా ‘హిందీ మీడియం’ నాలుగైదు స్థానాల్లో నిలిచాయి. రానా నటించిన మరో సినిమా ‘ఘాజీ’ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకొంది. అక్షయ్‌కుమార్ నటించిన రెండు సినిమాలు ‘టాయిలెట్.. ఏక్ ప్రేమ్ కథ’, ‘జాలీ ఎల్.ఎల్. బి’ కూడా ఈ లిప్ట్‌లో ఉన్నాయి. ఇక చివరి రెండు స్థానాలు తమిళ హీరో విజయ్ వివాదాస్పద చిత్రం ‘మెర్సల్’, ‘మమ్ముట్టి నటించిన మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఫాదర్’ కు దక్కాయి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్, కండల వీరు సల్మాన్ ఖాన్ చిత్రాలేమీ ఈ లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం. షారుఖ్ నటించిన ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’, సల్మాన్‌ఖాన్ నటించిన ‘ట్యూబ్‌లైట్’ చిత్రాలు రెండూ ప్రేక్షకుల తిరస్కారానికి గురి కావడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. | entertainment |
2,646 | 06-03-2017 23:38:19 | 50 ఎయిర్‌పోర్ట్‌ల పునరుద్ధరణకు రూ.4,500 కోట్లు | న్యూఢిల్లీ: దేశంలోని చిన్న చిన్న నగరాలు-పట్టణాల మధ్య విమాన ప్రయాణాల్ని ప్రోత్సహిచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఇందుకోసం వచ్చే రెండేళ్లలో ఉపయోగంలో లేని లేదా పెద్దగా ఉపయోగంలో లేని 50 ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌సి్ట్ర్‌పలను రూ.4,500 కోట్ల పెట్టుబడితో పునరుద్ధరించాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఈ) ఇందుకు ఆమోద ముద్ర వేసింది. ఇవి ప్రస్తుతం భారత విమానాశ్రయాల సంస్థ (ఎఎఐ) లేదా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి. వీటి పునరుద్ధరణ వలన ఆయా ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఊపందుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే వీటి పునరుద్దరణ ఈ ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌సి్ట్ర్‌పలకు రెగ్యులర్‌గా విమానాలు నడుపుతామని విమానయాన సంస్థల నుంచి లభించే హామీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే రాయితీలపై ఆధారపడి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు... పోర్చుగల్‌తో క్లీన్ ఎనర్జీపై గతంలో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందానికి ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఈ ఒప్పందాన్ని జనవరి 6న కుదుర్చుకున్నారు. ఆయిల్ స్టోరేజ్ అండ్ మేనేజ్‌మెంట్‌కు సంబంఽధించి అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీతో ఇండియన్ సా్ట్రటెజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం కింద మంగుళూరులోని స్టోరేజ్ కేంద్రంలో 5.86 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును అబుధాబి నేషనల్ ఆయిల్ నింపుతుంది. ఎనర్జీ మేనేజ్‌మెంట్ అండ్ కన్జర్వేషన్ విభాగంలో యుఎఇకి చెందిన అల్ ఎతిహాద్ ఎనర్జీ సర్వీసెస్ సేవలను వినియోగించుకునేందుకు వీలుగా నేషనల్ ప్రాడక్టివిటీ కౌన్సిల్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అంతర్జాతీయ సరుకుల రవాణాను మరింత సులభతరం చేసేందుకు వీలుగా ‘‘కస్టమ్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్‌నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ గూడ్స్ ’’లో భారత భాగస్వామిగా చేరేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. | business |
5,924 | 28-01-2017 19:59:01 | సంజయ్‌లీలాపై దాడిపై స్పందించిన రణ్‌వీర్ | బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీపై జరిగిన భౌతికదాడిపై రణ్‌వీర్ సింగ్ స్పందించారు. జైపూర్‌లో షూటింగ్ జరుగుతోన్న ఈ చిత్ర బృందంపై రాజ్‌పుత్ సేన దాడిని తప్పు పట్టారు. ‘‘రాజస్థాన్ ప్రజల, రాజ్‌పుత్ కమ్యునిటీల సున్నితమైన, భావోద్వేగమైన ప్రతి అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకొనే సినిమాను తెరక్కిస్తున్నాం. సంజయ్‌లీలా సర్ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, చాలా ప్రామాణికంగా సినిమాను పూర్తి చేయగల డైరెక్టర్‌లలో ఆయన ఒకరు. అనుకోకుండా ఇలా జరగడం చాలా దురదృష్టకరం. రాజస్థాన్ ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారనే నమ్మకముంది నాకు. సినిమాలోని మా ఉద్దేశాలకు వారి మద్దతు తప్పక ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇప్పటికే షాహిద్ కపూర్, సోనమ్ కపూర్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ఆందోళనపై స్పందించిన విషయం తెలిసిందే. | entertainment |
8,477 | 07-03-2017 21:56:10 | సూపర్ హీరోయిన్! |
విజయశాంతికి వచ్చిన సూపర్ హీరోయిన్ ఇమేజ్ మరొకరికి రాలేదు. అయితే దానికి కొంతవరకు చేరువ కాగలిగింది ఒక్క అనుష్క మాత్రమే. కొన్ని పాత్రలు ‘అనుష్క అయితేనే చేయగలదు’ అని దర్శక నిర్మాతలు నమ్మే స్థాయికి ఎదిగింది అనుష్క. చెప్పాలంటే కాస్త లేటుగా ఇరవై మూడేళ్ల వయసులో ‘సూపర్’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఆమె, మరో నాలుగేళ్లకే కోడి రామకృష్ణ రూపొందించిన ‘అరుంధతి’ సినిమాతో సూపర్ హీరోయిన్ అయిపోయింది. విజయశాంతి తర్వాత ఒక నాయిక ప్రధాన చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించిందప్పుడే. ‘వేదం’లో క్రిష్ కల్పించిన సరోజ అనే సెక్స్ వర్కర్ పాత్రలో అనుష్క ప్రదర్శించిన హావభావాలను అంత త్వరగా మరచిపోలేం. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన మహారాజ్ఞి రుద్రమదేవి కథను తెరకెక్కించాలని సంకల్పించినప్పుడు, ఆ పాత్రకు అనుష్క వినా ప్రత్యామ్నాయమే కనిపించలేదు దర్శకుడు గుణశేఖర్‌కు. నిజంగానే ఆ పాత్రకు అచ్చుగుద్దినట్లు సరిపోయింది అనుష్క. అలాగే రాజమౌళికి అమరేంద్ర ‘బాహుబలి’ భార్య దేవసేన పాత్రలోని ఏప్రిల్‌లో రాబోతున్న ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’లో పూర్తి స్థాయి దేవసేన పాత్రలో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఓవైపు అపూర్వ సౌందర్యరాశిగా, మరోవైపు కత్తిపట్టి యుద్ధంచేసే ధీరవనితగా ప్రేక్షకులకు కనిపించబోతోంది. | entertainment |
8,611 | 23-12-2017 11:03:25 | 'జై సింహ' ఆడియో వేడుకను హోరెత్తించనున్న సీనియర్ యాంకర్ | నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జై సింహ'. సికె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బాలయ్య కెరీర్‌లో 102వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ మాస్ మసాలా అంశాలతో చిత్రంపై ఓ రేంజ్ అంచనాలను క్రియేట్ చేసింది. కాగా 'జై సింహ' ఆడియో వేడుకను ఎంతో అట్టహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది చిత్రయూనిట్. డిసెంబర్ 24వ తేదీన విజయవాడలోని సిద్దార్థ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక జరుగనుంది. బాలయ్య అభిమానుల మధ్య సందడిగా జరగనున్న ఈ వేడుకను హోరెత్తించేందుకు సీనియర్ యాంకర్ ఝాన్సీకి ఈవెంట్ హోస్టింగ్ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో అభిమానుల కోలాహలం మధ్య వేదికపై ఝాన్సీ చమత్కారాలు, బాలయ్యబాబు పాటలు వినాలనే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు ప్రేక్షకులు. | entertainment |
8,516 | 03-07-2017 04:39:11 | నాగచైతన్యకు ‘యుద్ధం శరణం’ | నాగచైతన్య కథానాయకుడిగా వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మాణమవుతున్న చిత్రానికి ‘యుద్ధం శరణం’ అనే టైటిల్ నిర్ణయించారు. లావణ్యా త్రిపాఠి నాయికగా నటిస్తోన్న ఈ చిత్రంతో కృష్ణ ఆర్.వి. మారిముత్తు దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీకాంత్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నారు. ఆదివారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘యుద్ధం శరణం’ టైటిల్ సరిగ్గా సరిపోతుందని చిత్ర సమర్పకుడు సాయి కొర్రపాటి చెప్పారు. ‘‘నాగచైతన్య రూపం, ఆయన పాత్ర చిత్రణ చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఆయన కెరీర్‌లో ఇది బెస్ట్ ఫిల్మ్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. శ్రీకాంత్, రావు రమేశ్‌వి చాలా కీలక పాత్రలు. మురళీశర్మ, రేవతి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. జూలై 15న మొదటి టీజర్‌ను విడుదల చేస్తాం. ఇదే నెలలో పాటల్ని, ఆగస్ట్‌లో చిత్రాన్నీ విడుదల చేస్తాం’’ అని ఆయన తెలిపారు. ‘జెంటిల్‌మన్’ ఫేమ్ డేవిడ్ ఆర్. నాథన్ కథ అందించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: వివేక్ సాగర్ (‘పెళ్లిచూపులు’ ఫేమ్), ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, సమర్పణ: సాయిశివాని, నిర్మాత: రజని కొర్రపాటి. | entertainment |
1,605 | 02-07-2017 02:19:21 | పాన్ ఆధార్ లింక్‌కు కొత్త ఫారమ్ | న్యూఢిల్లీ : ఆధార్ సంఖ్యను పాన్ కార్డ్ సంఖ్యతో అనుసంఽధానం చేయడాన్ని అనివార్యంగా ప్రకటించిన ఆదాయం పన్ను శాఖ ఇందుకోసం ఒక సింగిల్ పేజీ ఫారమ్‌ను కూడా ఆవిష్కరించింది. ఆన్‌లైన్‌లో, ఎస్‌ఎంఎస్ ద్వారా పాన్ కార్డ్ -ఆధార్ లింక్‌కు వెసులుబాటు కల్పించిన ఐటి శాఖ తాజాగా ఫిజికల్ ఫారమ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ దరఖాస్తులో పేర్కొంటున్న ఆధార్ నెంబర్‌ను మరే ఇతర పాన్ నెంబర్‌తో లింక్ చేసేందుకు ఉపయోగించలేదనీ, తనకు ఈ దరఖాస్తులో పేర్కొన్న పాన్ నెంబర్ తర్వాత మరే ఇతర పాన్ నెంబర్లు లేవని కూడా ప్రమాణపూర్వకంగా దరఖాస్తుదారులు వెల్లడించాల్సి ఉంటుంది. జూలై ఒకటి నుంచి ఆధార్‌తో పాన్ నెంబర్‌ను లింక్ చేయడాన్ని కంపల్సరీ చేసిన విషయం తెలిసిందే. | business |
11,121 | 27-02-2017 03:16:33 | ప్రవాసభారతీయుల్లో కాన్సస్ కలకలం! | అమెరికాలో 6 లక్షల తెలుగువారు..ట్రంప్ శైలితో అందరిలోనూ భయం కోటి ఆశలతో అమెరికాకు చేరిన తెలుగు యువత ప్రస్తుతం భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి వీసా నిబంధనల్లో పలు మార్పులు తీసుకొస్తుండటంతో అమెరికాలో ఉంటున్న తెలుగు యువత తీవ్ర అలజడికి లోనవుతోంది. తాజాగా కాన్స్‌సలో జరిగిన కాల్పుల ఘటన అమెరికాలో ఉంటున్న లక్షలాది తెలుగువారితోపాటు తెలుగు రాషా్ట్రల్లో ఉంటున్న వారి తల్లిదండ్రులు, బంధువులనూ భయాందోళనకు గురి చేస్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ప్రవాసాంధ్రుల మీద జరిగిన పెద్ద దాడి ఇది. అమెరికాలో సుమారు ఆరు లక్షల మంది తెలుగువారు నివాసం ఉంటున్నారు. వారిలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, ఐటీ నిపుణులు, వైద్యులతోపాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. 2016లో 60 వేల మంది భారతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసాల మీద అమెరికా వెళ్లారు. వారిలో హైదరాబాద్ నుంచే వెళ్లిన వారి సంఖ్యే ఎక్కువ. కాన్సస్ దుర్ఘటన.. ట్రంప్ చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యల ప్రతిఫలం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాన్సస్ లో 30 వేల మంది ఎన్నారైలు | nation |
16,777 | 18-06-2017 20:29:19 | గవర్నర్‌ను కలిసిన తంబిదురై | చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై గవర్నర్ విద్యాసాగర్ రావును ఆదివారంనాడు రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. అసెంబ్లీలో పళనిస్వామి బలపరీక్ష సమయంలో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రతిపక్ష పార్టీలు గవర్నర్‌కు శనివారం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తంబిదుర గవర్నర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను తంబిదురై కలుసుకున్నట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. విశ్వాస పరీక్ష సమయంలో ఎమ్మెల్యేలకు పెద్దఎత్తున డబ్బు, బంగారం ఎరగా చూపించారని ఇటీవల ఓ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ బయటకు రావడం తమిళనాట సంచలనం సృష్టించింది. దీంతో స్టింగ్ ఆపరేషన్ సీడీని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ గవర్నర్‌కు శనివారం అందజేసి...మళ్లీ విశ్వాసపరీక్ష నిర్వహించాలని కోరారు. కాగా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు వచ్చిన ఆరోపణలను తంబిదురై తోసిపుచ్చారు. అందుకు అవకాశమే లేదని ఆయన అన్నారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించి ఓటు చేస్తే అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుందని, అలాంటప్పుడు బేరసారాల అవసరం ఏముంటుందని తందిదురై ప్రశ్నించారు. | nation |
6,353 | 20-09-2017 17:21:28 | 'స్పైడర్'లో ఇవే హైలైట్..! | ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం 'స్పైడర్'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ స్టెప్పులేసింది. ఇందులో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఇటీవల సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది. మహేష్ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా వస్తుండటంతో అభిమానుల ఆనందాలకు అవధులు కరువయ్యాయి. కాగా 2గంటల 25నిమిషాల నిడివితో రానున్న ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చర్చించుకుంటున్నారు ప్రేక్షకులు. సినిమాలో రెండు సీన్లు హైలైట్‌గా ఉండనున్నాయని, హై విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన ఇలాంటి సీన్లు మరే సినిమాలో.. మునుపెన్నడూ చూడనివిధంగా ఉంటాయని అంటున్నారు. అయితే అందులో ఒక సీన్ ట్రైలర్‌లో చూపించిన.. రోడ్డుపై బండరాయి దొర్లుతూ వచ్చి కార్లు, ఇతర వాహనాలను విధ్వంసం చేసేదని అంటున్నారు. ఇక ఇలాంటి మరోసీన్ కూడా సినిమాలో ఉందని అది థియేటర్లో చూడటానికి రెండు కళ్లు చాలవని చెప్పుకుంటున్నారు. చిత్రానికి హరీష్ జైరాజ్ ఇచ్చిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుంది. | entertainment |
370 | 06-05-2017 00:22:15 | బ్యాంకింగ్ షేర్లలో కరెక్షన్‌కు అవకాశం? | మొండిపద్దుల బెడద బ్యాంకులను వేధిస్తున్నప్పటికీ స్టాక్ మార్కెట్లో మాత్రం బ్యాంకు షేర్ల జోరు కొనసాగుతోంది. ఏడాది కాలంలో దాదాపు అరడజను బ్యాంకుల షేర్లు ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేశాయి. ఇందులో ఇండియన్ బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎన్‌బి, ఒరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఉన్నాయి. మొండిపద్దుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం తధ్యమన్న నమ్మకంతో ఏడాది కాలంగా ఇన్వెస్టర్లు బ్యాంకు స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. ఎన్‌పిఎల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పుడు ఆర్డినెన్స్ జారీచేయడంతో ఇక ఈ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికేచాలా బ్యాంకుల షేర్లు వాటి ఫండమెంటల్స్‌తో సంబంధం లేకుండా పెరిగాయి. కనీసం 10 శాతం మేర ఈ షేర్ల ధర తగ్గే అవకాశం ఉందని ఎనలిస్టులు అంటున్నారు. ఈ పతనం తర్వాత మళ్లీ పెరుగుదల ఉంటుందని, అందువల్ల షేర్ల ధర తగ్గినప్పుడు దాన్ని అవకాశంగా ఇన్వెస్టర్లు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ వంటి షేర్లపై వారు బుల్లి్‌షగా ఉన్నారు. బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ ప్రభావం ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టిన మ్యూ చువల్ ఫండ్స్‌లోనూ కనిపించింది. ఏడాది కాలంలో బ్యాంకింగ్ ఫండ్స్‌లో గరిష్ఠంగా 40 శాతం వరకు రిటర్న్స్ ఉన్నాయి. | business |
1,917 | 29-01-2017 23:31:43 | ఉత్పత్తి సామర్థ్యం పెంపుతో కష్టాలు | న్యూఢిల్లీ : ఆధునీకరణ, విస్తరణ తర్వాత ప్రభుత్వ రంగంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) మార్కెటింగ్ సమస్యలు ఎదుర్కొంటోంది. రూ.70,000 కోట్ల పెట్టుబడితో చేపట్టిన సెయిల్ ఆధునీకరణ, విస్తరణ చివరి దశకు చేరింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఆధునీకరణ కూడా కొద్ది నెలల్లో పూర్తవుతుంది. దీంతో కంపెనీ ఉత్పత్తి సామర్ధ్యం 60-70 శాతం పెరగనుంది. ఆర్థిక వ్యవస్థ నీరసించడంతో ప్రస్తుతం స్టీల్ డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది. ‘త్వరలో మా ఉత్పత్తి సామర్ధ్యం 60-70 శాతం పెరగనుంది. ఈ ఉత్పత్తిని అమ్మడం పెద్ద సవాల్’ అని సెయిల్ చైర్మన్ పికె సింగ్ చెప్పారు. దేశంలో స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యం ఏటా ఏడెనిమిది శాతం చొప్పున పెరుగుతుంటే, వినియోగం మాత్రం మూడు శాతం చొప్పున మాత్రమే పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. | business |
19,156 | 26-05-2017 03:34:10 | బాబ్రీ కేసులో ఆడ్వాణీ రావలసిందే: సీబీఐ కోర్టు | లఖ్‌నవ్, మే 25: రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద కట్టడం ఽకూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మంత్రి ఉమాభారతి తమ ముందు తప్పక హాజరు కావలసిందేనని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. 30వ తేదీన నిందితులంతా రావాలని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. | nation |
15,601 | 30-12-2017 10:24:49 | సైబర్ నేరాలపై కేంద్రమంత్రి సంచలన ప్రకటన | దేశంలో 22,700 ఆన్‌లైన్ మోసాలు జరిగాయి...న్యూఢిల్లీ : దేశంలో ఈ ఏడాది 22,700 ఆన్‌లైన్ మోసాల కేసులు నమోదైనాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంటులో సంచలన ప్రకటన చేశారు. ఈ మోసాల్లో రూ.155కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారని మంత్రి పేర్కొన్నారు. ఏటీఎం, క్రెడిట్ కార్డులు, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ లావాదేవీల్లో మోసాలు జరిగాయని మంత్రి వివరించారు. భారత రిజర్వు బ్యాంకు ఈ ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు వీలుగా అన్ని మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాలతో సైబర్ భద్రత గురించి చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు. | nation |
18,613 | 16-02-2017 01:04:41 | దీపక్‌కు ‘వేద నిలయం’? | జయ ఇతర ఆస్తులు ఎవరికి! చెన్నై, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): దివంగత సీఎం జయలలిత నివసించిన పోయెస్‌గార్డెనలోని ‘వేదనిలయం’ను ఆమె అన్న కుమారుడు దీపక్‌కు అప్పగించేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బృందం సిద్ధమైనట్లు తెలిసింది. జయ సోదరుడు జయకుమార్‌కు.. కుమారుడు దీపక్, కుమార్తె దీప ఉన్న విషయం తెలిసిందే. జయ జీవించి ఉన్నంత వరకు వీరి గురించి ఎవరికి తెలియదు. జయ అంత్యక్రియల్లో శశితోపాటు దీపక్ కూడా పాల్గొనడంతో ఆయన పేరు చర్చనీయాంశమైంది. శశికళ జైలుకు వెళ్లడంతో వేద నిలయానికి పోలీసు భద్రత కూడా ఉపసంహరించుకున్నారు. దాంతో ఆ ఇంటి సంరక్షణ బాధ్యతలను దీపక్‌కు అప్పగించాలని, అలాగే వదిలేస్తే ప్రభుత్వమే స్వాధీనం చేసుకునే అవకాశముందని శశికళ వర్గం భావిస్తోంది. కాగా, జయకు చెందిన కాంచీపురం జిల్లాలోని సిరుదావూర్ బంగ్లా, నీలగిరి జిల్లా కొడనాడులో తేయాకు ఎస్టేట్‌తో ఇతర స్థిర, చరాస్తులు ఎవరికి చెందుతాయనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. | nation |
13,625 | 05-01-2017 17:00:13 | మసూద్‌ను తామెందుకు వెనకేసుకు వస్తున్నదీ చెప్పిన చైనా! | బీజింగ్: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ అంటే తనకెంత ప్రేమో చైనా మరోమారు బయటపెట్టింది. మసూద్ విషయంలో చైనా ద్వంద్వ విధానాలు అవలంబిస్తోందన్న భారత్ ఆరోపణలను కొట్టి పడేసింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ఐరాసలో భారత్ చేసిన విన్నపాన్ని తాజాగా రెండోసారి అడ్డుకున్న చైనా ఈ విషయంలో విధేయతతో వాస్తవికంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటే అందుకు తగ్గ బలమైన సాక్ష్యాలు ఉండాలని, ఈ విషయంలో తాము తీసుకున్న నిర్ణయం సబబైనదేనని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుయాంగ్ పేర్కొన్నారు. భాతర విదేశాంగ మంత్రిత్వశాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ ఉగ్రవాదంపై భారత్ వాదనలు కాకుండా ప్రపంచం వాదన వినాలని చైనాను కోరారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతును ప్రస్తావిస్తూ బాధ్యతాయుతమైన, పరిపక్వత గల దేశంగా పాక్ ‘ద్వంద్వ’, స్వీయ రక్షణ, ఆత్మహత్య సదృశ విధానాలను చైనా అర్థం చేసుకోగలదని అన్నారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ఐరాస భద్రతా కూటమిలో పిటిషన్ దాఖలు చేసింది. 15 సభ్య దేశాలు కలిగిన 1267 కౌంటర్ టెర్రరిజం కమిటీలో చైనా ఒక్కటే భారత్ పిటిషన్‌ను సాంకేతిక కారణాల సాకుతో వ్యతిరేకిస్తోంది. | nation |
11,990 | 01-12-2017 19:35:08 | శత్రువులకు గుణపాఠం తప్పదు : దినకరన్ |
చెన్నై : అన్నాడీఎంకే నుంచి పక్కన పడేయబడిన నేత టీ టీ వీ దినకరన్ తన శత్రువులకు గట్టి సవాల్ విసిరారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థులకు గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. ‘రెండు ఆకులు’ గుర్తు గురించి మాట్లాడుతూ తనకు ఏ చిహ్నం వచ్చినా అంగీకరిస్తానన్నారు. ‘అమ్మ’ జయలలిత ‘రెండు ఆకులు’ గుర్తుపై పోటీ చేశారన్నారు. ప్రజా వ్యతిరేక, ద్రోహపూరిత ప్రభుత్వానికి ఈ గుర్తు వెళ్ళకూడదన్నారు. ‘రెండు ఆకులు’ గుర్తును అన్నాడీఎంకే ఓపీఎస్-ఈపీఎస్ వర్గం ఉపయోగించుకోవచ్చునని ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై దినకరన్ గురువారం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. | nation |
4,333 | 26-06-2017 00:31:52 | కథలు జీవితాంతం రాయలేరు | ‘‘కేవలం భావుకత్వ బలంతో మంచి కవిత్వం రాయొచ్చు కానీ మంచి కథ రాయడం సాధ్యం కాదు. అందుకే ఇరవై యేండ్ల లోపల గొప్ప కవిత్వం రాసిన వాళ్ళున్నారు కానీ మంచి కథ రాసినవాళ్ళు లేరు.’’ - రా.రా (రాచమల్లు రామచంద్రారెడ్డి)సొదుం జయరాం కథా సంపుటి ‘సింహాద్రి స్వీట్‌హోమ్’ను సమీక్షిస్తూ అన్న మాటలివి. జీవితానుభవాలను అర్థం చేసుకుని వాటికి సాహిత్య రూపం ఇవ్వడం ఆ వయస్సులోపల సాధ్యం కాదని అందుకు కారణాన్ని కూడా వివరించారు. కవిత్వము, కథ అనే రెండు ప్రక్రియల మధ్య వస్తుగతంగా వున్న తేడాను సరిగా చెప్పారు. అయితే, ‘ఇరవైయేండ్ల లోపల’ అని ఒక హద్దును నిర్ణయించడమెందుకు? జయరాం ఇరవైయేండ్ల లోపల మంచి కథ రాశారని చెప్పడమా... అదీ లేదు. ఆ వయస్సుకు కానీ అటు వంటి అవగాహన యేర్పడదని ఉజ్జాయింపుగా చెప్పినట్టుంది. ఇప్పుడు ఇంకొన్ని సందేహాలు. ఇరవైయేండ్లు వస్తే జీవితావగా హన వస్తుందని చెప్పలేము. సాహిత్య రూపం ఇవ్వడం సాధ్య మవుతుందనీ చెప్పలేము. ఎన్నేళ్ళొచ్చినా జీవితావగాహన కనిపించని కథల్ని చూస్తూనే వున్నాం కదా! అయితే, ఆ ఒక్క మాటను చర్చనీయం చేయాలన్న ఉద్దేశంతో నేను రా.రా.ను తీసుకురాలేదు. ఆయన చెప్పింది ఆ రెండు ప్రక్రియల ప్రారంభ సమస్య. ఆ సమస్య ఆదిలోనే కాదు, ఆద్యంతాలూ వుంటుందని చెప్పాలన్నది ఉద్దేశం. ఆ ఉద్దేశం ఎందుకూ అంటే, ప్రధానంగా నేను కథకుడిని కనుక కథా కష్టాలు చెప్పుకోవచ్చని. ముందు సారాంశం చెప్పి, తర్వాత వివరాల్లోకి వెళ్తాను. కవిత్వం రాసేవాళ్ళు ఆగకుండా రాస్తూనే వుండవచ్చు. కథలు రాసేవాళ్ళు ఎక్కడో అక్కడ ఆగిపోక తప్పదు. వాళ్ళు ఆగకపోవడానికీ, వీళ్ళు ఆగడానికీ వయస్సు కారణం కాదు. ఇటీవలే కీర్తిశేషులైన సినారె 86యేళ్ళ వయస్సులోనూ కవిత్వం రాశారు. శివారెడ్డి లాంటి వాళ్ళు వృద్ధాప్యంలోనూ అలసిపోకుండా రాస్తూనే వున్నారు. కథకుల విషయానికొస్తే, ఎన్నో కథలు రాసిన కొ.కు మరణానికి చాలాముందే కథలు రాయడం ఆపేశారు. కా.రా.గారైతే నేనింక కథలు రాయలేనని చెప్పేశారు. ఇంకా ఎంతోమంది మంచి కథలు రాసిన వారు మానేశారు. కారణం రా.రా చెప్పినట్టూ ఆ రెండు ప్రక్రియల మధ్య వున్న వస్తు భేదమే. కవులు వస్తు సంపన్నులైతే, కథకులు వస్తువు కోసం తల బాదుకునేవాళ్ళు. జీవితానుభవాలన్నీ కథా వస్తువులు కాలేవు. కొన్ని కథకు చాలనివి, కథకు అతీతమైనవీ వుంటాయి. పేదవాళ్ళు జీవించడానికి అత్యవసరమైన వస్తువులనే కొన్నట్టుగా, కథకులు కథకు అవసరమైన వస్తువునే ఎంచుకోవాలి. కవులకు అన్నీ కవితా వస్తువులే, ఏదీ కవిత కనర్హం కాదు. ఏ చిన్న సంఘటనో, సందర్భమో, లేదా పత్రికలో వార్తో చాలు. భావుకత్వంతోనో, భావో ద్వేగంతోనో కవిత్వంగా చేయవచ్చు. కవిత్వం కోరే స్పందన కూడా భావోద్వేగాన్నే. వస్తుసంపన్నులు విలాసానికి అవసరం లేని కొన్ని వస్తువుల్ని కొన్నట్టు దేన్నయినా కవిత్వం చేయొచ్చు. కథకులకు అంత విస్తృతి అవకాశం వుండదు. ఇందుకు శ్రీశ్రీ ప్రయోగాలు ఉదా హరణ. ఆయన ప్రయోగ కవిత్వం ‘సక్సెస్’ అయినట్టు, కథలు ‘సక్సెస్’ కాలేదు. అంటే, కథకులకు ఎంతో కొంత స్వీయానుభవం అవసరమైతే, కవులకు అవసరం లేదు. భావుకత్వం చాలు. కథకులకు భావుకత్వం అవసరం లేదా అంటే, దాన్ని అదుపులో వుంచుకోవలసిన అవసరం అంతకంటే ఎక్కువగా వుంటుంది. ఈ విధంగా కథకులు ఇన్ని కష్టాలున్న కథలు రాయకపోతే ఏం నష్టం అన్న స్థితికొస్తారు. ఆ పరిస్థితి లోనే సృజన చెయ్యలేకపోవడం అన్నది అసంతృప్తినీ, అశాంతినీ కలిగిస్తుంది. దాన్నుంచీ బయటపడి, మామూలు మనుషులుగా బతకడానికి (కథకులు మామూలు మనుషులు కాదని కాదు) రచయితలుగా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు రా.రా. మాటలకు మరి రెండు మాటలు కలిపి చెప్పాలి: కవులు రాయాలనుకుంటే జీవితాంతమూ కవిత్వం రాయొచ్చు. కథకులు రాయాలనుకున్నా రాయలేరు. - పి. రామకృష్ణ | editorial |
16,476 | 06-05-2017 02:57:22 | విమానాల్లో అతి చేస్తే నిషేధమే | దురుసు ప్రయాణికుల పేర్లు ‘నో-ఫ్లై’ జాబితాలోకితప్పును బట్టి 3 నెలల నుంచి రెండేళ్లు, అంతకు మించి బ్యాన్‌పౌర విమానయాన శాఖ ముసాయిదాస్వాగతించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌న్యూఢిల్లీ, మే 5: శివసేన ఎంపీ రవీంద్రగైక్వాడ్ ‘చెప్పు దెబ్బల’ నేపథ్యంలో విమానాల్లో దురుసుగా ప్రవర్తించేవారికి ముకుతాడు వేసేందుకు పౌర విమానయాన శాఖ సిద్ధమైం ది. అలాంటి ప్రయాణికులు విమానాల్లో కొంతకాలంపాటు ప్రయాణించకుండా నిషేధించేలా ‘జాతీయ నో-ఫ్లై జాబితా’ ముసాయిదాను రూపొందించి విడుదల చేసింది. దుష్ప్రవర్త న స్థాయిని బట్టి మూడు నెలలు నుంచి నిరవధిక నిషేధం దాకా రకరకాల నిబంధనలను పొందుపరచింది. హానికారకమని భద్రతా సంస్థలు గుర్తిస్తే నో-ఫ్లై జాబితాలో చేర్చవచ్చు.శారీరక సంజ్ఞలు, మాటలతో వేధింపులు, తప్పతాగి అదుపుతప్పి ప్రవర్తించడం వంటి తప్పులను మొదటి స్థాయి తప్పిదంగా 3 నెలలపాటు నో-ఫ్లై జాబితాలో చేరుస్తారు.నెట్టడం, కొట్టడం, గట్టిగా పట్టుకోవడం, అనుచితరీతిలో తా కడం, లైంగిక వేధింపులు వంటివాటికి పాల్పడితే రెండోస్థాయి తప్పిదంగా భావించి 6 నెలల నిషేధం విధిస్తారు.ఎదుటివారి ప్రాణాలకు హాని కలిగే రీతిలో ప్రవర్తించడం, విమానంలోని సాంకేతిక వ్యవస్థలు పాడయ్యేలా చేయ డం, గొంతు నులమడం, హత్యాయత్నం, విమాన సిబ్బం ది విభాగంలోకి అనుమతి లేకుండా చొరబడటం, చొరబాటుకు యత్నం వంటివాటిని మూడోస్థాయి తప్పిదంగా భావించి రెండేళ్లు, గరిష్ఠంగా నిరవధిక నిషేధం విధిస్తారు.చేసిన తప్పునే మళ్లీచేస్తే తొలి శిక్ష కన్నా రెట్టింపు శిక్ష పడుతుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి గతంలో మొదటిస్థాయి తప్పు చేసి 3 నెలల శిక్ష అనుభవించి.. మళ్లీ అదే తప్పు చేస్తే 6 నెలలపాటు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.నిర్ణయించేది ఎవరు?దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులకు శిక్షను విమానయాన సంస్థలు రూపొందించిన త్రిసభ్య స్థాయీ సంఘాలు ఘటన జరిగిన 10 రోజుల్లో నిర్ణయిస్తాయి. ఆ పదిరోజులూ దు డుకు ప్రయాణికులపై నిషేధం ఉంటుంది. అయితే, వారి నిర్ణయాన్ని ఇతర విమానయాన సం స్థలు తప్పనిసరిగా పాటించాల్సి న పని లేదు. నిర్ణయం మాత్రమే కమిటీది. అమలు ఎయిర్‌లైన్స్ ఇష్టం. ఉదాహరణకు ఎయిరిండియా విమానంలో ఎవరైనా దుష్ప్రవర్తనకు పాల్పడితే ఆ సంస్థ నియమించిన కమి టీ 3 నెలల నిషేధం విధించిందనుకోండి. దాన్ని మిగతా ఎయిర్‌లైన్స్ పాటించి తీరాలనే రూలేమీ లేదు. వాటికి ఇష్టమై తే ఎక్కించుకోవచ్చు. ఇది ‘జాతీయ’ జాబితానే కాబట్టి అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ఈ జాబితా వర్తించదు. మరోవైపు.. కమిటీ నిర్ణయాన్ని వినియోగదారులు అప్పీళ్ల కమిటీలో సవాల్ చేసుకోవచ్చు. హైకోర్టు జడ్జి నేతృత్వంలో పనిచేసే ఈ అప్పీళ్ల కమిటీని పౌర విమానయాన శాఖ నియమిస్తుంది. సవాల్ చేసే అవకాశం ‘దుష్ప్రవర్తన’ ప్రయాణికులకు మాత్రమే ఉంటుంది. భద్రతా సంస్థలు బ్లాక్‌లిస్ట్ చేసిన వారికి ఉండదు. | nation |
20,790 | 17-03-2017 10:18:41 | క్రికెటర్ ధోనీకి తప్పిన పెను ప్రమాదం! | న్యూ ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన ధోనీ నగరంలోని ద్వారకా హోటల్‌లో జట్టు సభ్యులంతా బసకు దిగారు. అయితే ఈ ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆటగాళ్లు అక్కడ్నుంచి పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ కాకపోవడంతో హోటల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. కాగా మ్యాచ్ ఆడటానికి తీసుకువచ్చిన కిట్ మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. అయితే మంటలు చెలరేగడానికి కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో సుమారు గంటపాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. జార్ఖండ్ కెప్టెన్‌గా హజారే ట్రోఫిలో పాల్గొంటున్న సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ధోనీ ఢిల్లీ వెళ్లారు. ఉన్నట్టుండి అగ్నిప్రమాదం జరిగింది.. పైగా కిట్ మొత్తం బూడిదపాలవ్వడంతో జార్ఖండ్- బెంగాల్ మధ్య జరగాల్సిన విజయ్ హజారే ట్రోఫీ సెమీస్ వాయిదా పడింది. అయితే మ్యాచ్ ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంపై క్లారిటీ రాలేదు. | sports |
18,472 | 20-06-2017 01:27:44 | గుట్టు విప్పని నవీన్ పట్నాయక్ | ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఇంకా గుట్టు విప్పలేదు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపే విషయంపై పార్టీ సీనియర్లతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆయనకు సోమవారం సాయంత్రం ప్రధాని నుంచి ఫోన్ వచ్చిందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. | nation |
10,012 | 11-05-2017 15:57:21 | దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ సినిమా | వరుసగా మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వస్తోన్న దిల్ రాజు.. తాజాగా మరో మెగా ఫ్యామిలీ హీరోని లైన్లో పెట్టాడట. ఆ స్టార్ హీరోతో ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ను తెరకెక్కించబోతున్నాడట. మొన్నటివరకూ మెగా ఫ్యామిలీ యువ హీరో సాయి ధరమ్ తేజ్‌తో గ్యాప్ లేకుండా మూడు సినిమాలు నిర్మించిన దిల్ రాజు.. ఇప్పుడు మరో యువహీరో వరుణ్ తేజ్‌తో.. 'ఫిదా' సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక.. యంగ్ హీరోస్‌ను పక్కనపెడితే.. లాంగ్‌గ్యాప్ తర్వాత స్ట్రైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తోనూ 'దువ్వాడ జగన్నాథమ్'ను మొదలుపెట్టాడు ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. ఈకోవలోనే ఇప్పుడు మరో మెగా ఫ్యామిలీ స్టార్ హీరో రామ్ చరణ్‌తో కూడా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఓ మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ స్టోరీని.. రామ్ చరణ్ కోసం సిద్ధం చేయించాడట దిల్ రాజు. ప్రస్తుతం సుకుమార్ చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ మూవీ తర్వాత చెర్రీ మరే కమిట్‌మెంట్ పెట్టుకోలేదు. దీంతో చరణ్ నెక్స్ట్ మూవీ దిల్ రాజు ప్రొడక్షన్‌లోనే అని తెలుస్తోంది. అయితే.. వీరి కలయికలో రూపొందే సినిమాకి.. దర్శకుడు ఎవరనేది ఫైనలవ్వాల్సి ఉంది. మొత్తంమీద.. 'ఎవడు' తర్వాత మరోసారి హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్న రామ్ చరణ్ - దిల్ రాజు కాంబినేషన్ మూవీపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. | entertainment |
8,895 | 17-03-2017 20:04:41 | పెళ్లి తర్వాతేనంటున్న సమంత! | చైతూతో ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత సమంత సినిమాల ఎంపిక చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ‘రాజు గారి గది-2’లో నటిస్తోంది. మరోవైపు సావిత్రి బయోపిక్‌లో నటించబోతోంది. అయితే ఈ రెండు సినిమాల్లో సమంత మెయిన్ రోల్ కాకుండా ఇంపార్టెంట్ రోల్ మాత్రమే పోషిస్తోంది. అలాగే నాగశౌర్య కథానాయకుడిగా ‘అమ్మమ్మగారింట్లో’ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్న సమంత మరి చైతూకు జంటగా ఎప్పుడు కనిపించనుందో తెలుసుకోవడానికి ఈ వీడియో క్లిక్ చేయండి. | entertainment |
8,417 | 19-07-2017 10:07:51 | శ్రుతిహాసన్‌పై ఖుష్బూ ఫైర్..! | రజనీ ‘2.0’ తరువాత తమిళంలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కబోతున్నట్టు ప్రచారం జరుగు తున్న ‘సంఘమిత్ర’ తాజాగా మరో వివాదానికి తెరతీసింది. ఈ చిత్రం నుంచి తప్పుకున్న శ్రుతి హాసన్‌పై చిత్ర దర్శకుడు సుందర్.సి సతీమణి, సీనియర్ తార ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీతేనాండ్రాళ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్య, జయంరవి హీరోలుగా సుందర్.సి తెరకెక్కించ నున్న ఈ చిత్రాన్ని కేన్స్ చిత్రోత్సవాల్లో భాగంగా చాలా గ్రాండ్‌గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే స్ర్కిప్టు సరిగ్గా లేదన్న కారణంతో శ్రుతి హాసన్ అనూహ్యంగా ఈ చిత్రం నుంచి తప్పుకుంది. అంతేకాదు, శ్రుతిని ‘సంఘమిత్ర’ గురించి అడిగితే సమాధానం చెప్పడానికి కూడా ఇష్ట పడడం లేదు. ఈ నేపథ్యంలో ఖుష్బూ తన ట్విట్టర్‌లో శ్రుతిహాసన్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. ‘సంఘమిత్ర స్ర్కిప్టు గురించి కొంతమంది తప్పుగా కామెంట్లు చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. వృత్తిపై అంకితభావం లేని వాళ్లే ఇలా మాట్లాడుతారు’ అని శ్రుతిపై పరోక్షంగా ఖుష్బూ వ్యాఖ్యానించారు. | entertainment |
17,076 | 19-11-2017 00:58:40 | మరణం ముప్పును తగ్గించే శునకం | బెర్లిన్, నవంబరు 18: మనిషి మచ్చిక చేసుకున్న తొలి జంతువు శునకమే. విశ్వాసం, నమ్మకానికి మారుపేరు. అంతేనా.. చావు ముప్పును కూడా దూరం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శునకం తోడుంటే ఒత్తిళ్లు తగ్గి హృద్రోగ సంబంధ వ్యాధులు దరిచేరవని, మరణం పొంచి ఉండే ముప్పు తగ్గుతుందని స్వీడన్‌కు చెందిన ఉప్సల యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 40 నుంచి 80 ఏళ్ల వయసున్న 34 లక్షల మందిని దాదాపు 12 ఏళ్లపాటు శునకానికి, మనిషికి ఉన్న అనుబంధాన్ని పరీక్షించగా ఈ విషయం తెలిసిందని వెల్లడించారు. 33శాతం మరణం ముప్పు తగ్గుతుందని, 11 శాతం హృద్రోగ బాధ ఉండదని వివరించారు. | nation |
1,649 | 18-09-2017 02:33:22 | నేడు సెబి బోర్డు సమావేశం | డొల్ల కంపెనీలపైనే ప్రధాన చర్చముంబై: క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబి డైరెక్టర్ల బోర్డు సోమవారం సమావేశమవుతోంది. నల్లధన చలామణికి వేదికలుగా పని చేసిన డొల్ల కంపెనీలపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్టు కంపెనీల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పడంతో డొల్ల కంపెనీలనే అనుమానంతో సెబి ఆగస్టు 7న సెబి 331 కంపెనీల షేర్ల ట్రేడింగ్‌పై ఆంక్షలు విధించింది. ఇంకా తప్పు చేసిన కంపెనీలు, వాటి ప్రమోటర్లు, కీలక అధికారులపై మరింత వేగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమూ సోమవారం జరిగే సమావేశంలో చర్చకు రానుంది. ఇంకా అక్రమ లావాదేవీల ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్‌టిసిజి) క్లెయిమ్ చేసుకుంటున్న విషయమూ చర్చించే అవకాశం ఉంది. వీటికి తోడు ఇప్పటికే డొల్ల కంపెనీలుగా ముద్రపడిన కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వాటాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సెబి చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. | business |
19,319 | 30-03-2017 21:48:55 | ఐపిఎల్ ఛైర్మన్‌గా ఆయనే ఉంటారు : బీసీసీఐ బాస్ | న్యూఢిల్లీ: ఐపిఎల్ ఛైర్మన్‌గా రాజీవ్ శుక్లానే ఉంటారని బీసీసీఐ బాస్ వినోద్ రాయ్ తెలిపారు. సుప్రీంకోర్డుచే నియమించబడ్డ బీసీసీఐ పాలక మండలికి నేతృత్వం వహిస్తున్న వినోద్ రాయ్ మాట్లాడుతూ ఐపిఎల్ ఛైర్మన్ మారతారనే వార్తలను ఖండించారు. ఏప్రిల్ 5 నుంచి మొదలుకానున్న ఐపిఎల్-10 సీజన్ నిర్వహణ, నిధులకు సంబంధించి పది రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ విషయాన్ని వినోద్ రాయ్ వెల్లడించారు. | sports |
16,554 | 08-02-2017 02:46:37 | పన్నీర్ తిరుగుబాటు | చెన్నై, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): అమ్మకు విశ్వాసపాత్రుడు చిన్నమ్మపై తిరుగుబాటు చేశాడు! ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ‘కాబోయే ముఖ్యమంత్రి’కి ఎదురు తిరిగాడు! శాంత, మృదు స్వభావిగా కనిపించే పార్టీ నాయకుడు అధినేత్రిపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు! అన్నాడీఎంకే మాజీ అధినేత్రి జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను ధిక్కరించారు. ఆమె తనకు ద్రోహం చేశారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. తనను అన్యాయంగా, అక్రమంగా పదవి నుంచి దించేశారని ఆక్రోశించారు. ‘‘నాతో బలవంతంగా రాజీనామా చేయించారు. అమ్మ జయలలిత సమాధి వద్దకు వెళ్లి వచ్చి రాజీనామా చేస్తానని చెప్పాను. అయినా ఒప్పుకోలేదు. నా చేయి పట్టుకుని బలవంతంగా రాజీనామా లేఖపై సంతకం చేయించుకున్నారు’’ అని వెల్లడించారు. తనను సీఎం స్థానంలో కూర్చోబెట్టి, మంత్రులతో అవమానింపచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థుడైన నాయకుడు వస్తే, ప్రజామోదం కలిగిన ఆ నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేందుకు సహకరిస్తానని, అప్పటి వరకు పార్టీ శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒంటరిగానే పోరాడతానని ప్రకటించారు. మంగళవారం రాత్రి అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆయన బయటకు వచ్చారు. రాత్రి 9 గంటలకు స్థానిక మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు ఒంటరిగా వచ్చిన పన్నీర్ సెల్వం.. సుమారు 40 నిమిషాలపాటు మౌన దీక్ష చేశారు. పన్నీరు కళ్ల వెంట కన్నీరు జలజలా రాలుతుండగా, అమ్మ సమాధి ముందు తన బాధనంతా మౌనంగానే వ్యక్తం చేశారు. అనంతరం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎట్టకేలకు మౌనం వీడారు. విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి నేటి వరకూ పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని, తనను సీఎం పదవి నుంచి దించేందుకు సాగించిన ప్రయత్నాలను వివరించారు. ‘‘ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని సీనియర్ నాయకుడు మధుసూదనన్‌కు అప్పగించాలని, తాను పూర్తిగా కోలుకునేంత వరకు సీఎం పదవిని చేపట్టాలని జయలలిత నన్ను కోరారు. అప్పట్లో ఆమె కాస్త కోలుకున్న స్థితిలో ఉండడంతో సీఎం పదవిని చేపట్టేందుకు నేను నిరాకరించాను. జయలలిత మరణంతో సీఎం పదవిని చేపట్టాను. ఆ తర్వాత రెండు నెలల్లోపే నా పాలనకు ప్రజల్లో మంచి పేరు రావటాన్ని శశికళ వర్గీయులు సహించలేకపోయారు. వర్దా తుపాను తాకిడికి గురైన బాధిత ప్రాంతాల్లో త్వరితగతిని పునరావాస పనులు చేపట్టడం, నగరంలో నీటి ఎద్దడి నివారణకు ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చలు జరిపి కృష్ణా నదీ జలాలను సాధించడం, జల్లికట్టు కోసం ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుని ప్రత్యేక ఆర్డినెన్స రూపొందించి, అటుపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో దానికి చట్టం చేయడం వంటి అంశాలతో నా పాలనకు అన్ని వర్గాల నుంచి మంచి పేరు వచ్చింది. దానిని శశికళ వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు’’ అని పన్నీరు సెల్వం వివరించారు. సీఎం పదవిని చేపట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ తన వద్దకు వచ్చి శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించాలని ఆమె బంధువైన దివాకరన ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారని, ఆ విషయమై పార్టీ నాయకులు, సీనియర్ మంత్రులతో చర్చించానని, చివరకు పార్టీ పదవిని ఆమెకు అప్పగించామని తెలిపారు. ఆ తర్వాత తాను సీఎంగా ఉన్నప్పుడే తన మంత్రివర్గ సభ్యుడైన ఉదయ భాస్కర్ శశికళ సీఎం కావాలంటూ బహిరంగంగా ప్రకటించారని, వెంటనే ఆ విషయాన్ని శశికళ దృష్టికి తీసుకెళ్లానని, తాను సీఎంగా ఉన్నప్పుడు మంత్రివర్గ సభ్యుడే తనకు వ్యతిరేకంగా విమర్శిస్తే శాసన సభలో తనకు బలం లేదని గవర్నర్ భావించి మెజారిటీ నిరూపించుకోవాలని అడిగే పరిస్థితి వస్తుంది కదా అని చెప్పానని పన్నీర్ వెల్లడించారు. దాంతో, ఉదయకుమార్‌ను మందలిస్తానని శశికళ చెప్పారని, కానీ, ఆ తర్వాత మదురైలో కూడా ఆయన మళ్లీ అదే మాటను ఎలుగెత్తి చాటి తనను అవమానపరిచాడని ఆరోపించారు. అలాగే మంత్రి సెల్లూరు రాజు, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కూడా అదే తీరుతో తనను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పార్టీలో ఐకమత్యాన్ని పెంచేందుకు పాటుపడ్డానని, జయలలిత అందించిన పాలనను కొనసాగించాలనే తపించానని, అయితే, ఊహించని రీతిలో శశికళ వర్గీయులు పార్టీలోను, పాలనలో సంక్షోభ పరిస్థితులు కల్పించారని చెప్పారు. మూడుసార్లు తనపై అత్యంత నమ్మకంతో సీఎం పదవినిచ్చిన జయలలిత ఆత్మ వద్దే తన మనసులోని మాటలను వ్యక్తం చేసేందుకు సమాధి వద్దకు వచ్చానని చెప్పారు. ‘‘రెండు రోజుల ముందు శశికళ ఆకస్మికంగా పార్టీ శాసనసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దానిపై నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. శశికళను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకోవడానికేనని అక్కడికి వెళ్లిన తర్వాతే నాకు తెలిసింది. ముఖ్యమంత్రి పదవికి నేను ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదు. ఒత్తిడి చేయడం వల్లే రాజీనామా చేశాను. అంతరాత్మ ప్రబోధం మేరకే ఇక్కడికి వచ్చాను’’ అని తెలిపారు. సీఎంగా కొనసాగిన రెండు మాసాలపాటు శశికళ వర్గీయులు, ఆమె మద్దతుదారులైన మంత్రుల వల్ల ఎన్నో అవమానాలు ఎదురైనా ఓర్పు వహించానని, చివరకు పార్టీ ప్రమాద స్థితికి రావడంతోనే నిజానిజాలను ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నానని వివరించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న మంచి పేరును కాపాడుకోవాలని, తన అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పాలనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ముఖ్యమంత్రిగా అమ్మ చూపిన బాటలో పయనించానని, తన విధులను నిర్వర్తించానని చెప్పారు. పార్టీని కాపాడేందుకు పోరాడతానని శపథం చేశారు. రాష్ట్ర ప్రజలు కోరుకుంటే తాను రాజీనామాను వాపసు తీసుకుంటానని ప్రకటించారు. ‘‘అయినా, ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పుకి ఏం అవసరం వచ్చింది? ఇది ధర్మమేనా? న్యాయమేనా? నా వల్ల పార్టీకి భంగం కలగకూడదని, దానివల్ల చరిత్రలో మచ్చ ఏర్పడకూడదని భావించా. అందుకే అవమానాలన్నీ సహించాను. పార్టీని, రాష్ట్రాన్ని కాపాడే వారే సీఎం కావాలని కోరుకుంటున్నా. ప్రజాభీష్టం ఉన్నవారే పదవి ఎక్కాలి. రాష్ట్రాన్ని కాపాడేందుకు ఒంటరిగానే పోరాడుతా’’ అని పన్నీర్ సెల్వం ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. | nation |
12,724 | 11-06-2017 17:02:50 | రోహిత్ వేములపై సినిమాకు ఫిల్మోత్సవ్‌లో నో ఎంట్రీ..! | తిరువనంతపురం: హెచ్‌సీయూ దళిత స్కాలర్ రోహిత్ వేముల మరణం దేశవ్యాప్తంగా ఇటీవల చర్చనీయాంశమైన నేపథ్యంలో తాజాగా ఆయనపై తీసిన 45 నిమిషాల డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రదర్శనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. కేరళలో ఈనెల 16 నుంచి ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనుంది. ఈ ఫిల్మోత్సవ్‌లో మూడు లఘ చిత్రాల ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వీటిలో రోహిత్ వేముల కథాంశంతో తీసిన 'ది అన్‌బేరబుల్ బీయింగ్ ఆఫ్ లైట్‌నెస్' డాక్యుమెంటరీ, కశ్మీర్‌లోని యువకళాకారులైన కొందరు విద్యార్థుల జీవనపోరాటంపై రూపొందించిన 'ఇన్ ది షేడ్ ఆఫ్ ఫాలెన్ చినార్', జేఎన్‌యూ నిరసనలపై తీసిన 'మార్చ్ మార్చ్ మార్చ్' ఉన్నాయి. ఈ చిత్రాలకు అనుమతి నిరాకరించడంపై కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్, ఫెస్టివల్ డైరెక్టర్ కమల్ విమర్శలు గుప్పించారు. దేశంలో 'సాంస్కృతిక అత్యయిక పరిస్థితి' (కల్చరల్ ఎమర్జెన్సీ) కనిపిస్తోందని ఆరోపించారు. దేశంలో అప్రకటత ఎమర్జెన్సీ నడుస్తోందని, మనం ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏమి మాట్లాడాలన్నది అధికారంలో ఉన్నవారే డిక్టేట్ చేస్తున్నారని అన్నారు. కాగా, ఐదు రోజుల ఫిల్మ్ ఫిస్టివల్‌లో సుమారు 262 లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శితమవుతాయని వైస్ చైర్మన్, ఆర్టిస్టిక్ డైరెక్టర్ బినా పాల్ తెలిపారు. కేరళ స్టేట్ ఛారిటబహుల్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ఫిల్మోత్సవ్‌ను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించనున్నారు. | nation |
18,886 | 16-05-2017 01:10:35 | అమెరికానే కారణం: మైక్రోసాఫ్ట్ | వాషింగ్టన్, మే 15: రాన్సమ్ వేర్ దాడిని ఓ మేల్కొలుపు చర్యగా పరిగణించాలని మైక్రోసాఫ్ట్ ప్రభుత్వాలను కోరింది. అమెరికా నిఘా వర్గాలు గుర్తించిన విండో్‌సలో పొరపాటే.. ఈ దాడికి మూలకారణమని తెలిపింది. అవుట్‌డేటెడ్ ఓఎ్‌సలు కలిగిన అన్ని పీసీలకూ ఈ ముప్పు పొంచి ఉందని తెలిపింది. మూడు నెలల కిందట అమెరికా నిఘా సంస్థలు మైక్రోసా్‌ఫ్టను ఈ లో పంపై హెచ్చరించగా ఆ సంస్థ ఓ ప్యాచ్‌ను విడుదల చేసింది. అయితే దీన్ని అందరూ అప్‌డేట్ చేసుకోలేదు. తాజా సైబర్ దాడికి అమెరికాయే కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శించారు. | nation |
2,052 | 30-08-2017 01:36:18 | ‘గోద్రెజ్ సెక్యూరిటీ’ నుంచి హోమ్ కామ్స్ | స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటిపై నిఘా, ఆడియోహైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గోద్రెజ్ అండ్ బాయిస్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ అనుబంధ సంస్థ గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్..... ఇళ్ల భద్రత కోసం త్వరలో మరో రెండు సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేయబోతోం ది. ఇవిఇ (ఈజీ వ్యూయింగ్ ఎవ్విరివేర్) సీరిస్ హోమ్ కెమెరాలుగా పిలిచే సిసిటివిలు, వీడియో డోర్ ఫోన్లను మరో వారం రోజుల్లో మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్టు కంపెనీ గ్లోబల్ హెడ్ (మార్కెటింగ్, సేల్స్, ఇన్నొవేషన్) మెహర్నోష్ బి.పిఠావాలా విలేకరులతో చెప్పారు. ఆయస్కాంతం ఉండే హోమ్ క్యామ్‌ను ఎలాంటి వైర్ల అవసరం లేకుండా ఎవరైనా ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ అమర్చుకోవచ్చు. వైఫై, యాప్‌లతో పని చేసే ఈ రెండు పరికరాలను స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసి ఇంట్లో లేదా ఇంటి బయట ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చన్నారు. వీటి ద్వారా మాట్లాడేటపుడు వీడియో, స్కైప్ యాప్ కంటే స్పష్టంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం దేశంలో 3 శాతం గృహాల్లో మాత్రమే హోమ్ సెక్యూరిటీ పరికాలు ఉన్నాయి. దీంతో తమ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తుందని కంపెనీ ఆశిస్తోంది. మూడు మోడల్స్‌లో లభించే హోమ్ క్యామ్స్ ధర పన్నులతో కలిపి రూ.5,500 నుంచి రూ.9,900కి, వీడియో డోర్ ఫోన్‌ను రూ.24,000కు అందిస్తామన్నారు. సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ పరికరాలకు సంబంధించిన సర్వర్లనూ దేశంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో వీటిని నేపాల్, కెన్యా, యూరప్ దేశాలకూ ఎగుమతి చేసే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. | business |
4,490 | 30-05-2017 02:58:53 | ఆన్‌లైన్ ఔషధ విక్రయాలు ప్రమాదకరం |
ఇ–ఫార్మసీ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించిన క్రమంలో నేడు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ పాటించి, ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని ఆలిండియా కెమిస్ట్ & డ్రగ్గిస్టుల సంఘం నిర్ణయించింది. దేశీయ ఔషధ రంగంపై బహుళజాతి కంపెనీల దృష్టి పడిన నేపథ్యంలో, వాటి ప్రయోజనాలు కాపాడడానికి మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఈ నిర్ణయంతో అర్థమవుతోంది. ఇప్పటికే ఆన్‌లైన్ విధానం అమల్లో ఉన్న దేశాల్లో, ఔషధ వినియోగం దుర్వినియోగం అవుతున్న స్థితిలో, భారతదేశంలో ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలనుకోవడం విచిత్రం. దేశంలో ఇప్పటి వరకూ అనధికారికంగా జరుగుతున్న ఆన్‌లైన్ ఔషధ వ్యాపారం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. నిషాకు, మత్తుకు అలవాటు పడిన కొందరు ఆన్‌లైన్ ద్వారా ఔషధాలు తెప్పించుకొని ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కోల్పోతున్నారు. ఐపిల్, ఎంటీపీ కిట్స్, డైజిపామ్, కొడిన్ లాంటి మందులు డాక్టరు సిఫారసు మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వాడవలసి ఉంటుంది. కానీ ఆన్‌లైన్ విధానంలో ఆర్డర్ చేసి, ఎవరి ఇష్టానుసారం వారు మందులు తెప్పించుకొని వాడితే ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉంది. డ్రగ్స్‌కు అలవాటు పడిన కొంతమంది యువతీ యువకులు మత్తును కలిగించే కొన్నిరకాల ట్యాబ్లెట్లు, సిరప్‌లు వాడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం క్వాలిఫైడ్ డాక్టరు సిఫారసు లేకుండా మందులు అమ్మవద్దని కెమిస్టులపై ఒత్తిడి చేస్తూ, మరోవైపు దొడ్డిదారిన ఆన్‌లైన్ విధానాన్ని చట్టబద్ధం చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. అదేవిధంగా ఈ–పోర్టల్ విధానం కూడా! వైద్యుల ప్రిస్కిప్షన్, మందుల అమ్మకాలకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు ఈ–పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్న నిబంధన కూడా ఇబ్బందికరమైనదే. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు అత్యవసర ఔషధాల విక్రయానికి విఘాతం ఏర్పడి రోగులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పట్టణ ప్రాంతాలను పక్కనపెట్టినా, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న కెమిస్టులకు ఇది మోయలేని భారంగా పరిణమించవచ్చు. మనదేశంలో సుమారు ఎనిమిది లక్షల యాభైవేల ఔషధ దుకాణాలున్నాయి. కోటి ఇరవై లక్షల మంది ఈ దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకుండా మొండిగా ఇ–ఫార్మసీ విధానంలో ఆన్‌లైన్ అమ్మకాలకు పచ్చజెండా ఊపేస్తే పెద్దఎత్తున ప్రజలు నష్టపోవడంతో పాటు, లక్షలాది దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్న కోటి ఇరవై లక్షల మంది ఉపాధి కోల్పోయి వీధిన పడే దుస్థితి దాపురిస్తుంది. ప్రభుత్వం తక్షణమే ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకం ఆలోచనను విరమించుకొని, ఔషధ రంగంలో బహుళజాతి సంస్థల ప్రవేశాన్ని నిరోధించాలి. ప్రభుత్వానికి ప్రజలపై ప్రేమ ఉంటే, ఔషధ ధరలను నియంత్రించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి.- యండి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ కెమిస్ట్(ఆన్‌లైన్ విక్రయాలకు వ్యతిరేకంగా నేడు మెడికల్ షాపుల మూసివేత) | editorial |
6,831 | 21-09-2017 12:57:52 | మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారనే ప్రశ్నకు జ్యోతిక ఏం చెప్పిందంటే.. | సినీ ఇండస్ట్రీలో దాదాపు ఎక్కువగా లవ్ మ్యారేజెసే. ఎక్కువ శాతం లవ్ మ్యారెజెస్ సక్సెస్ అయినవే. ఓ అవగాహనతో పెళ్లి పీటలెక్కుతారు కాబట్టి దాదాపు సక్సెస్ అవుతారు. ప్రస్తుత జంటల్లో చెప్పుకోదగిన ముచ్చటైన జంట.. సూర్య-జోతిక. వీరిద్దరి లవ్ మ్యారేజ్.. అసలు లవ్ ఎలా స్టార్ట్ అయింది.. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు..? వంటి విషయాలను తెలుసుకోవాలని ప్రేక్షకులు ముచ్చట పడుతుంటారు. ఈ మధ్యే జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తాజాగా మగలిర్ మట్టుమ్ అనే మూవీలో నటించారు. ఈ మూవీ మంచి హిట్ కొట్టింది. ఈ సందర్భంగా జ్యోతిక ఫేస్‌బుక్‌లో అభిమానులతో మాట్లాడారు. ఓ అభిమాని "మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు?" అని అడగ్గా.. జ్యోతిక మా ఇద్దరికీ గుర్తు లేదు. "నేను ప్రపోజ్ చేశానని సూర్య అంటుంటారు.. కాని నేను కాదు.. మీరే అని నేను అంటుంటాను" అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఏదిఏమైనా వీరిద్దరి జంట మాత్రం సింప్లీ సూపర్బ్. | entertainment |
18,140 | 03-12-2017 16:02:38 | యూపీలో పతంజలి పెట్టుబడులు | అహ్మదాబాద్: యోగా గురు రాందేవ్ బాబా, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ఆదివారంనాడు లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. రాష్ట్రంలో పతంజలి సేవలు అందించే విషయమై ఈ సమావేశంలో రాందేవ్, యోగి ఆదిత్యనాథ్ చర్చించారు. 'ముఖ్యమంత్రి యోగి నిర్దేశకత్వంలో పతంజలి ఏయే రంగాల్లో సేవలందించాలనేది నిర్ణయిస్తాం. గోసేవలకు సంబంధించి కూడా పతంజలి పనిచేస్తుంది. ప్రధాని మోడీ కలల సాఫల్యానికి పతంజలి కృషి చేస్తుంది' అని ఆచార్య బాలకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాల పెంపునకు కూడా పతంజలి కృషి చేస్తుందన్నారు. 'నొయిడా, బుందేల్‌ఖండ్‌లలో కొత్త ఫ్యాక్టరీలు తెరుస్తాం. మా ప్రయత్నాలకు ముఖ్యమంత్రి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కొత్త ఉత్పత్తులను కూడా మార్కెట్లోకి తెస్తాం' అని రాందేవ్ బాబా తెలిపారు. ట్రిపుల్ తలాక్ అంశంపై కూడా మాట్లాడిన రాందేవ్ బాబా...మతం పేరుతో మహిళలకు అన్యాయం జరగరాదన్నారు. ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఇందుకు అనుగుణంగా కేంద్ర తీసుకువస్తున్న బిల్లును తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు. | nation |
824 | 01-07-2017 01:10:55 | చిన్న మొత్తాల పొదుపుపై తగ్గిన వడ్డీ రేట్లు | న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గాయి. దీంతో పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలపై జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి రాబడి తగ్గుతుంది. అన్ని రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాల పైన వడ్డీ రేటును 0.1 శాతం తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది, అయితే సేవింగ్స్ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వం చిన్న తరహా పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒక సారి సవరిస్తోంది. తాజా సవరణతో జూలై-సెప్టెంబరు నెలల మధ్య కాలానికి పిపిఎఫ్ ఖాతాలపై 7.8 శాతం, 115 మాసాల గడువు ఉన్న కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతం, సుకన్య సమృద్ధి ఖాతాలపై 8.3 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల కాలపరిమితి ఉన్న సీనియర్ సిటిజెన్స్ పొదుపు స్కీమ్‌పై 8.3 శాతం వడ్డీ లభిస్తుంది. 1 నుంచి 5 ఏళ్ల కాలపరిమితి గల టర్మ్ డిపాజిట్లపై 6.8 శాతం నుంచి 7.6 శాతం, ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. | business |
15,785 | 10-12-2017 02:16:29 | గుజరాత్ తొలి దశలో 68% పోలింగ్ | భారీగా వచ్చిన యువత శతాధిక వృద్ధులు,మహిళలు కూడా..గత ఎన్నికల్లో 71.3%అహ్మదాబాద్, డిసెంబరు9: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి ఘట్టం పూర్తయింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను మొదటి దశలో 89 సీట్లకు శనివారం జరిగిన ఎన్నికల్లో కడపటి వార్తలందేసరికి 68% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటించింది. 2012 ఎన్నికల కంటే ఈ దఫా తక్కువ ఓటింగ్ నమోదుకావడం గమనార్హం. గత ఎన్నికల్లో 71.3ు పోలింగ్ నమోదైంది. పటేళ్ల ప్రాబల్యం ఉన్న సౌరాష్ట్రతో పాటు దక్షిణగుజరాత్, కచ్ ప్రాంతాల్లోని అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. 977 మంది అభ్యర్థుల భవిష్యత్‌ను తేల్చే తొలి దశలో ఓటర్ల సంఖ్య 2,12,31,652 కాగా.. 24,689 పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా యువత.. అందులోనూ తొలిసారి ఓటుహక్కు పొందినవారు ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాజ్‌కోట్(పశ్చిమ) నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీఎం విజయ్ రూపానీ కుటుంబ సమేతంగా ఉదయాన్నే వచ్చి ఓటేశారు. అక్కడ ఆయనపై పోటీచేస్తున్న కాంగ్రెస్ ప్రత్యర్థి ఇంద్రనీల్ రాజ్యగురు కూడా ఓటేశారు. భారత జట్టు క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా తనతండ్రి అరవింద్ పుజారాతో కలిసి వచ్చి ఓటు వేశారు. రాజ్‌కోట్ జిల్లా ఉప్లేటా పట్టణంలో 126 ఏళ్ల వృద్ధురాలు అజిబెన్ చంద్రవాడియా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసింది. రాష్ట్రంలో అధిక వయస్కురాలైన ఓటరు ఈమే. భావనగర్‌లో వధూవరులతో పాటు పెళ్లి బృందం మొత్తం పోలింగ్ కేంద్రానికి తరలివచ్చింది. ఇక 6-7 చోట్ల ఈవీఎంలు స్తంభించాయని, వీటిని తక్షణమే మార్చినట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటించింది. కాగా.. రెండో విడత పోలింగ్ ఈ నెల 14వ తేదీన 93 స్థానాలకు జరుగనుంది. మరోవైపు, మూడు పోలింగ్ కేంద్రాల్లో బ్లూటూత్ ద్వారా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. తన నియోజకవర్గం పోర్‌బందర్‌లో ముస్లిం ప్రాబల్య ప్రాంతంలో ఇలా ట్యాంపరింగ్ జరిగిందని, కొన్ని ఈవీఎంలను ఇతరత్రా పరికరాలకు అనుసంధానించారని ఆ పార్టీ సీనియర్ నేత అర్జున్ మోధ్వాడియా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కమిషన్ విచారణకు ఆదేశించింది. తదనంతరం మోధ్వాడియా ఆరోపణలు నిరాధారమని తేల్చింది. ఇతర పరికరాలు అనుసంధానం చేసి ఉంది ఈవీఎంకు కాదని, ఎన్నికల ఏజెంటు మొబైల్ ఫోన్‌కని స్పష్టం చేసింది. మోధ్వాడియా తన ఫోన్ బ్లూటూత్‌ను యాక్టివేట్ చేసినప్పుడు ‘ఈసీవో 105’ అని వచ్చిందని.. ఈసీవో 105 అంటే ఎన్నికల కమిషన్ అనుకుని ఆయన పొరబడ్డారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) బీబీ స్వెయిన్ తెలిపారు. | nation |
4,582 | 22-05-2017 00:00:34 | ప్రేమకు దారి చూపిస్తాడు | ‘‘అతను అంధుడే. కానీ మనసున్న అందగాడు కూడా. వైజాగ్‌లో ఆ కుర్రాడి పేరు తెలియని వారుండరు. ఎందుకంటే అతను రేడియోజాకీ కాబట్టి. అతని ఎయిర్‌నేమ్ లవ్ డాక్టర్ గౌతమ్. అందరి ప్రేమకి ఓ దారి చూపిస్తాడు. అంధుడైన అతను ప్రేమలో పడితే.. అతని ప్రేమకు ఎవరు దారి చూపించారో తెలుసుకోవాలంటే ‘అంధగాడు’ సినిమా చూడాల్సిందే అంటున్నారు వెలిగొండ శ్రీనివాస్. రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ నటీనటులుగా ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో నిఖిల్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. | entertainment |
6,764 | 08-03-2017 09:22:17 | బాహుబలిని ఎందుకు చంపావని కట్టప్పని అడిగితే... | బాహుబలి సినిమా మొదటి పార్ట్‌లో కట్టప్ప బాహుబలిని కత్తితో పొడిచి చంపేశాడు. అయితే బాహుబలికి అత్యంత ఆప్తుడైన కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం అందరిలోనూ ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ ఒక్క విషయం బాహుబలి2 సినిమాకు భారీ కలెక్షన్లను తెచ్చి పెట్టబోతోంది. అయితే కట్టప్పగా ఈ సినిమాలో నటించిన సత్యరాజ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించాడు. ఇప్పటికీ చాలామంది తనను ఈ ప్రశ్న అడిగారని సత్యరాజ్ చెప్పాడు. అయితే ఇలా అడగడం తనకు ఇబ్బందిగా ఏమీ లేదన్నాడు. బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడనే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని సత్యరాజ్ చెప్పడం విశేషం. ఈ విషయం సినిమా విడుదలయ్యే దాకా రహస్యంగానే ఉంటుందని తేల్చేశాడు. అయితే సోషల్ మీడియాలో తాను పోషించిన కట్టప్ప పాత్రపై ఎన్నో ఫన్నీ ఫోటోలు చూశానని, నోట్ల రద్దు సమయంలో కూడా ఈ క్యారెక్టర్‌ను బాగా వాడుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తాను సంతోషంగా ఉన్నానని చెప్పాడు. | entertainment |
17,072 | 23-12-2017 17:13:23 | తీర్పు తర్వాత లాలూ ట్వీట్లు |
రాంచీ : దాణా కుంభకోణం కేసులో దోషిగా తీర్పు వెలువడిన తర్వాత బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ట్విటర్ వేదికగా స్పందించారు. వరుసగా ఇచ్చిన ట్వీట్లలో అనేక విషయాలు వెల్లడించారు. ఆయనను బిర్సా ముందా జైలుకు తరలించారు. ఆయన ఈ జైలులో ఉండటం ఇది మూడోసారి. పక్షపాతం నిండిన విధ్వంసకర ప్రచార దాడి ద్వారా సత్యాన్ని అబద్దంగా కానీ, సందిగ్ధంగా కానీ, అర్ధ సత్యంగా కానీ కనిపించేలా చేయవచ్చు. అయితే ఏది ఎదురైనప్పటికీ పక్షపాతం, విద్వేషాల మకిలి తెరను ఇంకా తొలగించవలసి ఉంది. అంతిమంగా సత్యం గెలుస్తుంది. దుష్ట బీజేపీ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ఓట్లు పొందడానికి, ప్రతిపక్షాలపై ప్రజల భావాలను దెబ్బతీయడానికి, రాజకీయాల్లో అనైతిక, ద్వేషపూరిత భావనలు నిండిన కుళ్ళు ఆట ఆడుతోందని మరో ట్వీట్‌లో ఆరోపించారు. సత్యం చెప్పులు తొడుక్కుంటూ ఉండగానే అబద్ధం ప్రపంచాన్ని సగం చుట్టి రాగలదని, అయితే చివరిదాకా సత్యం నిలుస్తుందని పేర్కొన్నారు. శక్తిమంతులైనవారు, శక్తిమంతులైన వర్గాలు ఎల్లప్పుడూ సమాజాన్ని పాలకులు, పాలితులుగా విభజించగలిగాయి. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు క్రింది వర్గాల నుంచి ఎవరైనా వచ్చినపుడు, వారిని శిక్షిస్తారు. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ వంటివారు తమ కృషిలో విఫలమైతే, వారిని విలన్లుగా చరిత్ర పరిగణించి ఉండేది. పక్షపాతం, జాత్యహంకారం, కులతత్త్వం నిండిన మనసులుగలవారికి వీళ్ళందరూ ఇప్పటికీ విలన్లే. ప్రత్యేకంగా చూస్తారని ఎవరూ ఊహించరు. అబద్ధాలు చెప్పేవాళ్ళు మొండిగా ఉన్నారు. ధర్మ యుద్ధంలో లాలూ ఒంటరివాడు కాదు, యావత్తు బిహార్ తోడుగా ఉంది. | nation |
18,334 | 07-02-2017 03:23:57 | సౌదీలో మహిళా దినోత్సవం!! |
ఇస్లామిక్ చరిత్రలో తొలిసారిరియాద్, ఫిబ్రవరి 6: మహిళల హక్కులను, స్వేచ్ఛను శతాబ్దాల తరబడి బంధించిన ఉక్కు సంకెళ్లు తెగిపోయాయి! సంప్రదాయ ‘ముసుగు’లో అతివకు వేసిన బంధనాలు విడివడ్డాయి! మహిళల పట్ల ప్రపంచంలోనే అత్యంత కఠిన నియమ నిబంధనలను అమలు చేస్తున్న ఇస్లామిక్ రాజ్యంలో నవ చరిత్ర పురుడు పోసుకుంది. అతివ స్వేచ్ఛకు ఊపిరులూదుతూ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొంది. ఇస్లామిక్ దేశాల్లో తొలిసారి చోటు చేసుకున్న ఈ చరిత్రాత్మక పరిణామానికి సౌదీ రాజప్రాసాదం వేదికైంది! సౌదీ అరేబియాలో 3 రోజులు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రియాద్‌లోని రాజప్రాసాదం ‘కింగ్ ఫాద్ కల్చరల్ సెంటర్’ వేదికగా నిర్వహించిన మహిళా దినోత్సవంలో యువరాణి అల్ జవ్‌హర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘విద్యా రంగంలో మహిళల పాత్ర’ అంశంపై చర్చించారు. | nation |
5,427 | 08-08-2017 18:16:33 | తొలి సినిమా బాలయ్యదే అంటోన్న కైరాదత్ | ముందు వచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే వాడి అంటారు. ఇక్కడో ముద్దుగుమ్మ కూడా తొలి సినిమాను కాదని రెండో చిత్రాన్నే తన మొదటి సినిమాగా భావించాలని చెపుతోంది. బూచాడే బూచాడు అంటూ 'రేసుగుర్రం' సినిమాలో బన్నీ సరసన సెక్సీ స్టెప్పులు వేసిన కైరాదత్ గుర్తుందా..? ఈ పాటతో తెలుగులో ఐటం గర్ల్‌గా బిజీ అవుతుందనుకున్న కైరా, మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. నిజానికి నటీనటుల్లో చాలామంది తొలిచిత్రం విజయవంతమైతే ఆ సినిమా పేరునే తమ ఇంటి పేరుగా మార్చుకుంటారు. కానీ కైరాదత్ మాత్రం తెలుగులో తొలిచిత్రం 'రేసుగుర్రం' ఘన విజయాన్ని అందించినప్పటికీ తన రెండో సినిమానే తొలిచిత్రంగా భావించాలనుకుంటోందట. 'రేసుగుర్రం' వచ్చిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు బాలకృష్ణ సరసన 'పైసా వసూల్' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌కు వస్తోంది కైరా దత్. ఈ చిత్రంలో శ్రేయ, ముస్కాన్ కథానాయికలు కాగా కైరా దత్ ఐటం సాంగ్ చేస్తోందంటూ ప్రచారం జరిగింది. అయితే ఐటమ్ సాంగ్‌తో పాటు ప్రాధాన్యత కలిగిన కీలక పాత్రను ఈ సినిమాలో కైరా పోషిస్తోందట. ఇటీవల బాలకృష్ణతో డిన్నర్ చేస్తూ, 'ఏ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్..' అంటూ బాలయ్యని ఆకాశానికెత్తేసిన కైరా దత్ ఇప్పుడు తనకు తెలుగులో తొలి సినిమా ఇదేనంటోందట.క్యాలెండర్ గర్ల్స్' వంటి ఒకటి అరా సినిమాల్లో తప్ప హీరోయిన్‌గా నటించిన చిత్రాలు కైరాదత్‌కు చాలా తక్కువ. తెలుగు, తమిళ భాషలతో సహా హిందీలోనూ ఐటం సాంగ్స్‌తోనే అమ్మడికి క్రేజ్ ఎక్కువ. అయితే 'పైసా వసూల్'లో బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ సరసన హీరోయిన్ ఛాన్స్ వచ్చేసరికి ఇకపై తెలుగులో కథానాయికగా కొనసాగాలనుకుంటోందట. అందుకే తనకు ఇది తెలుగులో తొలి చిత్రం అంటోంది. ఇప్పటికే బాలయ్యను పొగిడేస్తూ తెలుగులో ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడ్డ కైరా హీరోయిన్‌గా బిజీ అవుతుందో లేక ఐటం సాంగ్స్‌తోనే సరిపెట్టుకుంటుందో చూడాలి.! | entertainment |
4,332 | 15-08-2017 05:11:12 | సార్వభౌమత్వమే సర్వ శక్తిమంతం | అంతిమ సార్వభౌములు ప్రజలే. ఈ ధరిత్రిపై ఏ శక్తి కూడా వారి సార్వభౌమత్వాన్ని స్వాయత్తం చేసుకోలేదు. ప్రపంచీకరణ శక్తులు ఎంత శక్తిమంతంగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ వారిపై తిరగబడినట్టుగా, మన ప్రజలు వాటికి వ్యతిరేకంగా తిరగబడటం ఖాయం. ప్రపంచీకరణ శక్తుల నుంచి మన సార్వభౌమత్వాన్ని సంరక్షించుకోగలమా? భారత స్వాతంత్ర్య 70వ వార్షికోత్సవ సందర్భంలో మనం తీవ్రంగా చర్చించవల్సిన ప్రశ్న ఇది. బహుళ పాక్షిక ప్రతినిధి సంస్థలు ఇప్పటికే మన దేశీయ విధానాలను నిర్ణయిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ మేధా సంపత్తి హక్కుల సంస్థ, ప్రపంచ బ్యాంకు మొదలైన అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మన ఉత్పత్తులకు సంపూర్ణ రక్షణ కల్పించే పేటెంట్ల విధానం, దిగుమతి సుంకాలను ఉపసంహరించుకోవడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆంక్షలు విధించడమే అందుకు ఉదాహరణలు. మరి మన సామాజిక, ఆర్థిక విధానాలపై నియంత్రణను పూర్తిగా ప్రపంచీకరణ శక్తులకు కోల్పోయేలా ఈ అంతర్జాతీయ సంస్థల ప్రభావం రానున్న కాలంలో మరింతగా విస్తృతమవనున్నదా? అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.నిజానికి ప్రపంచీకరణ వర్తమాన పరిణామమేమీకాదు. ఆ ఆర్థిక ప్రక్రియ శతాబ్దాలుగా బలవంతంగానో లేక అంగీకారంతోనే అమలవుతూనే వున్నది. బలప్రయోగంతో జరిగిన ప్రపంచీకరణకు ఒక నిదర్శనం యూరోపియన్లచే అమెరికా ఖండాల ఆక్రమణ. బ్రిటిష్ వారు కూడా తమ ఉత్పత్తులనే మనం దిగుమతి చేసుకొనేలా మనలను బాగా బలవంతం చేశారు. బ్రిటిష్ కంపెనీలు మనదేశంలో మదుపు చేసేందుకు, బ్రిటిష్ పౌరులు ఈ దేశంలో స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకొనేందుకు, ఇతర కార్యకలాపాలలో పాల్గొనేందుకు కూడా అనుమతించేలా మనపై వచ్చిన ఒత్తిడి అంతా ఇంతా కాదు. అంగీకారం ఆధారిత ప్రపంచీకరణకు ఉదాహరణ ప్రపంచ వాణిజ్య సంస్థ ఒడబండికలో మనం భాగస్వామి కావడం. ఈ రెండు రకాల ప్రపంచీకరణలలోను ఆ ప్రక్రియకు చిహ్నాలైన పెట్టుబడుల ప్రవాహం, ప్రజలవలసలు, సాంకేతికతల బదిలీ ముమ్మరంగా జరిగింది. దేశ దేశాల పాలకులు తమ సార్వభౌమిక హక్కులను ఇష్టపూర్వకంగా వదులుకోవడమనేది చరిత్ర పొడవునా సంభవిస్తూనే వున్నది. అలా వదులు కోవడం వల్ల కోల్పోయే దానికంటే ఎక్కువగా లబ్ధి పొందుతామనే భావనే ఆ పరిత్యాగానికి కారణంగా చెప్పవచ్చు. బ్రిటిష్ వారు మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి మొగల్ చక్రవర్తులు అనుమతినిచ్చారు. దానివల్ల తమ సొంత సముద్ర వ్యాపారం పెరుగడంతో పాటు సామ్రాజ్య ప్రజలకు ఇతోధిక ప్రయోజనం సమకూరుతుందనే విశ్వాసంతోనే వారలా చేశారు. అదే విధంగా మనం వ్యయాల కంటే లాభాలే అధికంగా ఉంటాయనే నమ్మకంతో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒడంబడికలో భాగస్వాములమయ్యాము. మనకు విదేశీ పెట్టుబడులు అపారంగా వస్తాయని, మన ఎగుమతులకు విదేశీ మార్కెట్లు మరింతగా అందుబాటులో ఉంటాయనే భావనతోనే ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాన్ని ఆమోదించాము. మొగల్ చక్రవర్తుల పాలనలో అమలైన, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో అమలవుతోన్న ప్రపంచీకరణ తీరుతెన్నులు మౌలికంగా ఒకేవిధమైనవి. ఈ రెండు సందర్భాలలోను వ్యయాల కంటే లాభాలే అధికంగా ఉంటాయనే నిండు నమ్మకంతోనే మనం ఇష్టపూర్వకంగా మన సార్వభౌమిక హక్కులను వదులుకున్నాం. మొగల్ చక్రవర్తుల కాలం నాటి ప్రపంచీకరణ ఫలితంగా బ్రిటిష్ వారు మన దేశంలోకి ప్రవేశించారు. అయితే వారితో సంబంధాల వల్ల నష్టాలే ఎక్కువగా సంభవించగా లబ్ధి స్వల్పంగా మాత్రమే సమకూరింది. మహాత్మా గాంధీ రంగంలోకి వచ్చిన తరువాత ఆయన నాయకత్వంలో మనం ఆ ప్రపంచీకరణను వ్యతిరేకించాము. ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ మూలంగా మనం పొందుతున్న ప్రయోజనాలకంటే కోల్పోతున్న సంపదలే అధికంగా వున్నాయి. మనమే కాదు, ఇంకా అనేక దేశాలు కూడా ప్రపంచ వాణిజ్య సంస్థ వల్ల తమకు సమకూరుతున్న లబ్ధి ఆశించిన విధంగా లేదనే వాస్తవాన్ని గుర్తించాయి. స్వల్ప లబ్ధికి అధిక నష్టాలను ఎందుకు భరించాలన్న ఆలోచనతోనే అవి ప్రాంతీయ ఆర్థిక కూటములను ఏర్పాటు చేసుకున్నాయి. కెనడా, అమెరికా, మెక్సికోల మధ్య నాఫ్తా, దాదాపు 30 యూరోపియన్ దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్, మనం మన ఇరుగు పొరుగు దేశాలతో కలిసి ఏర్పాటు చేసుకున్న దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య మండలం మొదలైనవి అందుకు ఉదాహరణలు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అధికారాన్ని గుర్తించడానికి అమెరికా తిరస్కరించింది. అలాగే ప్యారిస్ వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించడానికి కూడా నిరాకరించింది. వ్యయాల కంటే లాభాలు అధికంగా వున్నంత వరకు మాత్రమే ప్రపంచీకరణను ఏ దేశమైనా అంగీకరిస్తుందనేది ఒక మౌలిక సత్యం. ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామ్యం వల్ల ప్రయోజనాలు పెద్దగా సమకూరడం లేదని నిర్ధారణ అయితే మనం ఆ సంస్థ నుంచి బయటకు రావచ్చు. హక్కులను శాశ్వతంగా వదులుకోవడమనేది ఎక్కడా జరగదు. ఉదాహరణకు స్వాతంత్ర్యానికి పూర్వం మన సంస్థానాల రాజులు తమ అధికారాలను బ్రిటిష్ వారికి శాశ్వతంగా ఇచ్చివేశారు. అయితే ప్రజలు ఈ లొంగుబాటును అంగీకరించలేదు. మహాత్మాగాంధీ నాయకత్వంలో తిరగబడ్డారు. తమ సార్వభౌమిక హక్కులను పునః సాధించుకున్నారు. అంతిమ సార్వభౌములు ప్రజలే. ఈ ధరిత్రిపై ఏ శక్తి కూడా వారి సార్వభౌమత్వాన్ని స్వాయత్తం చేసుకోలేదు. ప్రపంచీకరణ శక్తులు ఎంత శక్తిమంతంగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ వారిపై తిరగబడినట్టుగా, మన ప్రజలు వాటికి వ్యతిరేకంగా తిరగబడటం ఖాయం. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వరంలో ప్రస్తుతం అమలవుతోన్న ప్రపంచీకరణ బ్రిటిష్ వలస పాలకుల హయాంలో చోటుచేసుకున్న ప్రపంచీకరణకు మౌలికంగా భిన్నమైనది కాదు. అయితే రవాణా, కమ్యూనికేషన్ రంగాలలో మౌలిక విప్లవాత్మక మార్పులు ప్రస్తుత ప్రపంచీకరణను నిర్వచిస్తున్నాయి, నిర్దేశిస్తున్నాయి. అయినప్పటికీ ప్రపంచీకరణ నుంచి ఉపసంహరించుకోవడంలో మన ప్రజల మౌలిక సామర్థ్యం తక్కువేమీ కాదు. ఆ సామర్థ్యాన్ని ఎవరూ తగ్గించలేరు. చెప్పవచ్చినదేమిటంటే ప్రపంచీకరణ గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. అయితే ప్రపంచీకరణ వ్యయ లాభాలను ప్రజలకు విడమర్చి చెప్పాలి. మెరుగైన అవగాహన ఉన్నప్పుడు, అవసరమైతే ఆ ఆర్థిక ప్రక్రియ నుంచి ఉపసంహరించుకోవడానికి వారు స్వేచ్ఛగా సరైన నిర్ణయం తీసుకోగలరు. ప్రపంచీకరణ మన స్వాతంత్ర్యాన్ని హరించివేస్తుందనే విషయమై ఆందోళన పడవల్సిన అవసరం లేదు. మన మేధావులు ప్రపంచీకరణ శక్తుల పక్షాన చేరి ప్రజలకు ఆ ఆర్థిక ప్రక్రియ వ్యయలాభాల గురించి తప్పుడు సమాచారం అందిస్తుండడమే ఎంతైనా ఆందోళన చెందవలసిన విషయం.(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్) ప్రపంచీకరణ శక్తుల నుంచి మన సార్వభౌమత్వాన్ని సంరక్షించుకోగలమా? భారత స్వాతంత్ర్య 70వ వార్షికోత్సవ సందర్భంలో మనం తీవ్రంగా చర్చించవల్సిన ప్రశ్న ఇది. బహుళ పాక్షిక ప్రతినిధి సంస్థలు ఇప్పటికే మన దేశీయ విధానాలను నిర్ణయిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ మేధా సంపత్తి హక్కుల సంస్థ, ప్రపంచ బ్యాంకు మొదలైన అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మన ఉత్పత్తులకు సంపూర్ణ రక్షణ కల్పించే పేటెంట్ల విధానం, దిగుమతి సుంకాలను ఉపసంహరించుకోవడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆంక్షలు విధించడమే అందుకు ఉదాహరణలు. మరి మన సామాజిక, ఆర్థిక విధానాలపై నియంత్రణను పూర్తిగా ప్రపంచీకరణ శక్తులకు కోల్పోయేలా ఈ అంతర్జాతీయ సంస్థల ప్రభావం రానున్న కాలంలో మరింతగా విస్తృతమవనున్నదా? అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.నిజానికి ప్రపంచీకరణ వర్తమాన పరిణామమేమీకాదు. ఆ ఆర్థిక ప్రక్రియ శతాబ్దాలుగా బలవంతంగానో లేక అంగీకారంతోనే అమలవుతూనే వున్నది. బలప్రయోగంతో జరిగిన ప్రపంచీకరణకు ఒక నిదర్శనం యూరోపియన్లచే అమెరికా ఖండాల ఆక్రమణ. బ్రిటిష్ వారు కూడా తమ ఉత్పత్తులనే మనం దిగుమతి చేసుకొనేలా మనలను బాగా బలవంతం చేశారు. బ్రిటిష్ కంపెనీలు మనదేశంలో మదుపు చేసేందుకు, బ్రిటిష్ పౌరులు ఈ దేశంలో స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకొనేందుకు, ఇతర కార్యకలాపాలలో పాల్గొనేందుకు కూడా అనుమతించేలా మనపై వచ్చిన ఒత్తిడి అంతా ఇంతా కాదు. అంగీకారం ఆధారిత ప్రపంచీకరణకు ఉదాహరణ ప్రపంచ వాణిజ్య సంస్థ ఒడబండికలో మనం భాగస్వామి కావడం. ఈ రెండు రకాల ప్రపంచీకరణలలోను ఆ ప్రక్రియకు చిహ్నాలైన పెట్టుబడుల ప్రవాహం, ప్రజలవలసలు, సాంకేతికతల బదిలీ ముమ్మరంగా జరిగింది. దేశ దేశాల పాలకులు తమ సార్వభౌమిక హక్కులను ఇష్టపూర్వకంగా వదులుకోవడమనేది చరిత్ర పొడవునా సంభవిస్తూనే వున్నది. అలా వదులు కోవడం వల్ల కోల్పోయే దానికంటే ఎక్కువగా లబ్ధి పొందుతామనే భావనే ఆ పరిత్యాగానికి కారణంగా చెప్పవచ్చు. బ్రిటిష్ వారు మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి మొగల్ చక్రవర్తులు అనుమతినిచ్చారు. దానివల్ల తమ సొంత సముద్ర వ్యాపారం పెరుగడంతో పాటు సామ్రాజ్య ప్రజలకు ఇతోధిక ప్రయోజనం సమకూరుతుందనే విశ్వాసంతోనే వారలా చేశారు. అదే విధంగా మనం వ్యయాల కంటే లాభాలే అధికంగా ఉంటాయనే నమ్మకంతో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒడంబడికలో భాగస్వాములమయ్యాము. మనకు విదేశీ పెట్టుబడులు అపారంగా వస్తాయని, మన ఎగుమతులకు విదేశీ మార్కెట్లు మరింతగా అందుబాటులో ఉంటాయనే భావనతోనే ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాన్ని ఆమోదించాము. మొగల్ చక్రవర్తుల పాలనలో అమలైన, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో అమలవుతోన్న ప్రపంచీకరణ తీరుతెన్నులు మౌలికంగా ఒకేవిధమైనవి. ఈ రెండు సందర్భాలలోను వ్యయాల కంటే లాభాలే అధికంగా ఉంటాయనే నిండు నమ్మకంతోనే మనం ఇష్టపూర్వకంగా మన సార్వభౌమిక హక్కులను వదులుకున్నాం. మొగల్ చక్రవర్తుల కాలం నాటి ప్రపంచీకరణ ఫలితంగా బ్రిటిష్ వారు మన దేశంలోకి ప్రవేశించారు. అయితే వారితో సంబంధాల వల్ల నష్టాలే ఎక్కువగా సంభవించగా లబ్ధి స్వల్పంగా మాత్రమే సమకూరింది. మహాత్మా గాంధీ రంగంలోకి వచ్చిన తరువాత ఆయన నాయకత్వంలో మనం ఆ ప్రపంచీకరణను వ్యతిరేకించాము. ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ మూలంగా మనం పొందుతున్న ప్రయోజనాలకంటే కోల్పోతున్న సంపదలే అధికంగా వున్నాయి. మనమే కాదు, ఇంకా అనేక దేశాలు కూడా ప్రపంచ వాణిజ్య సంస్థ వల్ల తమకు సమకూరుతున్న లబ్ధి ఆశించిన విధంగా లేదనే వాస్తవాన్ని గుర్తించాయి. స్వల్ప లబ్ధికి అధిక నష్టాలను ఎందుకు భరించాలన్న ఆలోచనతోనే అవి ప్రాంతీయ ఆర్థిక కూటములను ఏర్పాటు చేసుకున్నాయి. కెనడా, అమెరికా, మెక్సికోల మధ్య నాఫ్తా, దాదాపు 30 యూరోపియన్ దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్, మనం మన ఇరుగు పొరుగు దేశాలతో కలిసి ఏర్పాటు చేసుకున్న దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య మండలం మొదలైనవి అందుకు ఉదాహరణలు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అధికారాన్ని గుర్తించడానికి అమెరికా తిరస్కరించింది. అలాగే ప్యారిస్ వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించడానికి కూడా నిరాకరించింది. వ్యయాల కంటే లాభాలు అధికంగా వున్నంత వరకు మాత్రమే ప్రపంచీకరణను ఏ దేశమైనా అంగీకరిస్తుందనేది ఒక మౌలిక సత్యం. ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామ్యం వల్ల ప్రయోజనాలు పెద్దగా సమకూరడం లేదని నిర్ధారణ అయితే మనం ఆ సంస్థ నుంచి బయటకు రావచ్చు. హక్కులను శాశ్వతంగా వదులుకోవడమనేది ఎక్కడా జరగదు. ఉదాహరణకు స్వాతంత్ర్యానికి పూర్వం మన సంస్థానాల రాజులు తమ అధికారాలను బ్రిటిష్ వారికి శాశ్వతంగా ఇచ్చివేశారు. అయితే ప్రజలు ఈ లొంగుబాటును అంగీకరించలేదు. మహాత్మాగాంధీ నాయకత్వంలో తిరగబడ్డారు. తమ సార్వభౌమిక హక్కులను పునః సాధించుకున్నారు. అంతిమ సార్వభౌములు ప్రజలే. ఈ ధరిత్రిపై ఏ శక్తి కూడా వారి సార్వభౌమత్వాన్ని స్వాయత్తం చేసుకోలేదు. ప్రపంచీకరణ శక్తులు ఎంత శక్తిమంతంగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ వారిపై తిరగబడినట్టుగా, మన ప్రజలు వాటికి వ్యతిరేకంగా తిరగబడటం ఖాయం. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వరంలో ప్రస్తుతం అమలవుతోన్న ప్రపంచీకరణ బ్రిటిష్ వలస పాలకుల హయాంలో చోటుచేసుకున్న ప్రపంచీకరణకు మౌలికంగా భిన్నమైనది కాదు. అయితే రవాణా, కమ్యూనికేషన్ రంగాలలో మౌలిక విప్లవాత్మక మార్పులు ప్రస్తుత ప్రపంచీకరణను నిర్వచిస్తున్నాయి, నిర్దేశిస్తున్నాయి. అయినప్పటికీ ప్రపంచీకరణ నుంచి ఉపసంహరించుకోవడంలో మన ప్రజల మౌలిక సామర్థ్యం తక్కువేమీ కాదు. ఆ సామర్థ్యాన్ని ఎవరూ తగ్గించలేరు. చెప్పవచ్చినదేమిటంటే ప్రపంచీకరణ గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. అయితే ప్రపంచీకరణ వ్యయ లాభాలను ప్రజలకు విడమర్చి చెప్పాలి. మెరుగైన అవగాహన ఉన్నప్పుడు, అవసరమైతే ఆ ఆర్థిక ప్రక్రియ నుంచి ఉపసంహరించుకోవడానికి వారు స్వేచ్ఛగా సరైన నిర్ణయం తీసుకోగలరు. ప్రపంచీకరణ మన స్వాతంత్ర్యాన్ని హరించివేస్తుందనే విషయమై ఆందోళన పడవల్సిన అవసరం లేదు. మన మేధావులు ప్రపంచీకరణ శక్తుల పక్షాన చేరి ప్రజలకు ఆ ఆర్థిక ప్రక్రియ వ్యయలాభాల గురించి తప్పుడు సమాచారం అందిస్తుండడమే ఎంతైనా ఆందోళన చెందవలసిన విషయం.(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్) | editorial |
6,198 | 30-07-2017 09:35:12 | బిగ్ బాస్ సంబురాలు! | ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో సూపర్ హిట్ అయింది. ప్రేక్షకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఆ షో సూపర్ హిట్ అయిందన్నదానికి టీఆర్పీ రేటింగులే నిదర్శనం. తెలుగులో ఏ షోకు కూడా రాని రీతిలో టీఆర్పీ రేటింగులు బిగ్ బాస్ షోకు వచ్చాయి. 16.8 రేటింగ్‌తో బిగ్ బాస్, నిజంగానే మిగతా షోలకు బిగ్ బాస్ అయిపోయింది. ఇంతమంచి టీఆర్పీ రేటింగులు వచ్చిన సందర్భంగా ‘మా’ యాజమాన్యం, బిగ్ బాస్ యూనిట్ బిగ్ బాస్ సెట్లో సంబురాలు చేసింది. బిగ్ బాస్ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్, కేక్ కట్ చేసి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘బిగ్ బాస్ షో రికార్డ్ బ్రేకింగ్ నంబర్స్ వచ్చినందుకు సంబురాల సమయం’’ అంటూ ట్వీట్ చేశారు. మున్ముందు ఈ షో ఎలా సాగుతుందో చూద్దాం. | entertainment |
15,226 | 10-01-2017 03:23:48 | మణిపూర్‌లో నాలుగో కూటమి | ఇంఫాల్, జనవరి 9: మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని, ఈసారి పీఠం తనదేనని గట్టి నమ్మకంతో ఉన్న బీజేపీని ఢీకొనేందుకు రాష్ట్రంలోని చిన్నాచితకా పార్టీలన్నీ జట్టు కట్టాయి. వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్‌డీఎఫ్) గొడుగు కింద పోటీ చేయాలని నిర్ణయించాయి. సీపీఐ, సీపీఎం, ఎన్‌సీపీ, ఆప్, జనతాదళ్(యు), మణిపూర్ జాతీయ ప్రజాస్వామ్య(ఎంఎన్‌డీఎఫ్) ఈ కూటమిలో భాగస్వాములయ్యాయి. వచ్చే ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు పోటీ చేస్తామని, అధికారాన్ని చేజిక్కించుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మొయిరాంగ్తెమ్ ధీమా వ్యక్తం చేశారు. | nation |
9,877 | 23-05-2017 12:44:56 | ‘యాంకర్ రవి కనిపిస్తే కాళ్లు విరగ్గొడతాం’ | హైదరాబాద్: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఇప్పుడు టాలీవుడ్ మెడకు చుట్టుకొనేలా ఉంది. సీనియర్ నటుడు చలపతిరావు చేసిన అసభ్యకర వ్యాఖ్యాలతో మహిళాలోకం భగ్గుమంది. చలపతిరావుపై ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా సంఘం నేతలు యాంకర్ రవిపై కూడా మండిపడుతున్నారు. అంతేకాకుండా టాలీవుడ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళలను కించపరచడానికే ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నారంటూ మహిళా సంఘాల నేత సజయ ఆరోపించారు. కనీస ఇంగితజ్ఞానం లేకుండా, సీనియర్ నటుడనే సంస్కారం లేకుండా ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడిన చలపతిరావు మహిళలకే కాకుండా మానవజాతి మొత్తానికి క్షమాపణ చెప్పాలని సజయ డిమాండ్ చేశారు. చలపతిరావు చేసిన కామెంట్‌కు ‘సూపర్ సర్’ అన్న యాంకర్ రవి తమకు కనిపిస్తే కాళ్లు విడగ్గొడతామని హెచ్చరించారు. రవి యాంకరింగ్ చేసే అన్ని షోలలోకూడా ఆడవాళ్ల గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ సజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నువ్వు యాంకర్‌గా ఉండాలంటే ఉండు. నీకు ఉన్న టాలెంట్ చూపించు. కానీ ఈ రకమైన కామెంట్లు చేయకు. వాట్ సూపర్?.. నీ తల్లిని అట్లా మాట్లాడితే నువ్వు సూపర్ అంటావా రవి? చెప్పు? ఎవడు వాడు అసలు? వాడి వయసెంత.. వాడు సూపర్ అని మాట్లాడడానికి. వాడు క్షమాపణ చెప్పాలి.. నాగార్జున గారు చెప్పాలి. వాళ్ల కుటుంబం తరపున, ఇండస్ట్రీ తరపున బయటకొచ్చి మేం క్షమాపణ చెబుతున్నాం అని నాగార్జున గారు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ సినిమాకు ఆ ట్యాగ్ లైన్ తీసెయ్యాలి.’’ అని ప్రముఖ ఉద్యమకారిణి సజయ డిమాండ్ చేశారు. | entertainment |
3,629 | 22-05-2017 02:06:09 | గజల్, వచన కవితలకు ఆహ్వానం |
నెలవంకనెమలీక సాహిత్య పత్రిక తణికెళ్ల సూరిబాబు స్మారక పురస్కారం కోసం గజల్, వచన కవితలను ఆహ్వానిస్తున్నది. రూ.1,116 చొప్పున 6 బహుమతులు ఉంటాయి. ఫోటోతో రచనలను మే30లోగా ఎడిటర్, నెలవంకనెమ లీక సాహిత్య మాసపత్రిక, 15-140, పి అండ్ టి కాలనీ, కోదండ రామాలయం వీధి, దిల్ సుఖ్‌నగర్, హైదరాబాద్-500060కు పంపాలి. వివరాలకు 9866171648.- లక్కరాజు దేవి | editorial |
10,966 | 22-12-2017 12:24:02 | ‘హలో’ చూసిన తర్వాత కత్తి మహేశ్ రివ్యూ | అఖిల్ సినిమా నిరాశపరిస్తే.. ఆ ఆశలను హలో సినిమా నిజం చేసిందని సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ చెప్పాడు. మనసంతా నువ్వే తరహా ప్రేమకథకు కాస్త యాక్షన్ జోడించి.. భావోద్వేగాలను మిళితం చేసి.. ప్రేక్షకులకు నచ్చే విధంగా హలో సినిమాను విక్రమ్ తెరకెక్కించారని కత్తి మహేశ్ చెప్పాడు. ప్రేమకథలకు ప్రేమ జంట జోడీనే ప్రధానమని.. అఖిల్, కల్యాణి జంట చూడ చక్కగా ఉందని చెప్పుకొచ్చాడు. రమ్యకృష్ణ, జగపతి బాబు నటన కూడా సినిమాకు కలిసొచ్చిందని కత్తి మహేశ్ చెప్పాడు. సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు వేయొచ్చని తెలిపాడు. అనూప్ రూబెన్స్ సంగీతం మనం దగ్గరే ఆగిపోయిందేమోనని హలో చూసిన తర్వాత అనిపించిందని కత్తి అభిప్రాయపడ్డాడు. సంగీతం కూడా ఆశించిన విధంగా ఉంటే సినిమాకు మరింత కలిసొచ్చేదని చెప్పాడు. మొత్తం మీద ప్రేక్షకులకు సినిమా చూసిన తర్వాత ఓ అందమైన అనుభూతి కలగడం ఖాయమని కత్తి మహేశ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ముమైత్ ఖాన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేక క్విజ్ | entertainment |
4,202 | 11-02-2017 03:52:18 | భూసంస్కరణల అమలుతో బహుజనులకు మేలు! | అసలు అవినీతికి మూలమైనది వ్యక్తిగతమైన ఆస్తి. భారతదేశం ప్రధానంగా వ్యవసాయక దేశం. దేశ జనాభాలో ఎక్కువ మంది నిరుపేదలైన వ్యవసాయ కూలీలే. భూ సంస్కరణలను చేపట్టాలని అంబేడ్కర్ రాజ్యాంగంలో ప్రతిపాదించారు. కానీ అది జరగలేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా పేదలకు భూములు పంచితే ఇలాంటి నిర్ణయాలు అవసరముండదు. అసలు అవినీతికి మూలమైనది వ్యక్తిగతమైన ఆస్తి. అది ప్రాథమిక హక్కుల నుంచి తీసివేయమని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతిపాదించారు. కానీ అమలు జరుగలేదు. ఆర్టికల్ 31 ఆస్తి హక్కుకు సంబంధించినది. తరువాత 44వ రాజ్యాంగ సవరణ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినది. కేవలం అది ఒక హక్కు మాత్రమే. అంటే ఆ హక్కుకు ప్రత్యేకత లేదు. కానీ ఆస్తులు కూడబెట్టుకునే వారికి అడ్డు కాదు. నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనించాయి. ఇది ఒక సంచలన నిర్ణయం అని దేశీయ మీడియా, అంతర్జాతీయ మీడియా ప్రచారం చేశాయి. బీజేపీ ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు ఈ అంశాన్ని ఎంతగానో ప్రచారం చేసుకున్నాయి. మన ముఖ్యమంత్రి ఎలక్ట్రానిక్ మనీ, ప్లాస్టిక్ మనీ అని కొత్త కొత్త పదాలు తీసుకొని వచ్చారు.ఈ దేశంలోని నల్లధనాన్ని వెలికితీసి, పేదరికాన్ని నిర్మూలించి తద్వారా అవినీతి రహిత భారతదేశంగా చేస్తానని బీజేపీ ప్రగల్భాలు పలికింది. ఇంత గొప్ప కార్యంలో ప్రజలందరూ పాలు పంచుకొని అవినీతి నిరోధానికి, దేశ అభివృద్ధికి పాటుపడాలని మోదీ పిలుపునిచ్చారు. పేద ప్రజలు తాము కష్టించి చమటోడ్చి సంపాదించిన ఒకటి రెండు ఐదు వందల, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకొనుటకు గంటల తరబడి బ్యాంకుల ముందు నిలబడి ప్రాణాలు అర్పించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్‌రెడ్డి, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, టాటా, బిర్లా, రిలయన్స్ వారసులు ప్రపంచ ధనికుల్లో 10 మంది భారతీయులు ఎవ్వరూ బ్యాంకుల ముందు క్యూలలో కానరాలేదు. నోట్ల రద్దుతోనే పేదరికం పోతుందనే ప్రచారం చేసిన ప్రభుత్వాలను ఏమనాలి? భారతదేశం ప్రధానంగా వ్యవసాయక దేశం. రాజ్యాంగం అమలులో వచ్చేనాటికి బలమైన భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉన్నది. వందల వేల ఎకరాల భూమి సంస్థానాధీశులు, భూస్వాముల ఆధీనంలో ఉన్నది. దేశ జనాభాలో ఎక్కువ మంది నిరుపేదలైన వ్యవసాయ కూలీలే. అందువలన అంబేడ్కర్ భూ సంస్కరణలను చేపట్టి భూములను వికేంద్రీకరించి భూమి లేని వారికి భూమి పంచాలని, భూమి అంతా ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని, రాజ్యాంగంలో ప్రతిపాదించారు. కానీ అది నెరవేరలేదు. వ్యక్తిగతమైన ఆస్తి ప్రాథమిక హక్కు నుంచి ఆస్తి హక్కుగా మారిన దాని నుంచి రాజ్యాంగంలో నుంచి తొలగించి భూమి మొత్తాన్ని జాతీయీకరణ చేసి భూమి దళిత, బహుజనలకు, అగ్రవర్ణంలోని భూమి లేని వారికి అంబేడ్కర్ చెప్పినట్లు భూమిని పంచినట్లయితే పెద్దనోట్ల రద్దు నిర్ణయం భారత దేశానికి అవసరమయ్యేది కాదు. పెద్దనోట్లు వాటంతట అవే కాలగర్భంలో కలసిపోయేవి. ఇప్పటికైనా ప్రభుత్వాలు హేతువాద దృక్పథంతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లి ప్రసన్న కుమార్‌పిడుగురాళ్ళ, గుంటూరు జిల్లానరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనించాయి. ఇది ఒక సంచలన నిర్ణయం అని దేశీయ మీడియా, అంతర్జాతీయ మీడియా ప్రచారం చేశాయి. బీజేపీ ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు ఈ అంశాన్ని ఎంతగానో ప్రచారం చేసుకున్నాయి. మన ముఖ్యమంత్రి ఎలక్ట్రానిక్ మనీ, ప్లాస్టిక్ మనీ అని కొత్త కొత్త పదాలు తీసుకొని వచ్చారు.ఈ దేశంలోని నల్లధనాన్ని వెలికితీసి, పేదరికాన్ని నిర్మూలించి తద్వారా అవినీతి రహిత భారతదేశంగా చేస్తానని బీజేపీ ప్రగల్భాలు పలికింది. ఇంత గొప్ప కార్యంలో ప్రజలందరూ పాలు పంచుకొని అవినీతి నిరోధానికి, దేశ అభివృద్ధికి పాటుపడాలని మోదీ పిలుపునిచ్చారు. పేద ప్రజలు తాము కష్టించి చమటోడ్చి సంపాదించిన ఒకటి రెండు ఐదు వందల, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకొనుటకు గంటల తరబడి బ్యాంకుల ముందు నిలబడి ప్రాణాలు అర్పించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్‌రెడ్డి, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, టాటా, బిర్లా, రిలయన్స్ వారసులు ప్రపంచ ధనికుల్లో 10 మంది భారతీయులు ఎవ్వరూ బ్యాంకుల ముందు క్యూలలో కానరాలేదు. నోట్ల రద్దుతోనే పేదరికం పోతుందనే ప్రచారం చేసిన ప్రభుత్వాలను ఏమనాలి? భారతదేశం ప్రధానంగా వ్యవసాయక దేశం. రాజ్యాంగం అమలులో వచ్చేనాటికి బలమైన భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉన్నది. వందల వేల ఎకరాల భూమి సంస్థానాధీశులు, భూస్వాముల ఆధీనంలో ఉన్నది. దేశ జనాభాలో ఎక్కువ మంది నిరుపేదలైన వ్యవసాయ కూలీలే. అందువలన అంబేడ్కర్ భూ సంస్కరణలను చేపట్టి భూములను వికేంద్రీకరించి భూమి లేని వారికి భూమి పంచాలని, భూమి అంతా ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని, రాజ్యాంగంలో ప్రతిపాదించారు. కానీ అది నెరవేరలేదు. వ్యక్తిగతమైన ఆస్తి ప్రాథమిక హక్కు నుంచి ఆస్తి హక్కుగా మారిన దాని నుంచి రాజ్యాంగంలో నుంచి తొలగించి భూమి మొత్తాన్ని జాతీయీకరణ చేసి భూమి దళిత, బహుజనలకు, అగ్రవర్ణంలోని భూమి లేని వారికి అంబేడ్కర్ చెప్పినట్లు భూమిని పంచినట్లయితే పెద్దనోట్ల రద్దు నిర్ణయం భారత దేశానికి అవసరమయ్యేది కాదు. పెద్దనోట్లు వాటంతట అవే కాలగర్భంలో కలసిపోయేవి. ఇప్పటికైనా ప్రభుత్వాలు హేతువాద దృక్పథంతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లి ప్రసన్న కుమార్‌పిడుగురాళ్ళ, గుంటూరు జిల్లా | editorial |
5,509 | 25-11-2017 14:21:23 | వెంకటేష్ `నో`.. రవితేజ `ఓకే`! | `సొగ్గాడే చిన్ని నాయనా`, `రారండోయ్ వేడుక చూద్దాం` వంటి వరుస హిట్ సినిమాలు రూపొందించిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ. రెండు వరుస హిట్లు అందించిన ఈ దర్శకుడికి అవకాశాలు ఇచ్చేందుకు హీరోలు ఇంకా ముందుకు రావడం లేదు. తాజాగా ఈ దర్శకుడు ఓ కథ సిద్ధం చేసుకుని సీనియర్ హీరో వెంకటేష్‌కు వినిపించాడట. ఆ కథ వెంకీకి నచ్చలేదట. దీంతో ఆ సినిమా చేయనని వెంకీ చెప్పేశాడట. ఇప్పుడు ఇదే లైన్‌ను మాస్ మహారాజ్ రవితేజకు వినిపించాడట. ఆ కథ రవితేజకు నచ్చిందట. వెంటనే ఆ సినిమాలో నటించేందుకు తన అంగీకారం తెలిపాడట. రవితేజకు తాజాగా విజయం అందించిన `రాజా ది గ్రేట్` కథను కూడా రామ్, ఎన్టీయార్ తిరస్కరించిన విషయం తెలిసిందే. | entertainment |
21,218 | 01-03-2017 02:25:02 | భోజనానికి 75 లక్షలా? |
లెక్కలు భయంకరం..హెచ్‌సీఏ తీరుపై హైకోర్టు అసంతృప్తిభారత్-బంగ్లా మ్యాచ్‌పై నివేదికకు ఆదేశం | sports |
344 | 20-12-2017 00:44:37 | అమెరికాతో కేసు సెటిల్ | డాక్టర్ రెడ్డీస్ వెల్లడిహైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : ప్రిస్ర్కిప్షన్ ప్రొడక్ట్ ప్యాకేజింగ్ కేసులో అమెరికా ప్రభుత్వంతో ఆరేళ్లుగా కొనసాగుతున్న కేసు కు ముగింపు పలుకుతున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వెల్లడించింది. ఐదు బ్లిస్టర్ ప్యాక్డ్ ప్రిస్ర్కిప్షన్ ఉత్పత్తుల కేసుకు సంబంధించి 50 లక్షల డాలర్లు (సుమా రు రూ.32 కోట్లు) చెల్లించటం ద్వారా అమెరికా అనుబంధ సంస్థ ఈ కేసును సెటిల్ చేసుకోనుందని తెలిపింది. ఈ కేసులో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా తీర్పు వెలువరించేందుకు యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. రోగులు, వినియోగదారుల రక్షణకు డాక్టర్ రెడ్డీస్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఇందుకనుగుణంగానే గడచిన ఆరేళ్లుగా ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తిగా సహకరించటమే కాకుండా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిపింది. మరోవైపు అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఆరోపణలు చేసిందన్న వార్తలను తోసిపుచ్చింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతో ఈ సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు తెలిపింది. | business |
1,906 | 06-07-2017 00:39:22 | పిఇ పెట్టుబడుల జోరు | 6 నెలల్లో 1,134 కోట్ల డాలర్లుభారత కంపెనీల్లో ప్రైవేట్ ఈక్విటీ (పిఇ) పెట్టుబడులు వెల్లువెత్తుతున్నా యి. జూన్, 2017తో ముగిసిన త్రైమాసికంలోనూ కంపెనీలు 540 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాయి. దీంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు భారత కంపెనీల్లో పిఇ పెట్టుబడులు 1,134 కోట్ల డాలర్లకు చేరాయి. ప్రస్తుత మారకం రేటు ప్రకా రం ఇది దాదాపు రూ.73,710 కోట్లకు సమానం. ఒక త్రైమాసికంలో పిఇ పెట్టుబడులు 500 కోట్ల డాలర్లు దాటడం వరసగా ఇది మూడోసారని వెంచర్ ఇంటలీజెన్స్ సంస్థ తెలిపింది. | business |
11,890 | 05-09-2017 11:19:04 | ప్రజల్ని వణికిస్తున్న కఠిన శాసనాలు | ప్యోంగ్యాంగ్: కార్యాలయంలో ఎవరైన్ పోర్న్ మూవీ చూస్తే వారాంతపు సెలవు రద్దు. వచ్చేవారం రోజులు తప్పనిసరిగా పనిచేయాలి.నగర పౌరులెవరైనా సరే తమ ఇంట్లోని రేడియో సౌండ్ పెంచకూడదు. అలా అని తగ్గించకూడదు. ఈ రేడియో సర్కారు నియంత్రణలో పనిచేస్తుంది.దేశంలోని న్యూన్ పేపర్లు, మ్యాగజైన్లలో ఇతర దేశాల వార్తలు ప్రచురించకూడదు.ఎవరూ నీలిరంగు జీన్స్ ధరించకూడదు. ఇలా ధరిస్తే దీనిని నేరంగా పరిగణిస్తారు. కాదని ఈ పనిచేస్తే కఠిన చర్యలు తప్పవు.దేశంలోని పురుషులంతా ఒకే తరహా హెయిర్ స్టయిల్ కలిగివుండాలి. దేశాధినేత హెయిర్ స్టయిల్‌ను అంతా ఫాలో కావాలి.దేశంలోని పేద ప్రజల ఫొటోలు ఎవరూ తీయకూడదు.జూలై 8, 17 తేదీల్లో ఎటువంటి ఉత్సవాలు నిర్వహించకూడదు. ఆ రోజుల్లో దేశాధినేతల వర్థంతులు నిర్వహిస్తారు.మొబైల్ తీసుకువచ్చే పర్యాటకులను దేశంలోకి అనుమతించేది లేదు. మొబైల్ ఫోన్లను ఎయిర్ పోర్టులోఅప్పగించిన తరువాతే దేశంలో కాలుమోపాలి.తిరిగివెళ్లిపోయేటప్పుడు వాటిని తీసుకెళ్లవచ్చు.ఎవరూ వాహనాలు కొనుగోలు చేయకూడదు. ప్రభుత్వ, మిలటరీ అధికారులకు ఈ నియమం వర్తించదు.పొరుగు దేశంతో సంబంధాలు కలిగిన సినిమాలు చూడకూడదు.బైబిల్‌ను తమతో పాటు ఉంచుకోకూడదు.ఇవన్నీ ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ తాజాగా జారీచేసిన విచిత్ర ఆదేశాలు. వీటిని దేశ పౌరులు తప్పనిసరిగా పాటించాలి. లేని పక్షంలో కఠిన శిక్షకు గురవుతారని కిమ్ హెచ్చరించారు. | nation |
10,819 | 05-06-2017 15:48:29 | నష్టాల్లో ఉన్న నిర్మాతకు నయన్ ఝలక్! | హీరోయిన్ నయనతార ప్రొడ్యూసర్‌కు గట్టి ఝలకే ఇచ్చారట. మూడేళ్ల క్రితం ప్రారంభమైన గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమాకు ఆది నుంచీ ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఆ ఆటంకాలన్నిటినీ దాటుకుంటూ జూన్ 9న విడుదలకు సిద్ధమైన ఆ సినిమాకు నయన్ అనుకోని షాక్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. ఆ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా నయనతారను నిర్మాతలు కోరారట. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న నిర్మాతలు.. నయనతార స్పందనకు షాక్ అయ్యారని అంటున్నారు. వారం రోజుల పాటు టీవీ షోలు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తానని, అయితే.. తాను డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వాల్సిందేనని ఆమె పట్టుబట్టారట. రూ.30 లక్షల మొత్తం, రాను..పోను ప్రయాణ ఖర్చులు, బస ఏర్పాట్లు చూసుకోవాలని డిమాండ్ చేశారట. అయితే.. ఆర్థికంగా కొంచెం కష్టం ఉందని, కాస్తంత వీలు చేసుకోవాలని నయన్‌ను కోరినా.. దేనికదేనని ఆమె స్పష్టం చేసిందట. సినిమా ప్రచారానికి తాను వస్తే.. తమిళ సినిమాల షెడ్యూళ్లు దెబ్బతింటాయని, కాబట్టి డబ్బులిస్తేనే వస్తానని తేల్చి చెప్పారట. అయితే.. ఆమెకు అంత మొత్తం ఇచ్చే వీలే ఉంటే ప్రకటనల మీదే ఖర్చు చేసేవాళ్లమని నయన్‌పై నిర్మాతలు ఆశలు వదిలేసుకున్నారట. అయితే.. ఇటు నయనతారపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు నయన్ బాధంతా.. ప్రచారానిక వస్తే సినిమాల షెడ్యూళ్లు దెబ్బతింటాయనా..? లేదంటే డబ్బుల కోసమా..? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షెడ్యూళ్లే దెబ్బతింటాయనే బాధే ఉంటే.. డబ్బులిస్తేనే వస్తానని నయన్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారోనని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. కాగా, ఆరడుగుల బుల్లెట్ సినిమా బి.గోపాల్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంది. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. | entertainment |
8,982 | 02-12-2017 19:29:08 | కొరటాల శివ- అక్కినేని అఖిల్ సినిమా ఖరారు..? | దర్శకుడు కొరటాల శివ - హీరో అక్కినేని అఖిల్ కాంబినేషన్‌లో సినిమా ఖరారైనట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అంతేకాదు కొరటాల శివ అఖిల్ మూవీ తర్వాతే రామ్ చరణ్‌తో సినిమా చేస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కొరటాల శివ మహేశ్‌తో ‘భరత్ అనే నేను’ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఇది పూర్తి అయిన వెంటనే రామ్‌చరణ్‌తో సినిమా చేయాల్సిఉంది. ఇంతలో రామ్‌చరణ్ బోయపాటితో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. దీంతో కొరటాల శివ అక్కినేని అఖిల్‌ని లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్‌తో కూడా ఇంకో సినిమా చేయొచ్చని అనుకుంటున్నారు సినిమా వర్గాలు. కాగా హీరో అక్కినేని అఖిల్ నటించిన ‘హలో’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. | entertainment |
15,764 | 26-07-2017 17:46:39 | ఈడీ కస్టడీకి కశ్మీర్ వేర్పాటువాద నేత షబీర్ షా | న్యూడిల్లీ: ఉగ్ర నిధుల కేసులో జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసిన కశ్మీర్ వేర్పాటు వాద నేత షబీర్ షాకు కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఆదేశించింది. జమ్మూకశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడం పార్టీ నేత అయిన షబీర్ షాను మంగళవారం సాయంత్రం సనత్‌నగర్ రెసిడెన్స్‌లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. దశాబ్దానికి పైగా నడుస్తున్న మనీ లాండరింగ్ కేసులో షబీర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ బుధవారం ఉదయం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచింది. దీంతో 7 రోజుల పాటు ఈడీ కస్డడీలో ఉండేందుకు కోర్టు అనుమతించింది. కాగా, తన అరెస్టువెనుక రాజకీయ కుట్ర ఉందని పాటియాలా హౌస్ కోర్టు వెలుపల షబీర్ వ్యాఖ్యానించారు. టెర్రర్ ఫైనాన్స్ ఆరోపణల కింద 12 ఏళ్లుగా షబీర్‌పై ఈడీ కేసు ఉంది. తమ ముందు విచారణకు హాజరుకావాలని ఇప్పటికి 8 సార్లు ఈడీ సమన్లు పంపినప్పటికీ షబీర్ సాక్ష్యం ఇచ్చేందుకు నిరాకరిస్తూ వచ్చారు. ఉగ్రనిధుల వ్యవహారంలో షీబీర్‌కు సంబంధాలున్న విషయం 2005 ఆగస్టులో మొహమ్మద్ అస్లాం వనీ అనే హవాలా డీలర్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేయడంతో బయటపడింది. వనీ నుంచి రూ.63 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ నుంచి తనకు ఈ నిధులు వచ్చాయని, ఇందులో 53 లక్షలు షబీర్‌కు చెందాల్సి ఉందని విచారణలో వనీ వెల్లడించాడు. దీంతో షబీర్‌కు ఈడీ మరోమారు ఇటీవల సమన్లు పంపినప్పటికీ ఆయన ఖాతరు చేయలేదు. గృహనిర్బంధంలో ఉండటం వల్లే విచారణకు హాజరుకాలేకపోయినట్టు షబీర్ చెబుతున్నారు. | nation |
8,720 | 09-05-2017 11:56:20 | బాహుబలి హిస్టరీని చెరిపేస్తారట! | బాహుబలి ఎఫెక్ట్ హిందీ చిత్ర సీమపై, బాలీవుడ్ బడా హీరోలపై భారీగానే పడినట్టుంది. అందుకే రాజమౌళి తీసిన చిత్రంపై ఏ బాలీవుడ్ బడా హీరో కూడా స్పందించలేదు. వెయ్యి కోట్ల ఘనత సాధించిందన్న ఒకే ఒక్క కారణంతో పొడి..పొడి మాటలన్నారే తప్ప.. మనస్ఫూర్తిగా సినిమాను కొనియాడినట్టు ఎక్కడా కనిపించలేదు. నిన్నటికి నిన్న ఏఆర్ రెహ్మాన్.. వీఆర్‌కు బాహుబలి సూటవ్వదని తేల్చేశాడు కూడా. దీనిపై నెటిజన్లు అదే రీతిలో స్పందించారు. ఇక, అసలు విషయానికొస్తే... బాహుబలి-2 సినిమాను తలదన్నే సినిమాను చేయాలనుకుంటున్నాడట బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. ప్రస్తుతం అతడు ధూమ్-3 డైరెక్టర్ విజయ్ కృష్ణ డైరెక్షన్‌లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరూ బాహుబలి సినిమా గురించే మాట్లాడుకుంటున్న నేపథ్యంలో.. దాన్ని మించేటట్టుగా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌ను తీయాలనుకుంటున్నాడట విజయ్ కృష్ణ. అందుకే రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించాలని, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ రీతిలో ఎక్కువ సీక్వెల్స్‌ను తీయాలన్న ఆలోచనలో ఉన్నాడట. దాని కోసం స్క్రిప్ట్‌ను చాలా జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బాహుబలిని థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ మించిపోవాలన్న కృత నిశ్చయంతో విజయ్ కృష్ణ పనులు ప్రారంభించినట్టు చెబుతున్నారు. స్క్రిప్ట్‌లో ఎలాంటి లోపాలు లేకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారని అంటున్నారు. బాహుబలి హిస్టరీని చెరిపేసి థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌తో సరికొత్త చరిత్రను లిఖించాలని విజయ్ కృష్ణ అండ్ టీం పనిచేస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి, బాహుబలి రికార్డులను థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ బ్రేక్ చేస్తుందో.. లేదో తెలియదు కానీ, బాలీవుడ్‌కు బాహుబలి నిద్ర పట్టకుండా చేస్తోందన్నది మాత్రం నిజమేనని రుజువైంది. | entertainment |
16,719 | 18-12-2017 17:25:11 | మీ ప్రేమకు ధన్యవాదాలు : రాహుల్ గాంధీ |
న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రేమాభిమానాలు చూపినవారందరికీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా తీర్పును కాంగ్రెస్ గౌరవిస్తుందన్నారు. నూతన ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. వరుస ట్వీట్లలో ఆయన ఈ రాష్ట్రాల ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ప్రజా తీర్పును కాంగ్రెస్ అంగీకరిస్తుంది, ఈ రెండు రాష్ట్రాల్లో నూతన ప్రభుత్వాలను అభినందిస్తున్నాను. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు నా మీద చూపిన ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను’’ అని ఓ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో... ‘‘నా కాంగ్రెస్ సోదర, సోదరీమణులారా! మీరు నన్ను గర్వపడేలా చేశారు. మీరు తలపడినవారి కన్నా మీరు ప్రత్యేకమైనవారు ఎందుకంటే, మీరు కోపంపై హుందాగా పోరాడారు. మర్యాద, ధైర్యమే కాంగ్రెస్ గొప్ప శక్తి అని అందరికీ మీరు వివరించారు’’ అని పేర్కొన్నారు. | nation |
8,502 | 18-01-2017 03:03:59 | జైరానే నా రోల్‌మోడల్! | - బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ‘దంగల్’ జైరాపై కశ్మీర్ యువత ఎందుకు ఫైర్ అయ్యారంటే..ఇక్కడ క్లిక్ చేయండి | entertainment |
9,926 | 24-06-2017 19:44:39 | జూన్ 24న ఎమ్మెస్ విశ్వనాథన్ జయంతి | తమిళనాట పుట్టినా తెలుగువారినీ విశేషంగా ఆకట్టుకున్నారు సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్. నేడు ఎమ్మెస్ జయంతి. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతమంటే ఈ నాటికీ ఎందరో సంగీతప్రియులకు అమితాభిమానం. తెలుగునేలపై సైతం విశ్వనాథన్ బాణీలు విశేషాదరణ చూరగొన్నాయి. తెలుగు సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన విశ్వనాథన్, తన మిత్రుడు టి.కె.రామ్మూర్తితో కలసి పలు తెలుగు చిత్రాలకు మరపురాని మధురస్వరాలు సమకూర్చారు. కొంతకాలం గడచిన తరువాత విశ్వనాథన్ ఒక్కరే సంగీతం సమకూర్చారు. అప్పుడు కూడా మధురామృతం పంచారు. ఆయన సంగీతాన్ని అభిమానించి ఆరాధించిన దర్శకనిర్మాతలెందరో... ఇక కథానుగుణంగా బాణీలు కట్టడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ఎమ్మెస్. ఆయన స్వరకల్పన ఈతరం సంగీతాభిమానులను సైతం పులకింప చేస్తూనే ఉంది. అలా తెలుగువారి మదిలో సుస్థిరస్థానం సంపాదించారు ఎమ్మెస్. | entertainment |
10,337 | 04-11-2017 15:08:15 | ఒకే ఫ్రేమ్‌లో 'అల్లు' బ్రదర్స్.. | మనకు అల్లు అరవింద్ కుమారుల్లో అల్లు అర్జున్ బాగా తెలుసు.. తర్వాత శిరీష్ తెలుసు. వీరిద్దరే కాదు వెంకటేష్ అనే మూడో బ్రదర్ కూడా ఉన్నారు. ఉన్నట్టు అయితే తెలిసి ఉంటుంది కానీ ఆయన్ను సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి తప్ప బయటి వారు పెద్దగా చూసి ఉండారు. ఈ ముగ్గురిలో పెద్ద వెంకటేష్.. తర్వాత బన్నీ.. చిన్నవాడు శిరీష్. వెంకటేష్ బిజినెస్ చూసుకుంటారు. తాజాగా ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం బన్నీ వక్కంతం వంశీ డైరెక్షన్‌లో నాపేరు సూర్య-నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. అల్లు శిరీష్ ప్రస్తుతం ఆనంద్ డైరెక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నారు. | entertainment |
8,659 | 06-06-2017 16:41:23 | మరోసారి జంటగా కళ్యాణ్ రామ్, కాజల్ | 'లక్ష్మీ కళ్యాణం' తరువాత కళ్యాణ్ రామ్, కాజల్ మరోసారి జోడీ కట్టబోతున్నారు. ఇటీవలే వీరి కలయికలో కొత్త మూవీ లాంచ్ అయింది. కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి 'ఎమ్మెల్యే' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అన్న ట్యాగ్ లైన్‌ను ఫిక్స్ చేశారు. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో తెరకక్కబోతున్న ఈ చిత్రం, ఇటీవలే పూజా కార్యక్రమం కూడా జరుపుకుంది. ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మణిశర్మ స్వరాలు సమకూర్చబోతుండగా, రవి కిషన్, అజయ్, వెన్నెల కిశోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇకపోతే జూన్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఈ ఏడాది చివరికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శక-నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి 'లక్ష్మీ కళ్యాణం'లో బావమరదళ్లుగా అలరించిన కళ్యాణ్ రామ్, కాజల్ ఈసారి ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి. | entertainment |
5,314 | 09-09-2017 11:43:46 | అర్జున్ రెడ్డి మూవీ మేకింగ్‌లో టఫ్ఫెస్ట్ సీన్ అదేనట! | అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి తన మూవీ మేకింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ మూవీలో టఫ్ఫెస్ట్ సీన్ ఏది అనిపించింది? ఇంటర్వెల్‌కి బ్లాక్‌ని ఎలా డైరెక్ట్ చేశారు? అని ఓ అభిమాని ప్రశ్నించారు. దీనికి సందీప్ తనకు అత్యంత టఫ్‌గా ఆపరేషన్ థియేటర్ సీన్ అనిపించిందన్నారు. అది ఒక కొత్త ఆపరేషన్ థియేటర్ అని.. దానిలో లైట్స్ పెట్టేందుకు కూడా సపోర్ట్ లేదని సందీప్ పేర్కొన్నారు. కనీసం ఆ ఆపరేషన్ థియేటర్ ప్రారంభోత్సవం కూడా అవలేదన్నారు. ఒక రకమైన రబ్బర్ ఫ్లోర్ ఉందని.. ఆ సీన్ షూట్ చేస్తున్నంత సేపు లైట్స్‌ని చేతులతో పట్టుకుని నిలబడాల్సి వచ్చిందన్నారు. అది ఇబ్బందికరంగా అనిపించిందన్నారు. ఇంటర్వెల్ సీన్ కోసం పెద్ద బెడ్ రూమ్ ఉన్న ఇంటిని సెలక్ట్ చేసుకున్నామన్నారు. ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ అన్నారు. | entertainment |
15,452 | 17-11-2017 02:09:33 | మరో ‘భూమి’పై గ్రహాంతరవాసులు? | మన భూమి అంత పరిమాణంవాతావరణమూ అలాంటిదేఎర్రని మరుగుజ్జు నక్షత్రం చుట్టూ భ్రమణంజెనీవా, నవంబరు 16: మన భూమిపై కాకుండా విశ్వంలో జీవం ఉందా? ఇక్కడి లాంటి వాతావరణమే మరో చోట ఉందా? ఇవీ.. మన మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. ఏలియన్ల చెప్పు చేతల్లో మనం నడుస్తున్నాం అని కొందరు శాస్త్రవేత్తలు అంటే.. అలాంటిదేమీ లేదని మరికొందరు. అయితే, మన భూమిని పోలిన, అంతే పరిమాణం కలిగిన గ్రహం ‘రోజ్ 128బీ’ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రశాంతమైన మరుగుజ్జు నక్షత్రం ‘రోజ్ 128’ చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం భూమికి 11 కాంతి సంత్సరాల దూరంలో ఉందని, దానిపై ఏలియన్లు జీవించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ జెనీవా పరిశోధకులు తెలిపారు. చీలిలోని లా సిల్లా అబ్జర్వేటరీలో యురోపియన్ సౌతర్న్ అబ్జర్వేటరీకి చెందిన ‘హై అక్యూరసీ రేడియల్ వెలాసిటీ ప్లానెట్ సర్చర్’ సాయంతో దీన్ని కనుగొన్నారు. మనం ఆ గ్రహాన్ని చేరుకోవాలంటే దాదాపు 1,41,000ఏళ్లు పడుతుందని తెలిపారు. ఇది మినుకు మినుకు మంటూ కనబడటానికి 79వేల ఏళ్లు పడుతుందని వెల్లడించారు. రోజ్ 128బీ భూమి కంటే కేవలం 1.38 రెట్లు ఎక్కువ వికిరణం కలిగి ఉందని, దశాబ్దం క్రితమే కనుగొన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. | nation |
8,826 | 25-12-2017 22:49:10 | చిరంజీవికి, నాకు భేదాలు వచ్చింది అక్కడే: అల్లు అరవింద్ | తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, అల్లు అరవింద్‌లను శ్రీకృష్ణార్జునులుగా చెప్పుకుంటూ ఉంటారు. చిరంజీవి ఉన్నతికి కారణం అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్‌లే అని కూడా చెప్పుకుంటారు. తాజాగా అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవికి, తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపారు. ఆయన మాట్లాడుతూ..‘‘ చిరంజీవి హీరోగా ఎదుగుతున్న రోజుల్లో ఆయన వెనుక నేను ఉన్నది నిజమే. కానీ కొన్ని చిన్న చిన్న బాధ్యతలు మాత్రమే నేను చూసుకున్నాను. నేను ఈ బాధ్యతలను తీసుకోవడంతో చిరంజీవి సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వెనుక నేను ఉన్నానని, కుటుంబ బాధ్యతలను చూసుకుంటానని నమ్మి.. నాకు ఆ బాధ్యతలను అప్పగించారు. చిరంజీవిగారికి నేనంటూ ఏదైనా చేశాను అంటే అది ఇదే. మా మధ్య ఈ విషయంలో ఏనాడూ విభేదాలు రాలేదు. మా ఇద్దరి అనుబంధం అలా ఉంటుంది. కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాలలోకి చిరంజీవి ఎంటరైన తర్వాత మాత్రం మా ఇద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తాయి. అయినా కూడా మేమిద్దరం ఒకరినొకరం అర్ధం చేసుకుని వాటిని అధిగమించాం. అప్పుడెలా ఉన్నామో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఒకరినొకరం గౌరవించుకుంటాం. అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మా మధ్య అపార్ధాలు ఉండవు. అంతా హ్యాపీగానే ఉన్నాం’’ అని అన్నారు. | entertainment |
3,274 | 09-05-2017 01:32:20 | నాయీ బ్రాహ్మణులకు నామినేటెడ్ పదవులు! |
అనాది కాలం నుంచి సామాజిక సేవలో నాయీ బ్రాహ్మణుల పాత్ర విశిష్టమైనది. దేశంలో, తెలంగాణలో నాయీ బ్రాహ్మణుల స్థితిగతులను గుర్తించని వారుండరు. ప్రతి కుల వృత్తిదారునికి ఒక వృత్తి ఉంటే నాయీ బ్రాహ్మణులకు ఐదు వృత్తులున్నాయి. 1. క్షౌర వృత్తి, 2. మంత్రసాని, 3. వాయిద్యం 4. వైద్యం, 5. దివిటీ. మంగలి లేక మోక్షం లేదంటారు. అలాగే, సమాజాభివృద్ధి లేదు. నిజాం కాలంలో వెట్టిచాకిరి చేస్తూ, వీరు అనేక విధాల బాధలు అనుభవించారు. ఇనాం భూమి పొందినా అది నేడు కన్పించకుండా పోయింది. ఇక విద్యలో నాయీ బ్రాహ్మణుల స్థితి అగమ్య గోచరం. తెలంగాణ జిల్లాల్లో నేటి వరకు ఒక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారంటే అందరూ ఆలోచించవలసిన విషయం. సుమారు ఐదు లక్షలు జనాభా గల వారిలో ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, జిల్లా పరిషత్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ వంటి పదవులు లేవు. ఏ పార్టీ ఇవ్వలేదు. బంగారు తెలంగాణలోనైనా అధికారపార్టీ అర్హులైన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరుతున్నాను.- ఆచార్య ఎం. బాగయ్య | editorial |
245 | 05-10-2017 01:15:19 | ఫిన్‌టెక్ రాజధానిగా విశాఖ | నేడు మాస్టర్ కార్డుతో ఎంఒయురవాణా, రెవెన్యూ శాఖల్లో ప్రయోగం9-10 తేదీల్లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై సదస్సుఐటి సలహాదారు జెఎ చౌదరివిశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సాంకేతిక పరిజ్ఞాన (ఫిన్‌టెక్) కేంద్రంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి సలహాదారు జెఎ చౌదరి తెలిపారు. ఈ నెల 9-10 తేదీల్లో విశాఖలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై అంతర్జాతీయసదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రశ్న: బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అంటే..?జవాబు: సర్వర్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో భద్రపరిచిన సమాచారానికి రక్షణ కల్పించే వ్యవస్థే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ. సైబర్ దాడులు జరిగినా డాటా పోకుండా, కరప్ట్ కాకుండా ఈ టెక్నాలజీ కాపాడుతుంది. డాటాలో మార్పులు, చేర్పులు జరగకుండా అడ్టుకుంటుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ అనుసంధానమని, వివిధ సర్వేల పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం పూర్తిస్థాయిలో సేకరించి పెట్టుకుంటున్నాయి. ఈ సమాచారం ఇతరుల చేతికి వెళితే మా పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. వాటన్నింటికీ సమాధానమే ఈ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ. ఎలా పనిచేస్తుంది? ఈ విధానంలో డాటాను ఒక్క దగ్గర కాకుండా వివిఽ ద ప్రాంతాల్లో, వివిధ పరికరాల్లో, వివిధ రూపాల్లో నిక్షి ప్తం చేస్తారు. ఊహించని అగ్నిప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్‌లు జరిగి డాటా పోయినా, సైబర్ నేరగాళ్లు సర్వర్‌లోకి చొచ్చుకొని పోయి తస్కరించినా ఆ డాటా మరో ప్రాంతంలో భద్రంగా ఉంటుంది. దానికి అనధికారిక మార్పులు చేయకుండా బ్లాక్‌చెయిన్ నిరోధిస్తుంది. దేశంలో ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు?ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తొలి సారిగా భారతదేశానికి ఈ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని తీసుకొచ్చింది. జపాన్‌లో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని అమెరికా విస్తృతంగా ఉపయోగిస్తోంది. దుబాయ్‌లో ప్రతి సంస్థ ఈ టెక్నాలజీని వినియోగించుకుంటోంది. రాష్ట్రం ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటోంది?రెవెన్యూ, రవాణా శాఖల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా నాలుగు అంశాల్లో దీనిని ఉపయోగిస్తున్నారు. భూ వివరాలు నమోదుచేసే రికార్డులకు, యాజమాన్య హక్కులు నిర్ధారిస్తూ ఇచ్చే టైటిల్ డీడ్ పుస్తకాలకు రెవెన్యూ శాఖలో ఈ టెక్నాలజీని వాడుతున్నారు. అంటే ఆ రికార్డులను ఇకపై ట్యాంపరింగ్ చేయడం కుదరదు. పూర్తి భద్రత లభిస్తుంది. అదేవిధంగా రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ రికార్డులకు, వాహనాల రిజిస్ట్రేషన్ రికార్డులకు దీనిని ఉపయోగిస్తున్నారు. వీటి ఫలితాలను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకువచ్చి ఈ టెక్నాలజీని పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తామని ఆసక్తి వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఎవరైనా ముందుకు వచ్చారా?ఈ టెక్నాలజీ గురించి తెలుసుకున్న వెంటనే భాగస్వామ్యం కల్పించాలంటూ ఐసిఐసిఐ, హెచ్‌డిఎ్‌ఫసి, టాటా క్యాపిటల్ వంటి 20 కంపెనీలు ముందుకు వచ్చాయి. వారి డాటాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్యలు ఉన్నాయి. వీటికి ఈ నెల 9-10 తేదీల్లో జరిగే సదస్సులో ఇతర దేశాల నుంచి వచ్చే స్టార్ట్‌పలు పరిష్కారాలు చూపిస్తాయి. ఫిన్‌టెక్ వ్యాలీ పాత్ర ఏమిటి?ఫిన్‌టెక్‌లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ కూడా ఒకటి. ఇందుకోసం 500 కోట్ల నిధులు కేటాయించాం. తిరుపతిలోని ఐఐడీటీలో నిపుణులను తయారుచేస్తున్నాం. మార్కెట్ క్రియేట్ చేస్తున్నాము. మెంటారింగ్ చేస్తున్నాము. ఇవన్నీ ఫిన్‌టెక్ ద్వారానే జరుగుతున్నాయి. ఫిన్‌టెక్ పురోగతి ఏమిటి?ప్రస్తుతం ఎనిమిది స్టార్టప్ కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇప్పటికే వీసా కంపెనీతో కలిసి పనిచేస్తున్నాం. ఢిల్లీలో గురువారం జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాస్టర్ కార్డు కంపెనీతో ఎంఒయు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. ఈ రంగాల్లో పరిశోధనలు ఏమైనా జరుగుతున్నాయా?ఐటిలో నూతన సాంకేతిక పరిజ్ఞాన కేంద్రంగా ఎపిని ముందువరుసలో నిలపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్నాం. సైబర్ సెక్యూరిటీకి 42 42 అనే ఇజ్రాయిల్ సంస్థతో కలిసి పనిచేస్తున్నాం. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో బ్రాడ్‌రీచ్ కంపెనీతో, ఫిన్‌టెక్‌కు శ్యామ్‌సన్ రైటర్స్‌తో, క్రిప్టాలజీలో జేసీ బోస్‌తో కలిసి పరిశోధనలు చేస్తున్నాం. విశాఖ సదస్సు నిర్వహణ ఉద్దేశం ఏమిటి?ఇది అధునాతన టెక్నాలజీ. ఫలితాలపై విశ్వాసం కలిగితేనే అంతా వినియోగించడానికి ముందుకువస్తారు. అందుకే ఏయే దేశాల్లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి మంచి ఫలితాలు సాధించారో వారందరినీ విశాఖపట్నం సదస్సుకు ఆహ్వానించాం. ఏయే రంగాల్లో ఈ టెక్నాలజీని ఎలా వినియోగిస్తున్నారో వారు వివరిస్తారు. దాంతో దానిపై ఇక్కడి వారికి అవగాహన వస్తుంది. ఇది వ్యాపారాభివృద్ధికి, నూతన ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుంది. | business |
4,256 | 14-11-2017 00:28:57 | విధానాలే నాయకత్వ ప్రమాణాలు | వ్యక్తిగత నిజాయితీ, చిత్తశుద్ధి మొదలైన సుగుణాలను చూసి వృత్రా వంటి నాయకులను అనుసరించకూడదు. పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు అవినీతిపరుడైన ఇంద్రుడు మాదిరిగా, నిజాయితీపరుడైన రాముడు మాదిరిగా సరైన విధానాలు అమలుపరుస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. పరాక్రమశాలి ఇంద్రుని శౌర్యం గురించి ఋగ్వేదం ఘనంగా అభివర్ణించింది. రాక్షసుడు వృత్రాను సంహరించిన ఇంద్రుడు మద్యపాన మత్తుడు, మదవతీ లోలుడు. ఒకసారి గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఋషిపత్నిని వశపరచుకున్నాడు. వాల్మీకి రామాయణం ఏమన్నదో చూడండి: ‘వృత్రాను లోకం గౌరవిస్తుంది. అతనికి ధర్మం తెలుసు. ధర్మసూత్రాలకు అనుగుణంగా పాలన చేశాడు. లోపరహితుడైన వృత్రాను ఇంద్రుడు చంపివేయడం సమర్థనీయం కాదు’ (ఉత్తరకాండ 84, 85 శ్లోకాలు).నిజాయితీపరుడైన వృత్రాను కాకుండా అవినీతిపరుడైన ఇంద్రుడినే హిందు వులు ఆరాధిస్తారు. కారణమేమిటి? వ్యక్తిగతంగా భ్రష్టాకారి అయినప్పటికీ ప్రజల సంక్షేమానికి దోహదం చేసిన పాలకుడు ఇంద్రుడు. లోహ పరిశ్రమలు, వ్యవసాయాన్ని ప్రారంభించి మన పుణ్య భూమిలో కాంస్యయుగానికి పునాదులు వేసినవాడు ఇంద్రుడు. వృత్రా విషయానికి వస్తే వ్యక్తిగా విశుద్ధ వర్తనుడే అయినప్పటికీ వ్యవసాయాన్ని, గనుల తవ్వకాన్ని, లోహాల శుద్ధిని నిరుత్సాహపరిచాడు. తద్వారా సమాజ పురోగతిని నిరోధించాడు. సరైన విధానాలను అమలుపరచిన ఇంద్రుని వంటి అవినీతిపరుని నాయకత్వాన్ని ఆమోదించాలా లేక తప్పుడు విధానాలను అమలుపరచిన వృత్రా వంటి నిజాయితీపరుని నాయకత్వాన్ని అంగీకరించాలా? విస్మరించలేని వాస్తవమేమిటంటే సరైన విధానాలు అమలుపరిచిన దగాకోరు నాయకుల వైపే చరిత్ర మొగ్గుచూపింది. తప్పుడు విధానాలను అమలుపరిచిన నిజాయితీపరుడి నాయకత్వాన్ని చరిత్ర ఆదరించలేదు. మన ఇటీవలి గతంలో వృత్రా లాంటి నిజాయితీపరులైన నాయకులు చాలామందిని చూశాం. ఔరంగజేబునే తీసుకోండి. ‘తన పూర్వీకుల వలే కాకుండా సామ్రాజ్య కోశాగారాన్ని సామ్రాజ్య పౌరుల ధర్మనిధిగా ఔరంగజేబు పరిగణించాడు. ఆ నిధిని చక్రవర్తి తన స్వప్రయోజనాలకు వినియోగించుకోకూడదని భావించాడు. ఆయన వ్యక్తిగత ధర్మనిష్ఠ ఎవరూ కాదనలేనిది’ అని న్యూ వరల్డ్ ఎన్ సైక్లోపీడియా వ్యాఖ్యానించింది. ఔరంగజేబు చాలా నిరాడంబర, ధార్మిక జీవనాన్ని గడిపాడు. ముస్లిం మత బోధనలను దృఢ వైఖరితో సంపూర్ణంగా అనుసరించాడు. దివ్య గ్రంథం ఖురాన్‌ను ఎప్పుడంటే అప్పుడు చూడకుండా వల్లించగలిగేవాడు. హజ్ టోపీలు తయారుచేసేవాడు; ఖురాన్‌కు నకళ్ళు రూపొందించేవాడు. వీటిని అజ్ఞాతంగా విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన వ్యక్తిగత ఖర్చులకు వినియోగించుకునేవాడు. ఆ ఆదాయంతోనే ఆయన శాశ్వత విశ్రామ నెలవును నిర్మించడం జరిగింది. ఔరంజేబు 90 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఇస్లామిక్ సూత్రాల ప్రకారం ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు (ఔరంగజేబు సమాధి ఔరంగాబాద్‌కు సమీపంలోని కుల్దాబాద్‌లో వున్నది). మరి ఈ మత నిష్ఠాపరుడు, ధార్మిక చక్రవర్తే హిందువులపై జిజియా పన్ను విధించాడు. వారి దేవాలయాలను ధ్వంసం చేయించాడు. తన తండ్రిని ఖైదులో పెట్టాడు. తన ముగ్గురు సోదరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. గురు అర్జున్ దేవ్, గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్‌లు అతని కాఠిన్యానికి బలయ్యారు. నిజాయితీపరుడైన మరో నాయకుడు ఎడాల్ఫ్ హిట్లర్. 1932 మార్చి నెల ‘అట్లాంటిక్’ మ్యాగజైన్ ఆ జర్మన్ నాయకుడి గురించి ఇలా చెప్పింది: ‘17 ఏళ్ళ వయస్సులో హిట్లర్ అనాథ అయ్యాడు. చిల్లి గవ్వ కూడా అతని వద్ద లేదు. కూలీగా పొట్టపోసుకుంటూ చదువుకున్నాడు’. హిట్లర్ గురించి బ్రిటిష్ చరిత్రకారుడు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర ఆచార్యుడు రిచర్డ్ జాన్ ఇవాన్స్ ఇలా రాశాడు: ‘నిజాయితీపరుడుగా హిట్లర్ పేరు పొందాడు. పక్కా ప్యూరిటన్. అవివాహితుడు, శాకాహారి, మద్యపానం, ధూమపానం అలవాటు ఏమాత్రం లేనివాడు. జర్మనీ అభ్యున్నతికై వ్యక్తిగత సౌఖ్యాలను త్యజించిన నాయకుడుగా ప్రజల హృదయాలలో తననుతాను సుప్రతిష్ఠించుకున్నాడు’. హిట్లర్ గురించి ఒక జోక్ ప్రచారంలో వున్నది. జోసెఫ్ గోబెల్స్ పిల్లలు గోరింగ్, హిమ్లర్ మొదలైన నాజీ నాయకుల ఇళ్ళకు విందుకు వెళ్ళేవారు. విందు నుంచి తిరిగివచ్చిన ప్రతిసారీ తమకు ఎంత రుచికరమైన విందు ఇచ్చారో మహదానందంగా చెప్పేవారు. అయితే ఒకసారి హిట్లర్ ఇంటికి వెళ్ళిన ఆ పిల్లలకు కేవలం మాల్ట్ కాఫీ, సాదాసీదా బిస్కట్లు మాత్రమే ఇచ్చారట’. హిట్లర్ తన ఆత్మకథ మీన్ కాంఫ్ (నా పోరాటం) విక్రయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని నాజీ కార్యకర్తల పెన్షన్‌లకు వినియోగించేవాడు. నిజాయితీపరుడైన ఈ నాయకుడు ప్రపంచంపై వినాశనకరమైన యుద్ధాన్ని రుద్దాడు. కోట్లాది ప్రజల మరణానికి కారణమయ్యాడు. లక్షలాది యూదులను క్రూరంగా హతమార్చాడు. నిజాయితీపరుడైన మరో నాయకుడు జోసెఫ్ స్టాలిన్. తండ్రి చర్మకారుడు. తల్లి గృహ పరిచారిక. తల్లి రష్యన్ ఆర్థొడాక్స్ క్రిస్టియన్. కుమారుడిని చర్చ్ పాఠశాలకు పంపింది. జోసెఫ్ బాగానే చదివాడు. సెమినరీలో చేరడానికి అవసరమైన ఉపకార వేతనాన్ని కూడా సాధించుకున్నాడు. సెమినరీలో కూడా అతడు మంచి విద్యార్థే. అయితే ట్యూషన్ ఫీజు చెల్లించలేక వెళ్ళిపోయాడని పాఠశాల రికార్డులు చెబుతున్నాయి. కొంతకాలం ట్యూటర్‌గా, క్లర్క్‌గా పనిచేశాడు. కటిక పేదరికాన్ని అనుభవించిన వాడూ, ‘క్రిస్టియన్’ అయిన స్టాలిన్ తన రాజకీయ ప్రత్యర్థులను– ఒకరు కాదు, ఇద్దరు కాదు అక్షరాలా వేలాదిమందిని– క్రూరంగా హతమార్చాడు. లక్షలాది రైతులు ఆకలిదప్పులతో చనిపోయేలా చేశాడు. చెప్పవచ్చినదేమిటి? వ్యక్తిగత నిజాయితీ, చిత్తశుద్ధి మొదలైన సుగుణాలను చూసి వృత్రా వంటి నాయకులను అనుసరించకూడదు. పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు అవినీతిపరుడైన ఇంద్రుడు మాదిరిగా, నిజాయితీపరుడైన రాముడు మాదిరిగా సరైన విధానాలు అమలుపరుస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. ఇదే నాయకత్వ దక్షతకు గీటురాయి.భరత్ ఝున్‌ఝున్‌వాలా (వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్) నిజాయితీపరుడైన వృత్రాను కాకుండా అవినీతిపరుడైన ఇంద్రుడినే హిందు వులు ఆరాధిస్తారు. కారణమేమిటి? వ్యక్తిగతంగా భ్రష్టాకారి అయినప్పటికీ ప్రజల సంక్షేమానికి దోహదం చేసిన పాలకుడు ఇంద్రుడు. లోహ పరిశ్రమలు, వ్యవసాయాన్ని ప్రారంభించి మన పుణ్య భూమిలో కాంస్యయుగానికి పునాదులు వేసినవాడు ఇంద్రుడు. వృత్రా విషయానికి వస్తే వ్యక్తిగా విశుద్ధ వర్తనుడే అయినప్పటికీ వ్యవసాయాన్ని, గనుల తవ్వకాన్ని, లోహాల శుద్ధిని నిరుత్సాహపరిచాడు. తద్వారా సమాజ పురోగతిని నిరోధించాడు. సరైన విధానాలను అమలుపరచిన ఇంద్రుని వంటి అవినీతిపరుని నాయకత్వాన్ని ఆమోదించాలా లేక తప్పుడు విధానాలను అమలుపరచిన వృత్రా వంటి నిజాయితీపరుని నాయకత్వాన్ని అంగీకరించాలా? విస్మరించలేని వాస్తవమేమిటంటే సరైన విధానాలు అమలుపరిచిన దగాకోరు నాయకుల వైపే చరిత్ర మొగ్గుచూపింది. తప్పుడు విధానాలను అమలుపరిచిన నిజాయితీపరుడి నాయకత్వాన్ని చరిత్ర ఆదరించలేదు. మన ఇటీవలి గతంలో వృత్రా లాంటి నిజాయితీపరులైన నాయకులు చాలామందిని చూశాం. ఔరంగజేబునే తీసుకోండి. ‘తన పూర్వీకుల వలే కాకుండా సామ్రాజ్య కోశాగారాన్ని సామ్రాజ్య పౌరుల ధర్మనిధిగా ఔరంగజేబు పరిగణించాడు. ఆ నిధిని చక్రవర్తి తన స్వప్రయోజనాలకు వినియోగించుకోకూడదని భావించాడు. ఆయన వ్యక్తిగత ధర్మనిష్ఠ ఎవరూ కాదనలేనిది’ అని న్యూ వరల్డ్ ఎన్ సైక్లోపీడియా వ్యాఖ్యానించింది. ఔరంగజేబు చాలా నిరాడంబర, ధార్మిక జీవనాన్ని గడిపాడు. ముస్లిం మత బోధనలను దృఢ వైఖరితో సంపూర్ణంగా అనుసరించాడు. దివ్య గ్రంథం ఖురాన్‌ను ఎప్పుడంటే అప్పుడు చూడకుండా వల్లించగలిగేవాడు. హజ్ టోపీలు తయారుచేసేవాడు; ఖురాన్‌కు నకళ్ళు రూపొందించేవాడు. వీటిని అజ్ఞాతంగా విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన వ్యక్తిగత ఖర్చులకు వినియోగించుకునేవాడు. ఆ ఆదాయంతోనే ఆయన శాశ్వత విశ్రామ నెలవును నిర్మించడం జరిగింది. ఔరంజేబు 90 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఇస్లామిక్ సూత్రాల ప్రకారం ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు (ఔరంగజేబు సమాధి ఔరంగాబాద్‌కు సమీపంలోని కుల్దాబాద్‌లో వున్నది). మరి ఈ మత నిష్ఠాపరుడు, ధార్మిక చక్రవర్తే హిందువులపై జిజియా పన్ను విధించాడు. వారి దేవాలయాలను ధ్వంసం చేయించాడు. తన తండ్రిని ఖైదులో పెట్టాడు. తన ముగ్గురు సోదరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. గురు అర్జున్ దేవ్, గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్‌లు అతని కాఠిన్యానికి బలయ్యారు. నిజాయితీపరుడైన మరో నాయకుడు ఎడాల్ఫ్ హిట్లర్. 1932 మార్చి నెల ‘అట్లాంటిక్’ మ్యాగజైన్ ఆ జర్మన్ నాయకుడి గురించి ఇలా చెప్పింది: ‘17 ఏళ్ళ వయస్సులో హిట్లర్ అనాథ అయ్యాడు. చిల్లి గవ్వ కూడా అతని వద్ద లేదు. కూలీగా పొట్టపోసుకుంటూ చదువుకున్నాడు’. హిట్లర్ గురించి బ్రిటిష్ చరిత్రకారుడు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర ఆచార్యుడు రిచర్డ్ జాన్ ఇవాన్స్ ఇలా రాశాడు: ‘నిజాయితీపరుడుగా హిట్లర్ పేరు పొందాడు. పక్కా ప్యూరిటన్. అవివాహితుడు, శాకాహారి, మద్యపానం, ధూమపానం అలవాటు ఏమాత్రం లేనివాడు. జర్మనీ అభ్యున్నతికై వ్యక్తిగత సౌఖ్యాలను త్యజించిన నాయకుడుగా ప్రజల హృదయాలలో తననుతాను సుప్రతిష్ఠించుకున్నాడు’. హిట్లర్ గురించి ఒక జోక్ ప్రచారంలో వున్నది. జోసెఫ్ గోబెల్స్ పిల్లలు గోరింగ్, హిమ్లర్ మొదలైన నాజీ నాయకుల ఇళ్ళకు విందుకు వెళ్ళేవారు. విందు నుంచి తిరిగివచ్చిన ప్రతిసారీ తమకు ఎంత రుచికరమైన విందు ఇచ్చారో మహదానందంగా చెప్పేవారు. అయితే ఒకసారి హిట్లర్ ఇంటికి వెళ్ళిన ఆ పిల్లలకు కేవలం మాల్ట్ కాఫీ, సాదాసీదా బిస్కట్లు మాత్రమే ఇచ్చారట’. హిట్లర్ తన ఆత్మకథ మీన్ కాంఫ్ (నా పోరాటం) విక్రయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని నాజీ కార్యకర్తల పెన్షన్‌లకు వినియోగించేవాడు. నిజాయితీపరుడైన ఈ నాయకుడు ప్రపంచంపై వినాశనకరమైన యుద్ధాన్ని రుద్దాడు. కోట్లాది ప్రజల మరణానికి కారణమయ్యాడు. లక్షలాది యూదులను క్రూరంగా హతమార్చాడు. నిజాయితీపరుడైన మరో నాయకుడు జోసెఫ్ స్టాలిన్. తండ్రి చర్మకారుడు. తల్లి గృహ పరిచారిక. తల్లి రష్యన్ ఆర్థొడాక్స్ క్రిస్టియన్. కుమారుడిని చర్చ్ పాఠశాలకు పంపింది. జోసెఫ్ బాగానే చదివాడు. సెమినరీలో చేరడానికి అవసరమైన ఉపకార వేతనాన్ని కూడా సాధించుకున్నాడు. సెమినరీలో కూడా అతడు మంచి విద్యార్థే. అయితే ట్యూషన్ ఫీజు చెల్లించలేక వెళ్ళిపోయాడని పాఠశాల రికార్డులు చెబుతున్నాయి. కొంతకాలం ట్యూటర్‌గా, క్లర్క్‌గా పనిచేశాడు. కటిక పేదరికాన్ని అనుభవించిన వాడూ, ‘క్రిస్టియన్’ అయిన స్టాలిన్ తన రాజకీయ ప్రత్యర్థులను– ఒకరు కాదు, ఇద్దరు కాదు అక్షరాలా వేలాదిమందిని– క్రూరంగా హతమార్చాడు. లక్షలాది రైతులు ఆకలిదప్పులతో చనిపోయేలా చేశాడు. చెప్పవచ్చినదేమిటి? వ్యక్తిగత నిజాయితీ, చిత్తశుద్ధి మొదలైన సుగుణాలను చూసి వృత్రా వంటి నాయకులను అనుసరించకూడదు. పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు అవినీతిపరుడైన ఇంద్రుడు మాదిరిగా, నిజాయితీపరుడైన రాముడు మాదిరిగా సరైన విధానాలు అమలుపరుస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. ఇదే నాయకత్వ దక్షతకు గీటురాయి.భరత్ ఝున్‌ఝున్‌వాలా భరత్ ఝున్‌ఝున్‌వాలా (వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్) | editorial |
6,043 | 04-08-2017 18:08:50 | హీరోగా 25వ ఏటలోకి అజిత్ | కోలీవుడ్‌లోని స్టార్ హీరో అజిత్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అధిగమించారు. దీంతో పలువురు తమిళ సినీ నటులు ఆయనను అభినందనల జల్లులో ముంచెత్తారు. హీరోగా 25 ఏళ్లు కొనసాగడం ఒక నటుడి జీవితంలో మైలురాయిగానే చెప్పాలి. అలాంటి ఒక మైలురాయిని అధిగమించాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. 1993లో వచ్చిన 'అమరావతి' సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన అజిత్... తమిళ చిత్రసీమలో ఎవరూ ఊహించని రేంజ్‌కు ఎదిగాడు. ఒక దశలో వరుస ఫ్లాపులతో సతమతమైన అజిత్ ఇప్పుడు రజనీకాంత్ తరువాత స్థానం కోసం విజయ్‌తో పోటీ పడుతున్నాడు. త్వరలోనే 'వివేగమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కోలీవుడ్ క్రేజీ స్టార్... తమిళ సినీ రంగంలో హీరోగా 25వ సంత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కోలీవుడ్‌లోని కొందరు సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెస్ చెప్పారు. అజిత్‌కు శుభాకాంక్షలు చెప్పిన వారిలో యంగ్ హీరో ధనుష్, నటులు ప్రసన్న, అరుణ్ విజయ్, దర్శకుడు విఘ్నేష్ శివన్, హీరోయిన్ త్రిష తదితరులు ఉన్నారు. హీరోగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న అజిత్‌కు కోలీవుడ్‌లో రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది. కొన్నేళ్ల నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరోకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. కెరీర్ ప్రారంభంలోనే తెలుగు చిత్రం 'ప్రేమపుస్తకం'లో నటించిన అజిత్ ఇప్పుడు మాత్రం డబ్బింగ్ సినిమాలతోనే తెలుగువారిని పలకరిస్తున్నాడు. అజిత్ తాజా చిత్రం 'వివేగం' సైతం 'వివేకం' పేరుతో ఈ నెలలో తెలుగువారి ముందుకు రాబోతోంది. మరి హీరోగా 25 ఏళ్ల జర్నీ తరువాత కూడా అజిత్ అదే దూకుడు కొనసాగిస్తాడేమో చూడాలి. | entertainment |
1,141 | 13-03-2017 00:14:13 | బాబోయ్ బ్యాంక్ చార్జీలు.. |
ఎటిఎం కార్డు ఉంది కదా అని ఖాతాలో ఉన్న వంద రూపాయలు కూడా తీసుకునే వారు చాలా మంది ఉంటారు. కనీస నిల్వ ఉండాలని బ్యాంకు అధికారులు చెప్పినా చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే మా డబ్బు మా ఇష్టం అంటుంటారు. కానీ ఇకపై ఇలాంటి ఇష్టాలు సాగే పరిస్థితి లేదు. తమ సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వ లేకుంటే చార్జీలు కచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ లేనట్టయితే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చార్జీలు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ప్రైవేటు రంగంలోని హెచ్‌డిఎ్‌ఫసి, ఐసిఐసిఐ, యాక్సిస్ వంటి బ్యాంకులు ఇలాంటి చార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంకు గరిష్ఠంగా 600 రూపాయలు, ఐసిఐసిఐ బ్యాంకు గరిష్ఠంగా 450 రూపాయలు, యాక్సిస్ బ్యాంకు 350 రూపాయలు, ఎస్‌బిఐ 100 రూపాయల వరకు చార్జీలు వేస్తున్నాయి. బ్యాంకులు విధించే చార్జీలపై 14 శాతం సర్వీస్ టాక్స్, 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్, 0.5 శాతం స్వచ్ఛ్ భారత సెస్ కూడా ఉంటాయి.ఖాతాలో నెలవారీ కనీస నిల్వ (ఎంఎబి) లేకుంటే ఈ బ్యాంకులు స్లాబుల వారీగా చార్జీలను వసూలు చేస్తున్నాయి. మెట్రో నగరాల్లో హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంకులో ఖాతా కలిగిన కస్టమర్ ఎంఎబి సున్నా నుంచి 2,500 రూపాయల మధ్య ఉంటే.. 600 రూపాయల చార్జీని వసూలు చేస్తోంది. ఒకవేళ బ్యాలెన్స్ 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్య ఉంటే 450 రూపాయలు (పన్నులు అదనం), 5,000-7,500 రూపాయల మధ్య ఉంటే 300 రూపాయలు, 7,500-10,000 మధ్య ఉంటే 150 రూపాయల జరిమానాను విధిస్తోంది. ఎస్‌బిఐ విషయానికొస్తే.. మెట్రో నగరాల్లో సేవింగ్స్ ఖాతా కలిగిన వారు నెలవారీ కనీస నిల్వ 5,000 రూపాయలు ఉంచకుంటే 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు, పట్టణాల్లో 3,000 రూపాయల నిల్వ లేకుంటే 40 రూపాయల నుంచి 80 రూపాయల వరకు, సెమీ అర్బన్‌లో 2,000 రూపాయల నిల్వ లేకుంటే 25 రూపాయల నుంచి 75 రూపాయల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో 1,000 రూపాయలు లేకుంటే 20 రూపాయల నుంచి 50 రూపాయల చార్జీని వసూలు చేయనుంది. ఐసిఐసిఐ బ్యాంకు మెట్రో నగరాల్లోని కస్టమర్లు 10,000 రూపాయల కనీస నెలవారీ నిల్వను కలిగి లేకుంటే 350 రూపాయల నుంచి 450 రూపాయల వరకు (పన్నులు అదనం) జరిమానా వేస్తోంది. కనీస నిల్వ 5,000 రూపాయలకన్నా తగ్గితే 450 రూపాయలు, 5,000 రూపాయలు మించి 10,000 రూపాయల లోపు ఉంటే 350 రూపాయల జరిమానాను వసూలు చేస్తోంది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో ఖాతాలున్న కస్టమర్ల నుంచి కూడా నిర్దేశిత జరిమానాలను ఈ బ్యాంకు వసూలు చేస్తోంది. మెట్రో నగరాల్లోని ఖాతాదారులు 10,000 రూపాయల కనీస నిల్వను కలిగి లేకుంటే 350 రూపాయలతోపాటు పన్నులను యాక్సిస్ బ్యాంకు వసూలు చేస్తోంది.చాలా మందికి ఒకటికి మించి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలుంటాయి. వాటిలో కనీస నిల్వ లేనివి కూడా ఉండొచ్చు. బ్యాంకులు ఇప్పటికే త్రైమాసికాల వారీగా చార్జీలు, వార్షికంగా ఎటిఎం చార్జీలను వసూలు చేస్తున్నాయి. తాజాగా కనీస నిల్వ లేకుంటే చార్జీలను వసూలు చేసే పరిస్థితి వచ్చింది. రానున్న కాలంలో అన్ని బ్యాంకులు కూడా ఈ విధానాన్ని అనుసరించే అవకాశాలుండవచ్చు. కాబట్టి అంతగా అవసరం లేని బ్యాంకు ఖాతాను మూసివేయడం మంచిది. దీని వల్ల ఉన్న ఖాతాలోనే తగినంత నిల్వను కొనసాగించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ప్రతి ఖాతాలోనూ కనీస నిల్వను ఉంచాల్సి వస్తుంది. ఉదాహరణకు మెట్రో నగరాల్లోని ఒక వ్యక్తికి మూడు బ్యాంకు ఖాతాలు ఉంటే.. వాటిలో కనీసం 15,000 రూపాయల (ఉదాహరణకు) నిల్వ ఉంచాల్సి వస్తుంది. బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలోని సొమ్ముపై కనీసం 4 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. కానీ కనీస నిల్వ తగ్గినప్పుడు మాత్రం బాదే బాదుడు ఇంతకు మించి ఉంటుందన్న విషయం మరిచిపోవొద్దు. జన్‌ధన్ ఖాతాదారులకు భయం లేదు..సేవింగ్స్ బ్యాంకు ఖాతా తెరిచే సామర్థ్యం లేని వారి కోసం జన్‌ధన్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఖాతాలు తెరిచిన వారు తమ ఖాతాలో డబ్బు లేకపోయినా బ్యాంకులు ఎలాంటి చార్జీలను వసూలు చేయవు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని బ్యాంకులు దాదాపు 24 కోట్ల జన్‌ధన్ ఖాతాలను తెరిచాయి. ప్రభుత్వం అందించే సబ్సిడీలు, నగదు బదిలీలు పొందడానికి చాలా మంది ఈ ఖాతాలను వినియోగిస్తున్నారు. అయితే వీటి నిర్వహణ భారాన్ని తగ్గించుకోవడానికే సేవింగ్స్ ఖాతాదారులపై చార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని ఇటీవల ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించిన విషయం తెలిసిందే. | business |
396 | 19-04-2017 00:08:41 | ఐఎస్‌బి పూర్వ విద్యార్థి నీరజ్ అరోరా సారథ్యంలో స్కాలర్‌షిప్ | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) పూర్వ విద్యార్థి, వాట్సప్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ అరోరా.. మహిళా విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించారు. మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ విద్యనభ్యసిస్తున్న మహిళా విద్యార్ధులకు మెరిట్ ఆధారంగా జగన్నాధ్ అరోరా స్కాలర్‌షిప్ పేరుతో ఈ ఉపకార వేతనాలను అందించనున్నట్లు ఐఎస్‌బి తెలిపింది. యువ మహిళా నిపుణుల నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరిచటంతో పాటు తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా అరోరా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపింది. ఇందులో భాగంగా అండమాన్ నికోబార్ దీవులకు చెందిన మహిళా దంత వైద్యురాలు శాలిని తివారి.. తొలి జగన్నాధ్ అరోరా స్కాలర్‌షి్‌పను అందుకున్నారు. జీవితంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పించిన ఐఎసిబి అల్మా మేటర్‌కు ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఈ స్కాలర్‌షిప్‌ను ప్రారంభించినట్లు నీరజ్ అరోరా తెలిపారు. కాగా అలుమినస్ నుంచి వచ్చిన రెండో స్కాలర్‌షిప్ ఇదని ఐఎ్‌సబి తెలిపింది. ఫినిక్స్ హోల్డింగ్స్ ఫౌండర్ అమిత ఖన్నా.. ఫినిక్స్ నర్చర్ పేరుతో తొలిసారిగా స్కాలర్‌షి్‌పను ప్రారంభించారని ఐఎ్‌సబి వెల్లడించింది. | business |
10,769 | 12-03-2017 14:05:19 | చిరంజీవి చెప్పాకే మారాను: దర్శకుడు గోపీచంద్ | ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘విన్నర్’ సినిమాలతో కమర్షియల్ మేకర్ అనిపించుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇప్పుడు వరుసబెట్టి సినిమాలు తీస్తున్న గోపీ.. ఒకప్పుడు బాగా మొహమాటస్తుడట. అలాంటి తన వైఖరిని మార్చుకోవడానికి మెగస్టార్ చిరంజీవి ఇచ్చిన ఓ సలహాయే కారణమట. దాని గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు గోపీచంద్. | entertainment |
13,062 | 28-09-2017 15:04:57 | ఓటర్ల లిస్ట్ నుంచి అటల్ పేరు తొలగింపు |
లక్నో : మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. లక్నో పురపాలక సంఘం ఒకటో జోన్ జోనల్ అధికారి అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా వాజ్‌పేయి పేరును జాబితా నుంచి తొలగించారు. ఆయన బనారసీ దాస్ ఓటరు. 92/98-1 నంబరు ఇంటిలో ఆయన ఓటరుగా నమోదయ్యారు. ఆయన ఓటరు సంఖ్య 1,054. పదేళ్ళుగా ఆయన ఓటు వేయడం లేదు. 2000వ సంవత్సరంలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో చివరిసారి ఓటు వేశారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. పదేళ్ళ నుంచి ఆయన నగరానికి రాలేదు. లక్నో నుంచి ఆయన ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన వయసు 92 సంవత్సరాలు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి జీతాలు ఎంతో తెలుసా? అది కనుక అమలైతే భారతదేశం భూతల స్వర్గమే.. | nation |
1,601 | 25-07-2017 01:29:22 | జియో చవక ఫోన్‌తో పరిశ్రమకూ ప్రయోజనమే.. | ఆర్‌జియో కస్టమర్లు, మార్కెట్ వాటా వృద్ధికి అవకాశంరాబడులు పెరిగే చాన్స్: ఫిచ్‌ముంబై: చవక ధరలోనే 4జి ఫీచర్ ఫోన్‌ను తీసుకురావడం వల్ల రిలయన్స్ జి యోకేకాకుండా పరిశ్రమకూ ప్రయోజనం కలుగుతుందని తాజా నివేదిక స్పష్టం చేసింది. ఆర్‌జియో మరో 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకునేందుకు 4జి ఫీచర్ ఫోన్ దోహదపడవచ్చని, 2018నాటికి రాబడి పరంగా మార్కెట్ వాటా 3-4 శాతం నుంచి 10 శాతానికి పెరిగేందుకు దన్నుగా నిలువవచ్చని ఫిచ్ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా పరిశ్రమ రాబడులు వృద్ధి చెందేందుకు సహాయపడవచ్చని తెలిపింది. జియో 4జి ఫీచర్ ఫోన్ వల్ల ఇంటర్నెట్‌ను వినియోగించే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. 10 కోట్ల మంది 4జి ఫీచర్ ఫోన్‌ను తీసుకుంటే టెలికాం పరిశ్రమ వార్షిక రాబడికి 3-4 (సుమారు 95 కోట్ల డాలర్లు) జతకూరుతుందని నివేదిక పేర్కొంది. 1,500 రూపాయల రిఫండబుల్ డిపాజిట్‌తో 4జి స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఇటీవలే ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ మొదటిసారి 4జి సర్వీసులకు మారే వారిని ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉందని, ఫలితంగా రాబడి పరంగా జియో మార్కెట్ వాటా పెరుగుతుందని ఫిచ్ నివేదిక అంచనా వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 2జి ఫోన్ల స్థానాల్లో జియో ఫోన్లు అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉందని పేర్కొంది. 4జి మార్కెట్ విస్తరణ కారణంగా కొత్త రాబడులు రావడానికి అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్‌కు మారుతున్న వారి సంఖ్య ఆసియా పసిఫిక్‌లో తక్కువ స్థాయిలో ఉందని, అధిక ధరలు, గ్రామీణ ప్రాంతాల్లో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్స్ లేకపోవడమే కారణమని నివేదిక చెబుతోంది. ఇక రిలయన్స్ జియో ప్రకటించిన నెలవారీ టారిఫ్ ప్రస్తుత టెలికాం కంపెనీల రాబడి మార్కెట్ వాటాను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే జియో కారణంగా డేటా వినియోగం పెరుగుతుందని, ఇది ప్రస్తుత టెలికాం కంపెనీలకూ ప్రయోజనం కలిగిస్తుందని తెలిపింది. ఇదిలా ఉం టే.. 2017 మార్చి త్రైమాసికంనాటికి టెలికాం పరిశ్రమ రాబడి అంతకు ముందు ఏడాది ఇదేకాలంతో పోల్చితే 15.6శాతం తగ్గి 610 కోట్ల డాలర్లకు చేరుకుంది. టెలికాం కంపెనీల రాబడులు పెరిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఈ రంగానికి నెగిటివ్ ఔట్‌లుక్‌నే ఫిచ్ కొనసాగిస్తోంది. కస్టమర్ల సం ఖ్యను పెంచుకునేందుకు జియో మరి న్ని ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉండవచ్చని, దీనికి కౌంటర్‌గా ఇతర కంపెనీలు ధరల యుద్ధానికి దిగవచ్చని పేర్కొంది. | business |
3,603 | 26-02-2017 00:52:05 | ఓ భూమిపుత్రులారా..! | భూమి ఇప్పుడు సూర్యుడి చుట్టూ కాదు, భయం చుట్టూ పరిభ్రమిస్తున్నది. అవసరాలకు అత్యాశకు మధ్య, అభివృద్ధికి ఆత్మగౌరవానికి మధ్య భయంకర పోరాటం జరుగుతున్నది. ప్రపంచమంతా రైటిస్టు ఉద్యమం ఉరకలెత్తుతోంది. మన ఊరి నుంచి మహామెరికా దాకా ఇప్పుడంతటా జాతుల పోరాటమే! కోతుల కోలాటమే! నీతుల నీరాటమే! నేర్వని గుణ పాఠమే! భూమి గుండ్రంగా ఉంది. గడియారం గుండ్రంగా ఉంది. కారు చక్రం, విమానం వీల్ గుండ్రంగా ఉన్నాయి. మన తలకాయ గుండ్రంగా ఉంది. మా గురువర్యులు కూడా గుండులా గుండ్రంగానే ఉంటారు. గుండ్రాచార్య భ్రమణ మహర్షుల వారి భ్రమా భ్రాంతి గీతోపదేశం ఏం చెబుతుందంటే... జీవితంలో నీ ముందున్న మార్గం, నీకున్న సమయం కూడా నువ్వు గుర్తించలేనంత గుండ్రంగా ఉంటాయి. నువ్వు ఎంత తిరిగినా, చివరికి బయల్దేరిన దగ్గరికే వస్తావని! నా చిన్నప్పుడు ఊర్లో బతకలేక ఎవరైనా మస్కటో, దుబాయో పోతే ‘మా వాడు దేశం పోయాడు’ అని కొంచెం ఘనంగా చెప్పేవాళ్లు ఇంటోళ్లు. ‘వాడు బతకవోయిండురా’ అని ఊరిలో బతకలేనితనాన్ని చులకనగా పలుచన చేసేవారు పక్కింటోళ్లు! చెప్పేమాటలో తేడా. చూసే చూపులో తేడా! మస్కట్‌కు పోవడం అవమానం అని భావించే దశ నుంచి, అమెరికాకు పోవడం గర్వకారణం అనే దాకా... వీసాలు, విమానాల సాక్షిగా మన ప్రయాణం సాగింది. అమెరికా మనదే అని మనస్ఫూర్తిగా నమ్మాం. మనతో పాటు మన తెలివినీ, అతి తెలివినీ, సినిమా పిచ్చినీ, ఆవకాయ పిక్కనీ, గోకరకాయ వేపుడునీ, గోంగూర పచ్చడినీ, కులం రొచ్చునీ, అవినీతి కొండముచ్చునీ, అలవాట్లనీ, ఆధ్మాత్మికతనీ కూడా వెంట తీసుకువెళ్లాం. భారీగా డాలర్లలో సంపాదించి రూపాయల్లో లెక్కపెట్టే భారతీయ మనస్తత్వాన్ని కూడా! ఎన్నారై, ప్రవాసీ, గ్రీన్ కార్డు, స్టేట్స్, ఎస్టేట్స్, ప్లేస్‌మెంట్స్, అమెరికా సంబంధం, సాంస్కృతిక బంధం అని అందమైన పేర్లు అవతరించాయి. డాలర్ డ్రీమ్స్ స్వప్నించాయి. వాటి వెంటే వీసాలు- మోసాలు కూడా వచ్చాయి. ఇదీ ప్రపంచీకరణ సాధించిన అపూర్వమైన, అనితరసాధ్యమైన ఘనత! ప్రపంచం కుగ్రామంగా మారిపోయిందన్నది ప్రపంచబ్యాంకు. గ్లోబల్ విలేజ్ అని ఫ్రేజ్ కాయిన్ చేసేశారు సంస్కరణల డాబుగార్లు. ఏడు ఖండాలూ ఏకమైన శకమంటూ రింగరించారు కొందరు. కులమతాలేమీ లేవు, ఉన్నదొక్క జాతే.. మానవ జాతి అని వింగడించారు మహానుభావులు... భూగోళం అందరి హక్కుభుక్తం, వనరులు నరులందరివీ అన్నారు పర్యావరేణ్యులు. ‘నేను విశ్వ మానవుడ’ అని గర్జించారు కవికల్పులు! కలలు కన్నంతసేపు పట్టలేదు కల్లలవడానికి! కవిత్వం... కలం నుంచి కారి గడ్డకట్టినంత కాలం పట్టలేదు, కరిగి నీరవ్వడానికి! గోడలు కూల్చేసినంత టైం పట్టలేదు, మళ్లీ కట్టుబడి మొదలు పెట్టడానికి! ఎనీ బడీస్ ల్యాండ్ అమెరికా! ఎవ్రీ బడీస్ డెస్టినీ అమెరికా!! అసలు జాతి నేటివ్ రెడ్ ఇండియన్లను కాదని, అనేక జాతులు ఆక్రమించుకున్న వలసదార్ల స్వర్గం! ప్రపంచంలోని మెరికల బరి! తురుపు ముక్కల గురి! దున్నేవాడిదే భూమి నినాదం వెంటే... పోయేవాడిదే వలస... ఉండే వాడిదే అమెరికా అనే నినాదాలూ ఆవిర్భవించాయి. ‘ఉంటే అమెరికాలో ఉండాలి. ఉంటే అమెరికాలా ఉండాలి’... అని మనుషులు, దేశాలు మనసుపడ్డాయి. డాలర్ పట్టాలి... కాలర్ ఎగరేయాలని కలగన్నాయి! కానీ ఎంతలో ఎంత తేడా! రెడ్ కార్పెట్లు పరిచి పిలిచిన చోటే, గ్రీన్ కార్డులు రద్దు చేసే పరిస్థితి. అందుకే పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. దూరపు కొండలు నునుపు. అందని ద్రాక్ష పుల్లన అన్న అసలు జాతీయాలు జాతి సాక్షిగా గుర్తుకొస్తున్నాయి.పట్నపోళ్లు దోచేస్తున్నారన్నది అమాయకపు పల్లె. ఆంధ్రావాళ్లు దోచేశారన్నది ప్రత్యేక తెలంగాణ. బీహారీలు దోచేస్తున్నారన్నది నిరుద్యోగ ఈశాన్యం. ముంబైని దోచేస్తున్నారన్నది వీర మరాఠా. వలసదార్లు దోచుకుపోతున్నారు అంటున్నది ట్రంప్ అమెరికా! ఐరోపా దోచేస్తోంది అన్నది బ్రెగ్జిట్ బ్రిటన్. సౌతేషియన్లు దోచి పారేస్తున్నారు అన్నది ఆయిల్ రిచ్ గల్ఫ్. తెల్లవాళ్లు దోచేస్తున్నారు అన్నది రాచరికపు సౌదీ అరేబియా! ఎక్కడ చూసినా దోపిడీయే! మరి ఇంతమందిని మోస్తున్న, ఇంత మంది దోస్తున్న భూమి తల్లి ఏమనాలి? మా కాలనీలో మొరటు మనిషి మునుస్వామి అంటుంటాడు.. ‘ఈ కాలనీకి మొట్టమొదట వచ్చి ఇల్లు కట్టుకుంది నేనే. అందువల్ల కాలనీకి చచ్చేదాకా నేనే ప్రెసిడెంట్‌ని. నేను చెప్పిందే వేదం. ఏదైనా నాకు ఇచ్చాకే మిగతావారికి’ అని! అతని నోటి ధాటికి కాలనీ వాసులు భయపడి ఛస్తుంటారు!! మొన్నటిదాకా ప్రపంచాన్నంతా ఏలింది ముస్లిం రాజులేననీ, అందుకే ఈ భూమండలమంతా తమకే చెందుతుందనీ అంటుంది ఇస్లామిక్ స్టేట్! ప్రపంచ ప్రజలంతా భయపడి ఛస్తున్నారు!! జర్మనీ మూలాలున్న ట్రంప్ కూడా అదే భాష మాట్లాడుతున్నాడు. వలసదార్లంతా భయపడి ఛస్తున్నారు!! మా మునుస్వామికి, ట్రంప్‌కి పెద్దగా తేడా ఏం కనిపించడం లేదు. ఇప్పటిదాకా బ్లాక్స్‌కు జరిగింది ఇప్పుడు బ్రౌన్స్‌కు జరుగుతున్నదంతే! చర్మం రంగే ప్రధానమైన అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా అసలు రంగును నగ్నంగా నడివీధిలో ఆవిష్కరించినందుకు ట్రంప్‌ను ప్రపంచం అభినందించాలి. ఆయన చెప్పినట్టు అమెరికా అమెరికన్లదే! కానీ అసలు అమెరికన్లు ఎవరు?భూమి ఇప్పుడు సూర్యుడి చుట్టూ కాదు, భయం చుట్టూ పరిభ్రమిస్తున్నది. అవసరాలకు అత్యాశకు మధ్య, అభివృద్ధికి ఆత్మగౌరవానికి మధ్య భయంకర పోరాటం జరుగుతున్నది. ప్రపంచమంతా ‘రైటిస్టు’ ఉద్యమం ఉరకలెత్తుతోంది. మన ఊరి నుంచి మహామెరికా దాకా ఇప్పుడంతటా జాతుల పోరాటమే! కోతుల కోలాటమే! నీతుల నీరాటమే! నేర్వని గుణ పాఠమే! దేశం- ప్రదేశం ఎంత విశాలంగా ఉంటేనేం? మన మనసు ఇరుకు కూపమైనప్పుడు!! ఇప్పుడు ప్రపంచమంతటా గో బ్యాక్ నినాదమే! గ్లోబల్ విలేజ్ ప్రధానం కాదు; మన విలేజే గ్లోబ్.. ఇదీ విధానం! చివరాఖరు: తెలంగాణ విడిపోయాక హైదరాబాద్ మిత్రుడొకరు మాతృభూమిపై మమకారంతో స్థిరపడేందుకు బెజవాడ చేరుకున్నాడు. ఇంట్లో కరెంటు పోయింది. క్యాండిల్ కోసం కిరాణా షాపుకు వెళ్లాడు. పది రూపాయలన్నాడు కొట్టువాడు. ‘అంతెందుకు? హైదరాబాద్‌లో ఐదు రూపాయలేనే’ అన్నాడు మా మిత్రుడు. ‘అక్కడే ఉండిపోకపోయారా? లేదంటే అక్కడికే వెళ్లి క్యాండిల్ తెచ్చుకోండి’ అని జవాబిచ్చాడు నేటివ్ బెజవాడియన్. మరిచిపోయిన, మరుగునపడ్డ మూలాలను మళ్లీ వెతుక్కుంటూ వచ్చే మూలవాసులారా.. తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి మర్యాదలూ ఎదురు చూస్తుంటాయి మరి!! -కృ.తి[email protected] | editorial |
3,938 | 03-10-2017 01:19:46 | అవినీతిని పెంచుతున్న జీఎస్టీ | వస్తుసేవల పన్ను (జీఎస్టీ)తో వాణిజ్యరంగంలో ఒక నిరుత్సాహకరమైన పరిస్థితి దృశ్యమానమవుతోంది. ఉదాహరణకు జీఎస్టీ వ్యవస్థలో వ్యాపారులు ఈ–వే బిల్లులు జారీ చేయడం తప్పనిసరి. ఆ బిల్లులను పన్ను అధికారులు సంబంధిత సరుకు గమ్యం చేరకముందే దారి మధ్యలోనే సరిచూస్తారు. జీఎస్టీ అధికారి నెంబర్ 2 బిజినెస్ (అనధికారికంగా రవాణా చేస్తున్న సరకు) నుంచి లంచం తీసుకోకుండా వుంటేనే ఆ బిల్లుల తనిఖీ విజయవంతమవుతుంది. అయితే వ్యాపార వర్గాల నుంచి లభ్యమవుతోన్న అప్రకటిత వివరాలు, జీఎస్టీ అమలుతో నెంబర్ టు బిజినెస్ పెరుగుతోందని స్పష్టంగా సూచిస్తున్నాయి. జీఎస్టీ వ్యూహాన్ని ప్రధాని మోదీ తన గుజరాత్ పాలనానుభవం ప్రాతిపదికగా రూపొందించినట్టు కన్పిస్తోంది. కీలక స్థానాల్లో నిజాయితీపరులైన అధికారులను నియమించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం కింది స్థాయిలో అవినీతిని తగ్గించడంలో మోదీ సఫలమయ్యారు. అయితే ఆ వ్యూహం జీఎస్టీ సాఫల్యానికి దోహదం చేయదు. ఎందుకని? పన్ను అధికారుల్లో అత్యధికులు రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో వున్నారు. ఆయా రాష్ట్రాల్లోని పాలకులు మోదీ వలే కార్యదక్షులు కారు కదా. పైగా ముఖ్యమంత్రిగా మోదీకి గుజరాత్‌లోని అధికారుల వ్యక్తిత్వాలు, స్వభావాల గురించి ప్రత్యక్ష జ్ఞానమున్నది. ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఏ అధికారి ఎటువంటి వాడో నిశితంగా తెలుసుకొనే అవకాశం లేదు. అవినీతిపరులైన వ్యాపారులు, వాణిజ్యవేత్తలను నిజాయితీపరులైన అధికారుల ద్వారా నియంత్రించాలని మోదీ ఆశిస్తున్నారు. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టడం ఖాయం. ‘రాజు నియమించిన ఉద్యోగులు చాలావరకు ఇతరుల ఆస్తులను కైవశం చేసుకొనేవారూ, దగాకోరులూనూ; వారి నుంచి ప్రజలను రక్షించవలసిన బాధ్యత రాజుదే’ అని మనుస్మృతి చెప్పింది. అలాగే కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’ ఇలా ఉద్ఘాటించింది: ‘కోశాగారంలోని సొమ్మును అధికారులు ఏ మేరకు సొంతానికి వినియోగించుకున్నారో కనుక్కోవడం, తటాకంలోని చేప ఎంత నీరు తాగిందో చెప్పడమంత కష్టమైన విషయం’.ఉద్యోగిస్వామ్యం (బ్యూరాక్రసీ)ని సంస్కరించడానికి ప్రధాని మోదీ ఈ క్రింద సూచించిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వోద్యోగుల, అధికారుల నియామకాలకు సంబంధించిన సంపూర్ణ వివరాలను విధిగా ప్రభుత్వ వెబ్‌సైట్‌పై వుంచాలి. అజ్ఞాత ఫిర్యాదుల యంత్రాంగం ఒకదాన్ని నెలకొల్పడం మోదీ తీసుకోవల్సిన రెండో చర్య. ప్రస్తుతం పలువురు వ్యాపారవేత్తలు ప్రభుత్వాధికారులనుంచి ఎంతగా వేధింపులు ఎదురవుతున్నప్పటికీ మౌనంగా వుండిపోతున్నారు. ఉన్నతస్థాయిలో ఫిర్యాదుచేస్తే అధికారుల నుంచి కక్ష సాధింపు చర్యలకు గురికావలసివస్తుందనే భయంతోనే వ్యాపారులు మౌనం వహిస్తున్నారనేది స్పష్టం. ఫిర్యాదు చేసిన వ్యక్తి తన పేరు, వృత్తి, చిరునామా తదితర వివరాలను వెల్లడిస్తే గానీ అతని ఫిర్యాదును పోలీసు శాఖ, కేంద్ర నిఘా కమిషన్ పరిగణనలోకి తీసుకోవు. ఫిర్యాదుదారు తన వివరాలను వెల్లడించాలనే నిబంధనను తొలగించవల్సిన అవసరం ఎంతైనా వున్నది. గ్రూప్ ‘ఏ’ అధికారులు తమ విధులను నిర్వహిస్తున్న తీరుతెన్నులను ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి బయటి, స్వతంత్ర సంస్థలచే మూల్యాంకనం చేయించాలని ఐదో వేతన సంఘం సిఫారసు చేసింది. ఇదే సరిపోదు. ఇంతకంటే మరో అడుగు ముందుకేయాలి. ప్రజలే స్వయంగా ప్రభుత్వాధికారుల పనితీరును మూల్యాంకంనం చేసేలా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లలో ప్రతి సెమిస్టర్ ఆఖరులో విద్యార్థులు తమ అధ్యాపకుల బోధనా ప్రావీణ్యాన్ని మూల్యాంకనం చేయడం పరిపాటి. ప్రభుత్వాధికారుల పనితీరును కూడా వినియోగదారులు ఇదేవిధంగా మూల్యాంకనం చేయాలి. ఇందుకు కేంద్ర నిఘా కమిషన్ వలే ‘ప్రభుత్వ అధికారుల పనితీరు మూల్యాంకన సంస్థ’ ఒకదాన్ని నెలకొల్పాలి. ఇది, ప్రధాని మోదీ తీసుకోవల్సిన మూడో చర్య. సర్వేల నిర్వహణ, వినియోగదారులకు గోప్యంగా ప్రశ్నావళిని పంపడం మొదలైన చర్యల ద్వారా గ్రూప్ ‘ఏ’ అధికారుల పనితీరును ఈ సంస్థ మూల్యాంకనం చేయాలి. ఉదాహరణకు ఒక విద్యుత్ పంపిణీ డివిజన్‌లో 1000 మంది వినియోగదారులకు ప్రశ్నావళిని ఆ డివిజన్ ఉన్నతస్థాయి ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారుల పనితీరు గురించి తెలుసుకోవాలి. ఈ సర్వే ఫలితాలను వెబ్‌సైట్‌పై వుంచాలి. ప్రతి ప్రభుత్వోద్యోగి తాను కొనుగోలుచేసిన ఆస్తుల వివరాలను వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అంతేగాక తమ ఆస్తుల వివరాలను ఒక సీల్డ్ కవర్‌లో ఉంచి ప్రభుత్వానికి నివేదించాలి. సంబంధిత ఉద్యోగి లేదా అధికారి అవినీతికి పాల్పడినట్టు ఏదైనా ఫిర్యాదు వస్తే ఆ సీల్డ్ కవర్‌ను తెరుస్తారు. అయితే చాలామంది అధికారులు ఈ నిబంధనను పాటించడం లేదు. తమ ఆస్తుల వివరాలను ఏటా వెల్లడించడాన్ని తప్పనిసరి చేయాలి. ఇది, మోదీ చేపట్టవలసిన నాలుగో చర్య. ప్రతి ప్రభుత్వోద్యోగి, అధికారి ఆస్తుల వివరాలను ప్రజల పరిశీలనకు వెబ్‌సైట్‌పై వుంచాలి. ప్రభుత్వోద్యోగి, అధికారి స్వీయ ఆస్తులే గాక, ఆయన కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను కూడా విధిగా వెల్లడించాలి. ఈ నాలుగు చర్యలను ఏ మేరకు పటిష్ఠంగా అమలుపరుస్తారన్న దానిపై ప్రధాని మోదీ వ్యూహం సాఫల్యత ఆధారపడి వున్నది. (వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్) | editorial |
19,877 | 16-02-2017 01:56:28 | ఉసేన్ బోల్ట్ నాలుగోసారి... | లారెస్ అవార్డుకు ఎంపిక మహిళా ఉత్తమ అథ్లెట్‌గా బైల్స్ ఉత్తమ రీఎంట్రీ ఆటగాడిగా ఫెల్ఫ్స్ మోనాకో: జమైకా స్ర్పింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రతిష్టాత్మక లారెస్ అవార్డును అందుకున్నాడు. 2016 సంవత్సరానికి గాను క్రిస్టియానో రొనాల్డో, లీబ్రౌన్ జేమ్స్‌ను వెనక్కినెట్టి బోల్ట్ ఈ అవార్డుకు నాలుగోసారి ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో అమెరికా యువ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ఉత్తమ అథ్లెట్‌గా నిలిచింది. అమెరికా వెటరన్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ఫ్స్ ‘కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. రీఎంట్రీలో రియో ఒలింపిక్స్‌లో ఫెల్ఫ్స్ 5 స్వర్ణ, ఒక రజతం సాధించాడు. దీంతో అతని ఒలింపిక్స్ స్వర్ణాల సంఖ్య 28కి చేరింది. ఇక రియో ఒలింపిక్స్‌లో బోల్ట్ మూడు స్వర్ణాలు నెగ్గగా.. బైల్స్ 4 పసిడి, ఒక కాంస్యం సాధించింది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో అమెరికా దిగ్గజ అథ్లెట్ మైకేల్ జాన్సన్ చేతుల మీదుగా బోల్ట్ ఈ అవార్డును స్వీకరించాడు. అంతకుముందు టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్, సెరెనా విలియమ్స్‌తో పాటు సర్ఫర్ కెల్లీ స్లాటర్ నాలుగు సార్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇప్పుడు వీరి సరసన బోల్ట్ చోటు దక్కించుకున్నాడు. 2009, 2010, 2013లోనూ ఉసేన్‌ను స్పోర్ట్స్ ఆస్కార్‌గా పిలిచే లారెస్ అవార్డు వరించింది. | sports |
20,920 | 24-10-2017 02:24:27 | అసలు ఊహించలేదు..! | త్వరలో వాణిజ్య ఒప్పందాలుకిడాంబి శ్రీకాంత్‌ఒడెన్స్: వచ్చే ఏడాది ప్రముఖ టోర్నీలున్న నేపథ్యంలో ఎంపిక చేసిన చాంపియన్‌షిప్‌ల్లోనే పాల్గొననున్నట్టు డెన్మార్క్ ఓపెన్ విజేత కిడాంబి శ్రీకాంత్ వెల్లడిం చాడు. ‘కేవలం ర్యాంకింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతి టోర్నీ బరిలో దిగాలనుకోవడంలేదు. ఎంపిక చేసిన పోటీల్లోనే ఆడాలనుకుంటున్నాన’ని ఆదివారం రాత్రి జరిగిన డెన్మార్క్ ఓపెన్ ఫైనల్లో దక్షిణ కొరియా ఆటగాడు లీ హ్యున్‌ను చిత్తు చేసిన తెలుగు షట్లర్ స్పష్టంజేశాడు. ‘మొత్తం 10 టోర్నీల బరిలో దిగాలనుకుంటున్నా. ఆపై కామన్వెల్త్, ఆసియా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్ ఉన్నాయి. ఇవిగాక సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో తప్పక ఆడాలి. వీటితోపాటు పీబీఎల్. అంటే.. మొత్తంగా వచ్చే ఏడు 15 నుంచి 17 టోర్నీల్లో పాల్గొనాల్సి ఉంటుంది’ అని వివరించా డు. డెన్మార్క్ ఓపెన్‌పై మాట్లాడుతూ.. ‘గతవారం అద్భుతం గా గడిచింది. గట్టి ప్రత్యర్థులను ఓడించా. ఈ సంవత్సరం మూడు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలుస్తానని ఊహించలేదు. కానీ ఇదే స్థాయి ఆటతీరు కనబరచాలని మాత్రం పట్టుదలగా ఉన్నాన’ని చెప్పాడు. డెన్మార్క్ సహా 2017లో ఇండోనేసియా, ఆస్ర్టేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిళ్లు నెగ్గిన శ్రీకాంత్ ఈ ఏడాదిని అత్యున్నత స్థాయిలో ముగించాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు. ‘గాయం నుంచి కోలుకున్నాక ఈ సంవత్సరం చాలా చక్కగా ఆడాను. ఇంకా కొన్ని సూపర్ సిరీస్ టోర్నీలున్నాయి. వాటిలో కూడా సత్తా చాటాల’ని చెప్పాడు. డిసెంబరులో జరిగే దుబాయ్ సూపర్ సిరీస్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని, ముందుగా చైనా, హాంకాంగ్ టోర్నీలు ఉన్నాయని తెలిపాడు. రాబోయే రోజుల్లో కొన్ని పెద్ద సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు వెల్లడించాడు. మొత్తం ‘ఐదు’.. అగ్రశ్రేణిలో చోటుఆదివారం గెలిచిన డెన్మార్క్ ఓపెన్ టైటిల్‌తో.. శ్రీకాంత్ ఖాతాలో మొత్తం ఐదు సూపర్ సిరీస్ ట్రోఫీలు చేరాయి. ఈ ఏడాది ఇండోనేసియా, ఆస్ర్టేలియన్ ఓపెన్, డెన్మార్క్‌లతోపాటు 2014లో చైనా, 2015లో ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిళ్లు అవి. ఇంకా థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ (2013), స్విస్ ఓపెన్ (2015), సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రీ గోల్డ్ (2016), మాల్దీవుల ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ (2012)లతో మొత్తం 9 అంతర్జాతీయ టైటిళ్లు శ్రీ.. సాధించాడు. ఈ నేపథ్యంలో భారత అగ్రశ్రేణి షట్లర్లు ప్రకాష్ పదుకోన్, గోపీచంద్, సైనా, పీవీ సింధు సరసన చేరాడు. అంతే కాదు.. చైనా దిగ్గజ ప్లేయర్ లిన్‌డాన్ తర్వాత ఓ కేలెండర్ సంవత్సరంలో మూడు సూపర్ సిరీస్ టైటిళ్లు కైవసం చేసుకు న్న తొలి ఆటగాడిగా కిడాంబి ఖ్యాతినార్జించాడు. ఎంతో అద్భుతమైన ఫాం: కిడాంబికి లోకేశ్ ప్రశంస‘ఎంతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కిడాంబి శ్రీకాంత్ దేశానికి గర్వకారణంగా నిలిచాడని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేశ్ ప్ర శంసించారు. శ్రీకాంత్ డెన్మార్క్ సూపర్ సిరీస్ నెగ్గడంపై సోమవారం ఆయన తన ట్విటర్ ఖాతాలో స్పందించా రు. అలాగే భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్‌లో చాంపియన్‌గా నిలవడంపై కూడా ఆయన హ ర్షం వ్యక్తం చేశారు. కాగా.. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో తెలుగు తేజం శ్రీకాంత్ విజయంపై ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌ను అభినందించారు. బాయ్ 5 లక్షల నజరానాడెన్మార్క్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన శ్రీకాంత్‌కు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ ఐదు లక్షల నజరానా ప్రకటించింది. శ్రీకాంత్ డానిష్ ఓపెన్ టైటిల్ గెలిచినందుకు గర్విస్తున్నామని, భవిష్యత్తులో మన ఆట గాళ్లు దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని బా య్ అధ్యక్షుడు హిమాంత బిశ్వా ఆకాంక్షించారు. | sports |
9,509 | 15-04-2017 22:40:21 | నిజాయితీ లేదన్న మాటే!- కృతి సనన్ | ‘‘నేను ప్రేమను నిర్వచించలేను. ఎవరైనా ప్రేమను ఎలా నిర్వచించగలరు? ప్రేమలో ఉన్నవాళ్లయినా సరే.. ప్రేమ భావనను కచ్చితంగా నిర్వచించగలరని నేననుకోను’’ అని చెబుతోంది బాలీవుడ్ హీరోయిన కృతి సనన. తెలుగులోనూ ‘1.. నేనొక్కడినే’, ‘దోచెయ్’ సినిమాలు చేసిన ఆమె ప్రేమ గురించి తన అభిప్రాయం తెలియజేస్తూ ‘‘ప్రేమ అనేది ఒక బలమైన అనుబంధంగా పరిగణిస్తాను. ఒక వ్యక్తికి సంబంధించి మనల్నేదో ఆకర్షిస్తుంది. అతని వైపు లాగుతుంది. అతనికి బద్ధురాలయ్యేలా చేస్తుంది. అదేంటనేది మనకు అంతుపట్టదు. అతను బాగా డ్రస్ చేసుకుంటాడనీ, లేదంటే బాగా మాట్లాడతాడనీ, లేదంటే ఇంకేదో కారణంతో ప్రేమిస్తున్నాననీ చెబితే ఆ ప్రేమలో నిజాయితీ లేదని అర్థం. ఆ ఇద్దరూ నిజమైన ప్రేమలో లేరనీ అర్థం. కనీసం ‘ఒకరికొకరు’ అన్నంతగా ప్రేమలో లేరని బల్లగుద్ది మరీ చెప్పగలను. ప్రేమ జనించడానికి ఒక కారణమనేది ఉంటే, అదే కారణంతో ఆ అనుబంధం ముగిసిపోవడానికి సిద్ధంగా ఉన్నదన్న మాట. అలాంటప్పుడు ప్రేమకు అర్థమేముంది?’’ అంటోంది. సుశాంతసింగ్ రాజ్‌పుట్ సరసన కృతి నటిస్తోన్న ‘రాబ్‌తా’ చిత్రం జూన 9న విడుదల కానున్నది. | entertainment |
5,648 | 27-09-2017 14:16:01 | చెర్రీతో పూరీ.. పదేళ్ల తర్వాత..! | మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం 'రంగస్థలం 1985 ' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత చెర్రీ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అది కూడా పూర్తికాగానే చెర్రీ.. పూరీ బాటలోకి వస్తున్నారని సమాచారం. ఇటీవలే పూరీ ఓ కథ వినిపించగా చెర్రీ ఓకే చెప్పేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్వినీదత్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. నిజానికి రామ్‌చరణ్ 'చిరుత' సినిమాతో తన సినీ జీవితాన్ని పూరీ తోనే స్టార్ట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయలేదు. పదేళ్ల తర్వాత మరోసారి పూరీతో సినిమా చేస్తున్నారని అంటున్నారు. తన కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు చెర్రీ. తన సినిమాపై తానే సెటైర్ వేసుకున్న పూరీ మెగా హీరోల కాంబెనేషన్‌లో సినిమా? | entertainment |
3,433 | 29-11-2017 00:21:26 | నిజాంపై నిష్పాక్షిక దృష్టి | నిజాం పాలనను కేవలం మత కోణంలో చూడటాన్ని చారిత్రక ఆధారాలు సమర్థించవు. నిజాం వ్యతిరేకతను రాజకీయ ఆయుధంగా చేసుకోవడానికి తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి చేస్తున్న ప్రయత్నం ఆహ్వానించదగిన పరిణామం కాదు. అదేవిధంగా సంకుచిత దృష్టితో నిజాం పాలనను నిందించడం చారిత్రక వాస్తవాలను తిరస్కరించడమే అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య అసెంబ్లీలో నిజాం పాలనపై చేసిన వ్యాఖ్యలు వాదోపవాదాలకు, చర్చలకు దారితీశాయి. ఇది ఆహ్వానించదగిన అంశం. ఈ చర్చల్లో తెలంగాణ వారసత్వ విశ్లేషణకు సంబంధించి రెండు ప్రధాన ధోరణులు ప్రస్ఫుటంగా ముందుకు వచ్చాయి. మతతత్వవాదులు ఆసఫ్ జాహి పాలకులు ముస్లింలు కావడం వల్ల ఆధునిక తెలంగాణ చరిత్రను మత కోణంలో పరిశీలించి పాక్షిక యథార్థాలను ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా సాంప్రదాయ మార్క్సిస్టులు ‘మా రాజు తరతరాల బూజు’ విశ్లేషణ చట్రంలోనే నిరంకుశ భూస్వామ్య వ్యవస్థ తీరుతెన్నుల్ని బేరీజు వేసి ప్లస్, మైనస్‌ల ఆధారంగా అసమగ్ర చరిత్ర రచన చేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను ఉపయోగించుకోవడం సరికాదు. మార్క్సిస్టు మేధావులు సాయుధపోరాట కాలాన్నే కేంద్రంగా చేసుకొని, మొత్తంగా తెలంగాణ చరిత్రను పరిశీలించడం, హిందూత్వ వాదులు రజాకార్ల దురాగతాల్ని ఎత్తిచూపి నిజాం పాలనను వక్రీకరించడం సబబు కాదు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలంలో చివరి దశలో (1946–48) సంభవించిన సంఘటనలు, ఉత్పన్నమైన పరిణామాల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆధునిక తెలంగాణ చరిత్రను విశ్లేషించడం సరైన పద్ధతి కాదు. ఈ మధ్య కాలంలో పౌర సమాజంలోని మేధావులు, రాజకీయ సిద్ధాంతకర్తలు, నాయకులు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అనేక అంశాలపై విభిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మతం, వర్గం, కులం, లింగ భేదాలకు అతీతంగా ప్రాంతీయ అస్తిత్వం, ఉనికి, చైతన్యం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ సందర్భంలోనే ఆసఫ్ జాహీల పాలనకు సంబంధించి ఇంతవరకు మరుగునపడి, వక్రీకరణలకు గురైన అంశాల్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. ఒక ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకుడు నిజాం గురించి చేసిన ప్రకటనను ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. తెలకపల్లి రవి (ఆంధ్రజ్యోతి, నవంబర్ 17) రాసిన వ్యాసంలో వామపక్ష దృక్పథం విశదీకరించబడింది. ఆయన ఉటంకించిన గేయాలు, నిజాం పాలనకు సంబంధించి పేర్కొన్న అంశాలు తెలంగాణ చరిత్రను పాక్షికంగానే తెలియచేస్తాయనేది నా అభిప్రాయం. సాంప్రదాయ మార్క్సిస్టుల రచనల్లో ఆలోచనలో నిజాం నిరంకుశ, భూస్వామ్య వ్యవస్థలు తెలంగాణ ప్రాంతంలో అనేక వైరుధ్యాలతో పాటు, పలు సామాజిక, ఆర్థిక, పాలనా సంబంధమైన మార్పులకు కూడా దోహదం చేశాయనే చారిత్రక సత్యం విస్మరించబడింది. ‘మారాజు బూజు’ చట్రపరిధిలో కొంతమంది వామపక్ష మేధావులు చరిత్ర పరిణామ క్రమాన్ని కుదించి, ఏకధోరణితో విశ్లేషిస్తున్నారు. అందుకే వారి వాదనల్లో ఎన్నుకొనబడిన కొన్ని అంశాలకు ప్రాధాన్యతనిచ్చి, మిగతా అంశాల్ని వదిలివేయడం జరుగుతోంది. వామపక్ష రాజకీయ నాయకుల రచనల్లో ఫ్యూడల్ దోపిడీ, వివక్ష, అణచివేతలు ‘పాడిందే పాటగా’ పేర్కొనబడినాయి. అలాంటి రచనల్లో మొత్తంగా నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతం, సమాజం అంధకారమయమైందనే పాక్షిక విశ్లేషణ చేయబడింది. చారిత్రకంగా తెలంగాణ సమాజం, సంస్కృతులలో ప్రతిఘటనా చైతన్యం, ఆధిపత్య ధిక్కారం శతాబ్దాల పాటు అంతర్లీనంగా ఉన్నాయి. సమ్మక్క, సారక్క, సర్వాయి పాపన్న, పండుగ సాయన్నల వారసత్వం తెలంగాణ ప్రజాసంస్కృతిలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ పోరాటాల పరంపర పరాకాష్ట మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది తిరుగులేని చారిత్రక వాస్తవం. పోరాట సంస్కృతితో పాటు ఆసఫ్ జాహీల పానలో తెలంగాణ ప్రాంతం ఆధునికీకరణ ప్రక్రియలకు, పరిణామాలకు లోనైంది. మార్క్సిస్టు చరిత్ర రచనా పద్ధతి ప్రకారం ఫ్యూడల్, నిరంకుశ వ్యవస్థ, ద్వంద్వ ప్రవృత్తిని కలిగి ఉంటుంది. ఆ వ్యవస్థలో విధ్వంసక, నిర్మాణాత్మక శక్తులు అంతర్భాగంగా ఉంటాయి. ఈ ప్రాథమిక సూత్రీకరణను తెలంగాణ చరిత్రకు అన్వయించడంలో సాంప్రదాయ మార్క్సిస్టు మేధావులు విఫలమైనారని చెప్పవచ్చు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనా కాలం (1911–48)లో హైదరాబాద్ రాజ్యంలోని పలు రంగాల్లో చెప్పుకోదగిన మార్పులు సంభవించాయి. తెలకపల్లి రవి వ్యాసంలో పేర్కొన్నట్లు నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం యాదృచ్ఛికం కాదు. అది నిజాం అభివృద్ధి నమూనాలోని ఒక విశిష్ట అంశం. అదేమంటే కాకతీయ, కుతుబ్ షాహీల కాలంలో దక్కన్ ప్రాంతంలో రూపుదిద్దుకున్న నీటిపారుదల వ్యవస్థ. 1920 దశకంలో ప్రభుత్వ అజమాయిషీలో మధ్యతరగతి, భారీ నీటిపారుదల సౌకర్యాలు కల్పించబడ్డాయి. అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ కంటే ముందుగానే నిజాం రాజ్యంలో ప్రభుత్వరంగ సంస్థలు ఏర్పాటు చేయబడినాయి. బొగ్గు గనులు, రైల్వేలు, రోడ్డు రవాణా సంస్థ, విమానయానంతో పాటు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద నిజాం చక్కెర ఫ్యాక్టరీ, ఆజంజాహి, ఆల్విన్, పాగా టూల్స్, సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లులు పబ్లిక్ రంగంలో స్థాపించబడినాయి. చివరి నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానం కొన్ని ప్రత్యేకతల్ని సంతరించుకుంది. ప్రభుత్వ రంగంలో పారిశ్రామికీకరణ, నీటిపారుదల ప్రాజెక్టులు, మరణశిక్ష రద్దు, కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయ శాఖ విభజన, ప్రాంతీయ భాషలో విద్యాబోధన, ఆది హిందువుల (దళితులు) విద్యాభివృద్ధికి ఒక కోటి రూపాయల నిధి ఏర్పాటుచేయడం, స్వంత ద్రవ్య చలామణి, పబ్లిక్ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు నిజాంపాలనలో ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు. గత కొద్దికాలంగా చరిత్ర పరిశోధకులు ప్రామాణిక ఆధారాలతో ఆసఫ్‌జాహీ పాలకుల మత, సాంస్కృతిక విధానాలపై నూతన అంశాల్ని వెలికితీసినారు. స్థూలంగా చెప్పాలంటే నిజాం రాజులు, ముఖ్యంగా ఆరవ, ఏడవ నిజాంలు, దక్కన్ ప్రాంత మిశ్రమ సంస్కృతిని, మత సమ్మేళనాన్ని కొనసాగించినారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరమత సహనాన్ని పాటించి ముస్లిమేతర సంస్థలకు విరాళాలిచ్చి ఆదరించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలతో పాటు, యునానీ, ఆయుర్వేద, ఆర్ధోపెడిక్, నిలోఫర్, క్షయ, క్యాన్సర్, ఫోరెన్సిక్, జిజిఖానా, కోరంటి ఆస్పత్రులు స్థాపించబడినాయి. పురావస్తు శాఖ డైరెక్టర్ గులాం యాజ్‌దాని పర్యవేక్షణలో వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం పరిరక్షింపబడినాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మసీదులు, దర్గాలతో పాటు దేవాలయాలకు, చర్చిలకు, గురుద్వారాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాడు. ఆసఫ్ జాహీల కాలం నాటి కట్టడాలు, వాస్తుశిల్పం, శిల్ప కళలు మత సామరస్యాన్ని, మిశ్రమ సంస్కృతిని ప్రతిబింబించాయి. అందువల్ల నిజాం పాలనను కేవలం మత కోణంలో చూడటాన్ని చారిత్రక ఆధారాలు సమర్థించవు. హిందూత్వ వాదులు నిజాం వ్యతిరేకతను రాజకీయ ఆయుధంగా చేసుకోవడానికి తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి చేస్తున్న ప్రయత్నం ఆహ్వానించదగిన పరిణామం కాదు. అదేవిధంగా సంకుచిత దృష్టితో నిజాం పాలనను నిందించడం చారిత్రక వాస్తవాలను తిరస్కరించడమే అవుతుంది. చారిత్రకంగా పరిశీలించినట్లయితే నిజాం రాజు ముస్లిం మతస్థుడు, ప్రాజ్ఞ నిరంకుశుడైనప్పటికీ, ఆయన రాజ్యంలో పౌర హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అణచివేయబడినప్పటికీ, హైదరాబాద్ సంస్థానంలో షరియత్ చట్టం అమలుకాలేదు. ఎందుకంటే ముస్లిమేతరులు (హిందువులు) ప్రధాన మంత్రి, తదితర ఉన్నత ఉద్యోగులుగా నియమించబడినారు. కార్యనిర్వహణ శాఖ, న్యాయ వ్యవస్థలో హిందువులు, పార్సీలు వగైరా వారు ఉన్నత పదవుల్లో నియమించబడ్డారు. నిజాం న్యాయవ్యవస్థ ఆధునిక న్యాయసూత్రాల ఆధారంగా పనిచేసింది. మరణ శిక్ష రద్దుచేయబడింది. ఏది ఏమైనప్పటికీ ఉస్మాన్ అలీఖాన్ పాలనా కాలం చివరి దశలో తీవ్రస్థాయిలో మత వైషమ్యాలు, ఘర్షణలు, రజాకార్ల దౌర్జన్యాలు, రైతాంగ సాయుధ పోరాటం, సైనిక చర్య, ఆ తర్వాత ముస్లింలపై దాడులు జరిగినాయి. ఆధునిక తెలంగాణ చరిత్రలో 1946–48 సంవత్సరాల మధ్య సంభవించిన పరిణామాలపై చరిత్రకారుల్లో, మేధావుల్లో భిన్నాభిప్రాయాలు, పరస్పర వ్యతిరేక ధోరణులు వ్యక్తమౌతున్నాయి. అందువల్ల ప్రామాణిక చారిత్రక ఆధారాలతో ఆధునిక తెలంగాణ చరిత్రను శాస్ర్తీయ దృక్పథంతో తిరిగి రాయాల్సిన అవసరం ఉంది.ప్రొఫెసర్ అడపా సత్యనారాయణవిశ్రాంత ఆచార్యులు, ఓయూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య అసెంబ్లీలో నిజాం పాలనపై చేసిన వ్యాఖ్యలు వాదోపవాదాలకు, చర్చలకు దారితీశాయి. ఇది ఆహ్వానించదగిన అంశం. ఈ చర్చల్లో తెలంగాణ వారసత్వ విశ్లేషణకు సంబంధించి రెండు ప్రధాన ధోరణులు ప్రస్ఫుటంగా ముందుకు వచ్చాయి. మతతత్వవాదులు ఆసఫ్ జాహి పాలకులు ముస్లింలు కావడం వల్ల ఆధునిక తెలంగాణ చరిత్రను మత కోణంలో పరిశీలించి పాక్షిక యథార్థాలను ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా సాంప్రదాయ మార్క్సిస్టులు ‘మా రాజు తరతరాల బూజు’ విశ్లేషణ చట్రంలోనే నిరంకుశ భూస్వామ్య వ్యవస్థ తీరుతెన్నుల్ని బేరీజు వేసి ప్లస్, మైనస్‌ల ఆధారంగా అసమగ్ర చరిత్ర రచన చేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను ఉపయోగించుకోవడం సరికాదు. మార్క్సిస్టు మేధావులు సాయుధపోరాట కాలాన్నే కేంద్రంగా చేసుకొని, మొత్తంగా తెలంగాణ చరిత్రను పరిశీలించడం, హిందూత్వ వాదులు రజాకార్ల దురాగతాల్ని ఎత్తిచూపి నిజాం పాలనను వక్రీకరించడం సబబు కాదు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలంలో చివరి దశలో (1946–48) సంభవించిన సంఘటనలు, ఉత్పన్నమైన పరిణామాల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆధునిక తెలంగాణ చరిత్రను విశ్లేషించడం సరైన పద్ధతి కాదు. ఈ మధ్య కాలంలో పౌర సమాజంలోని మేధావులు, రాజకీయ సిద్ధాంతకర్తలు, నాయకులు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అనేక అంశాలపై విభిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మతం, వర్గం, కులం, లింగ భేదాలకు అతీతంగా ప్రాంతీయ అస్తిత్వం, ఉనికి, చైతన్యం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ సందర్భంలోనే ఆసఫ్ జాహీల పాలనకు సంబంధించి ఇంతవరకు మరుగునపడి, వక్రీకరణలకు గురైన అంశాల్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. ఒక ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకుడు నిజాం గురించి చేసిన ప్రకటనను ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. తెలకపల్లి రవి (ఆంధ్రజ్యోతి, నవంబర్ 17) రాసిన వ్యాసంలో వామపక్ష దృక్పథం విశదీకరించబడింది. ఆయన ఉటంకించిన గేయాలు, నిజాం పాలనకు సంబంధించి పేర్కొన్న అంశాలు తెలంగాణ చరిత్రను పాక్షికంగానే తెలియచేస్తాయనేది నా అభిప్రాయం. సాంప్రదాయ మార్క్సిస్టుల రచనల్లో ఆలోచనలో నిజాం నిరంకుశ, భూస్వామ్య వ్యవస్థలు తెలంగాణ ప్రాంతంలో అనేక వైరుధ్యాలతో పాటు, పలు సామాజిక, ఆర్థిక, పాలనా సంబంధమైన మార్పులకు కూడా దోహదం చేశాయనే చారిత్రక సత్యం విస్మరించబడింది. ‘మారాజు బూజు’ చట్రపరిధిలో కొంతమంది వామపక్ష మేధావులు చరిత్ర పరిణామ క్రమాన్ని కుదించి, ఏకధోరణితో విశ్లేషిస్తున్నారు. అందుకే వారి వాదనల్లో ఎన్నుకొనబడిన కొన్ని అంశాలకు ప్రాధాన్యతనిచ్చి, మిగతా అంశాల్ని వదిలివేయడం జరుగుతోంది. వామపక్ష రాజకీయ నాయకుల రచనల్లో ఫ్యూడల్ దోపిడీ, వివక్ష, అణచివేతలు ‘పాడిందే పాటగా’ పేర్కొనబడినాయి. అలాంటి రచనల్లో మొత్తంగా నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతం, సమాజం అంధకారమయమైందనే పాక్షిక విశ్లేషణ చేయబడింది. చారిత్రకంగా తెలంగాణ సమాజం, సంస్కృతులలో ప్రతిఘటనా చైతన్యం, ఆధిపత్య ధిక్కారం శతాబ్దాల పాటు అంతర్లీనంగా ఉన్నాయి. సమ్మక్క, సారక్క, సర్వాయి పాపన్న, పండుగ సాయన్నల వారసత్వం తెలంగాణ ప్రజాసంస్కృతిలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ పోరాటాల పరంపర పరాకాష్ట మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది తిరుగులేని చారిత్రక వాస్తవం. పోరాట సంస్కృతితో పాటు ఆసఫ్ జాహీల పానలో తెలంగాణ ప్రాంతం ఆధునికీకరణ ప్రక్రియలకు, పరిణామాలకు లోనైంది. మార్క్సిస్టు చరిత్ర రచనా పద్ధతి ప్రకారం ఫ్యూడల్, నిరంకుశ వ్యవస్థ, ద్వంద్వ ప్రవృత్తిని కలిగి ఉంటుంది. ఆ వ్యవస్థలో విధ్వంసక, నిర్మాణాత్మక శక్తులు అంతర్భాగంగా ఉంటాయి. ఈ ప్రాథమిక సూత్రీకరణను తెలంగాణ చరిత్రకు అన్వయించడంలో సాంప్రదాయ మార్క్సిస్టు మేధావులు విఫలమైనారని చెప్పవచ్చు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనా కాలం (1911–48)లో హైదరాబాద్ రాజ్యంలోని పలు రంగాల్లో చెప్పుకోదగిన మార్పులు సంభవించాయి. తెలకపల్లి రవి వ్యాసంలో పేర్కొన్నట్లు నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం యాదృచ్ఛికం కాదు. అది నిజాం అభివృద్ధి నమూనాలోని ఒక విశిష్ట అంశం. అదేమంటే కాకతీయ, కుతుబ్ షాహీల కాలంలో దక్కన్ ప్రాంతంలో రూపుదిద్దుకున్న నీటిపారుదల వ్యవస్థ. 1920 దశకంలో ప్రభుత్వ అజమాయిషీలో మధ్యతరగతి, భారీ నీటిపారుదల సౌకర్యాలు కల్పించబడ్డాయి. అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ కంటే ముందుగానే నిజాం రాజ్యంలో ప్రభుత్వరంగ సంస్థలు ఏర్పాటు చేయబడినాయి. బొగ్గు గనులు, రైల్వేలు, రోడ్డు రవాణా సంస్థ, విమానయానంతో పాటు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద నిజాం చక్కెర ఫ్యాక్టరీ, ఆజంజాహి, ఆల్విన్, పాగా టూల్స్, సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లులు పబ్లిక్ రంగంలో స్థాపించబడినాయి. చివరి నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానం కొన్ని ప్రత్యేకతల్ని సంతరించుకుంది. ప్రభుత్వ రంగంలో పారిశ్రామికీకరణ, నీటిపారుదల ప్రాజెక్టులు, మరణశిక్ష రద్దు, కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయ శాఖ విభజన, ప్రాంతీయ భాషలో విద్యాబోధన, ఆది హిందువుల (దళితులు) విద్యాభివృద్ధికి ఒక కోటి రూపాయల నిధి ఏర్పాటుచేయడం, స్వంత ద్రవ్య చలామణి, పబ్లిక్ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు నిజాంపాలనలో ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు. గత కొద్దికాలంగా చరిత్ర పరిశోధకులు ప్రామాణిక ఆధారాలతో ఆసఫ్‌జాహీ పాలకుల మత, సాంస్కృతిక విధానాలపై నూతన అంశాల్ని వెలికితీసినారు. స్థూలంగా చెప్పాలంటే నిజాం రాజులు, ముఖ్యంగా ఆరవ, ఏడవ నిజాంలు, దక్కన్ ప్రాంత మిశ్రమ సంస్కృతిని, మత సమ్మేళనాన్ని కొనసాగించినారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరమత సహనాన్ని పాటించి ముస్లిమేతర సంస్థలకు విరాళాలిచ్చి ఆదరించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలతో పాటు, యునానీ, ఆయుర్వేద, ఆర్ధోపెడిక్, నిలోఫర్, క్షయ, క్యాన్సర్, ఫోరెన్సిక్, జిజిఖానా, కోరంటి ఆస్పత్రులు స్థాపించబడినాయి. పురావస్తు శాఖ డైరెక్టర్ గులాం యాజ్‌దాని పర్యవేక్షణలో వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం పరిరక్షింపబడినాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మసీదులు, దర్గాలతో పాటు దేవాలయాలకు, చర్చిలకు, గురుద్వారాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాడు. ఆసఫ్ జాహీల కాలం నాటి కట్టడాలు, వాస్తుశిల్పం, శిల్ప కళలు మత సామరస్యాన్ని, మిశ్రమ సంస్కృతిని ప్రతిబింబించాయి. అందువల్ల నిజాం పాలనను కేవలం మత కోణంలో చూడటాన్ని చారిత్రక ఆధారాలు సమర్థించవు. హిందూత్వ వాదులు నిజాం వ్యతిరేకతను రాజకీయ ఆయుధంగా చేసుకోవడానికి తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి చేస్తున్న ప్రయత్నం ఆహ్వానించదగిన పరిణామం కాదు. అదేవిధంగా సంకుచిత దృష్టితో నిజాం పాలనను నిందించడం చారిత్రక వాస్తవాలను తిరస్కరించడమే అవుతుంది. చారిత్రకంగా పరిశీలించినట్లయితే నిజాం రాజు ముస్లిం మతస్థుడు, ప్రాజ్ఞ నిరంకుశుడైనప్పటికీ, ఆయన రాజ్యంలో పౌర హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అణచివేయబడినప్పటికీ, హైదరాబాద్ సంస్థానంలో షరియత్ చట్టం అమలుకాలేదు. ఎందుకంటే ముస్లిమేతరులు (హిందువులు) ప్రధాన మంత్రి, తదితర ఉన్నత ఉద్యోగులుగా నియమించబడినారు. కార్యనిర్వహణ శాఖ, న్యాయ వ్యవస్థలో హిందువులు, పార్సీలు వగైరా వారు ఉన్నత పదవుల్లో నియమించబడ్డారు. నిజాం న్యాయవ్యవస్థ ఆధునిక న్యాయసూత్రాల ఆధారంగా పనిచేసింది. మరణ శిక్ష రద్దుచేయబడింది. ఏది ఏమైనప్పటికీ ఉస్మాన్ అలీఖాన్ పాలనా కాలం చివరి దశలో తీవ్రస్థాయిలో మత వైషమ్యాలు, ఘర్షణలు, రజాకార్ల దౌర్జన్యాలు, రైతాంగ సాయుధ పోరాటం, సైనిక చర్య, ఆ తర్వాత ముస్లింలపై దాడులు జరిగినాయి. ఆధునిక తెలంగాణ చరిత్రలో 1946–48 సంవత్సరాల మధ్య సంభవించిన పరిణామాలపై చరిత్రకారుల్లో, మేధావుల్లో భిన్నాభిప్రాయాలు, పరస్పర వ్యతిరేక ధోరణులు వ్యక్తమౌతున్నాయి. అందువల్ల ప్రామాణిక చారిత్రక ఆధారాలతో ఆధునిక తెలంగాణ చరిత్రను శాస్ర్తీయ దృక్పథంతో తిరిగి రాయాల్సిన అవసరం ఉంది.ప్రొఫెసర్ అడపా సత్యనారాయణవిశ్రాంత ఆచార్యులు, ఓయూ | editorial |
19,211 | 29-06-2017 11:50:46 | గోడ దగ్గర పని కానిచ్చేసి.. స్వచ్ఛభారత్‌కు తూట్లుపొడిచిన మంత్రి | న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ పేరిట ప్రధాని మోదీ పరిసరాల పరిశుభ్రతపై ఉద్యమం చేపడుతుంటే... దానికి కేంద్రమంత్రి తన బహిరంగ చర్యతో తూట్లు పొడిచారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న చిత్రం తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను పరిశీలిస్తే సదరు మంత్రిగారు కారును ఆపి మరీ సెక్యూరిటీ గార్డుల సంరక్షణలో బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. మంత్రులే ఈ విధంగా చేస్తుంటే ఇక సామాన్యులు వారు చెప్పేమాటలను ఎలా వింటారని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘సభ్య సమాజానికి అసభ్య మెసేజ్ ఇచ్చిన కేంద్రమంత్రి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ పేరిట ప్రధాని మోదీ పరిసరాల పరిశుభ్రతపై ఉద్యమం చేపడుతుంటే... దానికి కేంద్రమంత్రి తన బహిరంగ చర్యతో తూట్లు పొడిచారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న చిత్రం తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను పరిశీలిస్తే సదరు మంత్రిగారు కారును ఆపి మరీ సెక్యూరిటీ గార్డుల సంరక్షణలో బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. మంత్రులే ఈ విధంగా చేస్తుంటే ఇక సామాన్యులు వారు చెప్పేమాటలను ఎలా వింటారని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘సభ్య సమాజానికి అసభ్య మెసేజ్ ఇచ్చిన కేంద్రమంత్రి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. | nation |
12,840 | 29-05-2017 03:07:05 | తాకి.. తడిమి.. లాగి.. నలిపి.. | యూపీలో ఇద్దరు అమ్మాయిలను చుట్టుముట్టిన 14 మందిఒక అమ్మాయిని లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులుమొబైల్‌లో వీడియో తీసి ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్‌రాంపూర్, మే 28: చుట్టూ చెట్లు. మధ్యలో సన్నని కాలిబాట. ఆ దారిలో వస్తున్న ఇద్దరు అమ్మాయిలను.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 14 మంది పోకిరీలు చుట్టుముట్టారు. ఒక అమ్మాయిని ఎక్కువగా టార్గెట్ చేసుకుని.. తాకరాని చోట్ల తాకుతూ, తడుముతూ, పట్టుకుని లాగేస్తూ, తోసేస్తూ, అసభ్యకరమైన భాషలో మాట్లాడుతూ దారుణంగా వ్యవహరించారు. పైగా తమ అకృత్యాన్ని మొబైల్‌ఫోన్‌లో వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టారు. యూపీలోని రాంపూర్ జిల్లా తండా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఎప్పుడు తీసిందీ తెలియలేదుగానీ.. 15 రోజులుగా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినవారిలో ప్రధాన నిందితుణ్ని అరెస్టు చేశామని.. మిగతావారి కోసం అన్వేషిస్తున్నామని రాంపూర్ ఎస్పీ తెలిపారు. | nation |
9,363 | 11-12-2017 11:33:25 | అనుష్కకు ఏమైంది? |
`బాహుబలి`తో దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనుష్క.. అ క్రేజ్‌ను క్యాష్ చేసుకోలేకపోతోంది. ఆ సినిమా దేశ చరిత్రలోనే అత్యంత భారీ హిట్‌గా నిలిచినా.. అనుష్క మాత్రం భారీ సినిమాలు చేయడం లేదు. దానికి కారణం అనుష్క చేసిన `సైజ్ జీరో` సినిమా. ఆ సినిమా కోసం లావైన అనుష్క సన్నబడేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రస్తుతం ఆమె `భాగమతి` సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవలె విడుదలైంది. నిజానికి `బాహుబలి` ప్రమోషన్ కార్యక్రమాల తర్వాత అనుష్క బహిరంగంగా కనబడలేదు. ఇటీవల సన్నగా మారి తీయించుకున్న ఫోటోను మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, అనుష్క ప్రస్తుతం కేరళలో చికిత్స తీసుకుంటోందని వార్తలు గుప్పుమంటున్నాయి. చాలా రోజుల నుంచి అనుష్క నడుం నొప్పితో బాధపడుతోందట. నడుం నొప్పి చికిత్స కోసం సన్నిహితుల సలహా మేరకు అనుష్క కేరళ వెళ్లిందని టాక్. | entertainment |
17,789 | 09-02-2017 01:55:46 | తక్కువ అవినీతిపరులకు ఓటెయ్యండి | ‘‘ దేశంలోని చాలా ప్రాంతాలలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులందరూ దాదాపుగా అవినీతిపరులే. కొన్ని ప్రాంతాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తక్కువ అవినీతిపరులు కూడా ఉన్నారు. ప్రజలు వివేకంతో ఆలోచించి బరిలో ఉన్న అభ్యర్థుల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తే దేశాభివృద్ధికి పాటుపడతాడు. యువత ప్రతిరోజూ యోగా చేయాలి’’ - బాబా రామ్‌దేవ్ | nation |
16,541 | 27-08-2017 03:15:11 | కేసు నమోదైన రోజే బెదిరింపు |
‘‘2002 డిసెంబర్ 12న గుర్మీత్‌పై కేసు నమోదైంది. ఆ వెంటనే నా గదిలోకి సీబీఐ సీనియర్ అధికారి ఒకరు వచ్చారు. కేసు మూసేయాలంటూ హుకుం జారీ చేశారు. ఆతర్వాతా చాలామంది బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు నేరుగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చి కేసు మూసేయాలంటూ ఒత్తిడి చేసేవారు. 1999లో గుర్మీత్ అత్యాచారానికి పాల్పడిన బాధితురాలు డేరా విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి వాంగ్మూలం ఇప్పించగలిగా’- అప్పటి సీబీఐ డైరెక్టర్ ములింజ నారాయణన్ | nation |
12,285 | 08-12-2017 14:18:28 | విద్యుత్తుకు అంతరాయం... పంపిణీదారుకు జరిమానా... |
న్యూఢిల్లీ : ప్రజలకు నిరంతరాయ విద్యుత్తు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విద్యుత్తు కోతలను నివారించేందుకు చర్యలు తీసుకుంటోంది. కంపెనీలు విద్యుత్తు చౌర్యాన్ని నివారించేందుకు ప్రీపెయిడ్ లేదా స్మార్ట్ మీటర్లను తప్పనిసరిగా అమర్చాలని ప్రకటించింది. ఈ నిబంధనలు 2019 ఏప్రిల్ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. 2018 చివరినాటికి అందరికీ నిరంతరాయ విద్యుత్తును అందజేసే లక్ష్యంతో సెప్టెంబరులో సౌభాగ్య పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం రూ.16 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్తు, నవీన, పునరుద్ధరణీయ ఇంధనాల మంత్రుల సమావేశం అనంతరం కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్ కే సింగ్ మాట్లాడుతూ 2019 మార్చినాటికి అందరికీ వారంలో అన్ని రోజులూ, రోజులో 24 గంటలూ విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇకపై కోతలు లేని విద్యుత్తు సరఫరా అనేది చట్టబద్ధమైన బాధ్యత కాబోతోందన్నారు. 2019 మార్చి తర్వాత నుంచి ఎటువంటి కారణాలూ లేకుండా లోడ్ షెడ్డింగ్ వంటివి జరిగితే జరిమానా విధిస్తామన్నారు. అయితే సాంకేతిక సమస్యలు, దైవ ఘటనల కారణంగా విద్యుత్తు సరఫరాలో లోపం జరిగితే జరిమానాల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. 2019 ఏప్రిల్ 1 నుంచి జరిమానాలు విధిస్తామని తెలిపారు. | nation |
8,437 | 07-07-2017 13:34:58 | నిన్ను కోరి | సంస్థ: డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పితారాగణం: నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి, మురళీశర్మ, పృథ్వి, తనికెళ్ళ భరణి, రాజశ్రీనాయర్, నీతు, భూపాల్‌రాజ్, కేదార్‌శంకర్, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్ నేహంత్ తదితరులు స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌ఫోటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేనిఆర్ట్: చిన్నాస్టైలింగ్: నీరజ కోనసంగీతం: గోపీ సుందర్‌పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజోదర్శకత్వం: శివ నిర్వాణనిర్మాత: దానయ్య డి.వి.వి. నిశితంగా పరిశీలించి కథల్ని రాయాలే గానీ ప్రతి నిత్యం మన చుట్టూ ఎన్నెన్నో ఘటనలు, సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఓ వాస్తవ కథను ఆధారంగా చేసుకుని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమే `నిన్ను కోరి`. ఈ మధ్య వరుస విజయాలతో కెరీర్‌లో హై మీద ఉన్న నాని ఇందులో కథానాయకుడు. ఆల్రెడీ `జెంటిల్‌మేన్`తో హిట్ పెయిర్‌గా నిలిచిన నాని, నివేదా థామస్ మరోసారి జంటగా నటించిన చిత్రం నిన్నుకోరి. మరి ఈ సినిమా ఎలా ఉంది.. `నిన్ను కోరి` అనే టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? అనేది చదివేయండి మరి.ఉమామహేశ్వరరావు (నాని) స్టాటిస్టిక్స్ మీద పట్టున్న వ్యక్తి. జర్నల్స్‌లో తన సబ్జెక్ట్ గురించి చాలా విషయాలు రాస్తుంటాడు. ఓ సందర్భంలో అతని డ్యాన్సు చూసి పల్లవి (నివేదా థామస్) ఇష్టపడుతుంది. తనకు కూడా డ్యాన్సులు నేర్పమని అడుగుతుంది. క్రమంగా వారి పరిచయం చనువుగా మారుతుంది. అది ప్రేమకు దారి తీస్తుంది. వైజాగ్‌లో పల్లవి ఇంటి డాబా మీద పెంట్ హవుస్‌లోకి చేరుతాడు ఉమా మహేశ్వరరావు. పల్లవి తండ్రితో తరచూ మాటలు కలుపుతుంటాడు. ఇంతలో ఇంట్లో వారు పల్లవి పెళ్లి గురించి మాటలు లేవనెత్తుతారు. దాంతో భయపడ్డ పల్లవి తనని పెళ్లి చేసుకోమని ఉమా మహేశ్వరరావును కోరుతుంది. కానీ ఆ సందర్భంలో అతను పల్లవిని ఒప్పించడంలో విఫల ప్రయత్నం చేసి, కెరీర్‌కి ఓటేసి వెళ్లిపోతాడు. పల్లవికి అరుణ్ (ఆది పినిశెట్టి)తో పెళ్లి జరుగుతుంది. ఫారిన్‌లో సెటిలవుతుంది. ఆ తర్వాత పల్లవి ఇంటికి ఉమా మహేశ్వరరావు వెళ్తాడు. ఎందుకు వెళ్లాడు? పల్లవికి, ఉమా మహేశ్వరరావుకి మధ్య ఏం జరిగింది? అరుణ్‌తో పల్లవి కాపురం సజావుగా సాగిందా? లేదా? అసలు పల్లవిని ప్రాణంలా ప్రేమించిన ఉమా మహేశ్వరరావు ఆమెను విడిచిపెట్టి కెరీర్ వైపు మొగ్గు చూపడానికి దారితీసిన కారణాలేంటి? వంటివన్నీ ఆసక్తికరం. ప్లస్ పాయింట్లుకోన వెంకట్ మాటలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. దర్శకుడు కొత్తవాడైనా ఎక్కడా కన్‌ఫ్యూజన్ లేకుండా, సింపుల్‌గా, ఎలాంటి తడబాటు లేకుండా తెరకెక్కించాడు. నాని నటన నేచురల్‌గా అనిపించింది. తన పాత్రలో నివేదా థామస్ జీవించింది. పద్ధతైన దుస్తులు వేసుకుని, గ్లామర్‌గానూ కనిపించింది. ఆది పినిశెట్టి తనకు కేటాయించిన పాత్రను పర్‌ఫెక్ట్ గా చేశారు. మురళీశర్మ పాత్ర కొత్తగా అనిపించింది. పృథ్వి నవ్వులు తెప్పించాడు. కెమెరావర్క్‌ని ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. ఆర్ట్ పనితీరు కూడా బావుంది. బాణీలు కొన్ని హార్ట్ టచింగ్‌గా అనిపించాయి. రీరికార్డింగ్ సినిమాకు ప్రాణం పోసింది.మైనస్ పాయింట్లుకథ పరంగా ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ అనిపించదు. అద్దెకున్న అబ్బాయి ఇంటి ఓనర్ కూతురిని ప్రేమించడం, ప్రేమించిన అమ్మాయిని ఇంకొకరు పెళ్లి చేసుకోవడం.. ఇవి తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. పెళ్లి చేసుకున్న అమ్మాయి చివరికి భర్త వైపే మొగ్గుతుందనే విషయాన్ని కూడా ఇదివరకే చాలా సినిమాల్లో చూశాం. సెకండాఫ్ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉంటే బావుండేది. విశ్లేషణవయసులో ఉన్నప్పుడు నచ్చిన వాడికి మనసిచ్చిన అమ్మాయి అతనికి దూరమైతే, పెళ్లైన తర్వాత భర్తతో సుఖంగా ఉంటుందా? లేదా? అనేది మన సమాజంలో తరతరాలుగా నలుగుతున్న ప్రశ్న. అయితే తను ప్రేమించిన వాడి గురించి భర్తకు చెప్పి, మాజీ ప్రియుడి క్షేమాన్ని కాంక్షించి, భర్తతో సమాలోచించి... ఓ సందర్భంలో తన ఇంటికే అతన్ని ఆహ్వానించడం అనేది ఇందులో కొత్త పాయింట్. అయితే ఈ విషయాన్ని మొదట కాస్త సీరియస్‌గా చెప్పాలనుకున్నారు దర్శకుడు.. ఒక వేళ `నీకు మా సంసారం బావుందనిపిస్తే మంచి వాడిగా మారాలి` అని నివేదా అంటే.. `ఒకవేళ నువ్వు హ్యాపీగా లేవని, నీ మనసులో నేనే ఉన్నానని తెలిస్తే నువ్వు నాతో వచ్చేయాలి` అని నాని అంటాడు. దాంతో కథ సీరియస్‌గా ఉందనిపిస్తుంది. కానీ మధ్యలో కామెడీ చోటుచేసుకుంటుంది. మరలా సీరియస్‌గా అనిపిస్తుంది.. ఇలా గ్రాఫ్ కాస్త అటూ ఇటూ పడుతూ లేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి జీవితం చాలా గొప్పది.. ఎక్కడికక్కడ ఎవరూ ఆగకూడదు. ఎదురైన అంశాలను స్వాగతిస్తూ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ ఓ అవకాశం ఇచ్చి చూడాలి అని చెప్పే అంశం కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతుంది.బాటమ్ లైన్: మెచ్యూర్డ్ లవ్ స్టోరీరేటింగ్: 3/5 | entertainment |
18,811 | 24-09-2017 03:50:37 | ప్యూర్టోరికోలో కుప్పకూలిన డ్యాం | నిరాశ్రయులైన 70 వేల మంది ప్రజలుమారియా తుఫానుతో కుండపోత వర్షంశాన్ జువాన్, సెప్టెంబరు 23: మారియా పెను తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ప్యూర్టోరికోలోని వాయువ్య ప్రాంతంలో 1920లలో నిర్మించిన డ్యాం కుప్పకూలింది. దీంతో సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 70 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలతో గ్వాజటకా నదికి వరద పోటెత్తింది. దీంతో ఈ నదిపై నిర్మించిన డ్యాం కుప్పకూలిందని అధికారులు తెలిపారు. మారియా కారణంగా ఇప్పటి వరకు 33 మంది ప్రాణాలు కోల్పోయినట్టు శాన్ జువాన్‌లోని జాతీయ వాతావరణ సేవల అధికారులు వెల్లడించారు. గవర్నర్ రికార్డో రొస్సెల్లో మీడియాతో మాట్లాడుతూ.. మారియాను ఈ శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తుగా పేర్కొన్నారు. ఐల్యాండ్‌లోని ఏ ఒక్కప్రాంతాన్నీ మారియా విడిచిపెట్టలేదన్నారు. | nation |
11,438 | 28-04-2017 18:01:34 | జీఎస్‌టీ బిల్లును ఆమోదించిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ | రాయ్‌పూర్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లును ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ శుక్రవారంనాడు ఆమోదించింది. ఒకదేశం, ఒక పన్ను విధానాన్ని తీసుకువచ్చిన కేంద్రంతో మమేకమవుతూ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడం సంతోషంగా ఉందని, రాష్ట్రానికి ఇందువల్ల మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ చరిత్రలో ఇదొక చరిత్రాత్మక రోజని అభివర్ణించారు. మెజారిటీ సభ్యుల సమ్మతితో బిల్లు ఆమోదం పొందిందన్నారు. జీఎస్‌టీ బిల్లులోని నాలుగు చట్టాలకు ఈవారం ప్రారంభంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. అంతకుముందు నాలుగు జీఎస్‌టీ బిల్లులను రాజ్యసభ ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించింది. జీఎస్‌టీ వల్ల ధరలకు రెక్కలు రావడం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో చర్చ సందర్భంగా భరోసా ఇచ్చారు. నాలుగు జీఎస్‌టీ బిల్లులను ఏప్రిల్ 6న లోక్‌సభ ఆమోదించింది. వీటిలో సెంట్రల్ జీఎస్‌టీ బిల్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ బిల్లు, యూనియన్ టెరిటరీస్ జీఎస్‌టీ బిల్లు, నష్టపరిహార చట్టం వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలు తమతమ అసెంబ్లీలో జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. | nation |
19,272 | 12-11-2017 19:09:06 | 'మోదీ రెచ్చగొట్టినా హుందాగా ఉండండి' | న్యూఢిల్లీ: 'ప్రధాని నరేంద్ర మోదీ రెచ్చగొట్టినా సరే హుందాగా వ్యవహరించండి. బీజేపీ చెప్పే అబద్ధాలను నిజంతోనే తిప్పికొట్టండి. మీరు కాంగ్రెస్ కార్యకర్తలు. తప్పనిసరిగా హుందాతనం పాటించాలి' అని రాహుల్ గాంధీ పార్టీ యువ ప్రచారకర్తలకు ఉద్బోధించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బనస్కాంత జిల్లాలోని అంబజిలో పార్టీ ప్రచారకర్తలతో ఆదివారంనాడు రాహుల్ సమావేశమయ్యారు. సుమారు 2,200 మంది యువ ప్రచారకర్తలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. 'బీజేపీ అబద్ధాలు చెబితే నిజమేమిటో మీరు వివరించండి. మీరు కాంగ్రెస్ వర్కర్లనే విషయాన్ని గుర్తుంచుకుని హుందాతనంతో వ్యవహరించండి' అని రాహుల్ సూచించారు. ఇదే విషయాన్ని అశోక్ గెహ్లాట్‌కు రాసిన ఒక లేఖలో తాను సూచించినట్టు చెప్పారు. మోదీజీని అగౌరవపరచేలా సోషల్ మీడియా ప్రచారకర్తలు వ్యవహరించకుండా చూడాలని గెహ్లాట్‌ను కోరానని, దేశ ప్రధానిగా ఆయనను మనం గౌరవించాల్సిందేనని కూడా సూచించానని రాహుల్ తెలిపారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు మోదీ ఆయనను పరిహసించారని, అయితే తాను మాత్రం అలా చేయనని, ప్రధానులను పరిహసించే సంస్కృతి కాంగ్రెస్‌కి లేదని తాను తెలియజేశానని అన్నారు. ప్రధాని మోదీ పొరపాట్లు చేసిన మాట నిజమే అయినా ఈ కారణం వల్ల ఆయనను అగౌరవించాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ, మోదీ పొరపాట్లు, లోపాలు చేస్తే వాటిని కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతుందని రాహుల్ స్పష్టం చేశారు. నార్త్ గుజరాత్‌లో రాహుల్ చేపట్టిన మూడు రోజుల నవసర్జన్ యాత్ర సోమవారంతో ముగియనుంది. | nation |
9,143 | 18-05-2017 09:46:23 | హీరో సుశాంత్ ఇంట్లో విషాదం | అక్కినేని నాగార్జున అల్లుడు, హీరో సుశాంత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణ రావు(68) మృతి చెందారు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. సత్యభూషణ రావు మృతితో అక్కినేని ఇంట కూడా విషాదం నెలకొంది. విషయం తెలుసుకొన్న సినీ ప్రముఖులు సుశాంత్ తండ్రి మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ దంపతుల రెండో కుమార్తె నాగ సుశీలను సత్యభూషణ రావు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. | entertainment |